jaya prakash narayan
-
జేపీ కొత్త రంగు.. అదీ అసలు సంగతి!
లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ తన ముసుగు తొలగించినట్లు ఉన్నారు. ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. గత ఐదేళ్లో ఏమీ జరగలేదన్నట్లుగా ప్రసంగించడంలోనే ఆయన ఎవరి రాజకీయ ప్రయోజనం కోసమో ప్రకటన చేస్తున్నారన్న సంగతి అర్ధం అవుతుంది. బాగా పరిశీలిస్తే ఇందులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కన్నా ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉండే ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కోసమే ఈ విధంగా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన బీజేపీలో ప్రజాస్వామ్యం చూశారు. చంద్రబాబులో నీతి, నిజాయితీలు ఉన్నాయని కనిపెట్టారు. పవన్‌కల్యాణ్‌కు గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిని బట్టే ఆయన మానసిక పరిస్థితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో కూడా టీడీపీ, జనసేనలకు అధిక మార్కులు ఇచ్చి వైసీపీకి తగ్గించారట. దానిపై వైసీపీ సోషల్ మీడియా ఏకిపారేసిందట. దానిని దృష్టిలో ఉంచుకుని ఆయన తనకు కులం ఆపాదిస్తున్నారని వాపోయారు. నిజమే అలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వరాదనుకుంటే ముందుగా తాను నిజాయితీగా మాట్లాడాలి కదా! కేవలం రామోజీ కళ్లలో ఆనందం చూడడానికో, లేక టీడీపీ మీడియాను సంతోషపెట్టడానికో, చంద్రబాబుతో అనుబంధం పెంచుకోవడానికో ప్రకటనలు చేస్తే ప్రత్యర్ధులు సహజంగానే అనుమానిస్తారు. జేపీకి ఏ స్వార్ధ ప్రయోజనం లేకుండా ఇలా అనైతిక మద్దతు ఇస్తారా అన్న డౌటు వ్యక్తం చేస్తారు! రాజకీయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చెప్పదలిస్తే అన్ని విషయాలను చెప్పాలి. గత ఐదేళ్లలోనే ఏవో జరగకూడనివి జరిగినట్లు చెప్పిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. 2014లో ఇదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీచేసి వందల కొద్ది హామీలు ఇచ్చి మోసం చేసిన సంగతి జేపీకి తెలియదా? అప్పుడు అది ప్రజాస్వామ్యంగా కనిపించిందా? లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తానని, తాకట్టులో ఉన్న రైతుల భార్యల మెడలలోని నగలను కూడా విడిపిస్తానని చంద్రబాబు వాగ్దానం చేసినప్పుడు అదెలా సాధ్యమని అడగని జేపీ ఇప్పుడు ఆయనలో అభ్యుదయాన్ని చూసి తరిస్తున్నారు. జగన్ తాను ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకు ఏభైవేల కోట్లు వ్యయం చేయడాన్ని పరోక్షంగా జేపీ తప్పు పడుతున్నారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు కలిసి సూపర్ సిక్స్ పేరుతో అలవి కాని హామీలను, ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల మేర ఖర్చు చేస్తామని అంటున్నారే. అయినా వారిలో జేపీకి ఎలా విజనరీలు కనిపించారు? పెట్టుబడుల గురించి జేపీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. రెండేళ్లపాటు కరోనా ఉన్నా జగన్ పాలనలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చింది అవాస్తవమా? పునరుత్పాదక విద్యుత్ రంగంలో వస్తున్న పెట్టుబడులు జేపీకి కనిపించడం లేదా? శ్రీసిటీ, అచ్యుతాపురం సెజ్‌లలో వచ్చిన కొత్త పరిశ్రమలు, విశాఖలో అదానీ డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ సెంటర్, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ హబ్, బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్, నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ ఇలా అనేక కొత్త పరిశ్రమలు వస్తుంటే, వాటిని ఎలా అడ్డుకోవాలా అని ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు దుష్ట పన్నాగాలు పన్నుతున్న వైనం జేపీకి తెలియదా? చంద్రబాబు హయాంలో మహా అయితే ఒక కియా ప్లాంట్ వచ్చింది. దాని ద్వారా బాగా వస్తే సుమారు పన్నెండు వందల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి. అదే జగన్ తీసుకు వచ్చిన రామాయపట్నం ఓడరేవు నిర్మాణంలోనే రెండువేల మంది పని చేస్తున్నారు. తీర ప్రాంతాన్ని చంద్రబాబు టైమ్‌లో ఎందుకు పట్టించుకోలేదో, ఓడరేవులు ఎందుకు నిర్మించలేదో చంద్రబాబును ఈయన అడగడం లేదు. ప్రస్తుతం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట, కాకినాడ, మచిలీపట్నం పోర్టులు కూడా వేగంగా సాగడం లేదా? వాటిని ఎప్పుడైనా జేపీ చూశారా? పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? పాడేరు వంటి మారుమూల కూడా మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంటే, కనీసం అభినందించడం మాని అచ్చం టీడీపీకో, రామోజీకో ఏజెంటుగా మారి జేపీ మాట్లాడడం చిత్రంగా ఉంది. అందుకే జేపీని శంకంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలాస వద్ద కిడ్ని బాధితులకోసం నిర్మించిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, 800 గ్రామాల కోసం వాటర్ స్కీమ్ వంటివి తెచ్చింది జగన్ కాదా? ఇవేవి చంద్రబాబు టైమ్‌లో ఎందుకు రాలేదు? అసలు ఏపీలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చింది జగన్ కాదా? దాని గురించి గతంలో ఒకసారి జేపీనే మెచ్చుకున్నారు కదా? మరి ఇంతలోనే ఏమైంది? సడన్‌గా మాట మార్చి ఏపీలో ఏమి జరగడం లేదని రాగం ఎత్తుకున్నారే! వైద్యరంగంలో తీసుకు వచ్చిన పెనుమార్పులు కనిపించడం లేదా? ప్రజల ఇళ్ల వద్దకే డాక్టర్‌ను పంపించడం గొప్ప విషయం కాదా? ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టడం తప్పవుతుందా? ఇవన్ని అభివృద్దిలో భాగం కాదా? పాలన సంస్కరణల గురించి గొప్పగా ప్రచారం చేసుకునే జయప్రకాష్ నారాయణకు గ్రామ, వార్డు స్థాయిలో జరిగిన అధికార వికేంద్రీకరణను చూడలేరా? గతంలో అన్ని ఆఫీసులు హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వల్లే నష్టం జరిగిందని, సచివాలయం ఒకచోట, వివిధ ప్రభుత్వ శాఖలు వేర్వేరు పట్టణాలలో ఏర్పాటు చేయాలని వాదించిన జేపీ ఇప్పుడు అన్నీ అమరావతిలోనే పెట్టాలని చెబుతున్నారు. మూడు పంటలు పండే భూములను చంద్రబాబు నాశనం చేశారని అప్పుడు బాధపడి, ఇప్పుడు ఇలా జేపీ మాట మార్చారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా వృద్దులతో సహా ప్రజలందరికి ఇళ్ల వద్దకే సుమారు 600 రకాల సేవలు అందిస్తుంటే, అంతకు మించిన గొప్ప పాలన ఎక్కడ ఉందని జేపీ చెప్పగలరు? చంద్రబాబు టైమ్‌లో మాదిరి జన్మభూమి కమిటీలు పెట్టి అవినీతికి ఆలవాలం చేస్తే జేపీకి బాగుందా? ఒక్క మాటకు సమాదానం చెప్పండి జేపీగారు! జగన్ తన ఐదేళ్ల కాలంలో రెండేళ్లు కరోనా సమస్యతో సతమతం అయ్యారు. అప్పుడు ఆయన ప్రభుత్వం అందించిన సేవలు సర్వత్రా ప్రశంసలు పొందాయా? లేదా? ఆ రెండేళ్లతో సహా ఐదు సంవత్సరాలలో సుమారు రెండున్నర లక్షల కోట్లకు పైగా పేదలకు వివిధ స్కీమ్‌ల రూపంలో అవినీతికి ఆస్కారం లేకుండా పంపిణీ చేశారు. దీనికి లెక్కలు ఉన్నాయి. మరి అదే చంద్రబాబు టైమ్‌లో రెండున్నర లక్షల కోట్ల అప్పు తెచ్చి ఫలానాది చేశామని చెప్పించండి. లేదా మీరు చెప్పండి. అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి, మూడు పంటలు పండే భూములను నాశనం చేస్తే అదేమో గొప్ప అభివృద్దిగా మీలాంటి చదువుకున్నవారు కూడా భావిస్తే ఏమనుకోవాలి? ఒకప్పుడు సోనియాగాందీ, మన్మోహన్‌సింగ్‌లకు సన్నిహితంగా ఉండి చాలా సంస్కరణలు తెచ్చామని చెబుతుంటారుకదా? సడన్‌గా మోడీని పొగుడుతున్నారేమిటి? మరి ఆయన ప్రభుత్వంలో వచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో కుంభకోణం జరగలేదని మీరు నమ్ముతున్నారా? చంద్రబాబుకు వచ్చిన ఆదాయపన్ను నోటీసులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు, తప్పుడు లెక్కలు చూపినట్లు ఉన్న అంశాలతో మీరు ఏకీభవిస్తారా? విభేదిస్తారా? చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది కదా! అయినా చంద్రబాబు నిప్పు అని మీరు దృవీకరణ పత్రం ఇస్తున్నారా? పవన్‌కల్యాణ్ సకల గుణాభిరాముడని మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారా? వీరంతా కలిసి తెస్తామన్న ప్రత్యేక హోదా ఏమైపోయింది? విభజన హామీలన్ని నెరవేరాయా? మద్యలో మోడీని చంద్రబాబు బండబూతులు ఎందుకు తిట్టారో మీరైనా వివరించగలరా? మోడీ పాచిపోయిన లడ్లు ఇచ్చారని పవన్ ఎందుకు అన్నారో కాస్త మీరైనా చెప్పండి. మరి ఇప్పడు మోడీతో కలిసి పాల్గొన్న సభలో ఒక్క మాటైనా వాటి గురించి అడిగే దైర్యం చేయని ఆ నేతలు మీకు ఆదర్శవంతంగా, రాష్ట్రాన్ని అభివృద్ది చేసేవారుగా కనిపిస్తున్నారా? ఇదంతా చూస్తుంటే ఒక మాట అనిపిస్తుంది. రామోజీరావుకు మీరు అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకే ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నారేమోనని డౌటు వస్తోంది. వచ్చే ఎన్నికలలో ఈ కూటమి గెలవకపోతే తమకు పుట్టగతులు ఉండవని, మార్గదర్శి అక్రమాలన్నీ పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన భయపడి మీకు ఈ డైరెక్షన్ ఇచ్చారేమోనని ఎవరైనా అనుకుంటే తప్పేమి ఉంటుంది? ఎందుకంటే వాటిమీద మీరు ఎన్నడూ స్పందించ లేదు కదా? గతంలో ఏపీలో విద్యారంగం బాగుందని చెప్పిన మీరే ఇప్పుడు స్వరం మార్చడంలో మతలబు ఏమిటో చెప్పాలి కదా! ఏపీలో ప్రజాస్వామ్యం లేదా? రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీలు, ఇతరత్రా టీడీపీకి మద్దతు ఇచ్చే చానళ్లు జగన్ ప్రభుత్వం పై విషం చిమ్ముతూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుంటే, పార్టీ కరపత్రాల కన్నా, బాకాల కన్నా హీనంగా మారితే కూడా ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదే? పత్రికా స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నా మీలాంటి ప్రగతి కాముకులు కనీసం అదేమిటి అనకపోగా వారికే వంత పాడతారా? ఇదెక్కడి న్యాయం. ఒకప్పుడు ఐఎఎస్ అధికారిగా ఉన్నప్పుడు కాస్తో, కూస్తో మంచి పేరే తెచ్చుకున్నారు కదా! అదంతా ఏమైపోయింది? లోక్ సత్తాను స్వచ్చంద సంస్థగా స్థాపించి, తర్వాత దానిని రాజకీయ పార్టీగా మార్చి కుకట్ పల్లిలోనే మీరు ఎందుకుపోటీచేశారో ఎవరికి తెలియదని అనుకుంటే ఎలా? 2014లో టీడీపీతో కలిసి పోటీచేసి మల్కాజిగిరి టిక్కెట్ కోసం ప్రయత్నించారా? లేదా? చంద్రబాబు మీకు మొండి చేయి చూపారా? లేదా? ఆ తర్వాత రాజకీయంగా బాగా వెనక్కివెళ్లిన జేపీ ఇప్పుడు కొత్త రంగు వేసుకుని కూటమికి మద్దతు ఇచ్చే అవతారం ఎత్తారు. ఇదంతా ఏపీ ప్రజలను మోసం చేయడానికే అన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది. రాజకీయ పార్టీల తప్పులను ఎండగడితే తప్పుకాదు. కాని కొన్ని పార్టీల తప్పుడు భాగోతాలను సమర్ధించడం కోసం ఇతర పార్టీలను నిందించాలని అనుకోవడం దుర్మార్గం. దీనివల్ల మీ పరువు, ప్రతిష్టే దెబ్బతిన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటివారితో మీరు శృతి కలిపి తప్పు చేస్తున్నారు కనుక! నిష్పక్షపాతంగా వ్యాఖ్యానించడం లేదు కనుక! తాను తప్పు మాట్లాడుతున్నానని, ఒత్తిడికి లొంగి మాట్లాడుతున్నానని తెలుసు కాబట్టే జేపీ తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చే సమయంలో జయప్రకాష్ నారాయణ మొఖం అపరాధభావంతో కందగడ్డ మారిన విషయం స్పష్టంగా అందరికి కనిపించింది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
జయప్రకాష్ నారాయణ్.. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, దానికిమించి ప్రజా నేత. భారత మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా అమితమైన ప్రజారదణ పొందారు. ఆయన జీవితాంతం ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. ఉన్నత పదవులు వరించినా, వాటికి దూరంగా ఉంటూ ప్రజల కోసం పలు పోరాటాలు సాగించారు. ఒకానొక సమయంలో జయప్రకాష్ నారాయణ్‌కు భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. మరోమారు రాష్ట్రపతి అయ్యే ప్రతిపాదన వచ్చినా దానిని కూడా తిరస్కరించారు. 1901 అక్టోబర్ 11న బెంగాల్ ప్రెసిడెన్సీ (నేటి బీహార్ రాష్ట్రం)లోని సరన్ జిల్లాలోని సీతబడియార గ్రామంలో జన్మించిన జయప్రకాష్ నారాయణ్ 9 ఏళ్ల వయస్సులో చదువు కోసం పట్నాకు వచ్చారు. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన కారణంగా కాలేజీని విడిచిపెట్టారు. తరువాత తన చదువును కొనసాగించారు. ఉద్యమం కోసం కాలేజీ చదువును మధ్యలోనే వదిలిన ఆయన బీహార్ విద్యాపీఠ్‌లో అడ్మిషన్ తీసుకుని, చదువు పూర్తి చేశారు. తన 20 ఏళ్ల వయసులో కార్గో షిప్లో అమెరికా చేరుకున్నారు. కాలిఫోర్నియాలో రెండు సంవత్సరాలు డిష్ వాషర్గా, గ్యారేజీలో మెకానిక్‌గా, ఔషధాల విక్రయం, పండ్లను ప్యాకింగ్ చేయడం, బోధించడం వంటి పనులు చేస్తూ, ఉన్నత విద్యను పూర్తి చేశారు. అమెరికాలో చదువుకుంటూనే ఆయన కార్మికుల సమస్యలను తెలుసుకునేవారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి సోషల్ సైన్సెస్‌లో ఎంఏ, ఒహియో విశ్వవిద్యాలయం నుండి అప్లైడ్ సైన్సెస్‌లో డిగ్రీ చేశారు. ఈ సమయంలో ఆయన కార్ల్ మార్క్స్ , అతని సోషలిజం సిద్ధాంతాలకు ప్రభావితులయ్యారు. 1929లో భారతదేశానికి తిరిగి వచ్చాక గాంధీ చెంత చేరారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. అయితే అప్పటికే ఆయన దేశ రాజకీయాలపై తీవ్ర నిరాశకు లోనయ్యారు. 1954లో బీహార్‌లోని గయలో వినోబా భావే చేపట్టిన సర్వోదయ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించారు. 1960వ దశకం చివరిలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 1974లో బీహార్ రైతుల కోసం ఉద్యమించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ రాజకీయ కార్యాచరణను కొనసాగించారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు ఉద్యమంలోకి దూకారు. ఎమర్జెన్సీ సమయంలో జేపీ జైలుకెళ్లారు. అనంతరం విడుదలయ్యారు. 1977లో జరిగిన ఎన్నికల్లో జేపీ నేతృత్వంలోని ప్రతిపక్షం ఇందిరా గాంధీపై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో జేపీ ప్రధానమంత్రి పదవికి తిరుగులేని బలమైన పోటీదారుగా మారారు. అయినా ప్రధాని పదవిని చేపట్టలేదు. అధికారానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. తరువాత అతని పార్టీ, ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని అంగీకరించాలని ఆయనను కోరింది. అయితే దీనిని కూడా జేపీ తిరస్కరించారు. రాజకీయాల్లో ఉన్నత ఆదర్శాలకు కట్టుబడిన నేతగా పేరొందారు. పలు అనారోగ్య కారణాలతో జేపీ 1979, అక్టోబర్ 7న బీహార్‌లోని పట్నాలో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: పాక్‌లో బరేల్వీ వర్గంపై దాడులు ఎందుకు పెరిగాయి? -
