
ప్రతీకాత్మక చిత్రం
కరీంనగర్ జిల్లా: కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)కి కరీంనగర్ లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన 60 మందికి రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని హక్కుల కమిషన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment