బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మంటల్లో రెహమాన్‌ ఇళ్లు దగ్ధం | Bangladesh Ex PM Sheikh Hasina Father Home Set On Fire In Dhaka | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మంటల్లో రెహమాన్‌ ఇళ్లు దగ్ధం

Published Thu, Feb 6 2025 7:12 AM | Last Updated on Thu, Feb 6 2025 8:49 AM

Bangladesh Ex PM Sheikh Hasina Father Home Set On Fire In Dhaka

ఢాకా: బంగ్లాదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఢాకాలో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో, హింస్మాతక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) తండ్రి, బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇళ్లును ఆందోళన కారులు ముట్టడించి నిప్పటించారు. దీంతో, భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో నిరసనకారులు మరోసారి ఆందోళనలకు దిగారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. ఈ క్రమంలో ఢాకాలో ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. అనంతరం,  ఆయన ఇంటిలోకి బలవంతంగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇంటిని తగులబెట్టినట్టు కూడా స్థానికి మీడియాలో కథనాలు వెల్లడించింది.

ఇదే సమయంలో మాజీ ప్రధాని హసీనాపై నమోదైన కేసులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా అవామీ లీగ్ పార్టీ (Awami League) గురువారం నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే హింస నెలకొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రెహమాన్‌కు చెందిన ధన్మొండి 32 నివాసంపై గతంలోనూ దాడి జరిగింది. గతేడాది ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తరువాత కూడా ఇంటిపై దాడి చేసి అందులోని కొంత సామగ్రిని ధ్వంసం చేశారు.

అయితే, షేక్‌ హసీనా బంగ్లాదేశీయులను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ‍ప్రసంగం చేస్తున్న సమయంలోనే నిరసనకారులు రెచ్చిపోయారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ.. ముహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బుల్డోజర్‌తో లక్షలాది మంది అమరవీరుల ప్రాణాలను బలిగొని మనం సంపాదించిన జాతీయ జెండా, రాజ్యాంగం మరియు స్వాతంత్ర్యాన్ని నాశనం చేసే శక్తి వారికి ఇంకా లేదు. వారు ఒక భవనాన్ని కూల్చివేయవచ్చు, కానీ చరిత్రను కాదు. చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా వారు గుర్తుంచుకోవాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని దేశ హోం శాఖ సలహాదారు, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎండీ జహంగీర్‌ ఆలం చౌదరి బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో షేక్‌ హసీనా దేశాన్ని వీడి.. గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో తల దాచుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ (ఐసీటీ) హసీనాతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ, సివిల్‌ అధికారులపై అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. ‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ఐసీటీలో విచారణలో ఉన్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని చౌదరి తెలిపినట్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బీఎస్‌ఎస్‌ వార్తా సంస్థ ప్రకటించింది. ‘దేశంలో ఉంటున్న వారిని అరెస్టు చేస్తున్నాం. హసీనా దేశంలో లేరు.. విదేశాల్లో ఉన్న వారిని ఎలా అరెస్టు చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement