'Ramanna Youth' Movie Release Date Poster Launched By Jayaprakash Narayana - Sakshi
Sakshi News home page

‘రామన్న యూత్’లాంటి సినిమాలకు సపోర్ట్‌ చేయాలి: జయప్రకాష్ నారాయణ

Aug 21 2023 11:28 AM | Updated on Aug 21 2023 11:45 AM

Ramanna Youth Movie Release Date Poster Launched By Jayaprakash Narayana - Sakshi

‘చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారు. ‘రామన్న యూత్’ సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది.ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలి’అని లోక్‌ సత్తా పార్టీ ఫౌండర్‌ డాజ జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.

అభయ్‌ నవీన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ ను  జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఎడ్యుకేట్‌ చేయాలన్నారు. రామన్న యూత్‌ మూవీ టీజర్‌ చాలా బాగుందని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు.

‘విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు. ఆ యువతను కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది “రామన్న యూత్” సినిమాలో వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించాం’ హీరో,దర్శకుడు అభయ్‌ నవీన్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement