జేపీ ఉగ్రవాది కంటే ప్రమాదకారి: టీ.లోక్‌సత్తా | JP than terrorist threat: t-loksatta | Sakshi
Sakshi News home page

జేపీ ఉగ్రవాది కంటే ప్రమాదకారి: టీ.లోక్‌సత్తా

Published Mon, Apr 14 2014 1:35 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

JP than terrorist threat: t-loksatta

హైదరాబాద్: లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఉగ్రవాది కంటే చాలా ప్రమాదకారుడని తెలంగాణ లోక్‌సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలలో ఆరితేరిన జేపీ యువతను మాయ మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో ఢిల్లీ లోక్‌సత్తా అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ సంభాషణల ఆధారంగా ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని  ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ధర్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జేపీ మంచివ్యక్తి అనే ముసుగులో దాగి ఉన్న ఒక గజదొంగ అని ఆయన ఆరోపించారు. లోక్‌సత్తా అనే గజదొంగల పార్టీకి తెర ముందు జేపీ కనిపించినా...తెరవెనుక నడిపించేది మొత్తం ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అని ఆయన పేర్కొన్నారు. తమ సామాజికి వర్గానికి చెందిన చంద్రబాబు ఫెయిల్ అయితే జేపీని తెరపైకి తెచ్చి ఫోకస్ చేయడానికే ఇదంతా రామోజీరావు చేస్తున్న డ్రామా అని ఆయన వివరించారు. విద్యార్థులు, యువత జేపీ మాయ మాటలకు మోసపోవద్దని కంచర్ల విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement