జోరందుకున్న నామినేషన్ల పర్వం.. | Contestants Files Nominations In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జోరందుకున్న నామినేషన్ల పర్వం..

Published Fri, Mar 22 2019 11:25 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Contestants Files Nominations In Andhra Pradesh - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. గురువారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పార్లమెంటుకు 36, అసెంబ్లీకి 221 నామినేషన్‌ సెట్లు దాఖలు చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు చేసిన ముఖ్యమైన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా మార్గాని భరత్‌ రామ్‌(రాజమండ్రి), కోటగిరి శ్రీధర్‌(ఏలూరు), లావు కృష్ణదేవరాయులు(నర్సారావు పేట), మాగుంట శ్రీనివాసులురెడ్డి(ఒంగోలు),  తలారి రంగయ్య(అనంతపురం), వైఎస్‌ అవినాష్‌ రెడ్డి(కడప), పి.వి మిధున్‌ రెడ్డి(రాజంపేట) నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ తరఫున మతుకుమిల్లి శ్రీభరత్‌(విశాఖ), శిద్ధా రాఘవరావు(ఒంగోలు), కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి(కర్నూలు), పనబాక లక్ష్మి(తిరుపతి), ఎన్‌.శివప్రసాద్‌(చిత్తూరు), జనసేన అభ్యర్థిగా ఎస్‌పీవై రెడ్డి(నంద్యాల) నామినేషన్‌ అందజేశారు. 

గుంటూరు జిల్లాలో.. 
గుంటూరు జిల్లాలో అధికంగా 94 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు 65 మంది అభ్యర్థులు 86 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నరసరావుపేట అసెంబ్లీకి అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి (వైఎస్సార్‌ సీపీ) , చిలకలూరిపేటలో విడదల రజిని(వైఎస్సార్‌ సీపీ), మాచర్లలో  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(వైఎస్సార్‌ సీపీ), ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత(వైఎస్సార్‌ సీపీ), సత్తెనపల్లిలో అంబటి రాంబాబు(వైఎస్సార్‌ సీపీ) నామినేషన్‌ వేశారు. అలాగే  ప్రత్తిపాడుకు  డొక్కా మాణిక్య వరప్రసాద్, చిలకలూరిపేటకు ప్రత్తిపాటి పుల్లారావు  టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. 

కృష్ణాజిల్లాలో..
కృష్ణాజిల్లాలో వ్యాప్తంగా 49 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు తిరువూరు నుంచి కొక్కిలిగడ్డ రక్షణనిధి, నూజివీడు నుంచి మేకా ప్రతాప్‌ అప్పారావు, పెనమలూరునుంచి కొలుసు పార్థసారథి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీకి చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర మచిలీపట్నం, కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ తిరువూరు, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం, డెప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అవనిగడ్డ నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలో 19 నామినేషన్లు దాఖలయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లాలో  40 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆరుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు శాసనసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాదరెడ్డి నామినేషను దాఖలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వై.విశ్వేశ్వరరెడ్డి  నామినేషన్‌ దాఖలు చేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 36 నామినేషన్లు దాఖలయ్యాయి.

గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ , విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మంత్రి గంటా శ్రీనివాసరావు, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వైరిచర్ల శృతిదేవి నామినేషన్‌ వేశారు. శ్రీకాకుళం  జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 15  నామినేషన్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ తరఫున  ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్, రాజాంలో ప్రస్తుత ఎమ్మెల్యే కంబాల జోగులు నామినేషన్లు వేశారు. విజయనగరం జిల్లాలో విజయనగరం పార్లమెంటు స్థానానికి జాతీయ ఇందిరా కాంగ్రెస్‌ తరఫున యడ్ల ఆదిరాజు నామినేషన్‌ వేశారు. సాలూరుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పీడిక రాజన్నదొర నామినేషన్‌ దాఖలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement