judiciary system
-
చరిత్రాత్మక తీర్పులకో వెబ్ పేజీ ప్రారంభించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో తాము ఇచి్చన చరిత్రాత్మక తీర్పులను గుదిగుచ్చి ఒక వెబ్‌పేజీ ద్వారా అందరికీ అందుబాటులోకి తెచి్చంది. న్యాయవితరణలో భాగంగా సుప్రీంకోర్టు వెలువర్చిన కీలక తీర్పుల వివరాలు పౌరులకు తెలియజెప్పడంతోపాటు, న్యాయవ్యవస్థ పట్ల వారిలో మరింత అవగాహన పెంచేందుకు ఈ చొరవ తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. www.sci.gov.in వెబ్సైట్లో ‘ల్యాండ్‌మార్క్ జడ్జ్మెంట్ సమరీస్’పేరిట విడిగా ఒక వెబ్‌పేజీని అందుబాటులోకి తెచి్చంది. ప్రస్తుతానికి 2017 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఇచి్చన కీలక తీర్పుల సమగ్ర వివరాలు అందులో అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందునాటి చరిత్రాత్మక తీర్పులను త్వరలో అప్లోడ్ చేయనున్నారు. ‘‘తీర్పు సంక్లిష్టమైన పదజాలంతో ఇంగ్లిష్ భాష ఉంటుంది. వందల పేజీలున్న కోర్టు తీర్పును చదివి అర్థంచేసుకోవడమూ సాధారణ ప్రజలకు కష్టమే. అందుకే సులభ భాషలో, తక్కువ పదాల్లో తీర్పు సారాంశాన్ని పౌరులకు అందుబాటులోకి తెచ్చాం’’ అని సుప్రీం పేర్కొంది. -
‘అందరికీ న్యాయం’ మన లక్ష్యం
తిరుపతి సిటీ/తిరుమల: ‘జస్టిస్ ఫర్ ఆల్’ అనేది మన లక్ష్యమని.. అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, యువత కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి విచ్చేసిన ఆయన శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన బీఏ ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పదో వార్షికోత్సవ సభలో విద్యార్థులను ఉద్దేంచి ప్రసంగించారు. ఎస్వీయూను 1982లో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తన తండ్రి సందర్శించారని చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. నాణ్యమైన విద్యకు ఈ యూనివర్సిటీ పెట్టింది పేరని, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ ద్వారా సమాజానికి అత్యున్నతమైన న్యాయవాదులను అందించడం శుభపరిణామమని అన్నారు. లా కోర్సును గతంలో రెండవ డిగ్రీగా చూసేవారని.. డాక్టర్, ఇంజనీరింగ్ కోర్సులకు ప్రాధాన్యత ఉండేదన్నారు. ప్రస్తుతం యువత న్యాయశాస్త్ర అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. న్యాయశాస్త్రం క్రమశిక్షణకు మారుపేరన్నారు. విద్యార్థులు విద్యతో పాటు ఆలోచనాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. న్యాయమూర్తులు ప్రజల సమస్యలను సావధానంగా పూర్తిస్థాయిలో వినడం నేర్చుకోవాలని.. తద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడానికి వీలుంటుందన్నారు. తిరుమల చేరుకున్న సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. వీరు రాత్రి తిరుమలలో బసచేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. వీరికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సోషల్ ఇంజనీర్లుగా న్యాయవాదులు సమాజంలో పెద్దఎత్తున మార్పు వచి్చందని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో 50 శాతం పైగా మహిళలు ప్రస్తుతం న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా పనిచేయడం గర్వకారణమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. సమాజంలో వైద్యులు, ఇంజనీర్ల తరహాలో న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లుగా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని, ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించి దేశసేవకు అంకితం కావాలని కోరారు. గురువుల మేధస్సు అసాధారణమైందని.. వారు అందించిన జ్ఞానంతోనే తాను చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఈ సందర్భంగా ఆరుగురు న్యాయాధికారులను ఎస్వీయూ లా కాలేజీ గౌరవ ప్రొఫెసర్లుగా నియమించారు. అనంతరం ఆయనతోపాటు సీజే సతీమణి కల్పనాదాస్ చంద్రచూడ్‌ను వర్సిటీ అధికారులు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి యు.దుర్గాప్రసాద్‌రావు, డిజిగ్నేటెడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ మహాలక్ష్మి పావని, వీసీ వి.శ్రీకాంత్‌రెడ్డి, రిజి్రస్టార్ ఒ.మహమ్మద్ హుస్సేన్, ప్రిన్సిపాల్ పద్మనాభం, డీన్ ఆచార్య ఆర్సీ కృష్ణయ్య, హైకోర్టు న్యాయవాదులు, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
Justice Sanjay Kishan Kaul: సహనశీలత తగ్గుతోంది
న్యూఢిల్లీ: ఎదుటి వారి అభిప్రాయాల పట్ల ప్రజలు సహనం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో నేడు సహనశీలత స్థాయిలు తగ్గుతూండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ధైర్యం కలిగి ఉండటం చాలా కీలకమైన అంశమన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడే బాధ్యత బార్ అసోసియేషన్‌దేనని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్ల 10 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ ఎస్కే కౌల్ ఈ నెల 25న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టుకు ఈ నెల 18 నుంచి వచ్చే జనవరి 2వ తేదీ వరకు శీతాకాల సెలవులు. దీంతో, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో సమావేశమైన వీడ్కోలు ధర్మాసనంలో జస్టిస్ కౌల్ మాట్లాడారు. ‘సర్వోన్నత న్యాయస్థానం నిర్భయంగా న్యాయాన్ని అందించిన న్యాయ దేవాలయం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలి’అని ఆయన ఆకాంక్షించారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్.. జస్టిస్ కౌల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘70ల్లో నేనూ జస్టిస్ కౌల్ కలిసి కాలేజీకి వెళ్లాం. పుట్టస్వామి గోపత్యా హక్కు కేసు, వైవాహిక సమానత్వ కేసు, తాజాగా ఆరి్టకల్ 370 కేసు..ఇలా పలు కేసుల్లో ఇరువురం కలిసి ఇదే వేదికపై నుంచి తీర్పులు వెలువరించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కేనంటూ తీర్పు వెలువరించిన తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ కౌల్ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమరి్థస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఉన్నారు. 1958లో జని్మంచిన కౌల్ 1982లో ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1999లో సీనియర్ న్యాయవాది గుర్తింపు పొందారు. 2001లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా, 2003లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2014లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నలుగురు నియమితులయ్యారు. నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. వీరితో శుక్రవారం ఉదయం హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. కాగా.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. జస్టిస్ నరేందర్ రాష్ట్ర హైకోర్టులో నంబర్ త్రీ స్థానంలో ఉంటారు. ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీకి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ వెంకటరమణ మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తులు, బదిలీపై వెళ్లే ఇద్దరు న్యాయమూర్తులతో కలిపి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. -
ఇజ్రాయెల్‌లో నిరసన జ్వాల.. ప్రధాని నెతన్యాహూ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో వేలాది మంది ప్రజలు నిరసనబాట పట్టారు. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న ప్రధాని బెంజిమన్ నేతన్యాహూకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. సంస్కరణలు ఆపాలని కోరిన రక్షణమంత్రి యోవ్ గ్యాలంట్ను నెతన్యాహు పదవి నుంచి తప్పించిన మరునాడే జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని అనేక మంది భారీ ర్యాలీగా ఆందోళనల్లో పాల్గొని తమ గళం వినిపించారు. జెరూసలేంలోని నెతన్యాహు నివాసం సమీపానికి చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, సైనికులు వారిపై భాష్పవాయువు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. Massive protests in Israel against PM Netanyahu’s judicial reforms ie; 1. Method of appointment of judges 2. Restrict court's ability to cancel laws passed by Israel govt. White House however urges a compromise as Israeli consul general in NY quits. pic.twitter.com/xNVILEYhbD — The Poll Lady (@ThePollLady) March 27, 2023 ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ జైలు శిక్ష పడకుండా తనను తాను కాపాడుకునేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో మార్పులు చేయాలనుకుంటున్నారు. జడ్జీల నియామకం, ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కోర్టులకు తొలగించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు ఈసంస్కరణల్లో ఉన్నాయి. వీటిని అమలు చేయొద్దని చెప్పిన రక్షణమంత్రిని కూడా నెతన్యాహూ పదవి నుంచి తొలగించారు. దీంతో రక్షణమంత్రికి మద్దతుగా, న్యాయవ్యవస్థలో సంస్కరణలకు వ్యతిరేకంగా లక్షలాది మంది పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. రోడ్లు, వీధుల్లో జెండాలు పట్టుకుని నిరసన తెలియజేశారు. Protest in Tel Aviv - Israel has moved to an intense stage of protests after Netanyahu’s sacking of the defense minister. pic.twitter.com/z6P45VlmV4 — Ashok Swain (@ashoswai) March 26, 2023 విమాన సేవలు నిలిపివేత.. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమాన సేవలు నిలిపివేశారు అధికారులు. ఎయిర్ పోర్టు వర్కర్క్ యూనియన్ సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అతిపెద్ద ట్రేడ్ యూనియన్ సమ్మెకు దిగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ.. -
కొలీజియమే అత్యుత్తమం: సీజేఐ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పరిపూర్ణమూ, లోపరహితమూ కాజాలదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక వ్యవస్థ అయిన కొలీజియాన్ని గట్టిగా సమర్థించారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియం వ్యవస్థ తీవ్ర విభేదాలకు కారణంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఇండియాటుడే సదస్సులో సీజేఐ మాట్లాడుతూ కొలీజియంను అత్యుత్తమ వ్యవస్థగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా కాపాడుకోవాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడే అది స్వతంత్రంగా పని చేయగలుగుతుందన్నారు. కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు ఆమోదం తెలపకపోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను కొలీజియం బయట పెట్టడంపై కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ‘‘వీటిపై న్యాయ మంత్రితో చర్చకు దిగదలచుకోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం’’ అన్నారు. అయితే కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో గత 23 ఏళ్లలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదన్నారు. అలాగే న్యాయమూర్తుల లైంగిక ప్రవృత్తికి, వారి సామర్థ్యానికి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొలీజియం సిఫార్సు చేసిన వారిలో కొందరు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకోవడం తెలిసిందే. -
ఇక్కడ ఎవరూ ఎవరినీ... బెదిరించలేరు
ప్రయాగ్‌రాజ్: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు మరోసారి స్పందించారు. ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ 150వ వార్షికోత్సవంలో పాల్గొని రిజిజు ప్రసంగించారు. హైకోర్టు జడ్జీల బదిలీలు, నియామకాల్లో ఏదైనా ఆలస్యమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై శనివారం మంత్రి రిజిజు మాట్లాడారు. ‘ భారత్‌లో ప్రజలే అసలైన యజమానులు. మనమంతా సేవకులం. రాజ్యాంగం చూపిన మార్గనిర్దేశకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకే మనం ఇక్కడ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగానికి లోబడే దేశపాలన కొనసాగనుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ బెదిరించలేరు. కొన్ని సార్లు కొన్ని అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బాధ్యతాయుత పదవుల్లో ఆసీనులైన వారు ఏదైనా చెప్పేముందు ఆలోచించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలనుద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో 4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘చిన్న చిన్న కేసులు కోర్టుల బయటే పరిష్కారం పొందుతాయి. దీంతో కోర్టులకు కేసుల భారం చాలా తగ్గుతుంది’ అని మంత్రి అన్నారు. -
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
తప్పో.. ఒప్పో.. అంగీకరించడం మీ విధి: నారిమన్
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్.. తాజాగా చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారి తీశాయి. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ(కొలీజియం సిఫార్సులు) ఆలస్యమైతే.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లేనని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి నారీమన్. కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రం వర్సెస్ న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వైరుధ్యం తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రిజిజు.. న్యాయ వ్యవస్థ అసలు పారదర్శకంగా లేదని, న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కూడా పాత పద్ధతిలోనే (NJAC ద్వారా) కొనసాగాలంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే.. ముంబైలో జరిగిన ఓ లా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. నేరుగా కేంద్ర న్యాయమంత్రిపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. కోర్టు ఇచ్చే తీర్పులు తప్పో ఒప్పో.. ఏవైనా సరే వాటిని అంగీకరించాల్సి ఉంటుందని, మీ విధులకు మీరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని న్యాయశాఖ మంత్రి రిజిజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా సాక్షిగా న్యాయవ్యవస్థను లా మినిస్టర్ కిరెన్ రిజిజు ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత అవసరం’ అంటూ విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఇప్పుడు మీరు విమర్శించొచ్చు. ఒక పౌరుడిగా నేనూ విమర్శించొచ్చు. ఎలాంటి సమస్య లేదు. కానీ, మీరిప్పుడు ఒక యంత్రాంగం అనే విషయం గుర్తుంచుకోండి. కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినా కట్టుబడాల్సిందే.. అంగీకరించాల్సిందే’’ అని పేర్కొన్నారాయన. స్వతంత్రంగా, ఏ మాత్రం బెదరక తీర్పులిచ్చే న్యాయమూర్తులు దేశానికి అవసరమని, వాళ్లు గనుక లేకుంటే న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతుందని, దేశం కొత్త చీకటి యుగంలోకి నెట్టేయబడుతుందని నారీమన్ అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా.. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు సైతం ఆయన ఓ సలహా ఇచ్చారు. కొలిజీయం ప్రతిపాదలను నిర్వీర్యం చేసే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని, అసలు కొలిజీయం సిఫార్సుల మీద కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం 30 రోజుల గడువు విధించాలని, ఆలోపు స్పందన లేకుండా ఆ సిఫార్సులు వాటంతట అవే ఆమోదించబడాలని సుప్రీం కోర్టుకు సూచించారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు ఒకరిద్దరికే అనుకూలంగా వస్తాయన్నారు. కొలీజియం వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని తొలగించాలని చూడకూడదని చెప్పారు. ఇదిలా ఉంటే మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలి నారీమన్.. ఆగస్టు 2021లో రిటైర్ అయ్యారు. అయితే.. అంతకు ముందు ఆయన కొలీజియం వ్యవస్థలో భాగం పంచుకున్నారు. -
న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే.. రాజ్యాంగమే సర్వోన్నతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. ఓ లీగల్ వెబ్సైట్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పార్లమెంటు చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అనే తనిఖీ బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ వల్ల న్యాయవ్యవస్థకు స్వతంత్రత పోతుందనే భావనతో దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించారని భావించరాదు’’ అని చెప్పారు. నిర్దిష్ట చట్టం, లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిన్నాయా, లేదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయించాలని జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నింటిలోనూ పార్లమెంటే అత్యున్నతమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో జస్టిస్ లోకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అనర్హులకు లబ్ధి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దాన్ని పెంచితే సరైన అర్హత లేని, సరైన పనితీరు కనబరచని న్యాయమూర్తుల సర్వీసూ పెరుగుతుంది. పైగా ప్రభుత్వోద్యోగుల నుంచీ రిటైర్మెంట్ వయసు పెంపు డిమాండ్‌కు ఇది దారి తీయొచ్చు’’ అని పేర్కొంది. ఈ మేరకు సిబ్బంది, న్యాయ వ్యవహారాల పార్లమెంటు సంఘానికి ప్రజెంటేషన్ సమర్పించింది. ‘‘కాబట్టి ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరముంది. ఉన్నత న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం చేపట్టే చర్యల్లో భాగంగా రిటైర్మెంట్ వయసు పెంపు అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్లు, హైకోర్టు న్యాయమూర్తులు 62 ఏళ్లకు రిటైరవుతున్నారు. దీన్ని పెంచేందుకు 2010లో 114వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ 15వ లోక్‌సభ రద్దుతో దానికి కాలదోషం పట్టింది. -
పౌర హక్కులకు... మేమే సంరక్షకులం
ముంబై: దేశంలో పౌరుల స్వేచ్ఛ తదితర హక్కులకు న్యాయస్థానాలే శ్రీరామరక్ష అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ప్రజలు కూడా ఈ విషయంలో న్యాయవ్యవస్థపైనే అపారమైన నమ్మకం పెట్టుకున్నారని స్పష్టం చేశారు. శనివారం బాంబే బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జస్టిస్ అశోక్ హెచ్.దేశాయ్ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో స్వేచ్ఛా దీపిక నేటికీ సమున్నతంగా వెలుగుతోందంటే దాని వెనక ఎందరో గొప్ప న్యాయవాదుల జీవితకాల కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టారు. ‘‘ఏ కేసూ చిన్నది కాదు, పెద్దదీ కాదు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఒక సామాన్య కేసే ఇందుకు తాజా ఉదాహరణ. విద్యుత్ పరికరాల దొంగతనం కేసులో యూపీకి చెందిన ఒక వ్యక్తికి ట్రయల్ కోర్టు తొమ్మిది కేసుల్లో రెండేసి సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. కానీ అది ఏకకాలంలో, అంటే రెండేళ్లలోనే పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం మర్చిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. లేదంటే చిన్న దొంగతనం కేసులో దోషి ఏకంగా 18 ఏళ్ల జైల్లో మగ్గాల్సి వచ్చేది. అందుకే మరోసారి చెప్తున్నా. జిల్లా కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా చిన్న కేసు, పెద్ద కేసు అని విడిగా ఏమీ ఉండవు. అన్ని కేసులూ ముఖ్యమైనవే’’ అన్నారు. పౌర హక్కుల్ని అంతిమంగా న్యాయవ్యవస్థే పరిరక్షిస్తుందని ఈ కేసుతో మరోసారి తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. సదరు కేసులో అలహాబాద్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సీజేఐ సారథ్యంలోని ధర్మాసనమే శుక్రవారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘మనిషి ప్రవర్తన సజావుగా ఉండేలా చూడటంలో చట్టంతో పాటు నైతికతది కూడా కీలక పాత్ర. మన బయటి ప్రవర్తనను చట్టం నియంత్రిస్తే మనోభావపరమైన లోపలి ప్రవర్తనను నైతికత దారిలో ఉంచుతుంది’’ అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. కోర్టుల వల్లే సుస్థిర ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీ సమయంలో కోర్టుల స్వతంత్ర వ్యవహార శైలే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బాంబే హైకోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ స్వతంత్రంగా, నిర్భీతిగా వ్యవహరించే న్యాయస్థానాలే నాడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాయి. మనకబారిన ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రమిద పూర్తిగా కొడిగట్టిపోకుండా జస్టిస్ రాణే వంటి న్యాయమూర్తులే కాపాడారు. బార్ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా నిలిపారు. మన ప్రజాస్వామ్యం ఇప్పటికీ సుస్థిరంగా నిలిచి ఉందంటే అదే కారణం’’ అన్నారు. పలువురు న్యాయమూర్తులతో తాను పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘యువత న్యాయవాద వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించడంలో బాంబే బార్ అసోసియేషన్ చురుౖMðన పాత్ర పోషించాలి. ఈ విషయంలో న్యాయమూర్తులపైనా గురుతరమైన బాధ్యత ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. -
కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు. బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు. -
కోర్టుల్లో స్థానిక భాష: మోదీ
కేవడియా (గుజరాత్): న్యాయమందే ప్రక్రియలో ఆలస్యం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సమర్థ దేశం, సామరస్యపూర్వక సమాజం నెలకొనాలంటే బాధితుల పట్ల సానుభూతితో స్పందించే న్యాయవ్యవస్థ చాలా అవసరమన్నారు. ‘‘కఠినమైన న్యాయ పరిభాష పౌరులకు అడ్డంకిగా నిలిచే పరిస్థితి మారాలి. కొత్త చట్టాలను స్థానిక భాషల్లో రాయాలి. కోర్టుల్లో స్థానిక భాషల వాడకం పెరగాలి. తద్వారా న్యాయప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని చెప్పారు. గుజరాత్‌లోని కేవడియా సమీపంలో ఏక్తానగర్లో శనివారం మొదలైన రెండు రోజుల అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి మోదీ వీడియో సందేశమిచ్చారు. ఈ ఉద్దేశంతోనే బ్రిటిష్ కాలం నాటి 1,500కు పైగా కాలం చెల్లిన, పనికిరాని పాత చట్టాలను తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బుట్టదాఖలు చేసిందన్నారు. ‘‘లోక్ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియలు కోర్టులపై భారాన్ని తగ్గించడంతో దోహదపడుతున్నాయి. పేదలకు సులువుగా సత్వర న్యాయమూ దొరుకుతోంది. చట్టాల్లోని కాఠిన్యం, గోప్యత లేనిపోని సంక్లిష్టతలకు దారి తీస్తుంది. అలాగాక అవి సామాన్యునికి కూడా అర్థమయ్యేలా ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. పలు దేశాల్లో చట్టాలు చేసినప్పుడు అందులోని న్యాయపరమైన పారిభాషిక పదాలను అందరికీ వివరిస్తారు. స్థానిక భాషలోనూ రాస్తారు. అలా అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొన్ని దేశాల్లో చట్టాలు చేసేటప్పుడే అవి ఎంతకాలం పాటు అమల్లో ఉండేదీ ముందే నిర్ణయిస్తారు. మనమూ వీటిని అందిపుచ్చుకోవాలి. యువతకు న్యాయ విద్యను కూడా స్థానిక భాషల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. సవాళ్లను అధిగమించేందుకు భారత న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇంధనావసరాలు తీర్చేందుకు ఉమ్మడి కృషి పరిశోధన సంస్థలకు మోదీ పిలుపు న్యూఢిల్లీ: నానాటికీ పెరిగిపోతున్న దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు పరిశ్రమ, పరిశోధన, విద్య తదితర రంగాలన్నీ ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.అన్ని రంగాల్లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటివాటి వాడకాన్ని పెంచాలన్నారు. శనివారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) భేటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌ను ప్రపంచ సారథిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ 2047 దిశగా కృషి చేయాలని సూచించారు. -
హైకోర్టులో 35 మంది ప్యానెల్ అడ్వొకేట్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులతో కూడిన ప్యానెల్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (అమరావతి)లో వాదనలు వినిపించేందుకు మరో ఏడుగురు న్యాయవాదులను నియమించింది. వీరంతా మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పోస్టుల్లో కొనసాగుతారు. హైకోర్టులో నియమితులైన న్యాయవాదులంతా కూడా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మార్గదర్శకత్వంలో పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా నియమితులైనవారిలో సాగి శ్రీనివాసవర్మ, జోస్యుల భాస్కరరావు, బొమ్మినాయుని అప్పారావు, ఏవీఎస్ రామకృష్ణ, తాత సింగయ్య గౌడ్, గేదెల తుహిన్ కుమార్, అంబటి సత్యనారాయణ, మల్లంపల్లి శ్రీనివాస్, సీవీఆర్ రుద్రప్రసాద్, అరవల శ్రీనివాసరావు, మంచాల ఉమాదేవి, పోతంశెట్టి విజయకుమారి, బేతంపల్లి సూర్యనారాయణ, బాచిన హనుమంతరావు, తానేపల్లి నిరంజన్, అరవ రవీంద్రబాబు, గుడిసేవ నరసింహారావు, గుండుబోయిన వెంకటేశ్వర్లు, పసల పున్నారావు, గేదెల సాయి నారాయణరావు, వి.వెంకట నాగరాజు, ఇ.అంజనారెడ్డి, కామిని వెంకటేశ్వర్లు, తుమ్మలపూడి శ్రీధర్, ఓరుగంటి ఉదయ్ కుమార్, కె.శ్రీధర్ మూర్తి, సోమిశెట్టి గణేష్ బాబు, తడసిన అలేఖ్య రెడ్డి, వైవీ అనిల్ కుమార్, సోమసాని దిలీప్ జయరామ్, పల్లేటి రాజేష్ కుమార్, పామర్తి కామేశ్వరరావు, మన్నవ అపరాజిత, షేక్ బాజీ, గొర్రెముచ్చు అరుణ్ శౌరి ఉన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో నియమితులైన వారిలో కవిపురపు పట్టాభి రాముడు, గొరికపూడి అంకమ్మరావు, ఎన్.వీరప్రసాద్, సీతిరాజు రామకృష్ణ, మాదాల ఆదిలక్ష్మి, షేక్ మంజూర్ అహ్మద్, బి.బి.లక్ష్మయ్య ఉన్నారు. -
న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సమ వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం, బార్, బెంచ్‌లు ఈ మేరకు చొరవ తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ క్రమంలో అనేక కుట్రపూరిత పరిశీలనలకు గురయ్యాయని చెప్పారు. తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. బాల్యం నుంచి సీజేఐ వరకూ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను స్మరించుకున్నారు. తన అనుభవాల్లో తీపి కంటే చేదు ఎక్కువగా ఉందన్నారు. అనేక ఆందోళనలు, పోరాటాల్లో భాగస్వామి అయిన తాను ఎమర్జెన్సీ సమయంలో బాధలు పడ్డానని తెలిపారు. ఆయా అనుభవాలే ప్రజలకు సేవ చేయాలన్న అభిరుచిని తనలో పెంపొందించాయని వ్యాఖ్యానించారు. మొదటి తరం న్యాయవాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, విజయాలకు షార్ట్‌కట్ ఉండదని తెలుసుకున్నానని వెల్లడించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ ఉద్దేశం అదే.. గొప్ప న్యాయమూర్తినని తాను ఎప్పుడూ చెప్పుకోలేదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే న్యాయ వ్యవస్థ అంతిమ ఉద్దేశమని నమ్ముతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బార్ కృషి చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల్లో అవగాహన, విశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 16 నెలల తన పదవీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తమేనని వివరించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను భీష్మ పితామహుడిగా జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్ వికాస్ సింగ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీజేఐ (నియమిత ) జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. హైకోర్టుల్లో నియామకాలు, మౌలిక సదుపాయాల కోసం జస్టిస్ ఎన్వీ రమణ సాగించిన కృషిని అభినందించారు. నూతన సీజేఐగా తన పదవీ కాలంలో కేసుల జాబితా, అత్యవసర విషయాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలపై దృష్టి సారిస్తానన్నారు. పెండింగ్ కేసులే అతిపెద్ద సవాల్ విచారించాల్సిన కేసుల జాబితా సమస్యలను పరిష్కరించడంపై తగిన శ్రద్ధ చూపలేకపోయినందుకు జస్టిస్ ఎన్వీ రమణ క్షమాపణలు కోరారు. దేశంలోని కోర్టులు పెండింగ్ కేసుల రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను ఒక ఉత్తర్వు, ఒక తీర్పుతో నిర్వచించలేమని, అదేవిధంగా ఒక తీర్పుతో మార్చలేమని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టుల పనితీరును సంస్కరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. శాశ్వత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మే«ధను వాడుకోవాలన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సందర్భంగా సీనియర్ లాయర్ దుష్యంత్ దవే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రజాన్యాయమూర్తి అంటూ కొనియాడారు.. జస్టిస్ రమణ సేవలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలతో సాయంతో పూర్తిస్థాయిలో పనిచేశారని జస్టిస్ రమణను అభినందించారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం సుప్రీంకోర్టు శుక్రవారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశగా జస్టిస్ ఎన్వీ రమణ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. నేడు జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించనున్నారు. వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్ -
చట్టాలలో అస్పష్టత ఎవరి పుణ్యం?!
న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వులు ఆచరణకు నోచుకున్నప్పుడే వాటికి విలువా, గౌరవమూ ఉంటాయి. పాలకవర్గం ఆ ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకపోతే దేశంలో గందరగోళం నెలకొని ఉన్నట్టే! ఆ గందరగోళమే చట్టాలు చేయడంలోనూ ప్రతిఫలిస్తోంది. ఎన్నో చట్టాలు సరైన చర్చలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. ఫలితంగా చట్టాల లక్ష్యమేమిటో జనానికి తెలియకుండా పోతోంది. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి స్ఫూర్తి, పారదర్శకత అడుగంటడమే ఈ విలువల పతనానికి కారణం. వలస పాలనావశేషాలు తొలగిపోనంతవరకూ వ్యవస్థలో మార్పు రాదు. అందుకే భారత న్యాయవ్యవస్థను పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘కోర్టులు జారీచేసే ఉత్తర్వులు ఆచర ణలో అమలు జరిగినప్పుడే వాటికి విలువా, గౌరవమూ... క్రమంగా కార్యనిర్వాహక వర్గమైన దేశ పాలకవర్గం కోర్టు ఉత్తర్వులను ‘బేఖాతరు’ చేసే ధోరణిలో ఉంది. అంతేగాదు, చట్టాలు చేయడంలోనూ, దేశంలో పార్లమెంటరీ చర్చల నిర్వహణలోనూ అనుసరిస్తున్న తీరుతెన్నులు సక్రమంగా లేవు. ఇందువల్ల దేశంలో తగాదాలు (లిటిగేషన్) పెరిగి, దేశ పౌరులకు, కోర్టులకు, తదితర సంబంధిత వర్గాలకు అసౌకర్యం కలుగుతోంది. చట్టాలు ఎందుకు చేస్తున్నామో స్పష్టత లేనందునే ఈ గందరగోళమంతా. దేశ చట్టాలను చట్ట సభలలో క్షుణ్ణంగా చర్చించిన, ఆమోదించిన రోజులున్నాయి. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలంగా చట్ట సభల్లో జరుగుతున్నదేమిటో మీకు తెలుసు, గుణాత్మకమైన చర్చలు జరగడం లేదు. ఫలితంగా రూపొందుతున్న కొత్త చట్టాల ఉద్దేశంగానీ, లక్ష్యంగానీ బొత్తిగా బోధపడటం లేదు.’’ – 16 ఆగస్టు 2021 – 27 డిసెంబర్ 2021 తేదీలలో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి. ఆ మాటకొస్తే, చట్టాలు రూపొందిస్తున్న తీరు, పార్లమెంటులో చర్చ లేకుండానే ‘తూతూ మంత్రం’గా ఆమోద ముద్ర వేస్తున్న తీరు గురించి ఒక్క ప్రధాన న్యాయమూర్తి రమణే కాదు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా నిరసన తెలపక తప్పలేదు. చట్టసభలలో చర్చలన్నవి ఎంతో పేలవంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చట్ట సభలలో నేడు పేరుకు జరుగుతున్న చర్చలు ఇంతగా పతనమవడాన్ని నేడు కళ్లారా చూడవలసి వస్తోంది. సమగ్రమైన చర్చలు జరక్కుండానే చట్టాలు రూపొందిస్తున్నారు. ప్రజాస్వామ్యా నికి ఆధారమే చర్చలూ, సరైన వాదనలూ. అయినా సభలో చర్చలు నిరాటంకంగా జరక్కుండా అడ్డుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థల హుందాతనాన్ని, గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీయడమే’’ అని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడం గమనార్హం! వీటన్నింటికంటే ప్రధానమైనది, ఒకనాటి పత్రికలు సమాజంలో నెలకొల్పిన పాత్రికేయ ప్రమాణాలుగానీ, వాస్తవాలపై ఆధారపడిన పరిశోధనాత్మక జర్నలిజంగానీ ఈ రోజున మనకు మృగ్యమని పేర్కొంటూ గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేడు సమాజంలో వాస్తవిక సంచలనం కలిగించగల ఒక్క వ్యాసమన్నా మీడియాలో చోటు చేసుకుందా అని ప్రశ్నించారు. ఒకనాడు భారీ కుంభకోణాలకు సంబంధించిన కథనాలు చదవడానికి పాఠకులు ఉవ్విళ్లూరేవారనీ, కానీ ప్రస్తుత కాలంలో ఏది నిజమో, ఏది కట్టుకథో తెలుసుకోవడం గగనమై పోతోందనీ కూడా జస్టిస్ రమణ ఎత్తి పొడిచారు. అంతేగాదు, ఇటీవలనే ‘మాధవన్ కుట్టి అవార్డుల’ ప్రదానోత్సవం సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ (18 డిసెంబర్ 2021), నేడు దేశంలో వాస్తవాల కోసం ఒక పత్రికపైనో, ఒక చానల్పైనో పాఠకుడు ఆధారపడే పరిస్థితి లేదనీ, పాత్రికేయ విలువలు, ప్రమాణాలూ పడిపోతున్నాయనీ, కనీసం ఒక ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలంటే కనీసం నాలు గైదు పత్రికలు చదవాల్సి వస్తోందనీ వ్యాఖ్యానించారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలోనే జాతీయోద్యమ కాలంనాటి సామాజిక విలువలు, స్ఫూర్తి మనం ఎందుకు, ఎవరి వలన కోల్పోవలసి వచ్చిందన్న ప్రశ్నకు నేటి తరం స్వార్థపరులైన రాజకీయ పాలకులు ఎవరూ సూటిగా సమాధానం చెప్పగల పరిస్థితుల్లో లేరు. చివరికి అనేకమంది ప్రజాస్వామిక, సామాజిక కార్యకర్తల చొరవ ఫలితంగా, పౌర హక్కుల ఉద్యమకారుల నిరంతర పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన ‘సమాచార హక్కు చట్టాన్ని’ సహితం నీరుగార్చి పాలకులు జీవచ్ఛవంగా మార్చిన విషయం మరిచిపోరాదు. చివరికి ఒక విదేశీ గూఢచారి వ్యవస్థ సలహా సంప్రదింపులపై ఆధారపడి దేశీయ పౌరహక్కుల ఉద్యమాలనూ, పౌరహక్కులనూ అణగదొక్కేందుకు, అరబ్ ప్రజలను అణచడంలో అమెరికాకు ‘తైనాతీ’గా పనిచేస్తున్న ఇజ్రాయెల్‌ను మన పాలకులు ఆశ్రయించడం... మన దేశంలోనే కాదు, ప్రపంచ సభ్యదేశాలలో ‘పెగసస్’ కుంభకోణం ద్వారా వెల్లడయిందని మరచిపోరాదు. చివరికి మన సుప్రీంకోర్టు చేతిలో దేశ పాలకులు చిక్కుపడిపోయి ‘పెగసస్’ కుంభకోణం నుంచి బయటపడగల పరిస్థితులు దాదాపు శూన్యంగా కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ మూర్తులైన ఎన్.వి. రమణ, జస్టిస్ అబ్దుల్ నజీర్ భారత న్యాయ వ్యవస్థను బడుగు వర్గాలయిన పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించు కోవలసిన అవసరం ఉందనీ, మన సమాజ వాస్తవాలకు సన్ని హితంగా మలచుకోవలసిన సమయం వచ్చిందనీ హెచ్చరించడం విశేషం. కనీసం 75 సంవత్సరాల స్వాతంత్య్ర ముహూర్తం కూడా గడిచిపోతున్న సందర్భంలోనైనా మనం కళ్లు తెరవవలసి ఉంది. ప్రజాబాహుళ్య విశాల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశీ న్యాయ శాస్త్ర అనుభవాల నుంచి మంచిని గ్రహిస్తూనే, ఒక స్వతంత్ర దేశంగా భారతదేశ న్యాయ వ్యవస్థను వలస పాలనావశేషాలకు కడు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం గురించి 1986 నాటి ఎం.సి. మెహతా కేసులో ఆనాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్. భార్గవ గుర్తు చేసిన వాస్తవాన్ని మనం మరవకూడదు. ఈ అనుభవాల నుంచి భారత న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద ఒనగూడిన ప్రత్యేక సదుపాయమే ‘ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం’ పౌర హక్కు అని మరచిపోరాదు. ఇలా ఎన్ని రకాల హక్కులు దేశ పౌరులకు సమకూడినా– ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య జమిలి వ్యవస్థ... ఆచరణలో రద్దు కానంత వరకూ... రాజకీయ పార్టీలు ఎన్ని ముసుగుల్లో అధికార పెరపెరతో ఎన్నికల్లో పాల్గొన్నా, వలస పాలనా చట్ట అవశేషాలు– దేశాధికారం ఎవరి చేతుల్లో ఉన్నా... ప్రజా బాహుళ్యానికి ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటారా? ప్రసిద్ధ ఆంగ్ల కవయిత్రి మౌమిత ఆలం ‘లైవ్ వైర్’కు రాసిన ‘పొరపాటు’ కవితకు ‘ఉదయమిత్ర’ అనువాదంలోని ఆవేదనను పరిశీలించండి: ‘‘ఔను, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది! ఎవరినైనా, ఎప్పుడైనా, ఎందుకైనా చంపగలరు చావడానికి మనకు కారణాలుంటాయేమోగానీ చంపడానికి వాళ్లకు ఏ కారణమూ ఉండనక్కర్లేదు ఇంట్లో పనిచేసుకుంటున్న అఖ్లాన్నీ రైల్లో ప్రయాణిస్తున్న పెహ్లూన్ని చంపగలరు లక్షలాదిమంది పేర్లూ, చరిత్రనూ తుడిచేసి నిలువెత్తు జీవితాల్ని నంబర్ల కిందకు కుదించేసి అనేకానేకుల్ని అనాధ శవాలుగా మార్చేయగలరు... ఇంతకూ ఎవరువాళ్లు? వాళ్లు దేశ ప్రేమికులండోయ్! ఏ శిక్షా పడకుండా సొంత ప్రజలనే చంపగలరు! గుర్తించడానికి నిరాకరించో ‘పొరపాటు’ గుర్తింపు పేరుమీదనో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చంపగలరు! సర్వకాల సర్వావస్థలకు అతీతులు వాళ్లు సుమా! అవును, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
Disha Encounter: ‘దిశ’ తండ్రి ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజున తెలంగాణ పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. రియల్ హీరోలు అంటూ ప్రశంసించారు. సామాన్యంగా పోలీసులంటే జనాల్లో ఉండే భయం ఆ రోజు దూరమయ్యింది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. వారిని హీరోలుగా చేసిన సంఘటన ఏంటంటే.. 2019, నవంబర్ 27న ఓ అమ్మాయిపై మృగాళ్లు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఆ దారుణం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మృగాళ్లకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష అని ప్రజలు భావించారు. ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న తెల్లవారు జామున ‘దిశ’ను హతమార్చిన నలుగురిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ సంఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. (చదవండి: ‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా? ) ఎన్కౌంటర్ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకున్న రెండేళ్లు పూర్తయినప్పటికి.. దిశ కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి కోలుకోలేదు. ఈ క్రమంలో దిశ తండ్రి మాట్లాడుతూ.. ‘‘లైంగిక నేరగాళ్లకు కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్న సమయంలో న్యాయవ్యవస్థ సత్వరమే స్పందించాలి. నెల రోజుల్లోగా నిందితులకు కఠిన శిక్ష విధించాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేయకపోతే.. బాధితులకు, వారి కుటుంబాలకు ఎన్నటికి న్యాయం జరగదు’’ అన్నారు. (చదవండి: మళ్లీ తెరపైకి దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన) సమాజంలో ఇలాంటి దారుణాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు లైంగిక నేరాల పట్ల అవగాహన కల్పించాలి. ఇలాంటి దారుణాలు నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి శిక్షణ ఇవ్వాలి అని కోరారు. చదవండి: Disha Encounter: సంచలనం.. చర్చనీయాంశం -
విచక్షణతో వ్యాఖ్యలు చెయ్యాలి
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో జడ్జీలు వ్యాఖ్యలు చేసేటప్పుడు విచక్షణతో చేయాలని రాష్ట్రపతి కోవింద్ హితవు పలికారు. జడ్జీలు తమ వ్యాఖ్యలకి తప్పుడు భాష్యాలు కల్పించే అవకాశం ఇవ్వకూడదన్నారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విక్షచణారహితంగా వ్యాఖ్యలు చేస్తే వాటిని సరిగా అర్థం చేసుకోలేరని అన్నారు. అంతిమంగా న్యాయవ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగదినోత్సవాల ముగింపు సమావేశంలో శనివారం కోవింద్ మాట్లాడారు. భారతీయ సంప్రదాయంలో న్యాయమూర్తులకు ఒక హోదా ఉందని, స్థితప్రజ్ఞతకు, నైతికతకు మారుపేరుగా వారు ఉంటారని కొనియాడారు. ‘మన దేశంలో తీర్పులిచ్చిన సమయంలో ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేసే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. వారు చేసే వ్యాఖ్యలు భవిష్యత్ తరాలకు బాటలు వేసేలా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలకే న్యాయవ్యవస్థ కట్టుబడి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యానికి న్యాయం మూలాధారం లాంటిది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు సామరస్యపూర్వక ధోరణిలో కలిసి ముందుకు సాగినపుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థకూ దాని పరిధిని నిర్దేశించారు. దానికి లోబడే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి’ అని కోవింద్ అన్నారు. ఆ చట్టాలతో న్యాయవ్యవస్థపై భారం: సీజేఐ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ శాసనవ్యవస్థ తాను చేసే చట్టాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అంచనా వేయకుండా, అధ్యయనాలు నిర్వహించకుండా వాటిని ఆమోదించడం వల్ల ఒక్కోసారి అతి పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దాని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోయి న్యాయవ్యవస్థపై పెనుభారం పడుతోందన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల్ని పెంచనంతవరకు పెండింగ్ కేసులు తగ్గుముఖం పట్టవని అన్నారు. పార్లమెంటు లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను అమలు చేయడం కష్టసాధ్యమనే పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడకూడదని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతను కాపాడుకోవాలి
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను అన్ని స్థాయిల్లోనూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతల పరిరక్షణ, ప్రచారం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టుల పని తీరుపైనే భారత న్యాయ వ్యవస్థ ఔన్నత్యం ఆధారపడి ఉందని, ఆ కోర్టులు ఇచ్చే తీర్పుల ద్వారా లక్షలాది మందికి ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన, ప్రచార కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన కోర్టులు ఇచ్చే తీర్పులు సమాజంపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయని, సంక్షేమ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఎంతో కీలకమైనదని ఉద్ఘాటించారు. ‘‘ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టుల పనితీరును ఆధారంగా చేసుకొని భారత న్యాయవ్యవస్థపై లక్షలాది మంది అంచనాలు ఏర్పాటు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో కోర్టులు బలోపేతమైతేనే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటవుతుంది. అందుకే న్యాయ వ్యవస్థ స్వతంత్రం, సమగ్రతలను కాపాడుకోవడానికి మించి దేనికి ప్రాధాన్యం లేదు’’ అని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను ఉద్దేశించి తొలిసారిగా ముఖాముఖి మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ ‘‘రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతల్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించాలి. అప్పుడే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. కింద కోర్టులు ఇచ్చిన తీర్పులు సామాజికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆ తీర్పులు అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషలో స్పష్టంగా ఉండాలి’’ అని ఉద్బోధించారు. -
48 గంటల్లో హైకోర్టు నుంచి స్టే తెప్పించగలను
సాక్షి, తిరుపతి: ‘చట్టం, న్యాయం మనవైపు ఉన్నాయి. 48 గంటల్లో హైకోర్టు నుంచి వ్యక్తిగతంగా స్టేలు తెప్పించగలను. నాపై 11 కేసులు పెట్టారు. 307 కేసు పెట్టినా ఏం పీక్కోలేకపోయారు..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం లోకేశ్ తీవ్రమైన, అసభ్యకరమైన పదజాలంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా ప్రచారం సాగించారు. లక్ష్మీపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రచారం చేస్తుంటే వారి వైపు చేయి చూపిస్తూ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న పోలీసులవైపు చూస్తూ.. తన చొక్కా కాలర్ ఎగరేస్తూ మాట్లాడారు. చిత్తూరు ఎస్పీని, కుప్పం డీఎస్పీని హైకోర్టు ‘దా.. దా.. అంటూ రమ్మంది..’ అని ఎద్దేవా చేశారు. రేపు సీఐ, కానిస్టేబుళ్లను కూడా కోర్టు ‘దా.. దా.. అంటుందేమో’ అని పోలీసులను చులకన చేస్తూ మాట్లాడారు. ‘కరెంటు ఇవ్వలేని నా కొడుకులు కుప్పంలో ఓట్లెలా అడుగుతారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే డిస్మిస్ చేస్తాం రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో ఎస్పీపై ఐదారు ప్రైవేట్ ఫిర్యాదులున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వీరందరినీ డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు వైఎస్సార్ సీపీ కండువా కప్పుకుని పనిచేస్తే మంచిదన్నారు. తన తండ్రి సీఎంగా ఉన్నన్ని రోజులు అమరావతిలో తన నివాసానికి ఎవరొచ్చినా గేట్లు తెరిచామని, అదే తాడేపల్లిలోని కొంపకు ఎంతమంది వెళ్లారంటూ స్థానికులను ప్రశ్నించారు. తన తండ్రి వయసున్న మంత్రి పెద్దిరెడ్డిని ‘వాడు, వీడు’ అంటూ సంబోధించారు. -
తెరపైకి మళ్లీ ఏఐజేఎస్
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
నిరవధిక దిగ్బంధనాలు సబబు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
న్యాయం జరగడమే కాదు, కనిపించాలి
ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యాయవ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధుల్లోకి చొచ్చుకుని వస్తోందని తరచూ విమర్శల పాలవుతుండటం విచారకరం. హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణలో ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నత జరుగుతున్నదని వ్యాఖ్యానించడం, దానిపై ఆదేశాలు జారీచేస్తామనడంపై కనీవినీ ఎరుగని విమర్శలొచ్చాయి. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ చూసి ఎరగమనీ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. చాలా కాలంగా అలాంటి విమర్శలు వస్తున్నా మంచి వాతావరణం నెలకొల్పే దిశగా ఏపీ హైకోర్టు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ స్థితిలో సగటు మనిషి ఎలా స్పందించగలడో ఎవరైనా సులభంగా ఊహించగలరు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో న్యాయవ్యవస్థ ఒకటి. రాజ్యాంగం ప్రకారం శాసనాలపై వ్యాఖ్యానించి వాటి రాజ్యాంగబద్ధతను తేల్చడం, ప్రభుత్వాల చర్యలు సరిగా వున్నాయో లేదో చూడటం న్యాయవ్యవస్థ ప్రధాన బాధ్యత. ఈ క్రమంలో రాజ్యవ్యవస్థకూ వ్యక్తులకూ మధ్య, వ్యక్తులకూ ప్రభుత్వంలోని వివిధ విభాగాలకూ మధ్య ఏర్పడే వివిధ వివాదాలను నిష్పాక్షిక రీతిలో పరిష్కరించడం కూడా న్యాయవ్యవస్థ బాధ్యతే. న్యాయస్థానాలు స్వతంత్రంగా ఉండాలి. అంటే ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వేతర వ్యక్తుల అసందర్భ ప్రభావాలకు న్యాయస్థానాలు గురికాకూడదని అర్థం. తమ ముందున్న కేసులను నిష్పాక్షికంగా నిర్ణయించడం న్యాయమూర్తుల బాధ్యత కాబట్టి అంతకు మించిన ప్రాధాన్యత వారికి దేంట్లోనూ ఉండదు కనుక నిజమైన న్యాయమూర్తులు ప్రజాకర్షణపై దృష్టి పెట్టరు. ప్రజాకర్షణకోసం వెంపర్లాడేవారు వివాదాలపై నిష్పాక్షిక నిర్ణయాలు వెలువరించలేరు. ఈ కారణం వల్లే న్యాయమూర్తులు ఏ పరిస్థితుల్లోనూ, ఏరకమైన అనుమానాలకూ తావీయకుండా గొప్ప సూక్ష్మగ్రాహ్యతతో, సున్నితత్వంతో పని చేయాల్సి ఉంటుంది. న్యాయం చేయడం మాత్రమే కాదు, న్యాయం చేసినట్లు కనిపించాలి అని సుప్రసిద్ధ నానుడి కూడా ఉంది. 1924లో ఆర్ వర్సెస్ సెషన్స్ జస్టి్టస్కి సంబంధించిన ఒక ఇంగ్లిష్ కేసును ఉదహరిద్దాం. ఒక మోటార్ సైకిల్ చోదకుడు రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. అతడిపై విచారణ సాగి అంతిమంగా తనను దోషిగా ప్రకటించారు. తర్వాత ప్రతివాది దీనిపై ట్రయల్ కోర్టుకు వెళ్లినప్పుడు కింది కోర్టు తీర్పును కొట్టివేశారు. న్యాయమూర్తుల వద్ద పనిచేస్తున్న ఒక క్లర్కు ఒక న్యాయవాద సంస్థలో సభ్యుడుగా ఉండేవాడు. ఒక పౌర దావాలో ఈ క్లర్కుకూ, ఆ మోటారు సైకిలిస్టుకూ వివాదం నడిచింది. దాంతో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును క్లర్కు ప్రభావితం చేసి ఉంటాడనే అనుమానంతో ప్రతివాది పైకోర్టుకు వెళ్లాడు. కానీ న్యాయమూర్తులు అతడి అభ్యర్థనను తిరస్కరిస్తూ, ఆ క్లర్క్ ఈ కేసులో ఏరకంగానూ న్యాయమూర్తులను ప్రభావితం చేయలేదని చెప్పారు. కానీ ఆ మోటారు సైకిలిస్టు పేర్కొన్న ఇతర అంశాలను ఎగువ కోర్టు ఆమోదించింది. అయితే అతడి అప్పీల్‌ని విచారించిన కింగ్స్ బెంచ్ అంతిమంగా ఇలా చెప్పింది. ‘నిస్సందేహంగా ఈ కేసు పూర్వాపరాలను చూసినట్లయితే క్లర్కు చాలా జాగ్రత్తగా ఈ కేసు విషయంలో దూరం పాటించాడని తెలుస్తోంది. అయితే అనేక కేసులు ఈ ఉదంతానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదని సూచిస్తున్నాయి, ప్రాథమిక విషయం ఏమిటంటే, న్యాయం జరగడమే కాదు, నిస్సందేహంగా న్యాయం జరిగినట్లు కనిపించాలి కూడా.’ ఈ కేసు పూర్వాపరాలు స్పష్టంగా నిరూపిస్తున్నది ఏమిటంటే, న్యాయమూర్తులను క్లర్క్ ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది అనే. ఈ పరిశీలనతోటే కింగ్స్ బెంచ్ కింది కోర్టు తీర్పును కొట్టిపడేసింది. న్యాయ సోదరుల్లో ఒక సభ్యుడిగా, నేను న్యాయవ్యవస్థ శ్రేయస్సుకోసం తపిస్తాను, తీర్పు చెప్పే తన యంత్రాంగం ద్వారా ప్రజాస్వామిక సూత్రాలను ఎత్తిపట్టడంలో దానికి కీలక పాత్ర ఉండాలని కూడా కోరుకుంటాను. సంబంధిత ఆదేశాలను చదవకుండానే కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లోకి న్యాయవ్యవస్థ వాస్తవంగా చొరబడిందని నేను చెప్పలేను కానీ న్యాయవ్యవస్థ ఆదేశాలపై ప్రజల స్పందనలను గురించి చెప్పగలను. కలవరం కలిగించే విషయం ఏమిటంటే, 2019 మధ్యలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ తన నిర్ణయాధికారం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లోకి ఉద్దేశపూర్వకంగా చొరబడుతున్నదని విమర్శలకు పాత్రమవుతుండటం దురదృష్టకరం. న్యాయవ్యవస్థ వస్తుగతంగా కాకుండా ఆత్మాశ్రయరీతిలో నిర్ణయాలు తీసుకుంటోందన్న అభిప్రాయం కలగడం దురదృష్టం. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రాథమికమైనది. కానీ మీడియా ఇప్పుడు వేరువేరు రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటున్నందువల్ల, న్యాయస్థానాల నిర్ణయాలతో సహా ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులు బుద్ధిపూర్వకంగా గానీ అనుద్దేశంగా గానీ ఒక గ్రూప్‌లో పాపులర్ అవుతున్నారు. మరొక గ్రూపులో లేదా గ్రూపుల్లో చెడుగా ప్రచారానికి లోనవుతున్నారు. దీంతో ప్రజాస్వామిక సూత్రాలకు వ్యతిరేకంగా న్యాయమూర్తులు ఒక గ్రూప్ లేదా కొన్ని గ్రూపులకోసం పనిచేస్తున్నారని ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లిపోతున్నాయి. ప్రజల్లో ఏ వర్గంలోనూ న్యాయమూర్తులు ప్రాచుర్యం పొందకూడదన్న భావనకు ఇది సన్నిహితంగా లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 10 మంది కరోనారోగుల మృతికి కారణమైనట్లు ఆరోపణలకు గురైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కేసులో దాని యజమాని డాక్టర్ రమేష్ అరెస్టు, విచారణ ప్రక్రియపై స్టే ఆదేశాలు ఇవ్వడం కానీ, అమరావతి అసైన్డ్ భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఎమ్మార్వో సుధీర్ బాబు కేసులో విచారణను ఏపీ హైకోర్టు నిలిపివేయడం కానీ ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశాల్లో హైకోర్టు సరైన రీతిలో వ్యవహరించలేదని విమర్శలు బయలుదేరాయి. తదనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఏపీ హైకోర్టు ఆదేశాల పట్ల అసంతృప్తిని ప్రకటించింది. క్రిమినల్ కేసుల దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోకూడదని భావిస్తూ సుప్రీంకోర్టు అవసరమైన ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ హైకోర్టుపై విమర్శలకు బలాన్ని చేకూర్చినట్లయింది. మాజీ అడ్వొకేట్ జనరల్‌పై మరో పదిమంది ఇతరులపై భూకుంభకోణానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని మీడియాలో ప్రచురించకుండా హైకోర్టు నిషేధ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, ఈ కేసును దర్యాప్తుపై స్టే విధించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ బాబు పట్ల పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణపై సీబీఐ విచారణకు ఆదేశించడం, ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థిస్తూ కేంద్ర ట్రిబ్యునల్ తీర్పును సైతం పక్కనబెట్టడమే కాకుండా అతడికి వేతనం బకాయిలను కూడా చెల్లించాలని ఆదేశించినప్పుడు ఏపీ హైకోర్టు తీవ్ర విమర్శల పాలైంది. హైకోర్టు ఆదేశాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టిపడేయటమే కాకుండా కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ, అతడి సస్పెన్షన్ కొనసాగింపునకు ఆదేశాలిచ్చింది కూడా. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, పేదలకు ఇళ్లపట్టాలివ్వడానికి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై ఏపీ హైకోర్టు విమర్శలను ఎదుర్కొంది. పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నత జరిగిందంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడంపై కనీవినీ ఎరుగని విమర్శలొచ్చాయి. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ చూసి ఎరగమనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టుపై, ఇలాంటి ఆదేశాలిచ్చిన న్యాయమూర్తిపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లిపోయాయి. సొంత అభిప్రాయాలు చొప్పించకుండా, నిష్పాక్షికంగా నిర్ణయాలు ప్రకటించాల్సిన న్యాయమూర్తులు ఇలాంటి విమర్శలకు ఎందుకు అవకాశమిస్తున్నారు? ఏదైనా కేసులో న్యాయమూర్తి నిర్ణయంపై తగుమాత్రం అనుమానం వచ్చినా సంబంధిత కేసులో నిజమైన న్యాయమూర్తి పాలు పంచుకోకూడదు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి అనే సూత్రాన్ని కోర్టులు విధిగా పాటించాల్సి ఉంది. చాలా కాలంగా అలాంటి విమర్శలకు గురవుతున్నప్పుడు మంచి వాతావరణం నెలకొల్పే దిశగా ఏపీ హైకోర్టు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇలాంటప్పుడు సగటు మనిషి ఎలా స్పందించగలడో ఎవరైనా సులభంగా ఊహించగలరు. అలాంటి విమర్శకు కోర్టులు తావు కల్పించవని ఆశిద్దాం. అలాంటి విమర్శలు భవిష్యత్తులో ఎదుర్కోకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి, కోర్టుల పట్ల ప్రజల గౌరవం కొనసాగేలా చూడాలి. జస్టిస్ గురిజాల కృష్ణమోహన్ రెడ్డి వ్యాసకర్త, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి -
అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్
న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్‌కౌన్సిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు. ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థలో అవినీతి చేటుకాదా?
ప్రజాస్వామ్య మూలాల్ని నమిలివేస్తున్న అవినీతి అని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ చేసిన ప్రసంగం అందరూ గమనించదగింది. ఒక న్యాయకోవిదుడు అవినీ తిపై తన ఆవేదన వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం. న్యాయం అన్న పదానికి విస్తృతమైన అర్థం ఉందని ఆయన విడమరిచి చెప్పే యత్నం చేశారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాలు దీని పరిధిలోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక శాంతికి కృషి చేయాలని, అంతేకాక, ఆ విషయాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియచేయాలని ఆయన సూచించారు. ఎక్కడైతే అవినీతి సాధారణం అయిపోతుందో అక్కడ వ్యవస్థలపై ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయన అన్నారు. చాలా విలువైన విషయాలను గౌరవ న్యాయమూర్తి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను అంతా పరిశీలించవలసి ఉంటుంది. న్యాయమూర్తి చెప్పిన విషయాలు కచ్చితంగా అన్ని వ్యవస్థలు పాటించాలి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్‌తో వ్యవస్థలు ముందుకు సాగాల్సి ఉంటుంది. శాసన వ్యవస్థలో రాజకీయ నేతలు కీలకంగా ఉంటే, కార్యనిర్వాహక వ్యవస్థలో ఐఏఎస్,ఐపీఎస్‌లు ముఖ్య భాగంగా ఉంటారు. మూడోది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు ప్రముఖులు అన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. ఈ మూడింటిలో ఎక్కడ తేడా వచ్చినా, పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిజమే! దేశంలో రాజకీయ వ్యవస్థలో అవినీతి పెరిగిన మాట వాస్తవం. అలాగే రాజకీయాల కోసం ప్రత్యర్థుల మీద కేసులు పెట్టిన ఘటనలు కొన్ని అయితే, తమకు కావాల్సిన వారు ఏమి చేసినా వారిపై ఎలాంటి కేసులు రాని పరిస్థితి మరొకటి ఉంటోంది. దీనికి ప్రధానంగా శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ బాధ్యత వహించాలి. జస్టిస్ రమణ చెప్పినదాని ప్రకారం అవినీతి ప్రజాస్వామ్య మూలాలను నమిలివేస్తుంటే, దానిని చెక్ చేయవలసిన న్యాయ వ్యవస్థపై ఆరోపణలు వస్తే ఏమి చేయాలన్న దానిపై కూడా ఆయన కొన్ని సూచనలు చేస్తే బాగుండేది. ఒక ప్రభుత్వం ఫలానా అవినీతి జరిగింది. దానిపై విచారణ చేయాలని దర్యాప్తు సంస్థలకు బాధ్యత అప్పగిస్తే, అవి తమ కర్తవ్యం నిర్వర్తించి కొంతమంది వ్యక్తులపై అవినీతి కేసులు పెడితే గౌరవ హైకోర్టులు ఎందుకు ఆ విచారణను నిలిపివేస్తున్నాయి? పైగా కొన్ని కేసులలో ఆశ్చర్యంగా సంబంధిత సమాచారం ఎవరికీ తెలియకూడదని ఆదేశాలు ఇస్తున్నాయి. రాజకీయ లేదా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలలో అవినీతి జరిగితే చెక్ చేయడానికి న్యాయ వ్యవస్థ ఉండాలి. మరి న్యాయవ్యవస్థలో అలాంటి లోటుపాట్లు జరి గితే దాన్ని చెక్ చేయడానికి కూడా అవకాశం ఉండాలి కదా.. న్యాయమూర్తులంతా కడిగిన ముత్యాల్లా, తామరాకు మీద నీటి బొట్టులా నిష్పక్షపాతంగా ఉంటే అంతకన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది? ముంబై హైకోర్టు సాయంత్రం ఆరు గంటలు దాటింది కనుక తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వజాలమని, జర్నలిస్టు అర్నాబ్ కేసులో ఎందుకు చెప్పింది? ఏపీలో మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీని వాస్ కేసులో హైకోర్టువారు రాత్రి పొద్దుపోయిన తర్వాత అవినీతి కేసులో ఎఫ్ఐఆర్పై స్టే ఇవ్వడమే కాకుండా ఎక్కడా ప్రచారం కారాదని ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? అంతేకాక అసలు ఆ కేసులో పిటిషన్ వేయకపోయినా, అందరికీ వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏ చట్టం, ఏ రాజ్యాంగం చెప్పిందన్నది మాబోటి సామాన్యులకు తెలియదు. కానీ ఆయా హైకోర్టులు కొన్ని అంశాలపై భిన్నమైన రీతిలో స్పందిస్తున్నప్పుడు సహజంగానే చర్చనీ యాంశం అవుతాయి కదా? కేరళలో మధ్యతరగతి ప్రజలు నివసించే అపార్టుమెంట్లను నదీ సంరక్షణ చట్టం కింద సుప్రీంకోర్టు ఎందుకు కూల్చివేయిం చింది.. మరి అదే ఏపీలో కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలు కూల్చడానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ ఎందుకు స్టేలు ఇచ్చిందని అనుకోవాలి. ఇలాంటి సంశయాలు చట్టపరమైన విద్య చదువుకోని మాబోటివాళ్లకు వస్తే ఎవరు సమాధానం ఇస్తారు? గతంలో న్యాయ వ్యవస్థలోని కొందరిని అవి నీతి కేసులలో అరెస్టు చేసిన ఘట్టాలు కూడా చూశాం. ఇప్పుడు జస్టిస్ రమణ చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకమైనది. కానీ ఆయన చెబుతున్నదానికి విరుద్ధంగా కొన్ని హైకోర్టులలో విషయాలు నడుస్తున్నాయన్న భావన కలిగితే ఎవరిని అడగాలి? రమణగారు అవినీతి ప్రజాస్వామ్య మూలాలను తినేస్తోందని అంటారు. కానీ కొన్ని హైకోర్టులు అవినీతి కేసులలో స్టేలు ఇస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అమరావతిలో భూమి స్కాం జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు అయితేనే దానిని గౌరవ న్యాయస్థానం వారు నిలుపుదల చేయడం సరైనదేనా? జస్టిస్ రమణ చేసిన అభిప్రాయాలకు ఇది విరుద్ధంగా ఉన్నట్లా? కాదా? ఈ ఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన ఒక రాజకీయ నాయకుడిని ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించడానికి ఒక కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు, అలాగే బెయిల్ వచ్చిన తీరు చర్చకు అవకాశం ఇచ్చిందా? లేదా? విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో ఎంతో సీరియస్‌గా స్పందించిన గౌరవ హైకోర్టు వారు, విజయవాడలో జరిగిన హోటల్ అగ్నిప్రమాద కేసులో ఎందుకు స్టే ఇచ్చిందని సామాన్యుడు అడిగే ప్రశ్నకు జవాబు దొరుకుతుందా? ప్రభుత్వాలలో అవినీతి జరగదని, కార్యనిర్వాహక వ్యవస్థలో తప్పులు జరగవని చెప్పడం లేదు. కచ్చితంగా వాటిని చెక్ చేయవలసిందే. కనీసం న్యాయ వ్యవస్థకు ఆ అవకాశం ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థలో జరిగే తప్పొప్పులకు ఎవరు బాధ్యత వహించాలి. న్యాయ వ్యవస్థలో ప్రముఖులపై అభియోగాలు వస్తే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలా? లేదా? న్యాయ వ్యవస్థ గురించి ఎవరూ మాట్లాడకూడదు అన్నట్లు వ్యవహారాలు నడవడం సమంజసమేనా? నిజమే కొన్నిసార్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి తప్పుడు కేసులుపెట్టవచ్చు. అలాంటి వాటిని కనిపెట్టి కోర్టులు న్యాయం చేయడం, పౌరహక్కులను కాపాడడం ఎవరైనా సమర్థించి తీరవలసిందే. కానీ అందరూ చూస్తుం డగా జరిగిన కొన్ని నేరాభియోగాలను న్యాయ వ్యవస్థ ఎందుకు గమనంలోకి తీసుకోవడం లేదని అడిగితే ఏమి చెబుదాం. ఉదాహరణకు ఓటుకు నోటు కేసులో ఒక మాజీ సీఎం పాత్ర గురించి చార్జీషీట్లో పలుమార్లు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? అయినా ఆయన పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదు? దానిపై హైకోర్టుకు వెళితే ఒక జడ్జిగారు చంద్రబాబుకు ఏం సంబంధం అని అనడం కరెక్టేనా? ఆ కేసుపై సుప్రీం కోర్టులో ఇంతకాలం అసలు విచారణే ఎందుకు జరగలేదని సామాన్యులకు సందేహాలు వస్తే ఏమని చెప్పాలి? కనుక జస్టిస్ రమణ చెప్పినట్లు ప్రజాస్వామ్య మూలాలను అవినీతి నమిలేస్తున్నదన్నది వాస్తవమే. అలాంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలో చొరబడకుండా గౌరవ న్యాయమూర్తులు ఏమి చేయాలి? దాని గురించి ముందుగా కేంద్రీకరించి వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి పూనుకుంటే అంతకన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది? ప్రభుత్వాల విధానాల నిర్ణయాలలో తరచూ హైకోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఓడిపోయినవారు కోర్టులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎందుకు అంటున్నారు? ఈ మధ్య రిటైర్ అయిన దీపక్ గుర్తా అనే సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేస్తూ న్యాయ వ్యవస్థ ధనికుల కేసుల్లో అతి వేగంగా స్పందిస్తోందని అనడంలో ఆంతర్యం ఏమిటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన రంజన్ గొగోయ్ వ్యవస్థలో మాఫియా ఉందని అనడం ఏమిటి? తదుపరి ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం ఏమిటి? ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన న్యాయ వ్యవస్థ గురించి కూడా అంతా ఆలోచించాల్సిన సమయం రాలేదా? జస్టిస్ రమణ చెప్పినట్లు అవినీతి ప్రజాస్వామ్య మూలాలను నమిలేస్తోంది. దురదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో విమర్శలు ఎదుర్కోవడమే బాధాకరం. ఆ పరిస్థితి పోవాలని, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని, నిష్పక్షపాతంగా ఉండాలని, ఎలాంటి అవినీతి అభియోగాలకు అవకాశం లేకుండా ఉండాలని ప్రజలు కోరుకోవడం ఆక్షేపణీయం కాదు. అందువల్ల అన్ని వ్యవస్థలు సజావుగా సాగాలని, అన్ని విభాగాలు అవినీతికి దూరంగా ఉండాలని, అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం మరింతగా వర్ధి ల్లుతుందని ఆశించడం తప్పు కాదు. మరి ఆ పరి స్థితి వస్తుందా? వ్యాసకర్త కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించిన బాబు
‘‘పబ్లిక్ సర్వెంట్లుగా ఉండాల్సిన జడ్జీలు ప్రజలనుంచి వచ్చే విమర్శలను శిరసావహించా ల్సిందే. అది న్యాయమూర్తుల వృత్తి ధర్మంలో ఎదురయ్యే అనివార్యమైన చిక్కు కావచ్చు. అలాంటి విమర్శ ఏదైనప్పటికీ ఒకవేళ ఆ విమర్శలో న్యాయమూర్తుల ధర్మాసనంపై అవిశ్వాసం లేదా అవినీతికి సంబంధించిన ఆరోపణలున్నా సరే– న్యాయమూర్తులకు న్యాయసంబంధమైన రక్షణ అవసరం గానీ లేదా ప్రత్యేక లీగల్ ప్రొటెక్షన్గానీ ఉండనక్కర్లేదు. ఎందుకంటే, ఆరోప ణలు నిజమైతే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని బహిరంగ పర్చాల్సిందే, అలా గాకుండా ఆరోపణలు అబద్ధమని తేలినపక్షంలో ఇతరత్రా రక్షణలు ఉండనే ఉంటాయి. ఆరోపణలకు సమాధానం ఇవ్వడం సబబని జడ్జి భావిస్తే అందుకు సిద్ధపడవచ్చు. తన ప్రతిపత్తిని కాపాడుకోగోరే జడ్జికి లేదా అతని ధర్మాసనానికీ చట్టం రక్షణగానే ఉంటుంది. కానీ ఒక్క సత్యాన్ని మాత్రం మరవరాదు– రాజకీయ వేత్తలకు లేని పాలనా కాల పరిమితి రక్షణ న్యాయమూర్తులకు ఉంది. అందువల్ల న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జడ్జీలు స్వేచ్ఛగా, బాహాటంగా ప్రజలు చేసే విమర్శలను శిరసావహించా ల్సిందే. విమర్శను కూడా జ్యుడీషియరీ అదో రకమైన రాజకీయ ప్రసంగంగానే భావించుకోవాలి’’. – ఎరిక్ బారెన్డ్ మన తెలుగువాళ్లలో ఓ సామెత ఉంది. ‘ముంజేతి కంకణానికి అద్దమెందు’కని. కానీ అదిప్పుడు మరో రూపంలో ప్రత్యక్షమవు తోంది: చేతి మరకలు చూసుకోవడానికి కూడా అద్దం ఎందుకు అని! 2019 ఎన్నికల్లో కేవలం ఒక మరుగుజ్జుగా, ‘లిల్లీపుట్’గా రాష్ట్ర శాసనసభలో తానూ, తన పార్టీలో మిగిలిన ‘సరుకు’ మిగిలిపోవలసి వచ్చి.. పేరుకు ప్రతిపక్ష నాయకుని హోదాలో కొనసాగుతున్న చంద్ర బాబు ఏ మార్గం ద్వారా అయినాసరే తిరిగి అధికారంలోకి రావాలన్న తాపత్రయంలో అనుసరించని ఎత్తుగడ అంటూ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ విశిష్ట ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం ఆ వెలితిని తీర్చడం కోసం కొత్తగా రంగంలోకి దూకవలసి వచ్చిన ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని.. అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు అప్పటికే అడుగూడి పోయిన చంద్రబాబు ‘దేశం’ జమిలిగా కుట్రపన్ని, ఈ క్షణం దాకా రుజువులేని ‘అవినీతి’ ఆరోపణల పేరిట వైఎస్ జగన్‌ని అరెస్టు చేయించారు. సీబీఐ, ఈడీ సంస్థల ద్వారా అభియోగాలు మోపి, దాదాపు 16 మాసాలపాటు ఎలాంటి అభియోగాలు రుజువు చేయకుండానే జైల్లో బంధించిన క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టు పదేపదే సీబీఐ అధికారుల్ని ‘ఏవి మీ రుజువులు, ఎక్కడ, ఎప్పటికి మీ సాక్ష్యాలు’ అని ప్రశ్నించ డంతో జగన్‌పై కేసు ‘కృత్రిమ వంటకం’ అని ప్రజలు నమ్మసాగారు. పర్యవసానంగా దేశంలో కాంగ్రెస్ అధికారానికి ఆంధ్రప్రదేశ్‌లో బాబు జమానాకు ‘అంత్యక్రియలు జరిగాయి. దేశంలో బీజేపీ పాలన ప్రారంభమైంది. పోనీ రెండు రాష్ట్రాలు విడి పోయిన తరువాత బాబు ‘తెదేపా’ పాలన అంతంతమాత్రంగా నిల బడ్డానికి చేదోడుగా నిలిచిన∙బీజేపీయే కారణం. అయినా ఆ సమయంలో జగన్ కేసుల విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా జగన్‌పైన ఆయన కుటుంబం పైన కృత్రిమ కేసులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. బాబు పంపాడో, లేదా ఈ ‘ఆదాన ప్రదానం’ బీజేపీకి అచ్చివచ్చిందని భావించారో ఏమో కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం తెదేపా అభినవ కోటీశ్వరులైన ఎంపీలను కాస్తా బీజేపీలోకి అప్పనంగా చేర్చుకుంది. ‘తెదేపా’ నాయకత్వానికీ, బీజేపీ నాయకత్వానికీ ఇదొక రకం ‘క్విడ్‌ప్రోకో’(ఇచ్చుకో–పుచ్చుకో వ్యూహం)గా మారింది. నర్మగర్భంగా సాగుతున్న ఈ ఒత్తిళ్లు, కుట్రలన్నింటినీ తట్టుకుని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంత ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ముందుకు జయప్రదంగా దూసుకు పోతోంది. ఈ ప్రభంజనాన్ని తట్టుకోలేని ‘మరుగుజ్జు’ తెలుగుదేశం పార్టీ, జగన్ ప్రభుత్వాన్ని మధ్యలోనే తుంచడానికి çకుట్ర పన్నుతూ తన పాత పాలనాకాలంలో న్యాయవ్యవస్థను తన కుట్రలకు అనువుగా ఎలా వాడుకుందో అదే పద్ధతిని ఇప్పుడూ పాటిస్తోంది. తన హయాం లోనే మన రాష్ట్ర హైకోర్టులోనే బాబు తాను ప్రమోట్ చేసిన న్యాయ మూర్తిని సుప్రీంకోర్టుకి పంపి, ఈరోజుదాకా సాకుతూ వస్తున్నాడు. కానీ, ఎవరూ మరవరాని ఒక సత్యం ఉంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి జగన్ రాసిన లేఖలో న్యాయవ్యవస్థపట్ల, దాని ప్రతిపత్తిపట్ల కించిత్తు అగౌరవం లేదు, పైగా న్యాయవ్యవస్థపైన, పార్లమెంటరీ వ్యవస్థలపట్ల గౌరవం కారణంగానే.. రాష్ట్రంలో పరి పాలనను స్తంభింపజేసే ప్రతిపక్షం ఎత్తుగడలను, అఖండమైన స్థానా లతో ప్రజాబాహుళ్యం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి రాష్ట్ర న్యాయవ్యవస్థను వందలాది కేసులతో కృత్రిమంగా వినియోగిం చుకుంటున్న తీరును బహిర్గతం చేసి, న్యాయాన్ని అర్థించడానికి మాత్రమే జగన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వాస్తవాలను తీసుకువెళ్లారు. ఈ లేఖ తర్వాత దేశవ్యాప్తంగా న్యాయ నిపుణుల నుంచి, ప్రజాస్వామ్యవాదులనుంచి, పలువురు రాజ్యాంగ నిపుణుల నుంచి, సునిశిత పరిశీలకుడైన ప్రముఖ పత్రికాధిపతుల నుంచి ‘ఆలస్యం లేకుండా తక్షణ విచారణ ద్వారానే న్యాయం నిగ్గుతేలాలని పలు రకాలుగా అభిప్రాయాలు వెల్లువెత్తడం జగన్ లేఖలోని నిజా యితీకి నిలువెత్తు నీరాజనంగా భావించాలి. ఎందుకంటే న్యాయస్థానాల ద్వారా, అందులోకి అనేక మార్గాల ద్వారా కోర్టులలో తాను చొప్పించిన కొందరు న్యాయవాదులు/ న్యాయమూర్తుల ద్వారా చంద్రబాబు తన ప్రాభవాన్ని నిలుపుకోవడా నికి ఇంతకాలం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇలాంటి నైతిక విరుద్ధమైన ప్రయత్నాలకు ఇప్పటికైనా న్యాయస్థానాలే అడ్డుకట్ట వేయక తప్పదు. జస్టిస్ ఫ్రాంక్ ఫర్టర్ అన్నట్టు జడ్జీలు కూడా మానవులేగానీ, రక్తమాంసాలు లేని మానవులు కారని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ వ్యాసం ముగింపు సందర్భంగా ఇంగ్లిష్ చదు వరుల కోసం చంద్రబాబు ‘మనోవృత్తి’ని వివరించే రెండు ప్రసిద్ధ ప్రకటనలను క్లుప్తంగా ఉటంకిస్తాను: బ్రిటన్ ప్రభుత్వ విభాగం అయిన డీఎఫ్ఐడీ ప్రొఫెసర్ జేమ్స్ మానర్ (ససెక్స్ యూనివర్సిటీ) ద్వారా చంద్రబాబు హయాంలో నిధుల వాడకం ఎలా జరుగుతుందో అధ్యయనం చేయించింది (2002–2003). దాని ప్రకారం, ‘పెక్కు భారత రాష్ట్రాల్లో మా సంస్థ సాధికారిక సంస్థలతో మాత్రమే చర్చలు జరుపుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అథికార సంస్థలను మినహాయించి కేవలం ఒకే ఒక వ్యక్తితో చంద్రబాబుతో మాత్రమే చర్చలు జరపాల్సి వస్తోంది. అధికారులతో ఇంటరాక్షన్ అసలు ఉండదు’. "At the apex level major kickbacks are received for its award of govt contracts in hundreds of cases. Legislators have been permitted to divert the one third of the funds... many takes bribes for favours and collaborate in extortion of criminal gangs. Chief minister after prefers the appearance of reform to the reality. This chief minister sometimes acquires substantial leverage with justice of the high court of AP. he made intelligent use of a reasonable advocate general who sets the tone for institutionals relations with the court అని ఆ నివేదికలో వ్యాఖ్యానించింది అంతేగాక, ‘అడ్వకేట్ జనరల్.. న్యాయమూర్తులతో చక్కటి సంబంధాలను నెరిపేవారు. అలాగే చంద్రబాబు నాయుడికి కూడా న్యాయమూర్తులతో అనుబంధం పెరుగుతూ వచ్చింది. అలాగే చంద్రబాబు ప్రభావం కూడా పెరిగింది.. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తితో ఆయన సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకోగలిగాడు’’ అని ఆ నివేదిక పేర్కొంది. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టీస్ బీఎస్ఏ స్వామి సహచర న్యాయమూర్తులకు రాసిన బహిరంగ లేఖ (2001–2003)లో ఇలా అన్నారు. ‘బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రధాన న్యాయమూర్తులతో ముఖ్యమంత్రి చాలా సన్నిహితంగా ఉండేవారనేది అందరికీ తెలి సిన విషయమే. తన 29 మంది ఎంపీల వల్లే కేంద్రప్రభుత్వం అధికారంలో ఉందని, కేంద్రప్రభుత్వం ఏది చేయాలో, ఏది చేయకూడదో కూడా తానే నిర్దేశించగలనని ముఖ్యమంత్రి న్యాయమూర్తులతో తొలి పరిచయంలోనే చెప్పేవారు. జస్టిస్ ఎన్వీ రమణను తన మనిషిగా సీఎం పరిచయం చేసేవారు. చీఫ్ జస్టిస్‌కు ఏం కావాలన్నా రమణకు చెప్పవచ్చని సీఎం చెప్పేవారు. చీఫ్ జస్టిస్ తిరుపతిని సందర్శించినట్లయితే, జడ్జి ఆయనతో పాటు ఉండేవారు’ అని ఆలేఖ పేర్కొంది. అన్నట్టు, ఒక కీలకమైన హత్యకు సంబంధించిన కేసులో సెషన్స్ కోర్టు ముద్దాయిలకు వివిధ సెక్షన్ల కింద ఖరారు చేసి తీర్పు చెప్పగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచి 17.8.2012న ఆ కేసును రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుని కాస్తా సుప్రీంకోర్టు డివిజన్ బెంచి కొట్టేసింది. హైకోర్టు తీర్పుని కాస్తా కొట్టివేస్తూ సుప్రసిద్ధ సుప్రీం న్యాయమూర్తులు పినాకీ చంద్రఘోష్, ఆర్.ఎఫ్. నారీమన్ హైకోర్టు తీర్పుని ‘ఆమోద యోగ్యం కాని, వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్) తీర్పుగా ప్రకటించా రని’ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ మంగారి రాజేందర్ ఒక పత్రికలో వెల్లడించారు. ఇంతకూ ఆ ‘పర్వర్స్’ తీర్పుని వెలువరించి సుప్రీం తీవ్ర విమర్శకు, అభిశంసనకు గురైన ఆ తెలుగు న్యాయ మూర్తులు ఎవరై ఉంటారో చెప్పగలిగిందెవరు? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కంగనాపై మరో కేసు నమోదు..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్‌పై మరో కేసు నమోదు అయ్యింది. న్యాయవ్యవస్థ గురించి హానికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేసినందుకు గాను నగరానికి చెందిన ఓ న్యాయవాది గురువారం ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరాడు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక కోర్టు కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇదే కాక మరో ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు కంగన, ఆమె సోదరి రంగోలి చండేలాకు సమన్లు జారీ చేశారు. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై ప్రశ్నించడానికిగాను వచ్చే వారం హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. గత వారం కంగనపై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ నమోదైన కేసుకు సంబంధించి బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ కంగన చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి.. కేసు నమోదు చేయాల్సిందిగా సదరు న్యాయవాది కోరాడు. దాంతో పోలీసులు కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవ్యవస్థను కించపర్చడమే కాక పప్పు సేన అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై నవంబర్ 10 న అంధేరి కోర్టులో విచారించనున్నారు. (చదవండి: కంగనాకు అత్యాచార బెదిరింపు..) గత వారం కంగనాతో పాటుగా ఆమె సోదరి రంగోలి చండేలా పైన కూడా దేశ ద్రోహం కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కంగనా, రంగోలి ఇంటర్వ్యూలు, ట్వీట్లు దేశంలోని పలు సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నాయని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని సయ్యద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. న్యాయవ్యవస్థను కూడా ఎగతాళి చేస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 153 ఎ (శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 ఎ (మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేసే హానికరమైన చర్యలు),ఆమె సోదరిపై 124 ఏ (దేశద్రోహం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు. సయ్యద్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ కంగన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి?
సాక్షి, అమరావతి: కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలహాబాద్ హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దంతులూరి శ్రీనివాస రంగనాథవర్మ స్పష్టం చేశారు. ఇంట్లో వాళ్లు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదనేందుకు న్యాయమూర్తులేమీ చట్టాలకు అతీతులు కారన్నారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధన పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తరువాత ఈ విషయాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమంటే అది గొంతు నొక్కేయడమేనన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం.. ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ, లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. గతంలోనూ చాలా మంది రాశారు. ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత హోదాలో కాకుండా ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేఖను బహిర్గతం చేయడంలో మంచి చెడులను ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం. గతంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, జోసెఫ్ మరొకరు మీడియా ముందుకు వచ్చి రోస్టర్ విషయంలో నాటి ప్రధాన న్యాయమూర్తి పారదర్శకంగా వ్యవహరించడం లేదని బహిరంగంగా తమ ఆవేదనను గొంతెత్తి చెప్పారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు.. 2004–05లో ఇంగ్లాడ్ బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయవ్యవస్థపై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టుకలిగి ఉన్నారని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. విదేశీ స్కాలర్స్ కూడా భారత న్యాయవ్యస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయకూడదంటే ఎలా..? ముఖ్యమంత్రి ఫిర్యాదుపై సుప్రీంకోర్టు సీజే ఓ కమిటీ ద్వారా అంతర్గత విచారణ జరుపుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఆరోపణలు రుజువైతే సాధారణంగా బదిలీ చేస్తారు. లేదా రకరకాల కారణాలతో చర్యలు తీసుకుండానే వదిలేస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేశారనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? ఆధారాలున్నప్పుడు కూడా ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? బాధతోనే సీఎం స్పందించారు.. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించరాదు. వ్యవస్థలను అభద్రతా భావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదు. అలా అభద్రతా భావం కలిగించినప్పుడు బాధతోనే ముఖ్యమంత్రి స్పందించి సీజేఐకి లేఖ రాశారు. అందులో తప్పేమీ లేదు. కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు వాడరాదు. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడమే అవుతుంది. లోతుగా విచారణ జరిపి ఆరోపణలకు ఆస్కారం రాకుండా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు... ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు. అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత దర్యాప్తు పూర్తి చేయాలి. అది ఆపడానికి వీల్లేదు. హైకోర్టు దర్యాప్తును ఆపేయడమే కాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చింది. అలా చేసి ఉండాల్సింది కాదు. నియామకాల్లో పారదర్శకత ఉండాలి.. న్యాయవ్యవస్థలో చాలా వరకు రాజకీయ నియామకాలేనన్న ఆరోపణలున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత ఉండాలి. అభిప్రాయ సేకరణ జరగాలి. సమర్థతకు పట్టం కట్టాలి. ఇష్టానుసారంగా నిందలు సరికాదు... న్యాయమూర్తుల బెంచ్ మీద నుంచి ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నది నా అభిప్రాయం. నేను జడ్జిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఒకరు ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారని వ్యాఖ్యానించడంపై సీజేకు ఫిర్యాదు వెళ్లింది. ప్రభుత్వమే భూ కబ్జాదారంటే ఎలా? అది ఎంత పెద్ద మాట? కోర్టులు, న్యాయమూర్తులు ఇలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఇక సుప్రీంకోర్టు సీజేకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు? ఆ లేఖలు.. మక్కీకి మక్కీ జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఓ న్యాయమూర్తికి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిర్గతం చేయడం సంచలనం రేకెత్తించింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు లేఖ వచ్చింది. రెండు లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి? ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నదే ప్రజల ఆకాంక్ష. -
అమెరికా సుప్రీం జడ్జి రూత్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు. రూత్ మృతితో ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆమెకి అశ్రు నివాళులర్పించారు. ‘‘న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిని అమెరికా జాతి కోల్పోయింది. ఒక అద్భుతమైన సహచరురాలిని కోర్టు కోల్పోయింది’అని అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ అన్నారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూత్‌ని ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకి టైటాన్లాంటి గొప్ప వ్యక్తికి అమెరికా జాతి యావత్తూ నివాళులర్పిస్తోం దన్నారు. కొత్త రాజకీయ పోరాటం అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా ఆరువారాల గడువు ఉన్న సమయంలో రూత్ గిన్స్బర్గ్ మృతి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కొత్త పోరాటానికి తెరతీసింది. రూత్ మరణించడానికి కొద్ది రోజులు ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక తన స్థానాన్ని భర్తీ చేయాలని, అదే తనకున్న ప్రగాఢమైన కోరికంటూ వెల్లడించారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అధ్యక్షుడు కొత్త న్యాయమూర్తిని ఎన్నుకోవాలి’’అని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. రిపబ్లికన్ పార్టీ సంప్రదాయ భావజాలానికి మద్దతుగా నిలిచే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో వివిధ ఫెడరల్ కోర్టుల్లోనూ, ఎన్నో సామాజిక అంశాల్లో పట్టు బిగించే అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. అబార్షన్లు, గే మ్యారేజెస్ వంటి అంశాల్లో తమకి అనుకూలంగా వ్యవహించే వారినే రూత్ స్థానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్ చేస్తే సెనేట్‌లో అది ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెనేట్‌లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉండడంతో న్యాయమూర్తి నియామకానికి అక్కడ ఎలాంటి ఆటంకం ఉండదు. రూత్ స్థానంలో మరొక జడ్జీని ఎటువంటి జాప్యం లేకుండా నామినేట్ చేస్తామని ట్రంప్ తెలిపారు. కీలకమైన ఈ పోస్టును నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్ ఈ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అధ్యక్షుడు సుప్రీం జడ్జీని నామినేట్ చేస్తారు. నవంబర్ 3 తర్వాతే జడ్జీ ఎన్నిక ఉంటుంది’ అని స్పష్టం చేశారు. హక్కుల గళం అమెరికాలో స్వేచ్ఛాయుత భావజాలానికి ఆమె కథానాయిక. లింగ సమానత్వం, మహిళా హక్కులపై ఎలుగెత్తిన కార్యకర్త. పురుషాధిక్యం కలిగిన న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లాయర్‌గా ఉన్న సమయంలోనే లింగ వివక్ష కేసుల్ని ఎక్కువగా తీసుకొని అద్భుతమైన తన వాదనా పటిమతో మహిళలకు అండగా నిలిచారు. న్యాయమూర్తిగా అబార్షన్ హక్కులకు మద్దతుగా నిలిచారు. గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామాహెల్త్‌కేర్ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు అండగా నిలిచారు. మీటూ ఉద్యమానికి మద్దతునిచ్చారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933 , మార్చి 15న జన్మించారు. రూత్ తండ్రి నాథాన్ బాడర్ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారి. తల్లి సెలియా గృహిణి. యూనివర్సిటీలో చదువుతుండగానే సహచర విద్యార్థి మార్టిన్ గిన్స్‌బర్గ్‌తో ప్రేమలో పడ్డారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఇద్దరూ లా చదివారు. 1954లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాయర్ చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం సంపాదించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తను ఒక మహిళని, వలసదారుని కనుకే ఏ అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్‌గా, న్యాయమూర్తిగా అపూర్వ విజయాలు సాధించి అమెరికన్ల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 1993లో సుప్రీంకోర్టు జడ్జిగా అధ్యక్షుడు క్లింటన్ సమక్షంలో రూత్ ప్రమాణం -
జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే
న్యూఢిల్లీ: అవాకులు చెవాకులు అర్థం పర్థం లేని నిందలు మోపుతూ చేసే సోషల్ మీడియా పోస్టింగులతో జడ్జీలూ బాధితులుగా మారుతున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పోస్టులకు జడ్జీలెవరూ స్పందించకుండా దూరంగా ఉంటే మంచిదన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి రచించిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. జడ్జీలందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని భావించడం సరైంది కాదన్నారు. ఇతర వ్యక్తుల కంటే జడ్జీల జీవితాలు ఏమంత మెరుగ్గా ఉండవని, ఒక్కోసారి కుటుంబ సభ్యులూ త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీల వ్యక్తిగత లబ్ధి కోసమని కాకుండా, మొత్తం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయడం కోసమైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. లాయర్ ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టింగులు చేసి రూ.1 జరిమానా కట్టిన నేపథ్యంలో జడ్జీలు ఈ వ్యాఖ్యలు చేశారు. రచయిత్రి జస్టిస్‡ భానుమతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విభిన్న కోణాలను పుస్తకంలో తన అభిప్రాయాలు చెప్పానన్నారు. -
ఇది సబబు కాదు
గత కొన్ని రోజులుగా ప్రశాంత్ భూషణ్ చుట్టూ తిరిగిన కోర్టు ధిక్కార వివాదం సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు రూపాయి జరిమానా విధించడంతో ముగిసింది. ఆయన పెట్టిన రెండు ట్వీట్లు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వున్నాయని, ఆయన నేరం చేసినట్టు నిర్ధారణ అయిందని సర్వోన్నత న్యాయస్థానం గత నెల 13న తేల్చింది. క్షమాపణ చెబితే సరేసరి...లేనట్టయితే శిక్ష తప్పదని చెబుతూ తుది తీర్పును వాయిదా వేసింది. వేయదగ్గ శిక్షపై ఆ నెల 20నుంచి వాదప్రతివాదాలు నడిచాయి. చివరకు విధించిన శిక్ష–రూపాయి జరిమానా లేదా మూడు నెలల జైలు, మూడేళ్లపాటు న్యాయవాద వృత్తినుంచి సస్పెన్షన్. జరిమానా చెల్లించడానికే ప్రశాంత్ భూషణ్ మొగ్గుచూపారు. కేవలం ఈ శిక్షను సమీక్షించమని కోరడానికి తనకున్న హక్కును వినియోగించుకోవడం కోసమే జరిమానా చెల్లిస్తున్నట్టు ఆయన వివరించారు. సుప్రీంకోర్టు సుమోటాగా ఈ కేసు తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్‌పై వున్న ఫొటోపై ప్రశాంత్ చేసిన వ్యాఖ్య, గత ఆరేళ్లుగా సుప్రీంకోర్టు తీరుతెన్నులపై చేసిన వ్యాఖ్య ఈ వివాదానికి మూలం. సుప్రీంకోర్టును లేదా న్యాయవ్యవస్థ మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం తనకు లేదని ప్రశాంత్ వాదిస్తే...తగినవిధంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా న్యాయవాదులకూ, కక్షిదారులకూ తప్పుడు సంకేతం వెళ్తుందని ధర్మాసనానికి నేతృత్వంవహించిన జస్టిస్ అరుణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. చూడటానికి ఇది రూపాయితో సరిపెట్టిన దండనగా కనబడవచ్చు. కానీ న్యాయవ్యవస్థపై విమర్శలు సహించబోమన్న సంకేతాలు పంపింది. దేశంలోని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థపై సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ గౌరవప్రపత్తులున్నాయి. అడపా దడపా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమైన సందర్భాలు లేకపోలేదు. కానీ మొత్తంగా మిగిలిన రెండింటితో పోలిస్తే అది మెరుగన్న అభిప్రాయమే బలంగా వుంది. అందులో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన న్యాయమూర్తులే ఇందుకు కారణం. నిజానికి బయటవారితో పోలిస్తే వారే అవినీతిని బాహాటంగా ఎత్తిచూపారు. ఇందుకు జస్టిస్ కృష్ణయ్యర్ మొదలుకొని జస్టిస్ కట్జూ వరకూ ఎందరినో ఉదాహరించవచ్చు. న్యాయమూర్తులుగా పనిచేస్తున్నప్పుడూ, రిటైరయ్యాక కూడా వారు ఈ పని చేశారు. న్యాయపీఠంపై వున్నవారిలో కనీసం 20 శాతంమంది అవినీతిపరులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటాచలయ్య చెప్పిన మాటను ఎవరూ మరిచిపోరు. న్యాయమూర్తుల్లో రెండు రకాలవారున్నారని...న్యాయం తెలిసినవారు, కేంద్ర న్యాయమంత్రి తెలిసినవారు అని విపక్షంలో వున్నప్పుడు బీజేపీ నేత స్వర్గీయ అరుణ్ జైట్లీ చమత్కరించారు. ‘మేం అధికారంలోకొచ్చాక ఆ ధోరణి పూర్తిగా పోయింద’ని ఆ తర్వాత ఆయన ఎక్కడా చెప్పిన దాఖలా లేదు. అలహాబాద్ హైకోర్టుపై పదేళ్ల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలవల్ల నిజాయితీపరులైన న్యాయమూర్తులపై సైతం నీలినీడలు కమ్ముకున్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తరఫున పిటిషన్ దాఖలైనప్పుడు ‘ఇది స్పందించాల్సిన సమయం కాదు...ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం’ అంటూ ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. న్యాయవ్యవస్థ అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ మూడేళ్లక్రితం నివేదిక విడుదల చేసినప్పుడు సైతం నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ధర్మాసనం అది కోర్టు ధిక్కారం కిందకు రాదని తేల్చిచెప్పింది. 1995లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. రామస్వామి ఈ విషయంలో ఇంకాస్త ముందుకెళ్లారు. సదుద్దేశంతో, సంయమనంతో న్యాయమూర్తి ప్రవర్తనను లేదా న్యాయస్థానం ప్రవర్తనను కఠిన పదజాలంతో విమర్శించినా కోర్టు ధిక్కారంకాదన్నారు. అయితే అవి న్యాయమూర్తి వ్యక్తిత్వహననానికి, నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసే స్థాయికి దిగజారకూడదన్నది జస్టిస్ రామస్వామి గీసిన లక్ష్మణరేఖ. ఇతర వ్యవస్థలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య మౌలికంగా వ్యత్యాసం వుంది. మిగతా రెండు వ్యవస్థల్లో పనిచేసేవారు ఇతర వ్యవస్థలపై లేదా తమ వ్యవస్థలపై విమర్శలు చేయలేరు. నిబంధనలు ఒప్పుకోవు. ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే ఎవరిలోపాలనైనా నిశితంగా విమర్శించగలదు. అటువంటి అధికారమూ, హక్కూ వున్న వ్యవస్థ మరీ ఇంత సున్నితంగా వుండటం సబబు కాదు. విమర్శలను మాత్రమే కాదు..ఆ విమర్శలు చేస్తున్నవారెవరో, వారి ఉద్దేశాలేమిటో, అందుకు దారితీస్తున్నవేమిటో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగని న్యాయమూర్తులను బెదిరిస్తే, కించపరిస్తే సహించాలని ఎవరూ చెప్పరు. న్యాయవ్యవస్థతోసహా వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా కావలసింది పారదర్శకత, జవాబుదారీతనం. ఆ రెండూ లోపించినా, అవి తగినంతగా లేకపోయినా విమర్శలు రాకతప్పదు. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టులో పనిచేసే యువతి లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో అసలు జరిగిందేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆమెపై కేసు పెట్టారు. ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేసే ఆమె భర్త, బావలను సస్పెండ్ చేశారు. ఆరోపణల్లో పెద్ద కుట్ర వున్నదని జస్టిస్ గొగోయ్ ఆరోపించారు. తీరా ఏడాది గడిచేసరికి అందరూ ఎవరి ఉద్యోగాల్లో వారు చేరారు. కేసులు రద్దయ్యాయి. పరిస్థితి ఇలా వున్నప్పుడు ప్రశాంత్‌భూషణ్ వంటివారు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సడలేలా చేస్తున్నారని అనడం సబబేనా? అందుకు బదులు ఆయన వ్యాఖ్యలకున్న ప్రాతిపదికేమిటో వెల్లడిస్తే దిద్దుబాటుకు సిద్ధమని లేనట్టయితే తదుపరి చర్యలు తప్పవని చెబితే బాగుండేది. బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీ వేయాల్సింది. -
ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. న్యాయాన్ని అందించే వ్యవస్థ గౌరవాన్ని ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లతో తగ్గించారని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ కఠిన శిక్షలేవీ విధించకుండా ఉదారంగా వ్యవహరిస్తున్నామని, నామమాత్రంగా రూపాయి జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. సెప్టెంబర్ 15లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో జమచేయాలని, లేని పక్షంలో 3 నెలల జైలు, న్యాయవాద వృత్తి నుంచి మూడేళ్ల నిషేధం అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ సోమవారం తీర్పునిచ్చింది. వాక్స్వాతంత్య్రాన్ని అదుపు చేయడం సరికాకపోయినప్పటికీ ఇతరుల హక్కులను గౌరవించాల్సిన అవసరముందని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రశాంత్ భూషణ్ తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పాలని బెంచ్ పదేపదే కోరిందని, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఆ ట్వీట్లు క్షణికావేశంలో చేసినవిగా అభిప్రాయపడుతూ క్షమాపణ వ్యక్తం చేయాలని కోరారని బెంచ్ గుర్తు చేసింది. సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోక ముందే ప్రశాంత్ భూషణ్ కోర్టుకు సమర్పించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారని బెంచ్ గుర్తించింది. సుమారు 82 పేజీలున్న తీర్పును మంగళవారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా చదివి వినిపించారు. తీర్పు ఎవరు రాశారన్నది ప్రతిపై లేకపోవడం విశేషం. న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై తనకు అపారమైన గౌరవం ఉందని, తన ట్వీట్లు సుప్రీంకోర్టును అగౌరవపరిచేందుకు కాదని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ‘సుప్రీంకోర్టు నన్ను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరే హక్కును ఉపయోగించుకుంటా. ఈ తీర్పు (జరిమానా)ను అంగీకరిస్తూ ఇంకే శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధం. ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తా’అని పేర్కొన్నారు. -
క్షమాపణకు ప్రశాంత్ భూషణ్ ససేమిరా
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా తాను చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ట్వీట్లలో వ్యక్తపరిచింది తాను విశ్వసించిన నమ్మకాలనేనని, అవి ఇప్పుడూ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిజాయితీ లేకుండా క్షమాపణ చెప్పడం ఆత్మసాక్షిని, ఒక వ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని ఆయన కోర్టు ధిక్కరణ కేసు విషయంలో సోమవారం దాఖలు చేసిన అనుబంధ వాంగ్మూలంలో తెలిపారు. అనుజ్ సక్సేనా అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణను చేపట్టడమే కాకుండా దోషి అని ఆగస్టు 14న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 20వ తేదీన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశాంత్ భూషణ్ కేసుపై విచారణ చేస్తూ.. తన వ్యాఖ్యలపై పునరాలోచన చేసేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. శిక్ష ఖరారు విచారణను వేరే బెంచ్‌కు బదలాయించాలన్న ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. శిక్ష ఖరారుపై తుదితీర్పును రిజర్వ్‌లో ఉంచింది. న్యాయ వ్యవస్థ నిష్కళంక చరిత్ర పక్కదారి పడుతూంటే ఆ విషయంపై గళమెత్తడం న్యాయవాదిగా తన బాధ్యతని, ఆ కారణంగానే మంచి విశ్వాసంతోనే తన భావాలను వ్యక్తం చేశానని ప్రశాంత్ సోమవారం నాటి వాంగ్మూలంలో తెలిపారు. సుప్రీంకోర్టుకు లేదా ఏ ప్రధాన న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు. రాజ్యాంగ ధర్మకర్తగా, ప్రజల హక్కులను కాపాడే న్యాయవ్యవస్థ తప్పుదోవ పట్టరాదని సద్విమర్శ మాత్రమే చేశానని వివరించారు. క్షమాపణ మాటవరసకు చేసేదిగా కాకుండా నిజాయితీగా ఉండాలని న్యాయస్థానమే చెబుతుందని గుర్తు చేశారు. దేశంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉన్న చిట్టచివరి ఆశ సుప్రీంకోర్టేనని, ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలకు ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. -
క్షమాపణపై పునరాలోచించుకోండి
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణ కోరబోనన్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పునరాలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. భేషరతుగా క్షమాపణ చెప్పడానికి ఈనెల 24 దాకా సమయం ఇస్తున్నట్లు తెలిపింది. ప్రశాంత్ భూషణ్ చేసిన కొన్ని ట్వీట్లు న్యాయవ్యవస్థను ధిక్కరించేవిగా ఉన్నాయని, ఆయనను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 14న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో భూషణ్‌కు గరిష్టంగా ఆరునెలల వరకు జైలుశిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా పడొచ్చు. లేదా రెండు శిక్షలు కలిపి విధించొచ్చు. శిక్ష ఖరారుపై సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. ధిక్కరణ కేసులో శిక్ష ఖరారును మరో బెంచ్ చేపట్టాలని ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ధిక్కార పూరిత ప్రకటన, న్యాయవ్యవస్థను ధిక్కరిస్తూ చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రశాంత్ భూషణ్‌కు ఈనెల 24 దాకా గడువు ఇచ్చిం ది. ఇందుకు ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ తన న్యాయవాదులతో సంప్రదించిన తరువాత కోర్టు ఇచ్చిన సలహాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అంతకుమునుపు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బెంచ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ధిక్కరణ కేసులో ఇప్పటికే దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్‌కు అదనంగా ఎలాంటి శిక్ష విధించవద్దని అభ్యర్థించారు. తన ట్వీట్లపై క్షమాపణలు చెప్పరాదన్న ప్రశాంత్ భూషణ్ నిర్ణయంపై పునరాలోచించకపోతే వేణుగోపాల్ అభ్యర్థనను పరిగణించలేమని బెంచ్ స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్ తన తప్పును తెలుసుకుంటే తామూ ఉదారంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన బెంచ్ తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. శిక్ష ఖరారును ఆపడం కుదరదు ధిక్కరణ కేసులో సమీక్ష కోసం వేయనున్న రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకూ శిక్ష ఖరారు చేయకూడదనే ప్రశాంత్ భూషణ్ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేంతవరకు శిక్ష అమలును నిలిపి ఉంచుతామని తెలిపింది. ఖరారు విచారణను ఇంకో బెంచ్‌కు బదిలీ చేయడం సంప్రదాయలకు విరుద్ధమవుతుందని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని బెంచ్ స్పష్టం చేసింది. ప్రతిదానికీ ఒక లక్ష్మణ రేఖ ఉంటుందని, భూషణ్ దాన్ని అతిక్రమించారని కోర్టు అభిప్రాయపడింది. త్వరలో తాను పదవీ విరమణ చేస్తున్న కారణంగా ఈ కేసులో వాయిదాలు కోరరాదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు కాపాడేందుకు సద్విమర్శకు తావు ఉండాలని, ఆ విలువలను కాపాడే ఉన్నత లక్ష్యంతోనే తాను ఆ ట్వీట్లు చేశానని ప్రశాంత్ వివరించారు. ‘‘దయ చూపాలని అడగను. ఉదాత్తంగా వ్యవహరించమనీ కోరను. ఈ కోర్టు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తా’’అని స్పష్టం చేశారు. -
విభజన రేఖ చెరపవద్దు
ప్రశ్న, నిరసన... వీటి గొంతు నులిమితే న్యాయవ్యవస్థకే కాదు మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అన్యాయాలపై ఇక గొంతెత్తే వారే ఉండరు. భయంతో ఏ గొంతులూ పెగలకుంటే అరిష్టాలకు అడ్డూ అదుపుండదు. అప్పుడు వ్యవస్థలన్నీ గతి తప్పుతాయి. అరాచకం రాజ్యమేలుతుంది. ఇంతటి తీవ్ర ప్రమాదం ముంచుకు రాకుండా పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ ఉండాలి. సద్విమర్శకు తావుండాలి. కోర్టుల పరువు, ప్రతిష్టలు నిల వాలి. ప్రజాస్వామ్యపు వివిధ అంగాల మధ్య సంఘర్షణ తుది ఫలితం మధ్యేమార్గం, ఉభయతారకంగా ఉండాలి. అంతే తప్ప, ఒకదాని కోసం మరోటి బలిపెట్టకూడదు. కోర్టుల పరువు నిలపాలనే తొందర పాటులో పౌరహక్కుల్ని కాలరాయొద్దు. పౌరహక్కుల పేరిట వ్యవస్థల గౌరవాన్ని నేరపూరితంగా నేలకు దించొద్దు. ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ధిక్కారం కేసులో దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిన కేసు గురువారం కొత్త మలుపు తిరి గింది. శిక్ష ఖరారు చేయాల్సిన వేళ తాజా పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ట్వీట్లలో చేసిన వ్యాఖ్యల పునరాలోచనకు రెండు, మూడు రోజులు సమయం ఇస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. తప్పు గ్రహించి, పశ్చాత్తాపం ప్రకటిస్తే తప్ప శిక్ష విషయంలో మరో అభి ప్రాయానికి తావు లేదంది. తన అభిప్రాయంలో మార్పు లేదని, తానా వ్యాఖ్యలు పూర్తి ప్రజ్ఞతోనే చేసినందున పునరాలోచన ఉండబోదని భూషణ్ నిర్ద్వంద్వంగా చెప్పారు. తీర్పు తనను కలతకు గురిచేసిందని, శిక్ష గురించి కాదు, న్యాయస్థానం తనను తప్పుగా అర్థం చేసుకుందని, దురుద్దేశ్యాలు ఆపాదించి ఆధారాలు చూపకుండానే దోషిగా తేల్చడం బాధించిందనీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఒక కేసులో కోర్టు ముందు వెల్లడించిన భావాల్ని గుర్తుచేస్తూ ‘దయ చూపమని అడ గను, ఉదారత కోసం కోరను.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బహిరంగ విమర్శ తప్పనిసరి అని భావించా, బాధ్యతగానే వ్యాఖ్యలు చేశాను. ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. తదుపరి నిర్ణయం ఇక కోర్టుదే! దేశ వ్యాప్తంగా ఈ అంశం ఓ విస్తృత చర్చకు తెరలేపింది. న్యాయవ్యవస్థ పనితీరుతో పాటు పౌరుల హక్కులు, ప్రశ్న–నిరసన– విమర్శ వంటి పలు అంశాలు ప్రస్తావనకొస్తున్నాయి. విమర్శకు తావులేని పరిస్థితి కల్పిస్తే, ఇక రాజ్యాంగం పూచీగా నిలిచిన భావప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19–(ఎ)) హక్కుకున్న అర్థమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రెంటినీ కలగాపులగం చేయొద్దు రాజ్యాంగబద్ధమైన సంస్థల పనితీరు సజావుగా సాగేందుకు వాటి లోపాలు ఎత్తిచూపడం, సద్విమర్శ పౌరునిగా తన బాధ్యత అని భావించినట్టు ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. నెల రోజుల వ్యవ ధితో ఆయన చేసిన రెండు ట్వీట్లు ప్రస్తుత వివాదానికి కారణం. ఒకటి, బయట సుప్రీంకోర్టు ఛీఫ్ జడ్జి ప్రవర్తనకు సంబంధించింది. ఇంకొ కటి, గత ఆరేళ్లుగా దేశంలో ఎమర్జెన్సీ విధించకుండానే ప్రజాస్వా మ్యాన్ని బలహీనపరుస్తున్న తీరు, అదే (నలుగురు ప్రధాన న్యాయ మూర్తుల) సమయంలో సుప్రీంకోర్టు పాత్ర గురించి చేసిన వ్యాఖ్య! ఈ రెండూ న్యాయవ్యవస్థ గౌరవాన్ని, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిం చేవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక ఫిర్యాదు ఆధారంగా తనంతతాను సుప్రీం ఈ కేసు చేపట్టి, సదరు చర్యను కోర్టు ధిక్కారంగా, భూషణ్‌ను దోషిగా తేల్చింది. ఇది వివాదాస్పదమౌ తోంది. న్యాయస్థానాలపైన, జడ్జీలపైన ఇలాంటి విమర్శలు కొత్త కాదు. 2018లో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు విలేకరుల సమావేశం పెట్టి, ‘సుప్రీంకోర్టు పనితీరు అంత సవ్యంగా లేదు, ప్రధాన న్యాయమూర్తి పని కేటాయింపు ప్రక్రియ లోపభూయిష్టం’ అని విమర్శ చేశారు. అదెందుకు కోర్టుధిక్కారం కాలేదు? అన్నది ప్రశ్న. అంటే, ఒకే విషయంలో... న్యాయమూర్తులకు, న్యాయవాదు లకు, సాధారణ పౌరులకు వేర్వేరు న్యాయాలు ఉంటాయా? అనేది సందేహం. విమర్శకు, న్యాయధిక్కారానికి మధ్య విభజన రేఖ గుర్తిం చాలి. రెంటినీ ఒకేగాట కట్టడం తప్పని సుప్రీంకోర్టే తన తీర్పుల్లో పలుమార్లు పేర్కొంది. కోర్టు ధిక్కార చట్టం–1971 సెక్షన్ 13 అదే చెబుతోంది. ఒక చర్య లేదా వ్యాఖ్య న్యాయ ప్రక్రియ నిర్వహణలో తగినంత అనుచిత జోక్యమని సంతృప్తి చెందితే తప్ప దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించకూడదన్నది చట్టం. తన వ్యాఖ్య సత్యమని, జనహితంలో చేసిందని నిరూపించుకునే నిందితుని వాదనకూ అవ కాశం కల్పిస్తూ చట్ట సవరణ (13–బి) కూడా జరిగింది. నిఖార్సయిన విమర్శ కోర్టుధిక్కారం కాబోదనీ ఇదే చట్టం (సెక్షన్–5) చెబుతోంది. దేశ విదేశాల్లో ఎందరెందరో న్యాయకోవిధులు ఈ విషయంలో స్పష్ట మైన తీర్పులిచ్చారు. న్యాయవ్యవస్థలో అవినీతి లేదా? ట్వీట్లలో ఒక న్యాయవాది చేసిన రెండు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపరచి, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిస్తాయన్న భావ నతో ఉన్నత న్యాయస్థానం వ్యక్తి ప్రాథమిక హక్కును నలిపివేయ డాన్ని ప్రజాస్వామ్య వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా మన న్యాయవ్యవస్థ, కోర్టులు, మొత్తంగా ప్రజాస్వామ్యం ఈ రోజు అంతటి బలహీన పునాదులపై ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ‘బార్ (న్యాయవాదుల సంఘం)ను నోరు మూయించి న్యాయస్థానాల్ని బలోపేతం చేయలేర’నే నినాదం దేశవ్యాప్తంగా పెల్లుబుకుతోంది. కోర్టుల గౌరవాన్ని నిలబెట్టే ఉద్దేశంతో, వాటి పనితీరుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనీయకుండా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు ‘కోర్టు «ధిక్కార’ అస్త్రంతో ముందే బంధనాలు విధించడం సబబా? తద్వారా కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెరుగుతాయా అంటున్నారు. 108 పేజీల తన తీర్పులో, ‘నాలుగు స్తంభాల్లో ఒకటిగానే కాదు, భారత ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ మూలస్తంభం’ అని పేర్కొన్న సర్వో న్నత న్యాయస్థానం, దేశంలో నెలకొన్న పరిస్థితులకూ బాధ్యత వహిం చాలన్న విమర్శను ఎందుకు స్వీకరించలేకపోయింది? వ్యాఖ్యను విమ ర్శగా కాకుండా కోర్టుధిక్కారంగా ఎలా పరిగణించారనేది విస్మయం! ‘ఇప్పుడే కాదు, 16 మందిలో సగంమంది సుప్రీం ప్రధాన న్యాయ మూర్తులు అవినీతిపరులన్న విమర్శ చేసినపుడు కూడా తన ఉద్దేశం కేవలం ఆర్థిక అవినీతి కాదని, ‘అవినీతి’ని విస్తృతార్థంలో వినియోగిం చానని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగస్టు 4న ఇచ్చిన వివరణలో, ఆగస్టు 10న కోర్టు ఆదేశాలకు బదులిచ్చినపుడూ పేర్కొన్నారు. ‘కింది స్థాయి న్యాయవ్యవస్థలో దేశమంతటా అవినీతి ఉంది, అక్కడక్కడ ఉన్నతస్థాయిలోకీ విస్తరించింది’ అని 1964లోనే పార్లమెంటరీ కమిటీ నివేదించింది. ‘జడ్జీల్లోనూ అవినీతి పరులున్నార’ని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్పీ బరూచా, ‘అవినీతి అంటుకోకుండా న్యాయ వ్యవస్థ ఏమీ పవిత్రంగా లేదని నేను నిజాయితీగా అంగీకరించా ల్సిందే’ అని మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంలు బహి రంగంగా పేర్కొనడాన్ని భూషణ్ తన వాదనలో ఉటంకించారు. న్యాయవ్యవస్థపై విమర్శ న్యాయధిక్కారమో, కోర్టుధిక్కారమో ఎలా అవుతుందన్న ఆయన ప్రశ్నకు సహేతుకమైన సమాధానం రావట్లేదు. ఒక గిడసబారిన ఉపకరణం (కోర్టుధిక్కారం)తో ఉన్నత న్యాయస్థానం మొరటు దెబ్బ వేసిందని, ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వ సనీయతను పెంచకపోగా సన్నగిల్ల చేస్తుందన్న భయాన్నీ కొందరు వ్యక్తం చేస్తున్నారు. తప్పుగా వాడితే వికటించే ప్రమాదం కోర్టుధిక్కారం, న్యాయధిక్కారం వంటి అస్త్రాల్ని కోర్టులు, జడ్జీలు ఎంతో ఆచితూచి వాడాలని విశ్వవ్యాప్తంగా ఓ బలమైన అభిప్రాయం. అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి స్థాయిలోనే కాక దీనిపై మన దేశంలోనూ లోగడ విస్తృత చర్చ జరిగి, నిక్కచ్చి అభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. బ్రిటన్‌లో 2013లో ఏకంగా కోర్టుధిక్కార చట్టాన్ని రద్దు చేశారు. ఆ సందర్భంగా తెచ్చిన బిల్లుపై చర్చలో మాట్లాడుతూ, ‘విమర్శ అసమంజసంగా ఉన్నా, నిందాపూర్వకంగా ఉన్నా, చివరకు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించేదైనా... జడ్జీలు కటువుగా దాన్ని పట్టించుకోకుండా ఉండటమే మేలు’ అని సుప్రసిద్ధ న్యాయమూర్తి (ఐర్లాండ్) లార్డ్ కార్స్వెల్ అంటారు. ఇంగ్లండ్‌కు చెందిన ఇరవయ్యో శతాబ్ది గొప్ప న్యాయవాది, న్యాయమూర్తి టామ్ డెన్నింగ్ స్ఫూర్తి ఇక్కడ కావాలి. ఆయనే ఓ పుస్తకంలో రాసినట్టు, లేబర్‌పార్టీ నాయ కుడు, న్యాయవాది హార్టీ›్ల షోక్రాస్ ఓ కేసు తీర్పు నచ్చక ‘డెన్నింగ్ ఒక గాడిద’ అని వ్యాఖ్యానించడంతో అది ‘ది టైమ్స్’ (లండన్)లో ప్రచురి తమయింది. కోర్టు/న్యాయ ధిక్కారం కింద తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ‘అవును ఆయన విమర్శించినట్టు నేను గాడిద కాను అని... కోర్టుధిక్కారం కింద తీసుకొని కాదు, నా పనితీరు ద్వారా నిరూ పించాలి’ అన్నది ఆయన వైఖరి. 1964లోనే సుప్రీం మాజీ న్యాయ మూర్తి గజేంద్ర గడ్కర్, ‘న్యాయధిక్కారాధికారాన్ని జడ్జీలు ఆలోచించి వాడాలి, వికటిస్తే అది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచకపోగా తగ్గించే ప్రమాదముంది’ అన్నారు. ఇప్పుడదే జరుగు తోందన్నది అత్యధికుల భయం! నిజానికి న్యాయ/కోర్టు ధిక్కార అంశాన్ని జడ్జీలు పౌరుల విమర్శలకు కాకుండా రెండే సందర్భాల్లో వాడాలని న్యాయకోవిదుల భావన! ఒకటి, కోర్టులు చెప్పింది ఎవరైనా పాటించనపుడు. రెండు, చేస్తామని (అఫిడవిట్లో, అండర్టేకింగో) కోర్టులకు చెప్పిన మాట ఎవరైనా ఉల్లంఘించినపుడు మాత్రమే అన్నది సారం. రక్షించాల్సిన వారే రౌద్రం వహిస్తే...? తన పట్ల ఫలానా జడ్జి వివక్షతో ఉన్నారు, కేసు విచారణ మరో బెంచీకి మార్చండన్న వినతి పట్టించుకోవాలి. కానీ, ప్రస్తుత కేసులో రెండు మార్లు అలా కోరినా నిరాకరించారు, ఎందుకో తెలియదు. ‘వివక్ష లేదని జడ్జి్జ దృష్టిలో కాదు, నిందితుని దృష్టిలో చూడాల’ని లోగడ ఒక కేసులో జస్టిస్ వెంకటాచలయ్య చెప్పారు. కీలక వ్యవహారాల్లో నత్త నడకన సాగే విచారణ ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ వెంటపడ్డట్టు వేగంగా సాగడమే విస్మయం! జడ్జీల అవినీతిపై చర్చ చాలా ముఖ్యం. దాని ఫలితంగానే విచారణలు, రుజువైతే అత్యున్నత చట్టసభల్లో వారి తొలగింపు ప్రతిపాదనలు–నిర్ణయాలు సాధ్యం. అలాంటి పరిస్థితు ల్లోనే హైకోర్టు జడ్జీలు పి.డి.దినకరన్, సుమిత్రాసేన్ రాజీనామాలు మనం చూశాం. సహేతుకమైన విమర్శల పట్ల ఉదారంగా వ్యవహరిం చడం ద్వారా మాత్రమే న్యాయస్థానాలు మరింత స్వేచ్ఛగా స్వతం త్రంగా పనిచేస్తాయి, గౌరవం–విశ్వసనీయత పొందుతాయి. అంతే తప్ప, కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెంచడానికి పౌరుల హక్కుల్ని పణంగా పెట్టడం సరికాదు. సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ సంస్థే కాదు, ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి లోబడి నడుచుకునేలా చూసుకోవాల్సిన వ్యవస్థ! తెలుగునాట ఓ సామెత ఉంది. ‘కన్నతల్లే దయ్యమైతే.. ఇక తొట్టెల (ఉయ్యాల) కట్టే తావెక్కడ?’ అని. సర్వో న్నత న్యాయస్థానం, దయ్యాల బారి నుంచి బిడ్డల్ని కాపాడుకునే దయగల కన్నతల్లి కావాలని జనం కోరిక! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
డెమోక్రసీ ‘నాల్గవ స్తంభం’లో పగుళ్లు!
పత్రికా స్వేచ్ఛ అనేది వ్యాపార స్వేచ్ఛలో భాగమైపోవడమే అత్యంత విస్మయకరం, విచా రకరం. పత్రిక అనేది ఒక వ్యాపారం కానప్పుడే అది స్వేచ్ఛగా ఉన్నట్టు లెక్క. అందుకే అది వ్యాపారానికి దూరంగా ఉండాలి. – కారల్ మార్క్స్ (లిటరేచర్ అండ్ ఆర్ట్స్) అనుమాన పిశాచమనే నీడలో హేతువు, రుజువు, కారణం నిలవవు, ఓడిపోతాయి. న్యాయం చచ్చిపోతుంది. అలాగే కొందరు జర్నలిస్టులు కూడా తాము ఏదో ఎదిగిపోవాలన్న తొందరలో అర్థసత్యాలతో ఏపగింపు కల్గిస్తూ అవే అంతిమ సత్యాలుగా పాఠకులపై రుద్దేస్తూ తమ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకుంటారు. ఈ తెచ్చిపెట్టుకున్న దురద పనికిమాలిన చిల్లర మల్లర చెత్త పత్రికలకు వర్తిస్తుందే గానీ ఉత్తమ ప్రమాణాలతో నడిచే గొప్ప పత్రికలకు వర్తించదు. దేన్ని బడితే దాన్ని, ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేవారు మసాలా కబుర్లలో ఆనందం పొందే బాపతు మాత్రమే, ఏది నిజమో, ఏది కట్టుకథో తేల్చుకోలేని వారు మాత్రమే తాత్కాలిక ఆనందానికి లోనవుతారు. కానీ వ్యక్తుల వ్యక్తిత్వాలను నర్మగర్భంగా, ముసుగువేసి నాశనం చేయడానికి అత్యుక్తులు రాసి సెన్సేషనలిజం ద్వారా సర్క్యులేషన్ పెంచుకునే ధోరణి– ఉత్తమ ప్రమాణాలు గల పత్రికలకు పడదు. పచ్చి అబద్ధాలను ఎదుర్కో వడమూ ఆ క్రమంలో కష్టసాధ్యమే. అందుకే ఉత్తమ ప్రమాణాలు గల పత్రికల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇదే క్షమించదగిన జర్నలిజా నికి, క్షమార్హంకాని జర్నలిజానికి మధ్య ఉన్న తేడా. – జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ (ఫ్రమ్ బెంచ్ టు ది బార్ పేజీ. 210) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) మానవాళికి ఎన్ని రకాల అనంతమైన అవకాశాలను ప్రసాదించిందో అంతకన్నా మించిన అనర్థాలను కూడా బలవంతంగా రుద్దుతోంది. యాప్‌లు, వాట్సాప్‌లు, లింకులు, వెబ్ లింకులు, మొబైల్స్, సూట్ కేసులో ఇమిడిపోయే కూపీ (ట్రాకింగ్) వ్యవస్థలూ, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు (పాత టెలిగ్రామ్ భాషను అప్పటికప్పుడు ఆధునికంగా వండివార్చే, బాజా సాధనం) ఇలా సవాలక్ష ముమ్మరిస్తున్న దశలో ఉన్నాం. జుకర్ బర్గ్ రంగంలోకి వచ్చి ఫేస్ బుక్ అనే కూపీ వ్యవస్థను నర్మగర్భంగా రంగంలోకి దించి దేశీయ సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలను దేశాల ప్రయోజనాలకు విరు ద్ధంగా దేశీయ ప్రజలే ప్రయోగించేలా చేశాడు. ఆ మాటకొస్తే ఒకప్పుడు చైనీయులపైన నల్లమందు చల్లి, నల్లమందు భాయిలుగా బ్రిటిష్ వాడు ప్రచారం చేసినట్లే జుకర్‌బర్గ్ కూడా ఫేస్బుక్ ద్వారా భారతీయుల వ్యక్తిగత ఫోన్ల సమాచారాన్ని కోట్ల సంఖ్యలో ఫేస్ బుక్‌లో నమోదు చేసి అమెరికా, బ్రిటన్ మాళిగల్లో నిర్లిప్తంచేసి పెట్టాడు. అలా అని బీజేపీ పాలకులు జుకర్‌బర్గ్ ఫేస్బుక్ మనకే ఉపయోగిస్తుందని మురిసిపోయే సమయానికి మన పాలకుల గుట్టు మట్టుల్ని కూడా ఫేస్బుక్లో నిక్షిప్తం చేసేసరికి పాలకులు లబోదిబో మంటున్నారు. ఈ బాగోతం కాలిఫోర్నియాలో మన ప్రధాని హుషా రుగా జుకర్‌బర్గ్‌ను కలుసుకుని కరచాలనం చేసినంత సేపు పట్టలేదు. ఇప్పుడు బీజేపీ వారు జుకర్‌బర్గ్ బీజేపీ రహస్యాలను ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల్లో భాగంగా ఫేస్బుక్ ద్వారా బట్టబయలు చేస్తున్న దశలో ఫేస్‌బుక్‌పై చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడు తున్నారు. మనం చైనాపై ‘గుర్రు’తో డజన్లకొద్దీ టిక్ టాక్‌లను, అప్పో లను నిషేధించినట్లు ప్రకటించుకున్నా అమెరికాతో మనకు పైన వేసు కున్న లింకుల వల్ల జుకర్‌బర్గ్‌ను వదిలించుకోలేము. అమెరికాలో జూకర్బర్గ్ బంధించి ఉంచిన మన ఫోన్ నంబర్లనూ విడుదల చేయించుకోలేని దుస్థితి ఈ సాంకేతిక ఉచ్చు మనచుట్టూ బిగియడానికి కారణం.. మన సర్వర్ల ‘బిస’ అంతా అమెరికాలోనే ఉండటం! ఆంధ్ర ప్రదేశ్‌లో టెక్నాలజీ మాయ చాటున కొన్ని తొత్తు పత్రికలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ, అటు రాష్ట్ర న్యాయ వ్యవస్థనూ కూడా అబద్ధాల అల్లికతో అభాసుపాలు చేయడానికి సంకల్పించి తప్పుడు కథనాలకు తెరలేపుతున్నాయి. న్యాయవ్యవస్థకూ చట్టబద్ధంగా ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య గండికొట్టి, అడుగువూడిన పాత పాలకులకు ప్రాణప్రతిష్ట చేయాలన్న తాపత్రయంకొద్దీ ‘న్యాయదేవతపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా’ అంటూ అశరీరవాణి కథనాలు అల్లుతోంది: ఒక్క దానికీ రుజువులు లేవు. పైగా రాష్ట్ర హైకోర్టు పేరును దుర్వినియోగపరుస్తూ, అలాంటి అలవాటులోనే ఉన్న ఆ ‘కెప్ట్ ప్రెస్’ అల్లిన కథనం అంతా ఆధునిక టెక్నాలజీ మెలకువలన్నింటినీ దుర్వినియోగం చేసి, ఆ కథనానికి తానే కర్త, కర్మ, క్రియగా మారిన మాస్టర్ అల్లిక అది. ఆ పత్రిక అల్లికల్లోని అంశాలు స్థూలంగా: ‘న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్? వెబ్‌లింక్ ద్వారా మొబైల్‌పై వల; వాట్సాప్ సందేశాలపైన నియంత్రణ, చదవక ముందే రీడింగ్‌మోడ్ లోకి, మాటల్లో అస్పష్టత, సమస్యలపై సాంకేతిక నిపుణులతో పరీక్ష, నెట్వర్క్ మొబైల్ మాత్రం బాగుందని నిర్ధారణ– అయినా అంతు చిక్కని ఇబ్బందులు అయినా నిఘాయే కారణమని అనుమానం, సూట్‌కేసులో ఇమిడిపోయే ట్రాకింగ్ వ్యవస్థ’ వల్ల ‘ఆధునిక టెక్నాలజీతో ఈ పనులన్నీ అత్యంత సులభమని’ ఆ కథనం సారాంశం. ఆ మొత్తం కథనం అంతా ఆధారపడింది వాస్తవాలపైన కాదు, పూర్తిగా ‘సొంత డబ్బా’పైననే! ‘న్యాయాన్ని అమ్మేవాడూ, దోవలు దోచేవాడూ ఒకటే’నన్న జగమెరిగిన మన తెలుగు సామెత. ఆ మాటకొస్తే అబద్ధం అంటేనే అతుకులమూట అనీ, అల్లిన కథనం దాచినా దాగని సత్యమనీ ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నిజానికి ‘న్యాయదేవతపై నిఘా’ వేసే తెలివితేటలు గాడితప్పి వ్యవహరిస్తున్న నడమంత్రపు పాత్రికేయులకు తప్ప వృత్తి ధర్మాన్ని, ప్రమాణాలను పాటించే వారికి ఉండజాలవు. రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో వైఎస్ జగన్ తనకు మించిన దీటైన పోటాపోటీతో తలపడి ‘ఢీ’కొనగల సత్తా ఉన్నవాడని భావించినందునే లోలోన టీడీపీ అధినేత చంద్రబాబు కుమిలిపోయాడు. అందుకే తప్పుడు ఆరోపణల పైన కుట్ర ద్వారా 16 మాసాలపాటు జైలుపాలు చేశాడని లోకానికి తెలిసి పోయింది. అయినా గత ఆరేళ్లకుపైగా సీబీఐ స్పెషల్ కోర్టులూ ఎంతసేపు ‘ఏవి మీ ఆధారాలు’ అని నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్నా ఈ రోజుదాకా జగన్‌పై కేసులు అలా కొనసాగడం రాజ్య వ్యవస్థలో, న్యాయ వ్యవస్థల్లో చెండితనానికి నిదర్శనం కాదా? అంతేగాదు, చివరికి ‘ఆదాని శాసిస్తాడు/మోదీ పాటిస్తాడు/ జగన్ జైలుకు, భార్య భారతి ముఖ్యమంత్రి కుర్చీపైకి’ అనేంతగా పాత్రికేయ అజ్ఞాని బరి తెగించడాన్ని ఇతరులే కాదు, న్యాయ వ్యవస్థ కూడా సహించరానిది. దేశంలో న్యాయవ్యవస్థ పనితీరును గమని స్తున్న వారికి గత 70 ఏళ్లలో మన రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ‘నాలుగు స్తంభాల’లో ఒకటైన పత్రికా వ్యవస్థతో పాటు మిగతా మూడు వ్యవస్థలు కూడా క్రమక్రమంగా ఎలా బీటలిచ్చి పోతు న్నాయో గమనించాల్సిన పరిణామం. దీనికి కారణం– ఈ రాజ్యాంగ వ్యవస్థలేవీ రాజ్యాంగం నిర్దేశిం చిన మౌలిక లక్ష్యాలకు కట్టుబడకుండా గాడితప్పి నడుచుకొంటు న్నాయి. బహుశా అందుకనే సు్రçపసిద్ధ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్య కొన్ని విషయాలను ఇలా బాహాటంగా చెప్పగలిగారు: ‘న్యాయమూర్తులుగా పదవీ స్వీకారం చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞకు అర్థం– రాజ్యాంగం నిర్దేశించిన సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య రాజకీయాలను పాటిస్తానని. ఇదెలా సాధ్యం? న్యాయమూర్తులకు రాజకీయ సిద్ధాంత తాత్వికత అనివార్యం. న్యాయమూర్తుల నియా మకం రాజ్యాంగం ప్రకారం జరిగిందిగానీ రాజ్యాంగానికి అతీతంగా జరగలేదు గనుక ఈ సైద్ధాంతిక నిబద్ధత అనివార్యం. ఒక కోటీశ్వ రుడు– మురికివాడల్లో నివసించే పేదవాడి ముందు నిలబడి నాకు రాజకీయాలు లేవు అని చెబితే అతణ్ణి మీరు నమ్ముతారా? అలాగే ఒక కార్మిక సంఘం నాయకుడు తన పారిశ్రామిక యజమాని ముందు నిల బడి నాకు రాజకీయాలు లేవంటే అది ఒట్టి తొండిమాట. రాజకీయా లున్నంత మాత్రాన వ్యక్తి న్యూనతగా భావించుకోరాదు. ‘నాకు రాజ కీయం’ లేదని దాచటం నేరం. మనం మనసిచ్చి భోళాగా మాట్లా డదాం. ఇతర వృత్తులలో ఉన్నవారి మాదిరిగానే న్యాయమూర్తులకు కూడా రాజకీయాలుంటాయి. కానీ, న్యాయ ప్రక్రియ అనేది మాత్రం కులాలకు, వర్గాలకు, సమూహాలకు అతీతం’! అంతేగాదు, కోర్టు ధిక్కార నేరాధికారాన్ని కోర్టు సమర్థించు కోవాలంటే, జరగాల్సిన న్యాయాన్ని జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో కోర్టు తన ‘ధిక్కార ప్రయోగా’న్ని సమర్థించడం సబబ వుతుందని జస్టిస్ బ్లాక్ (1943) నిర్ధారించాడు. అలాగే కోర్టు తీర్పును సదుద్దేశంతో విమర్శించే ఎవరినీ తప్పుబట్టరాదనీ, అలాంటి విమర్శ సామాన్యుడి హక్కు అనీ ప్రివీకౌన్సిల్‌లో ఏనాడో లార్డ్ అడ్కిన్ ప్రకటిం చాడు. అంతేగాదు, నిజం చెప్పాలంటే, వార్తా పత్రికల్లో వచ్చే విమ ర్శలవల్ల వృత్తి నైపుణ్యంగల ఏ న్యాయమూర్తీ ప్రభావితుడు కాడని క్వీన్స్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు, సుప్రసిద్ధ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ స్పష్టం చేశాడు. మీడియాలో వచ్చే విమర్శలకు ఏ న్యాయ మూర్తీ ప్రభావితం కాకనక్కర్లేదనీ, వాటిని వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందు లుగానే భావించి న్యాయమూర్తులు కూడా ప్రజల విమర్శను శిరసా వహించడం ధర్మమని లార్డ్ సాల్మన్ ప్రకటించాడు. అన్నింటికన్నా ‘కోర్టు ధిక్కార నేరం’ అనే ఆరోపణల గురించి లార్డ్ డెన్నింగ్ ఒక శిలా శాసనంగానే లభించిన పరిపక్వమైన వాక్యాలను ప్రపంచ న్యాయ శాస్త్రవేత్తలు తరచుగా పేర్కొనడాన్ని మనం మరచిపోరాదు. ‘ఈ కోర్టు ధిక్కారమనే మన అధికారాన్ని మన న్యాయమూర్తుల సొంత గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగించరాదు. స్పష్ట మైన సాక్ష్యంమీదనే ధిక్కార నేరం మోపాలి. అంతేగానీ మనను విమ ర్శించే వారిని అణచడం కోసం ఈ అధికారాన్ని వినియోగించరాదు. మనం విమర్శకు భయపడరాదు, విమర్శను వ్యతిరేకించరాదు. కానీ అంతకన్నా మనం కోల్పోయే అత్యంత ముఖ్యమైన ప్రాణప్రదమైన స్వేచ్ఛ ఒకటుంది– అదే భావప్రకటనా స్వేచ్ఛ. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన విషయాలపైన సరసమైన వ్యాఖ్య, భోళా విమర్శ చేసే హక్కు పార్లమెంటులోనూ, బయటా, పత్రికల్లోనూ, టీవీలలోనూ పౌరులకు ఉంది. మా ప్రవర్తనే అంతిమ సాక్ష్యంగా నిలబడాలి. అంతే గానీ, చుట్టూ చెడు జరుగుతుంటే మౌనంగా ఉండిపోవటం మార్గం కాదు’ అలా అని, పత్రికలు తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛతో ఇతరులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేయటానికి పూనుకోవటం భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే నని డెన్నింగ్ ప్రకటించాడు. అందుకేనేమో క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో అత్యంత స్పష్టంగా హెచ్చరించిపోయాడు– ‘నా ఒక్కడివల్లే, దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడివల్లా దేశానికి ప్రయోజనం లేదు’ అని!! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ -
ధిక్కారం కేసులో ప్రశాంత్ భూషణ్ దోషే
న్యూఢిల్లీ: న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థపైనే ప్రశాంత్ భూషణ్ వదంతులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని అవన్నీ దేశ గౌరవాన్నే దెబ్బ తీసేలా ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ కేసు నుంచి ట్విట్టర్‌కి విముక్తి కల్పించింది. ‘నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే న్యాయస్థానాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పెట్టని గోడలు’ అని ధర్మాసనం అభివర్ణించింది. రాజ్యాంగానికి మూలస్తంభమైన అత్యున్నత న్యాయస్థానంపై ప్రశాంత్ భూషణ్ దాడికి దిగారని, అది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్ ఏమని ట్వీట్ చేశారంటే ..? ప్రశాంత్ భూషణ్ జూన్ 27న చేసిన ట్వీట్లో దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులే దీనికి కారణమన్నారు. రెండో ట్వీట్లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఎలాంటి మాస్క్, హెల్మెట్ ధరించకుండా నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల బైక్‌ని నడుపుతున్నారని, లాక్డౌన్ అంటూ జనం సమస్యల్ని ప్రత్యక్షంగా విచారించడానికి నిరాకరిస్తూ హెల్మెట్ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ఆ ట్వీట్లో ప్రశ్నించారు. -
విమర్శ హద్దు దాటితే వ్యవస్థకే ప్రమాదం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం, దానికి గ్రేడింగ్స్ ఇవ్వడం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని వ్యవస్థలపై నెలకొన్న అసహనానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు. ‘నా తరువాత అంతా నాశనమే’ అన్న తరహాలో కొందరు మాజీ జడ్జీల తీరు ఉందన్నారు. మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ‘కోవిడ్ కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ’ అంశంపై ఆదివారం ఆయన ఆన్లైన్ ప్రసంగం చేశారు. ‘గతంలో మన న్యాయవ్యవస్థలో భాగంగా ఉన్న కొందరిలో ఒక సమస్య ఉంది. నా తర్వాత∙అన్నీ తప్పులే జరుగుతున్నాయి అనే భావనలో వారున్నారు. ఆ భావనే ప్రమాదకరం. ఇప్పుడు మాట్లాడుతున్నవారే గతంలో చాలా తప్పులు చేశారు’ అని అన్నారు. కొంతమందికి ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఇష్టమన్నారు. హద్దులు దాటి ఆరోపణలు చేయడం ‘తప్పుడు సమాచార మహమ్మారి’ వంటిదన్నారు. విమర్శలు అవసరమే కానీ హద్దులు దాటకూడదని సూచించారు. ‘విమర్శలు హద్దులు దాటితే వ్యవస్థపై అనుమానాలు ఎక్కువవుతాయి. ఏ వ్యవస్థకయినా అది మంచిది కాదు. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే వ్యవస్థే మనుగడలో లేకుండా పోతుంది. అప్పుడంతా అరాచకమే’ అని హెచ్చరించారు. సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న వలస కూలీల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడానికి ఒక రోజు ముందు సుమారు 20 మంది ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. వలస శ్రామికులపై కోర్టు చూపుతున్న నిర్లిప్తత సరికాదని వారు అందులో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఎప్పుడూ ప్రతికూల భావజాలాన్ని ప్రచారం చేసేవారు, ఇళ్లల్లో కూర్చుని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించే మేథావులు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నీలినీడలు
భారత ప్రధాన న్యాయ మూర్తిగా నవంబర్ 17న పదవీ విరమణ చేసిన రంజన్ గొగోయ్‌ని రాజ్యసభ సభ్యు డిగా రాష్ట్రపతి సోమవారం నియమించారు. విరమణ చేసిన నాలుగు మాసాల్లోనే ఆయన్ని ఇలా నియమించ డంతో న్యాయవ్యవస్థ స్వతం త్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. న్యాయమూర్తు లుగా పనిచేసిన వ్యక్తులు రాజకీయ పదవులను స్వీక రించడం ఇది మొదటిసారి కాదు. భారత న్యాయ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని రాజ్యసభకి నియామకం చేయడం ఇదే మొదటిసారి. కొన్ని ప్రధాన తీర్పులని వెలువరించిన సుప్రీం కోర్టు బెంచీలకు గొగోయ్ నేతృత్వం వహించారు. వివాదాస్పద రామ జన్మభూమి హిందువులకు కేటా యించడం, రఫేల్ ఫైటర్ విమాన కేసులో దర్యాప్తు నిరాకరించడం, క్లీన్చిట్ ఇవ్వడం, ఎలక్టోరల్ బాండ్స్ స్కీములో విచారణని జాప్యం చేయడం, కశ్మీర్‌కి సంబంధించిన హెబియస్ కార్పస్ కేసులని విచారిం చడానికి అయిష్టత చూపడం, ఎన్ఆర్సీని నిర్వహించ డాన్ని పబ్లిక్‌గా సమర్థించడం లాంటి ఎన్నో తీర్పులని ఆయన వెలువరించారు. అధికారంలో వున్న పార్టీ తీసుకున్న లైన్‌కి అను కూలంగా తీర్పులు చెప్పినందుకుగానూ ఆయన్ని ఈ పదవి వరించిందని న్యాయవాదులు బహిరం గంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అంతర్గతంగా వున్న విషయం ఇప్పుడు బహిర్గతమైపోయింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత అధికారికంగా చనిపోయిం’ దని సుప్రీంకోర్టు న్యాయవాది గౌతమ్ భాటియా అన్నారు. తన రికార్డునే కాకుండా, తనతో బాటూ బెంచీలో వున్న న్యాయమూర్తుల స్వతంత్ర తకీ, నిష్పాక్షికతకీ మచ్చ తీసుకొచ్చే విధంగా ఆయన నడవడిక వుందని సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే అన్నారు. గొగోయ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉద్యోగిని కేసు విషయంలో ఏర్పాటైన ఆంత రంగిక ప్యానెల్లో బయటి వ్యక్తికి చోటు కల్పించక పోవడం, న్యాయవాదిని నియమించుకోవడానికి అవ కాశం ఇవ్వకపోవడం దారుణమనీ; ఆ కేసులో గొగో య్‌కి క్లీన్చిట్ ఇవ్వడం, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా నియమించడంతో న్యాయ వ్యవస్థ బోలుతనం బయ టపడుతుందనీ సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దుష్యంత్ దవే అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే ఆయన పదవీ విరమణ చేసింది 1991లో. అది కూడా ఏడేళ్ల తరువాత 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు, నియామకం కాలేదు. ఈ మధ్య కాలంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మరో జస్టిస్ ఎం.హిదయతుల్లా కూడా ఉప రాష్ట్రపతిగా ఎంపికయ్యారు, పదవీ విరమణ (1970) చేసిన తొమ్మిదేళ్ల తర్వాత. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కూడా తమిళనాడు గవర్నర్‌గా 1997లో నియమితు లైనారు. ఆమె పదవీ విరమణ చేసింది 1992లో. పదవీ విరమణ చేసిన వెంటనే న్యాయమూర్తు లకి మరో పదవి ఇవ్వడం ఎప్పుడూ చర్చనీయాం శమే. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాటల్లో చెప్పాలంటే– ‘పదవీ విరమణ తరువాత వచ్చే పద వులు, పదవుల్లో ఉన్నప్పుడు చెప్పే తీర్పులని ప్రభా వితం చేస్తాయి’. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని హోదాలో 2012లో ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘పదవీ విరమణ చేసిన రెండేళ్ల వరకి ఎలాంటి పదవిని న్యాయమూర్తికి ఇవ్వకూడదు. అలా గడువు లేకపోతే ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో న్యాయమూర్తులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.’ ఇవే మాటలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులైన ఆర్.ఎం.లోధా, టి.ఎస్. ఠాకూర్, కపాడియా లాంటివాళ్లు అన్నారు. రోజర్ మాథ్యూ కేసులో గొగోయ్ అభిప్రా యాలు నిందాస్తుతి లాంటివి. పదవీ విరమణ తరు వాత పదవుల విషయంలో కోర్టు తన ఆందోళనని వ్యక్తపరిచింది. ఆ విధంగా పదవులు ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతే దెబ్బతింటుందని గొగోయ్ నేతృత్వంలోని బెంచి అభిప్రాయపడింది. విరమణ వెంటనే పదవుల గురించి తీర్పులు చెప్పిన గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా పదవి స్వీకరించడం విషాదం. రాజ్యాంగంలోని అధికరణ 80 ప్రకారం కళలు, సైన్స్, సాహిత్యంలో ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తులని రాష్ట్ర పతి రాజ్యసభ సభ్యులుగా నియమించవచ్చు. గొగో య్‌కి ఎందులో అనుభవం ఉందో మరి! వ్యాసకర్త: మంగారి రాజేందర్, గతంలో జిల్లా జడ్జిగా పనిచేశారు. మొబైల్ : 94404 83001 -
త్వరలో ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్
-
న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణ
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థలో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)ల తరహాలో న్యాయ వ్యవస్థలో అఖిల భారత సర్వీసును తెరపైకి తెస్తోంది. ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్ (ఐజేఎస్) పేరిట జిల్లా జడ్జీలను నియమించే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు కార్యరూపం ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనతో మన రాష్ట్రానికి కూడా ప్రమేయం ఉండటం, ఇక్కడే ఐజేఎస్ అధికారులకు శిక్షణనిచ్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (ఎన్‌జేఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తుండటం విశేషం. ప్రస్తుతం నియామకాలు ఇలా... న్యాయమూర్తి బాధ్యతల్లో తొలి దశ అయిన జూనియర్ సివిల్ జడ్జి (మేజిస్ట్రేట్), ఆ తర్వాతి దశ అయిన జిల్లా జడ్జీల నియామకాలను హైకోర్టు చేపడుతోంది. పోటీ పరీక్షలు నిర్వహించి ఈ రెండు స్థాయిల్లో న్యాయమూర్తుల పోస్టులను హైకోర్టే భర్తీ చేస్తోంది. ఇక హైకోర్టు న్యాయమూర్తుల కోసం కొలీజియం ఏర్పాటు చేసి భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా జడ్జీల నియామకాలను హైకోర్టు నుంచి కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌ల తరహాలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా చేపట్టాలనేది కేంద్రం ఆలోచన. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు న్యాయవాద డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. ఈ పరీక్ష రాసి ఐజేఎస్‌కు ఎంపికయ్యే విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్‌ల తరహాలోనే శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం నేరుగా వారు జిల్లా జడ్జి లేదా సమాన హోదాలో అఖిల భారత సర్వీసుల్లో చేరిపోతారు. స్వయం ప్రతిపత్తి ఎలా? ఐజేఎస్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తికి ఎలాంటి భంగం వాటిల్లదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. యూపీఎస్సీ ద్వారా ఐజేఎస్‌కు ఎంపిక చేసినప్పటికీ జిల్లా జడ్జీలుగా వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం, బదిలీలు, సర్వీసు వ్యవహారాలు వంటివి హైకోర్టుల పరిధిలోనే ఉంటాయి. ఈ విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం అవుతుందని చెబుతున్నారు. ఇక జిల్లా జడ్జి కంటే దిగువన ఉండే జూనియర్ సివిల్ జడ్జీల నియామకాలను ఎప్పటిలాగే హైకోర్టులే చేపడతాయి. ఐజేఎస్‌కు ఎంపికై జిల్లా జడ్జిలుగా నియమితులైన వారు పదోన్నతులపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. సీనియారిటీ ప్రాతిపదికన వారి నియామకాలు ఉంటాయి. ఐజేఎస్ వ్యవస్థ ఏర్పాటుపై ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చ ఊపందుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ సర్వీసు ఏర్పాటులో వచ్చే సానుకూల, ప్రతికూలతలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లా జడ్జీల నియామకాలను యూపీఎస్సీ ద్వారా చేపడితే జూనియర్ సివిల్ జడ్జీలుగా నియమితులయ్యే వారు సర్వీసు, పనితీరు ఆధారంగా ఐజేఎస్‌కు ఎంపికవుతారు. వారు జిల్లా జడ్జీలుగా పదోన్నతి పొందేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఉన్నట్లుగానే ఐజేఎస్లో కూడా మేజిస్ట్రేట్ల పదోన్నతుల కోసం కన్ఫర్డ్ సర్వీసు ఉంటుందని, అయితే ఎంత శాతం ఉంటుందన్నదే తేలాల్సి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇప్పుడేం జరుగుతోంది? నేషనల్ జ్యుడీషియల్ అకాడమీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉండగా ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) హైదరాబాద్‌లోనే ఉంది. జ్యుడీషియల్ శిక్షణకు కూడా దక్షిణాదిలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది కేంద్రం భావనగా కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్న అపప్రథ నుంచి బయటపడటం కోసం ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థను దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర కూడా దీని కోసం శతథా ప్రయత్నాలు చేస్తోంది. తమ రాష్ట్రంలోనే ఎన్‌జేఏ వస్తోందని, ఇందుకు స్థలం ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే ప్రకటించారు. అయితే హైదరాబాద్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల స్థల పరిశీలన కూడా జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మండలాల్లో అనువుగా ఉన్న రెండు చోట్ల స్థలాలను పరిశీలించారు. దీంతో ఇప్పుడు ఎన్‌జేఏ హైదరాబాద్‌లో ఏర్పాటవుతుందా లేక మహారాష్ట్ర తీసుకెళ్తుందా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాజ్‌పేయి హయాంలోనే తెరపైకి... వాస్తవానికి న్యాయ వ్యవస్థ అఖిల భారత సర్వీసు తీసుకురావాలన్న అంశం వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలోనే తెరపైకి వచ్చింది. సుశిక్షుతులైన న్యాయ విద్యార్థులను దేశం ఉపయోగించుకోలేకపోతోందని, న్యాయ శాస్త్రాన్ని ఔపోసన పట్టిన యువతరం కార్పొరేట్లకు, విదేశాలకు సేవలందిస్తోందని, వారిని దేశ న్యాయ వ్యవస్థలో మిళితం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రతిపాదనను అప్పట్లో తీసుకువచ్చారు. అయితే సివిల్ సర్వీసెస్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో నియమితులయ్యే జడ్జీలకు స్థానిక భాష సమస్యగా మారుతుందని, నిరక్షరాస్యులైన కక్షిదారులను అర్థం చేసుకోవడం, వారి వాదనలను వినడం సమస్యగా మారుతుందనే ఆలోచనతో అప్పట్లో 14 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి. అయితే అఖిల భారత సర్వీసు అధికారులు స్థానిక మాతృభాషను కచ్చితంగా నేర్చుకోవాలన్న నిబంధన ఉండటంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో భాష నేర్చుకోవడం సమస్య కాదనే ఉద్దేశంతోనే మళ్లీ ఇప్పుడు ఐజేఎస్ను కేంద్రం తెరపైకి తెస్తోంది. చాలా మంచి పరిణామం... ఇది చాలా మంచి పరిణామం. దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. న్యాయ వ్యవహారాల్లో స్థానిక జోక్యం తగ్గుతుంది. భాషా సమస్య ఎదురవుతుందని కొందరు అంటున్నారు. కానీ బ్రిటిష్ హయాంలోనే మన వాళ్లు భాషా సమస్యను అధిగమించారు. అందువల్ల భాష పెద్ద సమస్యే కాదు. మొత్తంమీద న్యాయ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి ఈ ప్రతిపాదన దోహదపడుతుంది. – జస్టిస్ ఎస్.రామలింగేశ్వర్రావు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి లా పట్టభద్రులకు గొప్ప అవకాశం... ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచే 50 వేల మంది లా డిగ్రీలు పొందుతున్నారు. లా విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశం. ప్రతిష్టాత్మకమైన జాతీయ న్యాయ సంస్థల్లో చదువుకున్న వారిలో జడ్జీలుగా ఒక శాతం మంది కూడా వెళ్లడం లేదు. ఐజేఎస్ ద్వారా ప్రతిభగల న్యాయ విద్యార్థులకు జిల్లా జడ్జీలుగా అఖిల భారత సర్వీసుల్లోకి వెళ్లే అవకాశం వస్తుంది. – ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్), నల్సార్ యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు -
ఇంకా సమయం ఇవ్వొద్దు!
న్యూఢిల్లీ: ‘నిర్భయ’పై పాశవికంగా హత్యాచారం జరిపిన దోషులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని కేంద్రం కోరింది. వారికి ఇంక ఎంతమాత్రం సమయం ఇవ్వడం సరికాదని, అందుకు వారు అర్హులు కారని స్పష్టం చేసింది. నిర్భయ హత్యాచారం కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ముందు ఆదివారం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా, గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, ఆ ఎన్కౌంటర్ షాకింగ్ ఘటనే అయినా, ప్రజలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ‘ఆ ఘటన తీవ్రమైన తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరిచింది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత, సొంత తీర్పును అమలు చేసే అధికారం ప్రశ్నార్థకంగా మారాయి’ అని మెహతా వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష పదేపదే వాయిదా పడేలా నిర్భయ దోషులు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల ఓపికను పరీక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘ఆ నలుగురు దోషులు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తూ చట్టం ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తున్నారు’ అన్నారు. పవన్ గుప్తా ఇన్నాళ్లు క్యురేటివ్ పిటిషన్ కానీ, క్షమాభిక్ష పిటిషన్ కానీ దాఖలు చేయకపోవడం ఈ ఉద్దేశపూర్వక ప్రణాళికలో భాగమేనన్నారు. సాధ్యమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుని ఉరి శిక్ష అమలును వాయిదా వేయడం లక్ష్యంగా వారు ప్రయత్నిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థతో ఆ దోషులు ఆడుకుంటున్నారని మెహతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులు అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాల తరఫున న్యాయవాది ఏపీ సింగ్, మరో దోషి ముకేశ్ కుమార్ తరఫున న్యాయవాది రెబెకా జాన్ వాదనలు వినిపించారు. ఉరిశిక్ష అమలుపై స్టే విధించడాన్ని కేంద్రం సవాలు చేయకూడదని రెబెకా అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో కేంద్రం ఎన్నడూ భాగస్వామి కాలేదన్నారు. ఉరిశిక్ష అమలు జరిగేలా డెత్ వారెంట్లను జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించింది బాధితురాలి తల్లిదండ్రులే కానీ కేంద్రం కాదని ఆమె కోర్టుకు గుర్తు చేశారు. దోషులను ఒకే రోజు కాకుండా, వేర్వేరు రోజుల్లో ఉరి తీసే అవకాశంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని హైకోర్టుకు రెబెకా తెలిపారు. అంతేకాకుండా, ఒకే తీర్పు ద్వారా ఆ నలుగురు దోషులకు ఉరి శిక్ష పడినందువల్ల.. వారిని వేర్వేరు రోజుల్లో ఉరి తీయడం చట్టబద్ధంగా సమ్మతం కాదన్నారు. ‘నేనొక దుర్మార్గుడిని. దారుణ నేరానికి పాల్పడ్డాను. ఉరి ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాను. ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను. అయినా, ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కోరుకునే హక్కు నాకుంది’ అని దోషుల తరఫున రెబెకా వాదించారు. చట్టబద్ధంగా తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే హక్కు దోషులకు ఉందని తేల్చిచెప్పారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన వాదనల అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ న్యాయమూర్తి సురేశ్ కాయిట్ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు దోషుల్లో ముకేశ్, వినయ్‌ల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. అక్షయ్ సింగ్ శనివారం క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్‌లో ఉంది. పవన్ ఇంకా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించలేదు. -
తీర్పు చెప్పి.. తుపాకీతో..
బ్యాంకాక్: అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తి థాయ్‌లాండ్ న్యాయవ్యవస్థలో అడుగడుగునా వచ్చే అడ్డంకుల్ని సహించలేకపోయారు. కిక్కిరిసిపోయిన కోర్టు హాలు సాక్షిగా దేశ న్యాయవ్యవస్థలో లోటుపాట్లను చీల్చి చెండాడుతూ తనని తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఉగ్రవాదం వెర్రి తలలు వేసే దక్షిణ థాయ్‌లాండ్‌లోని యాలా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనకోర్న్ పియాన్చన ఒక హత్యా కేసులో నిందితుల్ని నిర్దోషులుగా తీర్పు చెప్పిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకు ముందు ఫేస్బుక్ లైవ్‌లో న్యాయవ్యవస్థ ఎంత కుళ్లిపోయిందో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆ తర్వాత తన దగ్గరున్న తుపాకీతో ఛాతీలో కాల్చుకున్నారు. వెంటనే కోర్టు అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసి ఛాతీలో దిగిన గుళ్లను బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యాయమూర్తి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. థాయ్ సమాజంలో ధనబలం, కండబలం ఉన్నవారికి కోర్టులు అనుకూలంగా ఉంటాయని, సాధారణ పౌరులైతే చిన్నా చితక నేరాలకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తున్నారన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయితే ఒక న్యాయమూర్తి ఇలా వ్యవస్థను నిందించడం ఇదే తొలిసారి. ఒక హత్య కేసులో ముస్లింలైన అయిదుగురు నిందితుల్ని విముక్తుల్ని చేస్తూ తీర్పు చెప్పిన పియాన్చన న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని అన్నారు. ‘ఎవరికైనా శిక్ష విధించాలంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండాలి. అలా లేవని అనిపిస్తే వారిని విముక్తిల్ని చేయాలి. ఒక నిర్దోషికి ఎన్నడూ శిక్షపడకూడదు. వారిని బలిపశువుల్ని చేయకూడదు‘‘ అని అన్నారు. ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన ఆ అయిదుగురికి శిక్షలు వేయాలంటూ పియాన్చనపై ఒత్తిళ్లు వచ్చాయని, సాక్ష్యాధారాలు లేకుండా శిక్ష విధించలేని ఆయన తీర్పు చెప్పిన తర్వాత తనని తాను కాల్చుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైçపు న్యాయశాఖ అధికారులు న్యాయమూర్తి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకు వ్యక్తిగత సమస్యలే కారణమని అంటున్నారు. అసలు ఆయన ఎందుకు ఈ పని చేశారో విచారణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. -
‘తప్పు తీర్పు ఇచ్చానని ఏ జడ్జీ ఒప్పుకోడు’
న్యూఢిల్లీ: ఏ న్యాయమూర్తి తాను తప్పు తీర్పు ఇచ్చానని ఒప్పుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా, కేవలం తప్పుడు ఆదేశాలు ఇచ్చారన్న కారణంతో జడ్జీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేమంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత పవిత్రమైంది.తప్పు చేసినట్లు, అవినీతికి పాల్పడినట్లు, ప్రలోభాలకు గురైనట్లు స్పష్టమైన ఆరోపణలుంటే తప్ప.. తప్పు తీర్పు ఇచ్చారన్న ఒకే కారణంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించరాదు’ అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడంపై బిహార్‌కు చెందిన ఒక న్యాయాధికారి దాఖలు చేసి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటికే హైకోర్టు బెయిల్‌ను నిరాకరించిన విషయాన్ని గుర్తించకుండా.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కొందరికి బెయిల్ మంజూరు చేయడంపై, మరో డ్రగ్ సంబంధిత కేసు విచారణను హడావుడిగా ముగించడంపై ఆ న్యాయాధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది హిందూ నిర్మాణమే! : అయోధ్య వివాదాస్పద స్థలంలో పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో వెల్లడైన విషయాలు ఆ స్థలం తమదేనన్న ముస్లింల వాదనను స్పష్టంగా తోసిపుచ్చుతున్నాయని రామ్ లల్లా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయోధ్య వివాదాస్పద స్థల యాజమాన్య వ్యాజ్యంపై జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గురువారం వాదనలు కొనసాగాయి. -
‘పిల్లకు న్యాయవ్యవస్థ రక్షణ’
న్యూఢిల్లీ: ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లు కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థ వాటిని పరిరక్షిస్తోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. కేసులను ఆలస్యం చేయడానికే కొందరు తరచూ వాయిదాలు కోరుతుంటారనీ, దీంతో పేద∙కక్షిదారులపై ‘న్యాయ పన్ను’ పడుతోందన్నారు. పిల్లను ప్రవేశపెట్టిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, దివంగత జస్టిస్ పీఎన్ భగవతిపై వచ్చిన ‘లా, జస్టిస్ అండ్ జ్యుడీషియల్ పవర్: జస్టిస్ పీఎన్ భగవతీస్ అప్రోచ్’ అనే ఓ సంకలనాన్ని కోవింద్ ఆవిష్కరించారు. -
ఆరెస్సెస్ వల్లే అరాచకత్వం
భువనేశ్వర్: దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో చొచ్చుకునిపోయేందుకు, వాటిని నియంత్రించేందుకు ఆర్ఎస్ఎస్ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అందువల్లే న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ సహా దేశంలో గందరగోళం, అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రజలను కలుసుకోవడంలో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పలువురు మేధావులతో ముచ్చటించారు. ‘1991లో, 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సరళీకరణ విధానాలతోనే దేశంలో మధ్యతరగతి అవతరించింది’ అని రాహుల్ తెలిపారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ నేతలు నన్ను తరచుగా దూషిస్తూ ఉంటారు. వాటిని నేను బహుమానంగా స్వీకరిస్తా. ఎందుకంటే ఆ విమర్శలు నన్ను మరింత రాటుదేలేలా చేశాయి’ అని అన్నారు. ప్రియాంక రాకపై గతంలోనే నిర్ణయం సోదరి ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ స్పష్టంచేశారు. మిరాయా, రైహాన్ వాద్రాలు చిన్నపిల్లలు కావడంతో ప్రియాంక రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రస్తుతానికి యూపీలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడమే ప్రియాంక లక్ష్యమనీ, ఎలాంటి ఇతర బాధ్యతలు ఆమెకు అప్పగించలేదని స్పష్టం చేశారు. తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందనీ, నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్‌ల హత్యల తర్వాత అది మరింత దృఢపడిందని రాహుల్ పేర్కొన్నారు. తనను, ప్రియాంక పక్కపక్క గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగితే దాదాపు 80 శాతం ఒకేరకమైన సమాధానం వస్తుందని తెలిపారు.బీజేపీ నేత, సుల్తాన్పూర్ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటి ఊహాగానాలు వస్తున్నట్లు తనకు తెలియదన్నారు. -
సత్వర న్యాయం అందడం లేదు
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థలో ఇప్పటికీ బ్రిటీష్ విధానాలను అనుసరిస్తుండటం వల్ల సామాన్యులకు సత్వర న్యాయం అంద డం లేదని అఖిల భారత జడ్జీల సంఘం అధ్య క్షుడు జస్టిస్ రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆదివారం రెండో జుడీషియల్ పే కమిషన్ అమలుకు సంబంధించి రాజేంద్రప్రసాద్ తెలంగాణ న్యాయాధికారులతో చర్చించారు. జస్టిస్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థలో ప్రస్తుతం అమలవుతున్న సంస్కరణలను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. హత్య, అత్యాచారం వంటి కేసుల్లో 2 నెలల్లో శిక్షలు తేలాలని, అప్పుడు ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 40 ఏళ్ల వ్యక్తిపై హత్యానేరం తేలేందుకు 30 ఏళ్లు పడుతోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందన్నారు. ఏసీబీ దాడులకు సంబంధించి న్యాయాధికారుల రక్షణ సంగతి హైకోర్టు చూసుకుంటుందన్నారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన న్యాయాధికారి వి.వరప్రసాద్‌పై ఏసీబీ చేసిన ఆరోపణలను తాము పరిశీలించామని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని భావిస్తున్నామని చెప్పారు. దీనిపై హైకోర్టుకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు వసంత్‌కుమార్ షా, ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్ నతాని, కోశాధికారి రణధీర్ సింగ్ పాల్గొన్నారు. -
ఇకనేరుగా కోర్టులకు!
హైదరాబాద్: పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే క్షణాల్లో సంబంధిత కోర్టుకు ఆన్లైన్లో సమాచారం చేరనుంది. చార్జిషీట్ సైతం నిమిషాల్లో జడ్జి ముందు కన్పిస్తుంది. ఇలాంటి వ్యవస్థను న్యాయవ్యవస్థ దేశవ్యాప్తంగా ఇటీవల రూపొందించింది. ఇంటర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) పేరుతో నూతన ప్రాజెక్టును పోలీస్ శాఖ, న్యాయవ్యవస్థ మధ్య అనుసం«ధానంగా ప్రవేశపెట్టారు. ఈ ఐసీజేఎస్‌ను శనివారం ఈ వ్యవస్థ చైర్మన్ జస్టిస్ మదన్ బి.లోకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్.. ఐసీజేఎస్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్న న్యాయవ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్ర పోలీస్‌ను ఎంచుకుంది. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్‌లోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ జస్టిస్ మదన్ బి.లోకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టు, పోలీసుల సమన్వయం ద్వారానే కేసులను త్వరితగతిన పరిష్కరించగలమని పేర్కొన్నారు. త్వరితగతిన కేసులను పరిష్కరించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం కల్పించేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఐసీజేఎస్ రూపొందించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఎఫ్ఐఆర్ కాపీతో పాటు చార్జిషీట్లు కూడా పోలీస్ సిబ్బంది స్థానిక కోర్టుకు అందజేయడంతో పాటు సీసీ నంబర్లు, వారంట్లు, సమన్లను కూడా కోర్టు ద్వారా పోలీస్ సిబ్బంది పొందాలని సూచించారు. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో తెలంగాణ ముందు నుంచీ మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకొచ్చిన టీఎస్‌కాప్ తదితర యాప్‌లు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. జవాబుదారీతనం పెరుగుతుంది: డీజీపీ ఐసీజేఎస్ వ్యవస్థతో పోలీస్స్టేషన్ల అనుసంధానం వల్ల పోలీసుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలో పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌ను అనుసంధానించడం రాష్ట్ర పోలీస్ శాఖకు మరో మైలురాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జస్టిస్ మదన్ బి.లోకూర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టులో కీలకంగా పనిచేస్తున్న పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీపీ రవిగుప్తా, వరంగల్ కమిషనర్, ఇతర అధికారులను డీజీపీ అభినందించారు. -
‘పెండింగ్’ సమస్యకు పరిష్కారం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు భారంగా మారిన పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించేందుకు తన వద్ద ఒక ప్రణాళిక ఉందని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సోషల్ ఇంజనీరింగ్‌లో బార్ అండ్ బెంచ్ పాత్ర’అనే అంశంపై శనివారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో గొగోయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు సంబంధించి న వాటిలో రెండు సమస్యలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయన్నారు. వాటిలో పెండింగ్ కేసుల సమస్య ఒకటి అని తెలిపారు. ఇది మొత్తం న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు చాలా కాలం పాటు శిక్ష అనుభవించిన తర్వాత తీర్పు రావడం అనేది మరో సమస్య అని పేర్కొ న్నారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడు తరాల తర్వాత తీర్పు రావడం జరుగుతుందని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్య అయినప్ప టికీ పరిష్కరించడం సులువేనని వెల్లడించారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి తన వద్ద ఉన్న ప్రణాళికలు ఉన్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తమ మద్దతు ఇవ్వాల్సిందిగా బార్ అండ్ బెంచ్‌ను కోరారు. జిల్లా కోర్టుల్లో 5,950 పోస్టులు.. దేశంలో ఉన్న జిల్లా కోర్టులన్నింటిలో కలిపి 5,950 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గొగోయ్ తెలిపారు. జడ్జీల పదవీ కాలం తక్కువ ఉండటం వల్ల ఎలాంటి సమస్య లేదని, చీఫ్ జస్టిస్‌లు మారుతుండటం వల్ల కేసుల ప్రాధాన్యత కూడా మారుతోందని వ్యాఖ్యానిం చారు. దీనికి సంబంధించి న్యాయవ్యవస్థలో ఒక స్థిరమైన విధానాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, సరైన పాలసీతో కేసులను పరిష్కరిస్తే ఇది పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా పదవీ విరమణ అనంతరం సీజేఐగా గొగోయ్ బుధవారం (3న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
నిజంగా విషాదకరం
ఎవరూ మాట్లాడలేని, ఎవరూ స్వేచ్ఛగా సంచరించలేని ఒక ‘విషాదకర దశ’ను దేశం చూస్తున్న దని బొంబాయి హైకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యానాన్ని ధర్మాగ్రహ ప్రకటనగా భావించాలి. అయిదేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణేలో హేతువాది నరేంద్ర దభోల్కర్‌నూ, మూడేళ్లక్రితం అదే రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో మరో హేతువాది గోవింద్ పన్సారేనూ కాల్చిచంపిన ఉదంతాలపై దర్యాప్తుల్లో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ కేసుల దర్యాప్తును ఎడతెగకుండా సాగదీస్తున్న సీబీఐ, ఆ రాష్ట్ర సీఐడీ సంస్థలు ఉన్నత న్యాయస్థానానికి ఈ పరిస్థితిని కల్పించాయి. ఇవి దర్యాప్తును పూర్తి చేసి, నేరగాళ్లను బంధించే ఉద్దేశంలో లేవని, న్యాయస్థానం స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు చేయిస్తే తప్ప తమకు న్యాయం దక్కదని ఆ పిటిషనర్లు విన్నవించుకున్నారు. వారికి మణిపూర్ ఎన్కౌంటర్ల కేసులకు పడుతున్న గతి తెలియదనుకోవాలి. అక్కడ జరిగిన 1,500కుపైగా ఎన్కౌంటర్లపై దర్యాప్తు కోరుతూ ఏడేళ్లక్రితం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపి నిరుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీబీఐ డైరెక్టర్‌ను ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటికి కేవలం నాలుగు కేసుల్లో రెండు చార్జిషీట్లు మాత్రమే సిట్ దాఖలు చేయగలిగింది. ఆ కేసు ల్లోని నిందితులనైనా ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేకపోయారన్న ధర్మాసనం ప్రశ్నకు సీబీఐ దగ్గర జవాబు లేదు. సర్వోన్నత న్యాయస్థానం నిలదీసినందుకు కాబోలు మేజర్ విజయ్ సింగ్ బల్హారా అనే సైనిక అధికారిపై సీబీఐ కేసు దాఖలు చేసింది. 2009లో పన్నెండేళ్ల కుర్రవాడిని అతని తల్లిదండ్రుల కళ్లముందే ఎన్కౌంటర్ పేరుతో కాల్చిచంపిన ఉదంతమిది. దేశంలో అడపా దడపా సాగే ఎన్కౌంటర్లు, లాకప్ డెత్‌లు మన దేశ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ల గురించి సుప్రీంకోర్టు మాత్రమే కాదు... ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మొన్న జూన్‌లో సమితి మానవ హక్కుల మండలి ‘కావాలని, అనుచితంగా, అకారణంగా’ ఈ కేసుల దర్యాప్తును సాగదీస్తున్నారని కటువుగా విమర్శించింది. దేశంలో ఎన్కౌంటర్లు, లాకప్‌డెత్‌లు లేని రాష్ట్రాలు దాదాపు ఉండవు. కానీ 2008–09లో మణిపూర్ అన్ని రాష్ట్రాలనూ తలదన్నిందని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత స్థానం ఉత్తరప్రదేశ్‌ది. 89 ఎన్కౌంటర్ కేసులపై నిరుడు డిసెంబర్ ఆఖరికి దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు గడువునిస్తే ఆ సమయానికి దర్యాప్తు సంగతలా ఉంచి, కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత ఆ గడువు మొన్న ఫిబ్రవరికి మారింది. కానీ మార్చి 12 నాటికి 42 కేసుల నమోదు మాత్రమే పూర్తయింది. కనీసం జూన్ నెలాఖరుకు 50 కేసుల్లో అయినా దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే జూలై 2న హాజరైన సీబీఐ అధికా రులు కేవలం నాలుగు కేసుల్లో దర్యాప్తు పూర్తిచేశామని విన్నవించారు. ఆ కేసుల్లో ఏ ఒక్కరూ అరెస్టు కాలేదని తాజాగా వెల్లడైంది. లాకప్ డెత్‌ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. నిరుడు ఏప్రిల్ నుంచి మొన్న ఫిబ్రవరి వరకూ దేశంలో మొత్తం 1,674 లాకప్ మరణాలు సంభవించాయని ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్(ఏసీహెచ్ఆర్) గత నెలలో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారత్‌లో రోజుకు సగటున అయిదు లాకప్ డెత్‌లు జరుగుతున్నాయని సంస్థ లెక్కే సింది. చిత్రమేమంటే మన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసే గణాం కాల్లో ఈమధ్యవరకూ లాకప్ మరణాల ప్రస్తావన ఉండేది కాదు. అవి సర్వసాధారణంగా అనా రోగ్యం, ఆత్మహత్య, కస్టడీనుంచి అదృశ్యం కావటం, నిందితుణ్ణి తరలిస్తుండగా చనిపోవటం వంటి ఖాతాల్లో పడటం ఆనవాయితీ. ఎన్కౌంటర్ మరణాలైతే హక్కుల సంఘాల దృష్టికొస్తాయి. చివరకు ఏమవుతాయన్న సంగతలా ఉంచి కనీసం న్యాయస్థానాల్లో ఆ మరణాలపై విచారణ కోరుతూ పిటిషన్లు దాఖ లవుతాయి. కానీ లాకప్ డెత్‌లు అలా కాదు. మరీ ప్రాముఖ్యత సంతరించుకున్న కేసులైతే చెప్పలేంగానీ చాలా కేసుల్లో చివరివరకూ పట్టుదలగా పోరాడేవారుండరు. ఎందుకంటే వీటిల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు పూటకు గతి లేని, రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగు కులాలకు చెందినవారే. వారి తల్లిదండ్రులైనా, బంధువులైనా కూలి పనులు మానుకుని న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితిలో ఉండరు. ఉన్నా వారికి బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తుంటాయి. కేరళలో ప్రభావతి అనే ఒక తల్లి తన కుమారుడి లాకప్ మరణంపై పట్టుదలగా పోరాడి నిందితులకు సీబీఐ కోర్టులో ఈమధ్యే ఉరిశిక్ష పడేలా చూసిన ఉదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆ తల్లి పట్టుదలగా పోరాడిన వైనం గమనిస్తే అదే రాష్ట్రంలో 1976లో ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పోలీసుల చేతుల్లో అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్, అతని ఆచూకీ చెప్పాలంటూ 2006లో తుది శ్వాస విడిచేవరకూ పోరాడిన అతని తండ్రి ప్రొఫెసర్ ఎచెరా వారియర్ గుర్తుకొస్తారు. అంతం తమాత్రం చదువుకొని ఆయాగా పనిచేస్తున్న ఒంటరి మహిళ ప్రభావతి 2005లో తన ఒక్కగానొక్క బిడ్డను పోలీసులు కొట్టి చంపారని తెలిసినప్పటినుంచీ మొండిగా పోరాడింది. గూండాల నుంచి బెదిరింపులొచ్చినా, రోడ్డు ప్రమాదంలో హతమార్చే ప్రయత్నం జరిగినా, డబ్బు ముట్టజెబుతా మని ఆశ చూపినా తన సంకల్పం వీడలేదు. కానీ ఇంత సాహసికంగా, ఇంత నిర్భీతితో పోరాడటం అందరికీ సాధ్యమయ్యే పనేనా? ఈ ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు అంతర్జాతీయంగా మనల్ని నగుబాటుపాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. ఈ ఉదంతాలను పాలకులు నివారించలేకపోతే పోయారు... ఇప్పటికైనా మేల్కొని కనీసం త్వరితగతిన దర్యాప్తు పూర్తయ్యేలా, నిందితులకు శిక్షలు పడేలా చూడకపోతే ఈ ఘటనలకు వారి పరోక్ష ఆమోద మున్నదనే అభి ప్రాయం బలపడుతుంది. -
న్యాయవ్యవస్థకే ఇది మచ్చవుతుంది
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా అడ్డుకున్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ స్వతంత్రత నిలబడదు. ఎంత పటిష్టంగా, ఎంత వేగంగా తీర్పును వెలువరిస్తోంది అన్న అంశాలపై న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఆధారపడి ఉంటుంది. రాజకీయ, పాలనాపరమైన ప్రాధాన్యత గల కేసుల విషయంలో కూడా అంతులేని కాలయాపన చేస్తున్నప్పుడే న్యాయ వ్యవస్థపై పలు అనుమానాలు తలెత్తుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తమిళనాడులో 18 అసెంబ్లీ నియోజక వర్గాలు 2017, సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. పాలకపక్ష అన్నాడీఎంకే పార్టీలో అధికార సంక్షోభం ఏర్పడి 18 మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్‌తో జట్టుకట్టారన్న కారణంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వారిని అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. ఎడపాడి పళనిస్వామి అతి తక్కువ మెజారిటీతో సభా విశ్వాసాన్ని పొందిన నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ 18 మంది ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ తీర్పును వాయిదా వేస్తున్నట్టు జనవరి 23వ తేదీన ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయిన సందర్భాల్లో ప్రజలకు, పాలనా వ్యవహారాలకు ఇబ్బందులు కలుగరాదన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తోంది. మరెందుకో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయి ఎనిమిది నెలలు పూర్తవుతున్న తీర్పు వెలువడ లేదు. అదే ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు త్వరితగతిన కేసును విచారించి త్వరగానే తీర్పును వెలువరించింది. పళనిస్వామితో ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఆయనతో పన్నీర్ సెల్వం వర్గంలోని 11 మంది ఎమ్మెల్యేలు కలిసిపోయారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారన్న కారణంగా వాళ్లను సస్పెండ్ చేయాలంటూ విపక్షం కోర్టుకెక్కింది. 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై వేగంగా విచారణ పూర్తి చేసిన హైకోర్టు, ఇప్పటికీ పళనిస్వామి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కేసులో తీర్పు వెలువరించక పోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
జడ్జీల నియామకంపై తకరారు
న్యూఢిల్లీ: జడ్జీల నియామకానికి సంబంధించి న్యాయవ్యవస్థకు–కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకంపై శుక్రవారం సుప్రీంకోర్టు సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లు ఎన్ని కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలని న్యాయమూర్తులు జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ గుప్తా బెంచ్ అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. ఎన్ని పేర్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుంటానని ఏజీ సమాధానం ఇవ్వగా ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మీరు చెప్పే మాట ‘తెలుసుకుంటాను’ అనడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుల్లో 40 వరకూ ఖాళీలు ఉంటే కొలీజియం 3 పేర్లే సిఫార్సు చేసిందని, మరిన్ని పేర్లను సిఫార్సు చేయాలని ఏజీ అన్నారు. కొలీజియం సిఫార్సు చేస్తే ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కొలీజియం సిఫార్సులు లేకుండా కేంద్రం ఏమీ చేయలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తాము సిఫార్సులు చేశామని, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ యాకూబ్ మీర్.. మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ రామలింగం పేర్లను ప్రతిపాదించామని, ఇప్పటి వరకూ వాటికి ఆమోదం తెలపలేదని పేర్కొంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. వారి నియామకానికి సంబంధించి అతి త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన బెంచ్.. ఎంత త్వరగా.. ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. తన కేసును మణిపూర్ హైకోర్టు నుంచి గౌహతి హైకోర్టుకు బదిలీ చేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల అంశం తీవ్రంగా ఉందని ధర్మాసనం గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు కేసుల బదిలీ కోసం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఢిల్లీ వచ్చి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.. స్వతంత్రత ప్రజాస్వామ్య పునాది న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది ప్రజాస్వామ్య పునాదుల్లో ఒకటని సుప్రీంకోర్టు తాజా మాజీ న్యాయమూర్తి ఆర్కే అగర్వాల్ అన్నారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి∙సీజేఐ జస్టిస్ మిశ్రా, ఇతర సుప్రీంకోర్టు జడ్జీలు హాజరయ్యారు. -
న్యాయవ్యవస్థకు రక్షణ ఏది?
మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం. అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్థించదగ్గదేనా? వివాహాల వైఫల్యమే ఇతివృత్తంగా బాసు భట్టాచార్య మూడు వరస సిని మాలు నిర్మించారు. వాటిలో 1971 నాటి ‘అనుభవ్’ ఒకటి. ఈ చిత్రంలో పని తప్ప మరొక ధ్యాస లేని ఒక పత్రికా సంపాదకుడి పాత్రలో సంజీవ్‌కుమార్, ఎప్పుడూ ఏకాంతంగా గడిపే అతడి భార్యగా తనూజ నటించారు. రెండు న్నర గంటలు పాటు సాగే చిత్రంలో చివర దినేష్ ఠాకూర్ (మరొక పాత్రలో కనిపించిన నటుడు) ముక్కోణపు ఉత్కంఠను రేపుతాడు. అప్పుడే ఆ జంట మధ్య ఈ సంభాషణ చోటు చేసుకుంటుంది. ‘ఎవరెవరివో సమస్యలు తీసు కుని వాటి మీద మీరు నిత్యం ఒక సంపాదకీయం రాస్తారు. మీరు మన కోసం కూడా ఒక సంపాదకీయం రాయండి!’ అంటూ తనూజ (21వ శతా బ్దంలో ప్రేక్షకులకు బాగా దగ్గరయిన కాజోల్ తల్లి) సంజీవ్‌కుమార్‌ను అడుగుతుంది. ఇలాంటి దృశ్యంలో ప్రతిభామూర్తులైన మీ సుప్రీం కోర్టు న్యాయమూర్తు లను ఒకసారి ఊహించుకోండి. ఈవారంలో వారు అరుదైన స్పష్టతతో, ఎలాంటి శబ్దాలంకారాలు లేని రీతిలో ఒక తీర్పు ఇచ్చారు. నాగ్‌పూర్‌లో సంభ వించిన జస్టిస్ బీహెచ్ లోయా మరణం వివాదంపై స్వతంత్ర దర్యాప్తు జరి పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ డీవై చంద్రచూడ్ పిటిషనర్లను తీవ్ర స్థాయిలో హెచ్చరిం చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదిని కూడా వదిలిపెట్టలేదు. చిన్న ఆధారం కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారని తీర్పులో పేర్కొన్నారు. ఆ విధంగా మొత్తం న్యాయ వ్యవస్థ మౌలికతనే తక్కువ చేసి చూపుతున్నారని కూడా చెప్పారు. పిటిషన్లను తిరస్కరించడంతో పాటు, న్యాయ వ్యవస్థను న్యాయ వాదుల నుంచి, ఉద్యమకారుల నుంచి, మీడియా నుంచి రక్షించుకోవలసి వస్తున్నదంటూ ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఇది ఎలా ఉందంటే, ప్రతివారు న్యాయమూర్తుల మీద పడి వేధిస్తున్నట్టు, ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవడా నికి వారు పోరాడుతున్నట్టు ఉంది. కాబట్టి ‘అనుభవ్’ సినిమాలో తనూజ అడిగిన ప్రశ్ననే న్యాయమూర్తులను అడగవచ్చునా? ‘ న్యాయ వ్యవస్థను ఇత రుల నుంచి రక్షించడానికి మీరు ఎప్పుడూ తీర్పులు వెలువరిస్తూ ఉంటారు. అలాగే న్యాయమూర్తుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవడం ఎలా అనే అంశం మీద కూడా మీరు ఒక తీర్పును రాయగలరా?’ ఈ వాదనను తయారు చేయడంలో నేను అవసరానికి మించిన జాగ్రత్త చూపిస్తున్నానేమో! అలా ఉండడమే మంచిది. ఎందుకంటే జస్టిస్ లోయా కేసులో పిటిషనర్ల మీద, న్యాయవాదుల మీద నేర ధిక్కారం ఆరోపించ కుండా తాము విశాల హృదయంతో వ్యవహరించామని న్యాయమూర్తులు చెప్పారు. అంతటి ఔదార్యం ఒక మామూలు సంపాదకుడి విషయంలో చూపించకపోవచ్చు. అయినప్పటికి వాస్తవాలు చెప్పాలి. అవి చర్చకు రావాలి. అయితే తీర్పులోని మంచి విషయాలను చర్చించడానికి ఇది సమ యం కాదు. ఇందులో మంచి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు వెలువరించే చాలా ఆదేశాల వలె కాకుండా ఇందులో క్లుప్తత కూడా చక్కగా ఉంది. వేర్వేరు శిబిరాలుగా విడిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మీరు వివరించదలిచినది ఏదైనా అది మీ రాజకీయ పంథా, సైద్ధాంతికతల పునాది ఆధారంగానే ఉంటుంది. జర్నలిస్ట్ బర్ఖా దత్ మీడియా వారి సంకట స్థితిని చాలా కటువుగా వర్ణించారు. మీడియాను రెండు ధ్రువాలుగా– ఒకరు చెంచాలు (అస్మదీ యులు), మరొకరు మోర్చాలు (ఉద్యమకారుల బృందాలు) అని పేర్కొ న్నారు. ఇలా మాట్లాడడం ప్రమాదకరం. ఎందుకంటే తరువాత మీరు రెండు ధ్రువాలని నిందించాలి. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థ కూడా ఇలా ధ్రువా లుగా చీలిపోయిన సూచనలు కనిపిస్తున్న తరుణంలో అది మరింత ఇబ్బంది పెట్టే విషయం. న్యాయ వ్యవస్థకు అదే నిజమైన ముప్పు. తన నుంచి తనకు ఉన్న ముప్పు. నిజానికి దాని గురించే న్యాయమూర్తులు ఆగ్రహం ప్రకటిం చాలి. ఆ కారణంగానే న్యాయ వ్యవస్థ తనను తాను న్యాయమూర్తుల నుంచి రక్షించుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ వ్యక్తిగత ప్రతినాయకులు ఎవరూ లేరు. బయటి నుంచి వచ్చినదని భావించిన వైరస్‌ను వదిలించుకోవాలనుకు న్నప్పుడు వ్యవస్థ దానికదే స్వీయ రక్షణలో పడిపోతోంది. శరీరం తనని తాను తినడం ఎప్పుడు మొదలు పెడుతుందో మీకు తెలుసా? ఈ పిల్ మీద తీర్పులో మీరు అనివార్యంగా అంగీకరించ వలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.మొదటి అంశం– ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్విని యోగమవుతున్నాయి. రాజకీయ, వ్యక్తిగత, సైద్ధాంతిక పోరాటాలను కోర్టు లకు తీసుకువస్తూ ప్రజలు పిల్ వ్యవహారాన్ని ఒక వృత్తిలా మార్చేశారు. కోర్టుల సమయాన్ని వృధా చేస్తూ జాప్యానికి కారకులవుతున్నారు. రెండో అంశం– న్యాయమూర్తులు అబద్ధాలు ఆడరాదు. కనీసం వారిలో నలుగురు కలుసుకోనప్పుడైనా అబద్ధం ఆడరాదు. మూడో అంశం– మొత్తం న్యాయ వ్యవస్థను ఒకే వ్యక్తి అదుపు చేస్తాడని చెప్పడం అర్థరహితం. అది అసంభవం. ఇప్పుడు కొన్ని వాస్తవాల గురించి పరిశీలిద్దాం. జస్టిస్ లోయాకు సంబం ధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు ఉదయమే పత్రికలు బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు గురించి ప్రచురిం చాయి. మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం. అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్ధించదగ్గదేనా? అయితే న్యాయమూర్తుల వివేకం గురించి ప్రశ్ని స్తున్నప్పటికీ కూడా వారి చర్యలను శంకించడం మాత్రం తగదు. ప్రచారం కోరుకునే వ్యక్తులకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒక ఆయుధంగా మారిపో యిందని లోయా కేసు తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తులు కూడా తమని తాము అద్దంలో చూసుకుంటూ తాము అలాంటి ఆకర్షణకు లోనయ్యే వాళ్లం కాదని చెప్పుకోగలరా! ఇలాంటి కొన్ని ఉదాహరణలను సేకరించ డంలో నాకు సహకరించిన నా సహ జర్నలిస్ట్ మనీష్ చిబ్బర్ ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థను ఆసక్తిగా, లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. ఆ ఉదాహరణలలో భారత క్రికెట్‌ను నిర్వహించమని దాదాపు సంవత్సరం క్రితం సుప్రీంకోర్టుకు అప్పగించిన బీసీసీఐ ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇటీవలనే భారత ప్రధాన న్యాయమూర్తి మరొక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కూడా అనుమతించారు. ఆయనే ఇప్పుడు క్రికెట్ బెంచ్‌కు (ఇలాంటి రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నారా?) ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. క్రీడలలో బెట్టింగ్‌ను, జూదాన్ని చట్ట బద్ధం చేయాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆయనే అనుమతించారు. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక ముందు ఒక ఆదేశం జారీ (నవంబర్ 30, 2016) చేశారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను అనివార్యం చేస్తూ ఇచ్చిన ఆదేశమది. తరువాత దానిని రద్దు చేశారు. ఈ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా పత్రి కలలో పతాక శీర్షికల స్థానం పొందాయి. పిటిషన్‌దారులు ఎవరో ఎవరికీ గుర్తు లేదు. కాబట్టి పత్రికల పతాక శీర్షికలకు ఎక్కాలనుకుంటున్నారంటూ పిటిషనర్లను ఎందుకు విమర్శించడం? లోయా తీర్పు వచ్చిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చిన 43 వ్యాజ్యాలలో 12 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే. ఇంకొన్ని: బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం, సాంటా–బాంటా జోకుల నిషేధం, అశ్లీల చిత్రాల వీక్షణను నేరంగా ప్రకటించడం (2013 నుంచి కోర్టుల సమయాన్ని తింటున్నది), పాఠ శాలల్లో యోగాభ్యాసం తప్పనిసరి చేయడం–ఇంకొన్ని. ఇందులో కొన్నింటిని కొట్టివేశారు. ఇంకా ఎన్నో కీలకమైన కేసులు ఉండగా వీటిని ఎందుకు అను మతించాలి? వాస్తవం ఏమిటంటే, గొప్ప సదుద్దేశంతో 1980లో వచ్చిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని ఎందరో న్యాయమూర్తులు విస్తరించారు. ఇది ప్రజల అంతిమ ఆయుధంగా భావించారు. ఇంకొక విషయం–న్యాయమూర్తులు అబద్ధం ఆడరాదు. కనీసం నలు గురు సీనియర్ జిల్లా జడ్జీలు కలిసినప్పుడైనా అబద్ధం ఆడరాదు. ఈ సూత్రం సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు వర్తించదా? వీరు కోర్టు నిర్వహణకు సంబంధించిన కొన్ని దోషాలను గురించి కొన్ని నెలల క్రితం మాట్లాడారు. మనం నలుగురు మహారాష్ట్ర న్యాయమూర్తుల మాటను పరిగణిస్తున్నప్పుడు, వారి మాటలను ఉద్దేశపూర్వకమైనవిగా తోసిపుచ్చ వచ్చా, వారి ఆందోళనలను దారితప్పినవిగా కొట్టిపడేయవచ్చా? జిల్లా జడ్జీలు అబద్దమాడుతున్నారని అగ్నికి ఆజ్యం పోసేటంత మూర్ఖుడిని కాను. పైగా సుప్రీంకోర్టు జడ్జీలు అబద్దాల కోరులు అని నమ్మేందుకు నేను వెర్రి వాడినై ఉండాలి. వారు సంధించిన ప్రశ్నలకు స్పందించాలి. చర్చించాలి, అంతర్దృష్టితో చూడాల్సివుంది. న్యాయవ్యవస్ధపై కనికరం లేని ఈ సాగదీత, అంటువ్యాధిగా కొట్టిపడే సిన అదే ప్రజాప్రయోజన వ్యాజ్యాల గుండా పతాక శీర్షికలపై దృష్టి నిలిపే న్యాయవ్యవస్థ ధోరణి, తమ సొంత సంస్థను క్రమంలో ఉంచడంలో వారి అసమర్థత అనేవే బయటి వారికంటే ఎక్కువగా న్యాయవ్యవస్థను బలహీనప ర్చాయి. న్యాయమూర్తులు చీలిపోయినట్లు కనిపిస్తే, కక్షిదారులు, న్యాయవా దులు కలిసి ఫోరం షాపింగ్‌కు వెళతారని మీరు ఊహించవచ్చు. తీర్పులోని మూడో ముఖ్యమైన అంశంలోకి మనల్ని తీసుకెళుతోంది ఏదంటే, ఒక వ్యక్తిమాత్రుడు మొత్తం న్యాయవ్యవస్థను నియంత్రించగలడని చెప్పడం అర్ధరహితమనే చెప్పాలి. మీరు దీనితో విభేదించలేరు. వాస్తవానికి, అలాంటి పరిస్థితిని మనం గతంలో చూసి ఉన్నాం. కాని అలా చేసింది పురు షుడు కాదు మహిళ అయిన ఇందిరాగాంధీ. వెన్నెముక కలిగిన ఒకే ఒక్క సాహసికుడైన న్యాయమూర్తి హెచ్ ఆర్ ఖన్నా నేటి ఎర్డోగన్నేతత్వంలోని టర్కీ దేశంలా మారకుండా మనదేశాన్ని నాడు కాపాడారు. 2018 కాలపు భారతదేశానికి అలాంటి ఒక న్యాయమూర్తి కాదు, పలువురు న్యాయమూ ర్తులు కావలసి ఉంది. ఎందుకంటే న్యాయవ్యవస్థకు పెనుప్రమాదం ఇప్పుడు బయటినుంచి కాదు. లోపలి నుంచి పొంచి ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సీజేఐని కలవనున్న న్యాయశాఖ మంత్రి!
న్యూఢిల్లీ: కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య పలు అంశాలపై విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ త్వరలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై న్యాయశాఖ ఇప్పటికే ఓ నోట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జస్టిస్ కేఎం జోసెఫ్, సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాలకు ప్రమోషన్ కల్పించటం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జిల్లా కోర్టు జడ్జి భట్‌కు హైకోర్టు జస్టిస్‌గా పదోన్నతి వివాదం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
ఎన్డీఏ సర్కారుకు కపిల్ సిబల్ చురకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భావజాలాన్ని దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయడమే నరేంద్ర మోదీ సర్కార్ తమ అజెండాగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో ఆరెస్సెస్ ప్రచారక్‌లను కీలక స్థానాల్లో నియమించి బాధ్యతలు అప్పగించడాన్ని గుర్తుచేశారు. ప్రతి వ్యవస్థలో ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నది కేంద్రం పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. నేడు విద్యాసంస్థలతో పాటు న్యాయవ్యవస్థ, పరిపాలన విభాగాల్లోనూ ఆరెస్సెస్ నేతలు, ప్రచారక్‌లను ఎన్డీఏ ప్రభుత్వం అధికారాలు కట్టబెట్టడం సబబు కాదన్నారు కపిల్ సిబల్. దేశంలోని ప్రతిసంస్థపై కేంద్ర ప్రభుత్వం తమ ప్రభావం ఉండాలని తాపత్రయ పడుతోందని, వాటి సాయంతో మీడియాను, న్యాయవ్యవస్థతను నియంత్రించాలని దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ న్యాయ విభాగంలోనూ ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ప్రచారక్‌లకు బాధ్యతలు అప్పగిస్తే న్యాయవ్యవస్థ చాలా బలహీనం కావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ మెహుల్ చౌక్సీతో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సంబంధాల గురించి స్మృతి స్పష్టతనివ్వాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ముందు సీబీఎస్ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి దృష్టిసారించాలంటూ కపిల్ హితవు పలికిన విషయం తెలిసిందే. -
శిక్షలు తెలిస్తే నేరాలు చేయరు
మాడ్గుల: న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నేరాలపై అవగాహన పెంచుకుంటే తప్పులు చేయడానికి వెనకాడతారని కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సర్పంచ్ వై.వెంకటేశ్వర్లుగౌడ్ అధ్యక్షతన న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ విజ్ఞాన సదస్సులో జడ్జి అర్పితమారంరెడ్డి, అదనపు జడ్జి భవాని, పలువురు న్యాయవాదులు చట్టం, న్యాయం, ధర్మం, బాల్య వివాహాల నిõషేధం, ప్రమాదాల నివారణ, ఇన్సూరెన్స్, రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ఆస్తి తగాదాలు, రిజిస్ట్రేషన్లు, చెక్కులు, ప్రామిసరీ నోటు, జనన, మరణాలపై ప్రజలకు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. ఏ నేరం చేస్తే ఏ శిక్ష పడుతుంది..శిక్షల వల్ల కుటుంబాల జీవన పరిస్థితి ఎలా మారుతుంది..అనే అంశాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు వెంకట్‌నారాయణగౌడ్, న్యాయవాదులు ఏర్పుల రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, జానకిరాములు, వెంకట్‌రెడ్డి, యాదిలాల్, మహేశ్,మల్లేష్, జయంత్, వెంకట్రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో న్యాయ వ్యవస్థ
శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య మన రాజ్యాంగం సున్నితమైన సమతౌల్యం ఉండేటట్టు చేస్తుంది. ఇందులో ఏదీ ఒకదానిని ఒకటి అధిగమించకుండా చూస్తుంది. పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ ఆ చట్టాలను విశ్లేషిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ విధానంలోని మంత్రిమండలి విధానాన్ని మనం స్వీకరించాం. అధికారాల విభజన, న్యాయ సమీక్ష వ్యవస్థను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. రాజ్యాంగ నాలుగో భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల ఆలోచన ఐరిష్ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాత, మన దేశ సామాజిక, మత పరిస్థితులను; అవిద్య, దారిద్య్రం వంటి అంశాలకు అన్వయించుకుంటూ మన రాజ్యాంగ నిర్మాతలు ఒక విస్తృత రాజ్యాంగాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సభ సలహాదారు బీఎన్ రావు, ముసాయిదా సంఘం అధ్యక్షుడు, భారతజాతి రాజ్యాంగ పితగా గౌరవించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ల సేవలను స్మరించుకోవాలి. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పరిరక్షించేందుకుగాను న్యాయమూర్తుల నియామకం గురించి రాజ్యాంగ పరిషత్‌లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి ఆసక్తికరంగా ఉంటుంది. ఉన్నత న్యాయస్థానాలలో జరిగే నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో జరగాలన్నది అందులో ఒకటి. కానీ దీనిని డాక్టర్ అంబేడ్కర్ చాలా గట్టిగా నిరాకరించారు. ప్రధాన న్యాయమూర్తి చాలా సమర్థుడైన వ్యక్తేనని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నప్పటికీ, ఆయనకు కూడా మనుషులందరికీ ఉండే భావాలే ఉంటాయని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని మూడింట రెండువంతుల సభ్యుల అంగీకారం ద్వారా ఖరారు చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కట్టబెట్టాలంటూ మరొక ప్రతిపాదన కూడా వచ్చింది. దీనిని కూడా అంబేడ్కర్ నిరాకరించారు. రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఆ అధికారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంబేడ్కర్ విశ్లేషించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం గురించి ఆర్టికల్ 124(4) వివరిస్తుంది. దీనినే అభిశంసన అని పిలుస్తారు. ఇందుకు పార్లమెంట్ ఉభయ సభలలో మూడింట రెండువంతులకు తగ్గకుండా సభ్యుల మద్దతు ఉండాలి. అలాగే ఓటింగ్ తప్పనిసరి. అనుచిత ప్రవర్తన, అసమర్థత కారణాలుగా వారిని తొలగించడానికి అవకాశం ఉంది. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ రాష్ట్ర గవర్నర్, న్యాయమూర్తిని నియమిస్తున్న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రతించిన తరువాత రాష్ట్రపతి చేపడతారు. హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీరులోనే ఉంటుంది. దీనిని గురించి ఆర్టికల్ 217(1) వివరిస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల తొలగింపు కోసం 1968లో పార్లమెంట్ న్యాయమూర్తుల దర్యాప్తు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం పరిధిలో 1969లో వారి తొలగింపు విధివిధానాలను రూపొందించింది. వందమంది లోక్‌సభ సభ్యులు, లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు స్పీకర్ లేదా చైర్మన్ల వద్ద తొలగింపు కోసం తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. పరిశీలన తరువాత ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ తీర్మానాన్ని కనుక అనుమతిస్తే ఈ అంశాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన ఒక సంఘానికి నివేదిస్తారు. ఇందులో ఒక సభ్యుడిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. ఒకరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. రాజ్యాంగ నిపుణుడని స్పీకర్ లేదా చైర్మన్ భావించిన వ్యక్తిని మూడో సభ్యునిగా ఎంపిక చేస్తారు. ఈ సంఘం దర్యాప్తు పూర్తి చేసి, నివేదిక సమర్పించిన తరువాత సదరు న్యాయమూర్తి దోషి అని తేలితే అప్పుడు తొలగింపు తీర్మానాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. అయితే ఈ పద్ధతి పూర్తిగా నిష్ఫలమైనదని గతానుభవం రుజువు చేసింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత రెండు సందర్భాలలో మాత్రమే న్యాయమూర్తులను అభిశంసించాలని కోరడం జరిగింది. వారు– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామి, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా చటర్జీ. ఇందులో జస్టిస్ రామస్వామి మీద ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానం వీగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. ఇక లోక్‌సభ ఓటింగ్‌కు చేపట్టడానికి ముందే జస్టిస్ సౌమిత్రా చటర్జీ పదవికి రాజీనామా చేశారు. కేశవానందభారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం (ఏఐఆర్ 1973 ఎస్సీ 1461) కేసులో స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటని 13 మంది సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయమూర్తుల నియామకంలో ప్రతిభ కాకుండా మిగిలిన అంశాలు నిర్వహించిన పాత్ర అప్రాధాన్యమైనదని చెప్పలేం. కొన్ని కేసులలో రాజకీయ ప్రమేయం, ప్రాంతీయ, మతపరమైన మనోభావాలు ప్రధానంగా ప్రభావం చూపాయి. ప్రఖ్యాత భారత రాజ్యాంగ వ్యాఖ్యాత గ్రన్విల్లే ఆస్టిన్ కూడా నియామకాలలో పైకి చెప్పని ఉద్దేశాలు ఉన్నాయనే చెప్పారు. కోర్టులలో కేసులు పేరుకు పోవడానికి కారణం తృప్తికరంగా లేని న్యాయమూర్తుల నియామకం కారణమని ఎంసీ సెతల్వాడ్ నాయకత్వంలోని మొదటి లా కమిషన్, భారత మాజీ అటార్నీ జనరల్ అభిప్రాయం. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాలేదు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య వైరుధ్యం పొడసూపినా, లేదా కార్యనిర్వాహక శాఖలోనే అంతర్గత విభేదాలు వచ్చినప్పటికీ వివాదాలు బయటకి పొక్కలేదు. ఇలాంటి చిన్న చిన్న విభేదాలను ఆ విధానం తనలోనే దాచేసుకుంది. న్యాయమూర్తుల నియామకం విధానం 1950 నుంచి 1993 వరకు తృప్తికరంగానే సాగింది. ఈ కాలంలో భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి ఆమోదం లభించని సందర్భాలు ఏడు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1993 (4) ఎస్సీసీ 441) కేసులో జస్టిస్ ఏ ఎం అహ్మదీ ఇచ్చిన మైనారిటీ తీర్పులో ఇందుకు సంబంధించిన గణాంకాలు కనిపిస్తాయి. ఈ కేసునే సెకెండ్ జడ్జస్ కేసు అని పేర్కొంటూ ఉంటారు. జస్టిస్ జేఎస్ వర్మ వివరించిన మేరకు, ఈ తీర్పు ప్రకారం మెజారిటీ విశ్లేషించినదేమిటంటే, న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేయదలిచిన వ్యక్తులలో ప్రతికూల లక్షణాలు ఉంటే వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లడమనే పాత్రకు మాత్రమే కార్యనిర్వాహక వ్యవస్థ పరిమితం కావాలి. దీనితో కార్యనిర్వాహక వ్యవస్థ పాత్ర నిష్ఫలమైంది. కొలీజియం న్యాయమూర్తుల నియామకంలో చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థ అయింది. కొలీజియం సిఫారసులను కొట్టివేసే అధికారం ఏ కోర్టుకు లేదు. కోలీజియం సిఫారసుల మేరకు నియామకాలు జరపడానికే న్యాయ సమీక్షకు ఉన్న అధికారం పరిమితమైంది. న్యాయమూర్తుల నియామకంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కూడా లాంఛనంగా మారింది. కొలీజియం సిఫారసులను కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతికి తెలియ చేస్తే ఆయన నియామకాలు చేపడతారు. ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే సెకెండ్ జడ్జస్ కేసులో మెజారిటీ తీర్పును రచించిన జస్టిస్ జేఎస్ వర్మ తరువాత తన అభిప్రాయం మార్చుకున్నారు. న్యాయమూర్తుల నియామకాలను జాతీయ జ్యుడీషియల్ కమిషన్ చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి/ప్రధాని/ భారత ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఇందులో సభ్యులుగా ఉండాలని ఆయన చెప్పారు. అసలు ఎలాంటి న్యాయమూర్తులు దేశానికి కావాలి? రాజ్యాంగ పరిషత్‌లో ప్రసంగించినప్పుడు నెహ్రూ, ఆ న్యాయమూర్తులు అత్యంత విజ్ఞానవంతులు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజాస్వామిక దేశంలోను పాలన పాలించేవారి అనుమతితో సాగుతుంది. అమెరికాలో న్యాయమూర్తుల నియామకానికి సెనేట్ ఆమోదం అనివార్యం. కానీ ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా దూరంగా ఉండిపోయింది. దీనితో జవాబుదారీ తనం గురించిన ప్రశ్న తలెత్తింది. పార్లమెంట్ చేసిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టం, 2014 దీని ఫలితమే. దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు వ్యతిరేకించారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థదే పై చేయి అన్న సంగతి సెకెండ్ జడ్జస్ కేసుతోనే నిర్ధారణ అయిందని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ గోయెల్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మెజారిటీ తీర్పులో పునరుద్ఘాటించారు. కొలీజియం పని విధానాన్ని మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించవలసిందని కోరుతూ 16–12–2015న రాజ్యాంగ ధర్మాసనం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరారు. ఈ సలహాలను గ్రంథస్థం చేయడానికి ఒక సంఘాన్ని కూడా నియమించారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ఈ వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోవాలని భావించారు. అవి– అర్హత ప్రమాణం, నియామక విధానంలో పారదర్శకత, సరైన విధాన అవగాహన నిర్వహణకు ఒక సచివాలయం ఏర్పాటు. అయితే కొలీజియం వ్యవహార సరళి, ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కొలీజియం సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ భారత ప్రధాన న్యాయమూర్తికి సెప్టెంబర్, 2016లో ఒక లేఖ రాశారు. దేశంలో సాగుతున్న పాలన, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సున్నిత సమతౌల్యం మీద అది చూపుతున్న ప్రభావం గురించి కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ఆ లేఖ లేవనెత్తింది. పత్రికలలో వెలుగు చూసిన మేరకు ఆ లేఖలో ఆయన కొలీజియం పద్ధతి పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. అయితే ఆ న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలను పరిష్కరించారో లేదో మాత్రం తెలియదు. కొలీజియం వ్యవహారాలేవీ ప్రజలకు తెలియవు. ఆఖరికి కొలీజియంలో సభ్యులు కాని ఉన్నత న్యాయమూర్తులకు కూడా అక్కడ జరిగిన చర్చల వివరాలు తెలియవు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు, కొలీజియంలో కూడా సభ్యులు అయిన జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు 12–1–2018న విలేకరుల సమావేశంలో గళం విప్పడం దేశంలో సంచలనమైంది. ఈ నలుగురిలో సీనియర్ చలమేశ్వర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో జస్టిస్ గొగొయ్ తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నవారు. ఆ నలుగురు రెండు మాసాల క్రితం ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడిగా రాసిన లేఖ ప్రతిని కూడా విలేకరులకు అందించారు. కొలీజియం వ్యవస్థలోని దోషాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సహేతుకత లేకుండా కేసులను ధర్మాసనాలకు కేటాయిస్తున్న తీరును గురించే వారు ప్రధానంగా లేఖలో ఆరోపణలు చేశారు. ఆ తరువాత కూడా కొన్ని పరిణామాలు జరిగాయి. సీపీఐ నాయకుడు డి. రాజా వెళ్లి చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకోవడం గురించి కొన్ని పత్రికలు విమర్శించాయి. ఆ తరువాత అసలు న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇంకా సీపీఎం నాయకుడు యేచూరి ఉన్నత న్యాయస్థానంలో పనితీరు దిగజారడం, న్యాయమూర్తుల మధ్య విభేదాల గురించి గళమెత్తడంతో అసలు ప్రధాన న్యాయమూర్తి మీద అభిశంసన తీసుకురావడానికి సంకేతమనే అనుమానాలు కలిగించింది. (27–1–2018న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ మేధావుల ఫోరమ్ సభలో చదివిన ఉపన్యాసం) జస్టిస్ ఎం.ఎన్. రావ్ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి -
రాజకీయ పడగ నీడలో న్యాయవ్యవస్థ
హైదరాబాద్ : రాజకీయ పడగ నీడలో న్యాయ వ్యవస్థ ఉందని, అందుకే నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సాక్షిగా బహిరంగంగా ప్రజల ముందుకు రావడం దేశంలో మొదటిసారిగా జరిగిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శనివారం హైదరాబాద్ హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్ర చివరి దశలో ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఉన్నత న్యాయస్థానంపై విశ్వాసం కోల్పోకూడదని న్యాయవాదులు మీడియా ముందుకు వచ్చారని.. ఈ చర్యను పౌరహక్కుల సంఘం స్వాగతిస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు కోర్టు ప్రధాన న్యాయముర్తిగా సీనియర్‌ను నియమిస్తారన్నారు. ప్రభుత్వానికి అనుకూలమైన జడ్జీలను నియమించడం ద్వారా సీనియర్ జడ్జీలను పక్కన పెడుతూ కోర్టు సంప్రదాయాలను పాటించడం లేదన్నారు. సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు ముంబై హైకోర్టులో విచారణ జరుగుతుండగా దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేసి తనకు అనుకూలమైన జడ్జీలతో బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని బొంబాయి హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాదులు తప్పుబడుతున్నారని ఆయన వివరించారు. పౌరహక్కుల సంఘం ప్రతినిధి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ... రాజకీయాలకతీతంగా న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. దీపక్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీఎల్సీ ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. రఘునాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జెల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థలో సంక్షోభం ఇంకా సమసిపోలేదు
-
మూడురోజుల్లో పరిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ ఆరోపణల నేపథ్యంలో న్యాయవ్యవస్థలో నెలకొన్న సంక్షోభం ఇంకా సమసిపోలేదు. ‘న్యాయవ్యవస్థలో ముందుకొచ్చిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు..రెండు మూడు రోజుల్లో న్యాయమూర్తుల మధ్య పొడసూపిన విభేదాలు పరిష్కారమవుతా’యని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ వారాంతంలో సంక్షోభం సమసిపోతుందని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చెప్పారు. ఇక కీలక కేసులను విచారించే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు రెబెల్ జడ్జీలకు చోటుకల్పించకపోవడంతో సమస్యకు పరిష్కారం లభించలేదని వెల్లడైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు బాహాటంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసుల కేటాయింపు సవ్యంగా జరగడం లేదని, సుప్రీం కోర్టులో పరిస్థితి సరిగా లేదని వారు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
అంతర్గత చర్చ అవసరం కాదా?
జాతిహితం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలలో నమ్మకం చారిత్రకంగానే అట్టడుగు స్థాయిలో ఉండగా.. న్యాయ వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైన సంస్థగా నిలుస్తోంది. న్యాయవ్యవస్థలో ఏ లోపాలున్నా మన ప్రజలు మాత్రం అది న్యాయం చేస్తుందని నమ్ముతున్నారు. ప్రజలలో ఉన్న ఈ విశ్వాసాన్ని పరిరక్షించుకుని, మరింతగా విస్తరింపజేసుకునేట్టు చేయడం ఎలాగని మన అత్యున్నత న్యాయవ్యవస్థ లోతైన అంతర్గత చర్చను సాగించాలి. పరిపాలనలో అతి తరచుగా జోక్యం చేసుకోవడం ప్రతిష్టను కాపాడుకునే ఉత్తమ మార్గం అవుతుందా? చచ్చేటంత విసుగెత్తించే రాజకీయాల నుంచి తరచుగా నేను క్రికెట్లోకి జారు కుంటూ ఉంటాను. మన న్యాయ వ్యవస్థ గురించి వ్యాఖ్యానించాల్సి వచ్చిన ప్పుడు సినిమా సంగీతాన్ని అందులోకి చొప్పించడమూ చేస్తుంటాను. ప్రత్యే కించి సుప్రసిద్ధ సినీ గేయ రచయిత ఆనంద్ బక్షీ వర్థంతి (మార్చి 30) సంద ర్భంగా ఇది రాస్తున్నాను కాబట్టి. మన న్యాయ వ్యవస్థతో పాటూ బక్షీ శకాన్ని గురించి ఒకే సమయంలో ఆలోచిస్తుంటే, నాకు ఆయన రాసిన ఒక గేయ చరణాలు గుర్తుకు వస్తు న్నాయి. 1969లో విడుదలైన దో భాయ్ చిత్రంలో అశోక్ కుమార్, జితేంద్ర– మాలాసిన్హా నటించారు. అందులో అశోక్ కుమార్, జితేంద్ర అన్నదమ్ములు. ఒకరు న్యాయమూర్తి, మరొకరు పోలీసు అధికారి. ఇక మిగతా కథంతా ఊహించి చెప్పేయ గలిగిందే. తమ్ముడ్ని శిక్షించడమా లేక క్షమించడమా? అనే సందిగ్ధంలో పడతాడు అన్న. ‘‘ఇస్ దునియా మెయ్ ఓ దునియావాలో, బదా ముష్కిల్ హై ఇన్సాఫ్ కర్నా/బడా ఆసాన్ హై దేనా సజాయేం, బడా ముష్కిల్ హై రపర్ మాఫ్ కర్నా’’ (క్షమించడం కంటే శిక్షించడం చాలా సులువైనప్పుడు న్యాయమూర్తిగా ఉండటం చాలా కష్టం అని సంక్షిప్తార్థం). ఆనంద్ బక్షీ రాసిన ఈ గేయాన్ని మహ్మద్ రఫీ పాడారు. న్యాయమూర్తితో పోలిస్తే సంపాదకుని జీవితం ఎన్నో యోజనాలు దిగు వన ఉంటుంది. అయినా మా జీవితాలకు కూడా అదే తర్కం వర్తిస్తుంది. ప్రచురించకుండా ఆపి, అందుకు కారణాలను వివరించడం కంటే ప్రచురించి బాధపడటం తేలిక. ఒక సంచలనాత్మక కథనాన్ని, అది కొంత నమ్మదగినదిగా లేనంత మాత్రాన ప్రచురించకుండా వదిలేసేవాడు తెగువలేని సంపాదకుడు మాత్రమే. నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నది 1998 శీతాకాలం నాటి భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన కథనాన్ని గురించి. కొందరు వివేక వంతులు, గౌరవనీయులైన వ్యక్తులు నాపై ఉంచిన నమ్మకాన్ని 20 ఏళ్ల తర్వాత వమ్ము చేసి వారి పేర్లను వెల్లడి చేయాల్సి వస్తోంది. అందుకు నాకున్న కారణాలను వారు అర్థం చేసుకుంటారు, మన్నిస్తారు. న్యాయమూర్తిపై సంపాదక సందిగ్ధం అప్పుడే ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన జస్టిస్ ఏఎస్ ఆనంద్ గత జీవితంపై మంచి దిట్టౖయెన మా న్యాయ సంపాదకుడు క్షుణ్ణ మైన దర్యాప్తును చేపట్టారు. అది జస్టిస్ ఆనంద్‌ను ప్రయోజనాల సంఘ ర్షణను విస్మరించిన వారిగా, కానుకల విషయంలో పారదర్శకత పాటించని వారుగా, తన భూముల భాగస్వామ్య కౌలుదారులతో నిజాయితీలేకుండా ప్రవర్తించిన వారిగా చిత్రిస్తుంది. ఆ కథనాన్ని సాధ్యమైనంత అతి సూక్ష్మ వివరాలు సైతం ఉన్నదిగా రూపొందించే క్రమంలో అది ఎన్నోసార్లు మార్పులు, చేర్పులకు గురైంది. ఆ కథనాన్ని ప్రచురించే విషయమై 12 మంది అగ్రశ్రేణి న్యాయవాదు లలో దాదాపు 10 మంది సలహాలను నేనే స్వయంగా తీసుకున్నాననుకోండి. అంత గొప్ప కథనాన్ని ప్రచురించాలా, వద్దా అనే విషయంలో తీర్పు 2:8 నిష్పత్తిలో వచ్చింది. ప్రచురించవద్దన్న 8 మంది అభ్యంతరాలు పూర్తిగా న్యాయపరమైనవిగానీ లేదా వాస్తవాలకు సంబంధించినవిగానీ కావు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, చివరకు అమాయకులను బాధపెట్టి, మన అతి గొప్ప సంస్థకు నష్టం కలుగజేయడంగా ఇది ముగియకుండా చూడంyì . ఇదే వారి సలహా. ఇక ప్రచురించమన్న ఇద్దరిలో ఒకరు వాస్తవాలు వాస్తవాలే, ఇక మరే తర్కమూ పనిచేయదు అంటే, మరొకరిది మహోత్సాహం. ఆ న్యాయ మూర్తి మనల్ని ఏం చేస్తారు, కోర్టు ధిక్కారం నేరం మోపి చావగొడతారా? అని ఆయనను అడిగాను. అలాంటిదేమీ చేయరు, ఆయన చేయగలిగిందే మైనా ఉంటే అది ఆత్మహత్య చేసుకోవడమే అన్నారు. ఆ సమాధానం మమ్మల్ని కుదిపి పారేసింది. భారత న్యాయ వ్యవస్థలోని అత్యంత సుప్రసి ద్ధులైన ఆ న్యాయవాది అనాలోచితంగానే... మేం ఏం చేయాలని యోచిస్తు న్నామో దాని ప్రాధాన్యం స్ఫురించేలా చేశారు. మా కథనంలోని ప్రతి వాక్యాన్ని తిరిగి చదివాం. అందులో ఒకే ఒక్క అంశం లోపించింది. అది జస్టిస్ ఆనంద్ ప్రతిస్పందన. ఆయన కార్యాలయంతో మేం జరిపిన సంప్ర దింపులన్నిటికీ ఆయన ప్రధాన న్యాయమూర్తి కావడం వల్ల మీడియాతో మాట్లాడరనే సమాధానం వచ్చింది. కాబట్టి మా వద్ద రుజువులు ఉన్నట్టే. తుస్సుమన్న సంచలనాత్మక కథనం అప్పుడు నేను గొప్పగా గౌరవించే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు నన్ను సంప్రదించారు. వారు, సుష్మా స్వరాజ్, అరుణ్ శౌరి. వారిద్దరూ నాటి వాజ పేయి ప్రభుత్వంలో మంత్రులు. ఇద్దరికీ చాలా కాలంగా జస్టిస్ ఆనంద్‌తో, ఆయన కుటుంబంతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఆయన ఏదైనా నిజా యితీ లోపించిన పని చేసి ఉంటారనే విషయాన్ని వారిద్దరూ ఏ మాత్రమూ అంగీకరించలేదు. మేం ఈ కథనాన్ని ప్రచురించడం కోసం ఇప్పటికే తగినంత కాలం వేచి చూశామని, ఇంకా దాన్ని దాచి ఉం^è డం సాధ్యం కాదని వారికి చెప్పాను. మేం పేర్కొన్న వాస్తవాలు తప్పయితే జస్టిస్ ఆనందే మమ్మల్ని ఆ విషయంలో ఒప్పించాలి. సుష్మా స్వరాజ్ ఒక సూచన చేశారు. నన్ను ఆయనకు ఓ సారి ఫోన్ చేయమన్నారు, నేనా పని చేశాను. ఆయన నన్ను నా వద్ద ఉన్న వాస్తవాల ఆధారాలను తీసుకుని రమ్మన్నారు. అయితే మా సంభాషణ జనాంతికంగానే జరుగుతుంది. ఆ తర్వాత జరిగింది సంక్షిప్తంగా ఇది. అనుమానం, ఆదరణ కలగలిసిన భావనతో ఆయన నన్ను ఆహ్వానించారు. ప్రతి ఆరోపణ గురించి మేం గంటల తరబడి చర్చించాం. ఆయన ఒక లెదర్ బ్రీఫ్ కేసు నిండా ఉన్న పత్రాలు, ట్యాక్స్ రిటర్నులు, రాసి ఉంచుకున్న చిట్టీలు, వరి అమ్మకం వల్ల వచ్చిన రాబడుల రసీదులు, తన పిల్లల పెళ్లి శుభలేఖలు, ఆయన కోర్టులకు, ట్యాక్స్ అధికారులకు సమర్పించిన పెళ్లిళ్లకు వచ్చిన నగదు కానుకల పద్దుల పుస్తకాలను చూపారు. ఆయన చూపిన ‘‘వాస్తవాల’’న్నిటి చుట్టూ తిరిగాను. అదీ ఇదీ ఇంకా చాలానే తిరగేశా. చూడబోతే ఆయన వద్ద అన్నిటికీ ఒప్పించ గలిగిన సమాధానాలు ఉన్నట్టే ఉంది. చివరకు నికరంగా ఒకే ఒక్కటి లెక్కకు రానిది తేలింది. అది చాలా ఏళ్ల క్రితం ఆరు అర బస్తాల వరి ధాన్యం విలువ. అది నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువేమీ కాదు. కాబట్టి అది పద్దుల పరమైన పొరపాటుగా పోయేదే. దీంతో నా గాలంతా తీసేసినట్టయింది. దీనిలో మా జీవితకాలపు రహస్య కథనం ఏదో ఉన్నదని మేం అనుకున్నాం. తీరా చూస్తే మా ఉత్సాహంపై నీళ్లు చల్లే వాస్తవాలు ముందుకు వచ్చాయి. సందేహాస్పదమైన ఆరు అర బస్తాల వరి ధాన్యం లావాదేవీ కోసం ప్రధాన న్యాయమూర్తిని ఏ దినపత్రికా తప్పు పట్టలేదు. జస్టిస్ ఆనంద్‌తో కలసి గంటల తరబడి గడిపిన ఇద్దరికీ బాధాకరమైన ఆ సమయంలో ఒక్క „ý ణం ముద్ర నా మదిలో అలాగే నిలిచిపోయింది. దాన్ని ప్రస్తావిస్తున్నందుకు ఆయన క్షమిస్తారనే అనుకుంటున్నా. ప్రతి వాస్తవాన్ని మీ ముందుంచాను, భారత ప్రధాన న్యాయమూర్తినైన నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను... అయినా మీరు మీ కథనాన్ని ప్రచురించి నన్ను మాత్రమే కాదు, ఇంతటి గొప్ప సంస్థను కూడా గాయపరుస్తారా? అని అడిగారు. జస్టిస్ ఆనంద్, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నందుకు మన్నించండి... ఆ మాటలు అంటున్నప్పుడు చెమ్మగిల్లిన మీ కళ్లను నేను తత్త రపడుతూ, భీతావహుడినై చూశాను. ఆ కథనం గొంతు నులిమేశాం. నా వృత్తి జీవితంలో అలాంటి అతి కొన్ని సందర్భాలలో అదే అత్యంత బాధాకరమైనది. ఈ విషయంపై నేను తగినం తగా తిరిగి ఆలోచించలేదు. ఇదే గనుక ఒక రాజకీయవేత్త విషయంలో ఇంత ఓపికగా, ఇంత నిష్పక్షపాతంగా, అన్నిటికీ మించి ఇలా స్వీయ ప్రయోజన నిరాకరణతో వ్యవహరించేవారమా? ప్రధాన న్యాయమూర్తి కథనాన్ని తెలు సుకోవడానికి అంత సుదీర్ఘంగా వేచి చూడటానికి కారణం.. అది మనం ఎంతగానో గౌరవించే సంస్థకు సంబంధించినది కావడమే. మన స్వేచ్ఛలలో దేనికి ముప్పు వాటిల్లినా ఆశ్రయించే సంస్థను ఏమాత్రమూ దిగజార్చరాదనే. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేదెలా? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలలో నమ్మకం చారిత్రకంగానే అట్టడుగు స్థాయిలో ఉండగా.. న్యాయ వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైన సంస్థగా నిలుస్తోంది. మన న్యాయ వ్యవస్థలో లోపాలున్నా, కోర్టులు ఎంత అధ్వా నంగా ఉన్నా... ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకరు మరొకరితో ఏమంటారు? నీ సంగతి కోర్టులోనే తేల్చుకుంటాననే. న్యాయవ్యవస్థలో ఏ లోపాలున్నా ప్రజలు మాత్రం అది న్యాయం చేస్తుందని నమ్ముతారు. ఈ కారణాలన్నిటి రీత్యా, ప్రజలలో ఉన్న ఈ విశ్వాసాన్ని, సామాజిక ఒప్పందాన్ని కాపాడుకుని, మరింతగా అది విస్తరించేట్టు చేయడం ఎలా అని మన అత్యున్నత న్యాయవ్యవస్థ లోతైన అంతర్గత చర్చను సాగించాలి. పరిపాలనా రంగంలో అతి తరచుగా జోక్యం చేసుకోవడం ఈ ప్రతిష్టను కాపా డుకునే ఉత్తమ మార్గం అవుతుందా? పాలనాపరమైన సమస్యల నుంచి వాయు కాలుష్యం, అక్రమ కట్టడాలు, క్రికెట్ వరకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో సాధికారిక కమిటీలను ఏర్పాటు చేయడమనే భావన.. న్యాయ నిఘావాదం నుంచి ఎంత దూరంగా వచ్చేసింది? ఆగ్రహంతో మాట్లాడటం, చర్యలు చేపట్టడం నాయ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందా? పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో 70 శాతం మంది ఏదో ఒక ప్రభుత్వ ట్రిబ్యునల్‌లో లేదా కోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో స్థానం పొందుతున్నారని అంచనా. అది చర్చనీయాంశం కాదా? దాని నుంచి తేలే నిర్ధారణ పదవీ విరమణ వయస్సును 70 ఏళ్లకు పెంచాలనే అయినా దాన్ని నేను సమర్థిస్తా. హైకోర్టు న్యాయమూర్తులు 60 ఏళ్లకు, సుప్రీం న్యాయ మూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణచేయడం అంటే అది మరీ త్వరగానే లెక్క. పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ కావడం సమం జసమేనా? చర్చించరాని సున్నితమైన విషయం అంటూ ఏదీ లేదు. ఇది ఇంతటి కీలకమైన, విలువైన సంస్థ కాబట్టే సంపాదకులమైన మేము ఒక సంచలనాత్మక క£ý నం ప్రచురణపై వారాల తరబడి తర్జనబర్జనలు సాగించి, దాని గొంతు నులిమి పారేశాం. అది, దివంగత ఆనంద్ బక్షీ గీతంలో వర్ణించి నంతటి కష్టభరితమైన నిర్ణయం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
న్యాయాన్ని నమ్మడమే పరిష్కారం
రెండో మాట దేశ ప్రజలు ధైర్యంగా ఒక్కుమ్మడిగా అవినీతి వ్యవస్థను విముక్తం చేయడానికి ముందుకు రావాలంటూ జస్టిస్ అమితవ్ రాయ్ చేసిన విజ్ఞాపన ఉదారమైనదే కావచ్చు. కానీ అవినీతి పిశాచంతో చేతులు కలిపిన పాలక శక్తులు పెట్టుబడిదారీ వ్యవస్థను సాకుతున్నంతకాలం జస్టిస్ రాయ్ వేదన అరణ్యరోదనే. అందాకా, ఆదర్శవంతమైన సామాజిక వ్యవస్థను ఆవిష్కరించుకోలేం. సెక్యులర్ వ్యవస్థ రక్షణకు రాజ్యాంగబద్ధమైన జాగ్రత్తలను పాటించకుండా ఉన్నంతకాలం ఫాసిస్టు శక్తులు విజృంభిస్తూనే ఉంటాయి. ‘ఫాసిస్టు ప్రభుత్వాలు, పాలకులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికి వెన్నుదన్నుగా కొన్ని పారా మిలటరీ శక్తులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే నిరంకుశ పాలకుల, నాయకుల ధోరణులకూ, విధానాలకూ ప్రజలు సకాలంలో స్పందించి అంకుశం మాదిరిగా గళం విప్పి నిరసన తెలపరో, అప్పుడు పాల కులూ, నాయకులూ నల్లేరు మీద బండి నడకలా తమ నియంతృత్వాన్ని కొన సాగించడానికే సాహసిస్తారు. అధికారపు అహంకారం అనేది ఒక శారీరక, మానసిక బలహీనతతో కూడిన రోగం. ఎదుటివారిపైన నిష్కారణంగా విరుచు కుపడడం, హాని తలపెట్టడం వీరి ప్రత్యేక రోగ లక్షణం.’ - ప్రొఫెసర్ అకీల్ బిల్గ్రామి (కొలంబియా విశ్వవిద్యాలయ ఆచార్యులు. 18–2–17న హైదరాబాద్ కలెక్టివ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారత్‌లో ఫాసిజం ప్రమాదం అన్న అంశంపై అకీల్ ఇచ్చిన ప్రసంగంలోని మాటలు) బిల్గ్రామి ప్రస్తావించిన ఈ ‘రోగ లక్షణం’ క్రమంగా భారత పాలకులలో కూడా ఎలా తొలుచుకు వెళుతోందో జయలలిత, శశికళ పైన మోపిన భారీ అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 570 పేజీల తీర్పుతో రూఢీ అయింది. ఒక అవినీతికర ప్రభుత్వ పాలనలో వ్యక్తిగత స్థాయిలో జరిగిందని భావిస్తున్న ఈ కేసు మీద తుది తీర్పు రావడానికీ, శిక్షలు ఖరారు కావడానికీ జరిగిన జాప్యం అంతులేనివి. అంటే రెండు దశాబ్దాలు. అంటే అటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, ఇటు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ హయాం లలో పాలకులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించారు. అంతేకాదు, దేశ గౌరవ న్యాయ వ్యవస్థ మెడలు వంచి తమకు అనుకూల నిర్ణయాలు రాబట్టు కోవడానికి పరోక్షంగా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థకు పెద్దపీట జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నకాలంలోనే ముంద్రా జీపుల కుంభ కోణంలోను, అనంతర కాలాలలో కాంగ్రెస్ మంత్రి సుఖ్రామ్ అవినీతి వ్యవహారంలోను శిక్షలు పడ్డాయి. ప్రభుత్వ, శాసన, న్యాయ వ్యవస్థలకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేందుకు ఉన్న అధికార పరిధులను స్పష్టంగానే వివరించినప్పటికీ, ప్రత్యేకించి న్యాయ వ్యవస్థకు మాత్రం శాసన విభాగ నిర్ణయాలను సమీక్షించి వ్యాఖ్యానించే హక్కును రాజ్యాంగం కల్పించింది. అయినా పరస్పర ఉల్లంఘనలు తప్పడం లేదు. ఇందుకు ఎన్నో కారణాలు. రాజ్యాంగ లక్ష్యాలకు దూరంగా జరిగి, సెక్యులర్ వ్యవస్థ మౌలిక స్వభావాన్ని కాపాడి దేశ సమైక్యతను రక్షించడంలో పాలకులు, రాజకీయవేత్తలు ఎప్పు డైతే ప్రజా వ్యతిరేక ధోరణులకు పాల్పడినారో అప్పుడే మిగతా రాజ్యాంగ విభాగాలన్నీ కలుషితమైనాయి. పరస్పర ఉల్లంఘనలకు ఇదొక ముఖ్య కారణం. ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ తొలిసారిగా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి చేసిన ప్రయోగం దాని ప్రభావమే కూడా. ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రయోగం మొద లైంది. అంతవరకు న్యాయ వ్యవస్థ పరువును కాపాడుతూ వస్తున్న తీర్పులు ప్రజలలో న్యాయమూర్తుల గౌరవాన్ని ఇనుమడింపచేసేవి. న్యాయ వ్యవ స్థలోని ఈ సమతుల్యతనే ఇందిరాగాంధీ స్వార్థ ప్రయోజనాల కోసం చెడ గొడుతూ వచ్చారు. సుప్రీంకోర్టు నియామకాలలో కూడా సీనియారిటీనీ, ప్రతిభనీ తొక్కిపెట్టి విధేయతకి పెద్ద పీట వేయడంతో అత్యున్నత న్యాయ స్థానం తీర్పులు కూడా పెక్కు సందర్భాలలో ఆరోపణలకు గురికావలసి వచ్చింది. రాజకీయ పరిధిలో జరిగిన కొన్ని నిర్ణయాలు న్యాయమూర్తులలో గుబులుకీ, అనిశ్చితికీ దోహదం చేశాయి. నేటి ప్రధాని మోదీ పాలనలో కూడా ఇదే పరిస్థితి. పాలకశక్తుల లోపాయికారీ ఒత్తిళ్లకూ, సన్నాయి నొక్కు లకూ న్యాయ వ్యవస్థే కాదు; సమాచార హక్కు చట్టం కూడా బలహీన మవుతోంది. ఏలిన వారి కనుసన్నలలో ఉన్నందువల్లనే న్యాయవ్యవస్థ బిక్కు బిక్కుమంటూ తీర్పులు ఇవ్వవలసి వస్తున్నది. ప్రజా చైతన్యమే సమాధానం జయలలిత, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు (14–2–17) వెలువరించిన సందర్భంగా ధర్మాసనంలోని సభ్యులు జస్టిస్ అమితవ్ రాయ్, ‘దేశంలో అల్లుకుపోతున్న అవినీతి కుంభకోణాలపై పౌరులు ధ్వజమెత్తి సమర శంఖం పూరించవలసిన అవసరా’న్ని హెచ్చరించారు. ఈ హెచ్చరికకు మద్దతుగానే అకీల్ బిల్గ్రామి వ్యాఖ్యానించారని అర్థం చేసుకోవాలి. జస్టిస్ రాయ్ హెచ్చ రిక ప్రశంసార్హమే. కానీ న్యాయమూర్తులకూ, పాలకశక్తులకూ స్ఫురించవల సిన మొదటి సత్యం–పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్వహిస్తున్న నామమాత్రపు ప్రజాస్వామ్యంలో అట్టడుగు పేదవాడి కన్నీటిబొట్టును తుడిచే వరకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలన్న మాటలు నీటి మూటలేనని గమనించాలి. అసలు రాజకీయ అవినీతి ఏ స్థాయిలో పరిఢవిల్లుతున్నదో తెలియచేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన ఫిర్యాదు (25–10–16)లో ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు ఉన్నా యని పత్రికలు పేర్కొన్నాయి. అయితే రెండేళ్లుగా ఈ ఫైల్‌పై విచార ణ జరపకుండా కేంద్ర నేర విచారణ సంస్థ (సీబీఐ) కాలక్షేపం చేస్తోందని కూడా పత్రికలు ఆరోపించాయి. ఈ విషయాలను ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ (పేరు ప్రఖ్యాతులు ఉన్న సామాజిక కార్యకర్తలు) నిర్వహిస్తున్న ‘స్వరాజ్ ఇండియా’ ప్రకటించింది. అయినా పాలకులకూ, న్యాయస్థానా లకూ ఉలుకు లేదు, పలుకు లేదు. 2014 నవంబర్‌లో ఢిల్లీ, నోయిడాలలోని ‘సహారా ఇండియా’ గ్రూపు కార్యాలయాలలో జరిపిన దాడులలో అధికార పార్టీ నేతలకు ముట్టిన కోట్లాది భారీ లంచాల గుట్టు బయట పడిందని వచ్చిన వార్తలపై ఇంతవరకు అతీగతీ తెలియదు. ఇక న్యాయవృత్తి నుంచి, న్యాయమూర్తుల దాకా ఈ అవినీతి ఎలా పాకిందో వీఆర్ కృష్ణయ్యర్ స్వీయ రచనల సంకలనం ‘లీగల్ స్పెక్ట్రమ్’లో పేర్కొన్న అంశాలను ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన (7.12.09) అఫిడవిట్లో ఉదహరించారు. సుప్రీంకోర్టుకు చెందిన 16మంది ప్రధాన న్యాయమూర్తులలో 8మంది (అంటే సగంమంది) ఎలా అవినీతికి ఒడిగట్టారో సాక్ష్యాధారాలతో ఆ అఫిడవిట్ సమర్పించారు. ఈ అఫిడవి ట్పైన, మొత్తం జ్యుడీషియరీ నైతికస్థాయిపైన అత్యున్నత స్థాయి (హైపవర్) కమిషన్ చేత విచారణ జరిపితే ఫలితం దిగ్భ్రాంతి కల్గిస్తుందని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల సామాజిక ప్రతిపత్తి, నైతిక సంస్కృతి, స్వతంత్రంగా వ్యవహరించగల ధైర్యమూ అథమస్థాయిలో ఉన్నప్పుడు విప్లవకరమైన మార్పులు అసంభవం అన్నారాయన. అయితే ప్రశాంత్ భూషణ్ ఆరోపణలను సుప్రీంకోర్టు న్యాయస్థాన ధిక్కరణగా భావించింది. నిజానికి, ‘నా ఉద్దేశంలో సుప్రీంకోర్టులో ఇంతవరకూ అధిష్టిం చిన 17మంది ప్రధాన న్యాయమూర్తులలో 16మంది అవినీతిపరులేనని డాక్యుమెంటరీ రూపంలో సాక్ష్యాల ఆధారంగా, ఘటనా సాక్ష్యాలు ఆధా రంగా ఇది తేలిందని కూడా కృష్ణయ్యర్ నమోదు చేశారు. కాగా, ప్రజలు, వారికి అండగా నిలిచిన ప్రసిద్ధ న్యాయవాదులు కలసి ప్రజా ప్రయోజన వ్యాజ్య హక్కును సాధించుకున్నా, అది బీజేపీ పాలనలో క్రమంగా నీరు గారిపోవటం చూస్తున్నాం. సమాచార హక్కు చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్న ఉదాహరణలూ కనపడుతున్నాయి. దేశ ప్రజలు ధైర్యంగా ఒక్కు మ్మడిగా అవినీతి వ్యవస్థను విముక్తం చేయడానికి ముందుకు రావాలంటూ జస్టిస్ అమితవ్ రాయ్ చేసిన విజ్ఞాపన ఉదారమైనదే కావచ్చు. కానీ అవినీతి పిశాచంతో చేతులు కలిపిన పాలక శక్తులు ‘ప్రజాస్వామ్యం’ ముసుగులో పెట్టుబడిదారీ వ్యవస్థను సాకుతున్నంతకాలం జస్టిస్ రాయ్ వేదన అరణ్యరో దనే. అందాకా, ఆదర్శవంతమైన సామాజిక వ్యవస్థను ఆవిష్కరించుకోలేం. సెక్యులర్ వ్యవస్థ రక్షణకు రాజ్యాంగబద్ధమైన అన్ని జాగ్రత్తలను తు.చ. తప్పకుండా పాటించకుండా ఉన్నంతకాలం ఫాసిస్టు శక్తులు విజృంభిస్తూనే ఉంటాయి. రాజ్యాంగ వ్యవస్థ ఆచరణలో లక్ష్యాలకు దూరమవుతూ ఉంటే ఆ తప్పు, ఆ పాపం అమలు జరపాల్సిన నాయకులదేగానీ రాజ్యాంగానిది కాదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పలుమార్లు హెచ్చరించింది కూడా ఇందుకే. అందని న్యాయం తిండి, బట్ట, ఉపాధి, నివాస యోగ్యతకు రాజ్యాంగం పూచీ పడినప్పటికీ నేటి వాస్తవం ఏమిటి? దేశరక్షణలో అనేక త్యాగాలు చేసిన రిటైర్డ్ సైనికులు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా తమకు నాసికరం రేషన్లు అందజేస్తున్నారని ఫిర్యాదు చేసిన సంగతి వింటున్నాం. సరిహద్దు భద్రతా దళానికి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ భార్య ఫిర్యాదు చేసి, దాన్ని వీడియో పోస్ట్ చేసింది. ఢిల్లీ హైకోర్టును ఆమె (10.02.17) ఆశ్రయిస్తే తక్షణం నివేదిక ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయానికి కోర్టు నోటీసు పంపింది. ఈ లోగా తన భర్త కన్పించడం లేదని తేజ్ బహదూర్ భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసింది. మాజీ సైనికులకు అకస్మాత్తుగా నాసిరకం రేషన్లు సరఫరా కావడానికీ, బీజేపీకి సన్నిహితుడైన బాబా రామ్‌దేవ్ ‘పతం జలి’ ఆయుర్వేద సరుకును బీఎస్ఎఫ్ కేంద్రాలున్నచోట 12 దుకాణాలకు ఉరికించి సొమ్ము చేసుకోడానికీ ఏమైనా సంబంధం ఉందా అన్నది అసలు ప్రశ్న. ఈయనా ఆదాయపన్ను భారీగా ఎగ్గొట్టిన ‘పెద్దల’లో ఒకరేనని వార్తలు వెలువడ్డాయి. రామ్‌దేవ్ కంపెనీ తన మొదటి రేషన్ సరుకుల షాపును ప్రారంభించింది బీఎస్ఎఫ్ క్యాంపులోనే (9.2.17). మరో విశేషం– ‘తాడుతోనే దబ్బనం’ కూడా పాకిపోయినట్టుగా హరిద్వార్ కేంద్రంగా రామ్ దేవ్ స్థాపించిన ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ కంపెనీ సరిహద్దు భద్రతా సైనికుల భార్యల సంక్షేమ సంఘంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చు కోవటం. కేంద్రం బాటలోనే ఏపీ సీఎం బాబు కూడా ఫాసిస్టు బాటలో రాష్ట్రంలో ‘తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఎప్పటికీ అధికారంలో ఉంటూ ప్రతి పక్షాలకు తావులేని పరిస్థితిని కల్పించా’లని కొత్త సందేశం వినిపించారు. అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ అని ఉంటారు: ‘ప్రజాస్వామ్యంలో అంత ర్భాగం–అధికార వికేంద్రీకరణ. ఢిల్లీ కేంద్ర స్వార్థ ప్రయోజనాలకు ప్రజా స్వామ్యం చుక్కెదురు. ప్రజలు మేల్కోవాలి. రాజ్యాంగ మౌలిక లక్ష్యాల నుంచి న్యాయమూర్తులూ జారుకోకుండా ఉండాలని ప్రజలు శాసించాలి’. జస్టిస్ అమితవ్ రాయ్ ఆవేదన కూడా అలంకారప్రాయం కాకుండా ఉండా లంటే ఆయనే చెప్పినట్టు గాంధీ స్ఫూర్తితో అవినీతిపై దండయాత్ర మరొక ‘దండి’యాత్రలా సాగాలి! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
న్యాయప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడితే ధిక్కార చర్యలే
సాక్షి, హైదరాబాద్: నోటికొచ్చినట్లు మాట్లాడి న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మీడియా సమావేశంలో కోర్టుపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు నేతలపై ఆ రాష్ట్ర హైకోర్టు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవడాన్ని సుప్రీంసమర్థించింది. అయితే, హైకోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసి, జరిమానాను మాత్రం విధిస్తూ జస్టిస్ అనిల్ రమేశ్ దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావుల బెంచ్ తీర్పు చెప్పింది. 2000సంవత్సరంలో కమ్యూనిస్టు నేత దర్శన్ కోడా హత్య కేసులో కొందరు నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. దీంతో, మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు నేత హెట్రామ్ బేణీవాల్, నవరంగ్ చౌదరి, భూరామల్‌స్వామి, హర్దీప్‌సింగ్‌లు పత్రికాసమావేశం ఏర్పాటుచేసి తీర్పును తీవ్రంగా విమర్శించారు. బెయిలు వెనుక నగదు చేతులు మారిందన్నారు. దీంతో వీరిపై రఘువీర్‌సింగ్ అనే వ్యక్తి కోర్టుధిక్కార పిటిషన్ వేశారు. పత్రికా సమావేశంలో వీరి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఇవి కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హైకోర్టు తేల్చింది. వారికి 2 నెలల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బేణీవాల్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లను సుప్రీంవిచారించింది. అవినీతిపరులంటూ జడ్జీలపై నిరాధార ఆరోపణలు చేయడం కచ్చితంగా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడమే అవుతుందని కోర్టు పేర్కొంది. కేసులో ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ జైలుశిక్షను రద్దు చేసి జరిమానాను కొనసాగిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. -
వాయిదాలకు న్యాయం బలి!
వందలాది కేసుల్లో న్యాయ నియమాలు, ప్రక్రియ చట్టాలు, పెద్దల ప్రబోధాలతోపాటు, సహ చట్టం కూడా నిర్దేశిస్తున్నా, తగిన కారణాలు తెలపకుండా విచారణను వాయిదా వేయడం అన్యాయం, అసమంజసం. తనమీద దాడిచేసిన వారి పైన పెట్టిన క్రిమినల్ కేసు విచారణ ఆలస్యం ఎందుకవు తున్నదని మహావీర్ అనే వ్యక్తి ఢిల్లీ కోర్టును ఆర్టీఐ కింద అడిగారు. అక్టోబర్ 2012లో చార్జిషీటు, కోర్టు వ్యవహారాల వివరాలు అడిగాడు. నింది తులు ఎన్నిసార్లు హాజరుకా లేదు? ఎన్ని వాయిదాలు ఇచ్చారు? ఆరోపణలు నిర్ధారించడానికి చట్ట ప్రకారం ఉన్న కాలపరిమితి ఏమిటి? మూడేళ్లనుంచి ఈ నేర విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? అని నిలదీశాడు. కొన్ని వివరాలు ఇస్తూ కోర్టు ఫైలును తనిఖీ చేసుకోవచ్చునని పీఐవో లేఖ రాశాడు. తనిఖీ కాదనీ, ప్రతి అంశానికి వివరాలు చెప్పాల్సిందే అంటూ మొదటి అప్పీలు వేశారు. వాయిదా తేదీల వివరాలు ఇచ్చేశారని ఫిర్యాదు దారుడి హోదాలో కూడా మహావీర్ కేసు ఫైలును పూర్తిగా పరిశీలించే హక్కు ఉందని న్యాయాధికారి (అప్పీలు అధికారి) మార్చి 2016 స్పష్టం చేశారు. న్యాయ నిర్ణయ వివరాలు సహ చట్టం కింద అడగడానికి వీల్లేదని ఢిల్లీ జిల్లాకోర్టుల సహ చట్ట నియమాలను 2008లో 7(4) నిర్దేశించిందని ఆయన గుర్తుచేశారు. ఆరోపణల నిర్ధారణకు ఎంత కాలపరి మితి?, కేసును చాలా దూరం వాయిదా ఎందుకు వేశారనే ప్రశ్నలకు రికార్డు లేదని జవాబిచ్చారు. కారణాలను విశ్లేషించి వ్యాఖ్యానించే బాధ్యత పీఐవో పైన లేదని రూల్ 7(9) వివరిస్తున్నదని న్యాయమూర్తి తెలిపారు. కేసును చాలాకాలం వరకు వాయిదా వేయ డానికి కారణాలు ఆ ఆదేశంలో ఉంటే చదువుకోవచ్చని, లేకపోతే ఆర్టీఐ కింద అడగడానికి వీల్లేదని వివరించారు. తగాదాలతో కోర్టుకు వెళ్లిన న్యాయార్థులందరికీ ఎదురయ్యే సమస్య సుదీర్ఘ వాయిదాలే. దిక్కుమాలిన వాయిదాలకు కారణాలు ఏమిటని పెండింగ్ దెబ్బ తిన్న లక్షల మంది కక్షిదారులు అడుగుతూనే ఉంటారు. న్యాయసూత్రాల ప్రకారం ప్రతి ఆదేశానికి కారణాలు వివరించాల్సిందే. సుదీర్ఘంగా వాయిదా వేయడం కూడా న్యాయపరమైన నిర్ణయమే కనుక కారణాలు ఇవ్వవలసిందే. కారణాలు ఉండవు, చెప్పరు, ఆర్టీఐ కింద ఇవ్వడానికి వీల్లేదంటారు. ఇదేం న్యాయం? అని అభ్యర్థి ఆవేదన. ఆ కారణాలు ఫైల్లో లేవు కనుక ఇవ్వ జాలను అనడం చట్టబద్ధమైన లాంఛనం. కారణాలు ఇవ్వకుండా వాయిదా వేయకూడదని తెలిసి కూడా న్యాయాధికారులు అదేపని పదేపదే చేస్తుంటే ఎవరు అడగాలి? దానికి జవాబుదారీ ఎవరు? ఇది న్యాయ పాలనకు సంబంధించిన ప్రశ్నకాదా? కోర్టు పనివేళలను పూర్తిగా వినియోగించాలని, జడ్జి నిక్కచ్చిగా సమయానికి విచారణలు మొదలు పెట్టాలని, లాయర్లు కూడా అయిందానికి కానిదానికి వాయిదాలు అడగరాదని లా కమిషన్ 230వ నివేదికలో సూచించారు. చట్టనియమాలను కచ్చితంగా పాటించకుండా వాయిదాలు ఇవ్వరాదన్నారు. తగిన కారణం చూపడంతోపాటు ఎట్టిపరిస్థితిలోనూ మూడు సార్లకన్న ఎక్కువ వాయిదాలు ఇవ్వరాదని, వాయిదా వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయాలని ఆదేశించాలని సీపీసీ నియమాలు నిర్దేశిస్తున్నారు. కారణాలను వాయిదా ఆదేశంలో తప్పనిసరిగా వివరించాలని కూడా నిర్దేశించారు. వృథా వాయిదాలు, అనవసర అప్పీళ్లతో న్యాయవ్యవస్థ నిర్వీర్యమైపోతున్నదని, లాయర్లలో నైతిక విలువల పతనం అంశాన్ని బార్ కౌన్సిల్ పట్టించుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినే దిక్కులేదు. లాయర్లు అడిగిందే తడవుగా వాయిదా ఇవ్వడానికి జడ్జిలు సిద్ధంగా ఉండడం అన్యాయమని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా విమర్శించారు. కక్షిదారులు, వారి లాయర్లు కూడా వారుుదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచక్షణా రహితమైన వాయిదాలే న్యాయ వితరణలో విపరీత ఆలస్యాలకు కారణమని అందరికీ తెలుసు. తమ నిర్ణయాలవల్ల, విధానాల వల్ల దెబ్బతినే వారికి ఆ నిర్ణయాలకు దారితీసిన అన్ని వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సీ) శాసిస్తున్నది. 4(1)(డి) ప్రకారం తమ పాలనాపర మైన, అర్ధన్యాయపరమైన నిర్ణయాలకు కారణాలను బాధితులకు తెలియజేయాలని శాసిస్తున్నది. ఇవి తమంత తాము ప్రజాసంస్థలు తెలియజేయాల్సిన సమాచారాలు. వాటిని ప్రత్యేకంగా ఎవరూ అడగనవ సరం లేదు. వారు వెల్లడించనప్పుడు అడిగే హక్కు పౌరులకు ఉందని, ఈ రెండు నియమాల కింద కూడా ప్రతిపౌరుడికి కేసులను తరచుగా వాయిదా వేయడానికి కారణాలను తెలుసుకునే హక్కును వాడుకోవచ్చని సీఐసీ వివరించింది. న్యాయ నియమాలు, ప్రక్రియ చట్టాలు, లా కమిషన్ నివేదికలు, వందలాది కేసుల్లో ఉన్నత న్యాయస్థానాల ప్రవచనాలు, పెద్దల ప్రబోధాలతోపాటు, సహ చట్టం కూడా నిర్దేశిస్తున్నా కారణాలు తెలపకుండా వాయిదా వేయడం అన్యాయం, అసమంజసం. ఈ పరిస్థితిని తొలగించడానికి న్యాయస్థానాలు తగిన విధానాలు రూపొందించుకోవాలని సీఐసీ సూచించింది. ఈ కేసులో మొత్తం ఫైలును మహావీర్‌కు చూపాలని ఆదేశించింది. (ఇఐఇ/అ/అ/2016/0011 76 మహావీర్ వర్సెస్ పాటియాలా హౌస్ కోర్టు కేసులో 24.6.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com