బాబూ.. స్కిల్‌ స్కామ్‌ డబ్బు రాష్ట్ర ఖజానాకు జమ చేయండి | Deposit the Skill Scam money to the state treasury | Sakshi
Sakshi News home page

బాబూ.. స్కిల్‌ స్కామ్‌ డబ్బు రాష్ట్ర ఖజానాకు జమ చేయండి

Published Mon, Sep 25 2023 4:50 AM | Last Updated on Mon, Sep 25 2023 4:50 AM

Deposit the Skill Scam money to the state treasury - Sakshi

భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘గజదొంగ నారా చంద్రబాబు నాయుడు గారికి.. అయ్యా.. మీరు స్కిల్‌ స్కామ్‌లో ప్రజల సొమ్మును దోచుకున్నారని ప్రాథమిక విచారణ జరిగి ఏసీబీ కోర్ట్‌ రిమాండ్‌ విధించింది. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతగల వ్యక్తివంటూ మీ వందిమాగధులు కీర్తిస్తున్న నేపథ్యంలో మీరు నిజాయితీగా ఆ డబ్బు ఎక్కడికి మళ్లించారో రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియ చేసి.. ఆ సొమ్మును రాష్ట్ర ఖజానాకు జమ చేయా­లని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము..’ అంటూ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండ­లం గొల్లపూడి గ్రామ ప్రజలు చంద్రబాబుకు పోస్ట్‌ కార్డులు పంపారు.

స్కిల్‌ స్కామ్‌లో రిమాండ్‌ ఖైదీ­(7691)గా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గొల్లపూడి గ్రామస్తులు ఆదివారం నిర్వహించిన పోస్ట్‌ కార్డుల ఉద్యమంలో భాగంగా గ్రామ ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పోస్ట్‌ కార్డులపై పైవిధంగా రాసి ఆ పోస్ట్‌ కార్డ్‌లను చంద్రబాబు పేరుతో రాజ­మండ్రి సెంట్రల్‌ జైలు చిరునామాకు పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా గొల్లపూడి గ్రామస్తులు మాట్లా­డుతూ స్కిల్‌ స్కామ్‌లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు సాంకేతిక కార­ణా­లతో తప్పించకుందామని యత్నిస్తున్నారు తప్ప.. తాను తప్పు చేయలేదని మాత్రం అనకపోవ­డం గమ­­నార్హమన్నారు.

ఈ స్కామ్‌లో లోకేశ్‌ పాత్ర కూడా ఉందని సీఐడీ తమ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. అందుకే అతన్నికూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నందున ఢిల్లీ వదిలి రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కారంపూడి సురే‹Ù, కోమటి చుక్కయ్య, ధూళిపాళ శ్రీనాథ్, గేరా సుమన్‌ కుమార్, ధనేకుల చౌదరి, నామాల సుధా­కర్, కోట పూర్ణచంద్రరావు, వేమూరి వెంకయ్య, వేముల
కొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement