Kiran rijeju
-
రాహుల్‌కు కిరిణ్ రిజిజు కౌంటర్.. వారిని ఎగతాళి చేయొద్దు
న్యూఢిల్లీ: అందాల పోటీ మిస్ ఇండియా జాబితాలో కూడా దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ‘బాల బుద్ధి (చిన్న పిల్లలు)మాతమ్రే చేస్తారని ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, ఆటల్లో రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. ఇది ‘బాల బుద్ధి’తో వచ్చిన సమస్య కాదు. ఎవరైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ఆనందం వ్యక్తంచేస్తున్నారో వాళ్లు ఆయన వ్యాఖ్యలకు సమాన బాధ్యత వహించినట్లే. చిన్నపిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు. కానీ మీ విభజన వ్యూహాలతో వెనుకబడిన వర్గాలను ఎగతాళి చేయకండి. .. ప్రభుత్వాలు మిస్ ఇండియాను, ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఎంపిక చేయవు. సినిమాలకు నటులను ఎంపిక చేయవు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల రిక్రూట్మెంట్లలో రిజర్వేషన్లను మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించబోదు. కానీ రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఓ గిరిజన మహిళ, ప్రధాని ఓబీసీ, రికార్డు సంఖ్యలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు.. వారంతా రాహుల్ గాంధీకి కనిపించటం లేదు’’ అని కిరణ్ రిజిజు అన్నారు.Now, He wants reservations in Miss India competitions, Films, sports! It is not only issue of "Bal Budhi", but people who cheer him are - equally responsible too!बाल बुद्धि मनोरंजन के लिए अच्छी हो सकती है पर अपनी विभाजनकारी चालों में, हमारे पिछड़े समुदायों का मजाक न उड़ाएं। pic.twitter.com/9Vm7ITwMJX— Kiren Rijiju (@KirenRijiju) August 25, 2024 శనివారం రాహుల్ గాంధీ ప్రయాగ్ రాజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేను మిస్ ఇండియా పోటీల జాబితాను పరిశీలించాను. అందులో ఒక్క దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళ లేదు. కొంతమంది క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడారు. అందులో కూడా దళిత, ఆదివాసీలు లేరు. మీడియా రంగలోని టాప్ యాంకర్లలో 90 శాతం వెనబడిన వర్గాలకు చెందినవారు కాదు’’ అని అన్నారు. అయితే దేశవ్యాప్తంగా కుల గణనను డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
వక్ఫ్ సవరణ బిల్లు.. 21 సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ ) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు. ఈ కమిటీలో దిగువసభ నుండి ప్రభుత్వ, ప్రతిపక్షం నుండి 21 మంది సభ్యులు ఉంటారని ప్రకటించారు . అదనంగా, ఈ కమిటీలో రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. లోక్‌సభ నుంచి జేపీసీకి చెందిన 21 మంది సభ్యుల జాబితా ఇలా ఉంది. 1. జగదాంబిక పాల్2. నిషికాంత్ దూబే3. తేజస్వి సూర్య4. అపరాజిత సారంగి5. సంజయ్ జైస్వాల్6. దిలీప్ సైకియా7. అభిజిత్ గంగోపాధ్యాయ8. డీకే అరుణ9. గౌరవ్ గొగోయ్10. ఇమ్రాన్ మసూద్11. మహ్మద్ జావేద్12. మౌలానా మొహిబుల్లా నద్వీ13. కళ్యాణ్ బెనర్జీ14. ఎ రాజా15. లావు శ్రీ కృష్ణ దేవరాయలు16. దిలేశ్వర్ కమైత్17. అరవింద్ సావంత్18. సురేష్ గోపీనాథ్19. నరేష్ గణపత్ మ్హస్కే20. అరుణ్ భారతి21. అసదుద్దీన్ ఒవైసీ21 MPs from Lok Sabha who will be members of the JPC are - Jagdambika Pal, Nishikant Dubey, Tejasvi Surya, Aparajita Sarangi, Sanjay Jaiswal, Dilip Saikia, Abhijit Gangopadhyay, DK Aruna, Gaurav Gogoi, Imran Masood, Mohammad Jawed, Maulana Mohibullah Nadvi, Kalyan Banerjee, A… https://t.co/CFOYj0tjY6— ANI (@ANI) August 9, 2024 -
‘సభలో అసత్య ఆరోపణలు చేస్తే.. తప్పించుకోలేరు’
ఢిల్లీ: లోక్‌సభను ఏ సభ్యుడైనా తప్పుదోవ పట్టించాలని చూస్తే.. సభ నియమ, నిబంధనల నుంచి తప్పించుకోలేరని పార్లెమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంలో అన్నీ అసత్య ఆరోపణలు ఉన్నాయని స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ప్రాధాన్యత సంతరించుకుంది.‘‘లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చాం. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాం. సభలో అందరీకి సమానమైన నియమాలు ఉంటాయి. స్పీకర్ కంటే ఎవరూ పెద్ద కాదు. సభ నియమాలను నుంచి ఏ సభ్యుడు తప్పించుకోలేరు. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు భావిస్తే.. సభలో అటువంటి ప్రాధాన్యతలు ఉండవు. ఎవరైనా సభను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తే.. వాళ్లు సభ నియమాలను నుంచి తప్పించుకోలేరు’’ అని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.సోమవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పలు అంశాల్లో బీజేపీ, మోదీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై సభలో ప్రధానితో సహా మంత్రులు అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రభుత్వం, బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు.చదవండి: PM Narendra Modi: ప్రశాంతంగా మణిపూర్ -
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా జరుగుతాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో తొలిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపాయి. బడ్జెట్‌కు ముందు వివిధ శాఖలతో జరిపే సంప్రదింపులను ఆర్థిక శాఖ ఈనెల 17 నుంచి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగిన క్రమాన్ని ఆమె ఆనాడు వివరించారు. కాగా 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరగనున్నాయి. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ధృవీకరించారు. -
ఎవరేమోగానీ.. మీరయితే ఈ మధ్యన అలానే తీర్పులిస్తున్నారు సార్!
ఎవరేమోగానీ... మీరయితే ఈ మధ్యన అలానే తీర్పులిస్తున్నారు సార్! -
554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్ కేటగిరీయే
న్యూఢిల్లీ: 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే
న్యూఢిల్లీ: ‘‘కేంద్రం ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు మాత్రమే. పలు కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోనూ ఇదే స్పష్టమైంది’’ అని బీజేపీ పేర్కొంది. సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు ఈ మేరకు చేసిన రాజకీయ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. ‘‘రఫేల్, పెగసస్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, నోట్ల రద్దు, ఈడబ్ల్యూఎస్ కోటా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర దుష్ప్రచారం సాగించాయి. కానీ వీటికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ కేంద్రం వైఖరిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. విపక్షాలు చెబుతున్నదంతా అబద్ధమేనని దీంతో తేలిపోయింది’’ అని ఆమె అన్నారు. మోదీపై వారి నిరాధార ఆరోపణలను చట్టపరంగా తిప్పికొట్టామన్నారు. ‘‘దేశం కోసం పనిచేస్తున్న మోదీకి ప్రపంచదేశాల్లో గౌరవం లభిస్తోంది. దేశ ప్రతిష్టను ఆయన పెంచారు’’ అన్నారు. 2023 ఎన్నికలు కీలకం: నడ్డా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023లో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాల్లో ఒక్కదాన్నీ బీజేపీ కోల్పోరాదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతోందని కొనియాడారు. మోదీకి ఘన స్వాగతం అంతకుముందు కార్యవర్గ సమావేశానికి వస్తున్న మోదీకి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ దాకా పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానిపై పూలు చల్లారు. నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ విజయాలను తెలుపుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద మోదీకి నడ్డా స్వాగతం పలికారు. -
జైళ్లలోని 80% మంది విచారణ ఖైదీలే
జైపూర్: దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనన్నారు. శనివారం సీజేఐ జైపూర్‌లో ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ వార్షిక సదస్సులో పసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని పేర్కొన్నారు. ‘‘నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారింది. అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’’అని ఆయన అన్నారు. దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు. రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయి’’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లాయర్లకే ఎక్కువ గౌరవం: రిజిజు హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లోనే జరిపేలా ప్రోత్సహించాలని కిరణ్ రిజిజు చెప్పారు. ఏ ప్రాంతీయ భాష కంటే ఇంగ్లిష్ ఎక్కువ కాదన్నారు. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలిగినంత మాత్రాన లాయర్లు ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు పొందాలన్న విధానం సరికాదని చెప్పారు. కొందరు లాయర్లు ఒక్కో కేసుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంత ఫీజును సామాన్యులు భరించలేరని చెప్పారు. సామాన్యుడిని కోర్టుల నుంచి దూరం చేసే కారణం ఎలాంటిదైనా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. -
తెరపైకి మళ్లీ ఏఐజేఎస్
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
అనర్హత పిటిషన్లపై వినతి పత్రం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ ఎంపీల బృందం.. ఈ రోజు ( బుధవారం) కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజును కలిశారు. ఈ సందర్భంగా.. అనర్హత పిటిషన్లపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం అంజేశారు. అదే విధంగా, పదో షెడ్యుల్‌ను ఈ మేరకు సవరించాలని కోరారు. ఏపీ హైకోర్టును, జాతీయ న్యాయ వర్శిటీని కర్నూలుకు తరలించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ కమిషన్ తరహాలో రాజ్యాంగబద్ధమైన జాతీయ రైతుల కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చిన ఎంపీల బృందంలో విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు ఫిరాయింపులకు పాల్పడే వారిపై కచ్చితమైన గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్నిసవరించాలని, జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుతోపాటు హైకోర్టును కర్నూలుకు తరలించాలని కోరుతూ వైఎస్సార్సీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజుజును కలిసి విజ్ఞప్తి చేశారు. pic.twitter.com/ygQhLDc8AX — Vijayasai Reddy V (@VSReddy_MP) August 11, 2021 -
ఒక కిడ్నీతోనే పతకాలు సాధించా
కొచ్చి: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. ఇంత చేసిన ఆమె పయనం నల్లేరుపై నడకలా సాగలేదని ఇన్నేళ్ల తర్వాత తాజాగా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పింది. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా... ఒకే కిడ్నీతో ప్రపంచ క్రీడల్లో పోటీపడిన అతికొద్ది మందిలో నేనుంటాను. అలర్జీ, కాలి నొప్పి చాలా ఆరోగ్య సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోద్బలంతోనే వీటన్నింటిని అధిగమించి పతకాలు నెగ్గాను’ అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజూ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజూ 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం సాధించింది. అంజూ ట్వీట్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, నిబద్దతతో భారత్ ప్రతిష్ట పెంచావు’ అని కొనియాడారు. -
స్విమ్మింగ్ కోచ్‌పై ‘రేప్’ ఆరోపణలు!
పనాజీ: గురుపూజోత్సవం రోజున దేశంలోని ప్రముఖ ఆటగాళ్లెందరో తమకు ఓనమాలు నేర్పిన శిక్షకులను స్మరించుకుంటున్న వేళ... ఒక క్రీడా గురువు ఆ బాధ్యతకు మచ్చ తెచ్చే పని చేశాడు. తన వద్ద శిక్షణ పొందుతున్న ఒక 15 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించి ఛీ కొట్టించుకున్నాడు! గోవా రాజధాని పనాజీలో ఈ ఘటన జరిగింది. బెంగాల్‌కు చెందిన సురజిత్ గంగూలీ అనే స్విమ్మింగ్ కోచ్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండున్నరేళ్లుగా అతను పనాజీలో కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బాధిత అమ్మాయి కూడా బెంగాల్‌కు చెందినదే. ఈ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో గంగూలీ నిర్వాకం తెలిసింది. సదరు అమ్మాయి ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి దానిని గోవా పోలీసులకు బదిలీ చేశారు. సురజిత్‌పై వేర్వేరు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో రేప్ (376) కూడా ఉంది. ప్రస్తుతానికి సురజిత్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లినట్లుగా తెలిసింది. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
పెట్టుబడి 0%.. ఫలితాలు 100%
న్యూఢిల్లీ: దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ను మొదలు పెట్టింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం దీనిని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. ‘ఫిట్నెస్ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేది. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాధారణ వ్యక్తి కూడా కనీసం 8–10 కిలోమీటర్లు నడవటమో, పరుగెత్తడమో చేసేవాడు. టెక్నాలజీ పెరిగాక ఇది తగ్గిపోయింది. ఫిట్నెస్ అనేది కేవలం ఒక మాటగా మిగిలిపోకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించేందుకు విప్లవంలా సాగాలి’అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 86వేల కోట్ల ఏడీబీ రుణం భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అంగీకారం తెలిపింది. వచ్చే మూడేళ్లలో పైపుల ద్వారా అందరికీ నీటి సరఫరా, రహదారి భద్రతకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది. ఏడీబీ ప్రెసిడెంట్ టకెహికో నకావో గురువారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా మార్పు చెందేందుకు తమ సాయం దోహదపడుతుందని నకావో అన్నారు. -
షూటింగ్ లేకుంటే... 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను బహిష్కరిద్దాం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల జాబితా నుంచి షూటింగ్‌ను తప్పిస్తే... తాము ఏకంగా ఈ మెగా ఈవెంట్‌ను బహిష్కరిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) హెచ్చరిక జారీ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు సత్వరమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా శనివారం లేఖ రాశారు. గత నెలలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో రాబోయే కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించి, మరో మూడు కొత్త క్రీడలను చేర్చాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) ప్రతిపాదన తెచ్చింది. ఇదే జరిగితే... పతకాల పరంగా భారత్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. పట్టికలోనూ కిందకు పడిపోతుంది. ఈ 2018 గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో మన దేశం 66 పతకాలు సాధించగా, అందులో 16 షూటింగ్లో వచ్చినవే. నేపథ్యంలో తమ నిరసనగా సెప్టెంబరులో రువాండాలో జరుగనున్న సీజీఎఫ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేది లేదని ఐఓఏ తేల్చిచెప్పింది. సమాఖ్య రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, స్పోర్ట్స్ కమిటీ సభ్యత్వానికి నామ్‌దేవ్ షిర్గాంకర్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంది. ‘ఇలాంటి అసంబద్ధ ఆలోచనలపై మా నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయదల్చుకున్నాం. మేం ఇంకా బ్రిటిష్ పాలనలో లేమని వారు తెలుసుకోవాలి. భారత్ ఏ క్రీడలో పట్టు సాధిస్తే అందులో నిబంధనలు మార్చడమో, మరో అడ్డంకి సృష్టించడమో చేస్తున్నారు. ఈసారి మాత్రం వాటిని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాం’ అని బాత్రా తెలిపారు. -
విభజన సరికాదు
రాష్ట్రాల విభజనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజేజు సాక్షి, బెంగళూరు : ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాలుగా, కేంద్ర పాలిత ప్రాంతాలుగా తమ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ వందలాది మంది రోజూ తనకు వినతి పత్రాలు అందజేస్తుంటారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజేజు తెలిపారు. ఈ ఆలోచనా విధానం ఏమాత్రం సరికాదని, ‘ఈశాన్య’ రాష్ట్రాలు భారత్‌లో ఒక ప్రముఖ భాగమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. బీజేపీ నార్త్-ఈస్ట్ సంపర్క్ సెల్ ఆధ్వర్యంలో శనివారమిక్కడి భారతీయ విద్యాభవన్‌లో ‘నార్త్-ఈస్ట్’ కాన్క్లేవ్ పేరిట నగరంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో కిరణ్ రిజేజు మాట్లాడారు. భారతదేశం చాలా పెద్ద దేశమని, అందువల్ల దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలకు ఈశాన్య రాష్ట్రాల గురించి సరైన అవగాహన లేదని అన్నారు. అంతమాత్రాన ఈశాన్య రాష్ట్ర ప్రజలను ఇతర రాష్ట్రాల వారు గుర్తించలేదని అనుకోవడం సరికాదని హితవు పలికారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేనన్ని సంఘాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒక డిమాండ్లతో బంద్‌లు నిర్వహిస్తూ మన అభివృద్ధిని మనమే అడ్డుకుంటున్నాం’ అని ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కారణాలతో జరిగే గొడవలకు కుల,మత, ప్రాంతీయ వాదాలను జోడించడం, తద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రతి గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గాను ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక వాసులు శాంతిప్రియులు.... ఈ సందర్భంగా కర్ణాటక వాసులు ముఖ్యంగా బెంగళూరు ప్రజలు శాంతి ప్రియులని కిరణ్ రిజేజు పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ‘అతిథి దేవోభవ’ అనే వేద వాక్యాన్ని అనుసరిస్తారని శ్లాఘించారు. ఇక ఈ నగరంలో కూడా ఈశాన్య రాష్ట్ర ప్రజలపై దాడులకు సంబంధించి ఒకటి, రెండు ఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే అదంతా పూర్తిగా వ్యక్తిగతమేకానీ ప్రాంతీయతకు సంబంధించి కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ వచ్చిందని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను తమ సోదరులుగా భావిస్తోందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఈశాన్య రాష్ట్ర వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు గాను తనతో పాటు కన్నడిగులైన ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కళాకారులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, పార్లమెంటు సభ్యుడు పి.సి.మోహన్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ పాల్గొన్నారు.