సీఎంలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి
లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ
సాక్షి, హైదరాబాద్: నిజాయితీ, సమర్థతతో అధికారంలో మనుగడ సాధించడం ప్రస్తుత వ్యవస్థలో కష్టమని లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రులను ఎన్నుకొనేందుకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. అవిశ్వాసం, బడ్జెట్‌లకే విప్‌లను పరిమితం చేయాలని, ఆర్టికల్-356ను నామమాత్రం చేయడం వంటి సంస్కరణలు చేపడితేనే అరుణాచల్ వంటి రాజకీయ సంక్షోభాలు, నీతిమాలిన రాజకీయాలను కట్టడి చేయవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కేవలం గవర్నర్, స్పీకర్, విశ్వాస పరీక్షలకు, కొన్ని రాజకీయపార్టీలకు పరిమితమైనది కాదన్నారు. రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తున్న డబ్బు రాజకీయాలు, పార్టీలు విప్‌ల పేరుతో చట్టసభ సభ్యుల గొంతునొక్కడం అసలైన సమస్యలని ఆయన తెలిపారు.