
యువత ఓటు విలువ తె లుసుకోవాలి
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ
చైతన్యపురి: యువత ఓటు విలువ తెలుసుకోవాలని లోక్‌సత్తా వ్యవ స్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ పీఅండ్‌టీ కాలనీ ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ‘మీలో ఎవరు కార్పొరేటర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని యువతతో ముచ్చటించారు.
బడ్జెట్, మేయర్, స్థానిక సంస్థల అధికారాలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై యువత ప్రశ్నలకు జేపీ సమాధానాలిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని, ప్రజా సమస్యలు పరిష్కరించే అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకు క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా గ్రేటర్ అధ్యక్షుడు దోసపాటి రాము పాల్గొన్నారు.