దేశం ఎటుపోతోంది: దేవెగౌడ
బనశంకరి: జయప్రకాష్ నారాయణ్ దేశానికి రెండో స్వాతంత్య్రం తీసుకువచ్చారని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. సోమవారం జేడీఎస్ ఆఫీసులో జేపీ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జేపీ తెచ్చిన స్వాతంత్య్రం కూడా నేడు నశిస్తోంది, దేశంలో ఏ వైపు నడుస్తుందనేది, భవిష్యత్ ఏమిటనేది తెలియడం లేదు. అందరూ అధికార మంత్రాన్ని జపిస్తున్నారు అని వాపోయారు. యువత జేపీ మార్గంలో నడవాలని సూచించారు. చదవండి: పాన్ మసాలా యాడ్ నుంచి వైదొలిగిన అమితాబ్ -
ప్రతి ఒక్కరూ ప్రజలకే జవాబుదారిగా ఉండాలి
-
ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో..
ఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధకానికి కఠిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వాలన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు అనైతకమని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారని జేపీ విమర్శించారు. -
నిర్బంధాల నీడలలో
బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువాతనే తెలిసింది-ఎమర్జెన్సీ సంగతి. జయ ప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి కూడా అలాగే తెలిసింది. నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను. జూన్ 12, 1975. ఆ ముందురోజు రాత్రి నుంచే గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు రావడం మొదలైంది. కాంగ్రెస్ పరిస్థితి ఆశా జనకంగా లేదు. మరోవైపు రాయబరేలీ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక (1971) చెల్లదంటూ సోష లిస్ట్ నాయకుడు రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జేఎంఎల్ సిన్హా తీర్పు ఇచ్చినట్టు వార్త వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో మిత్రుడు సి. నరసింహారావు రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నాను. వార్త తెలిసిన వెంటనే ‘ఇందిర రాజీనామా చేయాలి’ అన్నాను. జూన్ 25, 1975 అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద పూర్తిగా స్టే విధించాలని కోరుతూ జూన్ 23న ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లారు. వెకేషన్ జడ్జి వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చారు. అది జరిగిన కొన్ని గంటలకే ఇందిరా గాంధీ ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధిస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆ రాత్రే కొద్దిగా జల్లు పడుతోం డగా నేనూ, మా నాన్నగారూ విజయవాడ నుంచి గుం టూరు శివార్లలో ఉండే మా ఇంటికి తిరిగి వచ్చాము. ఒం టిగంటకు తలుపు చప్పుడైంది. ఎదురుగా పోలీసులు. కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ వెంటనే రమ్మన్నారని చెప్పారు. అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కొంచెం హడా వుడి జరిగింది. ఇంతకీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సంగతి నాకు తెలియదు. ఆశ్చర్యంగా పోలీసులు కూడా చెప్పలేకపోయారు. ఇక్కడ నాకు స్నేహితుడు రాఘ వరావు జతయ్యాడు. ఇద్దరినీ ఒక హోటల్‌కు మార్చి, తరు వాత రాజమండ్రి జైలుకు తీసుకువెళతామని తెలియచేశా రు. మరునాడు ఉదయం పదిగంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని మాత్రమే ఆకాశవాణి ప్రకటించిం ది. చివరికి బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువా తనే తెలిసింది- ఎమర్జెన్సీ సంగతి. జయప్రకాశ్ నారా యణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి అలాగే తెలిసింది. నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను. రాఘవరావు, నేనూ విజయవాడ బయలుదేరాం. విజయవాడ బస్ డిపో లోనూ, రైల్వే స్టేషన్లోనూ మాకు సాదర స్వాగతం లభిం చింది. జూపూడి యజ్ఞనారాయణ, బి. సుబ్బారెడ్డి, తూమా టి బాలకోటేశ్వరరావులను కూడా ‘మీసా’ (మెయింటె నెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద అరెస్ట్ చేసినట్టు ఇక్కడే తెలిసింది. గొట్టిపాటి మురళీమోహనరావు, కొమర గిరి కృష్ణమోహన్‌రావు, ఎంవీ రామమూర్తి, తుమ్మల చౌదరి, అట్లూరి శ్రీమన్నారాయణ, అయితా రాములు- వీరందరినీ కూడా రాజమండ్రి జైలుకే తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దేశమే నిర్బంధం నీడలోకి వెళ్లింది. అంతటా, భయం అంతర్లీనంగా. ఆ గుబులుకు కొద్దిగా సాంత్వనను ఇచ్చే ఘటనలు కూడా మధ్య మధ్య జరగక పోలేదు. మాకు కాపలా ఉన్న పోలీసుకు రూపాయి ఇచ్చి పత్రికలు తెచ్చి పెట్టమన్నాను. నాలుగు తెచ్చాడు. నాలు గూ ఆంధ్రపత్రిక ప్రతులే. నాలుగు పత్రికలంటే, ఒకే పత్రి క నాలుగు ప్రతులు తెచ్చే మేధావులు ఉన్నంత వరకు ఫర వాలేద నిపించింది. ఇలాంటి వారి సాయంతో ఇందిర నియంత కావాలనుకుంటే కష్టమే అని బయటకే అన్నాను. రాజమండ్రి జైలులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టాం. అక్కడ ఎంవీ ఎస్ సుబ్బరాజు (వ్యవస్థా కాంగ్రెస్) ఉన్నారు. మాకినేని బసవపున్నయ్య (సీపీఎం), కాతా జనార్దనరావు (సోష లిస్ట్), కొల్లా వెంకయ్య (కమ్యూనిస్టు నాయకుడు), పీవీ ఎన్ రాజు (జనసంఘ్) మాదల నారాయణస్వామి (ఎం ఎల్ న్యూడెమోక్రసీ) ఉన్నారు. ‘మీసా’ నిబంధన కింద అరెస్టయిన వారిలో అన్నిరకాలు ఉన్నారు. మీసా నిబం ధనల మేరకు నిర్బంధానికి కారణాలేమిటో బందీలకు చెప్పాలి. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కారణాలు చెబుదామ నిపించింది కాబోలు. మేము చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్ మీద దాడికి వ్యూహం పన్నామట. ఇద్దరు కానిస్టేబుళ్ల మర ణానికి కారణమట. ఆయుధాలు దొంగిలించుకుపోవడా నికి కుట్ర చేశామట. ఇదీ వివరణ. భారతీయ లోక్‌దళ్ కార్యదర్శిగా సంచలనాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా నట. అలహాబాద్ హైకోర్టు తీర్పు తరువాత ఇందిర రాజీ నామా చేయాలని కోరడం, ‘సంపూర్ణ విప్లవం’ కావాలని కోరడం నేరమట. మాకు వివరణ ఇచ్చిన కొన్ని గంటలకే ఇలా కారణాలు చెప్పాలన్న ఆ నిబంధనను (జూన్ 29న) హఠాత్తుగా సవరించారు. అయితే ఏవో సాంకేతిక కారణా లతో మీసా అరెస్టులు చెల్లవని కర్ణాటక హైకోర్టు ఆగస్టు, 1975లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత నిర్బంధ ఆదేశాలను రద్దు చేసి కొత్తవి జారీ చేసింది. నేను ఎండీ ప్రవేశం కోసం విశాఖపట్నంలో ఇంటర్వ్యూకు హాజ రు కావలసి ఉంది. ఈ సౌకర్యం నాకు ఇవ్వలేదు. కాగా 20 రోజుల వరకు ఈ అరెస్టుల గురించి తెలియచేయలేదు కాబట్టి, ఆ అరెస్టులు చెల్లవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రక టించింది. కానీ పోలీసులు మా విడుదల, మళ్లీ అరెస్టు ఒకేసారి నిర్వహించారు. నేను హైకోర్టు మెట్లు దిగగానే అరెస్టు చేసి, చార్మినార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లోనే నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్న పుడు నిఘా విభాగానికి చెందిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు వచ్చారు. ‘‘జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీదేశాయ్ వంటి పెద్ద నాయకులను అరెస్ట్ చేసినా ప్రజలు మౌనంగానే ఉం డిపోయారు. అంటే ఈ పరిణామాలకు ప్రజా మద్దతులే దని అర్థం కావడం లేదా?’’ అన్నారు. ‘‘ఇందిరా గాంధీని అరెస్టు చేసినా అంతే, జనం మాట్లాడరు!’’ అన్నాన్నేను. ప్రజావిజయం కానీ ఆ మౌనం ఎంతోకాలం కొనసాగలేదు. 21 మాసాల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయక తప్పలేదు. అరెస్టయిన వేలాది మందిని విడుదల చేయక తప్పలేదు. జనతా పార్టీ ఆవిర్భవించింది. 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘోరం గా ఓడిపోయారు. జూన్, 1975 నుంచి 1977 మధ్య కాలం మన ప్రజాస్వామ్యానికి ఒక పీడకల. దేశం లో పడగ విప్పిన నియంతృత్వాన్నీ, నిర్బంధాన్నీ కూల దోసినవారు ఎవరో కాదు. అలాంటి రాజ్యశక్తిని ఎది రించి, తాము పోగొట్టుకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలను జాతికి అలవాటైన అహింసా పద్ధతిలో పదిల పరచిన వారు సామాన్య ప్రజానీకమే. ఇందుకు భావితరాలు రుణపడి ఉండాలి. (వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు) మొబైల్: 98663 76735, యూఎస్ 001-41077 78552 - ఎలమంచిలి శివాజీ -
దిక్కుమాలిన రాజకీయాలొద్దు: జేపీ
విజయవాడ బ్యూరో: ‘‘ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి ఎలా కొనొచ్చు.. అధికార పార్టీలోకి ఫిరాయింపులు ఎలా జరిపించవచ్చు.. అనే దిక్కుమాలిన రాజకీయాల్లో మన నేతలు పీహెచ్‌డీలు చేసినంత ప్రతిభను ప్రదర్శిస్తున్నారు’’ అంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబును లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామాకు పాఠాలు నేర్పింది కూడా మేమే అని చెప్పుకోవడానికి వీరు సిగ్గుపడటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నమోదైన ‘ఓటుకు కోట్లు’ కేసుపై, ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు రాసిన లేఖ ప్రతులను ఆయన శనివారం విజయవాడలో మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీక్షణం చైనా, సింగపూర్ల గురించి మాట్లాడే చంద్రబాబు విద్యలో ఆ దేశాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ పరస్పర నిందారోపణలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఎన్టీవీపై ఎంఎస్‌వోలతో అనధికార ఆంక్షలు అమలు చేస్తోందన్నారు. టేపుల ప్రసారంపై టీవీలకు నోటీసులు ఇవ్వడం మీడియా స్వేచ్ఛను హరించడమే అన్నారు. -
JP తో సాక్షి Question Time
-
'నేరాన్ని నేరంగా చూడకుండా రాజకీయం చేస్తున్నారు'
హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నేరాన్ని నేరంగా చూడకుండా రాజకీయం చేస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు నోటు వ్యవహారం నిజంగా సిగ్గు చేటన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో సీఎం అనే వ్యక్తి జవాబుదారీగా ఉండాలే గానీ.. అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని జేపీ ప్రశ్రించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వబోతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ లో సంభాషిస్తూ సూత్రధారి పాత్ర పోషించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఓటుకు నోటు అంశంపై సోమవారం సాయంత్రం జేపీ సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్యూలో అనేక విషయాలను ప్రస్తావించారు. ఓటుకు నోటు వ్యవహారం తనకు బాధగా అనిపించకపోయినా.. ఆశ్యర్యం వేసిందన్నారు. ఒక్క ఎమ్మెల్సీ ఓటుకు రూ.5 కోట్లా? అని ఆశ్యర్య పడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. రాజకీయాలు ఈస్థాయికి దిగజారిపోవడం బాధకరమన్నారు. ఈ అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా చూస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ అనే అంశం చట్టపరంగా తేలాల్సి ఉందని.. అయితే దీన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజలను రాజకీయంగా బలిచేసే పరిస్థితి దాపురించిందని జేపీ అన్నారు. చట్టబద్ధ పాలనను వేరుగా, నేరాన్ని వేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ వ్యవహారాన్ని మొత్తంగా ఒకేతాటిపైకి తెచ్చి గందరగోళ పరిస్థితులు స్పష్టించారన్నారు. దీంతో పాటు కులం, మతం, ప్రాంతం రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని ఆవరించిందన్నారు. రాజకీయంగా తాను ఎవరిపైనా వ్యాఖ్యలు చేయకపోయినా.. వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్వ్యూలో జేపీ ఇంకా ఏం చెప్పారంటే.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్లు ఉంటుంది కాబట్టి.. శాంతిభద్రతల పర్యవేక్షణకు గవర్నర్‌కు నిజాయతీ పరులైన ఇద్దరు సలహాదారులను నియమించాలి ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలి. దీన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చూడరాదు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడటం మంచిదికాదు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తుంగలో తొక్కటం సరికాదు రాజకీయ పార్టీలు మంచిని సమర్థించాలి. చెడును వ్యతిరేకించాలి మనం రాజకీయ ఉన్మాదంలో ఉన్నాం. పదవుల కోసం వెంపర్లాడటం మంచి పద్దతి కాదు రాజకీయాలు కులం, మతం చుట్టూ తిరుగుతున్నాయి -
పంతం వద్దు
సాక్షి, హైదరాబాద్: పంతానికి పోకుండా ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కును పరిరక్షించాలని, కళాభారతిని మరోచోట నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్‌లో కళాభారతి నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు లోతుగా ఆలోచించకుండా, భేషజాలకు పోయి అడ్డుకుంటున్నాయని కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో యువత, పిల్లలు ఆడుకునేందుకు ఎన్టీఆర్ స్టేడియాన్ని అలాగే ఉంచాలని కోరారు. ఇందిరా పార్కు పచ్చదనాన్ని కాపాడాలని సూచించారు. -
2009 అసెంబ్లీ ఎలక్షన్ రిపోర్ట్
11,705... గత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎమ్మెల్యేలు గెలుపొందిన సగటు మెజార్టీ ఇది. సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపోటములు కనిపిస్తాయి. కానీ కిందటిసారి జిల్లాలో నియోజకవర్గాల వారీగా మెజార్టీ పరిశీలిస్తే ఈ పరిస్థితి తలకిందులుగా కనిపిస్తోంది. అత్తెసరు ఓట్లతో బయటపడ్డవారే ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ ఇరు పార్టీల అభ్యర్థులు అరకొర ఓట్ల తేడాతో గెలుపొందారు. తక్కువగా.. ఎక్కువగా.. గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎం.భిక్షపతి యాదవ్ టీడీపీ అభ్యర్థిపై కేవలం 1,327 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత చేవెళ్ల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన రత్నం 2,249 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బండారు రాజిరెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ (28,183 ఓట్లు) సొంతం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానంలో కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కూన శ్రీశైలంగౌడ్ 25,862ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రెండోస్థానంలో నిలిచారు. హరీశ్వర్‌రెడ్డి (పరిగి) 19,982 ఓట్ల మెజార్టీ, జయప్రకాష్‌నారాయణ (కూకట్పల్లి) 15,643 ఓట్ల మెజార్టీ, మహేందర్‌రెడ్డి (తాండూరు) 13,203 మెజార్టీ ఓట్లు సాధించారు. అదేవిధంగా సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్) 13,164, ఆకుల రాజేందర్ (మల్కాజ్గిరి) 9,303, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం) 9,216, సబితారెడ్డి (మహేశ్వరం)7,833, ప్రకాష్‌గౌడ్ (రాజేంద్రనగర్) 7,485, కిచ్చనగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్) 5,570, జి.ప్రసాద్‌కుమార్ (వికారాబాద్) 4,859 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో ఆరు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో 14 శాసనసభ స్థానాలు ఏర్పాటయ్యాయి. 2009 సాధారణ ఎన్నికల పోలింగ్ నాటికి జిల్లాలో 40,18,664 మంది ఓటర్లున్నారు. వీరిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 23,37,163 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 58.16 శాతం పోలింగ్ నమోదైంది. గరిష్టంగా ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో 78.54శాతం మంది ఓట్లు వేయగా, తక్కువగా ఉప్పల్ నియోజకవర్గంలో 42.38శాతం ఓటింగ్ నమోదైంది. గ్రామీణ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోగా, పట్టణ ప్రాంతంలో తక్కువగా పోలింగ్ నమోదైంది. తాజాగా ఓటర్ల సంఖ్య 50 లక్షలకు చేరింది. ఈ సారి ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
సీఎం రాజీనామాపై నేతల భిన్నాభిప్రాయాలు
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే మేలు: జేపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడమే మేలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ్ అభిప్రాయపడ్డారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడం ఆయన కుటుంబ వ్యవహారమని అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ, కోస్తాంధ్రకు వచ్చే ఆదాయలోటును పూర్తిస్థాయిలో భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీ కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం గాడిదలా వ్యవహరించారు: నారాయణ నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు నీళ్లు రావని, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉండదని, పరిశ్రమలు రావని సీఎం కిరణ్ ప్రజలను మోసం చేస్తూ గాడిదలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆఖరి బంతులు, చివరి బంతులు అంటూ విర్రవీగిన సీఎం చివరికి రాజకీయాల నుండి పారిపోయాడని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఇక కిరణ్‌కు ‘సీతారామారావు’ గతే: డొక్కా సాక్షి, హైదరాబాద్: సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’లో సీతారామారావు పాత్రతో పోల్చారు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఆ పాత్రకు ఎలాంటి ముగింపు ఉంటుందో కిరణ్‌కు అదే తరహా ముగింపు ఉంటుందన్నారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి కిరణో, ఇంకొకరో పోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిరంజీవి వంటి ప్రజాదరణ ఉన్న నాయకులు పార్టీలో ఉన్నారని, ఆయనతో కలసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. మరో మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రికి ముందస్తుగానే సంకేతాలందాయన్నారు. కిరణ్‌కు నైతిక విలువలుంటే సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన మరుసటి రోజే సీఎం పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని, ఇప్పుడు రాజీనామా చేస్తూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. అవకాశవాదంతోనే రాజీనామాలు: డీఎస్ సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కిరణ్, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్వార్థం, అవకాశవాదంతో రాజీనామాలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఇలాంటి వారిని నమ్ముకుని పార్టీ తప్పుచేసిందని, ఇంత నీచంగా వ్యవహరించినవారు పార్టీ వీడితేనే మేలని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. సోనియా దయతో పదవులు అనుభవించినవారే ఆమెను వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. సోనియా బొమ్మలు తగులబెట్టి ఆమెను కించపరిచారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవా అని అడగ్గా.. ‘పార్టీ వల్ల ప్రతినిధులున్నారు తప్పితే ప్రతినిధుల వల్ల పార్టీ లేదు’ అని ఆయన జవాబిచ్చారు. కాంగ్రెస్‌ను వీడను : రఘువీరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తనకు తీవ్ర ఆవేదన కలిగించినా ఇప్పట్లో కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదని మంత్రి రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. కిరణ్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నామన్నారు. కిరణ్ అక్రమార్జనపై దర్యాప్తు జరపాలి: కోమటిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: సీఎంగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమార్జనకు పాల్పడిన కిరణ్ కుమార్‌రెడ్డిపై దర్యాప్తు జరిపించి, ఆయన్ను జైల్లో పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిరణ్ పదవిలో ఉండగా రూ. 3వేల కోట్లు అక్రమంగా సంపాదించారని, దానిని బయటపెడతామన్నారు. తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పుడు సమైక్యనాటకమాడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా, సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు విముక్తి లభించిందని ఎంపీలు వివేక్, మందా జగన్నాథం అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీని కిరణ్ నాశనం చేశారని ధ్వజమెత్తారు. -
టీడీపీకి ఎలా ఓటేశారు?: హరీష్‌రావు
జేపీ ఓటుపై చంద్రబాబును ప్రశ్నించిన హరీష్‌రావు మీ మధ్య ఉన్నది సామాజిక బంధమా? ఎన్టీఆర్‌ను దించిందీ, చెప్పులు వేయించిందీ నువ్వే కదా అపార అనుభవం ఉందంటావు.. అయినా జగన్‌ను అనుసరిస్తావు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని అంటున్న చంద్రబాబు.. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఏ ప్రాతిపదికన టీడీపీకి ఓటేశారో చెప్పాలని టీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉప నేత టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యేలు ఏనుగురు రవీందర్‌రెడ్డి, జోగురామన్న, హనుమంతు షిండేలతో కలసి హరీష్ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభ్యర్థి కేశవరావు విజయానికి సహకరించుకోవడంలో ఒక పవిత్ర బంధం ఉంది. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇవ్వడం మీ విధానం. రాజకీయాల్లో సంస్కరణల కోసం పనిచేస్తానంటున్న లోక్‌సత్తా పార్టీ నేత ఏ ప్రాతిపదికన మీ అభ్యర్థికి ఓటు వేశారు? మీ మధ్య ఉన్నది సామాజిక బంధమేనా’’ అని ప్రశ్నించారు. కేకే విజయాన్ని జీర్ణించుకోలేకే బాబు టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర రాజకీయాల్లో ఆయనంత అనుభవం మరెవ్వరికీ లేదని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్రెడ్డిని అనుసరిస్తున్నారు. కౌంటర్ రాజకీయాలు తప్ప ఏమి చేస్తున్నారు? తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జగన్ జాతీయ నేతలను కలిస్తే ఈయనా జాతీయ నేతల్ని కలుస్తారు. జగన్ దీక్ష చేస్తే, ఈయన తరువాత ఢిల్లీలో దీక్ష చేస్తారు. ఆయన తండ్రిలా న్యాయం చేయాలంటే, ఈయన ఇద్దరు కొడుకులకూ సమన్యాయం అంటారు’’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ వద్దకు చంద్రబాబు వెళ్లి వచ్చిన తరువాత టీటీడీపీ నేతలు వెళ్లి వినతిపత్రాలు అందజేయబోతే పార్టీ రెండు రకాల వైఖరిపై ఆమె కడిగి పారేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఆమోదంపై తమకు ఎలాంటి అనుమానాలూ లేవని హరీష్ అన్నారు. -
జేపీకి సర్వే బంపర్ ఆఫర్
మూసాపేట: లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కాంగ్రెస్‌లోకి వచ్చి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అడిగితే.. అమ్మగారికి చెప్పి తాను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి సర్వే పేర్కొన్నారు. రాజకీయాల్లో, అసెంబ్లీలో ఆయనకు మంచి పేరు ఉందని, జేపీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నానన్నారు. సర్వే ఇలా మాట్లాడుతుండగా పక్కనే ఉన్న జేపీ చిరునవ్వు చిందించారు. మూసాపేటలో నూతనంగా నిర్మించిన వాటర్ రిజర్వాయర్‌ను మంగళవారం కేంద్ర మంత్రి సర్వే, కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ పాల్గొని ప్రారంభించారు. అనంతరం సర్వే మాట్లాడుతూ.. వచ్చేసారీ మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తానన్నారు. దేశంలో ఇప్పటివరకు మంచి పాలన అందించిన ముఖ్యమంత్రుల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికే ప్రథమ స్థానం దక్కిందన్నారు. ఆయన ప్రజల కోసం 108, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే జేపీ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేని పాలనతో రాష్ట్రం గందరగోళంగా మారిందన్నారు. కొత్తగా నిర్మించిన రిజర్వాయర్‌తో వచ్చే సంవత్సరంలో మంచినీటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో ఉపకమిషనర్ గంగాధర్, ఈఈ రమేశ్ గుప్తా, మూసాపేట, కూకట్పల్లి కార్పొరేటర్లు పి.బాబురావు, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.