
భారత ప్రధాన న్యాయ మూర్తిగా నవంబర్ 17న పదవీ విరమణ చేసిన రంజన్ గొగోయ్‌ని రాజ్యసభ సభ్యు డిగా రాష్ట్రపతి సోమవారం నియమించారు. విరమణ చేసిన నాలుగు మాసాల్లోనే ఆయన్ని ఇలా నియమించ డంతో న్యాయవ్యవస్థ స్వతం త్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. న్యాయమూర్తు లుగా పనిచేసిన వ్యక్తులు రాజకీయ పదవులను స్వీక రించడం ఇది మొదటిసారి కాదు. భారత న్యాయ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని రాజ్యసభకి నియామకం చేయడం ఇదే మొదటిసారి.
కొన్ని ప్రధాన తీర్పులని వెలువరించిన సుప్రీం కోర్టు బెంచీలకు గొగోయ్ నేతృత్వం వహించారు. వివాదాస్పద రామ జన్మభూమి హిందువులకు కేటా యించడం, రఫేల్ ఫైటర్ విమాన కేసులో దర్యాప్తు నిరాకరించడం, క్లీన్‌చిట్ ఇవ్వడం, ఎలక్టోరల్ బాండ్స్ స్కీములో విచారణని జాప్యం చేయడం, కశ్మీర్‌కి సంబంధించిన హెబియస్ కార్పస్ కేసులని విచారిం చడానికి అయిష్టత చూపడం, ఎన్‌ఆర్‌సీని నిర్వహించ డాన్ని పబ్లిక్‌గా సమర్థించడం లాంటి ఎన్నో తీర్పులని ఆయన వెలువరించారు.
అధికారంలో వున్న పార్టీ తీసుకున్న లైన్‌కి అను కూలంగా తీర్పులు చెప్పినందుకుగానూ ఆయన్ని ఈ పదవి వరించిందని న్యాయవాదులు బహిరం గంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అంతర్గతంగా వున్న విషయం ఇప్పుడు బహిర్గతమైపోయింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత అధికారికంగా చనిపోయిం’ దని సుప్రీంకోర్టు న్యాయవాది గౌతమ్ భాటియా అన్నారు. తన రికార్డునే కాకుండా, తనతో బాటూ బెంచీలో వున్న న్యాయమూర్తుల స్వతంత్ర తకీ, నిష్పాక్షికతకీ మచ్చ తీసుకొచ్చే విధంగా ఆయన నడవడిక వుందని సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే అన్నారు.
గొగోయ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉద్యోగిని కేసు విషయంలో ఏర్పాటైన ఆంత రంగిక ప్యానెల్‌లో బయటి వ్యక్తికి చోటు కల్పించక పోవడం, న్యాయవాదిని నియమించుకోవడానికి అవ కాశం ఇవ్వకపోవడం దారుణమనీ; ఆ కేసులో గొగో య్‌కి క్లీన్‌చిట్ ఇవ్వడం, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా నియమించడంతో న్యాయ వ్యవస్థ బోలుతనం బయ టపడుతుందనీ సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దుష్యంత్ దవే అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే ఆయన పదవీ విరమణ చేసింది 1991లో. అది కూడా ఏడేళ్ల తరువాత 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు, నియామకం కాలేదు. ఈ మధ్య కాలంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మరో జస్టిస్ ఎం.హిదయతుల్లా కూడా ఉప రాష్ట్రపతిగా ఎంపికయ్యారు, పదవీ విరమణ (1970) చేసిన తొమ్మిదేళ్ల తర్వాత. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కూడా తమిళనాడు గవర్నర్‌గా 1997లో నియమితు లైనారు. ఆమె పదవీ విరమణ చేసింది 1992లో.
పదవీ విరమణ చేసిన వెంటనే న్యాయమూర్తు లకి మరో పదవి ఇవ్వడం ఎప్పుడూ చర్చనీయాం శమే. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాటల్లో చెప్పాలంటే– ‘పదవీ విరమణ తరువాత వచ్చే పద వులు, పదవుల్లో ఉన్నప్పుడు చెప్పే తీర్పులని ప్రభా వితం చేస్తాయి’. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని హోదాలో 2012లో ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘పదవీ విరమణ చేసిన రెండేళ్ల వరకి ఎలాంటి పదవిని న్యాయమూర్తికి ఇవ్వకూడదు. అలా గడువు లేకపోతే ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో న్యాయమూర్తులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.’ ఇవే మాటలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులైన ఆర్.ఎం.లోధా, టి.ఎస్. ఠాకూర్, కపాడియా లాంటివాళ్లు అన్నారు.
రోజర్ మాథ్యూ కేసులో గొగోయ్ అభిప్రా యాలు నిందాస్తుతి లాంటివి. పదవీ విరమణ తరు వాత పదవుల విషయంలో కోర్టు తన ఆందోళనని వ్యక్తపరిచింది. ఆ విధంగా పదవులు ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతే దెబ్బతింటుందని గొగోయ్ నేతృత్వంలోని బెంచి అభిప్రాయపడింది. విరమణ వెంటనే పదవుల గురించి తీర్పులు చెప్పిన గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా పదవి స్వీకరించడం విషాదం. రాజ్యాంగంలోని అధికరణ 80 ప్రకారం కళలు, సైన్స్, సాహిత్యంలో ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తులని రాష్ట్ర పతి రాజ్యసభ సభ్యులుగా నియమించవచ్చు. గొగో య్‌కి ఎందులో అనుభవం ఉందో మరి!
వ్యాసకర్త: మంగారి రాజేందర్, గతంలో జిల్లా జడ్జిగా పనిచేశారు.
మొబైల్ : 94404 83001
Comments
Please login to add a commentAdd a comment