post cards
-
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
బాబూ.. స్కిల్ స్కామ్ డబ్బు రాష్ట్ర ఖజానాకు జమ చేయండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘గజదొంగ నారా చంద్రబాబు నాయుడు గారికి.. అయ్యా.. మీరు స్కిల్ స్కామ్‌లో ప్రజల సొమ్మును దోచుకున్నారని ప్రాథమిక విచారణ జరిగి ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించింది. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతగల వ్యక్తివంటూ మీ వందిమాగధులు కీర్తిస్తున్న నేపథ్యంలో మీరు నిజాయితీగా ఆ డబ్బు ఎక్కడికి మళ్లించారో రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియ చేసి.. ఆ సొమ్మును రాష్ట్ర ఖజానాకు జమ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము..’ అంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ ప్రజలు చంద్రబాబుకు పోస్ట్ కార్డులు పంపారు. స్కిల్ స్కామ్‌లో రిమాండ్ ఖైదీ(7691)గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గొల్లపూడి గ్రామస్తులు ఆదివారం నిర్వహించిన పోస్ట్ కార్డుల ఉద్యమంలో భాగంగా గ్రామ ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పోస్ట్ కార్డులపై పైవిధంగా రాసి ఆ పోస్ట్ కార్డ్‌లను చంద్రబాబు పేరుతో రాజమండ్రి సెంట్రల్ జైలు చిరునామాకు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా గొల్లపూడి గ్రామస్తులు మాట్లాడుతూ స్కిల్ స్కామ్‌లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు సాంకేతిక కారణాలతో తప్పించకుందామని యత్నిస్తున్నారు తప్ప.. తాను తప్పు చేయలేదని మాత్రం అనకపోవడం గమనార్హమన్నారు. ఈ స్కామ్‌లో లోకేశ్ పాత్ర కూడా ఉందని సీఐడీ తమ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. అందుకే అతన్నికూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ఢిల్లీ వదిలి రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కారంపూడి సురే‹Ù, కోమటి చుక్కయ్య, ధూళిపాళ శ్రీనాథ్, గేరా సుమన్ కుమార్, ధనేకుల చౌదరి, నామాల సుధాకర్, కోట పూర్ణచంద్రరావు, వేమూరి వెంకయ్య, వేముల కొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధానికి పోస్టుకార్డులు
పాలకొల్లు సెంట్రల్: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పట్టణంలోని కొత్తపేట స్పెషల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్తరాలు రాశారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఉత్తరాలు రాసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయపూడి భవానీప్రసాద్ తెలిపారు. 2047 సంవత్సరం నాటికి దేశ భవిష్యత్ ఎలా ఉండాలనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలతో ఉత్తరాలు రాసినట్లు తెలిపారు. పోస్ట్‌మేన్ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
కాలంతో పోటీ పడలేక సెలవు తీసుకున్నా..
