Abhay Bethiganti : మెగా ఫోన్‌ పట్టిన ‘జార్జి రెడ్డి’ ఫేమ్‌ అభయ్‌ బేతి గంటి | Ramanna Youth: George Reddy Fame Abhay Bethiganti Turns As A Director | Sakshi
Sakshi News home page

Abhay Bethiganti : మెగా ఫోన్‌ పట్టిన ‘జార్జి రెడ్డి’ ఫేమ్‌ అభయ్‌ బేతి గంటి

Published Wed, Jul 6 2022 10:25 AM | Last Updated on Wed, Jul 6 2022 10:25 AM

Ramanna Youth: George Reddy Fame Abhay Bethiganti Turns As A Director - Sakshi

‘జార్జి రెడ్డి’ ఫేమ్‌ అభయ్‌ బేతి గంటి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్‌’. రజినీ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నటుడు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో యూత్‌ లీడర్‌ రాజు పాత్రలో అభయ్‌ బేతిగంటి నటిస్తున్నారు.

రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నించే ఓ యువకుడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నదే చిత్రకథ. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కమ్రాన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ ఎమ్‌ఎస్‌కే.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement