న్యూఢిల్లీ: అందాల పోటీ మిస్ ఇండియా జాబితాలో కూడా దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ‘బాల బుద్ధి (చిన్న పిల్లలు)మాతమ్రే చేస్తారని ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు.
‘ఇప్పుడు రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, ఆటల్లో రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. ఇది ‘బాల బుద్ధి’తో వచ్చిన సమస్య కాదు. ఎవరైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ఆనందం వ్యక్తంచేస్తున్నారో వాళ్లు ఆయన వ్యాఖ్యలకు సమాన బాధ్యత వహించినట్లే. చిన్నపిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు. కానీ మీ విభజన వ్యూహాలతో వెనుకబడిన వర్గాలను ఎగతాళి చేయకండి.
.. ప్రభుత్వాలు మిస్ ఇండియాను, ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఎంపిక చేయవు. సినిమాలకు నటులను ఎంపిక చేయవు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల రిక్రూట్‌మెంట్లలో రిజర్వేషన్లను మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించబోదు. కానీ రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఓ గిరిజన మహిళ, ప్రధాని ఓబీసీ, రికార్డు సంఖ్యలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు.. వారంతా రాహుల్ గాంధీకి కనిపించటం లేదు’’ అని కిరణ్ రిజిజు అన్నారు.
Now, He wants reservations in Miss India competitions, Films, sports! It is not only issue of "Bal Budhi", but people who cheer him are - equally responsible too!
बाल बुद्धि मनोरंजन के लिए अच्छी हो सकती है पर अपनी विभाजनकारी चालों में, हमारे पिछड़े समुदायों का मजाक न उड़ाएं। pic.twitter.com/9Vm7ITwMJX— Kiren Rijiju (@KirenRijiju) August 25, 2024
శనివారం రాహుల్ గాంధీ ప్రయాగ్ రాజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేను మిస్ ఇండియా పోటీల జాబితాను పరిశీలించాను. అందులో ఒక్క దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళ లేదు. కొంతమంది క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడారు. అందులో కూడా దళిత, ఆదివాసీలు లేరు. మీడియా రంగలోని టాప్ యాంకర్లలో 90 శాతం వెనబడిన వర్గాలకు చెందినవారు కాదు’’ అని అన్నారు. అయితే దేశవ్యాప్తంగా కుల గణనను డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment