![Centre likely to make fresh attempt to reach consensus with states - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/1/thra.jpg.webp?itok=w0eaxSF8)
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment