![Former CJI Ranjan Gogoi during oath taking in Rajya Sabha - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/20/ranjan.jpg.webp?itok=59LQkCRF)
న్యూఢిల్లీ/చండీగఢ్: అయోధ్య వివాదం వంటి కీలక కేసుల్లో చారిత్రక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా రంజన్ గొగోయ్(65) కొత్త అధ్యాయం ప్రారంభించారు. గురువారం ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ‘షేమ్, షేమ్’అని నినాదాలు చేసుకుంటూ వాకౌట్ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు, ప్రమాణ స్వీకారానికి ఆయన పేరును పిలవగానే ప్రతిపక్ష సభ్యులు ‘షేమ్, డీల్’అంటూ నినాదాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment