ఇడియట్స్ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు | Idiots corrupting political system | Sakshi
Sakshi News home page

ఇడియట్స్ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు

Published Sun, Jun 28 2015 3:37 AM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM

ఇడియట్స్ రాజకీయ  వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు - Sakshi

ఇడియట్స్ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ

 హైదరాబాద్ : ఇడియట్స్, జోకర్స్, పనిలేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను భ్రష్టుపటి ్టస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం లైఫ్‌స్కిల్స్ ఇండియా ఆధ్వర్యంలో ‘భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయ నేతలు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి రావాలన్న ధ్యాస తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై రెండు రాష్ట్రాల సీఎంలు రెచ్చగొట్టే ధోరణులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యా విధానం పరమచెత్తగా ఉందని, పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే యువతకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement