ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఆరోపించారు. ఇలా చేయడం వల్ల నష్టపోయేది చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని... ప్రజలే నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జేపీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు ప్రాంతాల మధ్య సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు.