హైదరాబాద్:లోక్ సత్తా పార్టీలో మరోసారి విభేదాలు చోటు చేసుకున్నాయి. గతంలో చోటు చేసుకున్న వర్గ పోరు ఈసారి తారాస్థాయికి చేరింది. లోక్ సత్తా పార్టీ.. తమదంటే తమదని శ్రీవాత్సవ వర్గం వాదిస్తుండగా.. పార్టీకి విధివిధినాలను రూపొందించింది తామని కఠారి శ్రీనివాస్, వర్మ వర్గం అంటోంది. అసలు శ్రీవాత్సవ వర్గం పార్టీ నియమాలను ఉల్లంఘించదని ఆ పార్టీ అధ్యక్షుడు కఠారి శ్రీనివాస్ తెలిపారు.
పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను ఆ వర్గం మబ్బుల్లో ఉంచుతున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలో జేపీ ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కఠారి తెలిపారు.