ఆగస్టు 9 దాకా సమావేశాలు
పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా జరుగుతాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో తొలిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపాయి. బడ్జెట్‌కు ముందు వివిధ శాఖలతో జరిపే సంప్రదింపులను ఆర్థిక శాఖ ఈనెల 17 నుంచి ప్రారంభించనుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగిన క్రమాన్ని ఆమె ఆనాడు వివరించారు. కాగా 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరగనున్నాయి. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ధృవీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment