పోస్టుకార్డులను చూపుతున్న విద్యార్థులు
♦ రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు
♦ పోస్టుకార్డులను రాయించిన పోలీసులు
హిందూపురం : ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు రోడ్డు భద్రత నియామాలు పాటించేవిధంగా విద్యార్థులతో వారి నాన్నకు రోడ్డుభద్రత గురించి వివరించాడానికి విద్యార్థులతో నాన్నకు ప్రేమతో అంటూ పోస్టుకార్డులు రాయించారు పోలీసులు. బుధవారం కిరికెరలోని ఎల్‌ఆర్‌జీ పాఠశాలలో పెనుకొండ డీఎస్పీ కరీమూల్లా షరీఫ్, రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్యర్యంలో పోలీసులు రోడ్డు భద్రతపై విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పిల్లలతో వారి నాన్నకు ఒక కార్డుపై రోడ్డు భద్రత గురించి హెల్మ్‌ట్ ధరించామని, తాగిబండి నడపొద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడావద్దని మీ ప్రాణలకు ప్రమాదం జరిగితే మేము అనాథలవుతామని పోస్టుకార్డులపై రాయించి పోస్టు చేయించారు. అనంతరం డీఎస్పీ కరీమూల్లా షరీఫ్ మాట్లాడుతూ హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాలను పూర్తీగా నివారించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ ఆంజినేయులు, ఎల్‌ఆర్‌జీ పాఠశాల ఏఓ నరేష్ ప్రధానోపాధ్యాయులు ప్రసాధ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.