ఎల్‌కే అద్వానీ (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు.. గురువారం లోక్‌సభ వాయిదా అనంతరం భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా పెంచాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అవసరం ఉందని, దానిపై సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన అద్వానీ.. ఆ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ చూపాలని కోరినట్టు సమాచారం. ఇప్పటికే, టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి రిజర్వేషన్ల పెంపు అంశాన్ని వివరించిన సంగతి తెలిసిందే.
మరోవైపు వరుసగా ఐదోరోజు టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ సభలను స్తంభింపజేశారు. రిజర్వేషన్ల పెంపుపై చర్చించాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment