న్యాయవ్యవస్థకు రక్షణ ఏది? | Shekhar Gupta Article On Judiciary System | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 1:13 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Shekhar Gupta Article On Judiciary System - Sakshi

మహారాష్ట్రలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం. అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్‌ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్థించదగ్గదేనా?

వివాహాల వైఫల్యమే ఇతివృత్తంగా బాసు భట్టాచార్య మూడు వరస సిని మాలు నిర్మించారు. వాటిలో 1971 నాటి ‘అనుభవ్‌’ ఒకటి. ఈ చిత్రంలో పని తప్ప మరొక ధ్యాస లేని ఒక పత్రికా సంపాదకుడి పాత్రలో సంజీవ్‌కుమార్, ఎప్పుడూ ఏకాంతంగా గడిపే అతడి భార్యగా తనూజ నటించారు. రెండు న్నర గంటలు పాటు సాగే చిత్రంలో చివర దినేష్‌ ఠాకూర్‌ (మరొక పాత్రలో కనిపించిన నటుడు) ముక్కోణపు ఉత్కంఠను రేపుతాడు. అప్పుడే ఆ జంట మధ్య ఈ సంభాషణ చోటు చేసుకుంటుంది. ‘ఎవరెవరివో సమస్యలు తీసు కుని వాటి మీద మీరు నిత్యం ఒక సంపాదకీయం రాస్తారు. మీరు మన కోసం కూడా ఒక సంపాదకీయం రాయండి!’ అంటూ తనూజ (21వ శతా బ్దంలో ప్రేక్షకులకు బాగా దగ్గరయిన కాజోల్‌ తల్లి) సంజీవ్‌కుమార్‌ను అడుగుతుంది. 

ఇలాంటి దృశ్యంలో ప్రతిభామూర్తులైన మీ సుప్రీం కోర్టు న్యాయమూర్తు లను ఒకసారి ఊహించుకోండి. ఈవారంలో వారు అరుదైన స్పష్టతతో, ఎలాంటి శబ్దాలంకారాలు లేని రీతిలో ఒక తీర్పు ఇచ్చారు. నాగ్‌పూర్‌లో సంభ వించిన జస్టిస్‌ బీహెచ్‌ లోయా మరణం వివాదంపై స్వతంత్ర దర్యాప్తు జరి పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పిటిషనర్లను తీవ్ర స్థాయిలో హెచ్చరిం చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదిని కూడా వదిలిపెట్టలేదు. చిన్న ఆధారం కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారని తీర్పులో పేర్కొన్నారు. ఆ విధంగా మొత్తం న్యాయ వ్యవస్థ మౌలికతనే తక్కువ చేసి చూపుతున్నారని కూడా చెప్పారు.

పిటిషన్లను తిరస్కరించడంతో పాటు, న్యాయ వ్యవస్థను న్యాయ వాదుల నుంచి, ఉద్యమకారుల నుంచి, మీడియా నుంచి రక్షించుకోవలసి వస్తున్నదంటూ ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఇది ఎలా ఉందంటే, ప్రతివారు న్యాయమూర్తుల మీద పడి వేధిస్తున్నట్టు, ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవడా నికి వారు పోరాడుతున్నట్టు ఉంది. కాబట్టి ‘అనుభవ్‌’ సినిమాలో తనూజ అడిగిన ప్రశ్ననే న్యాయమూర్తులను అడగవచ్చునా? ‘ న్యాయ వ్యవస్థను ఇత రుల నుంచి రక్షించడానికి మీరు ఎప్పుడూ తీర్పులు వెలువరిస్తూ ఉంటారు. అలాగే న్యాయమూర్తుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవడం ఎలా అనే అంశం మీద కూడా మీరు ఒక తీర్పును రాయగలరా?’

ఈ వాదనను తయారు చేయడంలో నేను అవసరానికి మించిన జాగ్రత్త చూపిస్తున్నానేమో! అలా ఉండడమే మంచిది. ఎందుకంటే జస్టిస్‌ లోయా కేసులో పిటిషనర్ల మీద, న్యాయవాదుల మీద నేర ధిక్కారం ఆరోపించ కుండా తాము విశాల హృదయంతో వ్యవహరించామని న్యాయమూర్తులు చెప్పారు. అంతటి ఔదార్యం ఒక మామూలు సంపాదకుడి విషయంలో చూపించకపోవచ్చు. అయినప్పటికి వాస్తవాలు చెప్పాలి. అవి చర్చకు రావాలి. అయితే తీర్పులోని మంచి విషయాలను చర్చించడానికి ఇది సమ యం కాదు.

ఇందులో మంచి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు వెలువరించే చాలా ఆదేశాల వలె కాకుండా ఇందులో క్లుప్తత కూడా చక్కగా ఉంది. వేర్వేరు శిబిరాలుగా విడిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మీరు వివరించదలిచినది ఏదైనా అది మీ రాజకీయ పంథా, సైద్ధాంతికతల పునాది ఆధారంగానే ఉంటుంది. జర్నలిస్ట్‌ బర్ఖా దత్‌ మీడియా వారి సంకట స్థితిని చాలా కటువుగా వర్ణించారు. మీడియాను రెండు ధ్రువాలుగా– ఒకరు చెంచాలు (అస్మదీ యులు), మరొకరు మోర్చాలు (ఉద్యమకారుల బృందాలు) అని పేర్కొ న్నారు. ఇలా మాట్లాడడం ప్రమాదకరం. ఎందుకంటే తరువాత మీరు రెండు ధ్రువాలని నిందించాలి. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థ కూడా ఇలా ధ్రువా లుగా చీలిపోయిన సూచనలు కనిపిస్తున్న తరుణంలో అది మరింత ఇబ్బంది పెట్టే విషయం.

న్యాయ వ్యవస్థకు అదే నిజమైన ముప్పు. తన నుంచి తనకు ఉన్న ముప్పు. నిజానికి దాని గురించే న్యాయమూర్తులు ఆగ్రహం ప్రకటిం చాలి. ఆ కారణంగానే న్యాయ వ్యవస్థ తనను తాను న్యాయమూర్తుల నుంచి రక్షించుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ వ్యక్తిగత ప్రతినాయకులు ఎవరూ లేరు. బయటి నుంచి వచ్చినదని భావించిన వైరస్‌ను వదిలించుకోవాలనుకు న్నప్పుడు వ్యవస్థ దానికదే స్వీయ రక్షణలో పడిపోతోంది. శరీరం తనని తాను తినడం ఎప్పుడు మొదలు పెడుతుందో మీకు తెలుసా? 

ఈ పిల్‌ మీద తీర్పులో మీరు అనివార్యంగా అంగీకరించ వలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.మొదటి అంశం– ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్విని యోగమవుతున్నాయి. రాజకీయ, వ్యక్తిగత, సైద్ధాంతిక పోరాటాలను కోర్టు లకు తీసుకువస్తూ ప్రజలు పిల్‌ వ్యవహారాన్ని ఒక వృత్తిలా మార్చేశారు. కోర్టుల సమయాన్ని వృధా చేస్తూ జాప్యానికి కారకులవుతున్నారు. రెండో అంశం– న్యాయమూర్తులు అబద్ధాలు ఆడరాదు. కనీసం వారిలో నలుగురు కలుసుకోనప్పుడైనా అబద్ధం ఆడరాదు.

మూడో అంశం– మొత్తం న్యాయ వ్యవస్థను ఒకే వ్యక్తి అదుపు చేస్తాడని చెప్పడం అర్థరహితం. అది అసంభవం. 
ఇప్పుడు కొన్ని వాస్తవాల గురించి పరిశీలిద్దాం. జస్టిస్‌ లోయాకు సంబం ధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు ఉదయమే పత్రికలు బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు గురించి ప్రచురిం చాయి. మహారాష్ట్రలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న  నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం.

అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్‌ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్ధించదగ్గదేనా? అయితే న్యాయమూర్తుల వివేకం గురించి ప్రశ్ని స్తున్నప్పటికీ కూడా వారి చర్యలను శంకించడం మాత్రం తగదు. ప్రచారం కోరుకునే వ్యక్తులకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒక ఆయుధంగా మారిపో యిందని లోయా కేసు తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తులు కూడా తమని తాము అద్దంలో చూసుకుంటూ తాము అలాంటి ఆకర్షణకు లోనయ్యే వాళ్లం కాదని చెప్పుకోగలరా! ఇలాంటి కొన్ని ఉదాహరణలను సేకరించ డంలో నాకు సహకరించిన నా సహ జర్నలిస్ట్‌ మనీష్‌ చిబ్బర్‌ ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థను ఆసక్తిగా, లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. ఆ ఉదాహరణలలో భారత క్రికెట్‌ను నిర్వహించమని దాదాపు సంవత్సరం క్రితం సుప్రీంకోర్టుకు అప్పగించిన బీసీసీఐ ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ఇటీవలనే భారత ప్రధాన న్యాయమూర్తి మరొక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కూడా అనుమతించారు. ఆయనే ఇప్పుడు క్రికెట్‌ బెంచ్‌కు (ఇలాంటి రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నారా?) ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. క్రీడలలో బెట్టింగ్‌ను, జూదాన్ని చట్ట బద్ధం చేయాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆయనే అనుమతించారు. జస్టిస్‌ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక ముందు  ఒక ఆదేశం జారీ (నవంబర్‌ 30, 2016) చేశారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను అనివార్యం చేస్తూ ఇచ్చిన ఆదేశమది. తరువాత దానిని రద్దు చేశారు. ఈ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా పత్రి కలలో పతాక శీర్షికల స్థానం పొందాయి. పిటిషన్‌దారులు ఎవరో ఎవరికీ గుర్తు లేదు.

కాబట్టి పత్రికల పతాక శీర్షికలకు ఎక్కాలనుకుంటున్నారంటూ పిటిషనర్లను ఎందుకు విమర్శించడం? లోయా తీర్పు వచ్చిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చిన 43 వ్యాజ్యాలలో 12 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే. ఇంకొన్ని: బ్రిటన్‌ నుంచి కోహినూర్‌ వజ్రాన్ని తీసుకురావడం, సాంటా–బాంటా జోకుల నిషేధం, అశ్లీల చిత్రాల వీక్షణను నేరంగా ప్రకటించడం (2013 నుంచి కోర్టుల సమయాన్ని తింటున్నది), పాఠ శాలల్లో యోగాభ్యాసం తప్పనిసరి చేయడం–ఇంకొన్ని. ఇందులో కొన్నింటిని కొట్టివేశారు. ఇంకా ఎన్నో కీలకమైన కేసులు ఉండగా వీటిని ఎందుకు అను మతించాలి? వాస్తవం ఏమిటంటే, గొప్ప సదుద్దేశంతో 1980లో వచ్చిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని ఎందరో న్యాయమూర్తులు విస్తరించారు. ఇది ప్రజల అంతిమ ఆయుధంగా భావించారు. 


ఇంకొక విషయం–న్యాయమూర్తులు అబద్ధం ఆడరాదు. కనీసం నలు గురు సీనియర్‌ జిల్లా జడ్జీలు కలిసినప్పుడైనా అబద్ధం ఆడరాదు. ఈ సూత్రం సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులకు వర్తించదా? వీరు కోర్టు నిర్వహణకు సంబంధించిన కొన్ని దోషాలను గురించి కొన్ని నెలల క్రితం మాట్లాడారు. మనం నలుగురు మహారాష్ట్ర న్యాయమూర్తుల మాటను పరిగణిస్తున్నప్పుడు, వారి మాటలను ఉద్దేశపూర్వకమైనవిగా తోసిపుచ్చ వచ్చా, వారి ఆందోళనలను దారితప్పినవిగా కొట్టిపడేయవచ్చా? జిల్లా జడ్జీలు అబద్దమాడుతున్నారని అగ్నికి ఆజ్యం పోసేటంత మూర్ఖుడిని కాను. పైగా సుప్రీంకోర్టు జడ్జీలు అబద్దాల కోరులు అని నమ్మేందుకు నేను వెర్రి వాడినై ఉండాలి. వారు సంధించిన ప్రశ్నలకు స్పందించాలి. చర్చించాలి, అంతర్దృష్టితో చూడాల్సివుంది. 

న్యాయవ్యవస్ధపై కనికరం లేని ఈ సాగదీత, అంటువ్యాధిగా కొట్టిపడే సిన అదే ప్రజాప్రయోజన వ్యాజ్యాల గుండా పతాక శీర్షికలపై దృష్టి నిలిపే న్యాయవ్యవస్థ ధోరణి, తమ సొంత సంస్థను క్రమంలో ఉంచడంలో వారి అసమర్థత అనేవే బయటి వారికంటే ఎక్కువగా న్యాయవ్యవస్థను బలహీనప ర్చాయి. న్యాయమూర్తులు చీలిపోయినట్లు కనిపిస్తే, కక్షిదారులు, న్యాయవా దులు కలిసి ఫోరం షాపింగ్‌కు వెళతారని మీరు ఊహించవచ్చు. 

తీర్పులోని మూడో ముఖ్యమైన అంశంలోకి మనల్ని తీసుకెళుతోంది ఏదంటే, ఒక వ్యక్తిమాత్రుడు మొత్తం న్యాయవ్యవస్థను నియంత్రించగలడని చెప్పడం అర్ధరహితమనే చెప్పాలి. మీరు దీనితో విభేదించలేరు. వాస్తవానికి, అలాంటి పరిస్థితిని మనం గతంలో చూసి ఉన్నాం. కాని అలా చేసింది పురు షుడు కాదు మహిళ అయిన ఇందిరాగాంధీ. వెన్నెముక కలిగిన ఒకే ఒక్క సాహసికుడైన న్యాయమూర్తి హెచ్‌ ఆర్‌ ఖన్నా నేటి ఎర్డోగన్‌నేతత్వంలోని టర్కీ దేశంలా మారకుండా మనదేశాన్ని నాడు కాపాడారు. 2018 కాలపు భారతదేశానికి అలాంటి ఒక న్యాయమూర్తి కాదు, పలువురు న్యాయమూ ర్తులు కావలసి ఉంది. ఎందుకంటే న్యాయవ్యవస్థకు పెనుప్రమాదం ఇప్పుడు బయటినుంచి కాదు. లోపలి నుంచి పొంచి ఉంది. 

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement