
భైరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటిస్తున్న హైకోర్టు జడ్జి చీమలపాటి రవి
మెరకముడిదాం: విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో శిక్షించవద్దని హైకోర్టు జడ్జి చీమలపాటి రవి అన్నారు. తన స్వగ్రామమైన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బైరిపురంలో తన తల్లిదండ్రుల 60వ వివాహ వార్షికోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భైరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రేమతో కూడిన విద్యను అందించిన నాడే చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సాయికళ్యాణ చక్రవర్తి, చీపురుపల్లి జూనియర్ సివిల్ జడ్జి విజయరామేశ్వరి పాల్గొన్నారు.