సాక్షి కడప : హలో! నన్ను ఉత్తరం అని పిలుస్తారండి ! ప్రస్తుత ఆధునిక కాలంతో పోటీ పడలేక చాలా రోజుల క్రితమే సెలవు తీసుకున్నా. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది కేవలం నా వల్ల ఒకప్పుడు కలిగిన ప్రయోజనాలను వివరిదద్దామనే వచ్చా. ఉత్తరం... ఒక మధురమైన అనుభూతి....గుండె గదిలో నిక్షిఫ్తమైన జ్ఞాపకాల తడి.....ఉత్తరాలు మన ఆత్మీయుల యోగ క్షేమాలకు ఆనవాళ్లు.....ప్రేయసి, ప్రియులకు మధురానుభూతాలు....భావుకుల గుండెల్లో విరబూసిన పారిజాతాలు.....స్వాప్నికుల మనసులను రాగరంజితం చేసే ఊహా చిత్రాలు....సరిహద్దుల్లో...మంచుకురిసే రాత్రుల్లో పహారా కాస్తూ శత్రువుల గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టిన సైనికుడు తన భార్యకు చేసుకునే హృదయ నివేదన....ఉత్తరం కోసం ఎన్నెన్ని ఎదురుచూపులో...ఎన్నెన్ని పడిగాపులో...ఇలా మానవ బంధాలకు నిలయంగా వెలుగొందిన ఉత్తరాలు నేడు కనుమరుగయ్యాయి. సెల్ఫోన్లు, ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లు, ఈ–మెయిల్ లాంటి ఆధునికి సమాచార వ్యవస్థలు రాడవంతో ఉత్తరం అస్థిత్వాన్ని కోల్పొయింది. రంగురంగుల లేఖతో సీతాకోక చిలుకలా గుంపు వాలినట్లు కనిపించే ఇంట్లోని చిలకొయ్య (హ్యాంగర్) ఉత్తరాలు లేక కనుమరుగైంది. ఉత్తరం కోసం పరితపించిన హృదయాన్ని అక్షరాలు మురిసిపోయేలా, అమృతం కురిసిన రాత్రిలో బాలగంగాధర్ తిలక్ వర్ణించిన తీరు అద్బుతం. ఉత్తరాల్లో ఆ మధురానుభూతులు, తీపి జ్ఞాపకాలు నేడు కనుమరుగయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా రూపంలో ఆత్మీయ స్పర్శ కోల్పొయింది. ఎవరెక్కడుంటారో తెలియదు. వారపత్రికలు, మాసపత్రికల ద్వారా పరిచయం అయ్యేవారు. ఆ తర్వాత కలం స్నేహంపై ఆసక్తి ఉన్న వారి చిరునామాలను పత్రికల్లో ప్రచురించేవారు. అలాంటి అభిరుచి ఉన్న వారు ఆ చిరునామాకు ఉత్తరాలు రాయడం, తిరిగి వారి నుంచి ప్రత్యుత్తరాలు అందుకునేవారు. కలం స్నేహం అంటే ఒకప్పుడు గొప్ప క్రేజ్ ఉండేది. పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసుకునే వారు. ఇదంతా గతం.. పూజ్యులైన అమ్మానాన్నలకు ..... ఇప్పుడంటే సెల్ఫోన్లు వచ్చాయి. వాట్సప్ సందేశాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఇలా కాదు...పైచదువుల కోసం, ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పిల్లలు ఉత్తరాలు రాస్తే తప్ప వారి తల్లిదండ్రులకు యోగక్షేమాలు తెలిసే అవకాశం ఉండేది కాదు. అలాగే తల్లిదండ్రులు తమ సమాచారాన్ని పిల్లలకు తెలియజేయాలంటే ఉత్తరమే వారధి. ‘పూజ్యులైన అమ్మానాన్నల పాదాలకు నమస్కరించి’ అంటూ దూర ప్రాంతాల నుంచి కొడుకు, అత్తరాంటి నుంచి కూతురు రాసే ఉత్తరాలను చూసుకుని తల్లిదండ్రులు పులకించిపోయారు. ఇలా మానవ సంబంధాలకు నిలయంగా వెలిగొందిన ఉత్తరాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. వాటిస్థానంలో ఆధునిక సమాచార మాధ్యమాలు అల్లుకున్నాయి. ఒకప్పుటి ఉత్తరం ఇప్పుడు సరికొత్త హంగులు సంతరించుకుంది. బంధుమిత్రుల మధ్య ఆప్యాయతతో నిండిన పలకరింపులను పంచిన లేఖలు కార్పొరేట్ సంస్థలకు, వినియోగదారులకు మధ్య వారధులుగా సరికొత్త అవతారం ఎత్తాయి. సెల్ఫోన్లు, ఈ–మెయిల్స్, ఎస్ఎంఎస్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంటర్నెట్, టెలిఫోన్లు, ఎంఎంఎస్, చాటింగ్లకు దీటుగా సేవలు విస్తరించాయి. పోస్టుకార్డులు, ఇంగ్లాండ్ లెటర్ స్థానంలో ఈ–పోస్టు, స్పీడ్ పోస్టు, బిజినెస్ పోస్టు వచ్చి చేరాయి. ఎక్స్‌ప్రెస్ పార్శిల్ పోస్టు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌విుషన్ ఉత్తరాలు, బిజినెస్ పోస్ట్ రీటైల్ పోస్టు, బంగారు నాణేలు అమ్మకాలు, పేమెంట్ బ్యాంకులుగా పోస్టాఫీసులు పలు సేవలు అందిస్తున్నాయి. -
‘కార్డు’ కథ కంచికేనా?
సాక్షి, హైదరాబాద్: ‘క్షేమంగా ఇల్లు చేరగానే ఓ కార్డు ముక్క రాయి...’కొన్నేళ్ల క్రితం ప్రతి ఇంటా సహజంగా వినిపించిన మాట ఇది. కుటుంబ క్షేమ సమాచారమైనా, దుఃఖాన్ని మోసుకొచ్చే వార్తయినా అరచేతంత ఉండే పోస్టు కార్డే దిక్కు. మరీ అత్యవసరమైతే టెలిగ్రామ్ చేయడం తప్ప ఇంటింటినీ పలకరించేది ఈ తోకలేని పిట్టనే. అయితే దాదాపు 150 ఏళ్ల క్రితం పెనవేసుకున్న ఆ బంధం ఇక తెగినట్టేననే అనుమానం కలుగుతోంది. సాంకేతిక విప్లవం నేపథ్యంలో కొరగాకుండా పోయిన తపాలా కార్డు కథ కంచికి చేరుతున్నట్టే కనిపిస్తోంది! రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క పోస్టు కార్డు కూడా లేకుండా పోయింది. గతంలో సరఫరా అయి వాడకుండా మిగిలిపోయినవి ఎక్కడైనా ఉంటే తప్ప ఏ తపాలా కార్యాలయంలోనూ పోస్టుకార్డులు కనిపించడంలేదు. తెలంగాణ సర్కిల్ ప్రధాన తపాలా కార్యాలయం జీపీఓ పరిధిలోనూ కార్డులు కానరావట్లేదు. గత వారం, పది రోజుల సంగతి కాదు... ఏకంగా గత ఆరు నెలలుగా తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు స్వయంగా పోస్టల్ అధికారులు ఇండెంట్ పెట్టినా అవి సరఫరా అవడం లేదు. అబిడ్స్‌లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీఓ) అధీనంలోని స్టాంప్స్, లెటర్స్ విభాగంలో కూడా ఒక్క కార్డు కూడా లేకుండా పోయింది. పోస్టుకార్డులు ఎందుకు సరఫరా కావడంలేదో అధికారులకే అంతు చిక్కకుండా ఉంది. నాసిక్ నుంచి ఆగిన సరఫరా.... ఇన్లాండ్ లెటర్స్, పోస్టు కార్డులు దేశవ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే ముద్రితమవుతాయి. హైదరాబాద్, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లలోనే వాటిని ప్రింట్ చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వాటి డిమాండ్, వాడకం బాగా తగ్గినందున కొన్నేళ్లుగా కేవలం నాసిక్‌లోని ప్రెస్లోనే పోస్టు కార్డులను ముద్రిస్తున్నారు. ఇక్కడి నుంచి గత పార్లమెంటు ఎన్నికలకు పూర్వం కొంత కోటా తెలంగాణకు విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ వాటి జాడలేదు. దీనిపై ఉన్నతాధికారులు వాకబు చేస్తే నాసిక్‌లోని ప్రెస్‌లో వాటి ముద్రణనే నిలిపేసినట్లు తెలిసింది. దీంతో పోస్ట్‌కార్డుల చలామణీని నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇదే విషయమై లోక్‌సభలో సభ్యులు ప్రశ్నించగా కొనసాగిస్తామనే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు మాత్రం ఏ విషయాన్ని స్పష్టం చేయడంలేదు. భారీ నష్టం.... ప్రస్తుతం తపాలా కార్డు విలువ 50 పైసలు. అత్యవసర వస్తువుల పరిధిలోనిదిగా పేర్కొంటూ నామమాత్రపు ధరకే తపాలాశాఖ వాటిని అందుబాటులో ఉంచుతోంది. మందంగా, అట్టలాగా ఉండే పోస్టుకార్డు ముద్రణతో తపాలాశాఖ ఏటా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ కార్డు తయారీకి దాదాపు రూ. 7.45 వరకు ఖర్చవుతుండగా ప్రజలకు కేవలం అర్ధ రూపాయికే అమ్ముతున్నారు. ప్రతి కార్డుపై దాదాపు రూ. 6.95 వరకు నష్టం వస్తోంది. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలనే జనం దాదాపుగా మరచిపోవడం, ఇతర అవసరాలకు కూడా పోస్ట్‌కార్డు వాడకం నామమాత్రంగా మారడంతో వాటిని ఇక నిలిపేయాలని తపాలాశాఖ ఉన్నతాధికారులు గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయితే దశాబ్దాలుగా పెనవేసుకున్న బంధం కావడంతో దాన్ని సెంటిమెంట్‌గా పేర్కొంటూ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అలాంటప్పుడు వాటి ధరనైనా పెంచాలని అధికారులు కోరినా పట్టించుకోలేదు. కానీ క్రమంగా జనం పోస్టుకార్డులను కొనడం బాగా తగ్గించారు. ఇటీవల ఉజ్జాయింపుగా కొన్ని పట్టణాల్లో వాటి వినియోగంపై అధికారులు లెక్కలు తీస్తే తెలంగాణ పరిధిలోని నిజామాబాద్ పట్టణంలో సంవత్సరకాలంలో అమ్ముడుపోయిన కార్డుల సంఖ్య కేవలం 69గా తేలింది. వాణిజ్య అవసరాలకు తప్ప వ్యక్తిగత అవసరాలకు కార్డుల వాడకం దాదాపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో క్రమంగా వాటి ముద్రణను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో వాటి పాత స్టాకు ఉన్నందున వాటినే సర్దుబాటు చేస్తూ అప్పటి వరకు ముద్రణను ఆపేయాలని నిర్ణయించినట్టు అధికారుల సమాచారం. రిటర్న్ కార్డులు ఉన్నా... కొన్ని సంస్థలు రిటర్న్ కార్డులను వాడుతున్నాయి. వినియోగదారులకు పంపి, తదుపరి సమాచారంతో అది తిరిగి సంస్థకు చేరేలా వీటిని రూపొందించారు. ఇవి వాణిజ్యపరమైన అవసరాలకే వాడుతున్నారు. ఇలాంటి కార్డులు జీపీఓ పరిధిలో దాదాపు 10 వేల వరకు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి కార్డు ధర రూపాయిగా ఉంది. కానీ జీపీఓలో ఉన్న స్టాక్ 15 పైసల నాటిది. ఆ పాత స్టాక్‌ను ఇప్పుడు వినియోగించాలంటే రూపాయి ధరకు సరిపోయేలా అంత విలువైన స్టాంపులు అతికించి వాడాల్సి ఉంటుంది. ఇవి తప్ప వేరే కార్డులు పూర్తిగా నిండుకున్నాయి. టెలిగ్రామ్ జాబితాలో చేరుతుందా...? మన దేశంలో 163 ఏళ్లపాటు కొనసాగిన టెలిగ్రామ్ సేవలను బీఎస్ఎన్ఎల్ 2013 జూలై 15న శాశ్వతంగా నిలిపేసింది. సాలీనా రూ. 400 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు పేర్కొంటూ ఆ విభాగాన్ని మూసేసింది. ఇప్పుడు అదే తరహాలో తపాలా కార్డులతో నష్టాలు వస్తున్నందున పోస్టుకార్డు చరిత్రకు కూడా ముగింపు పలుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరికొన్నేళ్లపాటు వాటిని కొనసాగించే అవకాశం ఉందని, డిమాండ్ తక్కువగా ఉన్నందున ముద్రణను తాత్కాలికంగా నిలిపివేసి ఉంటారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆకాశవాణి ప్రేక్షకుల ఆవేదన... పోస్టుకార్డు తరహాలో జనంతో బాగా పెనవేసుకున్న బంధం రేడియో సొంతం. ఆకాశవాణి ప్రసారాలను ఇప్పటికీ చాలా మంది వింటున్నారు. ఇందుకోసం ఆకాశవాణికి ఉత్తరాలు రాసే శ్రోతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పోస్టుకార్డులు శ్రోతల నుంచి ఆకాశవాణికి చేరుతుంటాయి. కానీ గత ఆరు నెలలుగా పోస్టుకార్డులు దొరకడం లేదంటూ శ్రోతలు ఆలిండియా రేడియోకి చెబుతున్నారు. కేవలం పోస్టుకార్డులు మాత్రమే రాసే పద్ధతి అక్కడ అమలులో ఉంది. ఇప్పుడు పోస్టుకార్డులు లేకపోయేసరికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలంటూ రేడియో కేంద్రం పేర్కొంటుండటం గమనార్హం. -
పోస్ట్ ఉమన్ జమీల
గార్ల: భర్త చనిపోయినా మొక్కవోని ధైర్యంతో పోస్ట్ ఉమన్‌గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండల కేంద్రానికి చెందిన జమీల. జమీల భర్త ఖాజామియా పోస్ట్ ఉమన్‌గా పనిచేస్తూ పది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పుడు జమీల పిల్లలు మూడవ తరగతి, ఐదో తరగతి చదువుతున్నారు. భర్త మృతితో కుటుంబ పోషణ జమీలకు భారమైంది. ఈ క్రమంలో తపాలా శాఖ అధికారులు భర్త ఉద్యోగాన్ని జమీలకు ఇచ్చారు. మొదట్లో సైకిల్ తొక్కరాకపోవడంతో కొన్ని రోజులు కాలినడకన ఉత్తరాలు బట్వాడా చేసింది. రోజుకు 4 గంటలు నడుస్తూ అనేక ఇబ్బందులు పడేది. సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉత్తరాలు బట్వాడా చేయడం ప్రారంభించింది. పిల్లల చదువుల ఫీజులు పెరిగాయి. నెల జీతం రూ.6 వేలు సరిపోకపోవడంతో పోస్ట్ ఉమన్ ఉద్యోగం చేస్తూ చీరల వ్యాపారం మొదలుపెట్టింది. భర్త చనిపోయిన మహిళను సమాజం చిన్నచూపు చూస్తుంది..ఎవరేమనుకున్నా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెద్ద కూతురు జరీనా ఇంజనీరింగ్, చిన్న కూతురును డిప్లొమా చదివిస్తోంది జమీల. ప్రస్తుతం ఆమె వేతనం రూ.పది వేలు. పోస్ట్‌మన్‌గా, చీరల వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తూ శభాష్ అనిపించుకుంటోంది జమీల. వేతనం రూ.20 వేలకు పెంచాలని ఆమె తపాలా శాఖను కోరుతోంది. -
నాన్నకు ప్రేమతో..
♦ రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు ♦ పోస్టుకార్డులను రాయించిన పోలీసులు హిందూపురం : ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు రోడ్డు భద్రత నియామాలు పాటించేవిధంగా విద్యార్థులతో వారి నాన్నకు రోడ్డుభద్రత గురించి వివరించాడానికి విద్యార్థులతో నాన్నకు ప్రేమతో అంటూ పోస్టుకార్డులు రాయించారు పోలీసులు. బుధవారం కిరికెరలోని ఎల్‌ఆర్‌జీ పాఠశాలలో పెనుకొండ డీఎస్పీ కరీమూల్లా షరీఫ్, రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్యర్యంలో పోలీసులు రోడ్డు భద్రతపై విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలతో వారి నాన్నకు ఒక కార్డుపై రోడ్డు భద్రత గురించి హెల్మ్‌ట్ ధరించామని, తాగిబండి నడపొద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లో మాట్లాడావద్దని మీ ప్రాణలకు ప్రమాదం జరిగితే మేము అనాథలవుతామని పోస్టుకార్డులపై రాయించి పోస్టు చేయించారు. అనంతరం డీఎస్పీ కరీమూల్లా షరీఫ్ మాట్లాడుతూ హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాలను పూర్తీగా నివారించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఆంజినేయులు, ఎల్‌ఆర్‌జీ పాఠశాల ఏఓ నరేష్ ప్రధానోపాధ్యాయులు ప్రసాధ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష పోస్టుకార్డులతో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన
రాజానగరం :రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోనందుకు ప్రభుత్వానికి తమ నిరసనను ఒక లక్ష పోస్టు కార్డుల ద్వారా తెలియజేస్తున్నామని కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి. కనకరాజు తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొంటున్నారన్నారు. 2014 సెప్టెంబర్‌లో మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేస్తున్నట్టుగా సీఎం ప్రకటించి, చేతులు దులుపుకున్నారన్నారు.16 సంవత్సరాలుగా తాము చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామన్నారు. -
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
జిల్లాల పునర్విభజనపై.. లోక్‌సత్తా ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం కౌడిపల్లి: జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని లోక్‌సత్తా నర్సాపూర్ నియోజకవర్గం కన్వీనర్ నాగేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కౌడిపల్లి బస్టాండ్ ఆవరణలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. నర్సాపూర్ నియోజక వర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయడంతోపాటు ఏ జిల్లాలో కలపాలన్న ప్రజలు ఆభిప్రాయాన్ని పోస్టుకార్డుపై రాసిన సీసీఎల్ఏ అడ్రస్ బాక్స్‌లో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్నారు. జిల్లా, రెవెన్యూ మండలాల పునర్విభజనలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్నందున అనుకూలంగా ఉండేట్లు చూడాలన్నారు. గ్రామస్తులు కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పోస్ట్కార్డ్ను బతికిస్తున్నాడు..
పుణె: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నట్టుగా, మనిషన్నాక జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఉండాలని తలంచిన స్థానిక సోషల్ ఇంటర్‌ప్రీనర్ ప్రదీప్ లోఖాండే గ్రామీణాభివృద్ధి కోసం పలు సామాజిక పథకాలు చేపట్టారు. అందుకోసం గ్రామీణ సంబంధాల సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మెయిల్, ఎస్సెమ్మెస్‌లు రాజ్యమేలుతున్న నేటి యాంత్రిక యుగంలో పోస్ట్కార్డ్ను పరిరక్షించడం కోసం ఓ ఉద్యమాన్నే చేపట్టారు. ప్రదీప్ పోస్ట్ కార్డు ద్వారానే గ్రామీణ భారత్‌లోని దాదాపు 58 లక్షల మంది ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 49 వేల గ్రామాల డేటాబేస్‌ను ప్రస్తుతం కలిగి ఉన్నారు. ప్రతి రోజు ఆయనకు వివిధ గ్రామాల నుంచి కనీసం 150 పోస్ట్ కార్డులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉపాధి అవకాశాలు మెరగుపర్చుకోవాలో, ఎలాంటి ఉద్యోగాలు, ఎలా చేయాలో పోస్ట్ కార్డు ద్వారానే సలహాలిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ల విస్తరణకు, ఉపాధి అవకాశాలకు కన్సల్టెంట్‌గా మారిపోయారు. పోస్ట్‌కార్డ్ మేన్ ఆఫ్ ఇండియాగా ముద్రపడిన ప్రదీప్ చిరునామా కూడా ఏక వాక్యంలో 'ప్రదీప్ లోఖాండే, పునె, 411ఏ13' అని ఉంటుంది. చిరునామాలో ఇది రాస్తే చాలు. నేరుగా పోస్ట్‌కార్డ్ ప్రదీప్‌కు చేరుతుంది. 'గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో 3,055 గ్రంధాలయాల ఏర్పాటుకు నేను కృషి చేశాను. ఆ గ్రామాల పిల్లల నుంచి ఇప్పటి వరకు నాకు 94 వేల పోస్ట్‌కార్డులు వచ్చాయి. పోస్ట్‌కార్డులను బతికించడం కోసమే కాకుండా పిల్లల్లో పుస్తకాల పఠనాశక్తిని పెంపొందించేందుకు నేను ఇదంతా చేస్తున్నాను. టెల్కో, పీఆండ్‌జీ, టాటా టీ లాంటి కార్పొరేట్ సంస్థలకు రూరల్ రిసోర్స్ పార్టనర్‌గా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు కృషి చేశాను' అని ప్రదీప్ మీడియాకు వివరించారు. ఈ పది రాష్ట్రాల్లోని 4,700 గ్రామాలకు తన భార్య, తండ్రి సహాకారంతో 20 వేల పోస్ట్‌కార్డులు రాయడంతో దశాబ్దం క్రితం తన ఉద్యమం ప్రారంభమైందని, టీచర్లకు, గ్రామ సర్పంచ్‌లకు లేఖలు రాశామని, తొలుత ప్రజల నుంచి స్పందన పెద్దగా రాలేదని, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 5,800 గ్రామాలను స్వయంగా సందర్శించానని చెప్పారు. ప్రతి గ్రామంలోని వనరులు ఏమిటో, అక్కడ కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఎలా ఉన్నాయో, ఉపాధి అవకాశాలు ఎలా మెరగుపరచవచ్చో క్షుణ్నంగా అధ్యయనం చేశానని, ఆ తర్వాత వాటిని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలతో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నానని వివరించారు. తద్వారా రూరల్ మార్కెటింగ్ వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని అన్నారు. ఇదే క్రమంలో 'జ్ఞాన్ కీ లైబ్రరీస్' అనే ఉద్యమాన్ని చేపట్టానని, 'నాన్ రెసిడెంట్ విలేజర్' పేరిట పల్లెలు వదిలి పట్టణాల్లో నివసిస్తున్న వారి సహకారం తీసుకున్నానని, తద్వారా వివిధ రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల్లోని 3,055 సెకండరీ పాఠశాలల్లో గ్రంధాలయాలను ఏర్పాటు చేశానని ప్రదీప్ తెలిపారు. ఈ గ్రంధాలయాల వల్ల దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇటీవల తన కూతురు పెళ్లికి పోస్ట్కార్డుమీదనే పెళ్లి ఇన్విటేషన్ కొట్టించి వాటిని బంధు, మిత్రులకు పోస్ట్ చేశామని ఆయన తెలిపారు.