హోదా కోసం ఐక్య పోరాటానికి సిద్ధం కావాలి
పలు పార్టీల నేతలకు ముద్రగడ పద్మనాభం లేఖ
కిర్లంపూడి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఐక్య పోరా టానికి సిద్ధం కావాలని పలు పార్టీల నేతలకు, సినీ ప్రముఖు లకు మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు, వామపక్షాలకు, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవి, మోహన్‌బాబుతో పాటు ఇతర నేతలకు రాసిన లేఖను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం మీడియాకు విడుదల చేశారు.
అందరూ కలిసి పోరాడితే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. బాధ్యతగల సీఎం మూడేళ్ల కాలంలో పలుమార్లు హోదాపై మాట మార్చడం తగదన్నారు.