సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులతో కూడిన ప్యానెల్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (అమరావతి)లో వాదనలు వినిపించేందుకు మరో ఏడుగురు న్యాయవాదులను నియమించింది. వీరంతా మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పోస్టుల్లో కొనసాగుతారు.
హైకోర్టులో నియమితులైన న్యాయవాదులంతా కూడా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ మార్గదర్శకత్వంలో పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా నియమితులైనవారిలో సాగి శ్రీనివాసవర్మ, జోస్యుల భాస్కరరావు, బొమ్మినాయుని అప్పారావు, ఏవీఎస్ రామకృష్ణ, తాత సింగయ్య గౌడ్, గేదెల తుహిన్ కుమార్, అంబటి సత్యనారాయణ, మల్లంపల్లి శ్రీనివాస్, సీవీఆర్ రుద్రప్రసాద్, అరవల శ్రీనివాసరావు, మంచాల ఉమాదేవి, పోతంశెట్టి విజయకుమారి, బేతంపల్లి సూర్యనారాయణ, బాచిన హనుమంతరావు, తానేపల్లి నిరంజన్, అరవ రవీంద్రబాబు, గుడిసేవ నరసింహారావు, గుండుబోయిన వెంకటేశ్వర్లు, పసల పున్నారావు, గేదెల సాయి నారాయణరావు, వి.వెంకట నాగరాజు, ఇ.అంజనారెడ్డి, కామిని వెంకటేశ్వర్లు, తుమ్మలపూడి శ్రీధర్, ఓరుగంటి ఉదయ్ కుమార్, కె.శ్రీధర్ మూర్తి, సోమిశెట్టి గణేష్ బాబు, తడసిన అలేఖ్య రెడ్డి, వైవీ అనిల్ కుమార్, సోమసాని దిలీప్ జయరామ్, పల్లేటి రాజేష్ కుమార్, పామర్తి కామేశ్వరరావు, మన్నవ అపరాజిత, షేక్ బాజీ, గొర్రెముచ్చు అరుణ్ శౌరి ఉన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో నియమితులైన వారిలో కవిపురపు పట్టాభి రాముడు, గొరికపూడి అంకమ్మరావు, ఎన్.వీరప్రసాద్, సీతిరాజు రామకృష్ణ, మాదాల ఆదిలక్ష్మి, షేక్ మంజూర్ అహ్మద్, బి.బి.లక్ష్మయ్య ఉన్నారు.
హైకోర్టులో 35 మంది ప్యానెల్ అడ్వొకేట్ల నియామకం
Published Sun, Sep 11 2022 6:15 AM | Last Updated on Sun, Sep 11 2022 4:22 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment