
పంతం వద్దు
సాక్షి, హైదరాబాద్: పంతానికి పోకుండా ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కును పరిరక్షించాలని, కళాభారతిని మరోచోట నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్‌లో కళాభారతి నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు లోతుగా ఆలోచించకుండా, భేషజాలకు పోయి అడ్డుకుంటున్నాయని కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో యువత, పిల్లలు ఆడుకునేందుకు ఎన్టీఆర్ స్టేడియాన్ని అలాగే ఉంచాలని కోరారు. ఇందిరా పార్కు పచ్చదనాన్ని కాపాడాలని సూచించారు.