కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ అన్నారు.
హైదరాబాద్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్ నుంచి నారాయణగూడ ఏఐటీయూసీ భవన్ వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏఐటీయూసీ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. కార్మిక వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులు లేకుండా చేస్తున్నాయని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
లోక్‌సత్తా ఆధ్వర్యంలో...: లోక్‌సత్తా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు పాండురంగారావు, ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్ సరోజనీదేవి, ఉపాధ్యక్షులు దుర్గారావు పాల్గొన్నారు.