ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం ఆదివారం హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 100కు చేరింది. ఇందులో 14 మంది పోలీసులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు..
ఆందోళనల నేపథ్యం ప్రభుత్వం నేటి (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యు విధించి, ఇంటర్‌నెట్ సేవలను తెలిపివేశారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్ల చెలరేగటంతో అక్కడ ఉండే భారతీయ విద్యార్థులు, పౌరులకు కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సాయం కోసం ఢాకాలోని భారత హైకమిషన్ సంప్రదించాని పేర్కొంది.
.. ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. ఇక.. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment