సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నలుగురు నియమితులయ్యారు. నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు.
వీరితో శుక్రవారం ఉదయం హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. కాగా.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. జస్టిస్ నరేందర్ రాష్ట్ర హైకోర్టులో నంబర్ త్రీ స్థానంలో ఉంటారు.
ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీకి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ వెంకటరమణ మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తులు, బదిలీపై వెళ్లే ఇద్దరు న్యాయమూర్తులతో కలిపి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది.
ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు
Published Thu, Oct 19 2023 5:01 AM | Last Updated on Thu, Oct 19 2023 5:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment