అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌ | Srikanth, Abhay, Megha Starrer Marshal Movie Successmeet | Sakshi
Sakshi News home page

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

Published Sun, Sep 15 2019 4:32 PM | Last Updated on Sun, Sep 15 2019 4:33 PM

Srikanth, Abhay, Megha Starrer Marshal Movie Successmeet - Sakshi

కొత్త హీరో అభయ్ హీరోగా, మేఘా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్రలో నటించిన సినిమా ‘మార్షల్’.. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సినిమా సక్సెస్ అవడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సంధర్భంగా దర్శకుడు జయరాజ్ సింగ్ మాట్లాడుతూ.. విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మార్షల్’ సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మార్షల్ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని శ్రీకాంత్ అన్న ఇంత మంచి క్యారెక్టర్ చేయడం వల్లే సినిమా హిట్ అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త హీరో అభయ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని జయరాజ్ సింగ్ అన్నారు. తన సినిమాని ఆదరించినందకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. 

హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత ప్రతీ ఒక్కరి నుంచి వస్తున్న అభినందనలు వింటుంటే చాలా సంతోషంగా ఉందని, సినిమాని ప్రతీ ఒక్కరూ చూసి బాగా చేశానని అంటున్నారని, ఇంకా చూడనివాళ్లు ఉంటే తప్పకుండా వెళ్లి సినిమా చూడాలన్నారు.
 
హీరో అభయ్ మాట్లాడుతూ..  సినిమా సక్సెస్ అవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు థ్యాంక్స్ చెప్పిన అభయ్.. ఫస్ట్ రోజు చాలా డల్ గా ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయని, కానీ రెండోరోజు నుంచి మౌత్ టాక్ తో ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారని అన్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చిన క్రిటిక్స్ అందరికీ పేరపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మౌత్ టాక్ తో పాటు ప్రేక్షకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అందుకు కారణం శ్రీకాంత్ అని.. హీరోగా ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నానని అన్నారు. నిర్మాతగా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ సినిమా చూసి ఫోన్ చేసి చెబుతున్నారని, డైరెక్టర్ గురించి అడుగుతున్నారని, ఈ మధ్య కాలంలో నా సినిమాల్లో ఇది ఒక మంచి సినిమాగా నిలిచిపోయిందని అన్నారు. క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చిందని అన్నారు. సినిమాకు అవార్డులు కూడా వస్తాయని అంటున్నారని, అందులో డైరెక్టర్ కష్టం చాలా ఉందని అన్నారు. జయరాజ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారని అన్నారు. మహాత్మ, ఖడ్గం సినిమాల తర్వాత అంత వైవిద్యమైన క్యారెక్టర్ ఇదేనని కొత్త హీరో అయినా కూడా అభయ్ చాలా బాగా చేశాడని, ప్రొడ్యూసర్ గా కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడని అన్నారు. ఒక్కసారి సినిమా చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement