Reseravation
-
రాహుల్‌కు కిరిణ్ రిజిజు కౌంటర్.. వారిని ఎగతాళి చేయొద్దు
న్యూఢిల్లీ: అందాల పోటీ మిస్ ఇండియా జాబితాలో కూడా దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ‘బాల బుద్ధి (చిన్న పిల్లలు)మాతమ్రే చేస్తారని ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, ఆటల్లో రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. ఇది ‘బాల బుద్ధి’తో వచ్చిన సమస్య కాదు. ఎవరైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ఆనందం వ్యక్తంచేస్తున్నారో వాళ్లు ఆయన వ్యాఖ్యలకు సమాన బాధ్యత వహించినట్లే. చిన్నపిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు. కానీ మీ విభజన వ్యూహాలతో వెనుకబడిన వర్గాలను ఎగతాళి చేయకండి. .. ప్రభుత్వాలు మిస్ ఇండియాను, ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఎంపిక చేయవు. సినిమాలకు నటులను ఎంపిక చేయవు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల రిక్రూట్మెంట్లలో రిజర్వేషన్లను మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించబోదు. కానీ రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఓ గిరిజన మహిళ, ప్రధాని ఓబీసీ, రికార్డు సంఖ్యలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు.. వారంతా రాహుల్ గాంధీకి కనిపించటం లేదు’’ అని కిరణ్ రిజిజు అన్నారు.Now, He wants reservations in Miss India competitions, Films, sports! It is not only issue of "Bal Budhi", but people who cheer him are - equally responsible too!बाल बुद्धि मनोरंजन के लिए अच्छी हो सकती है पर अपनी विभाजनकारी चालों में, हमारे पिछड़े समुदायों का मजाक न उड़ाएं। pic.twitter.com/9Vm7ITwMJX— Kiren Rijiju (@KirenRijiju) August 25, 2024 శనివారం రాహుల్ గాంధీ ప్రయాగ్ రాజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేను మిస్ ఇండియా పోటీల జాబితాను పరిశీలించాను. అందులో ఒక్క దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళ లేదు. కొంతమంది క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడారు. అందులో కూడా దళిత, ఆదివాసీలు లేరు. మీడియా రంగలోని టాప్ యాంకర్లలో 90 శాతం వెనబడిన వర్గాలకు చెందినవారు కాదు’’ అని అన్నారు. అయితే దేశవ్యాప్తంగా కుల గణనను డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
బంగ్లాదేశ్: 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం ఆదివారం హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 100కు చేరింది. ఇందులో 14 మంది పోలీసులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఆందోళనల నేపథ్యం ప్రభుత్వం నేటి (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యు విధించి, ఇంటర్నెట్ సేవలను తెలిపివేశారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్ల చెలరేగటంతో అక్కడ ఉండే భారతీయ విద్యార్థులు, పౌరులకు కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సాయం కోసం ఢాకాలోని భారత హైకమిషన్ సంప్రదించాని పేర్కొంది. .. ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. ఇక.. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
చదువు లేని భవిత పెద్ద సున్నా.. మీ జీవితాన్ని మార్చుకునే చక్కటి అవకాశం..
-
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ (అగ్రవర్ణ పేదల) రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ కోటా కింద రిజర్వేషన్ పొందడంలో.. ఆదాయ ధ్రువీకరణ పత్రమే కీలకంగా ఉండనుంది. ఆయా అభ్యర్థులు/విద్యార్థులు అందజేసిన అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాక నిబంధనలకు అనుగుణంగా తహసీల్దార్లు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారంఉత్తర్వులు జారీ చేశారు. ఎవరెవరు అర్హులు? ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకురాని వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అర్హులు. వీరి కుటుంబ స్థూల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. వేతనం, వ్యవసాయం, వృత్తి, వ్యాపారం తదితర అన్నిమార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరే వ్యక్తితోపాటు వారి తల్లిదండ్రులు, 18ఏళ్లలోపు ఉన్న తోబుట్టువులు, జీవిత భాగస్వామి, 18ఏళ్లలోపు వయసున్న సంతానాన్ని కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటారు. తోబుట్టువులు, సంతానం 18 ఏళ్లపైన వయసున్న వారైతే.. వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. పరీక్ష, ఇతర ఫీజుల మినహాయింపులు సమానంగా వర్తిస్తాయి. బ్యాక్లాగ్ నియామకాలకు నో.. ఏదైనా నియామక సంవత్సరం (రిక్రూట్మెంట్ ఇయర్)లో సరైన అర్హుల్లేక ఈడబ్ల్యూఎస్ కోటా పోస్టులు భర్తీ కాకుంటే.. ఆ పోస్టులను తర్వాతి నియామక సంవత్సరానికి బ్యాక్లాగ్ పోస్టుగా బదిలీ (క్యారీ ఫార్వర్డ్) చేయకూడదు. వికలాంగులు/ఎక్స్‌సర్వీ స్‌మెన్ కోటా కింద ఈడబ్ల్యూఎస్‌కు చెందిన వ్యక్తులెవరైనా ఎంపికైతే.. వారికి ఈడబ్ల్యూఎస్ రోస్టర్ వర్తింపజేయాలి. అన్రిజర్వ్డ్ పోస్టులకు పోటీపడే హక్కును ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిరాకరించరాదు. ఈడబ్ల్యూఎస్ వ్యక్తులు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెరిట్ ఆధారంగా (అన్రిజర్వ్డ్, ఓపెన్ కోటాల కింద) ఎంపికైతే.. వారి ఎంపికను ఈడబ్ల్యూఎస్ కోటా కింద లెక్కించరాదు. ఈడబ్ల్యూఎస్ కోటాలో అంతర్గతంగా మహిళలకు 33 1/3 శాతం కోటా అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రోస్టర్ పాయింట్లను కూడా ఖరారు చేశారు. ప్రతి 100 ఖాళీల భర్తీలో.. 9, 17 (మహిళలు), 28, 36, 50 (మహిళలు), 57, 65 (మహిళలు), 76, 86, 100 స్థానాల్లో వీటిని కేటాయిస్తారు. తప్పుడు మార్గాల్లో అనర్హులు ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అనర్హులు ఎంపికైతే సర్వీసు నుంచి తొలగించాలి. ఇకపై జరిపే అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులను చేర్చుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఉన్నత విద్యాసంస్థ కూడా వివిధ కోర్సులు/ బ్రాంచీ/ ఫ్యాకల్టీలో సీట్ల సంఖ్యను పెంచాలి. ‘ఆదాయ’ ధ్రువీకరణ తర్వాతే ఉద్యోగం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైనా ఉద్యోగానికి ఎంపికైనా.. వారి ‘ఆదాయ ధ్రువీకరణ పత్రం’ తనిఖీ ప్రక్రియను సంబంధిత వర్గాలు పూర్తిచేసే వరకు ఆ నియామకం తాత్కాలికమే. అక్రమంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందినట్టు గుర్తిస్తే వెంటనే ఎలాంటి కారణాలు తెలపకుండానే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఈ విషయాలను అభ్యర్థులకు జారీచేసే నియామక ఉత్తర్వుల్లో పొందుపర్చాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అభ్యర్థి సమర్పించిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేసిన అధికారి ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు. చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి -
సీఎం వైస్ జగన్ బ్రాహ్మణులకు గౌరవ ప్రదమైన జీవనాన్ని కల్పించారు : దత్తాత్రేయ శర్మ
-
12 నుంచి మరో 80 రైళ్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో నిలిచిపోయిన మరికొన్ని రైళ్లకు రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాను న్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 230 రైళ్లు నడుస్తున్నాయి. వాటికి అదనంగా మరో 80 రైలు సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నట్టుగా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదన్ శనివారం చెప్పారు. రైలు సర్వీసుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, మొదట్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రైళ్లలో ఈ మధ్య కాలంలో వెయిటింగ్ లిస్టులు పెరిగిపోతున్నాయని యాదవ్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్‌లు మరింతగా పెరిగిపోతే క్లోన్ రైళ్లను కూడా నడుపుతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లివే.. రైల్వేశాఖ ఈ నెల 12 నుంచి నడపనున్న 80 ప్రత్యేక రైళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లివే.. సికింద్రాబాద్ – దర్భంగా (07007); దర్బంగా– సికింద్రాబాద్ (07008); బెంగళూరు – గువాహటి (02509); గువాహటి – బెంగళూరు (02510); కోర్బా – విశాఖపట్నం (08517); విశాఖ– కోర్బా (08518); హైదరాబాద్ – పర్బణి (07563); పర్బణి – హైదరాబాద్ (07564). -
బీసీల కోటాపై టీడీపీ ఆట
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందనే వాదనకు బలం చేకూర్చేలా న్యాయ వివాదాలకు పురిగొల్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా విపక్షం కుట్రపూరితంగానే బీసీ రిజర్వేషన్లపై వివాదం రాజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ఆటంకాలు కల్పించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా నిధులను అడ్డుకునే దుర్బుద్ధి దీని వెనక దాగుందని పేర్కొంటున్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నా.. ధైర్యంగా ముందుకే జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశంలో 24 రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీసీలకిచ్చే రిజర్వేషన్లను 16–25 శాతం వరకు తగ్గించుకున్నాయి. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. అయినప్పటికీ ఆ తర్వాత 2019 డిసెంబరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్లి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్లో ఆమోదించి జీవో కూడా జారీ చేసింది. ఆ జీవో మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే టీడీపీ నేతలు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85%రిజర్వేషన్ల జీవోతో ఎన్నికలు జరపడంపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి దీనిపై హైకోర్టులో విచారణ జరగడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీర్పు వెలువడింది. 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు మొదట రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపిన తర్వాత టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేయకుంటే బీసీలకు 34 శాతంతోనే ఎన్నికలు జరిగేవని పేర్కొంటున్నారు. ఎన్నికలు, నిధులను అడ్డుకోవడమే విపక్షం ధ్యేయం రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకాగా టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవి పొందిన ఆ పార్టీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టులలో వరుసగా కేసులు వేయడంతో వాయిదా పడుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.5,100 కోట్ల నిధులను అడ్డుకోవడమే టీడీపీ ధ్యేయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో చట్టమే మార్గం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వివాదాలకు రాజ్యాంగ బద్ధతే శాశ్వత పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పార్లమెంట్లో చేసిన చట్టం కారణంగా తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం గతంలోనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు గతేడాది మార్చిలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు సుప్రీంకు వెళితే ప్రయోజనమా? బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలైన కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు సిద్ధరామయ్య హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ నేతలైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్ కూడా 2013–2014లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 – 22 శాతం తగ్గించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు వాదనలో పసలేదు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఆ తీర్పు పునరావృతం అవుతుంది. చంద్రబాబు చర్యలతో కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు’ – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. -
సామాజిక ఉద్యమ స్ఫూర్తి ‘దండోరా’
వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించిన మాదిగ దండోరా ఉద్యమం ఉద్భవించి నేటికి పాతికేళ్లు పూర్తయింది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వాన ఇరవైమంది యువకులతో పురుడుపోసుకున్న ఈ ఉద్యమం ఆనాటినుంచీ సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ, సమాజాన్ని సంస్కరించడం కోసం అలుపెరగని కృషి చేస్తోంది. అణగారిన కులాల ఆత్మగౌరవ పతాకగా, ప్రతీకగా పాలకులను ప్రశ్నిస్తూ ప్రజలమధ్యే నిలిచి ఉంది. సామాజిక న్యాయమంటే ‘సమాన పంపిణీ’యేనని నినదించింది. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్ల కోటాను కోరుతూ అంబేడ్కర్ వారసత్వ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. ఈ ఉద్యమం తరతరాలుగా అవమానాలకూ, అన్యాయాలకూ, అణచివేతలకూ, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న జాతిని ఏకం చేసింది. జాతి మొత్తాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి దాన్నొక శక్తిగా మలిచింది. నిషిద్ధాక్షరిగా మారిన ‘మాదిగ’ పదాన్ని శక్తిమంతమైన నినాదం చేసి జాతిలోని ప్రతి ఒక్కరూ తమ పేరు చివర చేర్చుకోవడమే నిజమైన, నిండైన ఆత్మగౌరవమని ప్రకటించింది. దౌర్జన్యానికి గురయ్యే జాతికి సమాజంలో గుర్తింపునూ, గౌరవాన్నీ, సామాజిక భద్రతనూ సాధించిపెట్టింది. వివిధ పార్టీల్లో మాదిగల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచింది. మాదిగ దండోరా ఉద్యమం ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు, అవమానాలు, అవరోధాలు, నిందలు, నిర్బంధాలు, కష్టాలు, కన్నీళ్లు, కుట్రలు, కుతంత్రాలు అధిగమించింది. ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ల సామాజిక వర్గీకరణ సమస్త అణగారిన కులాల్లో సామాజిక స్పృహను రగిల్చింది. తుడుందెబ్బ, నంగారభేరి, మోకు దెబ్బ, పూసలకేక, కుర్రు, చాకిరేవు, మాలమహానాడు, ముదిరాజ్ మహాసభ తదితర కులహక్కుల సంఘాల ఆవిర్భావంలో దండోరా ఉద్యమ ప్రభావ స్ఫూర్తే ఉంది. వివిధ మాదిగ ఉపకులాల సంఘాలను బలోపేతం చేసి వాటిల్లో సైతం నాయకత్వాన్ని అభివృద్ధి చేసింది. ఉపకులాలవారికి ఆర్డీఓల ద్వారా కాక ఎమ్మార్వో ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా పోరాడి సాధించింది. ఏబీసీడీ వర్గీకరణ ఫలాల్లో ప్రథమ ఫలాన్ని మాదిగలకు కాకుండా వారికన్నా వెనకబడి ఉన్న రెల్లి ఉపకులాలకు అందించి కింది కులాలపట్ల తన బాధ్యతను ఆచరణాత్మకంగా నిర్వర్తించింది. అంబేడ్కర్ స్ఫూర్తిని నిలబెట్టింది. అంతేకాదు...సందర్భం వచ్చినప్పుడల్లా మాలల పక్షపాతిగా మాదిగ దండోరా నిలబడింది. ప్రజా గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు, సుద్దాల దేవయ్యను చంద్రబాబు అకారణంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు వారికి అండగా నిలబడింది. ఢిల్లీలో చందర్రావు అనే మాల అధికారిపై తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్‌రావు దాడిచేసినప్పుడు, గీతారెడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోరాడింది. ఉమ్మడి అభివృద్ధికి, పురోగతికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిపెట్టింది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని నీరుగార్చాలని చూసినప్పుడు జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించి ఆ కుట్రలను వమ్ము చేసింది. తెలుగు నేలపై ఇంతటి సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉన్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగలేదనే ఆవేదన మాదిగ జాతిని వెన్నాడుతోంది. పాలకపక్షాలు మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనం వహించడం, ఈ ఉద్యమ ప్రభావంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మాదిగ జాతి నేతలు రాజకీయ బానిసత్వం చేస్తూ ద్రోహం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. మాదిగల అస్థిత్వ ఉద్యమానికి పునాదులు వేసిన ఈదుమూడి వేదికగానే ఎంఆర్పీఎస్ ‘మాదిగల ఆత్మగౌరవ జాతర’ పేరుతో జరిగే 25 వసంతాల ఉద్యమ ప్రస్థాన వేడుకలో సమరశంఖం పూరించబోతోంది. రాగల్ల ఉపేందర్ మాదిగ ‘ మొబైల్: 95736 35356 -
‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు నేడే
సాక్షి, నల్లగొండ : స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 5వ తేదీలోగా రిజర్వేషన్లను ఖరారు చేసి నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌లతోపాటు మండలాలను నోటిఫైడ్ చేస్తూ గెజిట్‌ను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి అందించాల్సి ఉంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోసం తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించింది. ఆ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించాలని గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించాలని ప్రస్తుతం నిర్ణయించింది. దీంతో ఆ ఓటర్ల జాబితా ప్రకా రమే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. నేడు రిజర్వేషన్లు ఖరారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్, ఆర్డీఓల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ 5వ తేదీలోగా రిజర్వేషన్ తయారు చేసి నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్ ప్రక్రియను ఆయా కలెక్టర్లు, ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రక్రియ ముగియనుంది. వెంటనే అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఖరారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఆయా జిల్లాలకు కేటాయించిన ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం 71 మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం ఎస్సీలకు 12 ఎంపీపీ స్థానాలు, ఎస్టీలకు 10, బీసీలకు 13, అన్ రిజర్వ్డ్ కింద 36 ఎంపీపీ స్థానాలను రిజర్వ్ చేశారు. ఈ జాబితాను ఇప్పటికే ఆయా కలెక్టర్లకు పంపించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లకు ఫైనల్ అథారిటీ కలెక్టర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు ఇప్పటికే ఆయా జిల్లాకు కేటాయించిన ఎంపీపీ రిజర్వేషన్లను ఏయే మండలాలకు కేటాయించాలనేది మంగళవారం నిర్ణయిస్తారు. అదే విధంగా జెడ్పీటీసీ రిజర్వేషన్‌కు సంబంధించి కూడా రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. జి ల్లా యూనిట్‌గా తీసుకొని జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ చేయనున్నారు. ఎంపీటీసీల రిజర్వేషన్ బాధ్యత ఆర్డీఓలకు... ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఆర్డీఓల ఆధ్వర్యంలో చేయనున్నారు. ఆయా డివిజన్లలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ఎంపీడీఓలు చేడతారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ జనాభా ఆధారంగా చేస్తుండగా, బీసీ రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా చేపట్టనున్నారు. జెడ్పీ అధ్యక్షుడు, ఎంపీపీలు రాష్ట్ర యూనిట్‌గా.. జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీల రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా తీసుకొని చేయనున్నారు. ఇప్పటికే ఎంపీపీల కోటా ఏ జిల్లాకు ఎవరెవరికి ఎన్ని స్థానాలనేది ప్రకటించారు. జిల్లా పరిషత్ అ«ధ్యక్షుల రిజర్వేషన్ మాత్రం ప్రకటించలేదు. తేలిన ఉమ్మడి జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 31 మండలాలు ఉండగా అందులో ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, బీసీలకు 4, జనరల్ కేటగిరీలో 16 కేటాయించారు. సూర్యాపేట జిల్లాలో 21 మండలాలకు ఎస్సీ 4, ఎస్టీ 3, బీసీ 4, జనరల్ 12 కేటాయించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు ఎస్సీ 3, ఎస్టీ 1, బీసీ 5, జనరల్ 8 స్థానాలుగా జిల్లా కోటాను నిర్ణయించారు. -
ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, కామారెడ్డి: మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు సంబంధించి సామాజిక వర్గాలవారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో 22 మండలాల పరిధిలో 236 ప్రాదేశిక స్థానాలు ఉన్నాయి. ఇందులో 123 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సత్యనారాయణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆయా మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఏ ప్రాదేశిక స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో ఖరారు చేయాల్సి ఉంది. అలాగే మండల పరిషత్ అధ్యక్షులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. జిల్లా ప్రాదేశిక స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు జరుగుతోంది. త్వరలోనే వాటి వివరాలు వెల్లడించనున్నారు. మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలు.. రామారెడ్డి మండలం : 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. సదాశివనగర్ మండలం : 12 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహ/æళకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు స్థానాలు కాగా, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు మూడు. తాడ్వాయి మండలం : తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనల్కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు. ఎల్లారెడ్డి మండలం : ఎనిమిది మండలపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు. గాంధారి మండలం : 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు రెండు, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు, జనరల్ మహిళకు నాలుగు, అన్‌రిజర్వుడు మూడు. లింగంపేట మండలం : 14 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు. నాగిరెడ్డిపేట మండలం : 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. బాన్సువాడ మండలం : 11 ఎంపీటీసీ స్థానాలు. ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు. బీర్కూర్ మండలం : ఏడు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జ నరల్కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు. నస్రుల్లాబాద్ మండలం : ఎనిమిది స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు. జుక్కల్ మండలం : 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు రెండు, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు. మద్నూర్ మండలం : 17 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు రెండు, ఎస్సీ జనరల్‌కు రెండు, బీసీ మహిళకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్ మహిళకు నాలుగు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు. నిజాంసాగర్ మండలం : 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. పెద్దకొడప్గల్ మండలం : ఆరు స్థానాలున్నాయి. ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు. బిచ్కుంద మండలం : 14 ఎంపీటీసీ స్థానా లున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళ కు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు రెండు, జనర ల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు. పిట్లం మండలం : 13 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు రెండు స్థానాలు, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. సామాజిక వర్గాలవారీగా.. జిల్లాలో ఎస్టీలకు 21 ఎంపీటీసీ స్థానాలు కేటాయించగా.. అందులో మహిళలకే 16 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఐదు స్థానాలు మాత్రమే ఎస్టీ జనరల్‌కు మిగిలాయి. ఎస్సీలకు 39 స్థానాలు కేటాయించగా.. 19 స్థానాలు ఎస్సీ మహిళలకు, 20 స్థానాలు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. బీసీలకు 63 స్థానాలు కేటాయించగా.. బీసీ మహిళకు 36 స్థానాలు బీసీ జనరల్‌కు 27 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. మిగతా 113 స్థానాలలో 52 స్థానాలు జనరల్ మహిళకు, 61 స్థానాలు జనరల్‌కు ఉన్నాయి. కామారెడ్డి మండలం: ఆరు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు. భిక్కనూరు మండలం : 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి.. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు. బీబీపేట మండలం : ఏడు స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్ రిజర్వుడు రెండు. దోమకొండ మండలం : తొమ్మిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు. రాజంపేట మండలం : 8 స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు 1, ఎస్సీ మహిళకు 1, బీసీ మహిళకు 1, బీసీ జనరల్‌కు 1, జనరల్ మహిళకు 2, అన్‌రిజర్వుడు 2. మాచారెడ్డి మండలం : 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, జనరల్‌కు మూడు స్థానాలు. -
ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎమ్మార్పీఎస్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందిం చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే పార్లమెం ట్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణమాదిగతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో ఎమ్మార్పీఎస్ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో వర్గీకరణబిల్లు ప్రవేశపెట్టి ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో ఒత్తిడి తేవాలనే ప్రతిపాదనకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినందుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఉత్తమ్, కుంతియాతో కలిసి మందకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై మాట తప్పారని, అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగదీక్షను ప్రశ్నించినందుకు కక్షగట్టి తనను జైల్లో పెట్టారని విమర్శించారు. తెలంగాణకు స్వేచ్ఛ ను ప్రసాదించిన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీపై కేసీఆర్ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోనియా ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పకుండా హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. సూట్‌కేసులు కావాలనుకుంటే సోనియా తెలంగాణను ఇచ్చేదికాదని, కేసీఆర్‌కు సంచులు కావాలి కాబట్టే, సూట్కేసులని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘కేసీఆర్‌కు ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎక్కువ సంచులు ఇస్తారు, కాబట్టి వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టారు’ అని విమర్శించారు. కేసీఆర్ అమరావతికి వెళ్లినప్పుడు చంద్రబాబు ఆంధ్రావాడని గుర్తుకు రాలేదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడిం చడానికి ఎమ్మార్పీఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ ఓడిపోవాలని స్పష్టం చేశారు కేసీఆర్ దళిత ద్రోహి: ఉత్తమ్ కేసీఆర్ దళితద్రోహి అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎస్సీలను సులువుగా మోసం చేయడం కేసీఆర్‌కు తెలుసని అన్నారు. దళితులను నాలుగున్నరేళ్లు మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉందని, ఆ వర్గానికి చెందిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి హోదా నుండి ఎందుకు తొలగించారో ఇప్పటికీ తెలియదన్నారు. సిరిసిల్లలో దళితులను హింసించిన కేసీఆర్‌ను దళితులు విస్మరించారని పేర్కొన్నారు. మందకృష్ణ పోరాటం తెలంగాణ సమాజానికి తెలుసని, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రజాకూటమి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అనేది ప్రాధాన్యత అంశంగా మారిందన్నారు. భవిష్యత్తులో మాదిగలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామిటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవిస్తామని హామీనిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే రాష్ట్రంలో ప్రజా స్వామ్యం బతుకుతుందన్నారు. అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్లమెం ట్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని కుంతియా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ ప్రతిపాదనలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజాకూటమిలోకి మందకృష్ణను సాదరంగా ఆహ్వానించారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆయనను కేసీఆర్ జైల్లో పెట్టడం దారుణమన్నారు. -
సుప్రీంకు పంచాయతీ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించేలా కోరాలని సీఎం నిర్ణయించారు. రేపు కేబినేట్ సబ్ కమిటీ భేటీ దీనిపై అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదనపు అడ్వకేట్ జనరల్, సంబంధిత అధికారులను ఈ భేటీకి ఆహ్వానించాలని తెలిపారు. అన్ని విషయాలు చర్చించి.. పూర్వాపరాలు పరిశీలించాలన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. దాని కోసం అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీనే పిటీషన్ వేసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమేగాక సుప్రీంకోర్టు తీర్పునకు సైతం విరుద్ధమంటూ సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి. సప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎ. గోపాల్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
అద్వానీకి టీఆర్ఎస్ ఎంపీల మొర
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు.. గురువారం లోక్‌సభ వాయిదా అనంతరం భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా పెంచాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అవసరం ఉందని, దానిపై సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన అద్వానీ.. ఆ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ చూపాలని కోరినట్టు సమాచారం. ఇప్పటికే, టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి రిజర్వేషన్ల పెంపు అంశాన్ని వివరించిన సంగతి తెలిసిందే. మరోవైపు వరుసగా ఐదోరోజు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సభలను స్తంభింపజేశారు. రిజర్వేషన్ల పెంపుపై చర్చించాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. -
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేం..!
-
50 శాతం రిజర్వేషన్లు ఎందుకు మించరాదు?
సాక్షి, రాజస్థాన్: రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక వెనుకబడిన వర్గాల జాబితా కింద ఐదు కులాలను చేర్చి వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే విద్యారంగంలో దళితులకు 16 శాతం, ఆదివాసీలకు 12 శాతం, ఇతర వెనుకబడిన వర్గాల వారికి 21 శాతం చొప్పున 59 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 54 శాతం చేరుకుంటాయి. సుప్రీం కోర్టు 1992లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదు. రాజస్థాన్ ప్రభుత్వం ఇంతకుముందు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల కింద కొన్ని కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు యాభై శాతం శీలింగ్ దాటిందన్న ఆరోపణతోపాటు మరికొన్ని ఇతర కారణాలతో 2016లో రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. 2017లో ఒడిశా అదనంగా తీసుకొచ్చిన రిజర్వేషన్లను యాభై శాతం పరిమితి దాటిందన్న కారణంగానే ఒడిశా హైకోర్టు కొట్టివేసింది. అసలు ఈ 50 శాతం రిజర్వేషన్ పరిమితి ఎందుకు ? దీన్ని సుప్రీం కోర్టు 1992లో ఈ పరిమితిని ఎందుకు తీసుకొచ్చింది? 50 శాతానికి మించకూడదన్న నిర్ణయానికి రావడానికి హేతుబద్ధమైన కారణాలేమిటీ? రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న చట్టం కేంద్రంలోగానీ, ఇటు ఏ రాష్ట్రంలోగానీ లేదు. అలాంటి సుప్రీం కోర్టు అత్యుత్సాహంతో ఈ పరిమితిని ఎందుకు తీసుకొచ్చింది? భారత రాజ్యాంగంలోని 15వ అధికరణం (4) నిబంధన, 16వ అధికరణం (4)వ నిబంధన కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి మించరాదని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టు 1992లో తీర్పు చెప్పింది. ఆ తీర్పును అనుసరించే హైకోర్టులు రాష్ట్రాలు పరిమితిని ఉల్లంఘించినప్పుడల్లా రిజర్వేషన్ల నిర్ణయాన్ని కొట్టివేస్తున్నాయి. రిజర్వేషన్లు 40 శాతంగానీ, 80 శాతంగానీ ఎందుకు ఉండకూడదు? దేశంలో ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారో, ఎవరు సామాజికంగా అభివద్ధి చెందారో, ఎవరు సామాజికంగా అభివద్ధి చెందలేదో, వారి శాతం ఎంత ? ఎవరెవరికి రిజర్వేషన్లు ఎంత శాతం అవసరం? అన్న లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్ల పరిమితి ఉండాలిగానీ, గుడ్డిగా సగానికి మించకూడదు అనడంలో అర్థం లేదు. ఈ లెక్కలకు సంబంధించి ఇప్పటి ప్రభుత్వాలు ఎలాంటి కసరత్తు చేయలేదు. మండల కమిషన్ 1980లో ఈ విషయంలో కొంత కసరత్తు చేసింది. ఆ కమిషన్ అంచనాల ప్రకారం దేశంలో 17 శాతం దళితులు, 8 శాతం ఆదివాసులుపోనూ 52 శాతం బీసీలు ఉన్నారు. వీరందరికి రిజర్వేషన్లు కల్పించాలని 77 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. 1931లో దేశంలో జరిగిన జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని నాటి మండల కమిషన్ 52 శాతం బీసీలు ఉన్నారని అంచనావేసింది. దేశంలో కులాల ప్రాతిపదికన జరిగిన జనాభా లెక్కల కార్యక్రమం 1931లో జరిగినదే. 2011లో కులాలు, సామాజిక అంశాల ప్రాతిపదికన జనాభా లెక్కల కార్యక్రమం జరిగింది. నాటి కులాల లెక్కలను నేటికి కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయలేదు. దేశంలో వెనకబడిన వర్గాల వారే ఎక్కువ శాతమని, అగ్ర కులాల వారు అతి తక్కువ శాతం ఉన్నారనే వాస్తవం వెలుగులోకి వస్తుందని, అప్పుడు ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తాయన్న భయంతోనే కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు ఈ వివరాలను వెల్లడించడం లేదు. పటేళ్లు, జాట్లు, మరాఠీలైన అగ్రవర్గాల వారు కూడా రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కులాల వాస్తవ వివరాలను వెల్లడించడమే ఉత్తమం. -
12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కోట్యానాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని మాట్లాడారు. పూర్తిస్థాయి రిజర్వేషన్లను అమలు చేయకపోవడం వల్ల 2014–15, 2015–16, 2016–17 విద్యా సంవత్సరంలో అనేక కోర్సుల్లో వేలాదిగా సీట్లు కోల్పోయామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో ఇప్పటివరకు ప్రకటించిన వాటిల్లో ఉద్యోగాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో 25 వేల గ్రూప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారని, వెంటనే రిజర్వేషన్లకు ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుంటే త్వరలోనే గిరిజనులు పూర్తిస్థాయి పోరాటానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశానికి జాతీయ ఉపాధ్యక్షుడు కేతావత్ నాగేశ్వర్ నాయక్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి ధారావత్ వెంకన్న నాయక్, ఇస్లావత్ సైదానాయక్, వాంకుడోతు రాంజీ నాయక్, బిక్షం నాయక్, నగర రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లతోనే సామాజిక మార్పు
ఉన్నత విద్యావకాశాలను అందుకున్నవారు... ఆ చదువుల ద్వారా సంక్రమించిన కొత్త హోదాకు ‘మెరిట్’ పేరు పెట్టి, వాటిని తమకే స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిభ పేరుతో గతంలోని విశేష హక్కులను తిరిగి పొందాలని, వాటిని రాజ్యాంగబద్ధం చేయాలని, తద్వారా అన్ని అవకాశాలను పొందాలని భావిస్తున్నారు. రష్యా, చైనాల వంటి దేశాలకు భిన్నంగా మన దేశంలో రక్తపాతం లేకుండానే సామాజిక న్యాయం కొంత మేరకైనా జరిగిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే సామాజిక పరివర్తనను అడ్డుకోవడమే. నేటి గుజరాత్ పటేళ్ల ఉద్యమంగానీ, గత యాభై ఏళ్ళుగా రిజర్వేషన్లపై దేశం లో తలెత్తుతున్న ఆందోళనలేవైనా గానీ ఊహించనివి కావు. మన సమాజం లో ఇటువంటి ఉద్యమాలు ఉద్భవిస్తాయని రాజ్యాంగవేత్తలు అప్పట్లోనే ఊహించారు. ప్రత్యేకించి అంబేడ్కర్ ఈ విషయంలో దార్శనికతను చూపా రు. 60 ఏళ్ళ తర్వాత ఎటువంటి ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందో ఊహిం చారు కనుకనే... ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి రాజకీయాధి కారాన్ని ప్రజలకు అందించారు. రాజకీయ సమానత్వాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వానికి దోహదం చేస్తుందని, అది సామాజిక సమానత్వానికి దారితీస్తుందని అంబేడ్కర్ భావించారు. కను కనే మన రాజ్యాంగవేత్తలు మొదట రాజకీయ సమానత్వంపై దృష్టి పెట్టారు. అది సత్ఫలితాలనిచ్చింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలకు ఇది భిన్నమైనది. ఇతర దేశాల్లో ఆర్థిక సమానత్వం సిద్ధించిన తదుపరి రాజకీయ సమానత్వం కోసం పోరాడుతు న్నారు. కొన్ని దేశాల్లో సామాజిక సమానత్వం తర్వాత రాజకీయ సమానత్వం కోసం కృషి జరుగుతోంది. కొన్ని అభివృద్ధిచెందిన దేశాల్లో సైతం మహిళలకు ఓటు హక్కును గానీ, కాలేజీల్లో చదువుకునే అవకాశాన్నికానీ ఇవ్వడంలేదు. ఈ రోజుకీ ఆ అవకాశం కోసం పోరాడుతున్న ఉదాహరణలు కోకొల్లలు. కానీ మన దేశంలో ప్రపంచంలోనే లేని ఒక నూతన ప్రయత్నాన్ని అంబేడ్కర్ చేశా రు. రాజ్యాంగం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించిపెట్టారు. అందరికీ ఓటు హక్కు ద్వారా చైతన్యం సిద్ధిస్తుంది. రాజకీయ సమానత్వం ఆర్థిక అస మానతలను తొలగించి, సామాజిక సమానత్వానికి దారితీస్తుంది అని ఆయ న భావించారు. నేడు గుజరాత్‌లోని పటేళ్ల ఉద్యమం సహా దేశంలో జరుగు తున్న ఉద్యమాలన్నీ రాజకీయ సమానత్వం ఇచ్చిన చైతన్యంతోనే వచ్చాయి. రిజర్వేషన్లను ప్రతిఘటించే శక్తులు ఎప్పుడైనా ఉంటాయి. గతంలో వచ్చిన రిజర్వేషన్ వ్యతిరేకోద్యమాల కోవలోకే పటేళ్ల ఉద్యమం కూడా వస్తుందే తప్ప మరేమీ కాదు. ఉన్నత విద్యావకాశాలతో ముడిపడ్డ సమస్య పటేళ్ల ఉద్యమానికి ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే కొన్ని కీలకమైన అంశాలు కనిపిస్తాయి. ఇది ఉన్నత చదువులకు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన అంశం. ఉద్యోగావకాశాలన్నీ ఉన్నత విద్యనభ్యసించిన వారికే వస్తున్నాయి. 20వ శతాబ్దంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అవి మనిషి జీవితంలోని ప్రతిభాగాన్ని స్పృశించాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిఫలాలు సామా న్యుడికి అందుబాటులోకి రావాలంటే సాంకేతికాభివృద్ధి ఎంతో అవసరం. 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక విప్లవం ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళకు ఉద్యోగార్హతను సాధించి పెట్టింది. ఉన్నత విద్య ఎవరికి అందు బాటులో ఉంటే వారికే అది ఉద్యోగావకాశాలను కల్పించింది. అందుకని ఉన్నత విద్యకు అవకాశాలను, రిజర్వేషన్లను రెండింటినీ కలిపి ఆలోచించా ల్సిన అవసరం ఉన్నది. అంటే ఉన్నత విద్యకు రిజర్వేషన్లను వర్తింపజేయాలి. ఈ రెండింటినీ సమన్వయిస్తేనే అట్టడుగున ఉన్న వాళ్ళకు సైతం శాస్త్ర, సాం కేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా సున్నితమైన సమస్య. అవకాశాలపై గుత్త హక్కుకు మరో పేరు ‘మెరిట్’ ఇక్కడే మరొక ముఖ్య విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఈ రోజు మనుషులకు గానీ, కొన్ని సామాజిక వర్గాలకు గానీ సమాజంలో గుర్తింపు, గౌరవం, హోదా, లేక అంతస్థు... ఆయా వర్గాల, వ్యక్తుల, సామాజిక వర్గాల ఆస్తి ఆధారంగా వచ్చినవే. దీనికి సాంస్కృతికపరమైన సామంజస్యం లభిం చింది. అందుకు మతం తోడ్పడింది. ఈ సాంస్కృతికపరమైన సామంజస్యా నికి వెనుక ఆర్థిక, సామాజిక కారణాలున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చాక వాటి పునాదులు కదిలాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధిం చలేకపోయినా వెనుకబడిన వర్గాల్లో మాత్రం చైతన్యం తెచ్చాయి. ఆస్తితో ఏ విధమైన హోదా వచ్చిందో, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి కూడా అటువంటి హోదా లభించింది. అయితే అటువంటి ఉన్నత చదువులను అభ్యసించే అవకాశాలను అందుకున్నవారు... ఆ చదువుల ద్వారా సంక్ర మించిన ఈ కొత్త హోదాను తమకే స్థిరపరచుకోవడానికి, సమర్థించుకో వడానికి దానికి ‘మెరిట్’ లేదా ప్రతిభ అని పేరు పెడుతున్నారు. ప్రతిభ పేరుతో గతంలోని విశేష హక్కులను తిరిగి పొందాలని, వాటిని రాజ్యాంగ బద్ధం చేయాలని, తద్వారా అన్ని అవకాశాలను పొందాలని ప్రయత్ని స్తున్నారు. ఉన్నత విద్య-సామాజిక న్యాయం అనేది ప్రస్తుతం కీలకమైన అం శంగా మారిపోయింది. అవి రెండూ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగారు, వివిధ దేశాలకు వెళ్ళారు. దీనివల్ల కేవలం ఆయా కుటుంబాలకే మేలు జరిగిందనుకుంటే పొరపాటే. యావత్ సమాజానికి అది మేలు చేసింది. అట్టడుగు వర్గాల నుంచి ఎదిగివచ్చిన వ్యక్తుల పరిశోధనలు అణగారిన వర్గాల సమస్యలకు పరిష్కారాన్ని వెతి కాయి. వారి అభివృద్ధికి దోహదం చేశాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దరికీ అందుబాటులోకి తెచ్చాయి. సామాన్యుడి అవసరాలకు అనుగుణ్యమైన పరిశోధనలు జరిగాయి. గతంలో సంపన్న వర్గాలకు సంబంధించిన అంశా లకే పరిమితమైన పరిశోధన పరిధి విస్తృతమైంది. ఈ పరిశోధన కానీ, ఈ పరి జ్ఞానం కానీ ఏ కొందరికో సొంతం కాకూడదనే తపన మొదలైంది. రిజర్వేషన్ల ఫలితంగానే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, వాటిపై జరిగే పరిశోధనలు సామా న్య మానవుణ్ణి కేంద్రంగా చేసుకుంటున్నాయి. సామాజిక సమానతకు శాంతియుత మార్గం ఇతర దేశాల్లో సామాజిక హోదాలో మార్పు హింసాత్మక పోరాటాల ద్వారా వచ్చింది. సోవియెట్ యూనియన్, చైనాలాంటి దేశాల్లో విప్లవాలు, హింసా త్మక ఉద్యమాల ఫలితంగా ఇటువంటి మార్పు సాధ్యమైంది. కానీ మన దేశంలో ఎటువంటి రక్తపాతం లేకుండానే సామాజిక న్యాయం కొంత మేర కైనా జరగిందంటే అందుకు కారణం రిజర్వేషన్లే. ఎక్కడో అట్టడుగున ఉన్న వర్గాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అడుగుపెట్టగలిగారు. సాధారణ వ్యక్తు లకు సైతం ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రావడం వల్ల తన సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పరిశోధనలు సాగించగలి గారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన భారతీయులు ఎందరో ఇతర దేశాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించ గలిగారంటే కారణం రిజర్వేషన్లే. కుల వ్యవస్థ అమానుష ప్రభావాన్ని స్వయంగా చవిచూసిన వ్యక్తి తన విజ్ఞానాన్ని సరికొత్త మార్గంలోకి తీసుకెళ్ళాడు. ఆ పరిశోధనల ఫలితాలు నేడు ప్రపం చంలోని అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేశాయి. భారత రాజ్యాంగం చేసిన రిజర్వేషన్ల ప్రయోగ ఫలితాలు కేవలం భారతీయులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. పరిశోధకుడి నేపథ్యం పరిశోధనల సంకుచిత సరిహద్దులను చెరిపే స్తోంది. పరిజ్ఞానం అనంత విశ్వానికి వ్యాప్తిసోంది. పేదలకు వచ్చే వ్యాధుల పైన, జీవన విధానంపైనా నేడు ప్రత్యేకంగా జరుగుతున్న పరిశోధనలు అటు వంటివే. ఉన్నత విద్యలో రిజర్వేషన్ల వల్ల పరిశోధనలు కొత్తపుంతలు తొక్కు తున్నాయి. రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే పరిశోధనకు కళ్లెం వేయడమే. విస్తృతమవుతున్న పరిజ్ఞానానికి పరిమితులు విధించడమే. అంబేడ్కర్ దూర దృష్టి భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయగలిగింది. సమాజ మనుగడకు దోహ దం చేసే పరిశోధనలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం... వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడం వల్లనే సాధ్యమనడానికి అంబే డ్కరే ఒక మంచి ఉదాహరణ. దానినే అతను ప్రయోగించాడు. ఉన్నత విద్యలో రిజర్వేషన్లను సుసాధ్యం చేశాడు. వెలుగులోకి రాకుండా పేదరికంలోనే మగ్గుతున్న మట్టిలోని మాణి క్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని వెలికితీయాలి. సామాజిక అణచివేతకు గురవుతున్న వారికి నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలి. అది ప్రతిభకు ప్రతిబంధకం ఎంతమాత్రం కాదు. రిజర్వేషన్ల వలన కొద్ది మం ది సీట్లు కోల్పోవచ్చు. కానీ కొత్త జ్ఞానానికి మాత్రం తలుపులు తెరుచుకుం టాయని స్పష్టం అవుతోంది. చీకట్లో మగ్గుతున్న ఎందరికో ఆ పరిశోధనలు చేయూతనిస్తాయి. పేదల ఆరోగ్యం, వ్యాధులు, వారి సామాజిక పరిస్థితులు, జీవన వైవిధ్యం పైన కూడా అది ప్రభావం చూపుతుంది. ఇంత వరకు జరిగిన పరిశోధనల్లో అత్యధిక శాతం సంపన్నుల ప్రయోజనాలను కాపాడేందుకు జరిగినవే. అంతేగానీ సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని జరిగినవి కావు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు మాత్రం పేదల సమస్యల పరిష్కారానికి సంబంధించినవి కావడం గమనించాల్సిన అంశం. అందువల్ల రిజర్వేషన్లను అడ్డుకోవడమంటే సామాజిక పరివర్తనను అడ్డుకోవడమే. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) - చుక్కా రామయ్య