న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో నిలిచిపోయిన మరికొన్ని రైళ్లకు రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాను న్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 230 రైళ్లు నడుస్తున్నాయి. వాటికి అదనంగా మరో 80 రైలు సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నట్టుగా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదన్ శనివారం చెప్పారు. రైలు సర్వీసుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, మొదట్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రైళ్లలో ఈ మధ్య కాలంలో వెయిటింగ్ లిస్టులు పెరిగిపోతున్నాయని యాదవ్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్‌లు మరింతగా పెరిగిపోతే క్లోన్ రైళ్లను కూడా నడుపుతామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లివే..
రైల్వేశాఖ ఈ నెల 12 నుంచి నడపనున్న 80 ప్రత్యేక రైళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లివే..
సికింద్రాబాద్ – దర్భంగా (07007); దర్బంగా– సికింద్రాబాద్ (07008);
బెంగళూరు – గువాహటి (02509); గువాహటి – బెంగళూరు (02510);
కోర్బా – విశాఖపట్నం (08517); విశాఖ– కోర్బా (08518);
హైదరాబాద్ – పర్బణి (07563); పర్బణి – హైదరాబాద్ (07564).
12 నుంచి మరో 80 రైళ్లు
Published Sun, Sep 6 2020 5:08 AM | Last Updated on Sun, Sep 6 2020 5:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment