
'ఎన్నికలు అయిపోయాయి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబును లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు సొంతింటి వ్యవహారం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి ఇచ్చిన లెక్కలు సరైనవా ? కాదా ? అన్నది తేలుతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఖర్చు నెలకు వడ్డీ కింద లెక్కేసినా రూ. 1900 కోట్లు అవుతుంది. అలాంటిది రూ. 100 కోట్లు ఇచ్చారు. ఈ డబ్బు కూడా ఖర్చు చేయలేదని జేపీ పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జయప్రకాశ్ నారాయణ నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్లలో సంవత్సారల్లో పోలవరం పూర్తికావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.