లోక్‌సత్తా.. వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీ | Tells is responsible for the failure of the me ..: JP | Sakshi
Sakshi News home page

లోక్‌సత్తా.. వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీ

Published Mon, May 19 2014 1:29 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

లోక్‌సత్తా.. వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీ - Sakshi

లోక్‌సత్తా.. వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీ

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణల్లో లోక్‌సత్తా పార్టీ వైఫల్యానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తనదే పూర్తి బాధ్యతని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆది వారం పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

పార్టీ ఏర్పాటైన తర్వాత అనేక మైలురాళ్లు సాధించామని, వచ్చేనెల 14, 15 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తామని చెప్పారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్‌ల విజయాన్ని అభినందించారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement