Successmeet
-
పండగ మీద పండగ చేసుకోవాలి
‘‘పండగ చేసుకుని రెండేళ్లయింది. మళ్లీ ఇప్పుడు పండగ (‘ధమాకా’ హిట్‌ని ఉద్దేశిస్తూ...). ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగ మీద పండగ చేసుకోవాలి. మీ స΄ోర్ట్ (అభిమానులు, ప్రేక్షకులు) ఇలానే కొనసాగాలి’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాలో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ సినిమాకు దర్శకుడు త్రినాథరావు డ్రైవర్ అయితే.. నేను కండక్టర్ని (నవ్వుతూ..). ఈ సినిమా సక్సెస్‌కి కారణమైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ధమాకా’ విజయం సమిష్టి కృషి’’ అన్నారు నక్కిన త్రినాథరావు. ‘‘రవితేజగారితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘ధమాకా’ విజయానికి ప్రధాన కారణం రవితేజ అన్న, ఆయన అభిమానులు’’ అన్నారు ఈ చిత్ర కథా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ. ఈ కార్యక్రమంలో కె. రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, బండ్ల గణేష్, తేజా సజ్జా ΄ాల్గొని ‘ధమాకా’ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్
‘‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్‌గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామంటూ మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. సమంత టైటిల్ రోల్లో హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సమంతగారి వన్ విమన్ షో ‘యశోద’. ఈ చిత్రం సీక్వెల్ గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. మా మూవీ ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది’’ అన్నారు. ‘‘మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. హరి, హరీష్ మాట్లాడుతూ– ‘‘యశోద’ మా తొలి తెలుగు చిత్రం. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే సీక్వెల్ సమంతగారిపై ఆధారపడి ఉంది’’ అన్నారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘మీరు రాయగలరు.. రాయండి. మీ సక్సెస్ చూడాలని ఉంది’’ అని మమ్మల్ని ప్రోత్సహించిన కృష్ణప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘యశోద’ని హిందీలో రిలీజ్ చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్, క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో ‘రెడ్’ చిత్రం విజయోత్సవం
-
అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్
కొత్త హీరో అభయ్ హీరోగా, మేఘా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్రలో నటించిన సినిమా ‘మార్షల్’.. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సినిమా సక్సెస్ అవడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా దర్శకుడు జయరాజ్ సింగ్ మాట్లాడుతూ.. విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మార్షల్’ సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మార్షల్ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని శ్రీకాంత్ అన్న ఇంత మంచి క్యారెక్టర్ చేయడం వల్లే సినిమా హిట్ అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త హీరో అభయ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని జయరాజ్ సింగ్ అన్నారు. తన సినిమాని ఆదరించినందకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత ప్రతీ ఒక్కరి నుంచి వస్తున్న అభినందనలు వింటుంటే చాలా సంతోషంగా ఉందని, సినిమాని ప్రతీ ఒక్కరూ చూసి బాగా చేశానని అంటున్నారని, ఇంకా చూడనివాళ్లు ఉంటే తప్పకుండా వెళ్లి సినిమా చూడాలన్నారు. హీరో అభయ్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు థ్యాంక్స్ చెప్పిన అభయ్.. ఫస్ట్ రోజు చాలా డల్ గా ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయని, కానీ రెండోరోజు నుంచి మౌత్ టాక్ తో ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారని అన్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చిన క్రిటిక్స్ అందరికీ పేరపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మౌత్ టాక్ తో పాటు ప్రేక్షకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అందుకు కారణం శ్రీకాంత్ అని.. హీరోగా ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నానని అన్నారు. నిర్మాతగా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ సినిమా చూసి ఫోన్ చేసి చెబుతున్నారని, డైరెక్టర్ గురించి అడుగుతున్నారని, ఈ మధ్య కాలంలో నా సినిమాల్లో ఇది ఒక మంచి సినిమాగా నిలిచిపోయిందని అన్నారు. క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చిందని అన్నారు. సినిమాకు అవార్డులు కూడా వస్తాయని అంటున్నారని, అందులో డైరెక్టర్ కష్టం చాలా ఉందని అన్నారు. జయరాజ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారని అన్నారు. మహాత్మ, ఖడ్గం సినిమాల తర్వాత అంత వైవిద్యమైన క్యారెక్టర్ ఇదేనని కొత్త హీరో అయినా కూడా అభయ్ చాలా బాగా చేశాడని, ప్రొడ్యూసర్ గా కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడని అన్నారు. ఒక్కసారి సినిమా చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండని కోరారు. -
జై లవకుశ సక్సెస్ మీట్
-
ఈ విజయం ఆనందాన్నిచ్చింది
‘‘నేను, సందీప్ కలిసి చేసిన మూడో సినిమా ‘నగరం’. ఈ చిత్రానికి ఇంత మంచి ఆదరణ రావడం హ్యాపీ. ప్రేక్షకులు మా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. విమర్శకులు సైతం బాగుందని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు లోకేష్ ఈ మూవీని చక్కగా తెరకెక్కించారు. చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని రెజీనా అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ముఖ్యపాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ సమర్పణలో ఏకెఎస్ ఎంటర్టైన్మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ నిర్మించిన ‘నగరం’ గత శుక్రవారం విడుదలైంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విడుదల టైమ్‌లో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోసం మలేసియాలో ఉన్నాం. ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారని తెలిసి, ఆనందపడ్డాం. కథ బాగుండటంవల్లే ఈ విజయం. కొన్ని కారణాల వల్ల ‘నగరం’ ఆలస్యంగా విడుదలైంది. అయినా తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు హీరోకు తమిళంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం, రెండో వారంలో మరిన్ని థియేటర్స్ పెరగడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. -
సంక్రాంతి సినిమా సక్సెస్ మీట్‌కు మెగాస్టార్
రీ ఎంట్రీలో సూపర్ హిట్‌తో అలరించిన మెగాస్టార్ చిరంజీవి, వీలైనంత వరకు అభిమానులకు కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా వేడుకల్లో సందడి చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్స్‌తో పాటు ఇతర హీరోల సినీ వేడుకల్లో కూడా మెగాస్టార్ తరుచుగా కనిపిస్తున్నాడు. తాజాగా ఓ యంగ్ హీరో సినిమా సక్సెస్మీట్కు చిరు, చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ మారింది. తన రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలోనే విడుదలయిన శతమానం భవతి సినిమా సక్సెస్‌మీట్‌లో చిరంజీవి పాల్గొననున్నారు. ఇలా మెగాస్టార్ చిన్న సినిమాల ఫంక్షన్స్‌కు హాజరు కావటం ఆ సినిమాలతో పాటు మెగాస్టార్ ఇమేజ్‌కు కూడా ప్లస్ అవుతుందంటున్నారు విశ్లేషకులు.