![Restoration of festival special trains - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/26/TRAI2.jpg.webp?itok=WG-D4T6B)
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల అవసరాల దృష్ట్యా రైల్వే శాఖ గతంలో నడిపిన పండుగ ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు ఈ రైళ్లు నిర్దేశించిన తేదీల్లో నడవనున్నాయి. ఈనెల 30 నుంచి బరోని–యర్నాకులం ప్రత్యేక రైలు(02521), నవంబర్ 3 నుంచి యర్నాకులం–బరోని ఎక్స్‌ప్రెస్ (02522), ఈ నెల 31 నుంచి దర్భంగ–మైసూర్ (02577), నవంబర్ 3 నుంచి మైసూర్–దర్భంగ (02578), ఈనెల 29 నుంచి గయా–ఎమ్‌జీఆర్ చైన్నై(02389), ఈనెల 31 నుంచి ఎమ్‌జీఆర్ చెన్నై–గయా (02390), ఈనెల 27 నుంచి పాటలీపుత్ర–యశ్వంతపూర్ (03251), యశ్వంతపూర్–పాటలీపుత్ర (03252), ముజఫర్‌పూర్–యశ్వంతపూర్ (05228), యశ్వంతపూర్–ముజఫర్‌పూర్ (05227) రైళ్లు నడవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment