3నుంచి లోక్‌సత్తా ఆవిర్భావ వారోత్సవాలు
Published Mon, Aug 1 2016 2:07 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM
పరకాల : ఉద్యమ సంస్థ లోక్‌సత్తా ఆవి ర్భావ వారోత్సవాలను 3 నుంచి నిర్వహిం చనున్నట్లు సంస్థ తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు తెలిపారు. పట్టణంలో ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ, పాలనా సంస్కరణల కోసం ఏ ర్పడిన లోక్‌సత్తా ఇప్పటికే అనేక విజయా లు సాధించిందన్నారు. ఈ మేరకు మలిదశ ఉద్యమంలో మరికొన్ని లక్ష్యాలతో 3 నుంచి 10 వరకు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పోటీలు, రౌండ్ టేబుల్ స మావేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయని, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కన్వీనర్ కామిడి సతీష్‌రెడ్డి, వీణవంక రమణాచారి పాల్గొన్నారు.
Advertisement
Advertisement