
'పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్'
విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టనున్న పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్ అని లోక్సత్తా అధ్యక్షుడు ఎన్.జయప్రకాశ్ నారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం ఓ ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్ట్ రాజకీయపరంగా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పోలవరం ప్రాజెక్టు కోసం కనీసం రూ.1 అయినా ఖర్చు చేశారా ? అని జయప్రకాశ్ నారాయణ... చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన తర్వాత పరిశ్రమలకు పన్ను రాయితీ ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వికృత క్రీడల్లా కనిపిస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు.