shekar gupta
-
బీజేపీ కథేంటో మూడు ముక్కల్లో చెప్పిన శేఖర్ గుప్తా
న్యూఢిల్లీ: ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల మినహా బీజేపీ ఘోర పరాభవమే ఎదుర్కొంది. దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ వేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తమిళనాడు, కేరళలో ఓటర్లు ఆ పార్టీని ఆదరించకపోగా.. అధికారమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్లో పోరాడిన బీజేపీకి మిశ్రమ ఫలితం దక్కింది. అధికారానికి చాలా దూరంలో బీజేపీ నిలిచిపోయింది. అయితే బీజేపీ ఓటమి చెందడానికి కారణాలను ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ఓటమి చెందడంపై మూడు కారణాలను వివరించారు. నరేంద్ర మోదీ హయాంలో బీజేపీకి ఇది ఘోర ఓటమి. బీజేపీ మత రాజకీయాలు దేశవ్యాప్తంగా పని చేయవు. హిందీ, గుజరాత్ ప్రాంతాల్లో తప్ప దేశంలోని ఇతర భూభాగాల్లో మోదీ హవా కొనసాగదు. చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్ Our #50WordEdit on NZ High Commission and oxygen pic.twitter.com/ls5UP7uVnH — Shekhar Gupta (@ShekharGupta) May 2, 2021 -
సుశాంత్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల
ముంబై: బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్‌లో వస్తున్న ‘సూసైడ్ ఆర్ మర్డర్’ చిత్రం ఫస్ట్ం లుక్‌ను దర్శకుడు శేఖర్ గుప్తా మంగళవారం సోషల్ మీడియాలో విడుదల చేశాడు. టిక్‌టాక్ స్టార్ సచిన్ తివారీ లీడ్రోల్లో పోషిస్తున్నాడు. టిక్‌టాక్‌లో సచిన్ తివారి వీడియోస్ చూసిన సుశాంత్ అభిమానులు అచ్చం సుశాంత్‌లా ఉన్నాడంటూ అతడిని ఫాలో అవడంతో సచిన్‌కు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. దర్శకుడు శేఖర్ గుప్తా సచిన్ తివారితో సుశాంత్ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ ఓ ప్రకటన చేశారు. ‘ఒక చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి చిత్ర పరిశ్రమలో షైనింగ్ స్టార్ అయ్యాడు. ఇది అతని ప్రయాణం. ఈ సినిమాతో సచిన్ తివారిని సినిమాలకు పరిచయం చేస్తున్నాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను విడుదల చేశాడు. (చదవండి: సుశాంత్ కేసు: స్టేట్మెంట్ ఇచ్చిన చోప్రా) View this post on Instagram A boy from small town became a Shining Star in the film industry. This is his journey. Introducing @officialtiwarisachin _ as 'The Outsider' in #SuicideOrMurder @vsgbinge @VijayShekhar9 @shamikmaullik @shraddhapandit @vsgmusic #bollywood #nepotismbollywood @abpnewstv @zeenews @aajtak @republicbharatofficial @ndtvindia A post shared by VIJAY SHEKHAR GUPTA (@iamvijayshekhar) on Jul 19, 2020 at 3:57pm PDT ఈ చిత్రం గురించి ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో గుప్తా మాట్లాడుతూ.. ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మనందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఇది కొత్త విషయమేమీ కాదు. చిత్ర పరిశ్రమలో ఎదగాలని వచ్చిన చాలా మంది నటులకు అవకాశాలు దొరకడం లేదు. చాలామంది ఈ మార్గంలో వెళతారు. మరికొందరు తమ జీవితమంతా కష్టపడుతూనే ఉంటారు. అందుకే బాలీవుడ్లో గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్నా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. గత నెల జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘రాబ్తా’, ‘కేదార్నాథ్’ వంటి చిత్రాల్లో సుశాంత్ నటించాడు. ఆ తర్వాత నటించిన ‘ఎమ్మెస్ ధోనీ’ బయోపిక్ మాత్రం సుశాంత్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత చిచోరే కూడా సుశాంత్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. -
విభజన వ్యూహాలు ప్రమాదకరం
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత, పాకిస్తాన్ అవలక్షణాలుగా చెబుతున్న అంశాల నుంచి తనను తాను వేరుచేసుకోవడానికి భారత్‌కు 25 ఏళ్లు పట్టింది. కానీ ఇన్నేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలన్నింటినీ దేశీయ ప్రయోజనాల పేరిట మోదీ, అమిత్ షాలు వృథా చేసేశారు. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాకిస్తాన్‌ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఈ విభజన తత్వం మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. జాతీయ భద్రత కలిగిన దేశాన్ని మనం ఎలా నిర్వచించాలి? మన పొరుగునే ఉంటున్న పాకిస్తాన్ నుంచి దీనికి ఉదాహరణలను చూద్దాం. జాతీయ భద్రత లేక అభద్రత అనే భావం చుట్టూతానే పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రతి విషయం నిర్మాణమవుతూ వచ్చింది. అందుకే పాక్ సైన్యం దేశ అధికార చట్రంలో శాశ్వతమైన, ప్రత్యేక హోదాను కలిగి ఉంది. దాని నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి ఎవరికీ లేనంత సంస్థాగత స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టారు. పాకిస్తాన్‌లోని 21 కోట్ల మందికి పైగా ప్రజలను ఎవరైనా ఎలా భ్రమల్లో పెట్టగలరు? అంటే ఒక ప్రమాదకరమైన దెయ్యాన్ని చూపించడం ద్వారా ఇన్ని కోట్ల మందిని భయపెడుతూ పాక్ తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. జాతీయ భద్రత కలిగిన దేశ నిర్మాణం అంటూ సమర్థించుకోవాలంటే ముందుగా మీరు ప్రజల్లో భయాన్ని పాదుకొల్పాలి. పాక్ ప్రజల పాలిట భయంకరమైన రాక్షసిగా భారత్‌ని పాక్ విజయవంతంగా చిత్రిస్తూ వచ్చింది. భారత్ బూచిని చూపించడం ద్వారానే పాక్ ప్రభుత్వాలు సైన్యంపై అంత ఖర్చు పెట్టగలిగాయి. పాక్ గురించి నేను సందర్భానుసారం రాస్తూవచ్చిన అనేక కథనాల్లో ఒక దాంట్లో ఇలా పేర్కొన్నాను. ‘వాఘా బోర్డర్ వద్ద మీ పాస్‌పోర్టులో స్టాంప్ వేస్తున్న ఇమిగ్రేషన్ అధికారి తలపై ఒక నోటీసు వేలాడుతూ ఉంటుంది. ఆ నోటీసులో ఇలా రాసి ఉంటుంది. మేం అందరినీ గౌరవిస్తాం. అందరినీ అనుమానిస్తాం’. దీనర్థం ఏమిటంటే జాతీయ భద్రతా ప్రభుత్వం అంటేనే అనుమానాస్పదమైన ప్రభుత్వం అనే. పైగా, ఈ కారణం వల్లే పాక్ అంత అస్తవ్యస్తతలో ఉంటోంది. దివాలా తీసిన, రుణాల కోసం సాగిలబడుతున్న ఆర్థిక వ్యవస్థ, విచ్ఛిన్నమైపోయిన సమాజం, పతనమవుతున్న సామాజిక సూచికలు, జాతీయ సంపదలను టోకున అమ్మిపడేయడం, పొరుగునున్న ‘అంకుల్ చైనా’కు రక్షణ ఫీజుల కింద దేశ భూభాగాన్నే అప్పగించేయడం, జిహాద్ యూనివర్సిటీ, ప్రపంచ వలస సరఫరా కేంద్రం వంటి వాటికి పేరొందడం ఇవీ పాక్ లక్షణాలు. ప్రత్యేకించి పొరుగుదేశాలు పాక్ నుంచి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే.. ‘నాలాగా ఎవరూ ఉండవద్దు’ అనే. ప్రస్తుత భారతదేశం సరిగ్గా దీనికి సాక్ష్యాధారంగా నిలబడుతోంది. ఎందుకంటే పాక్ ఇస్తున్న పై సందేశరూపంలోని హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవద్దని మనం నిర్ణయించుకున్నాం. మరోవైపున, 2015 తదుపరి పాకిస్తాన్ చిక్కుకున్న స్వీయ భావావరోధంలో మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. 2014 నాటికి పాకిస్తాన్ మన బహిరంగ ప్రసంగాలు, చర్చల్లో కనిపించకుండా పోయింది. పరుగుపందెంలో భారత్, పాక్ కంటే ఎంతో ముందుకెళ్లింది. పాక్ చికాకు కలిగించే రాజ్యంగా దిగజారిపోయింది. తాజాగా పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సందర్భంగా పాక్ గురించి గత వారం పాకిస్తాన్ పేరును పదే పదే చర్చిస్తూ వచ్చారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడి సమయంలో కాంగ్రెస్ వైఖరి సరిగ్గా పాకిస్తాన్ వైఖరితో ఎలా సరిపోలిందంటూ హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఇదే వైఖరిని ప్రతిబింబించారు. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇప్పుడు పాక్ పేరును తరచుగా ప్రస్తావిస్తూ వస్తోందన్న విషయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పుల్వామా ఘటన నేపథ్యంలో మీరు మా వైపు ఉంటారా లేక పాక్ వైపు ఉంటారా అనే అంశం చుట్టూనే 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం నడిచింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర వంటి నాలుగు రాష్ట్రాల్లో జరిపిన బహిరంగ సభల్లో మోదీ పాక్ పేరును 90 సార్లు ప్రస్తావించారు. తర్వాత హరియాణా, మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇది కొనసాగింది. చాలా కాలం తర్వాత మన బహిరంగ చర్చల్లో, మన రోజువారీ జీవి తంలో కూడా పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తున్నాము. ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చ మొత్తంగా పాకిస్తాన్, దేశ విభజన ప్రాతిపదికపైనే నడిచింది. పాకిస్తాన్లో మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరు మనకు చర్చనీయాంశమైంది. అందుచేత పాకిస్తాన్‌లోని ముస్లిమేతర మైనారిటీల క్షేమాన్ని పట్టించుకోవలసిన ప్రత్యేక బాధ్యత భారత్‌పై పడినట్లుగా ఉంది. పాకిస్తాన్‌ని సహజంగానే ముస్లింల నివాస స్థలంగా ఎలా పరిగణిస్తూ వస్తున్నారో భారత్ కూడా ఇప్పుడు హిందువుల నివాసస్థలంగా ఉండాలనే వాతావరణం దేశంలో బలపడుతోంది. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. రాజకీయ చర్చలను దేశ విభజన వద్దకు తీసుకుపోవడం, విభజన నాటి తప్పులను సరిదిద్దుతామని హామీ ఇవ్వడం, అతిపెద్ద శత్రువును అప్పట్లో ఊరికే వదిలేశామని విమర్శలు చేయడం.. వంటి పరిణామాలను చూస్తుంటే పాకిస్తాన్‌ను భారత్ కొత్తగా కనిపెడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అంతరం ఎంత దూరం పోయిందంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ చివరకు చైనాతో సహా మన రెండు దేశాలను ఒకే వైఖరితో చూడడం లేదు. భారత్–పాక్ మధ్య ఉన్న హైపనేషన్ ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది. అంటే భారత్, పాక్‌లను కలిపి చూసే పరిస్థితి మాయమైపోయిందని అర్థం. ఒకప్పుడు పాక్ అవలంబించిన వైఖరిని ఇప్పుడు మనం తవ్వి తలకెత్తుకుంటున్నామా అనిపిస్తోంది. ఎందుకంటే మొదట అభద్రతా భావాన్ని పెంచిపోషించకుంటే మీరు జాతీయ భద్రతా రాజ్యాన్ని ఎలా నిర్మించగలరు? అందుకే ఈ అవసరం కోసం మీకు భయపెట్టే శత్రువు అవసరం. అది పాకిస్తానే మరి. ఇప్పటికి అది అంత భయపెట్టకపోవచ్చు కానీ పాన్ ఇస్లామిజం అనే పెద్ద ప్రమాదాన్ని చూసినప్పుడు అది భయంకర రాక్షసిగా మారక తప్పదు. అదే ఇప్పుడు అనుమానాన్ని కలిగిస్తుండగా, భారత్‌లోని 20 కోట్ల మంది ముస్లింలకేసి చూస్తే అతిపెద్ద ఉపద్రవంలాగే కనిపిస్తారు మరి. 1947లో రెండు దేశాలు కొత్త చరిత్ర దిశగా అడుగులేయడం ప్రారంభించిన నాటి పరిస్థితిని సమీక్షిద్దాం. మన రెండు దేశాలూ విభిన్నమైన మార్గాలను ఎంచుకున్నాయి. ఒకటి ఉదారవాద రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా మారగా, మరొకటి మెజారిటీవాద, మతతత్వ, సైనిక రాజ్యంగా మారింది. ఒకటి అలీన రాజ్యంగా మారగా, మరొకటి ఆయా కాలాల్లో ప్రాబల్యంలోకి వచ్చిన సైనిక కూటములలో చేరింది. కేవలం 25 సంవత్సరాలలోపే, మతప్రాధాన్య రాజ్యంగా తనను తాను పేర్కొన్న పాకిస్తాన్ తన భూభాగంలో సగానికి పైగా జారవిడుచుకుంది, మరో కొత్త దేశం బంగ్లాదేశ్ రూపంలో ఉనికిలోకి వచ్చింది. చివరకు ఆ కొత్త దేశం కూడా తన మాతృదేశం నమూనాలోకే వెళ్లిపోయి, ఇస్లాంని తన మెజారిటీ వాద భావజాలంగా ఎంచుకునేసింది. దానికి తోడుగా మిలిటరీ పాలకులూ పుట్టుకొచ్చారు. రెండు దశాబ్దాలకుపైగా అప్పులను యాచిం చడం, దారిద్య్రంలో కూరుకుపోవడం జరిగాక, అనేక మూడో ప్రపంచ దేశాల చెడు లక్షణాలకు బంగ్లాదేశ్ ఒక నమూనాగా నిలిచిపోయింది. అధిక జనాభా, దారిద్య్రం అనే సాంక్రమిక వ్యాధుల దేశంగా దానికి పేరుపడిపోయింది. ‘ఆల్ ది ట్రబుల్ ఇన్ ది వరల్డ్’ అనే తన సంకలనంలో అమెరికన్ ప్రముఖ రచయిత పీజే ఓ రూర్కే అధిక జనాభాతో వచ్చే సమస్యలకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా పేర్కొనడం భావోద్వేగాలను రెచ్చగొట్టింది. పైగా అది ఒక అసందర్భ వ్యాఖ్య కూడా. కానీ అంత దూకుడు రచనలో కూడా రూర్కే ఒక వాస్తవాన్ని పదునైన వాక్యంలో చెప్పాడు. ‘తినడానికి తగినంత ఆహారం లేని దేశం, పండకముందే పంటను వాసన చూస్తున్న దేశం ఎలా మనగలుగుతుంది?‘ కానీ, చాలా త్వరలోనే ఆ కొత్త దేశం భారత్ వంటి దేశాన్ని పోలిన లౌకిక, ఆధునిక ఆదర్శ రాజ్య నమూనావైపు నడక మార్చుకుంది. మరో రెండు దశాబ్దాలలోపే, బంగ్లాదేశ్ ప్రతి సామాజిక, ఆర్థిక సూచికలోనూ పాక్‌కంటే ఎంతో ముందుకు సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 48 ఏళ్లక్రితం పాక్ పీడన నుంచి తన విముక్తిలో సహాయం చేసిన భారత్‌నే అది ఇప్పుడు వెనుకకు నెడుతోంది. ఆకలిదప్పులకు, బహిరంగ మలవిసర్జనకు నమూనాగా రూర్కే వ్యాఖ్యానించిన ఆ బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ రెండు శాపాలను భూస్థాపితం చేసిపడేసింది. బంగ్లాదేశ్ ఇప్పుడు బహిరంగ మల విసర్జన నుంచి దాదాపుగా బయటపడింది. దాని జనాభా వృద్ధి రేటు గణనీయంగా అంటే భారత వృద్ధి రేటు స్థాయికి.. ఒక్కశాతానికి పడిపోయింది. పాకిస్తాన్ నుంచి కొని తెచ్చుకున్న భావజాల వైరస్‌ను తుంగలో తొక్కి బయటపడిన దాని ఫలితమే ఇదంతా మరి. 1985లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి సారిగా సందర్శించినప్పుడు అదెంత మెరుగైన స్థితిలో ఉండేదో చూసి ఆశ్చర్యపోయాను. ఆనాటికి దాని తలసరి ఆదాయం భారత్ కంటే 65 శాతం ఎక్కువగా నమోదయ్యింది. కానీ 2019లో భారత్ తలసరి ఆదాయం పాక్ కంటే 60 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదెలా జరిగింది? పాకిస్తాన్ సామాజిక–ఆర్థిక వృద్ధి సూచికలు ఎంతగా కుప్పగూలిపోయాయంటే ఐఎమ్ఎఫ్ నుంచి ఆ దేశం 13వసారి ఉద్దీపన ప్యాకేజీని అందుకోవాల్సి వచ్చింది. ఇక పాక్ జనాభా వృద్ది రేటు భారత్, బంగ్లాదేశ్‌ల కంటే రెట్టింపు పెరిగింది. కాని ఇప్పటికీ అది జాతీయ భద్రతా రాజ్యంగా సైనికాధిపత్యంతోనే ఉంటోంది. ఎంతలా అంటే పాక్ ప్రధాని తన ఆర్మీ చీఫ్‌కు సలామ్ చేసేంతగా. భారత్ కంటే ఏ రంగంలో అయినా పాక్ ముందుందంటే బహుశా అణ్వాయుధాల సంఖ్యలోనే కావచ్చు. కానీ భారతీయ వ్యూహాత్మక అధ్యయనాల నిపుణుడు దివంగత కె. సుబ్రహ్మణ్యం తరచుగా ఒక మాట చెప్పేవారు, నీ దేశ రక్షణకు తక్కువ ఆయుధాలు అవసరమైనప్పుడు ఎందుకు ఎక్కువ ఆయుధాలకోసం వెంపర్లాడతావు? కాగా, దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాక్‌ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. నిజానికి ఇది పేలవమైన ఎంపిక. ఇప్పుడు పాక్‌తో మనల్ని మనం పోల్చుకోవాలంటే భారత్ తన కాళ్లు నెప్పి పెట్టేలా ముందుకు వంగాల్సి ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే.. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఇది మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మరో అయోధ్య కానున్న ‘పౌరసత్వం’
ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభం కాగా, విభజన తర్వాత హిందువుల వలస దానికి తోడైంది. 1947కి ముందే వచ్చిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే. ఈ చిక్కుముడిని విప్పడం కష్టమే కాబట్టి పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రజ లను విభజించే ఎత్తుగడతో తీసుకొస్తోంది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా బీజేపీ వారిపై ఆరోపణలకు దిగుతుంది. అంటే వచ్చే మూడు దశాబ్దాల్లో పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్ 370గా మారిపోతుంది. దీని వెనుక ఉన్న విభజన రాజకీయాలివే. గత కొన్ని రోజులుగా పౌరసత్వ చట్టం, 1955 లేక పౌరసత్వ సవరణ బిల్లు, 2019 (సీఏబీ)కు తాజా సవరణలపై అనేకమంది మద్దతిస్తూ దేశవిభజనను తిరిగి సమీక్షించాలని కోరుతున్నారు. పూర్తికాని వ్యవహారాన్ని మళ్లీ సమీక్షించాలి అనే మాట చెప్పనప్పటికీ, పూర్తి న్యాయం, ముగింపు, ముస్లిమేతర మైనారిటీలకు న్యాయం చేయడం అని చెప్పడంలో వీరు వెనుకాడటం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని మైనారిటీలకు చేసిన వాగ్దానాన్ని పౌరసత్వ సవరణ బిల్లు నెరవేరుస్తుందని వీరు నొక్కి చెబుతున్నారు. ఆ వాగ్దానం చర్చనీయాంశమే. ఉపఖండంలోని ముస్లింలకు మాతృభూమి కావాలనే ఊహను ప్రతిపాదించి, దాని కోసం పోరాడి, చివరకు పాకిస్తాన్‌ని సాధించడంలో విజయం పొందారనడంలో సందేహమే లేదు. విభజనకాలంలో మతపరంగా ప్రజలను అటూ ఇటూ మార్పిడి చేసుకున్నారన్నదీ వాస్తవమే. అయితే ప్రజల మార్పిడి ప్రక్రియ రక్తపాతంతో, మారణ కాండతో, అత్యాచారాలతో సాగింది. కొన్నేళ్లలోపే ఉపఖండం పశ్చిమప్రాంతంలో ఈ ప్రజల మార్పిడి ప్రక్రియ పూర్తయింది, దాదాపు ముగిసిపోయింది. భారత్ భూభాగంలోని పంజాబ్‌లో, ముస్లింలు, పాకిస్తాన్ భూభాగంలో హిందువులు, సిక్కులు చాలా తక్కువమంది మాత్రమే ఉండిపోయారు. 1960ల మధ్య వరకు విభజనకు సంబంధించి కొన్ని వింత ఘటనలు కొనసాగాయి. పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ అసిఫ్ ఇక్బాల్ 1961లో మాత్రమే పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు. అప్పటివరకు అతడు హైదరాబాద్ జట్టు తరపున ఆడేవాడు. 1965 యుద్ధ కాలంలో చిన్న అలజడి చెలరేగింది కానీ త్వరలోనే అది ముగిసిపోయింది. కానీ తూర్పు భారత్‌లో విభిన్న చిత్రం చోటు చేసుకుంది. అనేక సంక్లిష్ట కారణాల రీత్యా తూర్పు పాకిస్తాన్, భారత్‌కి చెందిన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురల మధ్య జనాభా మార్పిడి పూర్తి కాలేదు. బెంగాల్‌లోని అనేక వర్గాలకు చెందిన ముస్లింలు.. అలాగే తూర్పు బెంగాల్(పాకిస్తాన్)లోని హిందువులు భారత్‌లోనే ఉండిపోయారు. కానీ ఎత్తుకు పైఎత్తులు చోటు చేసుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. అందుకే ఇలాంటి ఘటనలను నిలిపివేయడానికి 1950లోనే జవహర్లాల్ నెహ్రూ, నాటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ ఆలి ఖాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే చారిత్రాత్మకమైన నెహ్రూ–లియాఖత్ ఒప్పందం. ఈ ఒప్పందంలో అయిదు ప్రధాన అంశాలున్నాయి 1. ఇరుదేశాలూ తమ భూభాగంలోని మైనారిటీలను పరిరక్షిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, సాయుధ బలగాల్లో చేర్చుకోవడంతోపాటు అన్ని హక్కులు, స్వేచ్ఛలను వారికి కల్పిం చాలి. 2. దాడుల కారణంగా తాత్కాలికంగా గూడు కోల్పోయి, వలసపోయినప్పటికీ, తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని భావిస్తున్నవారికి ఇరుదేశాలూ ఆశ్రయం కల్పించి, పరిరక్షించాలి. 3. అలా వెనక్కు తిరిగి రాని వారిని రెండు దేశాలూ తమతమ పౌరులుగానే భావిం చాలి. 4. ఈలోగా, ఇరు దేశాల్లో ఉండిపోయిన వారు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు, ఇప్పటికీ తామున్న దేశం నుంచి మరొక దేశంలోకి వలస వెళ్లాలని కోరుకుంటున్నవారికి ఇరుదేశాలూ రక్షణ కల్పించి సహకరించాలి. 5. ఇరుదేశాలు శాంతిభద్రతలను కాపాడటానికి నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు తాము కోరుకున్న భూభాగాలపై సురక్షితంగా ఉన్నట్లు భావించగలరు. ఈ ఒప్పంద సూత్రాలను బట్టే, భారత్ తన జనాభా గణనను చేపట్టి, 1951లో ప్రథమ జాతీయ పౌర పట్టికను (ఎన్ఆర్సీ) రూపొం దించింది. భారత్‌లో ముస్లిం జనాభా శాతం.. హిందువులు, సిక్కుల జనాభా కంటే కాస్త అధికంగానే పెరుగుతూవచ్చిందని, అదే సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉంటున్న హిందువుల జనాభా వేగంగా తగ్గుతూ వచ్చిందని ఇరుదేశాల జనగణన డేటా సూచిస్తోంది. అంటే హిందూ మైనారిటీలు పాక్‌ను, బంగ్లాదేశ్‌ను వదిలిపెట్టి భారత్‌లో స్థిరపడ్డారని చెప్పవచ్చు. దేశవిభజన సమయంలో పూర్తి చేయని కర్తవ్యానికి సమాధానంగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడానికి కారణం ఇదేనని బీజేపీ చెబుతుండవచ్చు. పాకిస్తాన్ నెహ్రూ–లియాఖత్ ఒడంబడికలోని సూత్రాలను పాటించి గౌరవించడంలో విఫలమైందని, దీంతో భారత్ మైనారిటీల సహజ నిలయంగా మారిందని పాక్‌లో మైనారిటీలను నేటికీ పీడిస్తున్నారని బీజేపీ వాదన. ఇక్కడే మనం సంక్లిష్టతల్లోకి కూరుకుపోవడం ప్రారంభిస్తాం. మొదట, భారత్ నిర్మాతలు తమ లౌకిక రిపబ్లిక్ ఇలా ఉండాలని కోరుకున్న చట్రంలో జిన్నా రెండు దేశాల థియరీ ఇమడలేదు. రెండు, ఏ దశవద్ద పాత చరిత్ర ముగిసి కొత్త చరిత్ర ప్రారంభం కావాలి? ఇక మూడోది, దేశీయతతో కూడిన జాతీయ సమానార్థకమైనది ఏది? మతం జాతి, భాషతో సమానమైనదా? తూర్పు భారత్‌లో ప్రత్యేకించి అస్సాంలో వలసల స్వభావం, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లడం అవసరం. అస్సాం సాపేక్షికంగా తక్కువ జనసాంద్రత కలి గిన విశాలమైన సారవంతమైన భూములతో, సమృద్ధిగా జలవనరులతో కూడిన ప్రాంతం. అందుకే ఈ రాష్ట్రంలోకి 20వ శతాబ్దిలో తూర్పు బెంగాల్ నుంచి తొలి దశ వలసలకు దారితీసింది. వీరిలో చాలామంది ఆర్థిక కారణాలతో వచ్చినవారే. భూములకోసం, మంచి జీవితం కోసం వీరొచ్చారు. ఇలా మన దేశంపైకి వలసరూపంలో చేసిన ఆక్రమణ గురించి ప్రస్తావించిన తొలి వ్యక్తి బ్రిటిష్ సూపరెంటెండెంట్ సీఎస్ ముల్లన్. 1931లో అస్సాంలో జనగణన కార్యకలాపాలను ఈయనే పర్యవేక్షించారు. తన మాటల్లోనే చెప్పాలంటే.. ‘బహుశా, గత 25 ఏళ్లలో అస్సాం ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘటన, అస్సామీయుల సంస్కృతి, నాగరికతలను పూర్తిగా ధ్వంసం చేసి అస్సాం భవిష్యత్తునే శాశ్వతంగా మార్చివేయగలిగిన ఘటన ఏమిటంటే, తూర్పు బెంగాల్ జిల్లాల నుంచి ప్రత్యేకించి మైమెన్సింగ్ జిల్లా నుంచి భూదాహంతో వలసవచ్చిన ముస్లింల భూ ఆక్రమణే’ అని సీఎస్ ముల్లాన్ పేర్కొన్నారు. ‘ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి రాబందులు వచ్చి కూడతాయి. ఎక్కడ బీడు భూములుంటే అక్కడికల్లా మైమెన్సింగ్ జిల్లా నుంచి వలస వచ్చినవారు గుమికూడతార’ని ఆయన ముగించారు. మరి అస్సాం ప్రజల జాతి, భాషా పరమైన ఆందోళనలు దీన్ని చూస్తే ఏమౌతాయో మరి. ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభంలోనే సమస్య కాగా, విభజన తర్వాత హిందువుల వలన దానికి మరింత తోడైంది. కాగా 1947కి ముందే వచ్చిన మైమెన్సింగ్ జిల్లాకు చెందిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. ఇదే సమస్యకు ప్రధాన కారణం. అస్సాం ఆందోళనలకు సమాధానం ఇవ్వడంలో పౌరసత్వ సవరణ చట్టం విఫలమవుతుండటానికి ఇదే ప్రధాన కారణం. మతంపై కాకుండా, జాతి, సంస్కృతి, భాష, రాజకీయ అధికారం వంటి అంశాల్లోనే అక్కడ అధిక ఆందోళనలు చోటుచేసుకుం టున్నాయి. గత మూడు దశాబ్దాలుగా దీన్ని మార్చడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తూ వచ్చాయి. పైగా ముస్లిం వలసప్రజలు దేశ విభజనకు ముందే వచ్చారు వీరికి పౌరసత్వాన్ని నిరాకరించలేరు. బెంగాలీ హిందువులు ఇటీవలి కాలంలో వచ్చినవారు. అందుకే జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే ఉండటం ఈ నిజాన్ని సూచిస్తోంది. ఇక్కడే బీజేపీ ఇరుక్కుపోతోంది. పౌరసత్వ చట్టాన్ని అమలు చేసినట్లయితే, ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది. తాజా పౌరసత్వ సవరణ చట్టంతో దీన్ని పరిష్కరించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ దీనికి అస్సామీయులు అంగీకరించడం లేదు. తాజాగా తీసుకొస్తున్న జాతీయవ్యాప్త పౌరసత్వ సవరణ పట్టికతో పౌరసత్వ చట్టాన్ని కలిపినట్లయితే ప్రారంభంలోనే అది చచ్చి ఊరుకుంటుందని బీజేపీకి తెలుసు. అందుకే దీన్ని ప్రజలను విడదీసే సాధనంగా బీజేపీ ఎక్కుపెట్టింది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా వారిపై బీజేపీ ఆరోపణలకు దిగుతుంది. అప్పుడేం జరుగుతుంది? వచ్చే మూడు దశాబ్దాల్లో జాతీయ పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్ 370గా మారిపోతుంది. ఈ అంశం వెనుక దాగిన విభజన రాజకీయాలు ఇవే మరి. వ్యాసకర్త, శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, twitter@shekargupta -
ముస్లిం ఓట్ల్ల ప్రాబల్యానికి గ్రహణం
భారతదేశాన్ని ఎవరు పాలించాలి.. ఎవరు పాలించకూడదు అని తేల్చే శక్తి గతంలో ముస్లింలకే ఉండేది. బీజేపీ అధికారం కోల్పోయిన ప్రతిసారీ ముస్లిం ఓటింగ్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకునేది. బీజేపీ అనేక సందర్భాల్లో ముస్లింలను చేరడానికి ప్రయత్నించింది. మైనారిటీల పట్ల వాజ్‌పేయి సానుకూలత ప్రదర్శించినా ఫలితం లేకుండా పోయింది. 2014లో నరేంద్రమోదీ, అమిత్ షాలు ఈ సమీకరణాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిపడేశారు. ముస్లిం ఓటర్ల సహాయాన్ని పొందకుండానే వారు సంపూర్ణ మెజారిటీని సాధించారు. ముస్లిం ఓటు తన శక్తిని కోల్పోయింది. ఫలితంగా పాలనావ్యవస్థలో ముస్లిలకు చోటు కరువైంది. అయితే దేశ జనాభాలో ఆరింట ఒకవంతు ప్రజలను వేరుచేసి, విడదీసిన ఏ దేశం, ఏ సమాజం కూడా భద్రతతో ఉండగలనని భావించకూడదు.భారతీయ జనతా పార్టీ ఒక విషయంలో నిత్యం మధనపడుతూనే ఉండేది. అదేమిటంటే, భారతదేశంలో తమకు దక్కాల్సిన రాజకీయ ప్రాముఖ్యతను దేశీయ ముస్లింలు దూరం చేస్తున్నారన్నదే బీజేపీ బాధ. గతంలో ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు నా మాజీ సహోద్యోగి, బీజేపీలో కీలక మేధావి అయిన బల్బీర్ పుంజ్తో నేను చేసిన సంభాషణల్లో పదే పదే ఇదే అభిప్రాయం వ్యక్తమయ్యేది. ’భారతదేశాన్ని ఎవరు పాలించాలి.. ఎవరు పాలించకూడదు అని తేల్చే శక్తి ముస్లింలకే ఉంది’ అని పుంజ్ తరచుగా చెప్పేవారు. మా మధ్య ఈ సంభాషణ 1999లో చోటు చేసుకుంది. లోక్‌సభలో రెండోసారి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినప్పుడు ఇది జరిగింది. లౌకికపార్టీలన్నీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఐక్యమైన ఫలితమది. 1996లో కూడా వాజ్‌పేయి తొలి ఎన్డీఏ ప్రభుత్వం 13 రోజుల్లోనే కుప్పగూలిపోయిందన్నది తెలిసిందే. రెండోధఫా ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ముగిసిపోయింది. బీజేపీ అధికారం కోల్పోయిన ప్రతిసారీ ముస్లిం ఓటింగ్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకునేది. లౌకిక వాద విలువలకే ముస్లింలు ప్రాధాన్యత నిచ్చేవారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. అప్పట్లో కాంగ్రెస్‌కి, బీజేపీకి మధ్య సీట్ల వ్యత్యాసం 145– 138గా ఉండేది. బీజేపీ అనేక సందర్భాల్లో ముస్లింలను చేరడానికి ప్రయత్నిం చింది. మైనారిటీలకు అత్యంత స్నేహపూరితమైన ముఖంగా వాజ్‌పేయి బీజేపీ తరపున నిలబడేవారు. మరోవైపున అడ్వాణీ సైతం ముస్లిం–లెఫ్ట్ పేరిట ముస్లిం మేధావులను పెంచి పోషించారు. జిన్నాను ప్రశంసించడానికి ముస్లిం పండుగల్లో పాల్గొనడం, ఏపీజే అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి భవన్‌కి ఎంపిక చేయడం వరకు ముస్లిం ఓటు దుర్గాన్ని బద్దలు చేసేందుకు వాజ్‌పేయి, అడ్వాణీ ప్రయత్నిం చారు. కానీ ఆ సంప్రదాయం లేని బీజేపీ విఫలమైంది. బీజేపీ దీన్నే భారత్‌ను ఎవరు పాలించాలి అనే అంశాన్ని తేల్చిపడేసే ముస్లిం వీటోగా పేర్కొంటూ వచ్చింది. బీజేపీ అధికారం దేశవ్యాప్తంగా పతనమైన యూపీఏ దశాబ్దంలో బీజేపీ వైఖరి మరింత పెరిగింది. తర్వాత 2014లో నరేంద్రమోదీ, అమిత్ షాలు ముందుకొచ్చారు. ఈ సమీకరణాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిపడేశారు. భారతీయ ముస్లిం ఓటర్ల సహాయాన్ని పెద్దగా పొందకుండానే వారు సంపూర్ణ మెజారిటీని సాధించారు. భారత రాజకీయాల్లో కొత్త ముద్ర ఏర్పడింది. ముస్లింలను, క్రైస్తవులను వదిలిపెట్టి 80 శాతం ఓటర్లతో కూడిన యుద్ధరంగంలోనే పోరాడాల్సి ఉందని ఇప్పుడు తాము గ్రహించామని పలువురు బీజేపీ నేతలు భావించసాగారు. ఈ వాస్తవాన్ని ఒకసారి వీరు అంగీకరించాక పార్టీ ముందున్న సవాల్ సులువైనదిగా మారింది. ‘హిందూ ఓటులో 50 శాతాన్ని కొల్లగొడితే చాలు.. మనం సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని ఏలగలం’. ఈ వాస్తవాన్ని వారు 2019లో కూడా నిరూపించారు. భారత రాజకీయాల్లో అసాధారణమైన పరివర్తన ఏదైనా ఉందా అంటే, 20 కోట్లమందితో కూడిన అతిపెద్ద ముస్లిం జనాభా ఓట్లకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత కూడా లేకుండా పోవడమే. విశ్వసనీయమైన ప్రతి ఎగ్జిట్ పోల్ చేసిన జనాభాపరమైన విశ్లేషణ దీన్నే వ్యక్తపరుస్తూ వచ్చింది. ఇదే బీజేపీ సెక్యులర్ ప్రత్యర్థులకు షాక్ కలిగించింది. అదే సమయంలో ముస్లింలను కూడా సమాధానాల కోసం అన్వేషించేలా చేసింది. ఈ 20 కోట్లమంది ముస్లింల హృదయాలను మీరు తరిచి చూసినట్లయితే నా ఓటు తన శక్తిని కోల్పోయింది అనే చిత్రణే మీకు కనబడుతుంది. కావచ్చు కానీ అధికార చట్రంలో నాకు చెందాల్సిన సరైన స్థానం కూడా తనకు దూరం కావలసిందేనా అనే వేదన మిగిలింది. ఆరో ఏడు పాలన సాగిస్తున్న మోదీ మంత్రివర్గంలో ఒక్క ముక్తర్ అబ్బాస్ నఖ్వి మాత్రమే మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్నారు. ఈయన ఒక్కరే కేంద్రంలో ముస్లిం మంత్రిగా ఉంటున్నారు. పైగా దేశ చరిత్రలో ఇప్పుడు ఒక ఆసాధారణమైన మలుపులో మనమున్నాం. కీలక రాజ్యాంగ పదవులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, సాయుధ బలగాల సేనాధిపతులు, భద్రత, నిఘా సంస్థల అధిపతులు, ఎలెక్షన్ కమిషన్, న్యాయవ్యవస్థ విభాగాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లింకూడా కనిపించని వాతావరణంలో మనం ఉంటున్నాం.పైగా దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా ముస్లిం ముఖ్యమంత్రి నేడు కనిపించరు. ఇక ముస్లిం వ్యక్తే ముఖ్యమంత్రిగా పాలించే జమ్మూ కశ్మీర్ ఇప్పుడు ఒక రాష్ట్రంగా కూడా లేదు. కీలక మంత్రిత్వ శాఖల్లో ఒక్క కార్యదర్శి పదవిలోనూ ముస్లిం కనబడరు. మరింత లోతుగా వెళ్లి చూస్తే.. 2015–17 మధ్యకాలంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నసీమ్ జైదీ ఒక రాజ్యాంగ పదవిని అధిష్టించిన చివరి ముస్లింగా చరిత్రకెక్కారు. హమీద్ అన్సారీ ఉన్నారనుకోండి. భారత్‌లోని 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నజ్మా హెప్తుల్లా, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనే ఇద్దరు ముస్లింలు మాత్రమే గవర్నర్లుగా ఉన్నారు. నేటి భారత్‌లో ఇది ఎక్కడ ముగుస్తుందో చెప్పలేం. బీజేపీ సబ్ కా సాత్, సబ్కా వికాస్‌పై జరుగుతున్న వాదనలు మనకు తెలుసు. తర్వాత దేశంలో ప్రధానంగా ఎలాంటి మత కల్లోలాలు లేవు. మోదీ ప్రభుత్వంలో ఐఏఎస్ తదితర విభాగాల్లో ముస్లిం అభ్యర్థుల సంఖ్య కనీసంగా మాత్రమే పెరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే మైనారిటీ స్కాలర్షిప్లు ప్రస్తుతం కాస్త పెరిగాయి. నిజమైన సమానత్వాన్ని ప్రబోధిస్తున్న దేశంలో 15 శాతం జనాభాకు తనదైన స్థానం దక్కాల్సి ఉంది. అధికారం, పాలన విషయంలో ఇది మరీ వర్తిస్తుంది. 2014 తర్వాత బీజేపీ నుంచి దీనికి వచ్చే సమాధానం ఒక్కటే. ‘మమ్మల్ని శత్రువులుగా భావిస్తూ మాకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మీరు చెబుతుంటారు తర్వాత అధికారంలో భాగం కావాలంటారు. ఎలా సాధ్యం?’ రాజ్యాంగపరమైన సమానత్వాన్ని ఇది ప్రశ్నిస్తోంది. మీకు ఓటుంది, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అవకాశాలున్నాయి. కానీ అధికారంలో వాటాకోసం మీ వోటింగ్ ఎంపికలపై మీరు పునరాలోచించుకోవాల్సి ఉందేమో మరి. దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లింల జనాభా చెల్లాచెదురుగా ఉంటున్నారు. లోక్‌సభలో 27 మంది ముస్లింలు మాత్రమే ఉంటున్న వాస్తవం దీన్ని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయిల్ వంటి జాత్యహంకార రిపబ్లిక్లో అతిపెద్ద మైనారిటీగా ఉంటున్న ముస్లింలకు ఇతర అవకాశాలున్నప్పటికీ, పాలనా యంత్రాగంలో చోటు లేదంటే అర్థం చేసుకోవచ్చు కానీ హిందూ రిపబ్లిక్ కాని భారత్‌లో ముస్లింల పరిస్థితి ఇలాగే ఉండటమే పెద్ద విషాదం. ప్రపంచంలో 40 శాతం పైగా ముస్లింలు భారతీయ ఉపఖండంలోనే జీవిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంనుంచి కొన్ని వందల సంఖ్యకు మించి ముస్లింలు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరలేదు. ఇక భారతీయ ముస్లింలలో ఐసిస్‌లో చేరినవారి సంఖ్య వందకు మించలేదు. ఇదెలా సాధ్యం? అంటే భారత్, పాక్, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లింలలో జాతీయవాదం వేళ్లూనుకుని ఉంది. వారికి సొంత జాతీయగీతం, క్రికెట్ టీమ్ ఉంది. గెలిపించడానికి, ఓడించడానికి రాజకీయనేతలు కూడా ఉన్నారు. ఇస్లాం రాజ్యం అనే ఊహ మన ముస్లింలను ఆకర్షించలేదు. పైగా ఉపఖండంలోని ముస్లింలు మతానికి మాత్రమే కాకుండా భాష, జాతి, సంస్కృతి, రాజకీయ సిద్ధాంతం వంటి ఇతర అంశాల ప్రభావానికి కూడా గురై ఉంటున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన అతి గొప్ప శక్తి ఇదే. 2014 తర్వాత ముస్లిం మైనారిటీ ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని భారత్ ఏమాత్రం కోరుకోవడం లేదు. వారి మౌనం అర్ధాంగీకారం కాదు. భారతీయ ముస్లింలు మధ్యతరగతిగా పరివర్తన చెందారు. వీరిలోంచి విద్యావంతులైన, వృత్తినైపుణ్యం కలిగిన కులీనవర్గం ఆవిర్బవించింది. వారసత్వ పార్టీ, వామపక్ష–ఉర్దూ కులీన వర్గాలకు చెందిన పాత వ్యవస్థను వారిప్పుడు అనుసరించడం లేదు. ఓటింగ్ ప్రాధాన్యతల రీత్యా ముస్లింలను శిక్షించడం వల్ల ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నట్లు సంతోషం కలిగించవచ్చు. కానీ అది స్వీయ ఓటమికే దారి తీస్తుంది. దేశ జనాభాలో ఆరింట ఒకవంతు ప్రజలను వేరుచేసిన ఏ దేశం, ఏ సమాజం కూడా భద్రతతో ఉండగలనని భావించకూడదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
హిందుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్ బలహీనత
వీర సావర్కర్, జాతీ యవాదంపై సోనియా, రాహుల్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవల్సిందేమిటి? వీర సావర్కర్ పట్ల కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అయోమయం మరోసారి జాతీయవాదంపై దాని ద్వైదీభావాన్ని బట్టబయలు చేసింది. సావర్కర్‌కు భారతరత్న అవార్డుపై తాజా వివాదం కాంగ్రెస్‌ని బట్టలూడదీయించినంత పనిచేసింది. సావర్కర్‌ని నాజీగా, గాంధీ హత్యకు కుట్రదారుగా ఖండించడానికి, ‘మేం సావర్కర్‌జీని గౌరవిస్తాం కానీ ఆయన భావజాలంతో ఏకీభవించలేం’ అంటూ మన్మోహన్ సింగ్ సూక్ష్మభేదంతో చెప్పడానికి మధ్య కాంగ్రెస్ పార్టీకి ఒక సున్నితమైన అంశంపై తన పంథా గురించి ఏమీ తెలీదని అనిపిస్తోంది.మన్మోహన్ వివేకంతో కూడిన ప్రకటన చేసిన 24 గంటల తర్వాత, కాంగ్రెస్ పార్టీ సింగ్ ప్రకటన నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది. సింగ్ ప్రకటనను తేలికపర్చడానికి కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా చేసిన ప్రయత్నం నిస్పృహతోనూ కూడి ఉంది. మన్మోహన్ ప్రకటనలో కుతర్కం గానీ, సందిగ్ధత గానీ లేదు. నిజానికి ఆయన చేసిన ప్రకటన ప్రారంభం నుంచి తన పార్టీ వైఖరిగా ఉండి ఉండాలి. అప్పుడే ఆ పార్టీ స్వీయ విధ్వంసంవైపు పోకుండా అది కాపాడి ఉండేది. ప్రత్యేకించి సావర్కర్ వీరాభిమానులు 1970లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సావర్కర్ గౌరవార్థం పోస్టేజీ స్టాంప్ విడుదల చేసిన చిత్రాన్ని, సావర్కర్‌కి ఇందిర అందించిన నివాళిని గుర్తు చేస్తూ ఫాసిమైల్ పంపుతున్న ప్రస్తుత సందర్భంలో కాంగ్రెస్ తనవైఖరిని పునరాలోచించుకోవలసింది. సావర్కర్ జీవితంపై డాక్యుమెంటరీకి ఇందిర ప్రోత్సాహమివ్వడమే కాకుండా ఆయన స్మారక నిధికి రూ.11,000 (నేటి విలువలో రూ. 5 లక్షలు) డొనేషన్ కూడా ఇచ్చారు. మరి కాంగ్రెస్ తన ప్రస్తుత వైఖరిని ఇందిరతో పోల్చుకోగలదా? ఇందిర, పీవీ నరసింహారావు లాంటి వ్యక్తి కాదు. హిందుత్వకు సన్నిహితుడు కానప్పటికీ మెతక లౌకికవాదం ప్రదర్శించడమే కాకుండా తన ‘ధోవతీలో కాకీ నిక్కర్ ధరించినందుకు’గాను పీవీని కాంగ్రెస్ పార్టీ తృణీకరించింది, పార్టీలో ఆయనకు స్థానం లేకుండా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మళ్లీ పార్టీ పాత తరహా కరడుగట్టిన లౌకికవాదానికి మళ్లాలని డిమాండు చేస్తున్నారు. లౌకికవాదంపైగానీ, హిందుత్వపైగానీ ఇందిర మెతకవైఖరితో వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఆరోపించలేరు. సైద్ధాంతికత కంటే రాజకీయానికే ఆమె ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆర్ఎస్ఎస్/జనసంఘ్‌ను అసహ్యించుకున్నప్పటికీ, వారిని దేశపటం నుంచి పరిత్యజించాలని ఆమె అనుకోలేదు. ఆరెస్సెస్‌పై ఆమె ఆరోపణ ఏమిటంటే, అది స్వాతంత్య్రోద్యమంలో భాగం కాకుండా బ్రిటిష్ వారితో కుమ్మక్కయిందనే. వీరసావర్కర్ని ఆరెస్సెస్ చేతిలో పెట్టాలని ఇందిర భావించలేదు. ఆరెస్సెస్‌కి ఒక పెద్ద సమస్య ఉంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నిజమైన హీరోలు ఎవరూ ఆ సంస్థకు లేరు. కాంగ్రెసేతర నేతలైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌ను కూడా వారి భావజాలం నుంచి ఆరెస్సెస్ తొలగించివేసింది. గాంధీ, నెహ్రూ వంశానికి చెందని ఎవరినైనా కౌగిలించుకోవడానికి ఆరెస్సెస్ సిద్ధంగా ఉంది. మోదీ ప్రభుత్వం ఇప్పుడు నెహ్రూ కంటే సర్దార్ పటేల్‌ని భారత గణతంత్ర రాజ్య సంస్థాపకుడిగా ఎత్తిపట్టాలని చూస్తోంది. కానీ పటేల్ ఎన్నడూ ఆరెస్సెస్ అభిమాని కాదని, గాంధీ హత్య తర్వాత ఆ సంస్థను పటేల్ నిషేధించారని మర్చిపోవద్దు. ఆరెస్సెస్ పట్ల ఆయనకు వ్యతిరేకత ఉన్నప్పటికీ, నెహ్రూతో పటేల్ విభేదాలు మరింత బలంగా ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ నుంచి బీజేపీ లాగేసుకున్న తొలి ప్రముఖ వ్యక్తిగా పటేల్ నిలిచారు.ఆరెస్సెస్ మేధావి, దాని అధికార వాణి ఆర్గనైజర్ సంపాదకుడు శేషాద్రి ఒక ముఖ్యమైన రాజ కీయ అంశాన్ని లేవనెత్తారు. ఇందిర జనసంఘ్ /బీజేపీలను హిందుత్వపార్టీగా ఎన్నడూ వర్ణించలేదు. తన రాజకీయాలను హిందూయిజానికి వ్యతిరేకంగా ఆమె ఎన్నడూ నిలపలేదు లేదా మెజారిటీ ప్రజానీకం విశ్వాసాన్ని తన ప్రధాన ప్రత్యర్థులకు ఆమె ఎన్నడూ అప్పగించలేదు. బనియా పార్టీగా మాత్రమే వారిని ఆమె కొట్టివేసేది. జనసంఘ్, బీజేపీలను హిందూ పార్టీగా పిలిస్తే హిందువుల నుంచి రాజకీయ మద్దతు వారికి లభిస్తుంది. బనియాలు అని ముద్రిస్తే వారు ఓట్లపరంగా అతి చిన్న బృందానికి పరిమితం అవుతారు. పైగా జనసంఘ్, బీజేపీలు సంపన్నులకు, వడ్డీవ్యాపారులకు, లాభాపేక్షగల వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినందున, గ్రామీణ ప్రాంతంలో చాలామంది హిందువులు బీజేపీ పట్ల పెద్దగా అనుకూలంగా ఉండేవారు కాదు. అందుకే ఇందిర వారిని సమాజానికి ఏమాత్రం మంచి చేయని ఫక్తు వ్యాపారులుగా, బనియాలుగా ముద్రించి తృణీకరించేవారు. సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని బని యాలపై కాకుండా హిందుత్వపై, హిందూయిజం పైకి మళ్లించిందని శేషాద్రి వ్యాఖ్యానించారు. ఇందిర కాంగ్రెస్‌కు, నేటి కాంగ్రెస్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. ఇందిర వామపక్ష మేధావులను తన దర్బారులో చేర్చుకుని, తన రాజకీయాలకోసం వారి ఆలోచనలను వాడుకున్నారు. కానీ సోనియా మాత్రం వామపక్షాలను, వారి మేధావులను దూరం పెట్టి తన రాజకీయాలను నడిపారు. ఇందిర వారసులు జాతీయవాదం, మతం, సోషలిజం వంటి అంశాలపై భీకర రాజకీయ త్రిశూలధారులైన మోదీ, షాల బీజేపీని ఎదుర్కొంటున్నారు. వీరిని సోనియా–రాహుల్ కాంగ్రెస్ ఎలా ఎదుర్కోగలుగుతుంది? శబరిమల, ట్రిపుల్ తలాక్, అయోధ్య వంటి ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. కరడుగట్టిన సోషలిజాన్ని మాత్రమే కాంగ్రెస్ తిరిగి పాటిస్తూ జాతీ యవాదాన్ని, మతాన్ని, సంస్కృతిని బీజేపీకి అప్పగించేటట్లయితే లోక్‌సభలో 52 స్థానాలు దానికి దక్కడం కూడా అదృష్టమేనని చెప్పాలి. రాజకీయ వేత్తకాని మన్మోహన్ సింగ్ దాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఆయన పార్టీ మాత్రం సింగ్ మాటల్ని ఎన్నడూ వినలేదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ ఆర్థికంలో అద్భుతాలు సాధ్యమా?
భారత ఆర్థిక వ్యవస్థ అనే ఏనుగు మరణం గురించిన వార్తలు మరీ అతిశయించిన రూపంలో ఉంటున్నాయి. కానీ అది చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతోందన్నది నిజం. జాతీయవాదం మరీ పాతుకుపోతున్నప్పుడు, వెనుకంజ కూడా జాతిని ఐక్యం చేసే అంశంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీకి లభిస్తున్న ప్రజాదరణ స్పష్టం చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద సవాలు అయిన ఆర్థిక మందగమనాన్ని తోసిపుచ్చి మోదీ అసాధారణంగా పేరు ప్రఖ్యాతులు పొందుతుండవచ్చు లేదా ఏదైనా అద్భుతాన్ని సృష్టించి దాన్ని మరింతగా మెరుగుపర్చవచ్చు కూడా. మోదీ ఆర్థిక వ్యవస్థ బాధ్యతలను నేరుగా చలాయించగలిగితే 2014 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చడం అసాధ్యం కాదు. నా ఈ మాటలు నిజం కావాలని నేను నిజాయితీగా కోరుకుంటున్నాను. అనేక సంవత్సరాలుగా నేను వార్తలను కవర్ చేస్తూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ వచ్చాను. హేతుబద్ధంగా ఉండే ప్రజాస్వామ్య దేశాల్లో లాగా తమ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడ్డానికి సుముఖత చూపని ప్రజలను కూడా కలిశాను. అది నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. కష్టకాలాల్లో హాస్యం, వ్యంగ్యం వికసిస్తూ ఉంటాయి. అయితే అనుమానం, భయం చోటుచేసుకున్నప్పుడు సృజనాత్మకతకు చెందిన రసావిష్కరణ పరవళ్లు తొక్కుతుంటుంది. గతంలో సోవియట్ పాలనపై వచ్చిన అత్యుత్తమ జోక్‌లు మాస్కోలోని వీధుల్లో, షాపుల్లో వినపడేవట. కానీ గుసగుసల రూపంలో మాత్రమే అని అదనంగా జోడిం చాలి. నిన్నటి గుసగుసలు నేటి వాట్సాప్ ఫార్వర్డ్‌లుగా మారుతున్న కాలమిది. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న జోకులను ముందుగా ఎవరు కనిపెట్టారో తెలీదు కనుక, పేరు లేకుండా వాట్సాప్‌లో జోకులు పేల్చడం సురక్షితమైనది. ఈ సీజన్లో బాగా వ్యాప్తిలో ఉన్న అంశం భారతీయ ఆర్థిక వ్యవస్థ. తాజాగా 1.45 లక్షల కోట్ల పన్ను రాయితీతో కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యకు ప్రాధాన్యం లేదు. ప్రతిరోజూ నా ఇన్‌బాక్స్‌లో మోదీ ప్రభుత్వ ఉపద్రవపూరితమైన ఆర్థిక వ్యవస్థ గురించి అనేక జోకులు, మెమ్‌లు వచ్చి చేరుతుం టాయి. వీటిలో మహారాజు, ఆయన ప్రేమించే ఏనుగు గురించిన జోకులు ఎక్కువగా వ్యాప్తిలో ఉంటాయి. దురదష్టవశాత్తూ ఒకరోజు దానికి ప్రాణాంతక జబ్బు వచ్చింది. గుండె పగిలిన మహారాజు తన ఏనుగు చనిపోయింది అన్న వార్తను తన వద్దకు మొదటగా మోసుకొచ్చే వాడి తల నరికిస్తానని హుంకరించాడు. ఒక రోజు అనివార్యమైనదే సంభవించింది. కానీ మహారాజు చెవిన ఆ విషయం చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. చివరకు మావటీవాడు కాస్త ధైర్యం తెచ్చుకుని వణుకుతూ, ‘మహారాజు ఏనుగు ఏమీ ఆరగించలేదని, లేవడం లేదని, శ్వాస పీల్చడం లేదని, స్పందించడం లేద’ని చెప్పాడు. ‘అంటే నా ఏనుగు చనిపోయిందని చెబుతున్నావా’ అని మహారాజు ప్రశ్నించాడు. ‘ఆ విషయం మీరే చెప్పారు మహారాజా’ అని మావటి గజగజ వణుకుతూ చెప్పాడు. ఈ కథలోని ఏనుగువంటిదే ప్రస్తుత మన ఆర్థిక వ్యవస్థ. మన ఏనుగు బహుశా చచ్చిపోయి ఉంటుందని కేంద్ర ప్రభుత్వంలోని అనేకమంది మంత్రులు వివిధ మార్గాల్లో ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఏనుగు చచ్చిపోయింది అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించడానికి ఎవరూ పూనుకోవడం లేదు. మార్క్ ట్వైన్ మాటల్ని అరువు తెచ్చుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థ మరణం గురించిన వార్తలు మరీ అతిశయించిన రూపంలో ఉంటున్నాయి. కానీ అది చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతోందన్నది నిజం. గత జూన్ నుంచి మదుపుదారులకు చెందిన రూ.11 లక్షల కోట్ల మదుపులు ఆవిరైపోయాయి. ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రభుత్వ స్పందన మూడు రకాలుగా ఉంటోంది. ఒకటి, మోదీని ద్వేషించేవారు చేస్తున్న తప్పుడు ప్రచారమే దీనికి కారణం. రెండు, ఆర్థిక మంత్రి తాజా ప్రకటన మరింత విశిష్టమైంది. సరైన గేమ్ ప్లాన్ లేకుండా భారీగా కార్పొరేట్ పన్నురాయితీ కల్పించడం. హౌస్టన్ వీకెండ్లో ఇది పతాశ శీర్షిక అయింది. మార్కెట్లు కొన్నిరోజులపాటు పండగ చేసుకుంటాయి. కానీ ఈ రాయితీని చెల్లించడం కోసం ప్రభుత్వం తన సొంత ఖర్చులను కుదించుకోవడానికి తగిన సాహసం ప్రదర్శించకపోతే ఇది మరింత కరెన్సీని ముద్రించడం ద్వారా మార్కెట్లకు అందించడానికి లేక పేదలపై పరోక్ష పన్ను విధించడానికి మార్గం సుగమం చేసుకుంటుంది. ఇక మూడవదీ చాలా ముఖ్యమైనదీ ఏమిటంటే ఇవి మోదీ రెండో దఫా హయాంలో ప్రారంభ దినాలు మాత్రమే. రెండో దఫా పాలనలో 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కొన్నింటిని మోదీ పరిష్కరించారు. ట్రిపుల్ తలాక్‌తోపాటు ఏకీకృత సివిల్ కోడ్ వైపు తొలి అడుగు వేశారు. తర్వాత ఆర్టికల్ 370 రద్దు. ఇలాగే మరికొన్ని. బహుశా నవంబర్ మొదట్లోనే రామమందిరం నిర్మాణం ప్రారంభం కావచ్చు. తర్వాత అత్యంత కష్టమైనది, అత్యవసరమైనది వేచి చూస్తోంది. మోదీ ఆర్థిక వ్యవస్థ బాధ్యతలను నేరుగా చలాయించవచ్చు. తాను అలా చేయగలిగితే 2014 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చడం కూడా అసాధ్యం కాదు. నా ఈ మాటలు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. మరొక దృక్పథం ఏమిటంటే, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు సమీపకాలంలో మెరుగుపడవన్నదే. అయితే 2018 మే నెలలో జాతిహితంలో నేను చెప్పినట్లుగానే తనకున్న భారీ ప్రజాదరణమీద మోదీ స్వారీ చేస్తుంటారు. ఆయన ఓటర్లు మాత్రం మోదీకోసం త్యాగాలు చేస్తుంటారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గత నెల మాతో చేసిన సంభాషణలో అద్భుతరీతిలో దీన్ని వివరించారు. జాతీయవాదం పెచ్చరిల్లుతున్నప్పుడు ప్రజలు ఆర్థికరపరమైన త్యాగాలను ఆమోదిస్తారు అని అన్నారాయన. జాతీయవాదం మరీ పాతుకుపోతున్నప్పుడు, వెనుకంజ కూడా జాతిని ఐక్యం చేసే అంశంగా ఉంటుందని ఖట్టర్ విడమర్చిచెప్పారు. దీనికి సులభమైన ఉదాహరణ ఉంది కూడా. చంద్రయాన్ 2 హృదయాల్ని బద్దలు చేస్తూ విఫలమైన క్షణాల్లో కూడా యావద్దేశం ఆ రోజు రాత్రి 2 గంటలవరకు చంద్రయాన్–విక్రమ్ ల్యాండింగ్‌ను చూడటానికి మేల్కొని చూస్తూ ఉండటమే. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పుడు కూడా మోదీ ప్రజాదరణ ఆకాశాన్నంటుతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలోని హౌస్టన్‌లో ఆదివారం రాత్రి జరగనున్న ‘హౌడీ, మోదీ’ (ఎలా ఉన్నారు మోదీ) కార్యక్రమం కోసం జనం మానసిక స్థితిని గమనించండి చాలు. నరేంద్ర మోదీ ఉత్థానం సాంప్రదాయిక రాజకీయ విశ్లేషణలను పటాపంచలు చేసింది. పెద్దనోట్ల రద్దు దారుణ వైఫల్యాన్ని చవి చూస్తూ కూడా భారత్ తనను క్షమించేసింది. నిరుద్యోగం పరాకాష్టకు చేరుకుంది కానీ ఓటింగ్ పరంగా అది మోదీని దెబ్బతీయలేదు. ఎన్నికల సమయంలో నేను దేశ పర్యటనలో ఉన్నప్పుడు ఎంతోమంది సామాన్యులు, పేదలు పెద్దనోట్ల రద్దు వల్ల తామెంతగానో దెబ్బతిన్నామని కానీ దేశం కోసం మనం కొంతమేరకు వ్యక్తిగత త్యాగాలు చేయవలసి ఉంటుందని నేరుగా చెబుతుంటే దిగ్భ్రాంతి చెందాను. మోదీ పట్ల సామాన్యులు ఇదే అభిమానాన్ని కొనసాగించడం అసాధ్యం కాదు. ఇప్పటికే విజయవంతమైన ఎల్పీజీ, టాయిలెట్లు, గ్రామీణ గృహకల్పన, ముద్రా లోన్లు వంటి పథకాలతో పాటు ఇంటింటికీ కుళాయిల ద్వారా నీళ్లు, ఆయుష్మాన్ భారత్ వంటి కొత్త, స్మార్ట్ పథకాలను ప్రభుత్వం పతాక శీర్షికల్లో అద్బుతంగా ప్రచురింపజేస్తున్నంత కాలం మోదీకి జరిగే నష్టమేమీ ఉండదు. తన మొదటి విడత పాలనలో అభివృద్ధితో సంబంధం లేకుండా ఈ పథకాలన్నింటికీ ఆయన నిధులు అందించగలిగారు. ఎక్సయిజ్ పన్ను పెంపు ద్వారా లభించిన సుమారు రూ.11 లక్షల కోట్లతో ఇది సాధ్యమైంది. అభివృద్ధి లేకుండా అదనపు సంపదను సృష్టించడం ఇప్పుడు సాధ్యం కాదు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఈ రాజకీయ ఆర్థిక వ్యవస్థ నాశనం కాక తప్పదు. గతంలో విశేష జనాదరణ పొందిన నేత ఇందిరా గాంధీ. 1972 మొదట్లో బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఆమె ఓ వెలుగు వెలిగారు. ఆమె తప్పేమీ చేయలేదు. ఆమె తన కఠినమైన, వినాశకరమైన పద్ధతిలో వరుసగా ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారు. అదే పద్ధతిలో నిర్మాలా సీతారామన్ పన్ను 42.7 శాతానికి పెంచేశారు. దీంతో ఎంతో కొంత ఆదాయం వస్తుందని అందరికీ తెలుసు. కానీ పన్నుల రాబడి పడిపోయింది. ధనవంతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పేదలు ఆనందపడ్డారు. అప్పట్లో ఇందిర లాభపడినట్టే మనమూ లాభపడుతున్నాం. అదే ఇందిర 1969–73మధ్య ఏ తప్పూ చేయకపోయినా, 1974లో జాతీయం, జాతీయవాద చర్యలతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. సోవియట్ విధానాలతో స్ఫూర్తిపొందిన అనుయాయుల సలహాలతో ధాన్యం, గుడ్ల పరిశ్రమను కూడా జాతీయం చేయడం ద్వారా ఇందిర ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వెంటనే ఆమె తన తప్పును సరిదిద్దుకుంది. అదేవిధంగా మోదీ ప్రభుత్వం భయంతో రూ. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్నును రద్దు చేయడం తీవ్ర నష్టం కలిగిస్తుంది. బహుశా లక్షల్లో ఒకడిగా మోదీ ఈ చరిత్రను తిరగరాయొచ్చు. ఆయనకు అత్యంత సన్నిహితులైనవారు చెబుతున్నట్టుగా ఆర్థిక వ్యవస్థ పగ్గాలను చేబూని అద్భుతం చేయొచ్చు. అది జరగాలని మనం ఆశిద్దాం. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ Twitter@ShekarGupta -
మోదీని ఇష్టపడండి లేక తిరస్కరించండి!
మోదీని మీరు ఇష్టపడండి లేక తిరస్కరించండి. కానీ సిమ్లా ఒప్పందం అనంతర యథాతథ స్థితిని ఆయన ఇప్పుడు చెరిపివేశారు. కశ్మీర్లో పాక్ ఉప–సైనిక విన్యాసాలకు ఇక తావులేదు. ఆర్టికల్ 370 రద్దు గురించి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించడం లేదు. దాని పద్ధతినే అవి వ్యతిరేకిస్తున్నాయి. కశ్మీర్లో ప్రస్తుతం సరికొత్త యథాస్థితి ఏర్పడింది. కానీ కశ్మీర్ సమస్య ప్రజాగ్రహం, పరాయీకరణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ముడిపడి ఉంది. వీటిని తప్పక పరిష్కరించాలి. ఇరుదేశాల మధ్య సరిహద్దులు ఇక శాశ్వతం అన్న వాస్తవాన్ని అంగీకరించాలి. రక్తం పారించి కశ్మీర్ రీజియన్‌లో మ్యాప్‌లను తిరగరాయలేమని సలహా చెప్పడానికి మనం ఇప్పుడు బిల్ క్లింటన్‌ను మళ్లీ రప్పించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ వాస్తవాన్ని ఆమోదించిన తర్వాత మీరు భవిష్యత్తు గురించి చర్చించవచ్చు. కశ్మీర్లో సిమ్లా ఒప్పందం అనంతర యథాతథ స్థితిని ప్రధాని మోదీ చెరిపివేశారు. కశ్మీర్ తన సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన గతం నుంచి బయటపడి కొత్త వాస్తవికతను అంగీకరించవలసి ఉంది. కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెదికేముందుగా మనం ఆ సమస్యను సరిగా అవగాహన చేసుకోవలసి ఉంది. వాస్తవికతను అర్థం చేసుకోకుండా పరిష్కారాలతో ముందుకు దుమికితే చిక్కులు తప్పవు. నకిలీ వైద్యులు (లేదా భూతవైద్యులు కావచ్చు) మాత్రమే సరైన రోగ నిర్దారణ చేయకుం డానే దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధాలను సూచించగలరు. ఇలాంటి మూడురకాలకు చెందిన భూతవైద్యుల నుంచి నేడు కశ్మీర్ సమస్యకు మూడు రకాల పరిష్కారాలను మనం చూడవచ్చు. వీటిలో మొదటిది భారత పాలకవర్గ దృక్పథానికి సంబంధిం చింది. కశ్మీర్లో అసలు సమస్య పాకిస్తానే అని, రైఫిళ్లతో, రాకెట్ లాంఛర్లతో, ఆర్డీఎక్స్తో ఆ దేశం ఎగుమతి చేస్తున్న రాడికల్ ఇస్లాం మాత్రమే భారత్ అసలు సమస్య అని భారత పాలక వ్యవస్థ ప్రదర్శిస్తున్న దృక్పథానికి విస్తృత ప్రజానీకం మద్ధతు లభిస్తోంది. పాకిస్తానీయుల బెడద లేకుండా చేసుకున్నట్లయితే, మీరు దాల్ సరస్సులో ‘కశ్మీర్ కీ కలి’సీక్వెల్‌కి షూటింగ్ చేయవచ్చు. ఇక రెండో కేటగిరీ పాకిస్తాన్ పాలనా వ్యవస్థ భ్రమలకు చెందింది. భారతీయులను కెలకడం, గిల్లడం, రక్తాలు కారేలా చేయడం ద్వారా వారిని పారదోలుదాం. మనం అప్గానిస్తాన్‌లో సోవియట్లను, అమెరికన్లనే ఓడించాం. భారత్ మనకో లెక్కా? భారత్‌ను అలా పారదోలిన తర్వాత కశ్మీర్‌ని మొత్తంగా పాకిస్తాన్‌కి చెందిన ఆరో ప్రాదేశిక ప్రాంతంగా కలిపేసుకుందాం. ఇక మూడో కేటగిరీ ఏమిటంటే మనం ఇవ్వాళ చేస్తున్న విశ్లేషణే. ఇది చిన్నదే అయినప్పటికీ భారతీయ ఉదారవాదులకు సంబంధిం చింది. భారత్‌లో కశ్మీర్ విలీనం అంతిమం కాదు, కశ్మీరీల మనోబలం అపారమైనది, అది ఇంకా ప్రదర్శితం కాలేదు. అంతవరకు ప్రజాభి ప్రాయ సేకరణ, స్వయంప్రతిపత్తి, చివరకు స్వాతంత్య్రం వంటి వారి మౌలిక డిమాండ్లు చట్టబద్ధమైనవిగానే ఉంటాయి. రాజ్యవ్యవస్థను, సైనిక శక్తిని ఉపయోగించి వారిని భారత్‌లో కొనసాగేలా చేయలేరు. తాత్వికంగా చూస్తే ఈ వైఖరితో వాదించడం కష్టం. భారతదేశం పలు రాష్ట్రాల స్వచ్చంద సమాఖ్యగా ఉంటోంది. ప్రజలు మీతో కలిసి ఉండాలని కోరుకోనప్పుడు మాతోనే కొనసాగాలంటూ మీరు వారిని ఎలా ఒత్తిడికి గురిచేయగలరు? ఉదారవాదుల అభిప్రాయంతో వాదించడం ద్వారా కలిగే చిక్కులను నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఈ వైఖరి వారిని అత్యున్నత నైతిక శిఖరంపై ఉంచు తోంది. కానీ మనం ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ప్రస్తుతం మనదేశంలోని ఉదారవాదుల స్థాయిని అయిదు ప్రాథమిక భాగాలుగా వేరు చేసి పరిశీలిద్దాం. 1. భారతదేశం 1947–48లలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో, కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు కట్టుబడతానని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని అది ఎందుకు ఉల్లంఘించినట్లు? వాస్తవమేమిటంటే, భారత్, పాకిస్తాన్ రెండూ కశ్మీర్లో ప్లెబిసైట్కి హామీ పడ్డాయి. కానీ రెండు దేశాలు దాన్ని ఉల్లంఘించాయి. ఆనాటి ఐరాస తీర్మాన పాఠంలోని మూడు దశల్లో మొదటి అంశం ఏదంటే, పాకిస్తాన్ తన బలగాలన్నింటినీ కశ్మీర్ నుంచి ఉపసంహరించు కోవాలి, ఇతరులు కూడా (వీరిని జిహాదీలు అంటున్నాం) కశ్మీర్‌కు దూరం జరగాలి. కానీ ఇది ఎన్నడూ జరగలేదు. ఇక రెండో అంశం.. కశ్మీర్లో కనీస స్థాయిలో మాత్రమే సైనికబలగాలను భారత్ ఉంచాలి. తర్వాత అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పర్చాలి. తర్వాత ఐక్యరాజ్యసమితి నియమించే గవర్నర్ నేతృత్వంలో ప్లెబిసైట్ నిర్వహిం చాలి. ఈ మూడింట్లో మొదటి దాన్ని పాకిస్తాన్ చేపట్టలేదు. దీంతో భారత్ మిగిలిన రెండు అంశాలను గౌరవించలేదు. 2. కశ్మీరీలలో చాలామంది భారత్, పాకిస్తాన్ రెండింటినీ కోరుకోవడం లేదు. వారు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు వారికి దాన్ని ఇవ్వకుండా ఎలా తిరస్కరించగలరు? మరోసారి కశ్మీర్‌పై ఐరాస తీర్మానాలు చూడండి. కశ్మీర్ స్వాతంత్య్రాన్ని లేక అజాదీని ఒక ఐచ్ఛికంగా ఇవి పేర్కొనలేదు. భారత్ లేక పాక్ రెండు దేశాల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోమని ఆ తీర్మానాలు చెబుతున్నాయి. ఇకపోతే కశ్మీర్ అజాదీ (స్వాతంత్య్రం)కి పాక్ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్న మద్దతు వంచనాత్మకమైనది. అయితే పాకిస్తానీ యులు కశ్మీరీల స్వాతంత్య్రం కోసం మద్దతు పలుకుతున్నారన్న కృత్రిమ ప్రచారంతో పాక్ మద్దతు ఒకమేరకు గ్లోబెల్ తరహా విజ యాన్ని పొంది ఉంది. తన ఆక్రమణలో ఉన్న పీఓకేని అజాద్ కశ్మీర్ అని పిలవడం ద్వారా పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా ఈ అభిప్రాయాన్ని విజయవంతంగా నిర్మిస్తూవచ్చింది. అయితే అజాద్ కశ్మీర్ కాల్పనిక భ్రమను పాకిస్తాన్ పీవోకేలో పెంచి పోషించగలదేమో కానీ తతిమ్మా భారత్‌లో దాని పప్పులుడకవు. 3. సైనిక శక్తితో ఒక భూభాగాన్ని, ప్రజలను నిలిపి ఉంచగలరా? తిరుగు ప్రశ్నే ఈ ప్రశ్నకు సమాధానమవుతుంది. సైనిక శక్తిద్వారా మీరు మరొక దేశం నుంచి ఒక భూభాగాన్ని, ప్రజలను స్వాధీనం చేసుకోగలరా? పాకిస్తాన్ దీనికే సుదీర్ఘకాలం ప్రయత్నించింది. 1947–48లో 1965లో ప్రత్యక్ష సైనిక దాడి ద్వారా రెండు సార్లు, 1989 నుంచి పరోక్ష యుద్ధం ద్వారా దీనికోసం పాక్ ప్రయత్నించింది. మధ్యలో కార్గిల్ వంటి ఉన్మాద చర్యలు కూడా ఉన్నాయి.ఇవి నిజాలు. అందుకే 1953 మధ్య కాలంలో ఐరాస తీర్మానాలనుంచి నెహ్రూ వైదొలగడాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్నయుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడం, భౌగోళికంగా కశ్మీర్ వ్యూహాత్మక ప్రాధాన్యత పెరిగిపోవడం వంటి పరిణామాలతో భవిష్యత్తులో ఎదురవనున్న చిక్కులను ముందుగానే పసిగట్టి షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయడం ద్వారా నెహ్రూ 1953లో కశ్మీర్‌ని భారత్‌లో కలిపేసుకునేం దుకు చర్యలు చేపట్టారు. ఆ తర్వాతి దశాబ్దమంతా అమెరికా మద్దతుతో పాక్ సైనిక సమతుల్యతా పరంగా ముందజ వేసింది. అందుకే నెహ్రూ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యే కశ్మీర్‌ని సైనిక ఆక్రమణ నుంచి కాపాడిందన్నది వాస్తవం. సైనికపరంగా ముందంజ వేశామని, 1962 చైనాతో యుద్ధంలో భారత్ సైనికంగా పతనమైందని, నెహ్రూ మృతి, ఆహార ధాన్యాల కొరతతో భారత్ వెనుకపట్టు పట్టిం దని గ్రహించి కశ్మీర్ ఆక్రమణకు అమెరికా ఆయుధాలు, శిక్షణ దన్నుతో పాక్ తీవ్రంగా ప్రయత్నించింది కానీ ఆ ప్రయత్నంలో అది ఓడిపోయింది. 4. సిమ్లా ఒప్పందం ప్రకారం కశ్మీర్ సమస్యను మోదీ ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదు? సిమ్లా ఒప్పందాన్ని మరోసారి చదువుకోండి. భారత్–పాక్ సమస్యలన్నీ ఇప్పుడు ద్వైపాక్షిక సమస్యలుగా మారాయి. అంటే ఐరాస తీర్మానాలు పనిచేయవన్నమాట. అంటే ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కటీ ఏ భూభాగాన్నీ బలప్రయోగంతో ఆక్రమించలేవు. అందుకే కాల్పుల విరమణ రేఖను ఆధీన రేఖగా పేరు మార్చుకున్నారు. ఇదే ఇరుదేశాల మధ్య సరిహద్దుగా తమతమ ప్రజలు ఆమోదించడంపై ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ 1971 యుద్ధంలో పట్టుబడిన పాక్ సైనికులను భారత్ విడుదల చేశాక ఈ కొత్త ఒడంబడిక స్ఫూర్తికి భంగం కలిగింది. జుల్ఫికర్ ఆలీ భుట్టో తన దేశాన్ని ఇస్లామీకరించడం ప్రారంభించారు. ఇస్లామిక్ బాంబు తయారీ కోసం నిధుల సేకరణకు కూడా ఒడిగట్టారు. అలా పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగాలు ఫలిం చిన తర్వాత సిమ్లా ఒప్పందానికి తూట్లు పడింది. కానీ ప్రత్యక్ష యుద్ధానికి తలపడితే ఓటమి తప్పదని పాక్ గ్రహించింది. ఆ విధంగా సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ మాత్రమే. 5. కశ్మీరీలు మీతో కలిసి ఉండాలనుకోలేదు.. మీరేం చేయగలరు? దీనికి కూడా తిరుగు ప్రశ్నే సమాధానం. కశ్మీరీలు ఎవరు? పది జిల్లాలతో కూడిన కశ్మీర్ లోయ మొత్తం రాష్ట్రం తరపున మాట్లాడలేదని చెప్పడం ద్వారా మితవాద జాతీయవాదులు సూక్ష్మార్థాన్ని గ్రహిం చడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలోని మెజారిటీ జనాభాకు ఈ పది జిల్లాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ఉదారవాద వాదన మరింత లోపభూయిష్టంగా ఉంది. లోయలోని ముస్లిం మెజారిటీ అభిప్రాయం రాష్ట్రంలోని మైనారిటీ అభిప్రాయాన్ని కలుపుకోనట్లయితే, భారత్ లోని మిగతా 99.5 శాతం మంది అభిప్రాయాన్ని మనం ఎలా చూడాలి? ఒక చోట మెజారిటీ అభిప్రాయాన్ని లెక్కించడం, మరొక చోట లెక్కించకపోవడంలో తర్కం ఏమైనా ఉందా? వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఇమ్రాన్‌పై మోదీ యార్కర్
ఒకే ఒక్క చర్య.. 70 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. దెబ్బతీయడం పాక్ వంతు.. దెబ్బ కాచుకోవడం భారత్ వంతు అనేలా సాగిన యథాతథస్థితి కశ్మీర్లో తల్లకిందులైంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా, భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని పదునైన యార్కర్‌తో దెబ్బతీసేశారు. కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక సమస్య నుంచి అంతర్జాతీయ సమస్యగా మార్చాలని దశాబ్దాలుగా పాక్ చేసిన ప్రయత్నం ఇప్పుడు మోదీ చర్యతో రెండు దేశాల మధ్య అంతర్గత సమస్యగా మారిపోయింది. యథాతథ స్థితి ఇప్పుడు స్థానం మార్చుకుంది.దాన్ని అంగీకరించినా లేక నిర్లక్ష్యపు దాడులకు దిగినా పాక్ సాధించేదేమీ ఉండదు. కశ్మీర్ లోయలో ఆంక్షలు తొలగించాక ప్రజలు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి భారత సైనికులు లోయపై తమ పట్టు కోల్పోయేలా చేస్తారనే ఆశ మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌కు మిగిలి ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోదీ యార్కర్‌కు చిత్తయ్యారా? క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇది నిజమేననిపిస్తోంది. ఇంతవరకు కశ్మీర్ విషయంలో పాకిస్తానే మొట్టమొదటగా పావులు కదుపుతూ వచ్చేది. దానికి భారత్ ప్రతిస్పందించేది. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భారత ప్రధాని మోదీ ఇంతవరకు సాగిన చరిత్రకు మంగళం పాడేశారు. అది ఎంత బలంగా తగిలిం దంటే తగిన ప్రతిస్పందనకు కూడా సిద్ధం కాలేకపోయిన పాకిస్తాన్ ఏం జవాబు చెప్పాలో తెలీని అయోమయంలో పడిపోయింది. భారత రాజ్యాంగంలోని తమకు అర్థంకాని చిక్కులు, తికమకల గురించి పాక్ జాతీయ అసెంబ్లీలో గత వారం సభ్యులు ప్రదర్శించిన భావోద్వేగాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాక్ చేష్టలుడిగి పోవడానికి అనేక కారణాలున్నాయి మరి. రాజ్యాంగాన్ని తరచుగా చాపచుట్టి, తిరగరాసే అలవాటు ప్రబలంగా ఉన్న పాక్ పాలకుడు భారతదేశంలో అలాంటి ఘటన జరగడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. రాజ్యాంగాన్ని ధిక్కరించడంలో సాటిలేదనిపించుకున్న పాకిస్తాన్ ప్రస్తుత స్పందనకు మంచిన అభాస మరొకటి ఉండదు. రెండోది.. కశ్మీరీయులకు తాను చేసిన హామీలకు భారత్ కట్టుబడాల్సి ఉందని పాక్ ప్రస్తుతం అరచి గీపెడుతోంది. కానీ బహుళ, ద్వైపాక్షిక సమావేశాల్లో తాను చేసిన వాగ్దానానలన్నింటినీ ఉల్లంఘించడం అలవాటుగా పెట్టుకున్న పాక్ మరోవైపు భారత్ స్పందనపై ఇంతగా ఉలిక్కిపడటమే అతిపెద్ద రసాభాస. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏదంటే సిమ్లా ఒప్పందాన్ని భారత్ ఉల్లఘించిందంటూ ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఆరోపణలకు దిగడమే. పైగా, ఫాస్ట్ బౌలింగ్‌లో నిష్ణాతుడైన ఇమ్రాన్ కొద్దిరోజుల క్రితమే వైట్‌హౌస్ నుంచి ప్రకటన చేస్తూ, కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడంలో భారత్, పాక్ దేశాలు 70 ఏళ్లుగా విఫలమవుతూనే వచ్చాయని, కాబట్టి ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన మిస్టర్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. దాదాపు 31 ఏళ్ల చరిత్ర క్రమంలో (1971లో సిమ్లా ఒప్పందం.. 1999లో లాహోర్ ఒప్పందం 2004లో ఇస్లామాబాద్ ఒప్పందం వరకు) ఇరుదేశాల మధ్య జరిగిన అతి ముఖ్యమైన మూడు ద్వైపాక్షిక ఒప్పందాలు కాగితపు ముక్కల్లాగా తేలిపోయాయి. చేసుకున్న ఒప్పం దాలను పాక్ నేతలందరూ స్వేచ్ఛగా తోసిపుచ్చుతూ వచ్చారు. లాహార్, ఇస్లామాబాద్ డిక్లరేషన్లు సిమ్లా ద్వైపాక్షిక నిబద్ధతను మరోసారి నొక్కి చెప్పాయి. అయితే కశ్మీరును ద్వైపాక్షికంగా ఇరుదేశాలూ పరిష్కరించుకోలేవు కాబట్టి ట్రంప్ జోక్యం చేసుకోవాలని చెబుతూ బయటి ప్రపంచానికి చెప్పిన ఇమ్రాన్ ఈ మొత్తం మూడు ఒప్పందాలను కూడా లాంఛనప్రాయంగానే తోసిపుచ్చేశారు. సిమ్లా ఒప్పంద సారాన్ని తుంగలో తొక్కిన ఇమ్రాన్ ఇప్పుడు మాత్రం భారత్‌పై ఆరోపణలకు లంకించుకున్నారు. విశేషమైన అంశం ఏమిటంటే, కశ్మీర్‌పై ప్రాథమిక వ్యూహాత్మక, రాజకీయ సమీకరణం ఇప్పుడు పూర్తిగా తల్లకిందులైంది. 1947 నుంచి కశ్మీర్‌పై పాకిస్తానే మొదటిబాణం సంధిస్తూ వచ్చింది. ప్రతి ఘర్షణలోనూ పాక్‌దే ముందడుగుగా ఉండేది. 1947లో, 1965లో, చివరకు 1972లో సిమ్లా ఒప్పందం జరిగేవరకు ప్రతి దాడిలోనూ పాకిస్తానే ముందుండేది. ఆ తర్వాత 17 సంవత్సరాలు కాస్త శాంతి నెలకొన్నా, శాశ్వత శాంతి వైపు పాక్ ఎన్నడూ సిద్ధమయ్యేది కాదు. ఈ క్రమంలోనే పాక్ సొంతంగా అణుపరీక్షలు నిర్వహించగలిగింది. ఆప్ఘనిస్తాన్‌లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వం లోని సంకీర్ణ కూటమి విజయం సాధించడంలో పాకిస్తాన్ అప్రయత్నంగానే తనవంతు సహాయం అందించింది కూడా. పాశ్చాత్య దేశాలకోసం ఒక జిహాద్‌ను గెలిపించిన పాక్ తన వద్ద ఉన్న అణ్వాయుధ దన్నుతో తూర్పువైపున మరొక జిహాద్‌కు రంగం సిద్ధం చేసుకుంది. కార్గిల్, భారతీయ విమానం హైజాక్, భారత పార్లమెంటుపై దాడి, ముంబైపై ఉగ్రవాదుల దాడి, పఠాన్ కోట్, పుల్వామాలో భారత బలగాలపై దాడి ఇలా భారత భూభాగంపై జరుగుతూ వచ్చిన ప్రతి చిన్నా, పెద్ద దాడిలో పాక్‌దే ముందడుగు. ఆ తర్వాతే భారత్ ప్రతిస్పందించేది. గత 70 ఏళ్లుగా సైనికంగా ఎంత బలపడినప్పటికీ కశ్మీర్ విషయంలో భారత్ యథాతథ స్థితిని కొనసాగించడానికి ప్రయత్నించగా పాక్ దాన్ని మార్చడానికి పదే పదే ప్రయత్నిం చేది. గత వారం భారత్ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంది. భారత్ మొట్టమొదటిసారిగా చేసిన ఏకపక్ష ప్రదర్శనకు పాక్ బిత్తరపోయింది. వాషింగ్టన్లో సిమ్లా, లాహార్, ఇస్లామాబాద్ ఒప్పందాల గురించి ఇమ్రాన్ ప్రస్తావించిన వారం రోజుల తర్వాత, ప్రధాని మోదీ దానికి నిరసన తెలిపి ఊరుకోవడానికి బదులుగా ఒక్కసారిగా చరిత్రను తిరగరాశారు. కశ్మీర్ అంతిమ పరిస్థితిపై ఇప్పటికీ చర్చలు, సంప్రదింపులకు మార్గం ఉందని పాకిస్తాన్, అంతర్జాతీయ కమ్యూనిటీ భావిస్తున్నవేళ అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాకుండా పాక్ ఆకాంక్షలను భారత్ సమాధి చేసిపడేసింది. ఇన్నేళ్ల తర్వాత.. రెచ్చగొట్టడం, తర్వాత తోసిపుచ్చడం, సహాయం చేస్తానని ప్రతిపాదించడం, చర్చలు జరపటం, కొన్నాళ్లు మౌనంగా ఉండిపోవడం.. ఇవీ పాక్ కశ్మీర్‌పై భారత్ పట్ల అనుసరిస్తూ వచ్చిన ప్రామాణిక చర్యల క్రమం. ఆ చరిత్ర ఇప్పుడు తిరగబడింది. గతంలో ప్రతిసారీ పాకిస్తాన్ దూకుడును తగ్గించాలంటూ భారత్ ఏదో ఒక అగ్రరాజ్యం సహాయాన్ని అర్థించేది. ఇప్పుడు ఆ పని పాక్ వంతయింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ తన పరిమితులను, క్షీణిస్తున్న తన స్థాయిని పాక్ అర్థం చేసుకున్నట్లే ఉంది. ఐఎమ్ఎఫ్ నుంచి తనకు రావలసిన 6 బిలియన్ డాలర్ల సహాయానికి పాక్ తన ఆర్థిక సార్వభౌమత్వాన్నే ఫణంగా పెట్టింది. పైగా, పాక్ రాజకీయాలు, సమాజం, వ్యవస్థలు కుప్పగూలిపోయాయి. కశ్మీర్ సమస్యను ఎల్లప్పుడూ అంతర్జాతీయీకరణ చేయడమే పాకిస్తాన్ వ్యూహంగా ఉంటూ వచ్చిందని అదేసమయంలో ఈ సమస్యను ద్వైపాక్షిక స్థాయిలోనే ఉంచాలని భారత్ ప్రయత్నించేదని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త హుసేన్ హక్కాని గతంలో రాశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్ రెండింటికీ కశ్మీర్‌ను ఒక ఆంతరంగిక సమస్యగా మార్చివేసింది. మోదీ మెజారిటీకి, రాజ కీయ, బౌద్ధిక బలమున్న ప్రతిపక్ష మైనారిటీకి మధ్య చర్చలు, ఘర్షణల కేంద్రంగా మాత్రమే భారత్‌ను పాక్ ఇటీవలికాలంలో లెక్కిస్తూ వచ్చింది. కాని ఒకే ఒక్క చర్యతో పాక్‌లో సర్వత్రా ఒకే చర్చ. ఇదెలా జరిగింది? ప్రపంచంలోనే నంబర్‌వన్ గూఢచారి సంస్థగా తాము గర్వంగా చెప్పుకునే ఐఎస్ఐ మోదీ కఠిన నిర్ణయం గురించి అణుమాత్రం కూడా ఎందుకు పసిగట్టలేకపోయింది? ఇప్పుడేం చేయాలి? సరిగ్గా దీన్నే ఇమ్రాన్ పాక్ జాతీయ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ‘ఇప్పుడు భారత్‌పై దాడికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి’. ఇలా అంటున్నానంటే భారత్‌లో ప్రతి అంశం కూడా సవ్యంగా ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు. లేదా కశ్మీర్లో ఇప్పుడు భారత చర్యలు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అలాగని చెప్పి, పాకిస్తాన్ ఆర్టికల్ 370 రద్దుపైనా (గతంలో దీన్ని చట్టవ్యతిరేకమని పాక్ చెప్పేది), జైళ్లపాలైన కశ్మీర్ నేతలపై సానుభూతి ప్రకటించినా (వీళ్లను గతంలో తొత్తులని పాక్ వర్ణిం చేది), కశ్మీర్లో పౌరహక్కుల గురించి గొంతు చించుకున్నా.. దానికి మించిన పరిహాసాస్పద విషయం మరొకటి లేదు. ఎందుకంటే ఇద్దరు మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, షబీద్ కఖాన్ అబ్బాíసీలను, ఒక మాజీ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీని పాక్ జైలుపాలు చేసింది. మరొక మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై దేశంలోకే అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. నవాజ్ కుమార్తె మరియంను కూడా ఇప్పుడు జైల్లో పెట్టారు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకి, నవాజ్ పార్టీ ఎంపీలకు, ఇతరులకు శిక్షపడేలా చేసి జైల్లో ఉంచారు. వీరిలో చాలామందిని కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా నెలలతరబడి నిర్బంధంలో ఉంచారు. కాబట్టి పౌరహక్కుల భాష పాకిస్తాన్‌కు నప్పదు. యథాతథ స్థితి ఇప్పుడు స్థానం మార్చుకుంది. పాకిస్తాన్ దాన్ని అంగీకరించినా సరే లేక వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా నిర్లక్ష్యపు దాడులకు దిగినా ఇకపై అది సాధించేదేమీ ఉండదు. కశ్మీర్ లోయలో ఆంక్షలు తొలగించాక ప్రజలు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి లోయపై భారత సైనికుల పట్టు కోల్పోయేలా చేస్తారు అనే ఒక్క ఆశ మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌కు మిగిలి ఉంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సంప్రదాయంలో ‘స్వయంప్రకాశం’
దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరెస్సెస్ మూలాలు మరవని సుష్మా స్వరాజ్ 11 సార్లు రాష్ట్రాల, పార్లమెంటు ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులతో తలపడి నిలిచి గెలిచారు. 2009లో అడ్వాణీ స్థానంలో నరేంద్రమోదీకి బదులుగా ఆయనకంటే చిన్న వయస్కురాలైన సుష్మా స్వరాజ్‌ను బీజేపీ అధినేతగా ఆరెస్సెస్ నిర్ణయించి ఉంటే ఆ పార్టీ చరిత్ర మరొక మలుపు తిరిగి ఉండేదనటం నిర్వివాదాంశం. కానీ క్రికెట్లో లాగే అందరు స్టార్లూ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్లు కాలేరనీ రాహుల్ ద్రావిడ్‌లు కూడా ఉంటారన్నది రాజకీయాల్లోనూ సత్యమే. వారసత్వ రాజకీయాలకు దూరంగా బీజేపీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజయాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలుగా సుష్మాస్వరాజ్ వెలుగొందారు. ఆమె నిష్క్రమణ ఆమె సొంత నిర్ణయమే. జాతిహితం భారతీయ జనతాపార్టీ వంటి పితృస్వామిక సంస్థలో స్వయం ప్రకాశంతో విజ యాలు సాధించిన విశిష్టమైన మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్. ఆమె నిష్రమణతో అనేక అంశాల్లో ముందువరుసలో నిలిచి చరిత్రకెక్కిన గొప్ప భారతీయ మహిళా రాజకీయవేత్తను బీజేపీ కోల్పోనుంది. రాష్ట్రపతి భవన్లో నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తున్న వారు కూర్చున్న స్థానాలను దాటి అత్యంత విశిష్ట సందర్శకులు కూర్చున్న చోటికి సుష్మా స్వరాజ్ నడిచి వెళుతున్న దృశ్యం సంచలనం కలిగిం చింది. అక్కడ కూర్చుని ఉన్న సందర్శకుల్లో చాలామందికి ఆమె నూతన మంత్రివర్గంలో చేరవచ్చనే ఆశ అప్పటికీ చావలేదు. తన తొలి మంత్రివర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి లేకుండా నరేంద్రమోదీ తన రెండో దఫా పాలన సాగించడం బహుశా కష్టమే కావచ్చు. సుష్మాకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు రహస్యం కాదు. తాను కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నానని ట్విట్టర్లో స్వయంగా ప్రకటించడం ద్వారా సుష్మా భారత రాజకీయ నాయకులు ప్రజా జీవితంపై కొనసాగుతున్న ముసుగును బద్దలు చేసిపడేశారు. తర్వాత ఆమె వేగంగా కోలుకున్నారనుకోండి. తన శరీరంలో కొత్తగా ఏర్పర్చుకున్న కిడ్నీతో ఆమె రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తూ వచ్చింది. దాని బలంతోనే ఆమె ఐక్యరాజ్యసమితిలో తన పాకిస్తానీ ప్రత్యర్థులతో తలపడ్డారు, ప్రపంచవ్యాప్తంగా తోటి విదేశీ కార్యాలయాలతో సమావేశాలు ఏర్పరుస్తూ వచ్చారు. అసాధారణమైన గౌరవాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఆమె పెదాలనుంచి ఒక్కటంటే ఒక్క తేలికపాటి పదం కానీ వ్యక్తీకరణ కానీ ఎవరూ చూడలేకపోయారు. అలాగే ఆమె ఆగ్రహాన్ని కూడా ఎవరూ చూడలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ శాఖ మంత్రులను కలవడంలో వ్యవహారాలు నడపడంలో సుష్మా పూర్తిగా భిన్నమైన ఒక వినూత్న దౌత్య ప్రక్రియను పాటించారు. నరేంద్రమోదీ విదేశీవిధానాన్ని పూర్తిగా తానే నడుపుతూ వచ్చారని సుష్మా పాత్ర ఏమీ లేదని విమర్శకులు దాడి చేశారు. పాస్‌పోర్ట్, వీసా వలస సమస్యలను ట్విట్టర్లో పరిష్కరించడం తప్ప ఆమె చేసేందుకు ఏమీ లేదని కూడా విమర్శలు వచ్చాయి. కానీ తనపై వస్తున్న ఇలాంటి ఆరోపణలన్నింటినీ ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. మోదీ మంత్రివర్గంలో ఏ మంత్రి కూడా నిజానికి పెద్దగా పొడిచిందంటూ ఏమీ లేదు. సుష్మా బాధ్యత చాలా కష్టభూయిష్టమైంది. ఒకవైపు తన ప్రధాని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుండగా ఆమె ఏమాత్రం లోటుగా భావించకుండా ఆయనకు దారి కల్పించారు. మీడియాలో ప్రచారం కోసం ఆమె ఎన్నడూ ప్రయత్నించలేదు. వెనుక గదిలో తన పాత్ర పోషించడానికి ఆమె సిద్ధపడ్డారు. మోదీని ప్రశంసించడం తప్ప ఆయన గురించి ఒక్క పదం కూడా చెడుగా మాట్లాడలేదు. అతి చిన్నపట్టణమైన చండీఘర్‌లో మేమిరువురం 1977లో ఏకకాలంలో మా వృత్తి జీవితాలను ప్రారంభించాం. దేవీలాల్ నేతృత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వంలో పాతికేళ్ల ప్రాయంలో సుష్మా నవ, యువ కేంద్రమంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. నేను ఆ సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సిటీ రిపోర్టరుగా పనిచేసేవాడిని. ఆ కాలంలో చాలా మంది రాజకీయ నేతల కంటే ఆమె ఎక్కువ ఆత్మగౌరవంతో మెలిగేవారు. అలాంటిది.. తన పార్టీ ఇప్పుడు రెండో దఫా ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒక సందర్శకురాలిగా ఉంటూ అక్కడ ఉన్న వారి అభినందనలు అందుకున్న సందర్భంలో 42 ఏళ్ల పాటు సాగిన ఆమె రాజకీయ జీవితం ఇక ముందు ఎలా సాగనుంది అనే విషయంలో నాకు ఇప్పటికీ అంత స్పష్టత కలగడం లేదు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుష్మా ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు పనిచేసిన ఎస్ జయశంకర్ ఇప్పుడామె స్థానంలో విదేశీవ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తన అసాధారణమైన అంతర్గత శక్తి సహా యంతో ఆమె తన రాజకీయ నిష్క్రమణను తాత్వికంగా స్వీకరించవచ్చు. ఆమె ప్రజాజీవితంలో జరిగిన ఈ మలుపు కేవలం మలుపు కాదు.. ఆమె విశిష్టమైన రాజకీయ ప్రయాణంలో ఇది బహుశా ముగింపు లాంటి మలుపు కావచ్చు. 1970ల నాటి భారత రాజకీయాల్లో స్వయంప్రకటిత మహిళా నేతగా ఎదిగిన సుష్మా 27 ఏళ్ల వయసులో ఆమె హర్యానా జనతాపార్టీ అధ్యక్షురాలయ్యారు. అయితే 1979లో జనతాపార్టీ విచ్చిన్నమయ్యాక ఆమె జనసంఘ్ గ్రూప్ వైపు అడుగులేశారు. అప్పటినుంచి ఆమె వంశ పారంపర్యతకు దూరంగా స్వయం సిద్ధ రాజకీయనేతగా ఎదుగుతూ వచ్చారు. జాతీయ క్యాలెండర్లలోంచి నాట్యం చేస్తున్న అజంతా అప్సర చిత్రాలను తొలగించాలని, అశ్లీలతతో కనిపిస్తున్న కండోమ్ ప్రకటనలను నిషేధించాలని, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని సెక్సీ రాధా పాటను తొలగించాలని, దీపా మెహతా సినిమా ఫైర్‌లో షబానా ఆజ్మీ, నందితాదాస్ మధ్య లెస్బియన్ ప్రేమ దృశ్యాలను ప్రదర్శించకూడదని, అత్యాచార బాధితురాలిని సజీవ శవంగా భావించాలని తన జీవితం పొడవునా ప్రకటిస్తూ వచ్చిన సుష్మా బీజేపీ సాంప్రదాయతత్వానికి తాను తలొగ్గినట్లు మనతో నచ్చబలికేవారు. అంతమాత్రాన ఆమెను ఒక మామూలు బీజేపీ సాంప్రదాయిక భావాలు మాత్రమే కలిగిన నేతగా భావించరాదు. ఆమె ఒక విభిన్నమైన మహిళ అని చెప్పడానికి ఆమె జీవితం నుంచి డజన్ ఉదాహరణలను ఎత్తి చూపవచ్చు. ఆమె ఫక్తు మధ్యతరగతి జీవితాన్ని ప్రధానస్రవంతి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఈ మూలాలే ఆమె వ్యక్తిగత ఎంపికలను నిర్ణయిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమె తన మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌కి చెందిన పితృస్వామిక వారసత్వాన్ని దూరం పెడుతూ వచ్చారు కూడా. ఈ క్రమంలోనే ఆమె మంగళూరులో కొంతమంది యువతులను అనైతిక కార్యకలాపాలకు దిగుతున్నారని ఆరోపిస్తూ బార్ల నుండి హిందూ ఛాందసవాద శక్తులు బయటకు లాగి అవమానించినప్పుడు ఆ చర్యకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సుష్మా ఏమాత్రం భయపడలేదు. ఒక ఆధునిక, స్వతంత్ర మహిళగా, ఒక యువతికి తల్లిగా ఆమె ఎంతో స్వతంత్రంగా వ్యవహరించేవారు. మాట్లాడేవారు. దీంతో ఆమె సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తానొక విభిన్నమైన మహిళ అని గుర్తించినందుకే ఆమె అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాజకీయ జీవితం నుంచి తాను నిష్క్రమించబోతున్నానని, ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీపడటం లేదని ఆమె సరైన సమయంలో ప్రకటించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 11 సార్లు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిన సుష్మా బలమైన పోటీని, ప్రత్యర్థులతో తలపడటాన్ని ఆమె ఎన్నడూ తప్పించుకోలేదు. కానీ ఇప్పుడామెకు 66 ఏళ్లు. పైగా ఆరోగ్యం ఇప్పుడామె ప్రధాన సమస్యగా మారింది. మధుమేహం తొలి దశ ప్రభావ ఫలితమిది. అయితే చివరవరకు వేచి ఉండకుండా కొత్త మంత్రివర్గంలో తాను చేరబోవడం లేదనే విషయాన్ని ఇంకాస్త ముందుగా ఆమె ప్రకటించి ఉండాల్సిందని నా సూచన. ఏది ఏమైనా ఆమె తన కెరీర్‌ను ఒక విజేతగానే, పార్టీకి అత్యంత విశ్వసనీయురాలిగానే ముగించారని ఆమె ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఆమె తొలినుంచి అడ్వాణీ ఆరాధకురాలు. కానీ 2009లో కొత్త తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి అడ్వాణీ తిరస్కరించినప్పుడు సుష్మా ఏమాత్రం తొట్రుపాటు చెందకుండా పార్టీకి చెందిన సద్బుద్ధి కలిగిన ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్‘ (వెంకయ్యనాయుడు, అనంతకుమార్, అరుణ్ జైట్లీ )తో చేతులు కలపడమే కాదు పార్టీకి యువ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను కోరారు కూడా. దాంతో నితిన్ గడ్కరీ వెలుగులోకి వచ్చారు.గత అయిదేళ్లకాలంలో ప్రధాని కార్యాలయం ఆమెను పక్కనబెట్టి ఉండవచ్చు, కొన్ని అంశాల్లో ఆమె ప్రాధాన్యం తగ్గించి ఉండవచ్చు. కానీ జైట్లీతో భేదాభిప్రాయాలు ఏర్పడిన సమయంలో మోదీ సుష్మాను తన వైపు ఉండాలని ఎంచుకున్నారు. ఆ సమయంలో రాజ్‌నాథ్ సింగ్ చైనాలో ఉండటంతో ఆమెను ఢిల్లీలోనే ఉండాలని మోదీ కోరారు. అప్పటికే ఆమె దుబాయ్‌కు వెళ్లవలిసి ఉంది. సుష్మా విశ్వాసాన్ని, పరిణతిని మోదీ గుర్తించారనడానికి ఇది చక్కటి తార్కాణం. పైగా అది ఆమె రాజకీయ కెరీర్లో కీలకమైన దశ. అద్వాణీకి బదులుగా యువనేతగా సుష్మానే ఎంచుకోవాలని బీజేపీ/ఆరెస్సెస్ నాయకత్వం నిర్ణయించుకుని ఉంటే ఏం జరిగేదన్నది చర్చనీయాంశం. ఆమె నరేంద్రమోదీ కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు. అదే జరిగి ఉంటే ఆమె నాయకత్వంలో ఎలాంటి బీజేపీ అవతరించి ఉండేదన్నది కూడా చర్చనీయాంశం.మోదీకి బదులుగా సుష్మా బీజేపీ నాయకత్వంలోకి వచ్చి ఉంటే అనేది మంచి చర్చకు తావిచ్చి ఉండేది. క్రికెట్‌లాగే రాజకీయాల్లోనూ ప్రతి స్టార్ కూడా ఒక కపిల్ దేవ్లా, సచిన్ టెండూల్కర్‌లా కాలేరు. వదలడానికి వీలులేని వ్యక్తి అయినప్పటికీ కీర్తి, అధికారానికి చేరువ కాలేకపోయిన రాహుల్ ద్రావిడ్ వంటి పాత్రను కూడా కొంతమంది పోషిం చాల్సి ఉంటుంది. ఒక రాజకీయ నేతగా సుష్మాస్వరాజ్‌కి కూడా ఈ వర్ణనే సరిగ్గా సరిపోతుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekarGupta -
ప్రతీకారంతో స్వీయ విధ్వంసం తథ్యం
పుల్వామాలో సైనికులపై దాడి తర్వాత మన టీవీ స్టూడియోలు వార్ రూమ్‌లుగా మారిపోయి ఎక్కడ దాడి చేయాలో, ఏ ఆయుధాలు వాడాలో కూడా అవే సూచిస్తున్న సమయంలో, దేశమంతటా పాక్‌పై ప్రతీకారం తప్పదంటూ ఆగ్రహం రేగుతున్న సమయంలో అందరూ గుర్తుంచుకోవలసిన పాఠం ఒక్కటే. ప్రతీకారంతో రగిలిపోయే జాతి విజయాన్ని సాధించడం కంటే స్వీయ విధ్వంసాన్నే చవిచూడవచ్చు. శతాబ్దాలుగా ప్రతీకార భావనలో మునిగిన ఆప్ఘానిస్తాన్ ఇప్పుడు మధ్యయుగాల స్థాయికి దిగజారిపోయింది. ప్రతీకారం మతిహీనులు ప్రకటించే భావోద్వేగం మాత్రమే. అదే సమయంలో స్వీయ నిరోధకత విజ్ఞుల మనస్సుల్లోంచి పుట్టుకొచ్చే సజీవ భావన. పాకిస్తాన్ వెన్నుదన్నుతో పుల్వామాలో ఉగ్ర దాడి జరిగిన వెంటనే ప్రతీకారం తీర్చుకోవలసిందేనంటూ యావద్దేశం ఊగిపోయింది. కొద్దిరోజులపాటు దీనిపై టీవీల్లో, ఇతర మీడియాలో బహిరంగ చర్చ కొనసాగింది. దీంతో అనివార్యంగానే ప్రతికారానికి సంబంధించిన కొత్త పదబంధం పుట్టుకొచ్చింది. ప్రతీకారమే ఉత్తమ మార్గం. ఈ పదబంధాన్ని కనిపెట్టిన ఘనత మాత్రం ఆప్ఘాన్లకే దక్కుతుంది. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవడం అనేది వారి జీవన శైలికి అత్యవసర లక్షణంగా మారింది. పైగా ఆ ప్రతీకారం తరాలపాటు కొనసాగేది. దాంట్లో వారెం తగా రాటుదేలిపోయారో తెలుసుకోవడం కోసం సోవియట్లను, అమెరికన్లను, లేదా పాకిస్తానీయులను అడిగితే చాలు. ఆప్ఘాన్లతో పెట్టుకో కండి. మీరు అంతకంతా అనుభవిస్తారు. ఈ ప్రతీకార చరిత్రను పక్కనబెట్టి ప్రస్తుతం ఆప్ఘానిస్తాన్ పరిస్థితిని చూడండి. వారు సాధించిన గత విజయాలు, భారత్‌లోని సంపన్నులను కొల్లగొట్టడం, రెండు అగ్రరాజ్యాలను చిత్తుగా ఓడించడం తర్వాత ఆప్ఘనిస్తాన్ చెల్లాచెదురైపోవడమే కాదు, నిరుపేద దేశంగా, దాదాపు మధ్యయుగ పరిస్థితుల్లోకి, పాలించడానికి వీల్లేని విధ్వంసంలోకి దిగజారిపోయింది. బహుశా మానవ చరిత్రలోనే ఇంత శాశ్వత నష్టాల్లో కూరుకుపోయిన మరో దేశాన్ని మనం చూడలేం. దీని వెనుక గుణపాఠం ఏమిటి? ప్రతీకారం అనే వంటకాన్ని వేడిగా లేక చల్లగా వడ్డించినా సరే అది ఆరగించడానికి చాలా అద్భుతమైన వంటకంగానే కనపడవచ్చు. కానీ మీ రక్తపిపాసను సంతృప్తిపరచుకోవడం తప్పితే అది మీకు ఒరగబెట్టేది ఏమీ ఉండదు. ప్రతీకారంతో రగిలిపోయే జాతి విజయాన్ని సాధించడం కంటే స్వీయ విధ్వంసాన్నే చవిచూడవచ్చు. ఇక పాకిస్తాన్ విషయానికి వద్దాం. 1971లో భారత్ చేతుల్లో ఘోర పరాజయం పొందాక ప్రతీకారం తీర్చుకోవాలని దశాబ్దాల ఘర్షణను అది కొనసాగించింది. ఈ క్రమంలో పాక్ ఆర్థికవ్యవస్థ, సమాజం, రాజ్యపాలన పూర్తిగా ధ్వంసమైపోయింది. మరోవైపున యుద్ధంలో గెలిచిన విజేత భారత్ ప్రతీకారం కంటే ‘నిరోధకత’కు ప్రాధాన్యమిచ్చింది. ప్రతీకారం మందబుద్ధులు, మతిహీనులు ప్రకటించే కేవల భావోద్వేగం మాత్రమే. అదే సమయంలో స్వీయ నిరోధకత అనేది విజ్ఞత కలిగిన వారి మనస్సుల్లోంచి నిత్యం పుట్టుకొచ్చే సజీవ భావన. ఉదాహరణకు ఉడీలో ఫిదాయీలు దాడి తర్వాత భారత్ జరిపిన సర్జికల్ దాడులను చూడండి. వాళ్లు 19మంది మన సైనికులను చంపారు. మనం అంతకంటే ఎక్కువమంది ఉగ్రవాదులను చంపేశాం. రక్తానికి రక్తం సమాధానం అన్నమాట. కానీ వాళ్లు పుల్వామాలో మళ్లీ మన గొంతుకోశారు. దీనికి మళ్లీ మనవైపునుంచి ప్రతీకారం ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో టీవీ స్టూడియోలు వార్ రూమ్‌లుగా మారిపోయాయి. ఎక్కడ దాడి చేయాలో, ఏ ఆయుధాలు వాడాలో కూడా అవే సూచిస్తున్నాయి. ఇక మన ప్రధాని నరేంద్రమోదీ ‘మీ ప్రతి కన్నీటిబొట్టు’కు బదులు తీరుస్తాం అంటూ వాగ్దానం చేస్తున్నారు. ఇక మన వ్యాఖ్యాతలు ఈసారి తప్పకుండా ఏదో ఒకటి చేసేయాల్సిందే అని మోత మోగిస్తున్నారు. ఎంత సీరియస్ ఘటనలకూ స్పందించని వారు కూడా ప్రతీకారమే ఉత్తమం అంటున్నారు. ఇది సరిగ్గా ఆప్ఘాన్లు చాలాకాలంగా చెబుతున్నట్లే ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న. ప్రతీకారం తర్వాత ఏం జరుగుతుంది? అది మీకు శాంతిని, భద్రతను సంపాదించిపెడుతుందా? అది మీకు ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టవచ్చు. కానీ అది మీ శత్రువును నిరోధించగలుగుతుందా? చరిత్రలోకి వెళితే.. కౌటిల్యుడి ధోవతి ఒక ముళ్లపొదలో చిక్కుకుని చిరిగిపోయినప్పుడు ఆ ముళ్లపొదను తెగనరకడానికి అతడు ప్రయత్నించలేదు. కాస్త సమయం తీసుకుని తీపి పాలను ఆ ముళ్లపొద కుదురులో పోశాడు. చంద్రగుప్తుడు ఎందుకలా చేశావని అడిగితే ‘నేను దాన్ని నరికినట్లయితే అది మళ్లీ వేర్లనుంచి పెరుగుతుంది. అదే చక్కెర కలిపిన పాలను దాని కుదుళ్లలో పోస్తే, ఆ తీపి పాలు లక్షలాది చీమలను ఆకర్షించి అవి ముళ్లపొద వేర్లతో సహా తినివేస్తాయి’ అన్నాడు కౌటిల్యుడు. ఇక్కడ ముళ్లపొదను తెగనరిగే కొడవలి ప్రతీకారం అయితే, తీపిపాలు అనేది నిర్మూలన అవుతుంది. ఈ భావన ఏమాత్రం ఆకర్షణీయమైనది కాదు పరమ పాశవికమైనది. కానీ కౌటిల్యం అంటే అదే మరి. అలాగే 1962లో చైనా చేసిన దురాక్రమణ భారత్‌ను శిక్షించడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, భూభాగాన్ని లాక్కోవడానికి కాదు. అది నిరోధకతను సృష్టించడమే. అది భారత్ ముందుకు పురోగమించే పాలసీకి భరతవాక్యం పలికింది. టిబెటన్లతో సరసమాడటం అనే మన వ్యూహానికి ఆ దాడి చెక్ పెట్టింది. అంతేకాకుండా సరిహద్దుల రక్షణకోసం 1962 నాటి యుద్ధపద్ధతుల్లోనే పోరాడాలనుకుంటున్న భారతీయ వ్యూహకర్తలను తరాలపాటు రక్షణాత్మక తత్వంలోకి నెట్టేసింది. తర్వాత చైనీయులు పాకిస్తాన్‌ను తమ విలువైన క్లయింటుగా మార్చిపడేశారు. అయిదు దశాబ్దాల నుంచి భారత్‌ను నిలువరించేందుకు అతి చిన్న దేశ మైన పాక్‌ని చైనీయులు అత్యంత తెలివిగా వాడుకుంటూ వస్తున్నారు. 1971లో ఇందిరాగాంధీ తనదైన అర్థశాస్త్రాన్ని అమల్లో పెట్టారు. ఆ సంవత్సరం మార్చి నెలలో పశ్చిమ పాకిస్తాన్ పాలకులు తమ ఆధీనంలోని తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)పై సైనిక చర్యలకు పాల్పడినప్పుడు ఆమె ప్రజాగ్రహం పట్ల స్పందించకుండా, 9 నెలలపాటు తగిన సైనిక, దౌత్యపరమైన సన్నాహక చర్యలను చేపడుతూ వచ్చారు. ఈ విరామ సమయంలో ఆమె సైన్యాన్ని సిద్ధపర్చారు. అమెరికాను, చైనాను అడ్డుకోవడానికి సోవియట్లతో సంధి కుదుర్చుకున్నారు. పాకిస్తాన్ అతి చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచమంతటా తిరిగి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించారు. పాక్‌ను ఆమె ఎంతగా ఊపిరాడకుండా చేశారంటే డిసెంబర్లో పాక్ సైనిక జనరల్ యాహ్యాఖాన్‌ను యుద్ధం ప్రకటించని స్థితిలోకి నెట్టారు. అనంతరం పాక్ ఈ 50 ఏళ్ల కాలంలో తన కలలో కూడా ఎన్నడూ కశ్మీర్ ఆక్రమణకోసం తన సైన్యాన్ని ఉపయోగించే ఆలోచనలకు పోలేదు. 1980ల చివరి నుంచి అది ఉగ్రవాదానికి, మంద్రస్థాయి ఘర్షణలకు మళ్లింది. చివరగా పాకిస్తాన్‌పై మీరు ప్రతీకారం తీసుకోండి. అది వారినేం చేయలేదు. వారిపై సైనిక దాడులను చేయండి. వారు ఎదురుదాడి చేస్తారు. ఈ క్రమంలో మనం మరింత ఆగ్రహానికి గురవుతుంటాం. ప్రతీకారం తప్పదంటుంటాం, నిస్పృహకు గురవుతుంటాం కూడా. అటు తన వద్ద ఉన్న అణ్వాయుధాలు, ఇటు సాంప్రదాయిక సైనికబలంలో తన సరిపోలని అసౌష్టవం రెండూ కలిసి భారతీయ నిర్ణయాత్మక దాడిని నిరోధిస్తాయన్న నమ్మకంతో పాకిస్తాన్ ఒక దేశంగా కొనసాగుతూనే ఉంటుంది. మనం ఈ కలుగులోంచి బయటకు వెళ్లేముందు, ఇక్కడ మనకు ఏం లభించిందో అర్థం చేసుకోవాలి. నేను నిర్ధారణకు వచ్చిన అంశాలు ఇవి. 1. విజేత కంటే ఓటమి పాలైనవారే ఎక్కువ గుణపాఠం నేర్చుకుంటారనేది పాత సామెత. పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రమాదాలకు 1971 పూర్తిగా అడ్డుకట్ట వేస్తుందని భారత పాలకులు తప్పుగా భావించారు. అందుకు భిన్నంగా జుల్ఫికర్ అలీ భుట్టో సంప్రదాయ సైనిక దాడులకు స్వస్తి పలికారు. కానీ, భారత్‌ను కాదంటూ అణుశక్తిగా పాక్ ఎదిగింది. 1980 నాటికి పాకిస్తాన్ తన అణుశక్తితో తగిన బలం సంపాదించుకుంది. అప్పటి నుంచి తొలుత పంజాబ్‌లో, తర్వాత కశ్మీర్లో అల్లర్లు సృష్టిం చడం ప్రారంభించింది. భారత్ నిశ్చింతంగా ఉంది. 2. 1998లో జరిగిన పరీక్షలతో రెండు దేశాలు అణుశక్తితో సమాన స్థాయిని పొందాయి. దీంతో పాకిస్తాన్ మళ్లీ కొత్త ఎత్తుగడలకు పోగా, భారత్ అణుశక్తికి కట్టుబడింది. దీంతో సంప్రదాయ యుద్ధం వచ్చే అవకాశం పోయింది. భారత విధాన నిర్ణయిక బృందం ‘న్యూక్లియర్ లేజీ’గా మారిందని చెప్పడం కాస్త సాహసమే అవుతుంది. పెను విధ్వంసాలను సృష్టించే మారణయుధాలు ఓటమిపాలైనవారి చివరి అస్త్రాలని ఆ బృందం మరిచిపోయింది. ఈ విషయంలో పాక్ తెలివిగా వ్యవహరించింది. 3. ఫలితంగా తన ఆర్థిక స్థాయికి తగినట్టుగా సంప్రదాయ సైనిక బలం పెంచుకోవడంలో భారత్‌కు ఆసక్తి లేకపోయింది. సంప్రదాయ సైనిక బలం పెంపుతో దండించగలిగే స్థాయి ద్విగుణీకృతమవుతుందని, తద్వారా మెరుపుదాడుల నుంచి పాక్‌ను నియంత్రించవచ్చనీ, అణుశక్తి స్వీయ వినాశనానికేననే భావనవైపు పాక్‌ను నెట్టవచ్చని భారత్ మరి చిపోయింది. లేకపోతే, ఇక్కడ బస్సులను పేల్చివేసేప్పుడు పాక్ పునరాలోచనలో పడి ఉండేది. ఈ న్యూక్లియర్ లేజీనెస్ కారణంగా జీడీపీలో భారత రక్షణ బడ్జెట్ల శాతం తగ్గుతూ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు యుద్ధమే గనుక వస్తే.. మూడు దశాబ్దాల క్రితం రాజీవ్‌గాంధీ కొనుగోలు చేసిన వాటినే మొదటి వరుసలో నిలపాల్సి వస్తుంది. అణుశక్తివల్ల యుద్ధాలు వచ్చే అవకాశం లేనప్పుడు ఎందుకు అధికంగా ఖర్చు చేయాలి? దేశభద్రత కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే మోదీ ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో బ్రెయిన్ వాష్ అవసరం. అది ఏడవ వేతన సంఘం సిఫారసులు అమలు చేసింది. కానీ, జీడీపీలో రక్షణ బడ్జెట్ శాతాన్ని తగ్గించివేసింది. అంతో, ఇంతో ప్రతీ కారం తీర్చుకోవడం ద్వారా మనల్ని మనం బాగానే సమర్థించుకోవచ్చు. కానీ, పాకిస్తాన్‌కు అడ్డుకట్టవేయలేం. మనం ముందుకెలా వెళ్లాలి? పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనే అంశాన్ని పక్కనబెట్టి, భారీగా సైన్యాన్ని పెంపొందించుకోవాలి. సైనిక బలంతో ప్రత్యర్థిలో వణుకు పుట్టించాలి. పాతకాలం నాటి సంప్రదాయక సైనిక శక్తిగా అవతరించి వారిని నిరోధించాలి. ఇది కౌటిల్యుడు చెప్పిన తియ్యని పాలు వంటి ఉపదేశంలా అనిపించవచ్చు. తలనొప్పిగా కూడా భావించొచ్చు. కాస్త సమ యం, సహనం ఉంటే ఇది పని చేస్తుంది. అప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రగుప్తుడిని గెలిపించాల్సిన తప్పనిసరి బాధ్యత కౌటిల్యుడిపై పడదు. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
జనం నాడి ఏం చెబుతోంది?
ఎన్టీయే కూటమి ఎంపీ సీట్ల సంఖ్య తగ్గనున్నట్లు ఓపీనియన్ పోల్స్ చెబుతున్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీకే వస్తాయని, పైగా కేంద్ర ప్రభుత్వంపై అసమ్మతి ఉన్నప్పటికీ మోదీ వ్యక్తిగత ప్రజాదరణ, చరిష్మా చెక్కుచెదరలేదని జనాభిప్రాయం. కాంగ్రెస్ సొంతంగా, మిత్రపక్షాల దన్నుతో అధికారం చేపట్టే పరిస్థితీ కనబడలేదు. ఈ రెండు కూటములకు భిన్నంగా ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చే పరిస్థితి కూడా లేదు. ప్రజల నాడి వ్యక్తిగతంగా మోదీ వైపే మొగ్గు చూపుతున్న ఈ నేపథ్యంలో మోదీ తిరిగి ప్రధాని కాగల అవకాశం ఒక్క మాయావతి ద్వారానే సాధ్యం. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ప్రత్యర్థి శిబిరం నుంచి బుజ్జగించో, బతిమాలో లాగేయవలసిన ముఖ్య పార్శ్వంలో ఆమె ఉన్నారు. పైగా, తొలిసారి ఓటు వేయబోతున్న పదమూడు కోట్లమంది యువ ఓటర్లు మోదీకి పెట్టని కోటలాగా ఉన్నారు. జర్నలిస్టులు ఎన్నికల ఫలితాలను అంచనా వేసినప్పుడు సాధారణంగా ఆ అంచనాలు తప్పుతుంటాయనేది అందరూ ఆమోదించే వాస్తవమే. పైగా పాత్రికేయులందరూ ఒకేవిధమైన అభిప్రాయం వెల్లడించినప్పుడు కచ్చితంగా దానికి వ్యతిరేక ఫలితాలు రావడం తప్పనిసరిగా జరుగుతుంటుంది. ఒపీనియన్ పోల్స్ కూడా ప్రమాదకరమైనవే కానీ, మన జర్నలిస్టుల కంటే అవి మెరుగైనవేనని చెప్పాలి. అయితే ఒపీనియన్ పోల్స్ కూడా ఒకే రకమైన ఫలితంపై ఆమోదం తెలిపినప్పుడు ఏం జరుగుతుంది? ఇది పలు ఒపీనియన్ పోల్స్ వెలువడుతున్న వారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, దేశంలో హంగ్ పార్లమెంట్ తప్పదనీ, బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచినా, బీజేపీ సాధించే స్థానాల్లో సగం మాత్రమే సాధిస్తుందని, దీంతో మళ్లీ నిజమైన సంకీర్ణ ప్రభుత్వం తప్పదని ఒపీనియన్ పోల్స్ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండిపోదు. అయినప్పటికీ, మనం కొన్ని ముఖ్యమైన ధోరణులను పసిగట్టగలం. ఆ పోల్స్ నుంచి విస్తృత స్థాయి నిర్ధారణలను జాగ్రత్తగా చేయగలం. 1. కొట్టొచ్చినట్లు కనిపించే సూచిక ఏదంటే, 2014లో సాధించిన మెజారిటీ బీజేపీకి రానప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత ప్రజాదరణ నేటికీ చెక్కుచెదరలేదు. పైగా 2014లో బీజేపీ సాధించిన 31 శాతం ఓట్లతో పోలిస్తే ఇప్పుడు ఒక్క శాతం మాత్రమే తగ్గిపోనున్నట్లు ఇండియా టుడే పోల్ సర్వే సూచిస్తోంది. ఇది నిజంగానే గుర్తించదగిన విషయం. మోదీ ఒరిజినల్ ఓటర్లలో గణనీయంగానే అసంతృప్తి ఉంటున్నప్పటికీ, 1996 తర్వాత పుట్టి, లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓట్లు వేయబోతున్న 13 కోట్లమంది ఓటర్లు మోదీపై వ్యక్తం చేస్తున్న తిరుగులేని ఆరాధన ద్వారా ఆ అసంతృప్తిని పూరించుకోవచ్చు. మోదీపట్ల అసంతృప్తి చెందుతున్న ఆయన అసలైన ఓటర్లకు, ఈ సరికొత్త ఓటర్లకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఈ కొత్త ఓటర్లు జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు పొందని స్థితికి ఇంకా వెళ్లలేదు. ఈ 13 కోట్ల మంది ఓటర్లు మోదీ శక్తి, ప్రజాకర్షణ పట్ల ఇప్పటికీ మంత్రముగ్ధులవుతూనే ఉన్నారు. అలాగే స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా వంటి మోదీ పథకాలతో పాటు, అవినీతిపై యుద్ధం, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరుగుతుండటం వంటి అంశాలపై జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని వీరు విశ్వసిస్తూనే ఉన్నారు. మోదీకి వ్యతిరేకంగా బలమైన ప్రచార కథనాలు కానీ, లేదా నిరుద్యోగుల తీవ్ర నిరాశా నిస్పృహలు కానీ వీరి దృష్టిలో ఇప్పటికీ పడటం లేదు. 2. 2017 జనవరిలో పెద్దనోట్ల రద్దు తర్వాత మోదీని శిఖరస్థాయిలో నిలి పిన పోల్ సర్వే తర్వాత నిర్వహించిన పోల్ సర్వే నంబర్లను పోల్చి చూసినట్లయితే బీజేపీ పట్ల సానుకూలత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టంగానే అర్థమవుతుంది. క్రమక్రమంగా అది క్షీణిస్తూ గత రెండేళ్లలో మూడింట ఒక భాగం సీట్లను బీజేపీ కోల్పోతున్నట్లు వ్యక్తమైంది. ఇలాగే కొనసాగితే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య మరో 25 నుంచి 40 స్థానాల వరకు క్షీణించిపోతుందని తార్కికంగానే అంచనా వేయవచ్చు. మరి ఈ పరిణామాన్ని నరేంద్రమోదీ అడ్డుకుని పార్టీకి మళ్లీ పూర్వ వైభవంవైపు తీసుకుపోగలరా? భారతీయ ప్రజాభిప్రాయాన్ని దాని వైవిధ్యత, సంక్లిష్టతల సమేతంగా దర్శించినట్లయితే, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని బోధపడుతుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రక్రియ మొదట్లో కాస్త నిదానంగానే సాగవచ్చు కానీ, ఒక్కసారి అది తన లక్ష్యం వైపు ప్రయాణించిందంటే దాని గమ్యాన్ని ఎవరూ మార్చలేరు. దాన్ని వెనక్కు మళ్లించడం దాదాపు అసాధ్యమే అవుతుంది. నరేంద్రమోదీకి ఈ విషయం బాగా తెలుసు కూడా. పొంచి ఉన్న ప్రమాదం పొడసూపుతోంది కాబట్టే, మోదీ శిబిరం మౌలికమైన, నమ్మశక్యం కాని స్థాయిలో ప్రజాకర్షక చర్యలకు సన్నద్ధమవుతోంది. అగ్రకులాల్లోని ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు, అన్ని ప్రైవేట్ సంస్థల్లో కోటాల నుంచి మొదలుకుని అవినీతిపరులు, పలుకుబడి గలవారిపై చివరి క్షణంలో సీబీఐ దాడులకు రంగం సిద్ధం చేయడం వీటిలో కొన్ని మాత్రమే. వచ్చేవారం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్లో మరికొన్ని తాయిలాలు ఉంటాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 180 కంటే తక్కువ సీట్లు వచ్చాయంటే ప్రభుత్వ అవకాశాలకు తెరపడినట్లేనని నరేంద్రమోదీ, అమిత్ షాలకు తెలుసు. రూపొందుతున్న ప్రజాభిప్రాయం అనే ఈ నిర్నిరోధక శక్తి గమనాన్ని వచ్చే 100 రోజుల కాలంలో వీరిద్దరూ మార్చగలిగినట్లయితే అది అసాధారణ విజయమే అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని దూకుడుతనంతో కూడిన మౌలిక ప్రకటనలు తప్పకుండా వస్తాయి. బీజేపీ రక్షణ పంక్తి ఏదంటే ఏమాత్రం చెక్కుచెదరని ఆలోచనలతో కూడిన 13 కోట్లమంది తొలిసారి ఓటేయబోతున్న ఓటర్లు మాత్రమే. 3. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మినహా మిగిలిన దేశమంతటా బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాలు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. దీనికి భిన్నంగా ఉత్తరప్రదేశ్‌లో మాత్రం బీజేపీ ఈసారి 45 నుంచి 55 ఎంపీ స్థానాలను కోల్పోతున్నట్లు పలు ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తగి లిన ఎదురుదెబ్బలను చూస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఈసారి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం కాకున్నా, బీజేపీ ఇక్కడ సాధించే స్థానాల విషయంలో ఊగిసలాట తప్పదనిపిస్తోంది. ఉత్తర భారతంలో బీజేపీకి కలిగే నష్టాల్లో కొన్నింటిని తూర్పు, ఈశాన్య భారత్‌లో పూడ్చుకోవచ్చన్నది తీసిపారేయలేం. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజేపీని మెజారిటీకి దూరం చేసే బలమైన కారణాల్లో ఒకటి కాబోతోంది. ఈ పరిణామాన్ని వెనక్కు తిప్పే యుక్తిని బీజేపీ కనుగొనగలదా? 4. మరోవైపున కాంగ్రెస్ పార్టీ పునరుత్థానం చెందుతోంది. దాని పునాదిపై ఈ పార్టీ సాధించే శాతాన్ని పోలిస్తే, బీజేపీ పొందనున్న నష్టాల కంటే పెను లాభం కాంగ్రెస్‌కి సిద్ధించనుంది. తేడా ఏమిటంటే, కాంగ్రెస్ పునాది బలహీనంగా ఉంది. కాబట్టే దాని బలం 200 శాతం మేరకు పెరిగినప్పటికీ అది కాంగ్రెస్‌కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 140 స్థానాలలోపే తీసుకురానుంది. ప్రస్తుత ఒపీనియన్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు 100 సీట్లు మాత్రమే రానున్నాయి. నరేంద్రమోదీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చలేరని భావించినప్పటికీ, కాంగ్రెస్ పరిస్థితిలో గణనీయంగా మార్పు వస్తుందని చెప్పలేం. మోదీ అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పెట్టుకునే ఉత్తమమైన ఆశాభావం ఏదంటే ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినటువంటి దేశం నడిగడ్డలోని మూడు కీలక రాష్ట్రాల్లో వీలైనన్ని ఎంపీ సీట్లను అధికంగా సాధించడమే. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అది సాధించాల్సిన ప్రధాన సంఖ్య 150. తను సాధించే మొత్తం సీట్లను ఈ స్థాయికి పెంచుకోవడం లేదా నరేంద్రమోదీకి వచ్చే స్థానాలను అంతకన్నా తగ్గించడం. ఇవి రెండూ కాకుండా మూడో మార్గం ఏదంటే యూపీఏ శిబిరాన్ని మరింతగా విçస్తృతపర్చి, మరిన్ని ప్రాంతీయ లేక కుల ప్రాతిపదికన ఉన్న పార్టీలను తనవైపు ఆకర్షించడమే. అయితే ఈ పరిస్థితుల్లో ఈ మూడు అంశాలు కూడా అసంభావ్యమే అనిపిస్తుంది. కానీ భారత రాజకీయాల్లో మోదీ చుట్టూ తిరిగే ఏక ధ్రువం లాంటి స్థితికి బదులుగా ప్రధాని పదవికి దగ్గరయ్యేందుకు రెండో ధ్రువం మళ్లీ వెనక్కు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. 5. గతవారం ‘జాతిహితం’లో మనం ప్రస్తుత భారత రాజకీయాల్లో ఒకటి, రెండు ఫ్రంట్లనే కాకుండా ఏర్పడనున్న మూడు, నాలుగు, ఐదో ఫ్రంట్లను గురించి కూడా చర్చించుకున్నాం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటితో పొత్తులేని పార్టీలకు, వాటి నేతలకు 150 పార్లమెంటు స్థానాలు వచ్చాయంటే గొప్ప రాజీమార్గంలో తామే ప్రధానిగా ఉండాలనే ఆశాభావం చాలామందికి కలిగే అవకాశం కూడా ఉంది కానీ ఇది అంత సాధ్యమైన పని కాకపోవచ్చు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలలో ఏ ఒక్క పార్టీకీ సొంతంగా 50 కాదు కదా 40 ఎంపీ స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలూ 272 మ్యాజిక్ సంఖ్యను చేరుకోలేకపోయినప్పుడు మాత్రమే ఇతర పార్టీల మధ్య అలాంటి భారీ బేరసారాలకు తావు ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఇటీవలి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ మే నెలలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపించడం లేదు. అంతిమ పొత్తులు మీరు ఎవరితో పొత్తు కలుపుతారు లేక ఎవరితో పొత్తుకు సిద్ధం కారు అనే అంశంపైనే ఆధారపడి ఉంటాయి. వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ ఎన్నటికీ ఎన్డీయేతో కలవబోవని మనందరికీ తెలుసు. అలాగే అకాలీలు, శివసేన ఎట్టిపరిస్థితుల్లోనూ యూపీఏలో భాగం కావు. ఈ పరిస్థితుల్లో గతంలో మొండివైఖరి లేకుండా కాస్త పట్టువిడుపులు ప్రదర్శించినవారిని చూద్దాం. మమతా బెనర్జీ గతంలో రెండు కూటముల్లోనూ ఉండేవారు. కానీ పశ్చిమబెంగాల్లో ఆమె ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఆధిక్యత వల్ల ఆమె ఎన్డీయే వైపు వెళ్లలేరు. 6. ఇప్పుడు ఇక మాయావతి దగ్గరకు వద్దాం. మోదీ రెండో దఫా అధికారంలోకి రాలేకపోయినట్లయితే మన రాజకీయాల్లో విశిష్టమైన అధికారం చలాయిస్తున్న మాయావతే అందుకు ప్రధాన కారణం అవుతారు. ఆమె గతంలో బీజేపీతో సంతోషంగా గడిపారు. లెఫ్ట్, రైట్ వాదాల మధ్య ఆమె పూర్తిగా భావజాలేతర స్థానంలో ఉన్నారు. మనువాద వ్యతిరేకతే ఆమె ఏకైక భావజాలం అయితే, ఎన్డీయే, యూపీఏ రెండూ ఆమె దృష్టిలో సమానంగా దుష్టశక్తులవుతాయి. అయితే ఆ విషాన్ని ఆమె ఈ రెండింటిలో ఏ పాత్రలోనుంచి అయినా స్వీకరించగలరు. తాము రెండో దఫా అధికారంలోకి రావాలంటే కీలకమైన కార్డు మాయావతి ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్‌లోనే ఉందని మోదీ, షాలకు స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు లేక ఆ తర్వాత తమ ప్రత్యర్థి శిబిరం నుంచి బుజ్జగించో, బతిమాలో, బెదిరించో లాగేయవలసిన ముఖ్య పార్శ్వంలో ఆమె ఉన్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ వెన్నులో గొడ్డలి దిగే పరిస్ధితిని ఊహించలేం కానీ అలాంటి పరిస్థితి సంభవించదని మీరు ఎన్నడూ తోసిపుచ్చలేరు. ముగించాలంటే, మోదీ వ్యక్తిగత ప్రజాదరణ, వోట్ బ్యాంక్ చెక్కుచెదరలేదు కానీ ప్రజాభిప్రాయం మాత్రం ప్రతికూలంగా ఉంది. యూపీలో ఏర్బడిన ఘటబంధన్ మోదీ రెండో దఫా పాలనకు ప్రమాదకారిగా మారుతోంది. కాంగ్రెస్ పురోగమిస్తోంది కానీ అధికారంలోకి వచ్చేంతగా కాదు. 15 లేక అంతకు ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించే ఏ పార్టీ అయినా ఇప్పుడు కింగ్ మేకర్ కాగలదు. కానీ అవి ఎన్నడూ కింగ్ కాలేవు. ఈ పార్టీలకు నూరు స్థానాలు వచ్చిన పక్షంలో అవి ఏ విజేతవైపుకైనా మళ్లవచ్చు. ప్రత్యేకించి మాయావతిని నిశితంగా గమనించాల్సి ఉంటుంది. - శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఏకపక్షానికి ‘ఎదురుగాలి’
పన్నెండు నెలలు.. కేవలం పన్నెండు నెలలు భారత రాజకీయ చరిత్రనే తిరగరాశాయి. ఈ ఏడాది వేసవిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజమైన పోటీని మనం చూడబోతున్నాం. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరాటంతో నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయాన్ని కలవరపర్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోశారు.మూడు కీలకమైన హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో బీజేపీని చావు దెబ్బ తీయడం ద్వారా మోదీ, షా వ్యూహాలకు రాహుల్ తొలి సవాలు విసిరారు. బీజేపీ రూపంలో ఏకధ్రువ పాలన తప్పదన్న పరిస్థితిని మార్చి రెండో ధ్రువంగా కాంగ్రెస్‌ను నిలిపిన రాహుల్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఏమాత్రం ఢీకొనగలరనేది అసలు ప్రశ్న. చాలామంది రాజకీయ విశ్లేషకులు 2017 శీతాకాలం వరకు మూడు అంశాలలో ఏకాభిప్రాయంతో ఉండేవారు: అవేమిటంటే, నరేంద్ర మోదీ రెండో దఫా అధికారంలోకి రావడం ఖాయం; రాహుల్ గాంధీకి, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తుది పతనం తప్పదు; ఇందిరాగాంధీ హయాం ముగిసిన చాలాకాలం తర్వాత భారత్ సుదీర్ఘకాలం పాటు ఏక పార్టీ పాలన, ఏకధ్రువ పాలన వైపుగా నడుస్తోంది. ఈ మూడు అంశాలకు దన్నుగా, ఉత్తరప్రదేశ్‌లో పొందిన భారీ విజయంతో దేశంలోని 21 రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వ పాలనలో మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లోనూ, 2019లో జరిగే అతిపెద్ద పరీక్షలోనూ సంభవించనున్న ఫలితాలకు తగిన భూమికను ఇవి నిర్దేశించినట్లే కనిపించింది. అయితే 2017 డిసెంబర్ మధ్యనాటికి పరిస్థితిలో ఏదో మార్పు వచ్చింది. అవును.. గుజరాత్లో వరుసగా ఆరోసారి కూడా బీజేపీ గణనీయ విజయం సాధించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. నరేంద్రమోదీ, అమిత్ షాలు తమ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రదర్శించిన ఆందోళనలు గుజరాత్ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి కూడా. గుజరాత్ ఎన్నికలు జరిగిన కొద్ది కాలంలోనే జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని అటు విజయమూ, ఇటు ఉపశమనమూ కలగలిసిన భంగిమతో కన్నీళ్లు కార్చారు కూడా. ఆ సన్నివేశం గుజరాత్ ఎన్నికలు ఎంత పోటాపోటీగా జరిగాయో తేల్చి చెప్పింది. దీంతో మోదీషా రాజకీయాల్లో ఇది మౌలిక మార్పును తీసుకొస్తుందని అప్పట్లే రాజకీయ వ్యాఖ్యాతలు రాశారు కూడా. అంతవరకు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించకుండా వీరు హిందుత్వ, కరడుగట్టిన జాతీయవాదం, సంక్షేమవాదం, అవినీతిని నిర్మూలించే భారీ స్థాయి ప్రచారంలో తలమునకలై ఉండేవారు. అలాంటి సమయంలో సరైన పిలుపునే ఇచ్చామని మేం ఒకరకంగా సంతృప్తి చెందాం కూడా. అయితే గుజరాత్ ఎన్నికలు ఏమంత ముఖ్యమైన మార్పుగా కనిపించలేదు. కానీ దాని ప్రభావాన్ని అంచనా వేయడంలో రాజకీయ వ్యాఖ్యాతలుగా మేం విఫలమయ్యాం. భారత రాజకీయాలు తదుపరి 12 నెలల్లో దాని ఏకధ్రువ పరిస్థితిని కోల్పోనున్నాయన్న విషయాన్ని 2017 డిసెంబర్18న ఎవరూ పెద్దగా ఊహించలేకపోయారు. కానీ ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఒక టీవీ చానల్ కార్యక్రమంలో ఆ చానల్ యాంకర్ నవికా కుమార్‌కు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కి మధ్య జరిగిన సంవాదం మన రాజకీయాలు ఎంత ఏకధ్రువ స్వభావాన్ని సంతరించుకున్నాయో స్పష్టంగా తెలిపింది. కర్ణాటక ఎన్నికలో అధికారం చేజిక్కించుకోవడానికి తగిన సంఖ్యను సాధించలేకపోతే, బీజేపీ ఏం చేయగలదని ఆ టీవీ యాంకర్ ప్రశ్నించారు. దానికి పాలక పార్టీలో అత్యంత శక్తిమంతుడైన రామ్ మాధవ్, ‘అయితే ఏంటి, మాకు అమిత్ షా ఉన్నారు’ అని సమాధానమిచ్చారు. అది సొంత డబ్బా మాత్రం కాదు. బీజేపీకి తగినన్ని స్థానాలు రాకపోతే గెలిచిన మిగిలిన పార్టీల సభ్యులను బీజేపీలోకి ఆకర్షిస్తాం అనే ధీమాను రామ్ మాధవ్ వ్యాఖ్య వ్యక్తం చేసింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా బరిలో నిలబడలేకపోయినప్పటికీ, మేఘాలయాలో మైనారిటీలో ఉన్నప్పటికీ బీజేపీ ఆ రాష్ట్రాల్లో అధికారం సాధించగలిగింది. సీట్లు ముఖ్యం కాదని, తనకు పోటీయే లేదని బీజేపీ ఇక్కడ నిరూపించుకుంది. అది అమిత్‌షా వ్యూహంతో గెల్చుకున్న అధికారమని రామ్ మాధవ్ సూచించారు. కానీ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలతో ఈ పరిస్థితిలో మార్పువచ్చింది. అతిచిన్న పొత్తుదారుకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని నివ్వెరపర్చింది. దీంతో నూతన రాజకీయాలకు నాంది ఏర్పడింది. బీజేపీని అధికారంలోంచి తప్పించాలని బలంగా కోరుకుంటున్న పార్టీలన్నీ పొత్తుకు అంగీకరించే ధోరణి పెరిగింది. దానికోసం ఎలాంటి మూల్యాన్ని చెల్లించడానికైనా ఈ పార్టీలు ఇప్పుడు సిద్ధపడిపోయారు. ఇది నిజంగానే అమిత్ షా రాజకీయాలకు సవాల్ విసిరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ ఎన్ని పన్నాగాలూ పన్నినప్పటికీ, ఎన్ని కుయుక్తులు అల్లినప్పటికీ, అతిపెద్ద పార్టీగా నంబర్ల గేమ్‌ను ఆడినప్పటికీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తొలిసారిగా, మోదీ, షాలు ఓటమి ఎరుగని, పరాజయం తెలీని మహా వ్యూహకర్తలు కాదని కర్ణాటక నిరూపించింది. వ్యూహాత్మకంగా బీజేపీని ఓడించగల సమయస్ఫూర్తిని కాంగ్రెస్ ప్రదర్శించింది. పైగా, మోదీ కేంద్రంగా నడిచే ఎన్నికల ప్రచార పోరాటంలో మోదీ తొలిసారిగా విఫలమయ్యారు. బీజేపీకి దన్నుగా నిలిచే అధికార వనరులూ, ఏజెన్సీలు కర్ణాటకలో ఎమ్మెల్యేలను గెల్చుకోవడంలో పరాజయం పొందాయి. ప్రధానంగా సుప్రీంకోర్టు బీజేపీ ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసింది. గుజరాత్లో అహ్మద్ పటేల్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాకుండా చూడాలని మోదీ, షా ద్వయం చేసిన ప్రయత్నాలకు తొలి సంస్థాగత వైఫల్యం సంభవించిన సంవత్సరం తర్పాత బీజేపీని అధికారం నుంచి తప్పించగలమని, ఉనికి కాపాడుకోవడమే కాదు. గెలుపు కూడా సాధించగలమనే నమ్మకాన్ని కర్ణాటక ఫలితాలు స్పష్టం చేశాయి. సరిగ్గా ఇదే హిందీ ప్రాబల్య ప్రాంతాల్లో తదుపరి జరిగిన ఎన్నికలకు ఒక విభిన్న పొందికను నిర్దేశించింది. మోదీని ఓడించవచ్చని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇప్పుడు నమ్మసాగాయి. 2017 డిసెంబర్మధ్యనాటికి కలలో కూడా ఇలాంటి స్థైర్యం వాటికి ఉండేది కాదు. 2018 డిసెంబర్ మధ్య నాటికి అధికారం తమకు చేరువలో ఉందని తొలిసారిగా కాంగ్రెస్‌తో సహా ప్రతిఫక్షాలకు విశ్వాసం కలిగింది. అందుకే 2017 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ మధ్య కాలం అత్యంత ముఖ్యమైన రాజకీయ సంవత్సరంగా మనం పిలుస్తున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఫలితాలు ప్రకటితమైన మధ్యాహ్నమే, మోదీ ప్రవచిస్తూ వచ్చిన కాంగ్రెస్ విముక్త భారత్ భావన కథ ముగిసిపోయిందని వ్యాఖ్యాతలుగా చెప్పాం. ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కూడా పరోక్షంగా ఈ వాస్తవాన్ని గుర్తించారు. కాంగ్రెస్ ముక్త్ అనే తన భావనకు అర్థం కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాలని కాదని, దాని భావజాలం, ఆలోచనలు ఉనికిలో లేకుండా పోవాలన్నది తన అభిమతమని మోదీ తొలిసారిగా నిర్వచనమిచ్చారు. కాంగ్రెస్ అలోచనలు అంటే కులతత్వం, వంశపారంపర్య రాజకీయాలు, అప్రజాస్వామికమైన, బంధుప్రీతితో కూడిన రాజకీయాలు మాత్రమేనని మోదీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ బరిలో ముందుకురావడం, ఉత్తరప్రదేశ్‌లో కుల ప్రాతిపదిక పార్టీలైన సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూటమి బీజేపీకి హెచ్చరికలు పంపడం, మోదీపై అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగటం వంటి పరిణామాలు బీజేపీకి అడ్డం తిరిగాయి. కాంగ్రెస్ ఆలోచనలు నశించాలి అనే మోదీ నిర్వచనం సరైందే అనుకుందాం. కానీ 2010 తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ తనను తాను శక్తివంతమైన పార్టీగా మార్చుకుని ముందుకొచ్చింది. భారతీయ రాజకీయాల్లో గత మూడేళ్ల తర్వాత ఏర్పడిన రెండో ఏక ధ్రువపార్టీగా కాంగ్రెస్ అవతరించింది. అయితే మోదీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో దుర్భల స్థితిలో ఉన్నారని చెప్పడానికి మీకు కాస్త దమ్ముండాలి మరి. ఆయన వ్యక్తిగత ప్రజాదరణ, తన శ్రోతలతో తానేర్పర్చుకున్న అనుసంధానం, ఆకర్షణ శక్తి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నట్లుగా భారతదేశంలో మెజారిటీని కలిగివున్న ఒక బలమైన నాయకుడిని ఇంతవరకూ ఏ పోటీదారు ఓడించలేకపోయారు. అలాంటి బలమైన నాయకుడు లేక నాయకురాలు (1977లో ఇందిరాగాంధీ లాగా) తనను తాను ఓడించుకోవలసిందే. ఇలా జరగాలంటే తప్పనిసరిగా మూడు పరిణామాలు సంభవించాల్సి ఉంది. ఆ బలమైన నాయకుడు తనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసేంత స్థాయిలో ప్రజాదరణ కోల్పోవాలి. తమలోని విభేదాలను, ఆకాంక్షలను, దురాశలను పక్కనబెట్టి ఆ బలమైన నాయకుడికి వ్యతిరేకంగా విభిన్న రాజకీయ శక్తులు పొత్తు కుదుర్చుకుని అతడి ఓటమికి ప్రాతిపదికను ఏర్పర్చుకోవాలి. కాబోయే ప్రధాని స్థాయిని ప్రకటించుకోనప్పటికీ ఇలాంటి రాజకీయ శక్తులను ఒక చోటికి చేర్చగలిగిన సమున్నత వ్యక్తిత్వం ఉన్న వారు ముందుకు రావాలి. 1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఇలాంటి పాత్రనే పోషించారు. 1989లో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వీపీ సింగ్ ఇలాంటి పాత్రనే పోషించారు. ఒక సంవత్సరం క్రితం వెలిసిపోతున్న రాజవంశానికి ప్రతినిధిగా ఉన్న స్థితినుంచి రాహుల్ గాంధీ ఇప్పుడు రెండో ఏకధ్రువ స్థితికి కాంగ్రెస్‌ను అమాంతంగా తీసుకొచ్చారు. 2019 కోసం రాజకీయ క్రీడ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు కూడా హాజరుకాకుండా తన రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనకున్న బలీయమైన కారణం ఇదే మరి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సంస్కరణలు జనంలోంచి రావాలి
కేరళలో హిందువుల విశ్వాసాలకు సంబంధించిన తొలి వివాదం నుంచి ఆరెస్సెస్/బీజేపీ లబ్ధిపొందే అవకాశం సుప్రీంకోర్టు తీర్పు వల్ల లభించింది. దీన్ని కాషాయపక్షం జనంలో తన పునాదులు విస్తరించుకోవడానికి విజయవంతంగా వాడుకోగలదా? లేక ప్రతిదీ సంశయాత్మక దృష్టితో చూసే మలయాళీలు హిందుత్వవాదుల ప్రచారాన్ని తిప్పికొడతారా? వివక్ష పాటించే మత సంప్రదాయాలను రద్దు చేయాల్సిన అవసరముంది. దురాచారాలను రూపుమాపాల్సింది సామాజిక, రాజకీయ సంస్కర్తలేగానీ న్యాయస్థానాలు కాదు. కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలు పోవాల్సిందే. కానీ వాటిని ప్రజలు వదులుకోవాలంటే సంస్కరణలు జనం లోపలి నుంచే రావాలి. కేరళ హిందుత్వ నాయకులు తెలివి తక్కువ వారై ఉండాలి. లేదా దుర్మార్గమైన హాస్య చతురత కలిగి ఉండాలి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి పది నుంచి 50 ఏళ్ల వయసున్న స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వారు నిరసన తెలుపు తున్నారంటే వారి ప్రవర్తనకు నేను ముందు చెప్పినవే కారణాలు. వాస్త వానికి తమకు పరోక్షంగా మేలుచేసిన సుప్రీంకోర్టు జడ్జీలకు ఈ నేతలు పుష్పగుచ్ఛాలు, ఆశీర్వాదాలు పంపాల్సింది. రాజ్యాంగ ధర్మాసనం 4–1 మెజారిటీ తీర్పు సదుద్దేశంతో ఇచ్చినా, హిందుత్వవాదులకు గొప్ప అవ కాశం కల్పించింది. కేరళలో ఎదగడానికి అవసరమైన పునాది నిర్మించు కోవడంలో రెండు తరాల ఆరెస్సెస్–జనసంఘ్–బీజేపీ నేతలు విఫలమ య్యారు. ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల హిందుత్వ నేతలు చివరి అడ్డంకి దాటి బలోపేతం కావడానికి ఆస్కారమిచ్చింది. తమిళనాడులో రెండు ప్రధాన పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదైనా బీజేపీతో కలిసి సంకీ ర్ణంలో చేరగలవు. కేరళలో మాత్రం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రెండూ బీజేపీని సమానంగా వ్యతిరేకిస్తాయి. కేరళలో చోటు సంపాదించడానికి ఆరెస్సెస్ కార్యకర్తలు వామ పక్షాలతో ఘర్షణ పడుతున్న క్రమంలో హత్యలు జరు గుతున్నాయి. రాజధాని తిరువనంతపురంలో తప్ప రాష్ట్రంలో ఇంకెక్కడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. 2014లో తిరువ నంతపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ కంటే కేవలం 15 వేల ఓట్లు తక్కువ వచ్చాయి. కేరళలో హిందువుల విశ్వాసాలకు సంబంధించిన తొలి వివాదం నుంచి ఆరెస్సెస్/బీజేపీ లబ్ధి పొందే అవకాశం సుప్రీంకోర్టు తీర్పువల్ల లభించింది. దీన్ని కాషాయపక్షం జనంలో తన పునాదులు విస్తరించుకోవడానికి విజయవంతంగా వాడుకోగలదా? లేక ప్రతిదీ సంశయాత్మక దృష్టితో చూసే మలయాళీలు హిందుత్వవాదుల ప్రచా రాన్ని తిప్పికొడతారా? ఇక్కడ తమ పరిధి పెంచుకోవడానికి హిందుత్వ శక్తులకు మంచి అవకాశం దొరికిందనేది మనకు కళ్లకు కనిపించే వాస్తవం. కోర్టు తీర్పుపై నిరసన తెలపడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలను భారీ సంఖ్యలో సమీకరించాయి. ఈ స్త్రీలలో ఎక్కు వమంది సంస్కృత పదాలు, ఉచ్చారణతో కూడిన హిందీ మాట్లాడ డానికి కారణం వారంతా ఆరెస్సెస్ వ్యవస్థలో శిక్షణపొందడమే. నేడు పెద్ద సంఖ్యలో వారు శబరిమల చేరుకోవడంలో తప్పేమీ లేదు. హిందూ మితవాదశక్తులు కేరళలో బలపడే అవకాశం ఇచ్చిన ఉదారవాద న్యాయ మూర్తులకు కృతజ్ఞతలు చెప్పకతప్పదు. ‘సుప్రీం’ జోక్యంతో ఊహించని పరిణామాలు! మతం సహా అన్ని విషయాలను చట్టం, రాజ్యాంగ సూత్రాలను బట్టి తీర్పు చెప్పే సుప్రీం కోర్టు జోక్యం ఫలితంగా ఊహించని పరిణామాలు ఎలా ఎదురౌతాయో శబరిమల వివాదం చక్కటి ఉదాహరణ. సుప్రీం కోర్టు విచారణ తీరు చూస్తే– అది ఏ మతం అయినా హేతుబద్ధమనే నమ్మకంతో సాగుతుందనిపిస్తోంది. దేవుడి అవతారాలపై విశ్వాసం హేతుబద్ధమేనా? లేక ఒకే దేవుడు లేదా దేవత వందలాది అవతారాలు కూడా హేతువుకు నిలుస్తాయా? ఏ దేవుడు లేదా దేవతకు సంబంధిం చిన అనేక అవతారాలను సమర్థిస్తూ శోధించి పరిశోధనా పత్రాలు సమర్పించగలరా? లేక కన్యకు బిడ్డ పుట్టాడని నిరూపించగలరా? శివుడు, విష్ణు అవతారమైన మోహినీ సంపర్కంతో అయ్యప్ప స్వామి పుట్టాడని తేల్చిచెప్పేవారున్నారా? ఏసు పునరుత్థానం సంగతి? మహ్మద్ ప్రవక్తకు అల్లా చెప్పిన విషయాలే పవిత్ర గ్రంథం ఖురాన్‌లోనివని చెప్ప డానికి సాక్ష్యం ఏదని ఏదైనా కోర్టు అడుగుతుందా? ఇంకా అనేక ఆది వాసీ విశ్వాసాలు, జంతువులను పూజించడం, సూర్య, చంద్రారాధన, జంతు బలుల సంప్రదాయాలు, ఆచారాలకు హేతుబద్ధమైన ఆధారాలు అడిగితే? ఎవరు చెప్పగలరు? ఓ చెట్టు మీదో, రాయి మీదో ఎవరైనా తెల్ల సున్నం లేదా కాషాయ రంగు వేసినా లేదా పాడుబడిన సమాధిపై కొన్ని ఆస్బెస్టాస్ రేకులతో షెడ్డు వేస్తే పెద్ద సంఖ్యలో జనం ఈ ప్రదే శాలకు వచ్చి ప్రార్థనలు, పూజలు చేయడం మొదలెడతారు. ఇలాంటి విషయాలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానాలు విచారిస్తాయా? రోమన్ క్యాథలిక్ పీఠంలో స్త్రీలకు సమాన హక్కులు, పదవులు ఇవ్వాలని ఆదేశించాలంటూ ఎవరైనా క్రైస్తవ మహిళ సుప్రీంకోర్టును అభ్యర్థిస్తే ఏమవుతుంది? క్రైస్తవ మతబోధకులను యూపీఎస్సీ తరహా సంస్థ ఎంపిక చేయాలని కోర్టు ఆదేశిస్తే? ఆరెస్సెస్‌లోని అన్ని పదవుల్లో స్త్రీలకు కూడా స్థానం కల్పించాలని ఆదేశించాలంటూ ఓ హిందూ మహిళ జడ్జీ లను అడగగలదా? అలాగే, ఆరెస్సెస్‌కు ఓ మహిళ నాయకత్వం (‘సర్ సంఘ్చాలికా’?) వహిస్తే నిజంగా బావుంటుంది. ఇది భవిష్యత్తులో జరగొచ్చేమో కూడా. అయితే, ఇది ఏదైనా కోర్టు ఆదేశాలపై మాత్రం జరగదని మాత్రం మీరు ఖాయంగా నమ్మవచ్చు. భిన్న విశ్వాసాలతో మనమంతా మొత్తంమీద శాంతియుత సహ జీవనం కొనసాగించడానికి కారణం భారతీయులుగా మనం మన పొరు గువారిని ప్రశాంతంగా ఉండనివ్వడమే. మత విశ్వాసాల విషయానికి వస్తే మన ప్రభుత్వం (రాజ్యం) అత్యంత స్వల్పస్థాయిలోనే వాటిలో జోక్యం చేసుకునే సంప్రదాయం మొన్నటి వరకూ కొనసాగింది.. హిందూ కోడ్ బిల్లుపై విపరీతమైన చర్చ జరిగిందిగాని దానిపై వివా దాల కారణంగా అది చట్టం కాలేదు. పార్లమెంటులో చర్చలు, మెజారిటీ ద్వారానే హిందూ పర్సనల్ చట్టాలు, సంప్రదాయాల్లో జవహర్లాల్ నెహ్రూ మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి సంస్కరణలను అత్యుత్తమ సుప్రీంకోర్టు బెంచ్‌లు కూడా గత కొన్ని దశాబ్దాల్లో చేయలేకపోయా యని నేను అత్యంత వినమ్రతతో చెప్పగలను. అదే కోర్టు నేడు ట్రిపుల్ తలాక్ చెల్లదని ప్రకటించింది. ప్రస్తుత పాలకపక్షం రాజకీయాలు భిన్నమైనవి కావడం వల్ల ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, ఈ కారణంగా పోలీసులు వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లలోకి ప్రవేశించి, పురుషులను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయడం మనం నిజంగా చూస్తున్నామా? అదే జరిగితే ఇప్పటికే భయంతో వణికిపోతున్న మతవర్గం మరింత భయోత్పాతా నికి గురికాదా? ముమ్మారు తలాక్ అనేసి విడాకులివ్వడం భరించరాని విషయమే. అనేక ముస్లిం దేశాలు ఈ పద్ధతిని రద్దుచేశాయి. భారత ముస్లింలు కూడా ముమ్మారు తలాక్‌కు మంగళం పాడాలి. ఇలాంటి సంస్కరణలు ఆయా సమాజాల లోపలి నుంచే రావాలి. అంతేగాని ‘ఉదారవాద’ తీర్పుతో లభించిన అధికారంతో పోలీసుల ద్వారా కాదు. వ్యక్తిగత స్వేచ్ఛే శబరిమల తీర్పునకు కారణమా? వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం కారణంగానే శబరిమల వివాదంపై ఇచ్చిన తీర్పును సమర్థించుకున్నారని అర్థమౌతోంది. పిల్లలు కనే వయ సులో ఉన్నారనే సాకుతో స్త్రీలను అయ్యప్ప గుడిలోకి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు? ఈ మహిళలు తమ స్త్రీత్వంతో బ్రహ్మచారి అయిన దేవుడి దృష్టికి ‘భంగం’ కలిగిస్తారని మనం ఎలా నమ్మాలి? స్త్రీలను శబరిమల గుడిలోకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును ప్రశంసిస్తూ మీడి యాలో సంపాదకీయాలు, పొగడ్తల వర్షం కురిసింది. సమానత్వం సాధించడానికి సుప్రీం మంచి తీర్పు ఇచ్చిందన్న సామాజిక కార్యకర్తలు మరో అంశం పరిష్కార దిశగా ప్రయాణం ప్రారంభించారు. అమలు చేయడానికి సాధ్యంకాని కోర్టు ఉత్తర్వులపై ప్రజలు చర్చించారా లేక దానిపై పరిశోధనా పత్రాలున్నాయా? అంటే జవాబు లేదనే వస్తుంది. మతాలతో సంబంధం లేకుండా టూవీలర్లు నడిపే మహిళలంతా హెల్మెట్లు తప్పనిసరిగా పెట్టుకోవాలన్న కోర్టు ఉత్తర్వు సిక్కుల నిరస నలతో తర్వాత రద్దయింది. అయినా, భద్రత గురించి ఆలోచించే సిక్కు మహిళలు హెల్మెట్లు ధరించడం పెరుగుతోంది. వారిని జన సమూహా లేవీ అడ్డుకోవడం లేదు. కొన్ని ముస్లిం తెగల్లో స్త్రీల మర్మాంగాల్లో కొన్ని భాగాలను తొల గించడం(ఎఫ్‌జీఎం)పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపు తోంది. కోర్టు ఈ దురాచారం చెల్లదని తీర్పు ఇవ్వవచ్చు. కానీ ఆ ఉత్త ర్వును అమలు చేయగలరా? ఈ తెగ ముస్లింలు నివసించే మహా రాష్ట్ర, గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వాలు కూడా పైన చెప్పిన నేరం చేసిన వారిని తమ పోలీసులతో ప్రాసిక్యూట్ చేయించగలవా? పోలీసులు అలా చేయలేమంటే ఏం చేస్తాయి? కొన్నిసార్లు జడ్జీల కన్నా రాజకీయ నేతలు తెలివిగా ప్రవర్తిస్తారు. ట్రిఫుల్ తలాక్‌పై ఆగ్రహం ప్రకటించిన నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం సైతం స్త్రీల మర్మాంగాల కోత విషయంపై మౌనం పాటి స్తున్నారు. వారణాసిలోని ఓ ఖబరిస్తాన్లో షియా–సున్నీ వివాదంపై 40 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో సుప్రీం కోర్టు దాని అమలుపై స్టే ఇచ్చింది. ఎలాంటి వివాదాస్పద సంప్రదాయం లేదా దురాచారమైనా చెల్లదని ఇచ్చే తీర్పులు న్యాయపరంగా, సామాజిక, రాజకీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇలాంటి కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలు పోవాల్సిందే. కానీ వాటిని ప్రజలు వదు లుకోవాలంటే సంస్కరణలు జనం లోపలి నుంచే రావాలి. కోర్టుల జోక్యం ద్వారా మాత్రమే పైన చెప్పిన సామాజిక రుగ్మతలను తొల గించడం సాధ్యం కాదు. కోర్టుల అనవసర జోక్యం వల్ల ఆశించని పర్యవసానాలు ఎదురౌతాయి. శబరిమల తీర్పుతో కేరళలో బీజేపీ బలపడే అవకాశాలు మెరుగవ్వడం వంటి పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మోదీకి ‘పనికొచ్చే మూర్ఖులు’
ముస్లింను శత్రువుగా చిత్రించే అసలు ఫార్ములా పాతబడింది. అందుకే దేశ ఉనికికి ముప్పు కలిగించే మరో శత్రువును ‘కనిపెట్టాల్సిన’ అవసరం ఏర్పడింది. మావోయిస్టుల్ని అలా చూపించవచ్చు. వారికి ఇస్లామిక్ తీవ్రవాదంతో సంబంధం అంటగడితే మరీ మంచిది. ఉద్యోగాలు అడిగే యువతను ‘అవతల దేశం నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే ఇలాంటివి అడుగుతారా... మీ దేశభక్తి ఏమైంద’ని ప్రశ్నిస్తే సరి! అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాలకపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు. బోల్షివిక్ విప్లవం సమయంలో తమకు అనుకూలంగా మాట్లాడే కమ్యూనిస్టులు కాని నవ ఉదారవాదులను సోవి యెట్ విప్లవ నేత లెనిన్ ‘పనికొచ్చే మూర్ఖులు’ అని పిలిచేవారని చెబు తారు. ఇండియాలో గత రెండు దశాబ్దాలుగా పట్టణప్రాంతాలకు చెందిన వామపక్ష, ఉదారవాద మేధావులను హిందుత్వ మద్దతుదారులైన బుద్ధిజీవులు ఇలాగే (యూజ్‌ఫుల్ ఇడియట్స్) పిలుస్తున్నారు. వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే కొత్త పేరు పెట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం పాక్షిక విజయమే సాధించింది. వారు అర్బన్ నక్సల్సా, కాదా అనే విషయం పక్కన పెడితే, ఈ మేధావులను బీజేపీ/ఆరెస్సెస్ పనికొచ్చే మూర్ఖులు అనడం సబబేనని ఇప్పుడందుతున్న సమాచారం చెబుతోంది. అయితే ‘గొప్ప భారత విప్లవానికి’ వారు పనికొచ్చే మూర్ఖులు కాదు. వారిలో అతికొద్ది మంది మాత్రమే ఇంకా రెండు మూడు కేంద్ర విశ్వ విద్యాలయాలకే పరిమితమై కనిపిస్తున్నారు. అలాగే, బస్తర్ వంటి ఆదివాసీలు నివసించే ఒకట్రెండు అటవీ ప్రాంతాల్లో కొద్దిమంది మరింత ప్రమాదకరమైన రీతిలో ఉంటున్నారు. ఇలాంటి చోట్ల వారు బీజేపీకి ఉపయోగపడే మూర్ఖులుగా కనిపిస్తున్నారు. పట్టణ నక్సల్ లేదా గ్రామీణ నక్సల్ అంటూ ఎవరూ ఉండరు. నక్సలైట్ నక్సలైటే గాక మావో యిస్టు కూడా. అలా ఉండటం ఏమీ నేరం కాదు. ఎలాంటి నమ్మకాలున్నా, ఆ విశ్వాసాల గురించి బహిరంగంగా ప్రకటించినా ఏ చట్టంగాని, చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టంగాని ఎవరినీ భారత జైళ్లలో పెట్టలేవు. కశ్మీర్‌ను ఇండియా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుందని లేదా మన ప్రజాస్వామ్యం బూటకమని మీరు బాహాటంగా చెప్పవచ్చు. అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తు న్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాల కపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు. దేశాన్ని కాపాడటానికి ఓటేస్తారు. అందుకే 1984లో సిక్కు ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రాజీవ్గాంధీకా ఎలాన్/నహీ బనేగా’ అనే నినాదం కాంగ్రెస్‌ను గెలి పించింది. ముస్లింను శత్రువుగా చిత్రించే కాషాయపక్షం అసలు ఫార్ములా పాతబడిపోయింది. ముస్లిం అంటే పాకిస్థాన్–అంటే కశ్మీర్ వేర్పాటువాది–అంటే ఉగ్ర వాది–అంటే లష్కరే తోయిబా/అల్‌కాయిదా/ ఐసిస్ అనే సూత్రంతో వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రాగలమన్న విశ్వాసం బీజేపీకి లేదు. అదీగాక, హిందువులం దరూ కులం వంటి అంశాలను విస్మరించి ముస్లిం లంటే భయపడిపోయే పరిస్థితుల్లో లేరు. ముస్లింలపై వ్యతిరేకత కొనసాగేలా చేయ డానికి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉండేలా చూస్తూ, పాక్ సైనికులపై మెరుపు దాడులు చేయడం అంత తేలిక కాదు. పాక్‌పై భారత్ విరుచుకుపడితే దాన్ని ఆదుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి, భారతదేశ ఉనికికి ముప్పుగా కనిపించే మరో శత్రువును కనిపెట్టాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. మావోయిస్టులను అలా చూపించవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాదంతో వారికి సంబంధం అంటగడితే మరీ మంచిది. ఇలా చేశాక ‘దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే మీరు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతున్నారు. మీ దేశభక్తి ఏమైంది’ అంటూ పాలకపక్షం నేతలు ప్రశ్నించే అవకాశం ఉంది. 1980ల ఆఖరులో రాజీవ్‌గాంధీ పలుకు బడి తగ్గిపోయాక ‘కులం వల్ల విడిపోయిన ప్రజ లను కలపడానికి మతాన్ని బీజేపీ ఉపయోగించు కోగలదా?’ అనే ప్రశ్న తలెత్తింది. అయోధ్యతో ఎల్‌కె ఆడ్వాణీ ఆ పనిచేశారు. 2004 ఎన్నికలనాటికి బీజే పీకి జనాదరణ తగ్గిపోయింది. పదేళ్ల తర్వాత నరేంద్రమోదీ బీజేపీని గెలిపించారు. ఆయన వ్యక్తిగత విజయాలు, జనాకర్షణ శక్తి హిందూ ఓటర్లను ఆకట్టుకున్నాయి. బలమైన సర్కారు, వికాసం అందిస్తానన్న వాగ్దానం ఆచరణలో సాధించింది సగమే. అందుకు పాలకపక్షానికి కొత్త శత్రువు అవసరమైంది. ముస్లింలకు మావోయిస్టులను కలపడం ద్వారా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని పాలకపక్షం భావిస్తోంది. ‘దేశం తీవ్ర ప్రమాదంలో ఉంద’నే ప్రచారంతో ఈ ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తోంది. మావోయిస్టు అనే ఒక్క మాటతోనే ప్రజలను భయపెట్టి కాషాయపక్షంవైపునకు మళ్లించడం కుదరని పని. కాలేజీల్లో ఏమాత్రం ప్రమాదకరంగా కనిపించని మావోయిస్టులను మనం చూశాం. అయితే, నక్సలైట్లు ఆయుధాలతో తిరుగుతారు కాబట్టి వారిని చూస్తే భయమేస్తుంది. కాని, మనకు వారు కనపడరు. టీవీ స్క్రీన్లు, ట్విటర్లో కూడా కనిపించరు. నక్సల్స్ పేరుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో జనాన్ని బెదరగొట్టలేం. అందుకే అర్బన్ నక్సల్ అనే ప్రాణి పుట్టుకొచ్చింది. రెండున్నరేళ్ల క్రితం ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన ఘటనలు ఇక్కడ ప్రస్తావించాలి. వామపక్ష మేధావులు అభిమానించే ఉర్దూ కవి ఆగా షాహీద్ అలీ స్మారక కార్యక్రమం సందర్భంగా అప్పుడు కశ్మీర్ స్వాతంత్య్రంపై చర్చించి, మద్దతు ఇచ్చే విషయంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘భారత్ ముక్కలు ముక్కలవుతుంది, ఇన్షాల్లా– ఇన్షాల్లా’ అని కొందరు యువకులు నినాదాలు చేస్తున్నట్టు చూపే వీడియో హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో ఇద్దరు వామపక్ష విద్యార్థినేతలను (వారిలో ఒకరు ముస్లిం) అరెస్ట్ చేసి, వారిపై రాజద్రోహం వంటి కేసులు బనాయించారు. మరిన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. కశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్న తన విద్యార్థులను ప్రశంసిస్తూ ఓ మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతున్న మరో వీడియో దర్శనమిచ్చింది. ఇండియాను ముక్కలు ముక్కలు చేయడానికి దేశవ్యతిరేక ముస్లింలతో తీవ్రవాద, వామపక్ష మేధావులు చేతులు కలిపారనే కొత్త సిద్ధాంతానికి ఇలా రూపకల్పన జరిగింది. కశ్మీర్, బస్తర్ సంక్షోభాలను న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె నగరాల్లోని ఈ శక్తులు కుమ్మక్క య్యాయని, ఢిల్లీలోని జేఎన్‌యూ ఈ కార్యకలా పాలకు కేంద్రస్థానమైందనే ప్రచారం చేశారు. దీనికితోడు కశ్మీరీ వేర్పాటువాదం గురించి మాట్లాడటం ద్వారా తీవ్రవాద వామ పక్ష మేధావులు పరోక్షంగా, సర్కారీ అనుకూల టీవీ చానళ్లు ప్రత్యక్షంగా పాలపక్ష కొత్త ప్రచార వ్యూహం విజయవంతమయ్యేలా చేశాయి. నేడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇస్లామిక్ తీవ్రవాదం అంతం చేస్తుందని, పూర్వపు సోవియెట్ యూనియన్ వల్లకాని అనేక పనులు దీనివల్ల పూర్తవుతాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్షాలు నమ్ముతున్నాయి. ఇండియాలో కూడా ఇలాంటి ఆశలున్నవారు లేకపోలేదు. ఆయుధాలు పట్టిన కశ్మీరీలను, బస్తర్ ఆది వాసీలను ప్రభుత్వ సాయుధ బలగాలు చంపేస్తుంటే మాట్లాడేవారు లేరు. భారత సర్కారుతో ఎవరు పోరుకు తలపడినా మనవంటి కొద్దిమంది మేధా వులు మాత్రమే అందుకు ‘మూల కారణాల’ గురించి ఆలోచిస్తారు. కుట్ర పేరుతో ప్రభుత్వం అరెస్టు చేసిన హక్కుల నేతలు కూడా ఈలోగా కోర్టుల జోక్యంతో విడుదలవుతారు. ఫలితంగా మోదీ సర్కారు నైతికంగానే గాక కోర్టుల్లో కూడా ఈసారి ఓడిపోతుంది. అయినా పాలక పక్షం దిగులుపడదు. ఇది ఇప్పటికిప్పుడు పూర్తి చేయాల్సిన ‘ఆపరేషన్ రెడ్ హంట్’ కాదు. అందుకే ప్రభుత్వ ప్రచార వ్యూహంలో తమకు తెలియకుండానే భాగమైన వామపక్ష మేధావులు చివరికి పాలకపక్షానికి లెనిన్ చెప్పినట్టు ‘పనికొచ్చే మూర్ఖులు’గా మారినట్టవుతుంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ముస్లింల దేశభక్తికి ఇన్ని పరీక్షలా?
ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశం ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని తాజా హిందీ సినిమా ‘ముల్క్’ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే– ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు. ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు ముస్లిం. ఈ లెక్కన 2021 జనాభా లెక్కల్లో వారి సంఖ్య 20 కోట్లు దాటిపోతుంది. భారతదేశపు అత్యంత విజయవంతమైన సృజనాత్మక పరిశ్రమ సినిమారంగంలో ముస్లింల శాతం జనాభాలో వారి నిష్పత్తి కన్నా ఎక్కువే. మన చిత్ర పరిశ్రమలో ప్రతి ఏడుగురు ఉత్తమ నటులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్లో ముస్లింలు ఒకరి కంటే ఎక్కువ మందే ఉన్నారు. భారత సినిమా పరిశ్రమలో ముఖ్యంగా హిందీ సినిమాల్లో ముస్లింల కథాంశంతో నిర్మించే చిత్రాలు బాగా తక్కువ. చాలా అరుదుగా ముస్లింలు ప్రధాన పాత్రధారులుగా తీసే సినిమాల్లో వారిని చాలా మంచి మనుషులుగా లేదా నిజంగా చెడ్డవారిగా చూపిస్తారు. అందుకే అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన తాజా హిందీ చిత్రం ‘ముల్క్’ పైన చెప్పిన ముస్లిం సినిమాలకు భిన్నంగా ఉంది. హిందీ సినిమాల్లో ముస్లిం పాత్రలు హిందీ సినిమాల్లో ముస్లింలను చిత్రించిన తీరును బట్టి ఈ తరహా చిత్రాలను మూడు దశల్లో వచ్చినవిగా అంచనా వేయవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1960ల వరకూ మొఘల్ చరిత్రకు సంబంధించిన ప్రముఖుల కథల ఆధారంగా వరకూ తీసిన సినిమాలే ఎక్కువ. తాజ్‌మహల్, ముఘలే ఆజం, రజియా సుల్తానా వంటివి ఈ తరహా సినిమాలు. అదే కాలంలో మేరే మెహబూబ్ నుంచి పాకీజా వరకూ నిర్మించిన ‘ముస్లిం సాంఘిక’ సినిమాల్లో ప్రేమ, కవిత్వం, భూస్వామ్యవర్గం ఆడంబరాలు వంటి అంశాలతో నిండి ఉన్నాయి. 1970ల్లో ముస్లింలను ‘ఆగ్రహంతో ఉన్న యువకుల’ లక్షణాలతో చూపిస్తూ హిందీ సినిమాలు వచ్చాయి. ఈ రకం సినిమాల్లో విశాల హృదయంతో, నిజాయితీతో ధైర్యసాహసాలు ప్రదర్శించే ముస్లిం పాత్రధారులు చివర్లో దేశం కోసం, తమ హిందూ స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించడం చూశాం. 1973లో ప్రకాశ్‌మెహ్రా తీసిన ‘జంజీర్’ షేర్‌ఖాన్ పాత్రలో ప్రాణ్ ఇందులో తన మిత్రుడు, హీరో అమితాబ్ బచ్చన్‌ను ఉద్దేశించి ‘యారీ హై ఈమాన్ మేరా, యార్ మేరా జిందగీ’ అంటూ పాడిన పాట పై అంశానికి అద్దం పడుతోంది. 1980ల చివరి వరకూ వచ్చిన హిందీ చిత్రాల్లోని ముస్లింలు దాదాపుగా మంచివాళ్లుగానే ఉంటారు. అరుదుగా దుష్టపాత్రల్లో కనిపిస్తారు. తర్వాతి దశలో తీరు మారింది. దీన్ని హిందీ సినిమాల్లో సన్నీ దేవల్ దశగా పిలుద్దాం. దేశంలో మతతత్వం పెరుగుతున్న ఈ కాలంలో ముస్లింలను చెడ్డవాళ్లుగా, ఎక్కువగా ఉగ్రవాదులుగా చిత్రిస్తూ సినిమాలు వచ్చాయి. అప్పటి సినిమాల్లో ఒకటైన ‘జాల్’(వల)లో హీరో సన్నీ దేవల్ మంచి మనిషిగా దుష్టులకు(వారంతా ముస్లింలే) గుణపాఠం చెబుతాడు. ఆ సమయంలో వెనుక నుంచి ‘ఓం నమః శివాయ’ అనే మాటలు బిగ్గరగా వినిపిస్తారు. ముస్లింలు అంటే దుష్టులు వస్తున్నప్పుడు సమీపంలోని మసీదు నుంచి ముస్లింలకు నమాజు చేయాలని కోరే పిలుపు ‘అజా’ వస్తుంది. దేశభక్తి గల కథానాయకుని భార్య పాత్రలో టబూ నటించింది. ఆమె భర్తకు ద్రోహం చేసినట్టు ఈ సినిమాలో చూపించారు. దేవల్ హీరోగా చేసిన ఇలాంటిదే మరో చిత్రం ‘ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై’(గూఢచారి ప్రేమకథ అని అర్ధం). ఇందులో దేవల్ ముస్లిం భార్యగా ప్రియాంకా చోప్రా నటించింది. భర్త దుష్టులైన ముస్లింలతో పోరాడుతుంటే, ఆమె భర్త కోసం ప్రాణ త్యాగం చేస్తుంది. గదర్ ఏక్ ప్రేమ్ కథా అనే చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంత మతవిద్వేషంతో కూడిన హిందీ సినిమా ఏదీ అప్పటి వరకూ రాలేదని అప్పటి ఎడిటర్ ఎంజే అక్బర్ నాతో అన్నారు. అప్పటి నుంచి మళ్లీ ట్రెండ్ మారింది. ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించారు ఇస్లాం అంటే భయపడే రోజుల్లో ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించిన సినిమాలకు గిరాకీ పెరిగింది. కశ్మీర్లో ఉగ్రవాదం, అల్ కాయిదా, ఇండియన్ ముజాహదీన్ కార్యకలాపాలు ఎక్కువ కావడం దీనికి కార ణం. ముస్లిం పాత్రధారులు ఉన్న 50 సినిమాలపై అష్రఫ్ ఖాన్, సయీదా జరియా బుఖారీ 2011లో జరిపిన అధ్యయనం ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ సినిమాల్లో 65.2 శాతం ముస్లింలను చెడ్డ గుణాలున్న వారిగా, దాదాపు 30 శాతం చిత్రాల్లో తటస్థులుగా, కేవలం 4.4 శాతం సినిమాల్లో వారిని దుష్టులుగా చూపించారు. ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. జాన్ అబ్రహం నటించిన న్యూయార్క్, షారుఖ్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్, మలయాళ సినిమా అన్వర్లో ముస్లింలే కథానాయకులు. ముల్క్లో గొప్ప మార్పు! అనుభవ్ మిశ్రా సిన్హా దర్శకత్వం వహించిన ‘ముల్క్’ నిజంగా భిన్నమైన చిత్రం. హిందీ ప్రాంత నగరంలో(వారణాసి) నివసించే సాధారణ ముస్లిం కథే ఇందులో చూస్తాం. అయితే దీనిలో ప్రధాన పాత్రధారి(ముస్లిం) హిందూ కోడలు కుటుంబానికి కొంత దూరంగా ఉంటుంది. ముల్క్లో ముస్లింలను దేశభక్తిగల మంచి మనుషులుగానేగాక దుష్టులుగా, ఉగ్రవాదులుగా చూపించారు. ఇందులో మంచి ముస్లిం పోలీసు అధికారి పాత్రలో రజత్ కపూర్ చాలా తక్కువ మాటలతో, గొప్ప నటన ప్రదర్శించారు. వారణాసి ఉగ్రవాద వ్యతిరేక పోలీసు బృదం అధిపతిగా ఆయన తన సొంత మతానికి చెందిన వారిని గడగడలాడిస్తూ ప్రాణాలు తీయడంలో ఉత్సాహం చూపిస్తూ చేసిన నటన ఆకట్టుకుట్టుంది. రోజూవారీ సమస్యలున్న సగటు కుటుంబం కథ ఇది. ఇందులో ఎప్పటిలా కనిపించే మూస కోర్టు దృశ్యాలున్నాయి. ఈ కుటుంబ సభ్యుడైన కొడుకు ఉగ్రవాదిగా మారి పెట్టిన బాంబు పేలగా ముగ్గురు ముస్లింలు సహా 16 మంది మరణిస్తారు. తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో అతను మరణిస్తాడు. నేటి హిందీ ప్రాంత భారత ముస్లిం మనసులో కదలాడే భయం, అభద్రతాభావం, పరస్పర విరుద్ధమైన సంశయాలు, అనుమానాలు, ఆశలు, నిస్పృహలు–ఇవన్నీ సమ్మిళతమై వేధిస్తున్నట్టు ‘ముల్క్’లో కనిపించాయి. ఈ సినిమాలో లాయర్ మురాద్ అలీ మహ్మద్ (రిషికపూర్) సోదరుడి కొడుకు షాహిద్(ప్రతీక్ బబ్బర్) యువ ఉగ్రవాది. అతనిపై అనేక ఒత్తిళ్లతోపాటు ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వరని, ప్రపంచవ్యాప్తంగా వారిపై వివక్ష చూపిస్తున్నారనే ప్రచారం ప్రభావం చూపిస్తుంది. నిజంగా ఏడుగురిలో ఒకరైన ముస్లిం మనసులో ఇలాంటి ఆలోచనలుంటే దేశం ఇంకా అల్లకల్లోలం కాలేదేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశంలో ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని ముల్క్ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే–ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. మనం దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి మరణించిన సైనికుడు హవల్దార్ అబ్దుల్ హమీద్, ఏపీజే అబ్దుల్ కలాం, షెహనాయి విధ్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ను అభిమానిస్తాం. మిగిలిన ముస్లింలందరూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు. వాస్తవానికి ఉగ్రవాదులే ముస్లింలలో చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆయన సందేశం. ఇరవై ఏళ్లకు పైగా రాస్తున్న ఈ కాలమ్‌లో నేను రెండు సార్లు మాత్రమే హిందీ సినిమాల గురించి రాశాను. మన సమాజం లేదా రాజకీయాల్లో వచ్చిన కొత్త మార్పును (రాజకీయ పడితులు, నేతలు గుర్తించనివి) ప్రస్తావించిన సినిమాల గురించి చర్చించాను. సంపదను, ధనికుల జీవనశైలిని గొప్పగా చూపించిన ఫర్హాన్ అఖ్తర్ సినిమా దిల్ చాహ్తాహై(2001) గురించి మొదటిసారి రాశాను. రెండో సినిమా మసాన్. నీరజ్ ఘ్యావణ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ చిత్రంలో అప్పటి అడ్డూ అదుపూ లేని అభివృద్ధి సమాజంలో, వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చెప్పడానికి మసాన్ ప్రయత్నించింది. ముల్క్ మాదిరిగానే మసాన్‌ను కూడా వారణాసి నేపథ్యంలోనే నిర్మించారు. ఆధునిక భారతంలో సాధారణ ముస్లిం కుటుంబం కథనే అనుభవ్ సిన్హా ఎంత భిన్నగా చూపించారంటే–ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలంటూ కొందరు డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తింది. అయితే, గతంలో మేఘనా గుల్జార్ తీసిన ‘రాజీ’లో ఓ పాకిస్థానీ సైనికుడి కుటుంబంలోని సభ్యులు మంచివారిగా చిత్రించారు. ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం, ఆత్మవిశ్వాసం భారతీయులకు ఉన్నందుకు మనం గర్వపడాలి. ఇప్పుడు ముల్క్ కూడా ‘రాజీ’లో మాదిరిగానే వాస్తవాలను ధైర్యంగా చెప్పింది. 2005లో ఇదే వారణాసి నగరంలోని గొప్ప ముస్లిం కళాకారుడు బిస్మిల్లా ఖాన్ నుంచి ఓ అద్భుతమైన పాఠం నేర్చుకున్నాను. నా ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూ కోసం ఆయనను కలిసినప్పుడు, ‘‘జిన్నా స్వయంగా మిమ్మల్ని కోరినా మీరు 1947లో పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోలేదు?’’ అని ప్రశ్నించాను. ‘‘ కైసే జాతే హమ్? వహా హమారా బనారస్ హై క్యా?’’(ఎందుకు వెళ్తాను? అక్కడేమైనా మా బెనారస్ ఉందా?) అని బిస్మిల్లాఖాన్ జవాబిచ్చారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంచి సందేశమిస్తున్న ముల్క్ చూడాలనే నేను సలహా ఇస్తున్నాను. శేఖర్ గుప్తా ,వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ (twitter@shekargupta) -
ఈ సందేశాల పరమార్థం ఏమిటి?
కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివసేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. కానీ శివసేన ఎన్డీఏ నుంచి బయట పడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశా నికి కారణమిదే. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. భారత రాజకీయాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇక్కడ శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరు. కేవలం మారే స్వార్థ ప్రయోజనాలే కనిపి స్తుంటాయి. ఈ రాజకీయ పొత్తులు, అవి ముగిసి పోవడం–ఇవన్నీ కొన్ని లెక్కల ప్రకారం సాగుతుం టాయి. ఉత్తరాదిన వీటినే హిందీలో ‘జోడ్–తోడ్ రాజినీతి’ (కలయికలు–చీలికల రాజకీయం) అని పిలుస్తారు. అయితే, ఈ తరహా రాజకీయాలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నేను రాజకీయ విలే కరిగా ఉన్న రోజుల్లో భారత రాజకీయాల్లో గొప్ప గురువులుగా పేరొందిన ముగ్గురు నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎల్.కె.ఆడ్వాణీ, దివంగత సీతారాం కేసరీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అదృష్టం నాకు దక్కింది. ఇండియాలో రాజకీయాధికారం ఎలా నడు స్తుందనే విషయంలో విభిన్న అంశాలకు సంబం ధించి ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ‘స్పెషలిస్ట్ ప్రొఫెసరే’. దేశంలో మొత్తం రాజకీయ శాస్త్రంలో అత్యంత నిష్ణాతుడైన అధ్యాపకుడు∙ప్రణబ్‌దా అని నేనంటే ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని భావిస్తాను. 1980ల చివరి నుంచీ ఆడ్వాణీ తన పార్టీ బీజేపీని బలోపేతం చేసే పని ప్రారంభించారు. 1984లో రెండు సీట్లు గెలిచిన ఈ పార్టీని 1989లో 85 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునే స్థాయికి, 1998లో అధికారంలోకి వచ్చే స్థితికి ఆయన తీసు కెళ్లారు. అనేక పార్టీలతో పొత్తుల ద్వారా సంకీర్ణ కూటమి నిర్మాణంతో విజయం సాధించవచ్చని ఆయన చెబుతారు. ‘‘మేం జాతి వ్యతిరేకమని భావించే పార్టీలు ఐదు ఉన్నాయి. వీటిని మిన హాయిస్తే మరెవరితోనైనా పొత్తుకు మేం సిద్ధమే’’ అని ఆయన అంటారు. ఆడ్వాణీ దృష్టిలో ఈ ఐదు ‘అంటరాని’ పార్టీలు–కాంగ్రెస్, వామపక్షాలు, ములాయం నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), లాలూ నడిపే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), ముస్లింలీగ్(ఇలాంటి తరహా పార్టీలైన ఒవైసీల ఎంఐఎం, అస్సాం అజ్మల్ పార్టీ ఏఐయూడీఎఫ్ సహా). బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా వేరే దారి లేని శివసేన, శిరోమణి అకాలీదళ్, ఒక దశలో టీడీపీ ఆ పార్టీ పంచన చేరాయి. వీటిలో మొదటి రెండు పార్టీలూ తమ రాజకీయాలకు, అధికారం సాధించడానికి మతమే కీలకం కావడం వల్ల కాషా యపక్షంతో జతకట్టాయి. కాంగ్రెసే తన ఏకైక ప్రత్యర్థి కావడంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఆడ్వాణీ రూపుదిద్దిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉన్న మొదటి మిశ్రమ సర్కారు. అప్పటి వరకూ సీనియర్ నేత జార్జి ఫెర్నాండెజ్ ‘అత్తగారి దేశంలో (ఇటలీ–సోనియా మాతృదేశం) సంకీర్ణ ప్రభుత్వాలు లక్షణంగా నడుస్తున్నప్పుడు ఇండి యాలో ఇవి ఎందుకు పనిచేయవు?’ అని గతంలో అన్నప్పుడల్లా జనం భయపడేవారు. తర్వాత ఆ ‘కూతురు’ (సోనియా) నిర్మించిన రెండు సంకీర్ణాలు పూర్తి కాలం పదేళ్లు అధికారంలో కొనసాగాయి. ‘సంకీర్ణ పరిస్థితులు’ పెద్దగా మారనే లేదు! ప్రధాన జాతీయపక్షాలు ఎప్పటికీ పొత్తు పెట్టుకోని పార్టీలు ఉన్నాయి. అలాగే, వేరే దారి లేక ప్రధాన పక్షాలతో చేతులు కలిపే పార్టీలూ ఉన్నాయి. రెండో తరహా పార్టీల్లో శరద్ పవార్ నేతృత్వంలోని నేషన లిస్ట్ కాంగ్రెస్‌పార్టీ(ఎన్సీపీ) మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం కోసం సిద్ధాంతాలు వదులుకునే రాజకీయపక్షాలకు 75 నుంచి 150 లోక్‌సభ సీట్లు వస్తుంటాయి. అందుకే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజా రిటీకి అవసరమైన 272 సీట్లు ఎలా గెలవాలనే విష యానికి బదులు 160 వరకూ సీట్లు దక్కించుకునే ఇలాంటి పార్టీలపై చర్చ ఎక్కువవుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల ముందునాటి స్థితికి మళ్లీ దేశం చేరుకుంటోందని పరిస్థితులు సూచిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవ కాశం లేదు. ఏ పార్టీకీ 272 సీట్లు రాని 1989 తర్వాత పరిస్థితికి చేరుకుంటున్నాం. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేకు ట్విటర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ‘‘శ్రీ ఉద్ధవ్ ఠాక్రేజీ, జన్మ దిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో ఆనం దంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను,’’ అని సందేశం పంపడంలో పరమార్థం ఏమిటి? మనసులో ఓ మాట, పైకో మాట రాజకీయ నేతలకు సహజమే. రాజకీయ ప్రత్యర్థికి పుట్టినరోజు లేదా పండగ శుభా కాంక్షలు చెప్పడం సర్వసాధారణం. అలాగే, తన బద్ధ రాజకీయ ప్రత్యర్థి దగ్గరకు వెళ్లి ఓ బడా నేత కావ లించుకోవడం చూసి మనం ఆశ్చర్యపడాల్సినది కూడా ఏమీ లేదు. కాని, ఉద్ధవ్‌కు రాహుల్ సందేశం విషయంలో మనం కొంత ఆలోచించక తప్పదు. కాంగ్రెస్ అధ్యక్షుడెవరూ బహిరంగంగా ఎవరికీ శుభా కాంక్షలు తెలిపిన సందర్భాలు లేవు. సైద్ధాంతికంగా పూర్తిగా అసహ్యించుకోవాల్సిన విలువలు పాటించే పార్టీ నేతకు దేశ ప్రజలందరూ చూసేలా ట్విటర్లో ఇలా గ్రీటింగ్స్ చెప్పడం వింతే మరి. కాంగ్రెస్‌కు బీజేపీ కన్నా శివసేన మరింత అంటరాని పార్టీగా ఉండాలని రెండు పార్టీల నేపథ్యం చెబుతోంది. అదీ గాక, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట మిలో ముఖ్య భాగస్వామ్య పక్షం శివసేన. శివసేన అధినేతకు దగ్గరవడానికి రాహుల్ ఇప్పుడిలా బహిరంగ ‘ప్రేమలేఖ’తో ప్రయత్నిం చడం మూడు విషయాలను సూచిస్తోంది. ఒకటి, బీజేపీ– శివసేన మధ్య సంబందాలు దెబ్బతినడం ఆయన గమనించారు. రెండోది, 2019 ఎన్నికల్లో తన వ్యూహంపై మరింత స్పష్టత ఇచ్చారు. నేను కాకున్నా ఫరవాలేదు గాని, మోదీకి బదులు ఎవరు ప్రధానిగా అయినా అభ్యంతరం లేదనే విషయం మరోసారి తేల్చి చెప్పారు. ఇక మూడోది, 2019లో దేశంలో సంకీర్ణయుగం మళ్లీ ఆరంభమైతే, రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఆడ్వాణీ చెప్పిన రీతిలో ఉండవనేది రాహుల్ అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వ్యూహంపై స్పష్టతనిచ్చిన రాహుల్ శత్రువు శత్రువు మిత్రుడనేది పాత మాట. నీ శత్రువు సన్నిహిత మిత్రునికి దగ్గరవడానికి నీవు సిద్ధంగా ఉన్నావంటే దేశ రాజకీయాల్లో ఇది కొత్త పంథాకు సంకేతంగా కనిపిస్తోంది. బాగా బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలంటే సిద్ధాంతాలు పక్కనపెట్టి, కొత్త పోకడలకు తెరతీయవచ్చనే తెలివి రాహుల్‌కు వచ్చి నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్న కారణంగా ఎవరు దేశాన్ని పరిపాలిస్తారనే విషయం మళ్లీ చర్చకు వస్తోంది. లోక్‌సభ ఎన్నికలను నేను తరచు తొమ్మిది సెట్ల టెన్నిస్ మ్యాచ్‌తో పోల్చేవాడిని. ఎవరు ఐదు సెట్లు గెలుస్తారో వారే విజేత. భారత పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. వచ్చే ఎన్ని కల్లో ‘తొమ్మిది సెట్లు’గా చెప్పే రాష్ట్రాలు ఏవంటే– ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, కర్ణా టక, కేరళ. ఇవి పెద్దవి కావడంతో 9 రాష్ట్రాల జాబి తాలో చేర్చాను. అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో మార్పు అనేది సాధ్యమౌతుంది. అందుకే, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌ను చేర్చలేదు. ఈ 9 రాష్ట్రాల్లోని మొత్తం లోక్‌సభ సీట్లు 342. వీటిలోని ఐదు రాష్ట్రాల్లో గెలిచే సంకీర్ణ కూటమికి దగ్గరదగ్గర 200 వరకూ సీట్లు దక్కే అవకాశముంది. లేకున్నా 160కి పైగానే స్థానాలు తప్పక లభిస్తాయి. అందుకే 2014 వరకూ 272 సీట్ల గెలుపుకున్న ప్రాధాన్యం ఇక 160 సీట్ల కైవసం చేసుకోవడానికి లభిస్తుందని అనుకోవచ్చు. యూపీలో బీజేపీకి సగంపైగా సీట్లు గల్లంతే! మోదీ–అమిత్‌షా నాయకత్వంలోని బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడ టమే అత్యంత ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరప్ర దేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే బీజేపీకి ఘన విజయం దక్కదు. 2014లో గెలిచిన 73 సీట్లలో సగం కూడా గెలవడం కష్టం. అప్నాదళ్ వంటి చిన్న మిత్రపక్షాలు సైతం బీజేపీతో కలిసి ఉంటాయా? అంటే చెప్పడం కష్టం. అలాగే, కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాలో బీజేపీ బలం బాగా తగ్గుతుంది. ఈ నష్టాలను తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసు కోవాలని బీజేపీ అనుకుంటోంది. కాబట్టి, యూపీ తర్వాత అత్యధిక ఎంపీలను పంపే అంటే 48 లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్రలో బలం నిలబెట్టుకోవడమే బీజేపీ అతి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మహా రాష్ట్రలో శివసేన సాయం లేకుండా ఒంటరి పోరుతో విజయం సాధించడం గురించి అమిత్ షా తన పార్టీ శ్రేణులను సమీకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, శివసేన లేకుండా బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోలేదనే విషయం ఆయనకు తెలుసు. రాహుల్కీ ఈ వాస్తవం తెలుసు. 2019 లోక్ సభ ఎన్నికలు నేను పైన చెప్పినట్టు 9 సెట్ల టెన్నిస్ మ్యాచ్‌లా మారితే, మహారాష్ట్రలో బీజేపీ (ఎన్డీఏ) గెల వకుండా రాహుల్ సాధ్యమైనంత కృషిచే యాలి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివ సేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. శివసేన ఎన్డీఏ నుంచి బయటపడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశానికి కారణమిదే. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రసం గిస్తూ, ఇదే తరహాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ‘వికాస్ పురుష్’ అంటూ ఆయనపై ప్రశం సలు కురిపించారు. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిçస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సామరస్యానికి ప్రొటోకాల్ అడ్డు!
1962 భారత–చైనా యుద్ధం నాటి గందరగోళమే ఇంకా రాజ్య సరిహద్దులో కొనసాగుతోంది. రెండు దేశాల సైనిక దళాల మధ్య పనిచేయాల్సిన హాట్‌లైన్ ప్రొటోకాల్ సమస్యల్లో చిక్కుకుపోయింది. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదురైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్ వైపు నుంచి హాట్లైన్లో ఎవరు మాట్లాడాలి? భారత్ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్యకలాపాల (ఆపరేషన్స్) డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైనికాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్ సమస్య తలెత్తుతుంది. ఎవరైనా కొన్ని తప్పని సరి పొరపాట్లు చేయడం తప్పుకాదు. అయితే, రక్షణ రంగంలో ఉద్దేశపూర్వక నిష్క్రియాపరత్వం సరి కాదు. ఇక్కడ అవకాశం పోతే దాన్ని సమర్ధించుకో వడం కుదరదు. భారత సైనిక, రక్షణ వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకొచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు వదులుకుంటోంది. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లుగా వాయిదాపడుతున్న సంస్కర ణలు సైనిక రంగంలో అమలు చేయడానికి అవకాశం వచ్చింది. ఈ పని చేయకుండా గత ప్రభుత్వాలను నిందించి ప్రయోజనం లేదు. సైన్యానికి అనుకూల మనే అభిప్రాయం ఉన్న కారణంగా మోదీ సర్కారు చాలా చేస్తుందనే అంచనాలు వేశారు. ఏ ఇతర రంగంలో లేనంతగా రక్షణ రంగ సంస్కరణ విష యంలో కేంద్ర వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక వ్యవ స్థను విప్లవాత్మక మార్పులతో ఆధునికీకరించే అరు దైన అవకాశం లభించినా తన పాలనాకాలంలోని చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏవేవో కొన్ని చిన్నాచితకా చర్యలతో కాలం గడుపుతోంది. తన సైనిక కాల్బలానికి అవసరమైన మౌలిక రైఫిళ్లు, సైనిక దళాలకు ఓ మోస్తరు బూట్లు సమకూర్చడానికి నానా పాట్లు పడుతోంది. వైమానికి దళానికి ఆధునికీకరిం చిన జాగ్వార్ యుద్ధ విమానాలు ఇస్తున్నట్టు సగ ర్వంగా చెప్పుకుంటోంది. కాని మొదట ఈ రకం విమానాలను ప్రవేశపెట్టి 40 ఏళ్లు దాటాయి. సైన్యా నికి ఆయుధాలు, సామాగ్రి సరఫరా చేయడంలో వెనుకబాటు మంచిది కాదు. కానీ, రక్షణ రంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు ఆలస్యం చేస్తే జరిగే నష్టం చాలా ఎక్కువ. ఈ విషయంపైనే ఇండియాను చైనా సూటిగా ప్రశ్నించింది. ‘‘మా వైపున అత్యవసర సమ యంలో మాట్లాడడానికి హాట్‌లైన్‌ను ఎవరు నిర్వ హిస్తారో మాకు తెలుసు. భారత సరిహద్దులో తూర్పు నుంచి పశ్చిమ కొస వరకూ యుద్ధ రంగ కమాండర్ ఈ పని చేస్తారు. మరి మీ వైపును ఎవరు చూస్తారు?’’ అని చైనా వేసిన ప్రశ్న ఆందోళనకరం. భారత సరిహద్దులో చైనాకు ఒకే కమాండర్! భారత సరిహద్దులో మోహరించే చైనా సైనిక దళా లన్నింటికీ ఒకే కమాండర్ ఉన్నారు. చైనా బలగాలకు ఒక ఉన్నత సైనిక కమాండర్, ఒక ప్రధాన సైనిక కార్యాలయం ఉంటే, ఇందుకు విరుద్దమైన పరిస్థితి భారత్‌ది. చైనా సరిహద్దున ఉన్న అరుణాచల్, సిక్కిం– భూటాన్ ప్రాంతం తూర్పు ఆర్మీ కమాండర్ నియంత్రణలో ఉంటుంది. ఉత్తరాఖండ్(మధ్య) సెక్టర్ మధ్య ఆర్మీ కమాండర్ అదుపులో, హిమా చల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం పశ్చిమ ఆర్మీ కమాండర్ నియంత్రణలో ఉంటాయి. ఇకపోతే, కశ్మీర్ మొత్తం, లద్దాఖ్ చివరి వరకూ ఉత్తర ఆర్మీ కమాండర్ చేతిలో ఉన్నాయి. భారత వైమానికి దళం (ఐఏఎఫ్) కూడా తన తూర్పు, మధ్య, పశ్చిమ కమాండ్ల ద్వారా సరిహద్దులో తన విధులు నిర్వహి స్తోంది. అంటే, చైనా సరిహద్దులో మూడు నక్షత్రాల హోదా ఉన్న కనీసం ఎనిమిదిమంది భారత సైనిక కమాండర్లు ఒకే ఒక చైనా కమాండర్‌తో విధుల నిర్వహణలో పోటీపడుతుంటారన్న మాట. ఆధునిక సైన్యాన్ని నడిపించే విధానం ఇది కాదు. రెండు దేశాల సైనిక దళాల మధ్య పని చేయాల్సిన హాట్‌లైన్ ప్రొటోకాల్ సమస్యల్లో చిక్కుకుపోయింది. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహ ద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదు రైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్ వైపు నుంచి హాట్లైన్లో ఎవరు మాట్లాడాలి? భారత్ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్య కలాపాల (ఆపరేషన్స్) డైరెక్టర్ జనరల్(డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైని కాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్ సమస్య తలెత్తు తుంది. మన మొత్తం సైనిక(ఆర్మీ) దళాల డీజీఎంఓ చైనాకు చెందిన ‘కేవలం’ యుద్ధరంగ(థియేటర్) కమాండర్‌తో మాట్లాడడం కుదురుతుందా? అనే ప్రశ్న మన సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇది కేవలం ప్రొటోకాల్‌కు సంబంధించినదే అయితే హాస్యాస్పదం కాదా? ఆధునిక యుద్ధంలో వేగం, పోరు తీరు, శరవేగంతో దళాలు, ఆయుధాల తర లింపు, ఆయుధాల పనితీరు, సమన్వయంతో కూడిన యుద్ధ వ్యూహాలు అత్యంత కీలకమైనవి. మన మౌలిక సైనిక వ్యవస్థలను బ్రిటిష్‌వారు మనకు అప్పజెప్పి వెళ్లిన స్థాయిలోనే ఇప్పటికీ కొనసాగు తున్నాయి. బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన సైనిక కంటోన్మెంట్లే ఇంకా పనిచేస్తున్నాయి. ఇటీవల మాజీ నౌకాదళ అధిపతి అరుణ్ ప్రకాశ్‌తో మాట్లాడిన ప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన విషయం వెల్లడిం చారు. ‘‘డొక్లామ్ సరిహద్దులో చైనాతో పోరాటం మొదలై ఉంటే–ఐదు రకాల భారత సైనిక విభా గాలు(కమాండ్లు) చైనా ఆర్మీతో తలపడాల్సివచ్చేది. వివిధ భారత విభాగాల మధ్య సమన్వయం సమస్యే. అదే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒకే కమాండ్ కింద ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా భారత దళాలతో పోరాడేది,’’ అని ఆయన చక్కగా కీలక పోరు సమస్యను వివరించారు. స్వల్ప కాలంలో, కొద్ది ప్రదేశంలో జరిగే భీకరపోరులో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలం? 19 విభిన్న కమాండ్లుగా భారత సైన్యం! భారత సైనిక దళాలను ప్రస్తుతం 19 విభిన్న విభా గాలుగా(కమాండ్లు) విభజించిందీ అరుణ్‌ప్రకాశ్ వివరించారు. ఏ రెండు సైనిక కమాండ్లూ ఏక లక్ష్యంతో, ఒకే ప్రాంతంలో లేవని ఆయన చెప్పారు. ఇంతటి అధ్వాన స్థితిలో సైనిక వ్యవహారాలు నడు స్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే తూర్పు ఆర్మీ కమాండ్ కోల్‌కతాలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద గ్రూపులను అదుపులో పెట్టే బాధ్యత కూడా దీనిదే. ఈ ఆర్మీ కమాండ్‌తో సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన తూర్పు వైమానిక దళ కమాండ్ విచిత్రంగా యుద్ధ విమానాలు దిగే ఎయిర్‌స్ట్రిప్ కూడా లేని ప్రాంతంలో ఉంది. సుందరమైన పర్వతా లకు నిలయమైన ఎగువ షిల్లాంగ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటే ఎంత ఇబ్బందికరంగా ఉందంటే–కోల్‌కతా నుంచి వేగంగా విమానంలో షిల్లాంగ్ వెళ్లాలంటే బంగ్లాదేశ్ గగనతలంపై పయ నించాల్సి ఉంటుంది. ఆర్మీ కమాండ్ ఉన్న కోల్‌కతా లోనే దీన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని బ్రిటిష్ వారు ప్రశ్నిస్తున్నారు. ఇక తూర్పు నౌకాదళ కమాండ్ విషయానికి వస్తే ఇది దక్షిణాన విశాఖపట్నంలో ఉంది. తూర్పు రంగంలో మాత్రమే ఇంతటి గందర గోళ పరిస్థితులున్నాయంటే పొరపడినట్టే. పశ్చిమ కమాండ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పశ్చిమ ఆర్మీ కమాండ్ చండీగఢ్ నగరం శివార్లలోని చండీమంది ర్లో ఉంది. కాగా, పశ్చిమ వైమానికి దళ కమాండ్ ఢిల్లీ నుంచి పనిచేస్తోంది. భారత వైమానిక దళా ధిపతి ప్రధాన కార్యాలయం, అతి పెద్ద కమాండ్ ఒకే నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ రెండింటికి మధ్య దూరం కేవలం ఐదు మైళ్లే. ఇలా దేశంలోని సైనిక కమాండ్ల జాబితాలు, వివరాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అన్ని కమాండ్లలోనూ ఒకే రకమైన అవ్వవస్థ రాజ్యమేలు తోంది. దక్షిణ ఆర్మీ కమాండ్ పుణె నగరంలో ఉండగా, పాకిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్– రాజస్థాన్ ఏడారి ప్రాంతం రక్షణ బాధ్యత దీనికి అప్పగించారు. కాని, దీనికి తోడ్పడాల్సిన నైరుతి వైమానికి దళ కమాండ్ గాంధీనగర్ నుంచి పని చేస్తోంది. ఇంకా, వైమానిక దళ దక్షిణ కమాండ్ తిరు వనంతపురంలో ఉంది. దీనికి మొత్తం ద్వీపకల్ప ప్రాంత రక్షణ బాధ్యత కల్పించారు. ఆర్మీ నైరుతి కమాండ్ జైపూర్‌లో ఉండగా, దానికి సాయమం దించే వాయుసేన ప్రధానకార్యాలయాలు ఢిల్లీలో (పశ్చిమ), గాంధీనగర్‌లో ఏర్పాటై ఉన్నాయి. అల హాబాద్(మధ్య)లోని వైమానిక దళ కమాండ్ కూడా దీనితో కొన్నిసార్లు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, ఏ రెండు కమాండ్లూ ఒక చోట నుంచి, ఒకే లక్ష్యంతో పని చేయడం లేదని స్పష్టమౌతుంది. ఒక్క అండమాన్ దీవుల్లో మాత్రమే త్రివిధ బలగాల కమాండ్లు ఒకేచోట కేంద్రీకృతమై పనిచేస్తున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కొత్త సమీకృత కమాండ్లు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయని చెప్పవచ్చు. చివరి సంవత్సరంలో హడావుడి ఇంతటి గందరగోళ పరిస్థితుల మధ్య ఇప్పటికే ఎక్కువగా విస్తరించి ఉన్న ఆర్మీ తూర్పు కమాండ్ ఆజమాయిషీలో కొత్తగా మౌంటెన్ స్ట్రయిక్ కోర్ అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పెట్టారు. పైన వివరించిన ఆందోళనకరమైన విషయాలు ‘ద ప్రింట్’ వెబ్సైట్లో వెల్లడవడంతో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త దళం ఏర్పాటు విషయాన్ని ఆర్మీ నిర్ణయానికే వదిలేశామని ఆమె చెప్పారు. ఆర్మీ చీఫ్ అనవసరంగా సైనిక కమాం డ్లను విస్తరించే కన్నా ఉన్న వాటిని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంతో తెగువ, తెలివితేటలు ప్రద ర్శిస్తున్నారని భావిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏమంటే, సైన్యానికి సంబంధించిన మౌలిక సంస్థా గత విషయాలపై మంత్రి స్పందన. సంయుక్త యుద్ధ రంగ కమాండ్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం అనుకూలమని ఆమె చెప్పారు. ఈ విషయం మనం గతంలో ఎన్ని సార్లు విన్నాం? ఈ విషయంలో ముందుకు సాగడానికి ఇదివరకటి ప్రభు త్వాలకు రాజకీయ బలం లేదు. మరి మోదీ ప్రభు త్వం ఈ నాలుగేళ్లలో ఈ పనిచేయకుండా ఎవరు అడ్డుకున్నారు? మొదటి నాలుగు సంవత్సరాలూ కళ్లు మూసుకున్న మోదీ ప్రభుత్వం చివరి దశలో హడావుడి చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యస్థలో పరిపా లన అంటే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ కాదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
న్యాయవ్యవస్థకు రక్షణ ఏది?
మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం. అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్థించదగ్గదేనా? వివాహాల వైఫల్యమే ఇతివృత్తంగా బాసు భట్టాచార్య మూడు వరస సిని మాలు నిర్మించారు. వాటిలో 1971 నాటి ‘అనుభవ్’ ఒకటి. ఈ చిత్రంలో పని తప్ప మరొక ధ్యాస లేని ఒక పత్రికా సంపాదకుడి పాత్రలో సంజీవ్‌కుమార్, ఎప్పుడూ ఏకాంతంగా గడిపే అతడి భార్యగా తనూజ నటించారు. రెండు న్నర గంటలు పాటు సాగే చిత్రంలో చివర దినేష్ ఠాకూర్ (మరొక పాత్రలో కనిపించిన నటుడు) ముక్కోణపు ఉత్కంఠను రేపుతాడు. అప్పుడే ఆ జంట మధ్య ఈ సంభాషణ చోటు చేసుకుంటుంది. ‘ఎవరెవరివో సమస్యలు తీసు కుని వాటి మీద మీరు నిత్యం ఒక సంపాదకీయం రాస్తారు. మీరు మన కోసం కూడా ఒక సంపాదకీయం రాయండి!’ అంటూ తనూజ (21వ శతా బ్దంలో ప్రేక్షకులకు బాగా దగ్గరయిన కాజోల్ తల్లి) సంజీవ్‌కుమార్‌ను అడుగుతుంది. ఇలాంటి దృశ్యంలో ప్రతిభామూర్తులైన మీ సుప్రీం కోర్టు న్యాయమూర్తు లను ఒకసారి ఊహించుకోండి. ఈవారంలో వారు అరుదైన స్పష్టతతో, ఎలాంటి శబ్దాలంకారాలు లేని రీతిలో ఒక తీర్పు ఇచ్చారు. నాగ్‌పూర్‌లో సంభ వించిన జస్టిస్ బీహెచ్ లోయా మరణం వివాదంపై స్వతంత్ర దర్యాప్తు జరి పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ డీవై చంద్రచూడ్ పిటిషనర్లను తీవ్ర స్థాయిలో హెచ్చరిం చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదిని కూడా వదిలిపెట్టలేదు. చిన్న ఆధారం కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారని తీర్పులో పేర్కొన్నారు. ఆ విధంగా మొత్తం న్యాయ వ్యవస్థ మౌలికతనే తక్కువ చేసి చూపుతున్నారని కూడా చెప్పారు. పిటిషన్లను తిరస్కరించడంతో పాటు, న్యాయ వ్యవస్థను న్యాయ వాదుల నుంచి, ఉద్యమకారుల నుంచి, మీడియా నుంచి రక్షించుకోవలసి వస్తున్నదంటూ ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఇది ఎలా ఉందంటే, ప్రతివారు న్యాయమూర్తుల మీద పడి వేధిస్తున్నట్టు, ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవడా నికి వారు పోరాడుతున్నట్టు ఉంది. కాబట్టి ‘అనుభవ్’ సినిమాలో తనూజ అడిగిన ప్రశ్ననే న్యాయమూర్తులను అడగవచ్చునా? ‘ న్యాయ వ్యవస్థను ఇత రుల నుంచి రక్షించడానికి మీరు ఎప్పుడూ తీర్పులు వెలువరిస్తూ ఉంటారు. అలాగే న్యాయమూర్తుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవడం ఎలా అనే అంశం మీద కూడా మీరు ఒక తీర్పును రాయగలరా?’ ఈ వాదనను తయారు చేయడంలో నేను అవసరానికి మించిన జాగ్రత్త చూపిస్తున్నానేమో! అలా ఉండడమే మంచిది. ఎందుకంటే జస్టిస్ లోయా కేసులో పిటిషనర్ల మీద, న్యాయవాదుల మీద నేర ధిక్కారం ఆరోపించ కుండా తాము విశాల హృదయంతో వ్యవహరించామని న్యాయమూర్తులు చెప్పారు. అంతటి ఔదార్యం ఒక మామూలు సంపాదకుడి విషయంలో చూపించకపోవచ్చు. అయినప్పటికి వాస్తవాలు చెప్పాలి. అవి చర్చకు రావాలి. అయితే తీర్పులోని మంచి విషయాలను చర్చించడానికి ఇది సమ యం కాదు. ఇందులో మంచి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు వెలువరించే చాలా ఆదేశాల వలె కాకుండా ఇందులో క్లుప్తత కూడా చక్కగా ఉంది. వేర్వేరు శిబిరాలుగా విడిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మీరు వివరించదలిచినది ఏదైనా అది మీ రాజకీయ పంథా, సైద్ధాంతికతల పునాది ఆధారంగానే ఉంటుంది. జర్నలిస్ట్ బర్ఖా దత్ మీడియా వారి సంకట స్థితిని చాలా కటువుగా వర్ణించారు. మీడియాను రెండు ధ్రువాలుగా– ఒకరు చెంచాలు (అస్మదీ యులు), మరొకరు మోర్చాలు (ఉద్యమకారుల బృందాలు) అని పేర్కొ న్నారు. ఇలా మాట్లాడడం ప్రమాదకరం. ఎందుకంటే తరువాత మీరు రెండు ధ్రువాలని నిందించాలి. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థ కూడా ఇలా ధ్రువా లుగా చీలిపోయిన సూచనలు కనిపిస్తున్న తరుణంలో అది మరింత ఇబ్బంది పెట్టే విషయం. న్యాయ వ్యవస్థకు అదే నిజమైన ముప్పు. తన నుంచి తనకు ఉన్న ముప్పు. నిజానికి దాని గురించే న్యాయమూర్తులు ఆగ్రహం ప్రకటిం చాలి. ఆ కారణంగానే న్యాయ వ్యవస్థ తనను తాను న్యాయమూర్తుల నుంచి రక్షించుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ వ్యక్తిగత ప్రతినాయకులు ఎవరూ లేరు. బయటి నుంచి వచ్చినదని భావించిన వైరస్‌ను వదిలించుకోవాలనుకు న్నప్పుడు వ్యవస్థ దానికదే స్వీయ రక్షణలో పడిపోతోంది. శరీరం తనని తాను తినడం ఎప్పుడు మొదలు పెడుతుందో మీకు తెలుసా? ఈ పిల్ మీద తీర్పులో మీరు అనివార్యంగా అంగీకరించ వలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.మొదటి అంశం– ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్విని యోగమవుతున్నాయి. రాజకీయ, వ్యక్తిగత, సైద్ధాంతిక పోరాటాలను కోర్టు లకు తీసుకువస్తూ ప్రజలు పిల్ వ్యవహారాన్ని ఒక వృత్తిలా మార్చేశారు. కోర్టుల సమయాన్ని వృధా చేస్తూ జాప్యానికి కారకులవుతున్నారు. రెండో అంశం– న్యాయమూర్తులు అబద్ధాలు ఆడరాదు. కనీసం వారిలో నలుగురు కలుసుకోనప్పుడైనా అబద్ధం ఆడరాదు. మూడో అంశం– మొత్తం న్యాయ వ్యవస్థను ఒకే వ్యక్తి అదుపు చేస్తాడని చెప్పడం అర్థరహితం. అది అసంభవం. ఇప్పుడు కొన్ని వాస్తవాల గురించి పరిశీలిద్దాం. జస్టిస్ లోయాకు సంబం ధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు ఉదయమే పత్రికలు బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు గురించి ప్రచురిం చాయి. మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వినియోగిస్తున్న నీటి మీద ఆంక్షలు విధించాలంటూ ఇంతకు ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. క్రీడా మైదానాన్ని తడపకుండా రైతు రక్షణ కోసం మిగిల్చిన ఆ నీటి విలువ సంగతి పక్కన పెడదాం. అయితే ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులు ఉండగా క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పు చెప్పడానికి సమయం కేటాయించడం నిజంగా సమర్ధించదగ్గదేనా? అయితే న్యాయమూర్తుల వివేకం గురించి ప్రశ్ని స్తున్నప్పటికీ కూడా వారి చర్యలను శంకించడం మాత్రం తగదు. ప్రచారం కోరుకునే వ్యక్తులకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒక ఆయుధంగా మారిపో యిందని లోయా కేసు తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తులు కూడా తమని తాము అద్దంలో చూసుకుంటూ తాము అలాంటి ఆకర్షణకు లోనయ్యే వాళ్లం కాదని చెప్పుకోగలరా! ఇలాంటి కొన్ని ఉదాహరణలను సేకరించ డంలో నాకు సహకరించిన నా సహ జర్నలిస్ట్ మనీష్ చిబ్బర్ ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థను ఆసక్తిగా, లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. ఆ ఉదాహరణలలో భారత క్రికెట్‌ను నిర్వహించమని దాదాపు సంవత్సరం క్రితం సుప్రీంకోర్టుకు అప్పగించిన బీసీసీఐ ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇటీవలనే భారత ప్రధాన న్యాయమూర్తి మరొక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కూడా అనుమతించారు. ఆయనే ఇప్పుడు క్రికెట్ బెంచ్‌కు (ఇలాంటి రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నారా?) ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. క్రీడలలో బెట్టింగ్‌ను, జూదాన్ని చట్ట బద్ధం చేయాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆయనే అనుమతించారు. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక ముందు ఒక ఆదేశం జారీ (నవంబర్ 30, 2016) చేశారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను అనివార్యం చేస్తూ ఇచ్చిన ఆదేశమది. తరువాత దానిని రద్దు చేశారు. ఈ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా పత్రి కలలో పతాక శీర్షికల స్థానం పొందాయి. పిటిషన్‌దారులు ఎవరో ఎవరికీ గుర్తు లేదు. కాబట్టి పత్రికల పతాక శీర్షికలకు ఎక్కాలనుకుంటున్నారంటూ పిటిషనర్లను ఎందుకు విమర్శించడం? లోయా తీర్పు వచ్చిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చిన 43 వ్యాజ్యాలలో 12 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే. ఇంకొన్ని: బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం, సాంటా–బాంటా జోకుల నిషేధం, అశ్లీల చిత్రాల వీక్షణను నేరంగా ప్రకటించడం (2013 నుంచి కోర్టుల సమయాన్ని తింటున్నది), పాఠ శాలల్లో యోగాభ్యాసం తప్పనిసరి చేయడం–ఇంకొన్ని. ఇందులో కొన్నింటిని కొట్టివేశారు. ఇంకా ఎన్నో కీలకమైన కేసులు ఉండగా వీటిని ఎందుకు అను మతించాలి? వాస్తవం ఏమిటంటే, గొప్ప సదుద్దేశంతో 1980లో వచ్చిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని ఎందరో న్యాయమూర్తులు విస్తరించారు. ఇది ప్రజల అంతిమ ఆయుధంగా భావించారు. ఇంకొక విషయం–న్యాయమూర్తులు అబద్ధం ఆడరాదు. కనీసం నలు గురు సీనియర్ జిల్లా జడ్జీలు కలిసినప్పుడైనా అబద్ధం ఆడరాదు. ఈ సూత్రం సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు వర్తించదా? వీరు కోర్టు నిర్వహణకు సంబంధించిన కొన్ని దోషాలను గురించి కొన్ని నెలల క్రితం మాట్లాడారు. మనం నలుగురు మహారాష్ట్ర న్యాయమూర్తుల మాటను పరిగణిస్తున్నప్పుడు, వారి మాటలను ఉద్దేశపూర్వకమైనవిగా తోసిపుచ్చ వచ్చా, వారి ఆందోళనలను దారితప్పినవిగా కొట్టిపడేయవచ్చా? జిల్లా జడ్జీలు అబద్దమాడుతున్నారని అగ్నికి ఆజ్యం పోసేటంత మూర్ఖుడిని కాను. పైగా సుప్రీంకోర్టు జడ్జీలు అబద్దాల కోరులు అని నమ్మేందుకు నేను వెర్రి వాడినై ఉండాలి. వారు సంధించిన ప్రశ్నలకు స్పందించాలి. చర్చించాలి, అంతర్దృష్టితో చూడాల్సివుంది. న్యాయవ్యవస్ధపై కనికరం లేని ఈ సాగదీత, అంటువ్యాధిగా కొట్టిపడే సిన అదే ప్రజాప్రయోజన వ్యాజ్యాల గుండా పతాక శీర్షికలపై దృష్టి నిలిపే న్యాయవ్యవస్థ ధోరణి, తమ సొంత సంస్థను క్రమంలో ఉంచడంలో వారి అసమర్థత అనేవే బయటి వారికంటే ఎక్కువగా న్యాయవ్యవస్థను బలహీనప ర్చాయి. న్యాయమూర్తులు చీలిపోయినట్లు కనిపిస్తే, కక్షిదారులు, న్యాయవా దులు కలిసి ఫోరం షాపింగ్‌కు వెళతారని మీరు ఊహించవచ్చు. తీర్పులోని మూడో ముఖ్యమైన అంశంలోకి మనల్ని తీసుకెళుతోంది ఏదంటే, ఒక వ్యక్తిమాత్రుడు మొత్తం న్యాయవ్యవస్థను నియంత్రించగలడని చెప్పడం అర్ధరహితమనే చెప్పాలి. మీరు దీనితో విభేదించలేరు. వాస్తవానికి, అలాంటి పరిస్థితిని మనం గతంలో చూసి ఉన్నాం. కాని అలా చేసింది పురు షుడు కాదు మహిళ అయిన ఇందిరాగాంధీ. వెన్నెముక కలిగిన ఒకే ఒక్క సాహసికుడైన న్యాయమూర్తి హెచ్ ఆర్ ఖన్నా నేటి ఎర్డోగన్నేతత్వంలోని టర్కీ దేశంలా మారకుండా మనదేశాన్ని నాడు కాపాడారు. 2018 కాలపు భారతదేశానికి అలాంటి ఒక న్యాయమూర్తి కాదు, పలువురు న్యాయమూ ర్తులు కావలసి ఉంది. ఎందుకంటే న్యాయవ్యవస్థకు పెనుప్రమాదం ఇప్పుడు బయటినుంచి కాదు. లోపలి నుంచి పొంచి ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
శిలా విగ్రహాలు కూలితేనేం?
మనం ఒక బూటకపు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం. అదే నిజమైన ఏకైక జాతీయ సిద్ధాంతం. ఒక పార్టీ వామపక్ష కంచుకోటను బద్దలు చేసినందుకు సంబరాలు జరుపుకుంటుంది. ఒక ఉద్రిక్త క్షణంలో ఆ పార్టీ కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. వారు ద్వేషిస్తున్న నియంత ఇప్పటికీ విజయం సాధిస్తూ ఉన్నాడన్నదే వారికి తెలియని విషయం. లెనిన్ 1924లో చనిపోయాడు. ఆయన సొంత దేశం తన తాత్విక చింతనను 1990లో వదిలిపెట్టేసింది. కానీ భారత్‌లో అది మార్పు లేకుండా కొనసాగుతోంది. భారత వామపక్షంతో నా తొలి అవగాహన క్రికెట్ ఆటలో మొదటి బాల్కే డకౌట్ కావడంతో సరిసమానమైనదే. 1975లో నేను జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగిందిది. అప్పుడు మాతో పాటు ఒకే ఒక కామ్రేడ్, నిజానికి శాంతియుతంగా ఉండే నక్సలైట్ ఉండేవాడు. ఆయనతో పందెం వేశాను. ఈఎంఎస్ నంబూద్రిపాద్ జీవించి ఉన్నారా, లేదా అన్నదే ఆ పందెం. ఆ పందెంలో నేను పది రూపాయలు పోగొట్టుకున్నాను. విద్యార్థి వసతిగృహం అద్దె, మెస్ బిల్లు కట్టడానికి ఇంటి దగ్గర నుంచి వచ్చే 200 రూపాయల కోసం ఎదురు చూసే రోజులవి. కాబట్టి పది రూపాయలంటే పెద్ద మొత్తమే. తరువాత చాలాకాలానికి కేరళ మీద వార్తా కథనం రాస్తున్నప్పుడు జరిగింది. వామపక్ష ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం (అప్పుడు అక్కడే ఉన్న దాదా జర్నలిస్ట్ రమేశ్ మేనన్‌తో కలసి) రాసినప్పుడు సాక్షాత్తు ఈఎంఎస్‌ను కలుసుకున్నాను. నా పందెం విషయం ప్రస్తావించాను. ఆయన తన చేయి పైకి ఎత్తి, మణికట్టు దగ్గర చూపిస్తూ, ‘మీరు నా నాడిని ఎందుకు పరీక్షంచకూడదు’ అన్నారు, నిర్వికారంగా. ఇంకా, ‘మీరు చెప్పిందే నిజమైతే, మీ డబ్బు మీకు వెనక్కి రావలసిందే’అన్నారు. అంతా నవ్వుకున్నాం. జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా నేను వామపక్ష రాజకీయాల గురించి తెలియకుండా ఉండిపోయానంటే అందుకు పంజాబ్ పల్లెటూళ్లలో ఉండే చిన్న చిన్న పాఠశాలల్లో, తరువాత హరియాణా వంటి చోట చదవడం కొంత కారణం. అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు ఉండేవి కావు. ఒక ఉపాధ్యాయుడు కామ్రేడ్ వంటి పదాలతో పిలిపించుకోవాలని ఆసక్తిగా ఉన్నప్పటికీ అసలు ఎలాంటి కార్మిక సంఘాలు, అందులోను వామపక్ష కార్మిక సంఘాలు లేనేలేవు. ఇక తూర్పున వచ్చిన నక్సల్ ఉద్యమం మాకు చేరేటప్పటికి పురాతనమైపోయింది. నేను భారత వామపక్ష రాజకీయాల గురించి తెలుసుకున్నది జర్నలిస్టుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాతనే. ఆ క్రమంలో నేను వామపక్ష విమర్శకుడిగానే ఎదిగాను. ముఖ్యంగా వారి ఆర్థిక సిద్ధాంతం, రాజకీయ–సామాజిక కపటత్వాన్ని నేను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నాను. నియంతృత్వం నుంచి అధికారాన్ని తెచ్చుకునే ఒక సిద్ధాంతం ‘ప్రజాస్వామిక’ అనే పదం పక్కన ఎలా ఇముడుతుంది? అలాగే భద్రలోక్ అని పిలుచుకునే అగ్రకులాల నుంచి వచ్చిన వ్యక్తులు(విదేశాలలో చదువుకున్నవారు, ప్రత్యేక హక్కులు ఉన్న భారతీయ వ్యవస్థల నుంచి వచ్చిన వారు) సమానత్వం గురించీ, బలహీన వర్గాల గురించీ ఏకధాటిగా ఎలా మాట్లాడతారు? ఇన్ని దశాబ్దాలలోను వామపక్ష రాజకీయాలతో నేను ఏకీభవించిన పరిస్థితి ఎక్కడా లేదు. ఈ మేధోపరమైన, తాత్వికమైన అహంకారం గురించి నేను బాధపడ్డాను కూడా. నీవు మాతో రాకపోతే పెట్టుబడుదారుల తాబేదారువి అయినట్టే. బూర్జువా అనే పదం కాలక్రమంలో వెలుగులోకి వచ్చి, తరువాత అదే నియో లిబరల్గా రూపాంతరం చెందింది. ఇది కాకపోతే ఇంకొకటి. 1989–1993 మధ్య పంజాబ్‌ను తుది దశ ఉగ్రవాదం కకావికలు చేసింది. సరిహద్దు జిల్లాలలో ఉగ్రవాదులు ‘విముక్తం’చేశామని చెప్పిన గ్రామాల మీద తిరిగి పట్టు సాధించిన ఏకైక రాజకీయ శక్తులు, అందుకు త్యాగాలు చేసిన పార్టీలు, ఇప్పటికీ కార్యకర్తలు ఉన్న పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే. పోలీసులు వారికి ఆయుదాలు అందించారు. ఒక మహిళా కామ్రేడ్ ఎల్ఎమ్జీ (లైట్ మెషీన్ గన్)ని తన ఇంటి మీద ఏర్పాటు చేసి, నిరంతరం రక్షించుకుంటూ ఉన్న ఉదంతం గురించి మేం నివేదించాం కూడా. ఆ ఒక్క రాష్ట్రంలో ఆ దశను మినహాయిస్తే, వామపక్షం గురించి చప్పట్లు కొట్టేందుకు ఏదీ నాకు కనిపించలేదు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం అనూహ్యంగా ఓడిపోయిన తరువాత సీపీఐ నాయకుడు ఏబీ బర్దన్ ‘భాద్మే జాయే డిజిన్వెస్ట్‌మెంట్’ అంటూ ఇచ్చిన ప్రకటనకు నేను మండిపడ్డాను కూడా. అణు ఒప్పందం గురించి జరిగిన ఓటింగ్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ విజయం సాధించినప్పుడు, వామపక్షాలు ఏహ్యభావంతో చూసే మాయవతి, బీజేపీ సహా కుల,మత శక్తులని పిలిచే వారితో చేతులు కలిపినప్పుడు కూడా నేను అభినందించాను. ఆ తరువాత అంతిమంగా మమతా బెనర్జీ వారిని పశ్చిమ బెంగాల్లో ఓడించినప్పుడు అభినందించాను. దాంతోనే భారత వామపక్ష రాజకీయాల కథ ముగిసిందని స్పష్టమైంది. తూర్పు, మధ్య భారతంలో ఉగ్రవాద వామపక్షం కూడా అనివార్యంగా అదే బాటలో ఉంది. కాబట్టి లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్ఘటన పట్ల నేను నిరసన ప్రకటించనని మీలో చాలామంది ఊహించవచ్చు. కానీ నేను నిరసన ప్రకటించాను. కానీ దానికి అనివార్యమైన వేరే కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఎవరైనా తమకు నచ్చిన దేవుళ్లను ఎంచుకుని పూజించుకునే హక్కు కలిగి ఉన్నారు. ఇతరులకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేసే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. 1980 దశకం చివరి అంకంలో ప్రపంచ కమ్యూనిజంలో మార్పు ఆరంభమైంది. సోవియెట్ యూనియన్ కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆఫ్ఘానిస్తాన్‌తో చేసిన యుద్ధంలో ఓడిపోయింది. గోర్బచెవ్ పెరిస్త్రోయికా, గ్లాస్నోస్త్లను ప్రవేశపెట్టారు. డెంగ్ సరళీ కరణను అనుమతిస్తూ, ఎలకలని పట్టుకోగలినదైతే పిల్లి తెల్లగా ఉంటే ఏమి, నల్లగా ఉంటే ఏమి అంటూ చైనా ప్రజలకు హితబోధ చేశారు. ‘భారత్‌లో మారని వామపక్షం’ అన్న అంశం మీద పని చేయడానికి ఆ సమయంలో నేను కలకత్తాలో ఉన్నాను. అప్పుడు సరోజ్ ముఖర్జీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి. పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల లెనిన్, స్టాలిన్, మార్క్స్‌ల పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి. ‘గోర్బచెవ్, డెంగ్ మారుతున్నారు. మీరు ఎందుకు మారడం లేదు సార్?’ అని అడిగాను. ‘ఎందుకంటే, నా కమ్యూనిజం డెంగ్, గోర్బచెవ్‌ల కమ్యూనిజం కంటే స్వచ్ఛమైనది’ అన్నారాయన అచంచల విశ్వాసంతో. తరువాత సరిగ్గా రెండేళ్లకి రిపబ్లిక్లు విడిపోయాక సోవియెట్ యూనియన్ను చూసేందుకు నేను మాస్కో వెళ్లాను. బుఖారెస్ట్‌లో ట్యాంకులు ఇంకా రోడ్ల మీదే ఉన్నాయి. వందలాదిమంది ప్రజలు సీసెస్క్యూను చంపిన చోటికి తండోపతండాలుగా వచ్చారు– శపించడానికి, ఉమ్మడానికి. రుమేనియా కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాలకు వెళ్లిన భారత వామపక్ష బృందం ఒకటి అంతకు కొన్ని వారాల ముందే మన దేశం చేరుకుంది. ఈ బృందంలోనే ఎవరో ది పయనీర్ పత్రికకు ఒక వ్యాసం రాశారు. సీసెస్క్యూ అరాచకాలకు సంబంధించి వస్తున్న వార్తలు, ఆయన ప్రభుత్వం పతనం కావడం గురించిన వార్తలు– ఇవన్నీ పాశ్చాత్య దేశాల దుష్ప్రచారమేనని రాశారు. అందుకు చూపించిన ఉదా‘‘ నియంత తన ఉపన్యాసం ముగించిన వెంటనే మొదలైన ప్రశంసల వర్షం కొన్ని గంటల దాకా ఆగలేదని పేర్కొన్నారు. ఇది జరిగిన సరిగ్గా ఎనిమిది మాసాల తరువాత మళ్లీ నేను మాస్కో వెళ్లాను. ఇవాళ ఇక్కడ ఎలా జరిగిందో, అలాగే అక్కడ జరిగిన కమ్యూనిస్టు నేతల విగ్రహాలను ఎలా పెళ్లగించడం జరిగిందో చూసేందుకు వెళ్లాను. ఆ విగ్రహాలను కూల్చివేసినందుకు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న కొందరు తప్ప చాలా తక్కువ మంది విచారం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం. ఒక సిద్ధాంతం కాలగర్భంలో కలసిపోతే, దానితో పాటు ఆ సిద్ధాంతం పునాదిగా వేళ్లూనిన నియంతృత్వాలు, వాటిని సాగించిన నియంతలు కూడా దాని వెంట కాలగర్భంలోకి నిష్క్రమించవలసిందే. తన 34 సంవత్సరాల పాలనలో రాజకీయంగా వామపక్ష కూటమి బెంగాల్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. అది ప్రజాస్వామ్యం గురించి, ఉదారవాదం గురించి ప్రబోధించింది. కానీ దుండగులతో, బలవంతపు వసూళ్లు చేసేవారితో కూడిన ఒక సైన్యాన్ని తయారు చేసి పెట్టింది. ఈ సైన్యం ఏ ఒక్క ప్రతిపక్షాన్ని బతకనివ్వలేదు. కేరళకు ఒక సోషలిస్టు గుణం ఉంది. అక్కడ కాంగ్రెస్, వామపక్షం ఒకదాని తరువాత ఒకటి అధికారం పంచుకుం టాయి. మిగిలిన దేశమంతటా పంజాబ్ మొదలు మహారాష్ట్ర వరకు; బిహార్ నుంచి ఆఖరికి అస్సాం వరకు కూడా వామపక్షాలు అంతర్ధానమయ్యాయి. అయితే ఇతరుల పుణ్యమా అని 2004లో 59 స్థానాలు పొందిన వామపక్షాలకు జాతీయ స్థాయి అధికారాన్ని రుచి చూసే అవకాశం దక్కింది. ఆ తరువాతే వారి రాజకీయ అధికారం పతనం కావడం ఆరంభమైంది. వామపక్షం అడుగంటిపోతోంది. ఆ పార్టీ పెద్దల విగ్రహాలు కూలుతున్నాయి. కానీ వాళ్ల సిద్ధాంతం ఇంకా ఏలుతుంది. అది సవాలు చేయలేనిది. నేను ప్రయాణించిన ట్యాక్సీ డ్రైవర్ చెప్పిన ప్రకారం పత్రికా విలేకరులు వార్తా కథనాల కోసం హేళన చేస్తూ ఉంటారు. వాక్లవ్ హావెల్ వెల్వెట్ రివల్యూషన్ కారణంగా ప్రేగ్ నగరంలో కమ్యూనిజం కకావికలైంది. అక్కడ మీరు ప్రయాణించే కారు డ్రైవర్ ఒక అణు ప్రయోగశాలలో ఉద్యోగం పోగొట్టుకున్న కంప్యూటర్ ఇంజనీర్ అయి ఉండవచ్చు. మేం ప్రయాణించిన కారు డ్రైవర్ అలాంటి వాడే. మా సంభాషణ అనివార్యంగా కమ్యూనిజం వైఫల్యాలు, తీవ్ర చర్యల మీదకు మళ్లింది. భారతదేశంలో సోషలిజం ఇప్పటికీ ఎందుకు అంత ప్రాచుర్యం కోల్పోకుండా ఉంది వంటి ప్రశ్న నుంచి చాలా ప్రశ్నలే అడిగాడు. అలాగే ముఖ్యమైన రాష్ట్రాలలో తరుచూ ఎందుకు ఎన్నికవుతారని కూడా అతడు ప్రశ్నించాడు. దానికి అతడే సమాధానం కూడా చెప్పాడు. మీ సోషలిజం మా సోషలిజం కంటే భిన్నమైనదని అన్నాడు. మా సోషలిస్టులు మా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛలను మా నుంచి దూరంగా తీసుకుపోయారు. కానీ మీ స్వేచ్ఛలు మీ దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఎమర్జెన్సీ సమయంలో వాటిని ప్రభుత్వం లాక్కున్నా మళ్లీ మీరు సాధించుకున్నారని కూడా వ్యాఖ్యానించాడు. అతడు చెప్పింది నిజమే. అయితే మీరు ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఎన్నడూ రుచిచూడలేదు కాబట్టి సోషలిజం మిమ్మల్ని నష్టపరిచింది ఏమిటో మీరు అర్థం చేసుకోలేరు. అతడు చెప్పింది నిజం. మనం ఇప్పుడు ఒక బూటకపు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం. అదే నిజమైన ఏకైక జాతీయ సిద్ధాంతం. ఒక పార్టీ వామపక్ష కంచుకోటను బద్దలు చేసినందుకు సంబరాలు జరుపుకుంటుంది. ఒక ఉద్రిక్త క్షణంలో ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. వారు ద్వేషిస్తున్న నియంత ఇప్పటికీ విజయం సాధిస్తూ ఉన్నాడన్నదే వారికి తెలియని విషయం. లెనిన్ 1924లో చనిపోయాడు. ఆయన సొంత దేశం తన తాత్విక చింతనను 1990లో వదిలిపెట్టేసింది. కానీ భారత్‌లో అది ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగుతోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ ధోరణికి పేరేమిటి?
ఆ పార్టీ వాళ్లు ఇలాంటి హింసను చట్టబద్ధం చేస్తే ఆ స్థాయి అధికారుల మీద దాడికి సంబంధించి దేశం నలుమూలలా ఉన్న కొరకరాని కొయ్యల వంటి రాజకీయనాయకులకు వేరే విధమైన సంకేతాలు వెళతాయి. నిజాయితీ కల అధికారి ఒక ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి ఆదేశాలను తప్పుడు ఆదేశాలుగా భావించి తిరస్కరించినప్పుడు దానికి పరిష్కారం ఊహించండి. అలాంటి అధికారిని మీ ఇంట్లో జరిగే భేటీలోనో లేక అతడి కార్యాలయంలోనో చితకబాదడమే పరిష్కారమా? ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుండెలు తీసిన భయానక వీధి రౌడీలతో రూపొం దిందన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కానీ ఆప్‌ను గట్టిగా వ్యతిరేకించేవారితో సహా చాలామంది అంగీకరించే మరొక విషయం మాత్రం ఉంది. నరేంద్ర మోదీ ప్రభ వెలిగిపోతున్న కాలంలో, అంటే 2014–15 సంవత్సరం శీతాకాలంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 70 స్థానాలకు గాను 67 చోట్ల గెలిచింది. అలా అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీకి అది ఇబ్బందికరంగా పరిణిమించింది. కేంద్రం ఆ పార్టీ ప్రభుత్వంతో ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభించింది కూడా. ఆఖరికి పూర్తి రాష్ట్ర హోదా లేనప్పటికి, ఉన్న ఆ తక్కువ అధికారాలను కూడా చలాయించకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి, మృదుభాషి, చాలామంది అభిమానించే అన్షు ప్రకాశ్ (1986 బ్యాచ్) మీద సోమవారం రాత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసంలో చేయి చేసుకున్న సంఘటన జరిగిందని చెబితే, దానిని చాలామంది సందేహిస్తారంటే నేను నమ్మను. ప్రభుత్వాలకీ, అధికారులకీ ఘర్షణ పాతదే ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకీ, ప్రభుత్వోద్యోగులకీ మధ్య ఘర్షణ కొత్త విషయం కాదు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా ప్రభుత్వోద్యోగులను ముఖ్యమంత్రులు కించపరిచే సంస్కృతి కూడా కొత్తది కాదు. చాలామంది నాయకులు అధికారులను తమ తస్మదీయుల చుట్టూ తిరిగేటట్టు చేసి, అందులో నుంచి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాయావతి అధికారుల బదలీ విషయంలో మహారాణి అనిపించుకున్నారు. అలాంటి అధికారాన్ని చలాయించడం గర్వకారణంగా కూడా ఆమె భావించేవారు. 2005లో ఆమెతో నేను ‘వాక్ ది టాక్’ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయాన్ని మాయావతి ఘనంగా చెప్పారు కూడా. తన గురువు కాన్షీరామ్‌ను మొదటిసారి కలుసుకున్నప్పుడు (ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కాన్షీరామ్ హుమాయూన్ రోడ్‌లోని నివాసం ఫస్ట్‌ఫ్లోర్‌లో కోమాలో ఉన్నారు) ఆమె ఐఏఎస్ పరీక్షకు సమాయత్తమవుతున్నారు. ఐఏఎస్ పరీక్షను పట్టించుకోవద్దనీ, తనతో పాటు రాజకీయాలలో చేరమని ఆయన చెప్పారు. ‘నీవు మామూలు ఐఏఎస్ అధికారివి కావాలని అనుకుంటున్నావు. కానీ ఆ ఐఏఎస్ అధికారులంతా నీ చుట్టూ తిరిగేటట్టు నేను చేస్తాను’ అని ఆయన అన్నారు. అలాగే చేసిన వాగ్దానాన్ని కాన్షీరామ్ నిలబెట్టుకున్నారు కూడా. బెహెన్జీ కూడా ఏమీ తగ్గకుండా వారిని తన చుట్టూ తిప్పించుకున్నారు. 2007 ఎన్నికల సమయంలో బదయూన్లో జరిగిన ఒక సభలో సభికుల హర్షధ్వానాల నడుమ ఇందుకు తగ్గట్టే ఆత్మస్తుతి కూడా చేసుకున్నారు. తను పేరు చెబితేనే ఉద్యోగస్వామ్యం గడగడలాడిపోతుందని ఆమె అన్నారు. మాయావతి అంటే గడగడలాడిపోవడానికి అవసరమైనంత భయాన్ని ఆమె అధికారులకి పుష్కలంగా ఇచ్చారు. ఆమె తరుచూ వారిని బదలీలు చేసేవారు. బదలీ చేసిన కొత్త ప్రదేశానికి వారు కుటుంబాలను తరలించే అవకాశం లేకుండా అవి జరిగేవి. దీనితో కుటుంబాలను పదే పదే తిప్పడం ఇష్టం లేక ఉద్యోగులు సర్కిట్ హౌస్‌లో మకాం పెట్టేవారు. చదువుకుంటున్న పిల్లలు ఉంటే మరీ ఇబ్బంది. ఏ పోస్టులో ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికీ తెలిసేది కాదు. నిజానికి మాయావతి అంటే ఎంత భయపడేవారో, అంతగానూ అధికారులు ద్వేషించేవారు. కేంద్ర సర్వీసులలోకి, ఆఖరికి ద్వితీయ స్థానాలకు వెళ్లడానికి కూడా ప్రయత్నించేవారు. ఇలా ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించిన రాష్ట్రాలలో నాకు తెలిసి హరియాణా కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా బన్సీలాల్, ఓంప్రకాశ్ చౌతాలా హయాములు అధికారులను వేధించడానికి పేర్గాంచాయి. ఆ సమయంలో అక్కడ తరుచూ ఉద్యోగుల బదలీలు ఉండేవి. వారి మీద అవినీతి కేసులు మోపేవారు. విజిలెన్స్ దర్యాప్తులు వంటి చర్యలు ఉండేవి. అలాగే అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇష్టులని పేరు పడిన వారికి బాధ్యతలు అప్పగించకుండా కూర్చోబెట్టడం కూడా జరిగేది (ఇలాంటి శిక్షకే ఖుద్దే లైన్ అని పేరు. అదేమిటో అనువదించి చెప్పడం ఇక్కడ బొత్తిగా అనవసరం). ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా చెప్పవచ్చు. రాజకీయ నేతల కుత్సిత మనస్తత్వానికి అద్దం పడుతూ ఉండే ఇంకొన్ని వాస్తవిక ఘటనలను కూడా ఉదాహరించవచ్చు. పత్రికా రచయితగా నా నలభయ్ ఏళ్ల జీవితంలో ఇలాంటి మరొక ఘటన జరిగినట్టు వెంటనే చెప్పమంటే నాకు కష్టమే. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద చేయి చేసుకోవడం, అందులోను ముఖ్యమంత్రి నివాసంలో అది జరిగిన ఉదంతం నాకు తక్షణం ఏదీ గుర్తుకు రావడం లేదు. దాడి జరగలేదంటే ఎవరూ నమ్మరు వైద్యుల నివేదిక, ఇప్పటిదాకా లభించిన వీడియో ఆధారాలు పరిశీలించినా, మూడు దశాబ్దాలుగా మంచి పేరు సంపాదించుకున్న అన్షు ప్రకాశ్ మాటను బట్టి ముఖ్యమంత్రి నివాసంలో దాడి జరిగిందనే వాస్తవాన్ని సందేహించడానికి అవకాశం తక్కువే. కాబట్టి ఇందులో వాస్తవం ఏమిటి అనేదాని గురించి చర్చ అనవసరం. ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయకుడు వీకే జైన్ కూడా ప్రకాశ్ మీద చేయి చేసుకున్న మాట నిజమని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. రోజులూ గంటలూ గడిచే కొద్దీ ఆప్ అధికార ప్రతినిధి సహా ఇతర నాయకులు కూడా తమ తమ వైఖరులను సడలిస్తూ వచ్చారు. అసలు అలాంటి దాడి ఏదీ జరగలేదని మొదట చెప్పారు. తరువాత మరింత అలక్ష్యంతో, న్యాయమూర్తి లోయా హత్య కేసులో అమిత్‌షాను ప్రశ్నించడానికి ఏమీ లేనట్టే భావిస్తూ, ‘ఏవో రెండు దెబ్బల’కే ముఖ్యమంత్రి ఇంటికి పోలీసులను పంపించి విచారిస్తారు అనే వరకు వారి మాటలు నడిచాయి. ఈ వైఖరిని మీరు పాత తరహా దబాయింపు అని పేర్కొనవచ్చు. నేను ఇంకో అడుగు ముందుకు వేసి దీనిని రాజ్యాంగపరమైన దురహంకారానికి మించినదని అంటాను. పశ్చాత్తాపం సంగతి పక్కన పెడదాం. మీ పాలనలో ఉన్న వ్యక్తి మీద జరిగిన దాడికి చిన్న సానుభూతి పదం కూడా నోటి నుంచి రాలేదు. భౌతికదాడికి గురైన వ్యక్తికి సంఘీభావం అసలే ప్రకటించలేదు. ఢిల్లీ స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్, కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ గడచిన మూడేళ్లుగా సంఘర్షిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనీ, పంపిన ఫైళ్లనీ లెఫ్టినెంట్ గవర్నర్లు నిరాకరిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసిన నియామకాలను లెఫ్టినెంట్ గవర్నర్లు మార్చడం లేదా నిరాకరించడం చేశారు. ముఖ్యమంత్రి సన్నిహిత ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్ మీద సీబీఐ దాడి చేయించి అవినీతి కేసును నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న అవినీతి నిరోధక శాఖను వారి అధీనం నుంచి తొలగించారు. ఆర్థిక లబ్ధి ఉన్న పదవులలో ఉన్నారన్న ఆరోపణతో ఈ మధ్యనే 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తూ ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిపారసు చేసింది. ఆ వారాంతంలోనే రాష్ట్రపతి అనుమతి కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ జాబితాకు అంతు ఉండదు. కానీ ఇది అధికారులు, నియమ నిబంధనల పేరుతో కేంద్రం వైపు నుంచే ఎక్కువ దాడి జరిగిన సంగతిని మనకి చెబుతుంది. దీనికి కేవలం మాటలతోనే ఆప్ ఎదురుదాడికి దిగింది. ఆ మాటలలో చాలా ప్రసిద్ధమైనవి లేదా చాలా అవమానకరమైనవి మోదీని గురించి కేజ్రీవాల్ చేసిన వర్ణనలే. మోదీని కేజ్రీవాల్ అబద్ధాల కోరు, మానసిక రోగి అన్నారు. ప్రకాశ్ మీద జరి గిన దాడి నేపథ్యంలో ఈ మాటల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఇదే సంస్కృతి విస్తరిస్తే... ఇది దేనికి దారితీస్తుందంటే, మనం దేనిని మున్నెన్నడూ లేనిది అంటున్నామో, అదే కొత్త ఉదాహరణను కూడా ప్రవేశపెడుతుంది. అన్షు ప్రకాశ్ విషయంలో మనలని ఎక్కువ భయపెట్టేది అదే. ఆప్‌ను భయానక వీధి రౌడీల మూక అని మనం చెప్పాల్సిందే. కానీ ఆ పార్టీ వాళ్లు ఇలాంటి హింసను చట్టబద్ధం చేస్తే ఆ స్థాయి అధికారుల మీద దాడికి సంబంధించి దేశం నలుమూలలా ఉన్న కొరకరాని కొయ్యల వంటి రాజకీయనాయకులకు వేరే విధమైన సంకేతాలు వెళతాయి. నిజాయితీ కల అధికారి ఒక ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి ఆదేశాలను తప్పుడు ఆదేశాలుగా భావించి తిరస్కరించినప్పుడు దానికి పరిష్కారం ఊహించండి. అలాంటి అధికారిని మీ ఇంట్లో జరిగే భేటీలోనో లేక అతడి కార్యాలయంలోనో చితకబాదడమే పరిష్కారమా? ఈ వ్యవహారంలో మనకు వినపడుతున్న వాదనల్లో ఒకటి ఏమిటంటే.. ప్రధాన కార్యదర్శి లేక అధికారులు.. రెండున్నర లక్షలమంది ప్రజలకు రేషన్ కార్డులను తిరస్కరించిన విషయాన్ని పట్టించుకోలేదన్నదే. అలా అని చెప్పి రాజకీయ నేతలు ఈ అధికార్ల పైకి మూకను ఉసిగొల్పుతారా? రాజకీయ నేతలు, ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారులకు మధ్య సున్నితమైన సంబంధం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనేది మంచి నాయకత్వానికి తెలుసు. ఒక రాష్ట్ర నాయకుడు, అదీ ఢిల్లీ వంటి పరిమిత అధికారాలు కల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి సమస్యలను పరిణామాలు దిగజారిపోని రీతిలో పరిష్కరించాల్సి ఉంది. తనకు సాధ్యం కానప్పడు సమస్యను అత్యున్నత రాజ్యాంగాధికారుల దృష్టికి తీసుకుపోవలసి ఉంటుంది. అది కూడా విఫలమైతే, బహిరంగంగా నిరసన తెలుపడం, మీడియా దృష్టికి తీసుకుపోవడం, (ఆప్‌కి ఇది వెన్నతో పెట్టిన విద్య) వంటి అవకాశాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీ ఇంట్లో దెబ్బలు తినడం – రెండు చెంపదెబ్బలే కావచ్చు– గర్వించవలసిన విషయం మాత్రం కాదు. 2014లో నా పుస్తకం ‘యాంటిసిపేటింగ్ ఇండియా’ ముందుమాటలో నేను ఒక ముఖ్యమైన అంశం ప్రస్తావించాను. మోదీ, రాహుల్, కేజ్రీవాల్ త్రయం మన వర్తమాన రాజకీయాల్లో అద్భుతమైన లక్షణాలను ప్రదర్శించనున్నారని, జర్నలిస్టుల జీవితాలకు ఇవి ఏమాత్రం విసుగెత్తించే క్షణాలు కావని నేను రాశాను. పైగా ఈ ముగ్గురు నేతలూ పరిణితి సాధిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాను. మోదీ ప్రధాన స్రవంతి సమన్వయం వైపుగా పయనిస్తారని, రాహుల్ బహిరంగ జీవితంలో బిడియాన్ని పక్కన పెడతారని రాశాను. కేజ్రీవాల్ వ్యవస్థాగతమైన శాంతివైపు పయనిస్తారని రాశాను. ఈ మూడో అంశంలో నా అంచనా తప్పు అని ఈ వారం మనకు చెబుతోంది. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
దావోస్‌లో దక్కిందేమిటి?
జాతిహితం ప్రధానమంత్రి, పలువురు కీలక కేంద్ర మంత్రులు, సీఎంల హాజరుతో ఇంత కృషి జరిగినా దావోస్ సమావేశ ఫలితాలు పరిమితమనే చెప్పాలి. ప్రధాని మోదీ సహా భారత ప్రతిని ధులు ఎంతటి చక్కటి సందేశాలిచ్చినాగానీ చివరికి వారు ప్రపంచ వ్యాపార సంస్థలకు ఇవ్వజూపేది ఏంటనేదే కీలకమవుతుంది. ఇండియాలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటే మంచిదే. కాని, చైనా జనాభాకు సరిసమానమైన జనం, దానిలో ఐదో వంతు మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి భారత్ హాజరుకావడం ఇది మూడోసారి. 2006లో ‘అన్ని చోట్లా ఇండియా’ అనే నినాదంతో, 2011లో ‘సమ్మిళిత భారత్’ పేరిట దావోస్‌లో పాల్గొనడానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈ రెండు సందర్భాలకు భిన్నంగా ఇప్పుడు భారత ప్రధాని దావోస్ వెళ్లారు. ఇంతకు ముందు దావోస్ సదస్సుకు హాజ రైన చివరి ప్రధాని హెచ్డీ దేవెగౌడ. 1997 నాటి ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ విషయ పరిజ్ఞానంతో పాటు తనకంటూ సొంత శైలి ఉన్న నేత. ఆయన సర్కారుకు పార్లమెంటులో భారీ మెజారిటీ ఉంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇందిరాగాంధీ తర్వాత పార్టీపై మోదీకి ఉన్నంత పట్టు మరే ప్రధా నికీ లేదు. నేడు మరే ఇతర పెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ ఏ ఒక్క నాయ కునికీ ఇంతటి నియంత్రణ లేదనేది మనం గుర్తుంచుకోవాలి. విదేశీ ప్రయా ణం హుషారుగా చేసే అలవాటు ఉన్న మోదీకి ప్రపంచనేతలతో మంచి సంబంధాలున్నాయి. ప్రపంచదేశాల నేతల శిఖరాగ్రసభల్లో వారిని సుదీర్ఘ గాఢాలింగనం చేసుకోవడం మోదీ ప్రత్యేక ముద్రగా మారింది. దావోస్‌లో ఆయన పాల్గొనడం డబ్ల్యూఈఎఫ్‌కు, దాని స్థాపకుడు క్లాజ్ ష్వాబ్కు నిజంగా ఘనవిజయం. ఆర్థిక వేదిక సదస్సులో మోదీ ఏం చేశారనే విషయం అలా ఉంచితే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయనకు దావోస్‌తో మంచి అనుభ వం, అనుబంధమే ఉంది. ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఆయన డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు హాజరవడంతోపాటు 2007లో దాలియన్‌లో జరిగిన వేసవి దావోస్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఓ చర్చకు నేను సమన్వయకర్తగా వ్యవహరించాను. భారత రాజకీయాలపై అనేక ప్రశ్న లడిగినా, ఆయన మాత్రం తాను రాజకీయనేతగా ఇక్కడికి రాలేదనీ, దేశ సమ స్యలను చర్చంచనని మోదీ తెగేసి చెప్పారు. మోదీకి ఆహ్వానం గిట్టని యూపీఏ సర్కారు! భారత పారిశ్రామికవేత్తలకు మోదీపై మోజు పెరిగేకొద్దీ దావోస్ సదస్సులో దేశ రాజకీయాల ప్రస్తావన, వాటిపై చర్చ తప్పలేదు. మోదీకి ఆహ్వానం పంపడం తమకు ఇష్టంలేదనే విషయాన్ని కూడా ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వా హకులకు అప్పటి యూపీఏ సర్కారు తెలిపింది. రాజకీయ ఒత్తిడి కారణం గానే తనకు ఆహ్వానం రాలేదని మోదీ నమ్మడంలో తప్పేమీ లేదు. అందుకే గత మూడేళ్లలో దావోస్ శిఖరాగ్ర సదస్సుపై ఆయన సర్కారు ఆసక్తి చూప లేదు. తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి డబ్ల్యూఈఎఫ్ చేయాల్సిందంతా చేసింది. ప్రారంభ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించే అవకాశం మోదీకి ఇచ్చారు. అగ్రదేశాల నేతలకు లభించే ఈ అవకాశం కిందటేడాది చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్‌కు దక్కింది. ఈ ఏడాది దీనికి గట్టి పోటీ ఏర్పడింది. డబ్ల్యూ ఈఎఫ్ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్, ఇమాన్యుయేల్ మాక్రాన్, జస్టిన్ ట్రూడో, థెరిజా మే, బెంజిమిన్ నెతన్యాహూ, ఏంజెలా మెర్కెల్ వంటి హేమాహే మీలు హాజరయ్యారు. కిటకిటలాడిన మోదీ సభ! మోదీ ప్రసంగించిన సభా ప్రాంగణం నేతలతో కిక్కిరిసింది. ట్రంప్ పాలన లోని అమెరికాపైనా, జిన్‌పింగ్ నాయకత్వాన నడుస్తున్న చైనాపైనా మోదీ కొన్ని చెప్పుకోదగ్గ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారత సంస్కృతి, జ్ఞానం ఆధారంగా ఆయన ప్రపంచ దేశాల నేతలకు ఎన్నో సలహాలు, సూచనలు అందించారు. మోదీ ఉపన్యాసం సదస్సు అంతటా చర్చనీయాంశమైంది. ఆయన ప్రారంభ ప్రసంగం చేసిన నాలుగు రోజుల వరకూ నాకు ఎదురైన ప్రతి భారతీయుడూ, ‘ప్రధాని ఉపన్యాసంపై మీరేమనుకుంటున్నారు?’ అని ప్రశ్నించాడు. దీనికి జవాబివ్వడానికి ముందే, తన అభిప్రాయం చెప్పాడు. పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడే ఓ విశేషముంది. భారతీయుడు కాని ఏ వ్యక్తీ ఈ ప్రశ్న అడగలేదు. అలాగే, అంతర్జాతీయ వార్తా ప్రచారసాధనాలు మోదీ ప్రసంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చైనాతో పాశ్చాత్య దేశాలతో పాటు, బడా అంతర్జాతీయ వ్యాపార సంస్థలు విసిగిపోయి ఉన్నాయి. చైనా అంటే వాటికి చికాకు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా విజయవంత మైన పాత్ర పోషించాలని, తమ పెట్టుబడులకు మంచి కేంద్రంగా మారాలని అవి కోరుకుంటున్నాయి. చైనాలో వ్యతిరేక ఫలితాలతో నష్టపోయే అంతర్జా తీయ కంపెనీల సంఖ్య పెరిగేకొద్దీ గత కొన్నేళ్లుగా ఇండియాపై వాటికి అభి మానం పెరుగుతూ వస్తోంది. ఇండియా ఆర్థికశక్తిగా విజయం సాధించాలని అవి కోరుకుంటున్నాయి. అయితే, నేడు ఇండియా ఈ విషయంలో వాగ్దానం చేసేది ఎక్కువ– సాధించేది తక్కువ అనే పరిస్థితి ఉంది. మోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశంలో మరిన్ని భారీ సంస్కరణలు వస్తాయని, అదే స్థాయిలో ఆర్థిక, వ్యూహాత్మక సుస్థిరత నెలకొంటుందని అంచనాలు సాగాయి. భారత్‌కు సంబంధించి దావోస్‌లో ఇలాంటి చర్చలు, ఊహాగానాలు ఇటీవల పెరి గాయి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు మరోసారి భారీగా అంటే 3.9 శాతానికి పెరగడంతో ఇండియాపై ఆశలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాస్తవానికి లాభసాటి ఒప్పందాలు చేసుకోడానికి సరైన వేదిక దావోస్. పైకి ప్రపంచ పరిస్థితులు మెరుగుపరచాల్సిన అవసరం గురించి నేతలందరూ మాట్లాడు తున్నా, తెర వెనుక జరిగేది వేరు. పోటీపడిన రాష్ట్రాలు దావోస్‌లో ఇండియాకు సంబంధించిన వ్యవహారాలు బాగానే నడిచాయి. భారత ప్రభుత్వం–సీఐఐ, చంద్రబాబు నాయుడి ఆంధ్ర, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో–ఇలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలు తమ బృందాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అన్ని చోట్లా గట్టి ప్రయత్నాలే చేశాయి. ప్రధానమంత్రి, పలువురు కీలక కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల హాజరుతో ఇంత కృషి జరిగినా ఫలితాలు పరి మితమనే చెప్పాలి. ప్రధాని మోదీ సహా భారత ప్రతినిధులు ఎంతటి చక్కటి సందేశాలిచ్చినాగానీ చివరికి వారు ప్రపంచ వ్యాపార సంస్థలకు ఇవ్వజూపేది ఏంటనేదే కీలకమవుతుంది. ఇండియాలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటే మంచిదే. కాని, చైనా జనాభాకు సరిసమానమైన జనం, దానిలో ఐదో వంతు మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. ఇది వాస్తవానికి క్రూర ప్రపంచమని చెప్పాలి. ఇది ఇబ్బందికర ప్రశ్నలనే అడుగుతుంది. ఇప్పుడు మీది నిజంగా బలమైన ప్రభుత్వమే అయితే వోడాఫోన్ కంపెనీని వెనుకటి కాలానికి పన్ను చెల్లించమని చేసిన చట్టసవరణను ఇంకా ఎందుకు రద్దు చేయలేదు? వంటి ప్రశ్నలు ఈ వేదికపై తలెత్తాయి. దశాబ్దం క్రితం ఇండియా దావోస్‌లో ఆర్భాటంగా తన బలం ప్రదర్శించినపుడు అప్పట్లో దేశంలో వృద్ధి రేటు 9 శాతం (పాత సూత్రం ప్రకారం) దాటుతోంది. టెక్నాలజీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ఐటీ సేవల ఔట్సోర్సింగ్ కారణంగా బెంగళూరు కొత్త సిలికాన్ వ్యాలీగా అవతరిం చింది. ఈ పరిస్థితుల్లో మన్మోహన్సింగ్ వంటి నియమితుడైన ప్రధాని సైతం దావోస్ వచ్చి ప్రసంగిస్తే కొంత ప్రభావం చూపించేవారు. వాగ్ధాటిలో మోదీకి పోటీ శక్తి ఆయనకు ఏ మాత్రం లేదనే విషయం పక్కనబెట్టినా డాక్టర్ సింగ్ మంచి ఫలితాలే సాధించేవారని భావించవచ్చు. మన్మోహన్ దావోస్ వెళ్లాల నుకున్నారు. కాని, ప్రపంచీకరణను వ్యతిరేకించే వామపక్షాలు ఆయనను వెళ్లనీయలేదు. దావోస్ సదస్సుకు సింగ్ హాజరైతే మద్దతు ఉపసంహరిస్తా మని అవి బెదిరించాయి. ఈ విషయం రాహుల్ బజాజ్ ఇక్కడి మీడియాకు వెల్లడించారు. నాయకుడు బలవంతుడేగాని పరిస్థితి అనుకూలంగా లేదు! ఏ సందేశం ఎలా ఇవ్వాలో తెలిసిన ప్రపంచస్థాయి బలమైన నాయకుడు భారత్‌ను పరిపాలిస్తున్నాడు. అయితే, పరిస్థితులు ఉత్సాహపూరితంగా లేవు. 2006 నుంచి 2011 వరకూ, మళ్లీ అప్పటి నుంచి 2018 వరకూ ఆహార పదార్థాలు, వంటకాలు ( ఆంధ్ర సహా దేశంలో చాలా ఎక్కువ) బాలీవుడ్ సినిమాలు, ఆధ్యాత్మికత, (ఇప్పుడు) యోగా– రంగాల్లో తన ప్రత్యే కతలు, విజయాల గురించే ఇండియా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కాని ఈ రంగాల్లో ఒకదేశానికి ఉన్న శక్తియుక్తులు దాన్ని ఉన్నత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి చాలా పరిమితులున్నాయి. ఇలాంటి కొన్ని ప్రత్యేక అంశాల్లో సాధించిన ప్రగతి థాయిలాండ్ వంటి చిన్న దేశానికి ప్రయోజన కరం కావచ్చు. కిందటేడాది ఈ దేశానికి మూడు కోట్ల 60 లక్షల మంది పర్యాటకులు రాగా, ఇండియాను కోటీ రెండు లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్న ఇండియా ఓ సైనిక శక్తిలా గట్టిగా మాట్లాడాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి. ప్రపంచ రక్షణ, భద్రత, వ్యూహాత్మక విషయాలపై ఇండియా ఎందుకు మాట్లా డదని ప్రపంచ నేతలు అడుగుతున్నారు. ఈ అంశాలపై కొన్ని ప్రకటనలు చేస్తే ఇండియాకు, మోదీకి గొప్ప ప్రచారం లభించేది. దావోస్‌లో భారత్ కొన్ని ప్రత్యేక రంగాల్లో తన శక్తియుక్తుల గురించి ప్రచారం చేసుకుంది. రిపబ్లిక్ దినోత్సం రోజున పది మంది ఆగ్నేయాసియా నేతలను ముఖ్య అతిధులుగా ఆహ్వానించి తన సైనికపాటవాన్ని ఢిల్లీలో ప్రద ర్శించింది. సముద్రయానంలో నిబంధనల ప్రకారం నడుచుకోవడం, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం వంటి అంశాలపై ఇండియా గట్టి సందేశ మిచ్చి ఉంటే బాగుండేది. దావోస్ సందేశానికి రిపబ్లిక్ డే దౌత్యం తోడైతే గొప్ప ఫలితాలు అందేవి. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంది. గత పదేళ్లలో ఇండియా చెప్పింది ఎక్కువ–చేసింది తక్కువ అనే భావన ఇతర దేశాల్లో కనిపిస్తోంది. అయితే, ఈసారి కూడా తన స్వభావానికి భిన్నమైన ప్రదర్శనకు దిగింది. తన శక్తిసామర్థ్యాలను తగినంతగా ప్రపంచానికి అర్థమయ్యేలా చూపించలేకపోయింది. దావోస్‌లో పదేళ్ల క్రితం కనిపించిన భారతీయ ప్రము ఖులే ఈసారి కనిపించారు. ఇండియా తరఫున జరిపిన భేటీలకు వివిధదేశాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరైతే తప్ప ప్రపంచపటంలో భారత్‌కు తగిన గుర్తింపు, ప్రయోజనం ఉండదు. మన గురించి ఎంత గొప్పగా మనం చెప్పు కున్నా జరిగేది ఇంతే. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
దళిత రాజకీయాలే కీలకమా?
జాతిహితం మైనారిటీలు, దళితులు, ఆదివాసుల నుంచి ఏ ఒక్కరూ నేడు కేంద్రంలో కీలక మంత్రు లుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో మినహా మరెక్కడా సీఎంలుగా లేరు. ఈ పరిస్థితే మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. బీజేపీ ఈ ముప్పును లెక్కచేయడం లేదు. దేన్నయినా జయించగల సమున్నత శక్తినని అది భావిస్తోంది. దళిత ఐక్యత వల్ల కలిగే ముప్పును మొగ్గలోనే తుంచేయగలనని అది భావిస్తోంది. కాబట్టే దళితుల ఆందోళనల పట్ల అతిగా ప్రతిస్పందిస్తోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. దళితులు మన జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తిగా ఆవిర్భవించనున్నారా? దళిత ఆత్మవిశ్వాసంగా ఇటీవల అభివర్ణిస్తు న్నది కేవలం సామాజిక–రాజకీయపరమైనదేనా లేక జోరుగా సాగనున్న ఈ ఎన్నికల ఏడాదిలో వర్తమాన రాజకీయాల ధోరణిని బద్దలుకొట్టే శక్తి దానికి ఉన్నదా? ఉన్నట్టయితే, ఆ రాకెట్లో మే 2019 వరకు సరిపడేటంత ఇం«దనం ఉన్నదా? లే క అంతకంటే ముందుగానే కొడిగట్టిపోతుందా? ఈ ప్రశ్నల పరం పరను మరో రెండు ప్రశ్నలతో ముగిద్దాం. ఈ నూతన అంశం జిగ్నేశ్ మెవానీ రూపంలో వ్యక్తమౌతోందా? రాజకీయ పరిభాషలో ఆయన సరికొత్త కాన్షీరాం కానున్నారా? లేక మహేంద్రసింగ్ తికాయత్ లేదా రిటైర్డ్ కల్నల్ కిశోరీసింగ్ బైంస్లాల వంటి వారు మాత్రమేనా? నేను చెప్పదలుచుకున్న అంశమైతే ఇదే.. కాన్షీరాం దేశ ప్రధాన భూభాగంలోని రాజకీయాలను ప్రగాఢంగా ప్రభావితం చేశారు. మిగతా ఇద్దరికీ వివిధ సమయాల్లో జాట్లు, గుజ్జర్ల మద్దతున్నా క్రమంగా తెరమరుగయ్యారు. దళిత ఓటర్లను సంఘటితం చేయగలరా? దేశ ఓటర్లలో దాదాపు 16.6 శాతం ఉండే దళితులు నిజానికి ముస్లింల కంటే మరింత శక్తివంతమైన ఓటు బ్యాంకు. కేరళ, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే 1989కి ముందు కాంగ్రెస్ దళితులంతా తమ ఓటర్లేనని భావించగలిగేది. 1989 నుంచి కాంగ్రెస్ వెనుకబడిన కులాలు, ముస్లింలతో పాటూ దళితుల ఓట్లను కోల్పోవడం మొదలైంది. ముస్లింలకు భిన్నంగా దళితులు ఎన్నడూ వ్యూహాత్మకంగా లేదా ఒక పార్టీని ఎన్నుకోవాలి లేదా మరో పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలి అనే ఏకైక లక్ష్యంతో ఎన్నడూ ఓటు చేయలేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ సహా చాలా కీలక రాష్ట్రాల్లో దళితుల ఓట్లు కాంగ్రెసేతర పార్టీలకు వెళ్లాయి. బీజేపీకి అది ఉపయోగపడింది. దళి తులలో కొందరు నరేంద్ర మోదీ పట్లా్ల, ఇటీవలి కాలంలో ఆ పార్టీ పట్ల కూడా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తదుపరి దశలో... జాతీయ రాజ కీయాల్లో ఏమంత ప్రాధాన్యం లేనంతగా దళితుల ఓట్లు చీలిపోయాయి. మరోవిధంగా కూడా ముస్లింలకంటే దళితులు విభిన్నమైన ఓటర్లు. దళితుల ఓట్లు వివిధ రాష్ట్రాల్లో బాగా చెల్లా చెదురుగా ఉన్నాయి. కాబట్టి ముస్లింల వలే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల శక్తిని కోల్పో యారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. దళిత ఓటర్లు అత్య ధికంగా ఉన్నది పంజాబ్‌లో (32%). కానీ వారిలో చాలా మంది సిక్కులు. ఆ రాష్ట్రంలో ఓటర్లు కులం ప్రాతిపదికపై సమీకృతం కారు. కానీ పెద్ద సంఖ్యలో ఎవరి ఓట్లయినా ఒక పక్షంవైపు మొగ్గితే బలాబలాలు తారుమారు అవు తాయి. అందువల్ల మనం ముందు వేసిన ప్రశ్నల సారం ఒక్కటే.. దళిత ఆత్మ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారికి నాయకత్వం వహిస్తున్న మెవానీ దళిత ఓట్లను అలా సంఘటితం చేయగలరా? ఆ పని చేయగలిగితే అది ప్రస్తుత రాజకీయాల ధోరణిని భగ్నం చేయగలుగుతుంది. మెవానీ దళిత నేతగా ఆవిర్భవించినా ఆయన చాలా రాష్ట్రాలకు విస్తరిం చిన జనాకర్షణశక్తిగల నేత కూడా కావాల్సి ఉంటుంది. దళితులను అందరినీ సమీకరించగలిగిన ఒక నేత అవసరం. 1970ల మధ్య వరకు జగ్జీవన్‌రాం కాంగ్రెస్‌కు అలాంటి నేతగా ఉండేవారు. ఆ తర్వాత మరో దళిత నేతకు అలాంటి సాధికారతను కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. దాదాపు 8 శాతం ఓటర్లుగా ఉన్న ఆదివాసులకు చెందిన అలాంటి జాతీయ స్థాయి నేత ఏ పార్టీకీ, ప్రత్యేకించి కాంగ్రెస్‌కు (పీఏ సంగ్మా తర్వాత) లేరు. ఈ విష యంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానం. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నా అది లెక్కలోకి రాదు. దళిత ఐక్యతకు అందివచ్చిన అవకాశం మైనారిటీలు, దళితులు, ఆదివాసులలో ఎవరూ కేంద్రంలో కీలక మంత్రులుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్యాలను మినహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా లేని ఆసక్తికరమైన పరిస్థితి నేడుంది. సరిగ్గా ఇదే జిగ్నేశ్ మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ముప్పును లెక్కచేయనంతటి రాజకీయ చతురత మోదీ–షాల బీజేపీకి ఉంది. దేన్నయినా జయించేయగల సమున్నత శక్తిననే ఆలోచనా ధోరణి దానిది. కాబట్టి తలెత్తగల ఆ ముప్పుతో తలపడి సాధ్యమైనంత త్వరగా, మొగ్గలోనే తుంచేయాలని ఆ పార్టీ భావిస్తుంది. క్షేత్రస్థాయిలో దళి తులు కార్యాచరణకు దిగడం పట్ల వారు అతిగా ప్రతిస్పందించడంలో అదే వ్యక్తమౌతోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. ఉనాలో గోరక్షకులు దళితులపై సాగించిన అత్యాచారం నేపథ్యంలో మెవానీ నేతగా ముందుకు వచ్చారు. తొలుత ఆయనను గుజరాత్‌కే పరిమి తమైన స్థానిక నేతగానే చూశారు. రాజకీయంగా పెద్దగా లెక్కలోకి తీసుకోవా ల్సిన వాడిగా చూడలేదు. ఆయన రాజకీయాల్లో మొదట్లో సాంప్రదాయ కమైన ఎన్నికల రాజకీయాలను మెచ్చని జేఎన్‌యూ తరహా భావజాలం కని పించింది. అదికాస్తా ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని, అది కూడా బూర్జువా జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో కూటమి కట్టాలని నిర్ణయించు కోవ డంతోనే అది ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రస్తుతం గుజ రాత్‌లోని ఒక ఎంఎల్ఏ మాత్రమే. అయినా అంతకంటే చాలా ఎక్కువ గానే లెక్కలోకి వస్తారు. ఇతర రాష్ట్రాలలోని దళితులకు తన సందేశాన్ని విని పించే అవకాశాన్ని కూడా అది ఆయనకు కల్పిస్తుంది. ఈ వారంలో ఆయన మహా రాష్ట్రలో చేసినది సరిగ్గా అదే. మెవానీలో చాలా బలమైన అంశాలు చాలానే ఉన్నాయి. యవ్వనం, అద్భుత వాక్పటిమ, సామాజిక మాధ్యమాలను ఉపయోగించగల శక్తిసామ ర్థ్యాలు, రాజకీయ, భావజాలపరమైన పట్టువిడుపుల గుణం ఆయనకు న్నాయి. అంతేకాదు, ఇప్పటికి ఏకైక శత్రువు బీజేపీ మాత్రమేనంటూ దానిపైకే గురిపెట్టి... మిగతా వారందరితోనూ కలవగల దృష్టి కేంద్రీకరణ కూడా ఉంది. పైగా ఆయన దళితులలోని ప్రధానమైన ఒక ఉపకులానికి చెంది నవారు. ఆయన వచ్చింది చిన్న రాష్ట్రం నుంచి, అయితే ఆయనకు ముందు కాన్షీరాం కూడా ఆయనలాగే ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చి జాతీయస్థాయిలో అత్యంత ప్రబలమైన రాజకీయ ధోరణిని నిర్మించారు. అది ఆయనకు అను కూలంగా పనిచేసే మరో బలీయమైన అంశం అవుతుంది. పంజాబీ అయిన కాన్షీరాం కూడా సాంప్రదాయకంగా చెప్పుకోదగినది కాని ప్రాంతం నుంచి రంగం మీదకు వచ్చారు. డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ, అంబేడ్కర్ రచనలతో ప్రభావితుడై ఆయన షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాన్ని (బీఏఎంసీఈఎఫ్) నిర్మించడంతో ప్రారంభించారు. అప్పటివరకు దళితులు అనే పదం పెద్దగా వాడుకలో లేదు. మొదట్లో ఆయన పతాకశీర్షికలకు ఎక్కా లని తాపత్రయపడేవారిలా కనిపించారు. 1980ల చివరి కాలం అస్థిరమైనది, కాంగ్రెస్ క్షీణిస్తూ పలు వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కాన్షీరాం చూపిన రాజకీయ చతురత ఉందా? సిక్కు వేర్పాటువాద నేతలు సహా రకరకాల గ్రూపులను ఆయన ఒక్క చోటికి చేర్చి భారీగా ప్రజలను సమీకరించారు. అయినా ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. త్వరలోనే ఆయన తన శక్తిని పెంచుకుని, వారందరినీ వదిలించే సుకున్నారు. తన రాజకీయాలు వృద్ధి చెందాలంటే మెవానీ కూడా ఉమర్ ఖలీద్‌ను విడిచిపెట్టాలి. దేశ ప్రధాన భూభాగంలో వేళ్లూనుకోనిదే జాతీయ వాదాన్ని లేదా మతాన్ని ఢీకొంటూ దళిత రాజకీయాలను నిర్మించలేమని కాన్షీరాం 30 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. దాన్ని మెవానీ గుర్తించాలి. అయితే, కాన్షీరాంగానీ, మాయావతిగానీ హిందూయిజాన్ని తిరస్కరించలేదు లేదా బౌద్ధాన్ని స్వీకరించలేదు. ‘‘మన పోరాటం హిందూ దేవతలతో కాదు మను వాదులతో’’ అనే వారాయన. ఇక బుద్ధుడంటారా? మను వాదులు మూడు కోట్ల దేవతల్లో ఒకడిని చేసేస్తారు అంటుండేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రముఖంగా ముందుకు వచ్చినది 1988లో. బోఫోర్స్ కుంభకోణం విష యంలో రాజీవ్‌ను తప్పు పడుతూ వీపీ సింగ్ ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. అదేసమయానికి అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయ డంతో అలహాబాద్ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. వీపీ సింగ్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి, లాల్‌బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రికి మధ్యనే పోటీ జరుగుతున్నదని మేం అంతా అనుకున్నాం. కొన్ని రోజుల ప్రచారం జరిగే సరికే కాన్షీరాం నిర్ణయాత్మక శక్తిగా ముందుకు వచ్చారు. అప్పుడే మేం మొదటిసారిగా సూటిగా సరళంగా దళిత రాజకీయాలను విన్నాం : ‘‘40 ఏళ్లుగా మనం జంతువుల్లా బతికాం. మనుషులుగా బతకా ల్సిన సమయం వచ్చింది.’’ ఆయన ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత రూప కల్పన చేసిన రాజకీయాల్లో మూడు అంశాలు కొట్టవచ్చిట్టు కనిపించేవి. ఒకటి, అస్పష్టంగానైనా వేర్పాటువాది అనిపించిన వారెవరైనా వారిని ఆయన దూరంగా ఉంచేవారు. రెండు, తన కుటుంబ జాతీయవాద, సైనిక వారసత్వాన్ని పదే పదే ఏకరువు పెడుతుండేవారు. అంతేకాదు, తన ప్రచా రాన్ని కూడా సైనిక పద్ధతుల్లోనే నిర్వహించేవారు: ప్రింటింగ్ బ్రిగేడ్, పాంప్లెట్ బ్రిగేడ్, దళిత బస్తీల్లో డబ్బాలు పట్టుకుని చందాలు సేకరించే బిచ్చగాళ్ల బ్రిగేడ్లను నిర్మించేవారు. వాళ్లిచ్చే డబ్బు ఎంత అని కాదు. ‘‘ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒకసారి ఒక రూపాయి ఇచ్చాడంటే, కాంగ్రెస్ వెయ్యి రూపాయలిచ్చినా దానికి ఓటు వేయడు’’ అనేవారు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది. ఆయన తన శిబిరాన్ని సువిశాలంగా మార్చారు. బహుజన సమాజ్ అనే నిర్వచనంతో ఇతర వర్గాలన్నిటినీ ఆకర్షించడానికి ప్రయత్నిం చారు. అలాగే ఆయన ఓట్లు మావి, అధికారం మీదా/ ఇక చెల్లదు, ఇక చెల్లదు అనే నినాదాన్ని తయారుచేశారు. తర్వాతి కాలంలో అధికారంలోకి రావడా నికి ముస్లింలను, కొన్ని ఉన్నత కులాలను కూడా కలుపుకుపోవాలని ఆయన, మాయావతి గుర్తించారు. అదే వారిని అధికారంలోకి తెచ్చింది. ఓడినా మాయావతిని ఇంకా ప్రబల శక్తిగా నిలిపింది. దళిత కౌటిల్యునిగా కాన్షీరాం తన మేధస్సుతో మాయావతిని తన చంద్రగుప్తునిగా తయారుచేశారు. మెవానీకి అలాంటి నైపుణ్యం, ప్రతిభ, తదేక దృష్టి ఉన్నాయా? చెప్పడం కష్టమే. కానీ, బీజేపీ, హిందూ ఉన్నత వర్గాలకు చెందిన మితవాదశక్తులూ ఆయన గురించి ఆందో ళన చెందడమే ఆ విషయాన్ని విశదం చేస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఆ ఆగ్రహమే రేపటి వ్యూహం
మోదీలోని ఉద్వేగం కట్టలు తెంచుకోవడంలో ముప్పు తప్పిందన్న ఊరటతో పాటూ ఆగ్రహం కూడా ఉంది. ఈ ఆగ్రహమే ఆయన భావి రాజకీయాలను నిర్వచిస్తుంది. బీజేపీ ఇక అనుసరించనున్న రాజకీయాలకు మతం, జాతీయవాదం, అవినీతి అనేవి మూడూ చోదక శక్తులుగా ఉంటాయి. అయితే వృద్ధి, ఉద్యోగాలు, మంచి రోజులు నినాదాలు అప్పు డప్పుడూ వినిపిస్తాయి. అయితే అవి తర్వాత పుట్టుకొచ్చిన యోచనలుగానే ఉంటాయి. గుజరాత్ ఎన్నికల తర్వాత కళ్లల్లో నీరుబికిన మోదీ మోమును చూస్తే అనిపించినది అదే. ఈ ఏడాదిని గుర్తుండిపోయేలా చేసే రాజకీయ చిత్రం ఏది? ఎంచుకోడానికి మనకు చాలానే ఉన్నాయి: గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రధాని విజయ సంకేతంగా రెండు వేళ్లను చూపడం; గాంధీ టోపీ పెట్టుకున్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేస్తుండటం; నూతన దళిత రాష్ట్రపతి; విజయో త్సాహంతో ఉన్న అమరీందర్‌సింగ్; ఈవీఎంలను తప్పుపడుతున్న కేజ్రీ వాల్; బీజేపీలో ప్రముఖనేతగా ఎదుగుతున్న నేత యోగి ఆదిత్యనాథ్ నోయిడా మూఢ నమ్మకాన్ని వమ్ముచేస్తూ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావడం (నోయిడాను సందర్శిస్తే ఓడిపోతామనే రాజకీయ మూఢ నమ్మకం ఉంది). లేకపోతే, మీరు సంక్లిష్టతలను ఇష్టపడేట్టయితే నితీశ్ కుమార్ బీజేపీ, ఎన్డీఏలకు చెందిన ఇతర ముఖ్యమంత్రులతో కలసి విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడాన్ని ఎంచుకోవచ్చు. మోదీని ఆయన తన ప్రమాణస్వీకారానికి హాజరు కావడానికి అనుమతించనిది ఈ దశాబ్దంలోనే. కావాలంటే మీరు లాలూప్రసాద్ యాదవ్ తిరిగి జైలుకు వెళ్లడా న్నయినా ఎంచుకోవచ్చు. భవిష్యత్తును ఆవిష్కరించనున్న చిత్రం అదే కానీ నేను ఎంచుకునే రాజకీయ చిత్రం వీటిలో ఏదీ కాదు. గుజరాత్లో గెలి చాక జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఉద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టిన దృశ్యం. అది, 2017 రాజకీయ ముఖ చిత్రాన్నేకాదు 2018 రాజకీయాలను కూడా నిర్వచిస్తుంది, 2019 ఎన్నికల సమరానికి కథనాన్ని సమకూరుస్తుంది. నిజ ఉద్వేగాలను లోలోపలే దాచుకో గల సామర్థ్యం మరెవరికన్నా ఎక్కువగా ప్రధానికే ఉంది. ఆయన బహిరం గంగా కనిపించేటప్పుడు ముందస్తుగానే, జాగ్రత్తగా ఎంచుకున్న విధంగా తన ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. కానీ ఇలా ఉద్వేగం కట్టలు తెంచుకో వడం మాత్రం సహజంగానే జరిగినట్టుంది. లేకపోతే, అణచుకోలేక కట్టలు తెగిన ఉద్వేగం అనవచ్చు. గుజరాత్ ఎన్నికల ప్రచారం మధ్యలో ఉండగా, గట్టి పోటీనే ఎదు ర్కోవాల్సి వస్తుందని అర్థమైంది. బీజేపీకి ఆధిక్యత లభించినా కొన్ని సీట్లు ప్రత్యర్థివైపు మొగ్గి ఉంటే అపారమైన నష్టం జరిగేదే. అది, కాంగ్రెస్‌ను పరివర్తనా దశలో ఉన్న పార్టీగా పునరుజ్జీవింపజేసి ఉండేది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఆకర్షించగల బలమైన శక్తిగా దాన్ని మార్చేది. ఏది ఎక్కువ లాభదాయకమనిపిస్తే వారితో చేరే బీజేపీ కొత్త మిత్రుడు నితీశ్ లాంటి వారు అది చూసి బెంబేలెత్తిపోయేవారు. అందువల్ల మోదీ ఉద్వేగం కట్టలు తెంచు కోవడం ఉపశమన భావంతో పాటూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసేది. ఈ ఆగ్రహమే ఆయన భావి రాజకీయాలను నిర్వచిస్తుంది. ఇరవై రెండేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ఆయన పార్టీవారు చెప్పుకోవచ్చుగానీ, ఆయన దాన్ని నమ్మేంత అవివేకి కారు. ఆయన ప్రధాని అయ్యాక మొదటిసారిగా గుజరాత్లో జరిగిన ఎన్నికలవి. కాబట్టి సంప్రదా యకమైన ప్రభుత్వ వ్యతిరేకత అంశం వాటికి వర్తించదు. ఆయన పార్టీ గుజరాత్ శాఖ మూడున్నరేళ్లపాటూ పరిస్థితులను చేజారిపోనిచ్చింది. ఒకరిని మించి మరొకరు అసమర్థులైన ఇద్దరు ముఖ్యమంత్రులను రాష్ట్రం చూసింది. కుల ప్రాతిపదికపై వెల్లువెత్తనున్న పెద్ద కుల ఉద్యమాలను ముందస్తుగా కనుగొనడంలో లేదా వాటిని అదుపులో ఉంచడంలో అక్కడి పార్టీ, ప్రభు త్వమూ విఫలమయ్యాయి. వ్యవసాయరంగంలోని ఆగ్రహం మోదీ ఎన్నడూ చూడని స్థాయికి చేరింది. సంప్రదాయకంగా కాంగ్రెస్ వారు సైతం ఆయనను గౌరవంగా చూసే రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేకంగా, దురుసుగా మాట్లాడే జనాకర్షణగల నేతల కొత్త తరం వృద్ధి చెందింది. విస్తీర్ణత రీత్యా గుజరాత్ మధ్యస్త స్థాయి రాష్ట్రం. అయినా దేశ ప్రధాని, బీజేపీ జాతీయ అధినేత గుజరాతీలే. ఆ పరిమాణం గల మరే రాష్ట్రమూ ఇంతవరకూ అలాంటి ఉన్నతిని చూడలేదు. అలాంటి రాష్ట్రంలోనే ఈ విపరిణామాలన్నీ జరిగాయి. ప్రధాన ఓటర్లలోనే అసంతృప్తి అందువల్లనే అది జాతీయ స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని నెరపగల రాష్ట్రం అయింది. తాను ప్రధాని అయ్యాక నాలుగవ ఏట గుజరాత్లో గెలుపు తమదేననే ధీమా మోదీకి కలగకపోతే, తన పార్టీ ఆ మాత్రం చేయలేకపోతే ఆయనకు అంత ఆగ్రహం కలగడం సరైనదే. అంతకన్నా మరింత లోతైన సమస్య ఏమిటో కూడా ఆయనకు తెలుసు. మొత్తంగా చూస్తే, అంతా సజా వుగానే ఉన్నదనే సెంటిమెంటును కలిగించగల దానికంటే తక్కువ స్థాయిల్లోనే ఆర్థిక వృద్ధి స్థిరంగా నిలచి ఉంటోంది. నిరుద్యోగులు కానున్న యువతీ యువకులు కూడా రైతుల్లాగే ఆగ్రహంతో ఉన్నారు. స్తబ్ధుగా నిలిచి పోయిన ఆర్థిక వ్యవస్థను హడావుడిగా బాగు చేయగల చిట్కా ఏదీ లేదు. వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా వృద్ధికి ఊపును తెద్దామని ఆశపడితే, అది కాస్తా బెడిసికొట్టి ప్రతికూలంగా మారింది. బాండ్లపై వచ్చే రాబడి ఇప్పటికి 12 వారాలుగా పెరుగుతూ పోతోంది. అంటే తక్కువ వడ్డీ రేట్లతో వృద్ధికి ఊపును కలిగించే అవకాశం దాటి పోయిందని అర్థం. ఇప్పుడిక వృద్ధి పుంజుకోవడం మొద లైనా, ఈ అంసతృప్తిని చల్లార్చడానికి సరిపడేటన్ని ఉద్యోగాలను కల్పించడా నికి సమయం బాగా మించి పోయింది. అసంతృప్తితో ఉన్న ఈ యువతనే మోదీ తన ప్రధాన ఓటర్లుగా భావిస్తున్నారు. మతం పేరిట ఐక్యం చేయాల్సిందే వచ్చే ఏడాది ఆయన ఆందోళనకరమైన ఈ సమస్యలతో అత్యవసర ప్రాతి పదికపై వ్యవహరించాలని ప్రయత్నిస్తారు. ఆ కృషే ఆయన రాజకీయాలను మలుస్తుంది. కొత్త కుల సమీకరణలను ఇలా వాడుకోవడం, గుజరాత్‌పై తన పట్టు సడలిపోవడమే చివరకు తనకు సవాలుగా పరిణమిస్తాయని కూడా ఆయనకు తెలుసు. ఈ పాక్షిక సాఫల్యతను సాధించిన ఈ ఎత్తుగడనే ప్రతి చోటా ఆయన ప్రత్యర్థులు ప్రయోగిస్తారు. కాబట్టి ఇప్పుడిక రాజకీయాలను నిర్వచించే వి గుజరాత్ ఎన్నికలే తప్ప, దానికి మూడింతలు పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కావు. గుజరాత్ అంటేనే పూర్తిగా మోదీ, షాలకు సంబంధించిన వ్యవహారమైనా అక్కడ పోటాపోటీగా పోరాడాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అప్రతిష్టపాలైన, అధికారంలో ఉన్న ప్రత్యర్థులతో త్రిముఖ పోటీలో బరిలోకి దిగింది. పైగా గుజరాత్ వారి సొంత రాష్ట్రం. దీనిపై ఆధారపడే మోదీ 2019 ఎన్నికలు సమీపించేసరికి నిర్ణయాలను తీసుకుంటారు. ఆలోగా పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. కుల ప్రాతిప దికపై చీలిపోయి ఉన్నవారిని మీరు మతపరంగా తిరిగి ఒక్కటి చేయగలరా? అనేదే మన ఎన్నికల రాజకీయాల్లోని కేంద్ర సమస్య. గుజరాత్లో కాంగ్రెస్ జిగ్నేశ్, అల్పేశ్, హార్దిక్‌లతో కలసి సాధించిన కుల సమీకరణలతో దాదాపు విజయవంతమైంది. కాబట్టి, హిందుత్వ అనే కలిపివుంచే అంశంతో ఓటర్లను మరింతగా కేంద్రీకరింపజేయాలి. ఆ మూడు ముక్కల తోనే ఆట మూడు తలాక్‌ల బిల్లు ఈ దిశగా వేసిన తొలి ఎత్తు. దీనికి ప్రతిగా రాహుల్ గాంధీ దేవాలయాలను సందర్శించవచ్చునేమోగానీ ఈ బిల్లును వ్యతిరేకించి మైనారిటీలను సంతృప్తిపరస్తున్నారనే ఆరోపణను ఎదుర్కొనకుండా తప్పిం చుకోవాలంటే గొప్ప రాజకీయ మేథస్సు కావాలి. కర్నాటకలో టిప్పు సమస్య ఇలాంటి ఎత్తుగడ అవుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అలాంటి వాటిని మరిన్నిటిని కనిపెడతారు లేదా తామే కొత్తగా సృష్టిస్తారు. ‘వికాస్’ (అభివృద్ధి) నినాదంగా ఉంటే ఉద్యోగాలను కల్పించడానికి కృషి చేయాలని లేదా ఆ ప్రాతిపదికపైనే ఓట్లను రాబట్టుకోవాలని ఈపాటికి బీజేపీకి అర్థమై ఉంటుంది. అవినీతి వ్యతిరేక పోరాటం ఇంకా ఎన్నికల్లో ఉప యోగపడగలిగేదిగానే ఉంది. కాబట్టి చర్చను దానిపైకి మళ్లించవచ్చు. ప్రము ఖులుగా పేరున్నవారిపై మరిన్ని దాడులు జరగవచ్చు, కొన్ని పెద్ద కార్పొరేట్ దివాలాలను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. అయితే 2–జీ స్పెక్ట్రమ్ నిందితులను వదిలిపెట్టేయడంతో అవినీతి వ్యతిరేక పోరాటయో ధునిగా మోదీ ప్రతిష్ట తగ్గింది. ఇప్పుడు ఆదర్శ్ కేసును కూడా న్యాయప రంగా నీరుగార్చేస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా అవినీతి మకిలి అంటని వారుగా ఆయనకు, ఆయన పార్టీకి ఉన్న ప్రతిష్ట అలాగే ఉంది. ఇటీవల వెలువడ్డ ఆరోపణలు నిలిచేవి కావు. ‘‘అదానీ–అంబానీ సర్కార్’’ హేళనలు ట్వీట్లుగా పునరావృతమౌతాయే తప్ప ఓట్లను రాల్చవు. కాబట్టి అవినీతి వ్యతిరేక దాడులు తిరిగి మొదలు కాకపోవచ్చు కూడా. అవినీతి మంచి సమస్యే. కానీ రాజకీయాల్లో నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపేవి మాత్రం మతం, జాతీయవాదం. బోలెడంత జాతీయవాదాన్ని మనం చూడొచ్చు. సంక్షోభ పరిస్థితుల్లో దేశం ప్రభుత్వం వెనుక ఐక్యం అవు తుంది. దాని వైఫల్యాలు లేదా అసమర్థత లెక్కలోకి రావు. కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై ఉగ్రదాడుల తదుపరి కొన్ని నెలల్లోపల జరిగిన ఎన్నికల్లో వాజపేయి,మన్మోహన్సింగ్ ప్రభుత్వాలు పెద్ద మెజారిటీలను సాధించడం ఇటీవలి ఉదాహరణలు. తార్కికంగా చెప్పాలంటే, పాకిస్తాన్‌తో నెలకొన్న సంక్షోభ పరిస్థితి ఇంకా పెరగడాన్ని మీరు చూడవచ్చు. కాకపోతే ఓ సంక్లిష్ట సమస్య కూడా ఉంది. చైనా బుర్రలో ఏముందో, మంచు కరిగాక డోక్లాంలో అది ఏ ఎత్తుగడ వేయనున్నదో ఎవరికీ తెలియదు. సంక్షోభాన్ని అదుపు చేస్తూ, పరిమితం చేయగలుగుతున్నంత వరకూ, అది తీవ్ర పోరుగా పరి ణమించనంత వరకు ప్రభుత్వంలో ఉన్నవారికి మంచిదే. లేకపోతే చివరకు విజయం సాధించామని చెప్పుకోగలగాలి. కాబట్టి, దూకుడైన జాతీయవా దాన్ని ప్రయోగించడాన్ని, మనకున్న వ్యూహాత్మకమైన పరిమితులను సమ తూకం చేసుకురావడం మోదీ ప్రభుత్వానికి సవాలే అవుతుంది. బీజేపీ అనుసరించనున్న రాజకీయాలకు మతం, జాతీయవాదం, అవి నీతి అనేవి మూడూ చోదకÔ¶ క్తులుగా ఉంటాయి. అయితే వృద్ధి, ఉద్యోగాలు, మంచి రోజులు అనే నినాదాలు అప్పుడప్పుడూ కొన్నిసార్లు వినిపిస్తాయి. అయితే అవి కేవలం తర్వాత పుట్టుకొచ్చిన యోచనలుగానే ఉంటాయి. కళ్లల్లో నీరుబికిన మోదీ మొహం చిత్తరువును చూస్తే మాకు అనిపించినది అదే. దాన్ని బట్టే ఆయన మిగతా పదవీకాలాన్ని నిర్వచించాం. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఎన్నాళ్లీ సందిగ్ధావస్థ?
♦ జాతిహితం మోదీ యువకునిగా ఉన్నప్పటి నుంచి స్వయంసేవకునిగా పనిచేశారు. ఆ మితవాద పెంపకం ప్రభావం మటుమాయమయ్యేది కాదు. కానీ, ఆయన నేడు ప్రపంచాన్ని చూస్తు న్నారు, ప్రపంచ నేతలను కలుస్తున్నారు. ఎక్కువ విజయవంతమైన ఆర్థిక వ్యవస్థలు పని చేసే తీరును గమనిస్తున్నారు. ఇవి ఆయనలో నయా ఉదార వాద ఆదర్శాన్ని స్వీకరించాలనే కోరికను రేపుతున్నాయి. కానీ, సామాజిక–మతపరమైన మితవాదం, నయా ఉదారవాదం పరస్పర విరుద్ధమైనవి. మోదీ ఆర్థిక చింతన చిక్కుబడిపోయింది ఆ రాజకీయాల్లోనే. జోసెఫ్ హెల్లర్ నవల క్యాచ్–22 లోని హీరో లెఫ్టినెంట్ మైండర్బైండర్ తనతో తానే వ్యాపారం చేసి సుప్రసిద్ధుడయ్యాడు. అది, ఆ వ్యాపార లావా దేవీల చక్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చివరికి ప్రభుత్వ ఖజానా నుంచి లాభా లను ఆర్జించగలిగేలా చేసే పద్ధతి. ఇలాంటి పరిస్ధితి ఏదైనా, క్యాచ్–22 పరిస్థితిగా ప్రాచుర్యం పొందింది. సిండికేట్ అనే తన కంపెనీకి లాభం చేకూ రడం తప్ప మరేదీ మిలోకి çపట్టదు. సరిగ్గా ఆ కారణంగానే అతడు అత్యంత స్వార్థపూరితమైన పెట్టుబడిదారీ విధానానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అతగాడు, ఏదైనా ఒక వస్తువును, సాధారణంగా ఒక గ్రామంలోని మొత్తం గుడ్లు లేదా టమాటాలను అన్నింటిని తానే కొనేసి, తన కంపెనీకే చెందిన మరో విభాగానికి గుత్తాధిపత్య ధరకు (అత్యధిక) అమ్మేసేవాడు. ఒక్కసారి మాత్రమే, అతగాడు ప్రపంచంలో ఉన్న ఈజిప్షియన్ పత్తిని అంతటినీ కొనేసి చిక్కుల్లో పడ్డాడు. ఆ పత్తిని ఎవరో కొనేసి తనకే అమ్మినట్టు చేసినా, దాన్ని కొనేవారు ఎవరూ దొరకలేదు. దీంతో సృజనాత్మకమైన తెగిం పుతో పత్తి ఉండలను చాక్లెట్లో ముంచి, తోటి సైనికులకు అమ్మాలని సైతం ప్రయత్నించాడు. ఈజిప్షియన్ కాటన్ మార్కెట్‌కు గుత్త (ఏకైక) వ్యాపారిగా మారడం ద్వారా మిలోనే స్వయంగా ఆ పత్తికి మార్కెట్ లేకుండా చేశాడు. అయితే ఆ మేధావి ఈ పరిస్థితి నుంచి బయటపడే దారిని కూడా కని పెట్టాడు. ఆ పత్తిని తన ప్రభుత్వానికే ఎందుకు అమ్మకూడదు? పక్కా పెట్టు బడిదారునిగా అతగాడు ప్రభుత్వం వ్యాపార వ్యవహారాలలో తలదూర్చ కూడరాదని నమ్మినవాడే. అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ స్వేచ్ఛా విపణి సిద్ధాంతాలను నమ్మినవాడు. సరిగ్గా సమయానికి, కూలిడ్జ్ విసిరిన ఈ వ్యంగ్యోక్తి మిలోకి అనువుగా దొరికింది: ‘‘ప్రభుత్వం పని (బిజినెస్‌కు పని, వ్యాపారం తదితర అర్థాలున్నాయి) ‘పని’లో ఉండటమే!’’ కూలిడ్జ్ మన అధ్యక్షుడు, ఆయన చెప్పారంటే అది తప్పక సరైనదే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వ్యాపారంలోకి దిగాలి అని అతగాడు భాష్యం చెప్పాడు (కూలిడ్జ్ ఉద్దేశించని అర్థాన్నే లాగాడు). కాబట్టి, ఈ పత్తిని అమెరికా ప్రభుత్వానికే ఎందుకు అమ్మకూడదు? గత్యంతరం లేని చర్యే కానీ.. మిలో స్థానంలో 1969 తర్వాతి భారత సర్కార్‌ను, ఈజిప్షియన్ పత్తి స్థానంలో భారత బ్యాంకులను ఉంచుదాం. ఇప్పుడు ప్రదర్శితమౌతున్న ఆర్థిక విధానాలను చూడండి. దేశంలోని ప్రధాన బ్యాంకులన్నిటినీ ఇందిరా గాంధీ మొదట జాతీయం చేసేసారు. అభివృద్ధికి సంబంధించిన ద్రవ్య (ఫైనాన్స్) సంస్థలు (ఒకప్పటి ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐఎఫ్సీఐ తదితరాలు) అన్నీ ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. కాబట్టి బ్యాంకింగ్, ఫైనాన్స్ (ద్రవ్య) రంగాలలో ప్రభుత్వ గుత్తాధిపత్యం నెలకొంటుంది. ఇక ప్రభుత్వం తన నుంచి తానే కొనడం ప్రారంభిస్తుంది: ప్రభుత్వం, తను జారీ చేసిన సొంత బాండ్లపై బ్యాంకులు పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. తమ సొంత ప్రాజె క్టులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూలకు) రుణాలు ఇప్పిస్తుంది, రుణ మేళాలను నిర్వహించేలా చేస్తుంది. చివరకు రుణ మాఫీలు చేయి స్తుంది. కాబట్టి బ్యాంకులపై దాని గుత్తాధిపత్యం ఆచరణలో ఎదురేలేని ఓట్లను కొనే వ్యాపారం కూడా అవుతుంది. ఈ క్రమంలో బ్యాంకులు క్రమం తప్పకుండా కొంత కాల వ్యవధితో దివాలా తీయడం కొనసాగుతుంది. బ్యాంకులన్నీ ప్రభుత్వానివే కాబట్టి, అవి దివాలా తీయడాన్ని అనుమ తించడానికి వీల్లేదు. ప్రభుత్వం విఫలం కావడానికి వీల్లేనంతటి పెద్దది. దానికి పన్నులు విధించే, నోట్లు ముద్రించే అధికారం ఉంది. కాబట్టి, ప్రభుత్వం తన బ్యాంకులను తానే మళ్లీ కొంటుంది (రీకాపిటలైజేన్ లేదా కొత్త పెట్టుబడిని సమకూర్చడం). ద్రవ్యలోటు పరిస్థితి బాగా లేదని అనిపిం చకుండా ఈ వ్యవహారం బడ్జెట్‌తో సంబంధం లేకుండా సాగిపోయే పద్ధతీ ఉంది. మీరు మీ బ్యాంకుల చేత బాండ్లను జారీ చేయిం చవచ్చు. మీ ఇతర కంపెనీలైన ప్రభుత్వరంగ సంస్థల చేత, వాటి వద్ద ఉన్న మిగులు నగదుతో మీ బ్యాంకుల బాండ్లనే మీరు కొనిపించవచ్చు. ఇప్పుడు చెప్పండి, మన ప్రభుత్వం మిలో మైండర్బైండర్ కంటే తెలివైన పెట్టుబడి దారా, కాదా? మిలో ఆర్థికనీతి క్యాచ్–22 అయితే, భారత ప్రభుత్వ ఆర్థికనీతి క్యాచ్–23 (ఈ అతి తెలివిలో మన ప్రభుత్వం మిలో కంటే రెండాకులు ఎక్కువ చదివింది). తాజాగా ప్రభుత్వం ప్రకటించిన బెయిలవుట్ పథకాన్ని ప్రశంసించిన నేనే, దాన్ని క్యాచ్–23 అంటూ ఇలా ఎద్దేవా చేయడం ఎలా సమంజసమని ప్రశ్నించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైన పని అది ఒక్కటే. రోగి తీవ్రమైన ఉబ్బసపు పోటుకు గురై ఊపిరిసలపక మరణించే స్థితిలో ఉంటే, మీరే డాక్టరైతే ఏం చేస్తారు? స్టెరాయిడ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను పట్టిం చుకోకుండా, రోగి శరీరంలోకి వాటిని ఎక్కించడం తప్ప ఏం చెయ్యగలరు? దేశ బ్యాంకింగ్ పరిశ్రమలో 70 శాతం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్న పరిస్థితిలో, అవి దాదాపుగా దివాలా తీసే స్థితిలో అవి కుప్పకూలడం అనివార్యంగా కనిపిస్తున్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలిపోనిచ్చి, ఆ శిథిలాలను ఏరుకుంటారా? ఏదైనా చేయక తప్పని పరిస్థితిలో బెయిలవుట్ నిర్మయాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయం. అంతేకాదు, కొంత సృజనాత్మకమైనది అని కూడా జోడించనివ్వండి. భారీ ఎత్తున నిధులను సమకూర్చుకోడానికి బాండ్లను జారీ చేయాలనేది తెలివైన యోచనే. కానీ, భారీ నగదు నిల్వలున్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఆ బాండ్లను కొనాలని సంకేతం ఇవ్వాలనే సూచనే ఆందోళనకరమైనది. సంస్కర్తగా గుర్తుండిపోవాలని అనుకుంటున్నారా? ఇంతకంటే సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన, సంస్కరణవాద చర్యలు కూడా ఎంచుకోడానికి ఉన్నాయి. గొప్ప నాయకులు సంక్షోభాన్ని ఎప్పుడూ వృథా చేసుకోరు. కానీ మోదీ అలాంటి అవకాశాన్ని చేజార్చు కున్నారు. ఇందిరా గాంధీ నుంచి సంక్రమించిన ఆర్థిక వారసత్వంలోకెల్లా అత్యంత అధ్వానమైన ది బ్యాంకుల జాతీయకరణ. దాన్ని పూర్తిగా వెనక్కు మరల్చాలనడం అసమంజసం. అయినా, ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిన చిన్న ప్రభుత్వరంగ సంస్థలను, కేవలం రెండింటిని అమ్మేయడం ద్వారా ఆయన ఆ ప్రక్రియకు నాంది పలకాల్సింది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ఏడాదికి ఒకటిగా అమ్మేస్తామని ప్రకటించాల్సింది. అది మార్కెట్లను మెరుపు వేగంతో స్పందించేలా ప్రభావితం చేసేది. ఇతర బ్యాంకులకు, అవి మెరుగ్గా నడుచుకునేలా చేసే, ఓట్లను కొనుక్కోవడానికి ప్రభుత్వ ఖజానా చెక్కులను రాసే రాజకీయ వర్గం నిగ్రహం చూపేలా చేసే పెద్ద కుదుపై ఉండేది. మోదీ పేరు గొప్ప సంస్కర్తల సరసన నిలిచే లా చేసేది. కానీ మోదీ, తాను ఆర్థిక సంస్కర్తగా గుర్తుండిపోవాలని నిజంగానే కోరు కుంటున్నారా? ప్రభుత్వరంగ సంస్థలను సక్రమంగా నడపడానికి కట్టుబ డటం లేదా ప్రభుత్వం వ్యాపార లావాదేవీలను జరపడం సంస్కరణలకు ఒక ముఖ్యమైన గీటురాయే తప్ప, ఏకైక గీటురాయి కాదు. మన్మోహన్సింగ్, పీవీ నరసింహారావు, పీ చిదంబరం సహా ఏ జాతీయ నేతా ప్రభుత్వరంగ సంస్థ లను, ప్రత్యేకించి లాభాలను ఆర్జిస్తున్న వాటిని అమ్మే సాహసానికి ఒడిగట్ట లేదు. స్వాభావికంగానే అలాంటి నిబద్ధత ఉన్న ఏకైక నేత అటల్ బిహారీ వాజ్‌పేయి. రెండు భారీ చమురు సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన ప్రయత్నించారు. కానీ ఒక సుప్రీం కోర్టు ఆదేశం.. పార్లమెంటు ఆమోదం లేనిదే ఆ పని చేయరాదని అడ్డుకుంది. మోదీ, వాజపేయి చూపిన మార్గాన వెళతారని ఆశించి ఉండొచ్చు. కానీ, ఆయన చేస్తున్నది ఏమిటి? హెచ్‌పీసీఎల్‌ను అమ్ముతున్నారు. కానీ దాన్ని అమ్ముతున్నది సొంత ఓఎన్‌జీసీకే. మరోసారి ఇప్పుడు ప్రభుత్వ ధనంతో... మిలో, మిలోతేనే వ్యాపారం చేయడం జరుగుతుంది. అదే క్యాచ్–23. పొసగని వైరుధ్యంతోనే తంటా 1991 నుంచి చాలా వరకు సంస్కరణలు దొడ్డిదారిన అమలుచేస్తూ వచ్చారు, కానీ నేడు ప్రతిదీ ప్రజల కళ్ల ముందే జరుగుతోందని, వాటి రాజకీయ పర్యవసానాలు ఉంటాయని మోదీ మద్దతుదార్లు అనవచ్చు. ప్రజాభిప్రా యాన్ని సానుకూలంగా మల^èడానికి మోదీని మించిన శక్తిసామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? అందువలన, ఆయన ఎందుకు చేయడం లేదు? అసలు ఆయన అలా చేయాలనుకుంటున్నారా? లేకపోతే, ఆయన చేయాలనుకుంటు న్నది సరిగ్గా ఏమిటి? వాటికి సమాధానాలు రాజకీయాల్లో ఉన్నాయి. వాజ్ పేయికి భిన్నంగా, మోదీ నిబద్ధతగల స్వయంసేవకుడు, ఆయనలా పాత ఆర్ఎస్ఎస్ సామా జిక–ఆర్థిక నీతి బాల్యావస్థను చూసి నవ్విపారేసేవారూ కారు. ఆ భావజా లంలో నిజమైన విశ్వాసం ఉన్నవారు. తాను మోహన్ భాగవత్ వంటి స్వయం సేవకుడిననే భావన జీర్ణించుకుపోయిన వారు. వాజ్ పేయిలాగా ఆధునిక సంస్కర్తగా గుర్తుండిపోవాలని కూడా అనుకుంటు న్నారు. ఈ రెండింటి మధ్యా ఆయన చివరకు మరో ఇందిరా గాంధీగా, మరో గొప్ప ప్రభుత్వ నిర్ణాయకవాదిగా మిగిలిపోతారు. గొప్ప ఆర్థిక జాతీయవాది మోదీ.. నియంత్రణల పట్ల వ్యామోçహం విస్తరిస్తున్న, పెరుగుతున్న ప్రభు త్వానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన మదిలోని రాజకీయ–ఆర్థిక చింతన ఇది కావచ్చు: మనం ప్రభుత్వాన్ని వివేకవంతంగా, నిజాయితీగా నడుపుతు న్నంత కాలమూ... అది ఆర్థిక వ్యవస్థను నడపడంలో ఎలాంటి తప్పూ లేదు. లోపరహితమైన రాజ్యం కోసం జరిపే అన్వేషణ ఎన్నడూ సఫలం కాలేదు. ఇప్పుడూ జరగపోవచ్చు. మోదీ యువకునిగా ఉన్నప్పటి నుంచి స్వయంసేవకునిగా పనిచేశారు. ఆ మితవాద పెంపకం ప్రభావం ఆవిరి అయిపోయేది కాదు. కానీ, ఆయన నేడు ప్రపంచాన్ని చూస్తున్నారు, ప్రపంచ నేతలను కలుస్తున్నారు, ఎక్కువ విజయవంతమైన ఆర్థిక వ్యవస్థలు పనిచేసే తీరు కూడా ఆయనలో నయా ఉదారవాద ఆదర్శాన్ని స్వీకరించాలనే కోరికను రేపుతోంది. కానీ, సామా జిక–మతపరమైన మితవాదం, నయా ఉదారవాదం అనే ఈ రెండు శక్తులూ పరస్పర విరుద్ధమైనవి. అవి సహజీవనం చేయలేవు. మోదీ ఆర్థికచింతన చిక్కుబడిపోయింది ఆ రాజకీయాల్లోనే. ఆయన సందిగ్ధాన్ని ఏమని పిల వాలి? క్యాచ్–24 రాజకీయాలు అని పిలవాలని నా సూచన. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
హితబోధలు వద్దు దాదా!
♦ జాతిహితం మన రాజకీయాలకు ‘భీష్మ పితామహుడు’ ప్రణబ్ ముఖర్జీ జ్ఞాపకాలు 1984 తర్వాతి మన రాజకీయ చరిత్రకు సంబంధించి విలువైనవి. మన∙రాజకీయాలను, పరిపాలనాపరమైన స్థితిగతులను కళ్లకు కడతాయి. అయితే హానికరమైన లోపాలతో కూడినవి. అవి చెప్పిన దానికంటే దాచిపెట్టినదే ఎక్కువ. అధికార యంత్రాంగపు సంకేతాత్మకత, నిగూఢత, సూచనాపరత్వంతో తరచుగా ఆయన తన జ్ఞాపకాలను చెబుతారు. అంతేగానీ కీలకమైన మలుపులు వేటినీ సవివరంగా విశదీకరించడం కనబడదు. ప్రణబ్ ముఖర్జీతో వాదనకు దిగ సాహసించిన వారెవరూ నెగ్గింది లేదని ఆయన ఐదు దశాబ్దాల ప్రజా జీవిత చరిత్ర చెబుతుంది. ఆయన ఎన్నడూ ఓటమిని అంగీకరించకపోవడమే అందుకు కారణం. రాజకీయ చరిత్ర, దాని పరిణామం, రాజ్యాంగపరమైన సూక్ష్మభేదాలలో ఆయనకున్న జ్ఞానం పరి పాలనకు సంబంధించి అద్భుతమైన విషయం. ఆయన నెలకొల్పిన ‘‘ఉదా హరణ’’ చెప్పుకోదగినది. ఐదు దశాబ్దాలుగా ఆయన ఏర్పరచుకున్న సంబం ధాలు, సంపాదించుకున్న మంచి పేరు మాత్రమే దానికి సాటి. ఇవన్నీ పూర్తిగా తెలిసే నేను ఆయన తాజా పుస్తకం ద కొయలిషన్ ఇయర్స్ గురించి రాస్తున్నాను. గ్రంథస్తం చేసిన ఆయన రాజకీయ జ్ఞాపకాలకు సంబంధించి ముఖ్యమైనది... ఆయన వాటిని రాత పూర్వకంగా ఉంచడమే. మన దేశంలో ప్రజా జీవితంలోని ప్రముఖులు పుస్తకాలను రాసే సాంప్రదాయం మనకు లేదు. అతి ఎక్కువగా సాహిత్య వ్యాసంగం సాగించిన నెహ్రూ సైతం అధికా రంలోకి రాక ముందే రాశారు. అధికారంలో ఉండగానే మరణించారు. అప్పటి నుంచి మన అగ్రనేతలలో ఏ ఒక్కరూ కలం, కాగితం పట్టింది లేదు. పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్ అందుకు మినహాయింపు. కొందరికి వయసు పైబడటంతో రాయడానికి సమయం, శక్తి మిగిలలేదు. కొందరికి అందుకు కావల్సిన పాండిత్యం, నోట్సు, లేదా చెప్పాల్సినంతటి కథనమూ లేదు. ఆ మూడూ ఉన్నవారు మన్మోహన్సింగ్, కనీసం ఇప్పటికైతే ఆయన ఆ పని జోలికి పోదలుచుకున్నట్టు లేదు. మన ప్రజా జీవితంలోని ప్రముఖులలో చాలామంది... తామో లేక తమ పిల్లలో వారసత్వపరమైన రాజకీయ వృత్తి పోటీలో ఇంకా బరిలో ఉండటమే అందుకు కారణం. విలువైనవే కానీ... అందువల్ల ప్రణబ్‌దా లేదా దాదా ఇంత సాహిత్యాన్ని సృష్టించడం గొప్ప విషయమే. ఇప్పటికే ఆయన మూడు సంపుటాలను వెలువరించారు, తను రాష్ట్రపతిగా ఉన్న కాలానికి సంబంధించిన జ్ఞాపకాల నాలుగో సంపుటì వచ్చే ఏడాది వెలువడవచ్చు. మన రాజకీయ చరిత్రకు, ప్రత్యేకించి 1984 తదుపరి కాలపు రాజకీయ చరిత్రకు సంబంధించి ఇవి విలువైనవి. ఘటనల కాలానుక్ర మణ, వాటికి సంబంధించిన ఆధారాలను సూచించడంలో ఆయన చూపిన శ్రద్ధ అనితర సాధ్యమైనది. కాబట్టే ఆయన జ్ఞాపకాలుæ భారత రాజకీయాలు, పరిపాలనాపర మైన స్థితిగతులకు సంబంధించి ఎవరికైనా అమూల్యమైనవే. అయితే ఈ జ్ఞాపకాలు హానికరమైన లోపాలతో కూడినవి. అవి చెప్పిన దాని కంటే దాచి పెట్టినదే ఎక్కువ. అధికార యంత్రాంగపు సంకేతాత్మకత, నిగూ ఢత, సూచనాపరత్వంతో ఆయన తరచుగా తన జ్ఞాపకాలను చెబుతారు. అంతేగానీ కీలకమైన మలుపులను సవివరంగా విశదీకరించడం కనబడదు. మొదటి రెండు సంపుటాలు ఆయన ఇంకా రాష్ట్రపతి భవన్లో ఉండగా వెలువడినవి. కాబట్టి అవి ఇలా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. అత్యున్న తమైన ఆ లాంఛనప్రాయపు పదవి ‘‘మర్యాద’’ లేదా ప్రమాణాలు... కొన్ని సున్నితమైన అంశాలను దాటవేయడానికి లేదా సూచనాత్మకంగా చెప్పడానికి సమర్థన అయింది. ఇందిర వారసునిగా తన స్థానంలో రాజీవ్‌ను ఎంపిక చేయడానికి దారితీసిన వంచనాత్మక మంత్రాంగాన్ని అద్భుతమైన రీతిలో సున్నితంగా అభివర్ణించడం ఇందుకు మంచి ఉదాహరణ. అయితే ఈ మూడో సంపుటిలో చెప్పుకోడానికి ఆ సాకు దొరకదు. ఇది, ఆయనతో మన కున్న పేచీల్లో మొదటిది, ఎక్కువ మృదువైనది. మూడో సంపుటిని ఆయన యూపీఏ దశాబ్ద కాలంలోని చాలా వివాదాస్పద విషయాలపై స్వీయ సమ ర్థనకు, తన సహచరులు కొందరిని తప్పుపట్టడానికి, వారిపై మర్మగర్భిత మైన వ్యంగ్యోక్తులు విసరడానికి వాడుకున్నారు. అదే ఆయనతో మనకున్న పెద్ద పేచీ. ఇంతకంటే ఎక్కువ స్పష్టతను, నిష్కపటత్వాన్ని మనం ఆశిస్తాం. ఏ కీలక మలుపునూ వివరించరెందుకు? యూపీఏ పదేళ్ల పాలనలో ప్రణా»Œ దా ప్రమేయం ఉన్న మలుపుల జాబితాను ఎంపిక చేసి ఇక్కడ ఇస్తున్నాను. ప్రణబ్‌దా ఈ విషయాల్లో మరింత స్పష్టతను ఇవ్వాలని కోరుకుంటాం: సోనియా, ఆయన కంటే మన్మోహన్ సింగే మెరు గని ఎందుకు ఎంచుకున్నారు? ఆ పరిస్థితిని ఆయన ఎలా నిభాయించుకు న్నారు? మొదటి దఫా ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖను ఎందుకు వద్ద న్నారు? ఐదేళ్ల తర్వాత అదే శాఖను ఎందుకు అంగీకరించారు? ఆ శాఖ వ్యవ హారాలను అంతగా ఎందుకు గందరగోళపరచారు? రాష్ట్రపతి పదవికి సోనియా, హమీద్ అన్సారీని ఎంపిక చేయాలనుకున్నా, తననే ఆ పదవికి నామినేట్ చేయక గత్యంతరం లేని స్థితి కలిగేలా ఎలా చక్రం తిప్పారు? రెట్రా స్పెక్టివ్ ట్యాక్స్ (వర్తిస్తుందని భావించే ముందటి తేదీ నుంచి వసూలు చేసే పన్ను) సవరణ లాంటి విషపూరితమైన వారసత్వాన్ని ఆర్థికశాఖకు వదిలి వెళ్ల డాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు? వీటిలో ప్రతి ఒక్కదాన్నీ ఆయన చర్చించారు కానీ చాలా వరకు వాటి అంచుల్లోనే తారాడారు. 2004లో ఆర్థిక శాఖను వద్దనడానికి కారణం ‘‘ఆర్థిక సమస్యలపై తానూ, మన్మోహస్ సింగ్ భిన్నాభిప్రాయాలను కలిగి ఉండటమే’’నని చెప్పినప్పుడు, తర్వాత ఎలా ఆమోదించారు? మన్మోహన్ కంటే, అంతకు మించి చిదంబరం కంటే తన ఆర్థిక దృక్పథం ఎంత ఎక్కువ భిన్నమైనదో చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి. ఈ సందర్భంలో ఆయన అత్యంత స్పష్టతను కనబరచారు. చిదంబరానికి సంబంధించిన విభాగంలో ఆర్థిక వ్యవస్థపై ఆయనతో తాను ఎలా విభేదించారో వివరంగా చెప్పారు. ‘‘మితవాదిగా నేను, సంస్కరణలు నిరంతరం కొనసాగాల్సిన క్రమ మని విశ్వసించాను. ఆర్థిక వ్యవస్థ– నియంత్రణల వ్యవస్థ పరివర్తన సమ్మిళిత మైనదిగా, క్రమక్రమంగా సాగాలని కోరుకున్నాను. కాగా ఆయన ఉదార వాద అనుకూల, మార్కెట్ అనుకూల ఆర్థికశాస్త్రవేత్త.’’ వోడాఫోన్ కేసులో రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్‌కు చేసిన సవరణను ప్రణబ్ ఈ వైరుధ్యానికి ‘‘మంచి ఉదారణ’’ అన్నారు. మరోచోట, 1997 నాటి చిదంబరం ‘‘డ్రీమ్’’ బడ్జెట్‌పై ఆయన్ను చీల్చి చెండారు. అయితే ఇచ్చిన గణాంకాలన్నీ తప్పు. ఆర్థికమంత్రిగా ఆయన పని చేసిన కాలం అత్యంత ఘోర వైఫల్యాలతో కూడినది. వృద్ధి స్తంభించిపోయింది, తర్వాత క్షీణించింది, అప్పటి నుంచి నిజంగా కోలుకోనే లేదు. ఆయన ప్రారంభించిన లేదా అనుసరించిన కొత్త పథకాలన్నీ అసంపూర్తిగానే మిగిలాయి. ‘‘తనపై రుద్దిన’’ నాటి ఆర్బీఐ గవర్నర్ డీ సుబ్బారావుతో తనకున్న విభేదాలు తీవ్రమైనవనే వాస్తవాన్ని ఆయన దాచలేదు. ప్రణబ్ ఆర్థికశాఖలోనే ఒక అత్యున్నత నియంత్రణ వ్యవ స్థను సృష్టించాలని కోరుకున్నారు. తద్వారా భారత ద్రవ్య వ్యవస్థలో, ఆర్థిక నియంత్రణ సంస్థలలో బలాబలాల సమతూకంలో మార్పును తేవాలను కు న్నారు. ఆయన కథనం ప్రకారమే మన్మోహన్ దీనితో విభేదించారు. ఆ కాలం నాటి కీలక ఘటనల గురించి మాట్లాడకుండా ఆయన దాట వేశారు. వాటిలోకెల్లా ముఖ్యమైనవి కుంభకోణాలు, 2జీ కుంభకోణం విష యంలో తన కార్యాలయానికి, ప్రధాని కార్యాలయానికి మధ్య జరిగిన హాస్యస్ఫోరక ఘటనలు. బాబా రామ్‌దేవ్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో కలుసు కుని, ఇతర మంత్రుల సమక్షంలో నల్లధనం గురించి ఒప్పందాన్ని కుదుర్చు కోవడం ఆర్థికమంత్రిగా ఆయన వేసిన అతి పెద్ద తప్పుటడుగు. అయినా 278 పేజీల పుస్తకాన్ని రామ్‌దేవ్ బాబా పేరును ప్రస్తావించకుండా రాయడం నమ్మశక్యం కానిది. ఈ విషయంలో ఆయన మన్మోహన్ని లేదా చిదంబరాన్ని తప్పు పట్టలేరు. ఈ కథనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ప్రణబ్ రాజకీయ జీవితం చూడటానికి పైకి గొప్పగా సఫలమైనదిగా అనిపించినా, వాస్తవంగా అందుకు పూర్తి భిన్నమైనదిగా కనిపిస్తుంది. తనకు న్యాయంగా ఇవ్వాల్సిన పదవిని చాలా సార్లు నిరాకరించారని ఆయన భావిస్తారు. ఇందిర హత్య తర్వాత గాంధీ కుటుంబంలో అంతర్గతంగా చక్రం తిప్పేవారూ, తిరిగి 2004లో సోనియా ప్రధాని మంత్రి పదవిని నిరాకరించారని ఆయన అభి ప్రాయం. కానీ హోంశాఖను అప్పగించడానికి సైతం ఆమె ఆయనను విశ్వ సించలేదు. ఆమె ఆ తర్వాత 2007లో రాష్ట్రపతి పదవినీ నిరాకరించారు. 2012లో కూడా దాదాపు అంత పని చేశారు. అయినా దాదా వీటిలో దేన్నీ స్పష్టంగా చెప్పలేదు. అయితే దాదా కూడా ఒక మనిషేనని తెలిపే ఒక మాణిక్యం దీనిలో దాగి ఉంది. 2012 జూన్ 2న సోనియాతో జరిపిన భేటీ నుంచి వెళుతుండగా ఆయనకు.. ఆమె మన్మోహన్‌సింగ్‌కు రాష్ట్రపతి పదవి కట్టబెట్టి, తనను ప్రధానిని చేస్తారనే ‘‘అస్పష్ట అభిప్రాయం’’ కలిగింది. కానీ ప్రణబ్ ‘‘లోక్‌సభలో కాస్త మానసిక స్వస్థతను పునరుద్ధరించ’’మని సుష్మా స్వరాజ్‌ను చీవాట్లు పెట్టాక... సోనియా ‘‘ఇందుకే మీరు రాష్ట్రపతి కాలేరు’’ అంటూ మరింత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వైఫల్యాలకే గర్విస్తారా? ఈ పుస్తకంలో అక్కడక్కడా పాతిపెట్టిన బంగారు కణికలున్నాయి. ఎమ్జే ఆక్బర్ ‘‘నా రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి మరింత గట్టిగా కృషి చేçస్తున్నారు’’ (బీజేపీలోనే) అని పేర్కొన్నారు. మద్దతు కోసం బీజేపీతో మంత నాలు సాగిస్తున్న సంగతిని తన పార్టీకి చెప్పారో లేదో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తను మద్దతు కోసం బాలాసాహెబ్ ఠాక్రేను కలుసుకున్నందుకు సోనియా ఎంత పట్టలేని ఆగ్రహాన్ని ప్రదర్శించారో ప్రణబ్æ చెప్పారు. దాన్ని బట్టి బీజేపీ మద్దతును కోరడం పట్ల ఆమె ఎలా ప్రతిస్పందించేవారో ఊహించుకోవచ్చు. దాదా నిలకడగా హితబోధను చేస్తూ, పదే పదే తనను తాను ‘‘పార్టీ నిర్మా ణపు మనిషిని’’ అని అభివర్ణించుకున్నారు. కాబట్టి 2012 నాటి ఆయన ప్రవ ర్తన పూర్తిగా కాం్రVð స్ తరహాదేనా? అని అడగడం సమంజసమే. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ సవరణను తేవడం చిరకాలం నిలిచిపోయే దుర దృష్టకరమైన ప్రతికూలాత్మక వారసత్వం. అయినా ఐదేళ్లుగా ఏ ఆర్థికమంత్రీ ఆ సవరణను వెనక్కు మళ్లించలేకపోయారని గర్వంగా చెబుతారు. పాత ప్రభుత్వ నియంత్రణవాదం తప్ప, ఈ చర్య వల్ల అంతా నష్టపోయిన వారే. తాను ‘‘నియంత్రణాయుత వ్యవస్థ’’ను కోరుకుంటానని మనకు తగినంతగా ముందుగా ఆయన చెప్పారా? మన్మోహన్ 1991లోనే బద్ధలు కొట్టిన వ్యవ స్థనే ఆయన ప్రధాని ఉండగా సృష్టించాలని ప్రణబ్ ఎందుకు ప్రయత్నించి నట్టు? అది చెప్పాలంటే మనకు మరింత తక్కువ పక్షపాతి అయిన జీవిత చరిత్రకారుడు కావాలి. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రాజకీయాల దిశ మారుతోందా?
జాతిహితం దేశంలోని రాజకీయాల దిశ ఇంకా మారలేదు. కానీ, ఏదో జరుగుతోందన్న భావన మాత్రం బలంగా వ్యాపిస్తోంది. 2013 తర్వాత మొదటిసారిగా మోదీ ఎదురొడ్డి పోరాడాల్సి వస్తోంది. ప్రతిపక్షాల పరిస్థితిని చూసి ప్రభుత్వం ఊరట చెందుతోంది. కానీ, ప్రజల ఆగ్ర హానికి గురైనప్పుడు ఎంతటి జనాదరణగల నేతకైనా పతనం తప్పదని మనకు తెలుసు. ప్రభుత్వం తన జనసమ్మోహన శక్తిని తిరిగి సంపాదించాలంటే మరింత ఆకర్షణీయమైన ఆర్థిక గణాంకాలను చూపాలి. అవి తమ పాలనకు సంబంధించిన గణాంకాలై ఉండాలి. ఇటీవల తరచుగా సంభాషణలు మొదలయ్యే తీరులో కొత్త పద్ధతి కనిపి స్తోంది. ప్రత్యేకించి వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు ఉన్నప్పుడు సాగే సంభాషణల్లో అది వ్యక్తమౌతోంది. ఎవరో ఒకరు మిమ్మల్ని ఓ మూలన ఏకాంతంగా ఉండే చోటుకు తీసుకుపోయి ‘‘జనాంతికంగా (రహస్యంగా) మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా’’ అంటూ మొదలెడతారు. ‘‘నేను పాత్రికే యుణ్ణి, నేను మాట్లాడేదెప్పుడూ జనాంతికంగా ఉండదు సార్. కాబట్టి ఏం అడిగినా బహిరంగంగానే అడగండి’’ అంటాను నేను. ‘‘కాదండి, మీరు చెప్పేది సరే, కానీ ఇది చాలా సున్నితమైన ప్రశ్న కాబట్టి దయచేసి జనాం తికంగానే ఉంచండి’’ అంటూ మాట్లాడేవారు ప్రాధేయపడతారు. సంభాషణ ఈ పద్ధతిలో కొంత సేపు సాగాక, మీతో మాట్లాడే వ్యక్తే వెర్రిమొహం వేసుకుని భయంభయంగా ఆ చిక్కుముడిని విప్పుతాడు. జనాంతికంగా మాట్లాడాలనుకుంటున్నది తానేనని ఒప్పుకుంటాడు. తానీ ప్రశ్న అడిగినట్టుగా ఎవరికీ తెలియకూడదని ఆయన అనుకుంటారు. అలా అని మాటిచ్చాక, ప్రశ్న బయట పడుతుంది. ‘‘మీరేం అనుకుంటున్నారు, గాలి వీచే దిశ మారుతోందా?’’ ఆయన ప్రస్తావించేది ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న జనాదరణ గురించి. నేనిక్కడ రాస్తున్నట్టుగానే సరళంగా ‘నేను అలా అనుకోవడం లేదు’ అని ఆయ నతో నిజాయితీగా బహిరంగంగానే చెబుతాను. మీరు వింటున్నవి పదవీకాలం మధ్యలో సాధారణంగా వినవచ్చే చప్పుళ్లే. అయితే ఎట్టకేలకు, ఈ ప్రభుత్వం ఆ మధ్యస్త కాలాన్ని దాటి పోయాక ఇప్పుడు కొంత గొడవ వినవస్తోంది కూడా అంటాను. ఈ వారాంతంలో తిరిగి ఇలాంటి సంభాషణ జరిగితే, నా ప్రతి స్పందన కొంత స్పష్టంగా ఉండవచ్చునేమో. అయినాగానీ, గాలి దిశ ఇంకా మారలేదు, కానీ ఏదో జరుగుతోందన్న భావన మాత్రం వ్యాపిస్తోంది అనే బహుశా చెప్పవచ్చు. యూపీఏ–2 హయాంలోని బాధాకరమైన కాలంలో, ఎన్నికలపరమైన ప్రక్షాళనా సమయంలో అనుభూతిలోకి వచ్చిన నిరాశావాదం, సందేహాలు ఇప్పుడు మనకు అనుభవంలోకి వస్తున్నాయి. జనాదరణ తగ్గక పోయినా... ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి నూతన సందే హాలు, నిరాశావాదం పెంపొందుతున్నాయి. ఈ ఆర్థిక ప్రతిష్టంభన యూపీఏ చివరి రెండేళ్ల పాలనా కాలంలో ప్రారంభమై ఉండొచ్చు, కానీ ఇప్పుడది మరీ సుదీర్ఘంగా సాగింది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా స్థూల జాతీయోత్పత్తి క్షీణత, రెండు 1,100 వోల్టుల విద్యుదాఘాతాల కుదుపులు (పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ), ఉద్యోగాలలో కోతలు, వేతనాల స్తంభన (7వ వేతన సంఘం సిఫా రసుల వల్ల ప్రభుత్వోద్యోగుల వేతనాలు పెరగడం మినహా) ప్రజలను బాధిం చడం ప్రారంభమైంది. ఆర్బీఐ నివేదికలు, ద్రవ్యవిధానం, జీడీపీ, కరెంటు ఖాతా లోటు, వాణి జ్యలోటు, నిజ వడ్డీ రేట్లు, తదితర అసాధారణ పదజాలం చెప్పే సంక్లిష్ట విష యాలను చాలా మంది పట్టించుకోకపోవచ్చు. అయితే కుటుంబంలోని ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయి లేదా ఉద్యోగం దొరకక కలిగే వ్యధ, కుటుంబ వ్యాపా రమైన ఏ మిఠాయి దుకాణంలోనో పనిచేయక తప్పని స్థితికి నెట్టే యడం వల్ల కలిగే నిరాశాజనితమైన అసంతృప్తి బాగా బాధిస్తాయి. గాజులు తయారుచేసే చిన్న వ్యాపారానికి పెద్ద నోట్ల రద్దు ఆరు నెలలపాటూ తూట్లు పొడవడం కూడా బాధకలిగించేదే. ఇక ఇప్పుడు జీఎస్టీకి సంబంధించిన చిక్కుముడు లతో కుస్తీ పట్టాల్సిరావడం పుండుకు కారం రాసినట్టే అవుతోంది. కానీ ప్రధాని జానాదరణ మాత్రం ప్రబలంగానే ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే, ఫలి తాలు 2014 నాటి కంటే చాలా భిన్నమైనవిగా ఉండేట్టేమీ కనబడటం లేదు. అయితే, మూడు విషయాలను మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉన్నవారు చాలా సుదీర్ఘంగానే బాధలు పడ్డారు, సందేహాలు వారి మనసులను ముంచెత్తుతున్నాయి. పదవీ కాలంలో మూడింట రెండు వంతుల కాలం ముగిసేనాటికి అధికారంలో ఉన్న చాలా మందికి జనాదరణ క్షీణించడం జరుగుతుంటుంది. కానీ ప్రధాని జనాదరణ మాత్రం తగ్గలేదు. అయితే ఆయన ప్రాబల్యం పెంపొందుతుండటం మాత్రం నిలిచిపోయింది. వచ్చే ఎన్నికల వరకు, రెండేళ్లపాటూ రాజకీయాలు అలాగే కదలిక లేకుండా నిలిచిపోవు. ఆందోళనకర సంకేతాలు ఈ వారం ప్రధాని, కంపెనీ సెక్రటరీల సమావేశంలో ఉద్వేగభరితంగా చేసిన గంట ప్రసంగంలో ఆ ఆందోళన కనిపించింది. ఆర్బీఐ ఈ ఏడాది వృద్ధి అంచనాలను మరింతగా తగ్గించి, స్టెరాయిడ్లలా ఉత్ప్రేరణను కల్పించి ప్రభు త్వానికి ఊపిరి సలుపుకునే అవకాశాన్ని ఇవ్వనిరాకరించిన తర్వాత ఆయన ఈ ప్రసంగం చేశారు. అది మోదీ చేసిన అత్యుత్తమమైన ప్రసంగం. ఉద్రేకం, ఆగ్రహం, తీక్షణత, ఆత్మవిశ్వాసాలతో అది తొణికిసలాడింది. 2013 తర్వాత మొదటిసారిగా, ఆయన ఎదురొడ్డి పోరాడుతున్నారు. పోరాట స్ఫూర్తితోనే ఉన్నారు గానీ అది రక్షణాత్మకమైనది. తన మూడేళ్ల పాలనను ఆయన పదే పదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చివరి మూడేళ్ల పాలనతో పోలిక తేవడంలో అది మీకు కనిపిస్తుంది. ఆ మూడేళ్ల కాంగ్రెస్ పాలన అత్యంత అధ్వానమైనది, అది ఆపార్టీ బలాన్ని లోక్‌సభలో 44 స్థానాలకు కుదించివేసింది. ఆ ప్రసం గంతో ఆయన మద్దతుదార్లందరూ తిరిగి నూత నోత్తేజం నింపుకుని ఇళ్లకు వెళ్లి ఉంటారని పందెం కాస్తాను. ఆయన మాటల ఆకర్షణశక్తి, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలచుకోవడంలో ఆయనకున్న సాధికారత అలాంటివి. అయితే ఆయన మొహంలో ఆందోళన తొంగి చూసింది. ఇటీవల ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటిలో కూడా అది కనిపి స్తుంది. ‘‘నిరాశావాదాన్ని వ్యాప్తి చెందించే’’ వారిపై ఆయన చేసిన దాడి చురుక్కుమని గుచ్చుకునేది. ఇందిరా గాంధీ, తను సంక్షోభ పరిస్థితిలో ఉన్న నెలల్లో ‘‘ప్రతికూలాత్మకతను సృష్టించే’’ వారిని ఖండించడానికి అది సరితూ గుతుంది. ఇంతకు ముందు తాను రద్దు చేసిన ఆర్థిక సలహా మండలిని ప్రధాని తిరిగి తెచ్చారు. మోదీ, తాను చేసిన ఏదైనా ఒక యోచన నుంచి వెనక్కు మరలడం ఇదే మొదటిసారి. హార్వార్డ్‌లో విద్యాభ్యాసం చేసిన ఆర్థిక వేత్తలను దుమ్మెత్తిపోసిన కొన్ని నెలల్లోనే ఆయన వారిలో ఒకరిని (ప్రిన్సి టన్‌కు చెందిన సుర్జిత్ భల్లాను) తన సలహా మండలిలోకి తీసుకున్నారు. ఇకపోతే, పెట్రోల్, డీజిల్‌పై పెంచిన ఎక్సైజు సుంకాన్ని తగ్గించడం రెండవది. అంతకు ముందు కొన్ని వారాలుగా ఆయన సీనియర్ మంత్రులు, అభివృద్ధికి అవసరమైన వనరుల సమీకరణకు అత్యంత ఆవశ్యకమైన చర్యగా ఆ పెంపు దలను దూకుడుగా సమర్థించారు. నూతన పర్యాటక మంత్రి, మోటారు వాహనాలున్న మధ్యతరగతివారు పన్నుల విధింపు గురించి వాపోవడం ఇక ఆపాలని చెప్పే సాహసం (ఇది వ్యంగ్యం కాదు, ఆయనతో నేను ఏకీభవి స్తున్నా) చేశారు. ఇప్పుడిక బీజేపీ నేతలు ‘‘పేదలకు అనుకూలమైన’’ చర్యను చేపట్టినందుకు ప్రధానిని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వ్యాట్‌ను తగ్గిం చాల్సిందిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాస్తానని ఆర్థికమంత్రి చెప్పారు. ఈ రెండు ఘటనల నడుమ కాలంలో ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ చేసిన ‘‘దేశం పరిస్థితి’’ దసరా ఉపన్యాసంలో... ఉద్యోగాలు, ధరలు, వ్యాపా రస్తులు, ఆర్థికపరిస్థితి విషమంగా ఉండటం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉండగా ఆయన ఇలా మాట్లాడటం అసాధారణ మైన విషయం. ఆశాజనకమైన ఆర్థిక గణాంకాలు అవసరం ప్రతిపక్షాల పరిస్థితిని, వాటికి ప్రధానికున్న ఆకర్షణశక్తి, శక్తిసామర్థ్యాలు, దృష్టి కేంద్రీకరణకు సరితూగే నాయకుడు లేకపోవడాన్ని లేదా వాటికి ఉమ్మడి ఎజెండా లేకపోవడాన్ని చూసి ప్రభుత్వం ఊరట చెందుతోంది. కానీ, వ్యతిరే కంగా ఓటు చేసేంతగా ప్రజలు ఆగ్రహానికి గురైనప్పుడు.. ప్రత్యర్థి సంగతి ఎలా ఉన్నా, ఎంతటి అత్యధిక జనాదరణగల నేతకైనా పతనం తప్పదని మనకు తెలుసు. నేడు లోక్‌సభలో మోదీకి ఉన్న దానికంటే ఎక్కువ ఆధిక్యత ఉన్న రాజీవ్ గాంధీ 1989 నాటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. బలాబలాలను తలకిందులు చేసే ఆ స్థానం ఇంకా సుదూరంలోనే ఉంది. కానీ, ఇప్పుడు వీస్తున్న గాలిలో ఆసక్తికరమైన భవిష్యత్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై పరిహాసాలు పుట్టుకొస్తుండటం, ప్రాచుర్యం పొందుతుండటం ఏ నేత విషయంలోనైనా ఇబ్బందులను సూచించే తొలి సూచికలు అవుతాయి. ఇలాంటి కాలంలో ఆ పరిహాసం ఒకరి నుంచి ఒకరికి సోకుతుంటుంది. మోదీ ప్రభుత్వం విషయంలో ఇది ఆరు నెలల క్రితం మొదలై ఇప్పుడు ఊపందుకుంది. రెండు, ప్రతిపక్షాలు ఎంతగా దెబ్బతిని ఉన్నా, సామాజిక మాధ్యమ యుద్ధ వ్యూహ శాస్త్రం గుట్టును విప్పాయి. కాంగ్రెస్‌ను దాని మిత్రపక్షాలను మట్టి కరిపించడానికి బీజేపీ దాన్ని అద్భుతంగా ఉపయోగించింది. ఆ రంగంలో నేడు పోరాటం ఏక పక్షంగా సాగుతున్నట్టు కనబడటం లేదు. వాస్తవానికి, ఈ ఎలక్ట్రానిక్ యుద్ధంలో బలాల మొగ్గులో మార్పు వస్తోంది. ఆప్ ఈ యుద్ధంలో ఎప్పుడూ ఆరితేరినదే. కాంగ్రెస్ కూడా దాన్ని నేర్చుకుంది. బలహీనంగానైనా ఇంకా అస్తిత్వంలో ఉన్న వామపక్ష– ఉదార వాదమేధావులు కూడా తమ బలాన్ని అందిస్తున్నారు. కాబట్టి బీజేపీకి ఇప్పుడు పోటీ ఉంది. సామాజిక మాధ్యమాలను అదుపులో ఉంచుకుని బీజేపీ గత ఎన్నికల్లో గొప్ప అనుకూలతను సాధించింది. ఆ నియంత్రణ నేడు క్షీణిస్తోంది. ఈ వారం ప్రధాని తన అత్యుత్తమ అనర్గళోపాన్యాసంతో ముంద డుగు వేశారు. ఈ రంగంలో ఆయనకు ఎదురే లేదు. కానీ అదే సరిపోదు. పార్టీని ఎన్నికలు గెలిచే యంత్రంగా తయారు చేయడం కోసం ఈ మూడే ళ్లుగా ఆయన చాలా ఎక్కువ శక్తిని వెచ్చించారు. పరిపాలనపట్ల మరింత ఎక్కువ శ్రద్ధ అవసరమైన ఈ సమయంలోనే ముఖ్యమైన రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రభుత్వం క్షీణిస్తున్న తన విజయాల ఉరవడిని పునరు ద్ధరించుకోలేకపోతే, దిగువకు జారిపోయే ప్రమాదం ఉంది. అందుకు సందే శాన్ని మార్చడం మాత్రమే సరిపోదు. తమ సమ్మోహన శక్తిని తిరిగి సంపా దించుకోడానికి మోదీ ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన ఆర్థిక గణాంకా లను చూపడం అవసరం. యూపీఏ కాలపు వాటిని కాదు, తమ పాలనలోని గణాంకాలను చూపాలి. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ అత్యాచారం ఆమోదనీయమా?
జాతిహితం అత్యాచారానికి ముందు లేదా దానితో పాటూ ఉండే అతి హేయమైన హింస జరగకపోయి నట్టయితే ఆ నేరానికి శిక్ష పడ్డవారికి బెయిల్ మంజూరు చేయవచ్చా? బాధితురాలి అభ్యంత రకర జీవన శైలి దృష్ట్యా నేరస్తులకు సడలింపులు ఇవ్వవచ్చా? లైంగిక, జీవన శైలిపరమైన ఎంపికల పట్ల మరింత సున్నితంగా ఉండాలని మాత్రమే సూచిస్తున్నాను. 1988 నాటి ‘అక్యూస్డ్’ చిత్రంలో దోషి తరçఫు సాక్షి... బాధితురాలు తిరుగుబోతు కాబట్టి అత్యాచారం చేస్తే తప్పేమిటి? అంటూ చేసిన వాదన చెల్లలేదు. 2017లో కూడా అది చెల్లడానికి వీల్లేదు. వయసులో ఉన్న ఆడపిల్ల బాయ్‌ఫ్రెండ్‌తో కలసి అర్థరాత్రి పూట సినిమా చూడటానికి ఎందుకు వెళ్లినట్టు? అది కూడా టైట్ జీన్స్, టీ–షర్టు ధరించి మరీ వెళ్లింది. ఇది, వారిద్దరి మధ్యా ఉన్నది అక్రమ సంబంధమని సూచిం చడం లేదా? అసలు ఆమె తన తల్లిదండ్రులకు, కళాశాలలో చెప్పకుండా వెళ్లడమేంటి? పైగా ఆమె తండ్రి, ఓ కారునీ, దాన్ని నడపడానికి ఓ డ్రైవర్నీ ఏర్పాటు చేయగల ధనవంతుడూ కాదు కదా? ఆమెకు లేదా ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు ట్యాక్సీకి కాకున్నా ఓ ఆటోకు బాడుగ చెల్లించడానికి సైతం డబ్బులు లేనప్పుడు ఎందుకు వెళ్లాలి? ఇంతకూ ఆమె, ఆమె బాయ్‌ఫ్రెండ్ రాత్రి పూట ఎందుకు ఒంటరిగా సంచరించాలి? అక్రమంగా తిప్పుతున్న ఓ బస్సులో ఆరుగురు జులాయి యువకులు తప్ప మరెవరూ లేరని కనిపిస్తున్నా, అందులో ఎక్కించుకు పొమ్మని ఎందుకు దేబిరించాలి? సామూహిక అత్యాచారం జరగక తప్పదని అంత స్పష్టంగా కనిపిస్తుండగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఈ పరిస్థితిలో పొంచి ఉన్న ప్రమాదాలు ఎలాంటివో ఆ ఇద్దరిలో ఒకరైనా ఎందుకు గమనించలేదు? ఇది ఎలాంటి నిర్లక్ష్యపూరిత మైన, దుస్సాహసికమైన, బాధ్యతారహితమైన ప్రవర్తన? సలహా, సహా యాల కోసం మీరు మీ తల్లిదండ్రులను ఎందుకు పిలవలేదు? అహింసాయుత అత్యాచారం మేలు కాదా? బస్సులో ఉన్న ఆ మగాళ్లు ఆ ఆడపిల్లపై అత్యాచారానికి పాల్పడటం, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను చావగొట్టడం తప్పే. కానీ, యవ్వన ఉద్వేగాలతో ఉన్మ త్తులై ఉన్న ఆ దుష్టులు అలాంటి దురాగతానికి పాల్పడే దుస్థితి ఏర్పడేలా మీరు వాళ్లను ఎందుకు రెచ్చగొట్టినట్టు? పోనీ వాళ్లు అలా రెచ్చి పోయిన ప్పుడు, ఆ తర్వాత ఆసారాం బాబా ప్రవచించిన సూత్రాన్ని అనుసరించి వారిని సోద రులుగా సంబోధిస్తూ, వాళ్ల చేతులకు రాఖీలు కడతానని ఎందుకు వేడు కోలేదు? అదీ పని చేయలేదనుకున్నా, ఉన్న ప్రమాదాలను గమనించి, పరి స్థితులకు అనుగుణంగా ఎందుకు నడుచుకోలేదు? అలాచేస్తే నీకా హింసా, చావూ తప్పేవి. నీకు ఎలాగూ ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. మీ మధ్య లైంగిక సంబంధాలు ఉండే ఉంటాయి (లేదా మన క్రిమినల్ లాయర్లు చెప్పేట్టు అలవాటుపడీ ఉంటారు). ఇక ఇందులో అంత పెద్ద విషయం ఏముంది, ఎందుకు అంత ప్రమాదకరంగా ప్రతిఘటించినట్టు? ఈ దరిద్రగొట్టు కుర్రాళ్లు మూర్ఖులు. నిన్ను చంపకపోయి ఉంటే, వాళ్ల పట్ల మరింత కనికరం చూపడానికి అర్హులయ్యేవారు, శిక్ష అమలును సైతం తాత్కాలికంగా నిలిపి వేసి ఉండేవారు కావచ్చు. అప్పుడిక, అత్యాచారానికి ముందు లేదా దానితో పాటూ ఉండే అతి హేయమైన హింస ఈ కేసులో ఉండి ఉండేదే కాదుగదా! అప్పుడది కేవలం మరో అహింసాయుతమైన అత్యాచారం అయి ఉండేది. కుటుంబాల లోపల, డేట్స్‌లో (ప్రేమికులు కలు సుకునే సందర్భంగా), మత్తులో ఉండగా తదితర విధాలుగా సాగే 85 శాతం అత్యాచారాల్లాంటిదే ఇదీ అయ్యేది. కొద్ది రోజుల కౌన్సెలింగ్ (మానసిక పరమైన సలహా, సహాయాలు) తర్వాత... ఆ కుర్రాళ్లు ఇప్పుడు బుద్ధిమం తుల్లా సాధారణ జీవితాలను గడుపుతుండేవారు కూడా కావచ్చు. కోర్టులు సైతం పెద్ద మనసుతో ప్రాధాన్యాన్ని ఇచ్చి మరీ ఇలాంటి కౌన్సెలింగ్‌ను అందించి, వెంటనే నివేదికను సమర్పించాలని ఆదేశిస్తున్నాయి కూడా. మన ముందున్నది ఒక విధమైన విషాదం కావడంలో ఆశ్చర్యమేం లేదు. ఎనిమిది మంది, వారి కుటుంబాల జీవితాలు అంధకార బంధురమై పోతున్నాయి. ఒక విలువైన యువ ప్రాణం ఇప్పటికే పోయింది, మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు, మరొకరు శారీరకమైన గాయాలు, ఉద్వేగపరమైన విషాదాల నుంచి కోలుకోవాల్సి ఉంటుంది. మరో నలుగురిని ఉరితీస్తారు. ఈ యువతీయువకులు... బాధితురాలు లేదా అత్యాచారానికి పాల్పడిన వాళ్లు తమను, తమ కుటుంబాలను కూడా అంతేలేని దుస్థితిలోకి ఎలా ఈడ్చారనేది కూడా అంతే ఆందోళనకరమైనది. దేశాన్నంతటినీ కుదిపేసిన ‘నిర్భయ’ సామూహిక అత్యాచారం, హత్యను దృష్టిలో ఉంచుకుని నేనిలా రాస్తుండటాన్ని చూసి మీరు నాపై పిచ్చి కోపంతో ఉండి ఉండాలి. అదే జరిగితే, చిర్రెత్తించే ఈ ఎత్తుగడ ఉద్దేశం అదే. అది నెరవేరినట్టే. ఇంకా ఇవే కొలబద్దలా? ఇక మనం మన దృష్టిని హరియాణాలోని సోనేపట్‌లో జరిగిన ఓ ఘటనపైకి మళ్లిద్దాం. దేశ రాజధానికి ఉత్తర పొలిమేరల్లో, నిర్భయ/జ్యోతి కేసు జరిగిన రెండేళ్లకు ఇది జరిగింది. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని, తన బాయ్‌ఫ్రెండ్ (కళాశాల సహచరుడు), అతని మిత్రులు తనను బ్లాక్మెయిల్ చేసి తనపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడ్డారని, కనీసం ఒకసారైనా తను సామూహిక అత్యాచార పరిస్థితికి గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కుర్రాడు తనకు ఇంటర్నెట్ ద్వారా తన నగ్న చిత్రాలను పంపి, తనను బతిమిలాడి తన నగ్న చిత్రాలను పంపేలా చేశా డని, ఆ తర్వాత వాటిని క్యాంపస్‌లోను, ఆమె తల్లిదండ్రులకు బహిర్గతం చేస్తానని బెదిరించాడని ఆమె చెప్పింది. ఆమె 164 సీఆర్పీసీ కింద మెజిస్ట్రేట్ ముందు ప్రకటనగా నమోదు చేసి మరీ ఈ ఆరోపణలను చేసింది. నిర్భయ అనంతర కాలపు కఠినమైన కొత్త అత్యాచార చట్టం పేర్కొన్న క్రమానికి అనుగుణంగానే ఈ కేసులో బ్లాక్మెయిల్, అత్యాచారం, బలవంతంగా మద్యం తాగేలా, మాదకద్రవ్యాలు (బహుశా మార్జువానా పొగ కావచ్చు) సేవించేలా చేయడం ఉన్నాయి. ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వారూ ఉన్నత వర్గాల వారే కాబట్టి అత్యుత్తమ న్యాయవాదులను పెట్టుకున్నారు. పోటా పోటీగా వాదనలు సాగాయి. ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి ఆ యువతి చేసిన ఆరోపణ లను ఆంగీకరించారు. అత్యాచారం, బ్లాక్మెయిల్, ఐటీ చట్టం ఉల్లంఘన తదితర నేరాలకు గానూ 20 ఏళ్ల జైలు శిక్ష సహా పలు శిక్షలను విధించారు. నేరస్తులు ఆ తీర్పుపై అప్పీలుకు పంజాబ్ హరియాణా హైకోర్టుకు వెళ్లారు. ఆ అప్పీలు ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది. ఇలాంటి క్రిమినల్ కేసుల అప్పీళ్లను విచారణకు చేపట్టేప్పటికి చాలానే సమయం పడుతుంది. ఉదాహరణకు, ఆరుషి హత్య కేసులో నేరుస్తులైన ఆమె తల్లి దండ్రులు చేసుకున్న అప్పీలు 2013 నుంచి అలహాబాద్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అయితే, గత వారం పంజాబ్ హరియాణా హైకోర్టు ధర్మాసనం ఆ అత్యాచారం/బ్లాక్మెయిల్ కేసులో శిక్షపడ్డవారి శిక్షలను తాత్కాలికంగా నిలి పివేసి, వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సడలింపు సమంజసమన డానికి తగిన చెప్పుకోదగ్గ లక్షణాలు ఈ కేసులో ఉన్నాయని అది పేర్కొంది. ఈ ఆదేశాల్లో తాము చేప్పేది ఏదీ కేసు బాగోగులను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది అనుకోండి. అప్పీలు క్రమానికి సమయం పడుతుంది కాబట్టి, ఈలోగా ఆ కుర్రాళ్లు కోర్టు అనుమతితో బయటకు పోయి తమ జీవితాలను పునర్నిర్మించుకోడాన్ని, వాళ్లు తమ విద్యాభ్యాసాన్ని (విదేశాల్లోనైనా సరే) కొనసాగించడాన్ని అనుమతించడం సమంజసం. ఆ కుర్రాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, దాని పురోగతిని ఎప్పటికప్పడు తమకు నివేదించమని ధర్మాసనం ఢిల్లీ ఎయిమ్స్ వైద్య విద్యా సంస్థను అభ్యర్థించింది. కుర్రాళ్లు మారడానికి సహాయం అందించాలని వారి తల్లిదండ్రులను కూడా కోరింది. బాధితుల పట్ల కాస్త సున్నితత్వం చూపలేరా? న్యాయమూర్తుల ఆదేశాలను ప్రశ్నించడం నా ఉద్దేశం కానే కాదు. ఫిర్యాదు దారు నేపథ్యాన్ని, ప్రవర్తనను, నేరస్తులతో ఆమె సంబంధాల చరిత్రను ఈ కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్లు పరిగణనలోకి తీసుకుని ఉంటారు. అప్పీలు పై తీర్పు కోసం మనం వేచి ఉండాలి. గౌరవనీయులైన న్యాయ మూర్తుల 12 పేజీల తీర్పులోని దిగువ పేరాలు నా వాదనకు సందర్భోచి తమైనవని భావించి ఇస్తున్నాను. 1. బాధితురాలు ముగ్గురు దోషులతోనూ కొంతకాలం పాటూ లైంగిక సంబంధం కలిగి ఉన్నా, ఏ దశలోనూ ఆమె కళాశాల అధికారులకు లేదా తల్లి దండ్రులకు లేదా మిత్రులకు తన మానసిక స్థితిని గురించి ఫిర్యాదు చేయ లేదని ఆమె ఫిర్యాదును బట్టి తెలుస్తోంది. 2. తన హాస్టల్ గదిని తనిఖీ చేసి వార్డెన్ కండోమ్స్‌ను కనుగొన్నారని, ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదని బాధితురాలు క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీరించింది. తనకు ‘క్లాసిక్ ’ సిగరెట్లు తాగే అలవాటుందని, అయితే మాదకద్రవ్యాలను మాత్రం తనంతట తానుగా వాడలేదని తెలిపింది. తాను కాల్చినది ‘జాయింట్’ అనేదని కూడా చెప్పింది. 3. పతనావస్థలోని యువత మానసిక స్థితి మాదక ద్రవ్యాలను, మద్యాన్ని, అక్రమసంబంధాలను, విచ్చలవిడి ప్రపంచాన్ని పెంచిపోషిస్తోందని క్రాస్ ఎగ్జా మినేషన్ ప్రక్రియ స్పష్టం చేసింది. 4. ఈ యువతీయువకులు... బాధితురాలు లేదా అత్యాచారానికి పాల్ప డిన వాళ్లు తమను, తమ కుటుంబాలను కూడా అంతులేని దుస్థితిలోకి ఎలా ఈడ్చారనేది కూడా అంతే అందోళనకరమైనది. 5. బాధితురాలికి తన స్నేహితులు, పరిచయస్తులతో సంబంధాలు,లైంగిక సంబంధాలలో దుస్సాహసికత, ప్రయోగాత్మకత ఉన్నాయనే ప్రత్యా మ్నాయ కథనాన్ని కూడా ఆమె సాక్ష్యం అందిస్తున్నది. అది, శిక్ష తాత్కాలిక నిలిపివేత కోసం దోషులు పెట్టుకున్న అభ్యర్థనను అనుకూలంగా పరిగణన లోకి తీసుకోవాల్సిన తప్పనిసరి కారణాలను అందిస్తోంది. ప్రత్యేకించి నేర స్తులు యువకులు, అత్యాచారానికి ముందు లేదా దానితో పాటూ ఉండే అతి హేయమైన హింసకు పాల్పడినట్టు బాధితురాలి కథనం తెలపడం లేదు. ఈ ఆదేశాల్లోని కొన్ని పేరాల నుంచి లభించిన ప్రేరణతో నా వ్యాసంలో మొదట ఉన్న ఇటాలిక్స్లోని వాక్యాలను రాశాను. నా వాదన ఏమిటో సుస్ప ష్టంగా తెలుస్తూనే ఉంది. న్యాయమూర్తుల తర్కాన్ని నేను ప్రశ్నించడం లేదని మరోసారి మనవి చేస్తున్నాను. యుక్త వయస్కుల లైంగికపరమైన, జీవన శైలి పరమైన ఎంపికల పట్ల మనం మరింత ఎక్కువ సున్నితంగా ఉండాలని, అర్థం చేసుకోవాలని మాత్రమే నేను సూచిస్తున్నాను. 1988 నాటి జోడీ ఫోస్టర్ క్లాసిక్ చిత్రం ‘అక్యూస్డ్’లో దోషి తరఫు సాక్షి ఒకామె... బాధితురాలు తిరుగు బోతు కాబట్టి ఆమెను అత్యాచారం చేస్తే తప్పేమిటి? అని ప్రశ్నిస్తుంది. ఆ సినిమాలో ఆది సమంజసంగా చెల్లలేదు. 2017లో కూడా చెల్లడానికి వీల్లేదు. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta శేఖర్ గుప్తా -
మధ్యవర్తిత్వమే నేటి మార్గం
జాతిహితం రాజ్యాంగపరంగా సుస్థిరంగా ఉన్న దేశాల మధ్యనే ద్వైపాక్షిక వాదం పనిచేస్తుంది. అందువలన, పాక్‌తో కుదుర్చుకునే భావి ఒప్పందం ఏదైనా గానీ, అది అంతర్జాతీయమైనది అయితే తప్ప, కనీసం పెద్ద ప్రపంచ శక్తుల హామీలు ఉంటే తప్ప మనజాలదు. ప్రపంచవ్యాప్తంగా నేడు ఓటర్లను రంజింప జేసే మాటలు మూడున్నాయి. అలాగే వారికి రోతపుట్టించే మాటలూ మూడున్నాయి. మార్పు, అంతరాయం, నిరంతరాయతను భగ్నం చేయడం, రాజకీయ, భావజాల విశ్వాస విధ్వంసన వారు మెచ్చేవి. కాగా, యథాతథ స్థితి, పాత వ్యవస్థలు, రాజకీయ సముచితత్వం అంటేనే వారు ఏవగించుకు నేవి. డొనాల్డ్ ట్రంప్ అత్యున్నతిని సాధించడం దీని తాజా వ్యక్తీకరణే. నరేంద్ర మోదీని సుస్పష్టమైన ఆధిక్యతతో అధికారంలోకి తెచ్చినది, ఆయన జనాదరణను ఇంకా కాపాడుతున్నది సరిగ్గా ఇదే. మీరు జాగ్రత్తగా, సునిశితంగా పరిశీలిస్తే రాజకీయాలలో మోదీ అనుస రించిన వైఖరి స్పష్టమౌతుంది. ‘‘ఢిల్లీ అధికార వర్గాల’’ను, వారి ఆలోచనను, కుహనా మర్యాదను ఆయన తన దాడికి లక్ష్యంగా ఎంచుకున్నారని గమనిస్తారు. అమెరికా ఆధికార వర్గానికి వ్యతిరేకంగా ట్రంప్ దాదాపు అలాంటి దాడి చేయడానికి ముందే మోదీ ఆ పని చేశారు. ట్రంప్ భయపెట్టినవాటిలో లేదా అదేనండి, వాగ్దానం చేసిన వాటిలో యూరప్ పట్ల అమెరికా దృక్పథంలో మార్పు సైతం ఒకటి. అమెరికా ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి యూరప్ మూల స్తంభం, అత్యంత ముఖ్య వ్యూహాత్మక, ఆర్థిక, తాత్విక మిత్రశక్తి అనే విషయంలో ఇంతవరకు రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మధ్య దాదాపు ఏకాభిప్రాయం ఉండేది. నాటో కూటమి కోసం అమెరికా భారీ వ్యయానికి కట్టుబడ డాన్ని అలాగే సమర్థించేవారు. కానీ ట్రంప్ తన పద్ధతికి, వాగ్దానానికి అనుగుణంగానే వ్యవహరించారు. ఆయన అ«ధ్యక్షుడయ్యాక తొలిసారి అమెరికా వచ్చిన ఏంజెలా మర్కెల్‌ను... నాటో రక్షణ వ్యయాలలో జర్మనీ వాటా వందల కోట్ల డాలర్లను చెల్లించాలని కోరారు. ఒక అమె రికా అధ్యక్షుడు తన యూరోపియన్ మిత్రుల నుంచి రక్షణ సొమ్మును చెల్లించమని కోరడం, అదీ జర్మనీని కోరడం ఊహించరానిది. కానీ నేడది నిజం. గౌరవనీయులైన వాషింగ్టన్ మేధో నిధులను, సంప్రదిం పుల బృందాలను, చివరకు రిపబ్లిక్ పార్టీ అధికార వ్యవస్థ చెప్పే వాటిని సైతం ట్రంప్ విస్మరించారు. వారందరినీ పాత, అధికార వ్యవస్థగా తోసి పారేశారు. మన దేశీయ, విదేశాంగ విధానాల్లో సైతం మనం ఈ మార్పును చూశాం. పాత, విదేశాంగశాఖ జాగ్రత్త వైఖరిని తోసిపుచ్చి ఆమెరికాతో సంబంధాలలో ముందడుగు వేశారు. అలాగే మోదీ చైనా విషయంలో దృఢంగా నిలవడానికి బదులు దానికి ఎరవేసే విధానాన్ని చేపట్టారు. ఆయన పాతను కూలదోయడం మాత్రమే కాదు, తన సొంత అధికార వ్యవస్థను, తన భావజాల జనాకర్షణ శక్తిని చురుగ్గా నిర్మించడం కూడా చేస్తున్నారు. అందువల్లనే మరో ముఖ్య రంగంలో సైతం మార్పు వస్తుం దని మనం ఆశించవచ్చు. ఐరాసలో ట్రంప్ రాయబారి నిక్కీ హేలీ భారత్–పాకిస్తాన్ సంబంధాలపై ఆందోళన వెలిబుచ్చుతూ అత్యంత భయానకమైన ‘మధ్యవర్తిత్వం’ అనే పదాన్ని ప్రయోగించారు. భారత వ్యాఖ్యాతలు, విదేశాంగ శాఖ తక్షణమే ఆగ్రహించారు. భారత్–పాక్ సమస్యలన్నీ ద్వైపాక్షికంగానే పరిష్కారం కావాలి, ‘మూడో వారు’ ఎవరూ జోక్యంచేసుకోడానికి ఏమీ లేదనే అవే పాత మాటలను తిరిగి వల్లించారు. సిమ్లా ఒప్పందం నాటి నుంచి పదే పదే వల్లె వేస్తున్న అదే కీలక విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక ప్రశ్నను మరోసారి తిరిగి చెప్పడం దేనికి? ఢిల్లీ అధికార వర్గపు వ్యాఖ్యాతలు, మోదీ ప్రభుత్వం అత్యంత కీలకమైన సమస్యపై ఏకీభవిస్తున్నట్టు అనిపించడం కాదు, ఏకీభవించడం మీకు ఆశ్చర్యం కలిగించడం లేదా? మీరు ఓటు చేసినది దీన్నంతటినీ మార్చడానికి, యథాతథస్థితిని భగ్నం చేయడానికి, అధి కార వ్యవస్థ ఆలోచనను భగ్నం చేయడానికి కాదా? 2017లో మన దేశం ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక స్థానంలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే పాక్, కశ్మీర్ సమస్యలపై మన వైఖరులలో మౌలికమైన మార్పులు రావడం సమంజసం కాదా? పాక్‌తో ద్వైపాక్షిక పరిష్కారానికి కాలం చెల్లిపోలేదా? ‘మూడోవారు’ అనే ఆలోచనపట్ల భారత్ ఎందుకు అయిష్టం చూపుతోంది? మోదీ అధికారం అత్యున్నత దశలో ఉన్నప్పుడే ఆయన ఘనీభవించి పోయిన ఈ భావనను సమీక్షించాలి. కొనసాగుతున్నాయి, భారత్–పాక్ మధ్య సమీకరణం విప్లవాత్మకంగా మారిపోయింది. అప్పట్లో పాక్ భారత్ కంటే సంపన్నవంతమైన దేశం (తలసరి ఆదాయం రూపేణా). ఆ సమీకరణం నేడు తలకిందులైంది. ఇంకా మార్పు చెందుతూనే ఉంది. మన జనాభా వృద్ధి వేగం పాక్ దానిలో సగం మాత్రమే. దీన్ని లెక్కలోకి తీసుకుని మన అధిక ఆర్థిక వృద్ధి రేట్ల నికర ప్రభావం ఆదాయాల ప్రభావాన్ని బట్టి చూస్తే భారత్‌కు అనుకూలంగా రెండు దేశాల మధ్య ఆర్థిక అంతరం ఏడాదికి 5 పాయింట్ల చొప్పున పెరుగుతోంది. భారత్ ఉన్నత మధ్యస్త స్థాయి ప్రపంచ శక్తి హోదాకు ఎదిగింది. ఇప్పటికే గొప్ప ఆర్థికశక్తిగా ఉన్న దేశం వృద్ధి చెందుతోంది. దేశ సైనిక పాటవం బలవత్తరమౌతున్నది, రాజకీయ సుస్థిరత నెలకొంది. దేశానికి పాత అభద్రతలను విడనాడి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలి, 2014 అనంతర కాలపు నూతన కశ్మీర్, పాక్ వైఖరిని రూపొందించాలి. రెండు సర్వసత్తాక సార్వభౌమత్వ దేశాలు సమానవైనవి కావ నడం రాజకీయంగా సరైనది కాదు. కానీ నేను ఆ మాటే అంటాను. మనం కోరు కుంటున్నది అలా కావాలనే కాదా? నేడు భారత్, పాక్‌లు ఏ కొలబద్ధతో చూసినా సమాన మైనవి కావు. రాజ్యాంగపరంగా సుస్థిరంగా ఉన్న దేశాల మధ్యనే ద్వైపా క్షికవాదం పనిచేస్తుంది. తరచుగా కొత్త పాలకులు తమకు ముందటి వారిని హత్యగావించి, జైల్లోవేసి లేదా ప్రవాసానికి పంపి అధికారంలోకి వస్తూ, తమకు అనువైన కొత్త రాజ్యాంగాలను అమల్లోకి తెస్తుంటే... అంతర్జాతీయ ఒప్పందాలకు వారు కట్టుబడి ఉంటారని వారిని నమ్మే దెలా? సిమ్లా, లాహోర్, ఇస్లామాబాద్ ప్రకటనలన్నిటినీ పాక్ తిర స్కరించినది అందువల్లనే. మన సమస్యల పరిష్కారంలో ద్వైపాక్షిక వాదం విఫలమైంది. పాక్‌తో కుదుర్చుకునే భావి ఒప్పందం ఏదైనా గానీ అది అంతర్జాతీయమైనది అయితే తప్ప, కనీసం పెద్ద ప్రపంచ శక్తుల హామీలు ఉంటే తప్ప మనజాలదని నా ప్రతిపాదన. కాబట్టి వెళ్లండి, బలమైన స్థానంలో నిలచి మూడో వారి సహాయాన్ని కోరండి. ప్రచ్ఛన్న యుద్ధకాలపు శిథిలాల నుంచి బయటకు రండి. మోదీ భారతదేశంలో అది ఆలోచించదగిన చర్చనీయాంశం. twitter@shekargupta శేఖర్ గుప్తా -
కొత్త గాలికి సంకేతం పంజాబ్
జాతిహితం అకాలీలను దించి కాంగ్రెస్‌ను ఎక్కించే క్రీడ ఇంకా ఎందుకు? మాతో యువత ఉంది, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడంyì అనేదే ఆప్ ప్రచార వ్యూహం. ఎన్నికల పండితులు ఆ పార్టీ ప్రభావం మాల్వాకే పరిమతమని అంటున్నారు. ఒక ప్రాంతంలోని ఇంత బలీయ మైన ధోర ణిని భౌగోళికతో లేదా నదో అడ్డగిస్తుందని నమ్మడం కష్టమే. ఎన్నికల పండి తులు చెప్పేదే నిజమైనా ఆప్ ఒక పెద్ద జాతీయ శక్తిగా ఆవిర్భవిస్తుందనడం నిస్సందేహం. దాని ప్రభావం దేశంపైనా, వచ్చే ఏడాది జరిగే గుజరాత్ ఎన్నికలపైనా ఉంటుంది. జరగనున్న పరిణామాలకు ముందస్తుగానే స్పష్టమైన సూచనలు కనిపించ డాన్ని ఇంగ్లిష్‌లో ‘రైటింగ్ ఆన్ ది వాల్’ (గోడమీది రాతలు) అనడం రివాజు. ఆ నానుడి భారత్, దాని ఇరుగుపొరుగు దేశాలలో ప్రయాణాలు చేసే క్రమంలో, ప్రత్యేకించి ఎన్నికల ప్రచార క్రమంలో పుట్టుకొచ్చింది. భారత్‌లోని నగరాలు, వేగంగా పట్టణీకరణం చెందుతున్న గ్రామీణ ప్రాంతాల గుండా పోయేటప్పుడు కళ్లూ, చెవులు బార్లా తెరచి ఉంచి గోడల మీది రాతలను చూస్తే లేదా వాటి ప్రతిధ్వనులను వింటే... ఏ మార్పు జరగనున్నదో, ఏ మార్పు జరగడం లేదో అవే చెబుతాయి. భారత్‌లో మార్పు ఎన్నటికీ పదును కోల్పోదని అవి మీకు తెలియజేస్తాయి. భారత ఉపఖండం హృదయం గోడల మీద పరుచుకుని ఉంటుంది. ఇక్కడ ‘గోడలు’ అంటే పరిమితమైన, భౌతికమైన, భాషాపరమైన అని అర్థం కాదు. అది గుజరాత్ ప్రధాన రహదారుల వెంబడే ఉండే ఫ్యాక్టరీల గగనపు శిగపై ఎగిరే పతాకమూ కావచ్చు, కాంచీపురంలోని పెరియార్ బస్ట్ సైజు పాత విగ్రహం కింద చెక్కిన అక్షరాలూ కావచ్చు. లేదంటే ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ ప్రజల మొహాల్లో కనిపించే నవ్వులే కావచ్చు. ప్రజాభీష్టానికి నవ్వుల కొలబద్ద అవి సాధారణమైన ఉల్లాసం వల్ల కలిగే నవ్వులు కావు. అంతకంటే విశి ష్టమైన, అనిర్వచనీయమైన తబ్బిబ్బు, మెచ్చుకోలు, ఆశావాదం కలగలిసి విరిసే దరహాసాలు. ఎన్నికల ప్రచార సమయంలో అలాంటి నవ్వు మీకు కని పించిందీ అంటే నిశ్చయాత్మకమైన మార్పును చూస్తున్నామని మీకే అర్థమౌ తుంది.1990 ఎన్నికల్లో వీపీ సింగ్ సవాలు విసిరినప్పుడు, నరేంద్ర మోదీ 2014 ప్రచారంలో, నితీశ్‌కుమార్ బిహార్‌లోనూ, మమతా బెనర్జీ బెంగాల్‌లోని గత రెండు ఎన్నికల్లోనూ సాగించిన ప్రచారంలో ఆ నవ్వు మనకు కనిపిం చింది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సాగించిన ప్రచారంలో తిరిగి మళ్లీ అదే నవ్వును చూశాం. వీటిలో ప్రతి ఒక్కటీ నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చింది. ‘నవ్వు’ పరీక్ష ద్వారా ఓటరు ఆలోచనా సరళిని కొలిచే సమయం మరోసారి ఆసన్నమైంది. అయితే అది ఈసారి పంజాబ్‌లో జరగనున్నది. లూథియానా, పంజాబ్‌లోని అత్యంత సుసంపన్నవంతమైన, అతి పెద్ద నగరం, వ్యాపార కేంద్రం. అక్కడి వీధుల్లోని హిందూ, సిక్కు ప్రజల మొహా లకు, గోడలు, పిట్ట గోడల మీదుగా, బాల్కనీలు, కిటికీల్లోంచి తొంగి చూసే మహిళలు, పిల్లల ముఖాలకు, సెల్ ఫోన్ కెమెరాలకు ఈ పరీక్షను అన్వ యించి చూడండి. ఎన్నికల ప్రచార క్యాంపెయిన్లకు సంబంధించి అత్యంత జనాదరణ పొందిన తాజా విలక్షణ.. రోడ్ షోలు. అరవింద్ కేజ్రీవాల్ ఆ రోడ్ షోలనే సాగిస్తున్నారు. ఈ తరహా ప్రచారంలో నాయకుడు సాధారణంగా ఒక్క మాటైనా మాట్లాడడు. కానీ ఓ వాహనంపైకెక్కి చేతులు ఊపుతుంటాడు లేదా ఫలానా వారిని అని ఉద్దేశించకుండా కుడి ఎడమల ఉన్నవారందరికీ చేతులు జోడిస్తుంటాడు. ‘‘మీ ఓటును నాకు ఇవ్వండి’’ అని స్ఫురించే నవ్వును చిందిస్తుంటాడు. ఈ మాదిరి ప్రచారంలో మీరు ఎంతో కొంతమంది గుంపును ఆకర్షించగలుగుతారు. మన దేశంలో ఏ తమాషా అయినా జరుగు తుంది, అంతే. కాకపోతే వీధులకు ఇరుపక్కలా ఉన్న గోడలు నవ్వుల వెలు గులను చిందిస్తున్నాయంటే మీరు మార్పును చూస్తున్నారన్నమాటే. స్థానికత సమస్యేకాని విలక్షణమైన పార్టీ నడచి పోతుండగా లేదా వాహనంలో పోతుండగా వేలాది మంది మొహాలను ^è దివేయడానికి మీకు సహాయపడే అనుభవాధార ఫార్ములాగానీ, లేబొరేటరీ పరీక్ష గానీ లేదు. కాబట్టి ఆ నవ్వులను మీరు ఎలా వ్యాఖ్యానిస్తారనేది పూర్తిగా మీ స్వీయగతమైనదే. కానీ నేనీ మొహాలను ఇంతకు ముందే చూశాను. ఎప్పుడూ వాటి అర్థం మార్పే. లేదా కనీసం ఒక కొత్త రాజకీయ పరిణామం ఆవిర్భవించడం. ప్రజాభిప్రాయ సేకరణవేత్తలు ఈ అభిప్రాయాన్ని హేళన చేస్తారు. నేనేమీ వారి విజ్ఞానశాస్త్రాన్ని, వృత్తి నైపుణ్యాన్ని కేవలం గోడ మీది రాతల నానుడితో తీసి పారేయడం లేదు. కాబట్టి మార్చి 11న ఎవరు గెలుస్తారని చెప్పి మీకేమీ పట్టుబడిపోను. కానీ, మన రాజకీయాల్లో దేశ వ్యాప్తమైనది కాకున్నా, పలు రాష్ట్రాలకు విస్తరించిన ఒక కొత్త పార్టీ ఆవిర్భ వించనున్నదనడం నిస్సందేహం. 1989లో జనతాదళ్ తర్వాత ఇలాంటి శక్తి ఆవిర్భవించడం ఇదే మొదటిసారి. అయితే, జనతాదళ్‌కు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ అప్పటికే ఏర్పడి ఉన్న సోషలిస్టు–కుల రాజకీయ శక్తుల నుంచి ఆవిర్భవించినది కాదు. అది అణువణువునా పూర్తిగా కొత్తగా నిర్మితమైన అసలైన పార్టీ. లేదంటే మరే పార్టీతోనూ పోల్చడానికి వీల్లేని విలక్షణమైన పార్టీ. పంజాబ్‌లో సువ్యవస్థితమైన రాజకీయ వ్యవస్థ యథాతథంగా 70 ఏళ్లపాటూ మనగలిగింది. 1966లో రాష్ట్రం భాషా ప్రతిపదికపై (మతపరమైన హిందూ, సిక్కు ప్రాతిపదికపైన కూడా) విడిపోయినప్పుడూ, 1883–93 ఉగ్రవాద దశాబ్దంలోనూ కూడా అది అలాగే నిలవగలిగింది. అకాలీలు, కాంగ్రెస్‌వారు వంతులవారీగా అధికారాన్ని నెరపారు. మధ్యలో కొన్నిసార్లు రాష్ట్రపతి పాలనకు మాత్రమే అవకాశమిచ్చారు. ఇతర జాతీయ పార్టీలు, అకాలీల నుంచి చీలిపోయిన వర్గాలు ఎన్నడూ నిజమైన ప్రభావాన్ని చూప లేకపోయాయి. వామపక్షాలు కొన్ని ప్రాంతాలలో చాలా కాలంపాటే తమ బలాన్ని కాపాడుకోగలిగాయి. చివరకు అవి కూడా కనుమరుగైపోగా రెండు పార్టీల వ్యవస్థ మరింతగా సువ్యవస్థితమైంది. కాన్షీరాం కూడా పంజాబీనే, అక్కడే పుట్టారు. పైగా దేశంలో అత్యధికంగా, 32.4 శాతం దళిత ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అయినా ఆయన ఇక్కడ ఒక రాజకీయశక్తిని నిర్మిం చడంలో ఎన్నడూ సఫలీకృతులు కాలేకపోయారు. ఉగ్రవాద దశాబ్దంలో భింద్రన్‌వాలే బృందాలు, వారి వారసులు ఆవిర్భవించారు. కానీ వారు ఎన్నడూ విస్తృత జనాకర్షణను, ప్రజాబాహుళ్యపు ఆదరణను చూరగొన లేకపోయారు. వీటన్నిటిని బట్టి చూస్తే, బయటివారితో కూడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఒక శక్తిగా ఆవిర్భవించడం విశేషమే. పైగా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పంజాబీ మాట్లాడని హిందువు. అంతేకాదు ఇక్కడ లెక్కలోకి రాని కులానికి చెందినవాడు. హరియాణతో పంజాబ్‌కు నదీజలాలు సహా ఎన్నో వివాదా లున్నాయి. కేజ్రీవాల్ ఆ రాష్ట్రానికి చెందినవాడే. కాబట్టి ఆ పార్టీ అస్తిత్వ పరీక్షలో పూర్తిగా విఫలమైంది. ఇక దాని భావజాలం అంతుబట్టేది కాదు. అయినా ప్రజలకు పట్టింపే ఉన్నట్టు అనిపించడం లేదు. ‘‘అతను పంజాబీ కాకపోతే ఏమిటి, కెనడా నుంచో లండన్ నుంచో వచ్చిన వాడేం కాదే. ఆయనా భారతీయుడే, మేమూ భారతీయులమే’’ అన్నాడు సెహ్వత్ సింగ్. ఆప్ గాలి రాష్ట్రవ్యాప్తం కాదా? భటిండాకు ఎంతో దూరంలేని జాత్రు గ్రామానికి బయట మూడు రోడ్ల కూడలిలో ఆయన, డజను మంది ఆప్ మద్దతుదార్లతో కలసి ప్లకార్డులు పట్టుకు నిలబడ్డారు. కొద్దిమంది కాంగ్రెస్ మద్దతుదార్లు, ఓ ఇద్దరు అకాలీ విధేయులు అక్కడున్నారు. అక్కడ చర్చలు ఆవేశపూరితంగానూ, వర్గాలుగా చీలిపోయి, పోటీపడుతూ సాగుతున్నాయి. అయినా మంచి హాస్యం చిందిస్తు న్నాయి. పెద్ద నోట్ల రద్దు అందరినీ చాలా దెబ్బ తీసిందనే ఒక్క విషయంలో మాత్రం వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. మీరు గనుక సుసంపన్న మైన పత్తి/గోధుమ ధాన్యాగారంలోకి లోతట్టుకు చొచ్చుకుపోతే ఈ అసం తృప్తి గగ్గోలుగా మారుతుంది. మౌర్ మండి వద్ద మితూసింగ్ అనే రెండున్నర హెక్టార్ల భూమున్న రైతు కలిశాడు. ఆయన తన పంటను రూ. 1.10 లక్షలకు అమ్ముకున్నా, కొద్ది కొద్దిగా రూ. 10,000 చొప్పున దఫదఫాలుగా చేతికి రావ డంతో డబ్బంతా ఖర్చయిపోయిందని ఆగ్రహంతో చెప్పాడు. పంజాబ్ చిన్నదే అయినా అద్భుత రవాణా సదుపాయాల వ్యవస్థ ఉన్న రాష్ట్రం. అమృత్సర్ నుంచి లూథియానాకు, అటునుంచి దక్షిణాదిన భటిండా, పాటియాలాల దిశగా, రాష్ట్రానికి గుండెకాయలాంటి ప్రాంతం గుండా ప్రయాణిస్తూ, ఆగి మాట్లాడుతూ పోతుంటే... మీకు కాంగ్రెస్, అకా లీల కంటే ఆప్, చీపురుల మాటే ఎక్కువగా వినబడుతుంది. కెప్టెన్ అమ రీందర్సింగ్, బాదల్లు ఇద్దరూ కలిసే ఉన్నారు. అయినా అకాలీల గురించి ఒక్క మంచి మాట వినిపించడం అరుదే. అయితే అతి పాత పార్టీ కావడం వల్ల కాంగ్రెస్‌కు మౌన మద్దతుదార్ల రిజర్వాయరు ఇంకా ఉండి ఉండొచ్చు. అది పోలింగ్ పండితులకే తప్ప రిపోర్టర్లకు కనిపించేది కాదు. అయినా నేను ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆమ్ ఆద్మీ ప్రభావం పంజాబ్‌లోని ఒక పెద్ద ప్రాంతానికి మాత్రమే పరిమితమైందనే వాదనను కూడా నేను సవాలు చేస్తున్నాను. చిన్న రాష్ట్రమైన పంజాబ్‌ను జాతీయ మీడియా మూడు ప్రాంతాలుగా విడగొట్టేసింది. ఆ రాష్ట్రంలో మూడు భిన్న ప్రాంతాలున్న మాట నిజమే. అమృత్సర్ సహా బియాస్ నదికి పశ్చిమాన ఉన్న జిల్లాలు వీటిలో కెల్లా చిన్న ప్రాంతం. దాన్ని మాఝా అని పిలుస్తారు. లూథియానా, జలంధర్లున్న బియాస్, సట్లేజ్ నదుల మధ్య ఉన్న సుసంపన్న ప్రాంతం దొవాబ్. సట్లెజ్కు తూర్పున, ఇంకా లోతట్టున రాజస్థాన్, హరియాణల సరిహద్దుల్లోని దక్షిణాది మెట్ట ప్రాంతాన్ని మాల్వా అంటారు. అక్కడ 69 శాసనసభా స్థానాలు న్నాయి, మిగతా రెండు ప్రాంతాల్లో కలిపి ఉన్నవి 48. ఆప్ పోటీదారులు, ఎన్నికల పండితులు ఆ పార్టీ ప్రభావం మాల్వాకే పరిమతమని అంటున్నారు. ఒక ప్రాంతంలోని ఇంత బలీయమైన ధోరణిని భౌగోళికతో లేదా నదో అడ్డగి స్తుందని నమ్మడం కష్టమే. మెట్టప్రాంతంగా చెప్పే మాల్వా ప్రాంతాన్నే చూడండి. పచ్చటి పంటలు, కాలువలు, ఇళ్లు చూస్తే దేశంలోని ఏ గ్రామీణ ప్రాంతానికైనా అసూయ కలుగుతుంది. నిజానికి ఇవేవీ 2017 నాటి పంజాబ్‌లో లెక్కకు వచ్చేవి కావు. ఆప్ ఓటర్లకు ఇస్తున్నది ఒకే ఒక్క సందేశం, అదే దాని వ్యూహం: ‘క్రై’ (సీఆర్‌వై) అంటే మార్పు, ప్రతీకారం, యువత. మీకు మార్పు కావాలి. అకాలీలను దించి కాంగ్రెస్‌ను ఎక్కించే క్రీడ ఇంకా ఎందుకు? మీరు అందరిపట్లా ఆగ్రహంతో ఉన్నారు. మాకైతే గతæ అనుభవం ఏమీలేదు నిజమే. కానీ మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఎన్నికల పండితులు చెప్పేదే నిజమైనా ఆప్ ఒక పెద్ద జాతీయ శక్తిగా ఆవిర్భవిస్తుందనడం నిస్సం దేహం. దాని ప్రభావం దేశంపైనా, వచ్చే ఏడాది జరిగే గుజరాత్ ఎన్నికల పైనా ఉంటుంది. శేఖర్ గుప్తా twitter@shekargupta -
అసలు రూపం చూపిన డ్రాగన్
జాతిహితం పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మైన్మార్, శ్రీలంకలకు చైనా చేరువ కావడమంటే భారత్‌ను చుట్టుముట్టడమే. ఇదొక కొత్త ప్రపంచం. కాబట్టి భారత్ కూడా కొన్ని వ్యూహాత్మక సాధ్యాసాధ్యాల గురించి శోధించాలి. దీనికి తొలి మెట్టుగా మొదట మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. హిమాలయాలలో ఉన్న ఒకటి రెండు ప్రతిదాడి భారత దళాలు చైనాను నిరోధించగలవా? కాబట్టి అవకాశం ఉన్నప్పుడు వ్యూహాత్మక విధానంలోకి మారాలి. అద్భుతకాలం అని పిలవదగిన ఒక సమయంలో ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి వినిపించిన మాట ఇది: ప్రపంచ పరిస్థితిని మెరుగుపరచాలి. ఇది కొంచెం తికమక పెట్టే పదమే అయినా ఆశావహమైన మాట. అయితే ఈ శీతాకాలంలో ముగిసిన మరో దావోస్ సదస్సు ముగింపు సమయానికి ఈ మాటను వర్తింపచేయలేం. ఈ సందర్భం అద్భుతకాలం కాబోదు. ప్రపంచీకరణకు పెద్ద చోదక శక్తిగా ఉన్న వ్యవస్థకయితే కచ్చితంగా మంచి కాలమని అసలే అనలేం. అంతేకాదు, ప్రపంచీకరణను శ్లాఘించే వాళ్లకీ, చీత్కరించే వాళ్లకీ కూడా ఇది మహోన్నతకాలం కాదు. ఎందుకంటే ప్రపంచీకరణ ఆలోచన విశ్వవ్యాప్తంగా ప్రతిఘటనను, ప్రతికూలతను ఎదు ర్కొంటున్నది. దీని ఆశయాన్ని నిరంతరం శంకించే వామపక్షీయులూ, ఆ సిద్ధాంతంతో సంబంధం ఉన్న సంస్థల కార్యకర్తలూ మాత్రమే ఇప్పుడు దీనిని వ్యతిరేకించడం లేదు. ధనిక, ప్రజాకర్షక పథకాలు అమలు చేసే ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా దాని ఎడల విముఖ భావనతోనే ఉన్నాయి. అందుకే పారిశ్రామిక విప్లవం గురించి ప్రస్తావిస్తూ చార్లెస్ డికెన్స్ చెప్పిన ‘ఇది అద్భుతం కాలం, ఇది అత్యంత దుర్భర కాలం కూడా’ అన్న వాక్యాలని ఈ సందర్భంలో, అంటే ప్రపంచీకరణ కోసం ప్రార్థిస్తున్న సమయంలో, మరీ ముఖ్యంగా చైనా అగ్రనేత జింగ్పింగ్ అత్యంత మక్కువతో దానికి మద్దతు ఇచ్చిన సందర్భంలో కచ్చితంగా ప్రస్తావిం చుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత బలీయమైన కమ్యూనిస్టు పార్టీలో అగ్రనేత ప్రస్తుతం ప్రపంచీకరణకు పెద్ద మద్దతుదారు. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే నేటి ప్రపంచ పరిస్థితి నిజంగా ఇదే. మనమంతా తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసిన మరో సంగతి–రిపబ్లికన్ పార్టీలో మహా కోటీశ్వరుడు, అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తి ఇప్పుడు ప్రపంచీకరణకు తీవ్ర వ్యతిరేకి. ప్రపంచీకరణ నేపథ్యంలో జీవిస్తున్న నీవు ఈ ప్రపంచ పరిస్థితిని మెరుగుపరచాలన్న ఆలోచనను ఇప్పుడు ఎక్కడ నుంచి ప్రారంభించాలి? ఇప్పుడు వీస్తున్న గాలి ఈ సందర్భాన్ని చక్కగా రూపుకట్టించడానికి మొదట నీవు ఆలోచించే పనిలో దిగుతావు. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ధోరణి నెలకొని ఉన్నది అనే అంశాన్ని గమనించడానికి దావోస్ వైపు ఒకసారి దృష్టి సారిస్తే చాలు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మొదలు, రష్యాలో పుతిన్, జపాన్‌లో ఏబ్, చైనాలో జింగ్, భారత్‌లో నరేంద్ర మోదీ, టర్కీలో ఎర్డొగన్, ఇజ్రాయెల్‌లో నెతన్యాహు వరకు–ఈ అన్ని దేశాలలోను మొనగాళ్లు అనిపించుకున్నవాళ్లు గద్దెనెక్కారు. వీరంతా తమవైన శైలుల్లో వాళ్ల దేశాల పరిపాలనలు సాగిస్తున్నవారే. అయితే వీళ్లందరిలో సా«ధారణంగా కని పించే సారూప్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి జనాకర్షణ. ఇంకా జాతీయతా భావాలు, కొన్ని సందర్భాలలో మామూలుగా, ఇంకొన్ని సందర్భాలలో ధాటీగా కూడా మాట్లాడే స్వభావం కూడా కనిపిస్తాయి. ఒకవేళ వీళ్ల ధోరణులు కాస్త విసుగు పుట్టిస్తే కనుక ఫిలి ప్పీన్స్ను ఏలుతున్న డ్యూటర్టేని చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఆ పని చేయడానికి పూనుకోవద్దు. ట్రంప్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్న అమెరికా ప్రపంచంలో ఇప్పటికీ చాలా శక్తిమంతమైనది. సైనిక, ఆర్థిక, సాంకేతిక రంగాల దృష్ట్యా కూడా బలోపేతమైనది. పుతిన్‌కి నవ్వించే సామర్థ్యం చాలా ఉంది. తన శక్తి నంతా రష్యాకు ధారపోసి, ట్రంప్‌తో సఖ్యంగా ఉన్నాడు. ఏబ్ పీకల్లోతు సమస్యల్లో ఉన్నాడు. అవన్నీ జపాన్ జనాభాకు సంబంధించినవే. మనం జపాన్ మంత్రి కొజొ యామామాటోని ఈ వారం కలుసుకున్నాం. ఆయన చాలా ఆసక్తి రేకెత్తించే మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. దాని పేరు జనాభా క్షీణతను అధిగమించే చర్యల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. చైనా నేత జింగ్‌కు చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఆధిక్యంలో ఉన్న ఈ సూపర్ పవర్ దేశానికి అంతరంగంలో అమెరికా అంటే అభిమానం. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్‌కు కూడా విస్తృతమైన ఐచ్ఛి కాంశాలు చేతిలో ఉన్నాయి. ఇప్పటికి అమెరికాతో భారత్‌కు ఉన్న సంబంధాలు చెక్కుచెదరకుండా ఉండడమే కాదు, అవి మరింత బల పడవచ్చు. పాకిస్తాన్‌తో సంబంధాలు అంకురిస్తున్న తరుణంలో రష్యాతో కొన్ని ప్రయోజనాల ప్రాతిపదికన భారత్ బంధం ఉంటుంది. భారత్‌ను విశ్వసనీయమైన దేశంగా, పెట్టుబడులకు ఆస్కారం ఉన్న దేశంగా జపాన్ భావిస్తోంది. చైనా సంగతి తీసుకుంటే, అప్పుడప్పుడు వాగాడంబరం ప్రదర్శించినా, వీసాల జారీ గురించి మాట్లాడినా, ఐక్యరాజ్య సమితిలో పాక్‌కు మద్దతుగా ఉన్నా కూడా, భారత్‌తో 70 బిలియన్ డాలర్ల మిగుల వాణిజ్య ప్రయోజనాలు ఆ దేశానికి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, చైనా ఉత్పత్తులను నిరోధిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన వాగ్దానం కనుక నిజంగా అమలైతే భారత్‌తో చైనా వాణిజ్యం మరింత అనివార్యమవుతుంది. దావోస్‌లో చైనా విశ్వరూపం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్న సమయంలోనే ఈ వ్యాసం రాయడం జరిగింది. ప్రపంచం గురించి భారత్‌కు సహజంగా మొదటి నుంచి ఉన్న ఆలోచనా సరళి హేతుబద్ధమైనదే కావచ్చు. అయినా అది కాలం చెల్లినదే. చైనాకు సంబంధించి అయినప్పటికి ఆ సరళి మరింత చురుకైనదిగా ఉండడం అనివార్యం. చైనా మనకు అత్యంత సమీపంగా ఉన్న పొరుగుదేశం. పైగా భారత్‌కు భౌగోళికంగా వ్యూçహా త్మకం అనదగిన దేశాలతో పాచికలు వేస్తున్నది. వస్తూత్పత్తి ఆర్థిక వ్యవహారాలలో కొత్త ధోరణులను తీసుకువచ్చే అంశంలో ప్రపంచంలోనే అధిక ప్రాధాన్యం సంతరించుకున్న దేశం కూడా చైనాయే. ఈ ధోరణే వ్యూహాత్మక శక్తిగా అవతరించడానికి ఆ దేశానికి వరంగా మారింది. ఇప్ప టికీ ఇదే దాని విశాల దృష్టి. ఇంకా చెప్పాలంటే విశ్వ శ్రేయస్సుకు సదా నిబద్ధతతో కూడుకున్నది. కచ్చితంగా చెప్పాలంటే నిస్వార్థమైనది. దీనికి సంబంధించిన జాడలు దావోస్‌లో జింగ్పింగ్ ఇచ్చిన విశే షమైన ఉపన్యాసంలో రూపుకట్టాయి. ఆయన చైనాను స్వేచ్ఛా వాణి జ్యానికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకీ మద్దతుదారుగా చూపించారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక సుంకాలను విధించాలని (ఇది ఎలాంటిదంటే చలి, వర్షాల నుంచి రక్షణకు మనలను మనం గదిలో బంధించుకుంటే అక్కడకి గాలీ వెలుతురు కూడా రావు) శాంతియుత సహజీవనానికీ, వాతావరణంలో మార్పులకీ ఇవన్నీ నేడు అవసరమని ట్రంప్ ప్రసంగించారు. అబద్ధాల పుట్ట డ్రాగన్ స్వేచ్ఛా వాణిజ్యం మీద, ప్రపంచ వాణిజ్యంలో అనుసరించే చట్టాలూ నిబంధనలపై గౌరవ ప్రకటన పట్ల చైనా చెప్పిన మొత్తం మాటలన్నీ మోసపూరితాలే. చైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక శక్తులు గూగుల్, ట్వీటర్లను దిగ్బంధనం చేసింది. సుంకాలతో పాటు, సుంకేత రమైన సమస్యలను కూడా కల్పించింది. కార్పొరేట్ కార్యాలయాల మీద దాడులు చేయవలసి వచ్చినప్పుడు వాటి కంప్యూటర్ల నుంచి డేటాను ఖాళీ చేస్తుంది. కొత్త డేటాను నింపుతుంది. ఉగ్రవాదానికి ఆ దేశం ఇస్తున్న మద్దతుకు అనుగుణంగా కొత్త ద్వీపాలను సృష్టిస్తుంది. పొరుగు దేశాలకు చెందిన భూమిని హెక్టార్ల కొద్దీ కలుపుకుంటుంది. తనకు ప్రయోజనం అనుకుంటే ఉగ్రవాది మసూద్ అజర్‌ను కూడా సమర్ధిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో, క్లీన్ టెక్నాలజీ (ఉత్పత్తులు, సేవల విషయంలో పర్యా వరణానికి ప్రతికూలం కాని విధానం), శాంతియుత సహజీవనాల గురించి చైనా చెప్పే సుద్దులు ఎంత అబద్ధమంటే ప్రచురించడానికి సాధ్యం కాని ఆ ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదంతో–అదే ‘బి’తో ఆరం భమై ‘టి’తో ముగుస్తుంది–మాత్రమే వ్యక్తీకరించగలం. జింగ్పింగ్ ఉప న్యాసం ప్రపంచ నాయకత్వం మీద వారికున్న ఆశను కూడా ప్రతిబిం బించింది. ఇన్ని ఆశలు ఉన్న అలాంటి దేశం మన పొరుగునే ఉంది. మన దేశానికి చెందిన చాలా భూభాగాలను తనవిగా చెప్పుకుంటున్న దేశం కూడా. ‘వన్ బెల్ట్’, ‘వన్ రోడ్’ (అభివృద్ధి కోసం చైనా, అంటే జింగ్పింగ్ సూచిస్తున్న భూ, సముద్ర మార్గాల వ్యూహానికి పేరు) అంటూ జింగ్పింగ్ ప్రస్తావవశంగా చేసిన ప్రతిపాదన ప్రపంచంలో శక్తిమంతమైన దేశాలు తిరోగమన దశలో ఉన్న కాలంలో చేసినదని గమనించాలి. ఇదే అంశాన్ని ఆ దేశం నుంచి వచ్చిన ఒక అధికార ప్రతినిధి తరువాత మరింత వివ రించారు కూడా. ఆయన దీనిని 64 దేశాల ప్రాతినిధ్యం ఉన్న, 100 సంవత్సరాల పథకంగా వర్ణించారు. ఇది చైనా తనదైన నాటో శిబిరం గురించి చెప్పడమే కాదు, తన భౌగోళిక స్వరూపాన్ని కూడా చూపిం చింది. అది ఒకింత పెద్దది కూడా. అయితే సహకార, సంపదలపై చైనా ప్రతిపాదన అన్న మాటను ప్రయోగించడం చారిత్రక కారణాల దృష్ట్యా, చరిత్ర అనుభవాల మేరకు నాకు సుతరాము ఇష్టం లేదు. కానీ నేరుగా సైనిక బలగాల ప్రస్తావన లేకుండా కొన్ని ఆలోచనలను మాత్రం ఆ దేశం బయటపెట్టింది. ఇందుకు ఉదాహరణ సీపీ ఈసీ. ఈ భ్రమలో ములిగిన పాకిస్తాన్ వ్యూహాత్మక దృష్టి ఇప్పటికే మారిపోయింది. మన ఆలోచనా విధానం మారాలి పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మైన్మార్, శ్రీలంకలకు చైనా చేరువ కావడమంటే భారత్‌ను చుట్టుముట్టడమే. ఇదొక కొత్త ప్రపంచం. కాబట్టి భారత్ కూడా కొన్ని వ్యూహాత్మక సాధ్యాసాధ్యాల గురించి శోధిం చాలి. దీనికి తొలి మెట్టుగా మొదట మన ఆలోచనా విధానాన్ని మార్చు కోవాలి. హిమాలయాలలో ఉన్న ఒకటి రెండు ప్రతిదాడి భారత దళాలు చైనాను నిరోధించగలవా? కాబట్టి అవకాశం ఉన్నప్పుడు వ్యూహాత్మక విధానంలోకి మారాలి. 1962 నుంచి 2017 నాటికి ప్రపంచం ఎంతో దూరం ప్రయాణించింది. మన వ్యూహాత్మక దృష్టి కూడా అందుకు తగ్గట్టే ప్రయాణించాలి. శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘రద్దు’ ఆటలో మోదీదే పైచేయి
జాతిహితం నల్లధనం ఎంతుంది? ఎక్కడ, ఎవరు దాచారు, దాన్ని రాబట్టడానికి ఉత్తమమైన లక్ష్యాలు ఎవరు? ఏదీ మనకు తెలియదు. ‘‘పరిష్కారం’’ మాత్రం మొత్తం డబ్బునంతటినీ పీల్చి పారేసి, చట్టబద్ధమైనదిగా ముద్రవేసిన దాన్ని తిరిగి ఇవ్వడమూ, మిగిలేదంతా లాభం అనుకోవడమే. సాధారణ మానవుని మెదడు రెండు భిన్న మైన అర్ధ భాగాలుగా ఉంటుంది. వాటిలో ఒక్కొక్కటీ విభిన్నమైన, క్లిష్టమైన పనులను చేస్తుంది. అధికారంలో ఉన్న రాజకీయ నేత మెదడులోని ఆ రెండు భాగాలనూ రాజ కీయాలు, పరిపాలనగా విభజించడం వీలుగా ఉంటుంది. ఒకటి పథకాలను, పన్నాగాలను పన్నుతూ అధికారాన్ని అందు కోవడానికి అనువుగా మాట్లాడేలా చేస్తుంది. రెండవది అతడు ఆ అధికారాన్ని ప్రయోగించగలిగేలా చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో ఇది ఎలా పనిచేస్తుంది? ప్రత్యే కించి పెద్ద నోట్లను రద్దు చేసిన తదుపరి ఈ పరిశీలన అవసరం. 2014 సార్వత్రిక ఎన్నికలకు చాలా ముందే ఆయన బుర్రలోని రాజకీయ భాగం గురించి మనకు చాలా తెలుసు. ఆయన, సుప్రసిద్ధ నాడీ వైద్యుని వలే ప్రజాభిప్రాయాన్ని కచ్చితంగా పసిగట్టగల సెవంత్ సెన్స్ (ఏడవ జ్ఞానేంద్రియం) ఉన్న అత్యంత గొప్ప రాజకీయ నేత. 2002–2007 మధ్య, 2012–2014 మధ్య ఆయన ఓటర్ల అత్యంత సున్నితమైన భావాలను మీటుతూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చారో మనం చూశాం. ఆ మేర కు, కనీసం ఇప్పటివరకు మోదీ ఈ దఫా కూడా విజయం సాధిస్తున్నారు. రాజకీయంగా (ఎన్నికలపరంగా) ఆయన ఆలోచన సూటిగానే ఉంది : ఎలా కూడబెట్టిందైనా దేశంలో బోలెడంత నల్లధనం ఉన్నదని మీరు విశ్వసిస్తున్నారా? అవును అనే సమాధానం. కాబట్టి మరిన్ని ప్రశ్నలు వస్తాయి. లక్షల కోట్ల నల్లధనాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి తీసుకు రాకుండానే దేశం పురోగమించగలదా? కాదు అనే సమాధా నమే వస్తుంది. విదేశాలలోని నల్లధనాన్ని తిరిగి రప్పించడానికి, క్షమాభిక్ష పథకం ద్వారా దేశంలోని అక్రమార్జనను రాబట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామా లేదా? అభిమానులైతే అవును చేశాం అంటారు. విమర్శకులు లేదంటారు. అత్యధికులు అనిశ్చితితో ఉంటారు. ఒక్కో పౌరునికి రూ. 15 లక్షల కానుక వాగ్దానాన్ని మీరు విశ్వసించినా, సందేహించినా అది మరుపున పడిపోయేదేం కాదు. అన్ని ఇతర ప్రయత్నాలూ చేశాకే పెద్ద ఎత్తున అమాయకులకు హాని కలిగే అవకాశం ఉన్న ఈ చివరి చర్యకు దిగారా? అనేదే తాజా ప్రశ్న అవుతుంది. ఇది కష్టభరితమైన నిర్ణయమని నాకు తెలుసు. కానీ మీరు నన్ను ఎన్నుకున్నది ఇందుకు కాదా? అనేదే మోదీ సమాధానం. ఇంతవరకు ఈ వాదనతో ఆయన నెగ్గుకొస్తున్నారు. నా కోసం, దేశం కోసం ఒక్క యాభై రోజులపాటూ ఇబ్బంది పడండి. అద్భుత భారతదేశాన్ని మీకు ఇస్తాను అంటున్నారాయన. నల్లధనం లేని కోట్లాది మంది ప్రజల్లో అధికులను ఈ మాటలు ఉత్తేజ పరుస్తు న్నాయి. అయితే ఈ చర్య వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాటిల్లే నష్టం ఎంత? నికర ఫలితాలు ఏమిటి? అనేవి ఆ తర్వాత రెండేళ్ల వరకు కాకున్నా, కొన్ని నెలల వరకైనా మనకు తెలియవు. జనాదరణ పొందే భావనను, నినాదాన్ని కనిపెట్టడమే రాజకీయాల్లో ముఖ్య మైనది. ఎన్నికల రీత్యా అద్భుత ప్రతిభాశాలిౖయెన ఏ నేతా తాను నెరవేర్చగలనని నమ్మే∙వాగ్దానాలపైనే ఆధారపడరు. 1969లో ఇంది రాగాంధీ కాంగ్రెస్‌ను చీల్చి బ్యాంకుల జాతీయ కరణ, రాజభరణాల రద్దు వంటి చర్యలు చేపట్టారు. గరీబీ హటావో (పేదరిక నిర్మూలన) నినాదాన్ని కనిపెట్టారు. ప్రతిపక్షాలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఏకమై, ఆమె కట్టుకథలను ప్రచారం చేస్తున్నారన్నాయి. కానీ ఆమె ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పేదరిక నిర్మూలనకు నిజమైన ప్రణాళికగానీ, అసలు ఆ ఉద్దేశం గానీ ఇందిరకు లేదు. కాకపోతే ఓటర్లలో చెల్లుబాటయ్యే నినాదాన్ని ఆమె కనిపెట్టారు. పేదరికాన్ని ఆమె ఎలా నిర్మూలించగలరు? ఆమెను ఎలా విశ్వసించగలం? అనే మాటలు తప్ప... ప్రతిపక్షాల వద్ద అంతకంటే పెద్ద ఆలోచన లేదు. ఓటర్లు ఆమెనే నమ్మారని మనకు తెలుసు. చాలా కాలం తర్వాత గానీ ఆమె విధానాలు దేశాన్ని బికా రిని, తమను మూర్ఖులను చేశాయని ఓటర్లు గ్రహించలేదు. బ్రెగ్జిట్, డొనాల్డ్ ట్రంప్‌ల విజయాలు ఇందుకు ఇటీవలి ఉదా హరణలు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ప్రచారం సాగించిన వారు బ్రిటన్ను పరిరక్షించి, తిరిగి గొప్పదాన్ని చేస్తామని వాగ్దానం చేస్తూ వాగాడంబరాన్ని ప్రదర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణలో గెలిచి, యూరప్‌ను విచ్ఛిన్నం చేశారు. తదుపరి పరీక్షకు నిలిచేసరికి చేతులు ఎత్తేశారు. అలాగే ట్రంప్ కూడా అమెరికాను మళ్లీ గొప్పదిగా చేస్తానని వాగ్దానం చేశారు. నిజానికి అమెరికా మునుపెన్నటికన్నా నేడే అతి గొప్పదిగా ఉన్నదని వివేకవంతులెవరైనా అంటారు. ట్రంప్ దాన్ని మరింత గొప్పదిగా ఎలా చేయగలరు? ఎప్పుడు, ఎలా చేస్తారు? అని అడగకండి. ఆయన ఎన్నికల్లో గెలుపొందారు అంతే. అదే రాజనీతి. సరిగ్గా ఇక్కడే మోదీ తక్షణ యుద్ధంలో గెలుపొందుతున్నారు. 1970 లలో ఇందిర తన ప్రత్యర్థులను అందరినీ పేదరిక నిర్మూలనకు వ్యతి రేకులుగా ఇరికించేసినట్టుగా... మోదీ తన ప్రత్యర్థులను ప్రతికూల స్థితిలోకి నెట్టేస్తున్నారు. ఈ చర్య వల్ల కలిగే ఫలితాలు తర్వాతగానీ లెక్కకు రావు. నిరుపేదలు ఆయన కోరుతున్న అసౌకర్యానికి సిద్ధప డుతున్నారు. ఈలోగా ధనవంతులు బహుశా నల్లధనాన్ని దాచడానికి నూతన మార్గాలను అన్వేషిస్తుంటారు. అందువల్ల మోదీ బుర్రలోని రాజకీయ అర్ధభాగం అద్భుతంగా పనిచేస్తోందని నిర్ధారించవచ్చు. ఇకపోతే ఆయన బుర్రలోని రెండో భాగానికి వస్తే... పరిపాలన విషయంలో మోదీ అనుసరిస్తున్న వైఖరిని సూచించే ముఖ్యమైన చర్య నోట్ల రద్దు. అసలు నల్లధనం ఎంతుంది? ఎక్కడ ఎవరు దాచారు, దాన్ని రాబట్టడానికి, ప్రక్షాళన చేయడానికి అభిలషణీయమైన ఉత్తమ మైన లక్ష్యాలు ఎవరు? ఏదీ మనకు తెలియదు. ‘‘పరిష్కారం’’ మాత్రం మొత్తం డబ్బునంతటినీ పీల్చిపారేసి, చట్టబద్ధమైనదిగా ముద్రవేసిన దాన్ని తిరిగి ఇవ్వడమూ, మిగిలేదంతా లాభం అను కోవడమే. ఆధీనరేఖను దాటి పాకిస్తాన్లో చేసిన లక్ష్యిత దాడుల పర్యవసానాలు ఏమిటో ప్రజలకు తెలియదు. అలాగే ఇదీనూ. మీరు ఈ ప్రభుత్వ అభిమాని అయితే సెహ్వాగ్‌లాగా బంతిని చూసి, బాది పారేయడంతో పోల్చవచ్చు, కాకపోతే పరిపాలనకున్న సంప్రదాయక నిర్వచనంతో పోల్చి చూడవచ్చు. ఏది ఏమైనా ఇది గడ్డు కాలం. twitter@shekargupta శేఖర్ గుప్తా -
మెత్తని ‘కత్తి’.. గెలిపించే శక్తి
జాతిహితం మన మెత్తని బలం, పాకిస్తానీలు మన సినిమాలను మన క్రీడాకారులను అభిమానించ డానికే పరిమితమైనది కాదు. మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు నెలకొనడంలో సొంత ప్రయోజనాలు ఇమిడి ఉన్న పాక్ నటీనటులు అంతకంటే కాదు. వాటికంటే పెద్దది భారత ఉదారవాద, ప్రజాస్వామ్య వ్యవస్థలది, సంస్థలది. ఒక దేశం మరో దేశంలోకి చొరబాటు దార్లను, ఉగ్రవాదులను పంపి హింసాకాండను సృష్టించడం ద్వారానే ప్రభావితం చేయలేదు. ఉత్తమ ఉదాహరణగా నిలవడం ద్వారా కూడా ఆ పని చేయగలుగుతుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి చరిత్రాత్మకమైన లాహోర్ బస్సు యాత్రకు బయ లుదేరిన 1999 ఫిబ్రవరి 22న ప్రధాని కార్యాలయం జుట్టుపీక్కోవాల్సి వచ్చింది. ఆ అర్ధరాత్రి వేళ దేవానంద్‌ను తీసుకు రావడం ఎలా? దేవానంద్ అంటే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పిచ్చి అభిమానం. ఆ విషయం నాటి మన ప్రధాని అటల్జీకి అప్పుడే గుర్తుకొచ్చింది. మరో దేవానంద్ అభిమాన్ని ఎలాగోలా ఆయన వద్దకు వెళ్లి వాజ్‌పేయితో బస్సు యాత్రకు అందుకోగలుగుతారా? అని అడిగారు. ఆయన ఆనందంగా వచ్చేశారు. ఆ పర్యటనలో దేవానంద్ రాక ప్రధాన ఆకర్షణ అయింది. ఆ సినీ మాంత్రికుడు అక్కడ బాల్ డాన్స్ చేశారు, రాజకీయవేత్తలను, ప్రముఖులను, మొత్తంగా పాకిస్తాన్ మీడియాను ఉల్లాసపరుస్తూ గడిపారు. వ్యూహాత్మకంగా అంత ముఖ్యమైన పర్యటనను ఆయనేమీ ఆషామాషీగా చూడలేదు. దేవానంద్‌ను తీసుకెళ్లడం ద్వారా ఆయన అప్పుడు భారత్‌కు ఉన్న మెత్తని బలాన్ని (సాఫ్ట్ పవర్) ఉపయోగించారంతే. పాక్‌పై సాంస్కృతిక, క్రీడాపరమైన, విద్యాపరమైన మొత్తం బహిష్కర ణను విధించాలంటూ సాగుతున్న నేటి ప్రచారాన్ని చూస్తుంటే నాకు... మెత్తని బలం అంటే ఏమిటో ఇంకా అర్థంకాని లేదా గుర్తించని రోజులనాటి ఆ విషయం గుర్తుకొస్తోంది. గౌతం గంభీర్, సౌరవ్ గంగూలీ వంటి గొప్ప క్రికెట్ క్రీడాకారులు సైతం కార్యక్రమంలో చేరారు. మెత్తని బలాన్ని ప్రయోగించా ల్సినది మెత్తని వారి మీదనే అంటున్నారు. పాక్ సమస్య పరిష్కారానికి కుసుమ కోమలమైన సుతి మెత్తని వైఖరి పనికిరాదంటున్నారు. కాబట్టి పాక్‌తో అన్ని సంబంధాలూ తెంచేసుకుని, దాన్ని ప్రపంచంలో అంటరాని రాజ్యంగా నిలపాలి. భారత్ సాగిస్తున్న ఉగ్రవాద (పాకిస్తానీ) వ్యతిరేక పోరా టంలో మిగతా ప్రపంచమంతా చేరేలా ఒప్పించి అప్పుడు చూడమంటు న్నారు. గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ముందు తరువాత సంభవిం చిన కొన్ని తాజా పరిణామాలు ఈ వైఖరికున్న పరిమితులను నొక్కి చెబుతు న్నాయి. 2014 మేలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశం ప్రపంచ శక్తిగా అవిర్భవించిందని మన టీవీ స్టూడియో యుద్ధ యోధులు, ‘‘యుద్ధ వాద’’ విశ్రాంత సైనిక, గూఢచార అధికారులు, దౌత్యవేత్తలు విశ్వసిస్తు న్నారు. వాస్తవంలో మనం అందుకు బహు దూరంలో ఉన్నాం. మెత్తని బలం అంటే ఏమిటి? మెత్తని బలం అనే సిద్ధాంతానికి మద్దతుదార్లు, వ్యతిరేకులు కూడా ఉన్నారు. జూనియర్ బుష్ మొదటి దఫా అమెరికా అధ్యక్షునిగా ఉండగా రక్షణ మంత్రిగా ఉన్న డొనాల్డ్ రమ్స్ఫీల్డ్ను, మొత్తని బలాన్నిమీరు విశ్వసిస్తారా? అని అడిగితే ‘‘అదేమిటి?’’ అని అమాయకంగా అతి సుప్రసిద్ధ సమాధా నాన్ని చెప్పారు. గట్టి, సైనిక బలం, బల ప్రయోగాలను కోరే వారిలో ఆయన అగ్రగణ్యులు. ప్రపంచాన్ని, అమెరికా ప్రయోజనాలను, భావి తరాల ప్రయో జనాలను ఆయన ఎలా చింద ర వందర చేసి వెళ్లారో కూడా మనకు తెలుసు. రోగిని నిలువుగా కోసేసి వ్రణాన్ని తొలగించకుండానే లేదా తిరిగి కుట్లయినా వేయకుండానే అపరేషన్ బల్లపై (ఇరాక్, అఫ్గానిస్తాన్) అలాగే వదిలేసి పోయారు. 1990లలో, ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో ‘మెత్త్తని బలం’ అనే భావనను హార్వర్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ న్యే జూనియర్ మొదట నిర్వ చించారు. 2006లో రాసిన ఓ వ్యాసంలో ఆయన... బుష్ రెండవ దఫా అధ్యక్షునిగా ఉండగా కండోలిజా రైస్ వద్ద మెత్తని బలం గురించి పాఠాలు నేర్చుకున్నారని, మెత్తని బలాన్ని, బహిరంగ దౌత్యాన్ని మరింత ఎక్కువగా ప్రయోగించారని రాశారు. ఇప్పుడు స్టూడి యోలో, పార్టీలు చేసుకునే బృందాల్లో, ఎయిర్ పోర్ట్‌లో, పార్లమెంటులో, ఎక్కడైనాగానీ మెత్తని బలం అనే మాట వింటేనే విరగబడి నవ్వుతారు. ప్రత్యే కించి న్యే అన్నట్టు మెత్తని బలం అనే ఆయన సిద్ధాంతాన్ని ‘‘అతిగా సాగదీశారు, మెలికలు తిప్పారు, కొన్ని సందర్భాల్లో గుర్తుపట్ట లేనంతగా చేసేశారు.’’ మెదళ్లను మెలి తిప్పడం మెరుగు న్యే ఇలా వివరించారు... మెత్తని బలం అని పిలుస్తున్న కారణంగానే అది మెత్తనిది అయిపోదు. అలాగే అది తప్పనిసరిగా మరింత మాన వత్వంతో కూడినది అని కూడా కాదు, అది కేవలం ‘‘విలువలను ప్రబోధించేది కాదు.’’ మీ గట్టి బలాన్ని ప్రయోగిస్తారా? లేక మెత్తని బలాన్ని ప్రయోగిస్తారా? అనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఒక జనరల్ ఎడారి యుద్ధంలో గెలవడానికైతే పెద్ద ట్యాంకుల బలగాన్ని ప్రయోగిస్తాడు. వియత్నాం అడవుల్లో అయితే అందుకు ఇతర పద్ధతులు అవసరం అవుతాయి. దీన్ని మరింతగా వివరిస్తూ అయన.. మీరు తుపాకీ చూపి అవతలి వాడి డబ్బును దోచుకోవచ్చు లేదా త్వరగా ధన వంతులు కావచ్చని మోసగించి కాజేయొచ్చు లేదా ఆధ్యాత్మిక యాత్రలో తనతో చేరమంటూ అతన్ని ఒప్పించి ఆస్తినంతా మీ పేరిట రాయించేసు కోవచ్చు. మొదటివి రెండూ గట్టి బలానికి ఉదాహరణలు కాగా, మూడోది మెత్తని బలానికి ఉదాహరణ. ‘‘కానీ ఫలితం మాత్రం దొంగతనమే.. చేతులు మెలి తిప్పడం కంటే మెదళ్లను మెలి తిప్పడం మెరుగు.’’ ప్రపంచ శక్తిగా భారత ప్రయోజనాలకు లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే, భారత్-పాక్ సంబంధాలకు ఈ తర్కాన్ని విస్తరింపజేయడం ఎలా? మెత్తని బలం అంటే ఆహారం, సంస్కృతి, సాహిత్యం, క్రీడలేనా? అలా అయితే కోకా కోలా, మెక్ డొనాల్డ్స్, మైఖేల్ జాక్సన్, మడోనాలు సోవియట్ కూటమిని ఇంకా చాలా ముందుగానే జయించేసి ఉండేవారు. లేకపోతే చైనావారు వారి ఆహారం ద్వారా మన మెదళ్లను, హృదయాలను కూడా శాసించేవారు. లేదా దేశీ వెజిటబుల్ ప్రైడ్ రైస్‌ను నాశనం చేసేలా, అది మాదంటే మాదని మనతో యుద్ధానికి దిగేవారు. మెత్తని బలం అంటే జాతీయ విలువలు, విధానాలు ప్రజాస్వామ్యం, రాజకీయాల నాణ్యత, సంస్థల దృఢత్వాలకు సంబంధించినది కూడా. మెత్తని బలం, కేవలం పాకిస్తానీలు టీవీ చానళ్లలో మన సినిమాలను చూడటానికి, మన క్రీడా హీరోలను ఆరాధించడానికి లేదా మన జనరంజక గేయాలను ఆలపించడానికి మాత్రమే పరిమితం కాదు. అది మరింత ఎక్కువ సుప్రసిద్ధ్దులైన పాకిస్తానీలు, క్రీడాకారులు మాత్రమే కారు. ప్రత్యేకించి మన దేశంలో జీవనాధారాన్ని సంపాదించుకుంటూ, మెరుగైన ద్వైపాక్షిక సంబం ధాలు నెలకొనడంలో సొంత ప్రయోజనాలు ఇమిడి ఉన్న నటీనటులు అంత కంటే కాదు. ఇవన్నీ లెక్కలోకి వచ్చేవే, కానీ వాటికంటే మరింత పెద్దదైన భారత ప్రభావం నైతికంగా మరింత ఆకర్షణీయమైనది. మెరుగైన ప్రజా స్వామ్యం, మరింత ఉదారవాద సమాజం, మైనారిటీలతో వ్యవహరించే తీరు, ఎక్కువ వాక్ స్వాతంత్య్రం, సున్నితమైన, ప్రశ్నించే మీడియా, కోర్టులు, పర్యావరణ చట్టాలువంటివన్నీ కలిసి ఆకర్షణీయమైన ఆ బ్రాండ్ ప్రభావా నికి మూల సారంగా ఉంటాయి. దాన్ని మీరు మెత్తని బలం అనొచ్చు లేదా గట్టి బలం అనొచ్చు లేదా నిర్వచించలేనిది అనొచ్చు. గట్టిగా పనిచేసే మెత్తని బలం ఒక దేశం మరో దేశంలోకి చొరబాటుదార్లను, విద్రోహులను, ఉగ్రవాదు లను పంపి హింసాకాండను సృష్టించడం ద్వారానే దాన్ని ప్రభావితం చేయ లేదు. తానే ఉత్తమ ఉదాహరణగా నిలవడం ద్వారా కూడా ఆ పని చేయ గలుగు తుంది. మరింత ఉదారవాద, ప్రజాస్వామిక శక్తులు నియంతృత్వంతో పోటీ పడేటప్పుడు అది ఎప్పుడూ అద్భుతంగా పనిచేసింది. 25 ఏళ్ల క్రితం ‘సెమి నార్’ పత్రికలో నేను ‘‘పాకిస్తాన్: ఎ హ్యాక్స్ ఎజెండా’’ అనే వ్యాసం రాశాను. పాశ్చాత్య కూటమి, ప్రత్యేకించి అమెరికా తన ప్రజాస్వామిక, ఉదారవాద, సాంస్కృతిక ప్రభావాలతో (మెత్తని బలం అనే పద ప్రయోగం అప్పటికి వాడుకలో లేదు) ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్ కూటమిని ఓడించ గలిగిందో అందులో వివరించాను. భారత్ దాన్ని క్షుణ్ణంగా అధ్య యనం చేసి, దాన్ని తన పాక్ విధానంలో అల్లాలి. రిపోర్టర్‌గా నేను పాక్‌లో చాలా సార్లు పర్యటించా. భారత సంస్థల ప్రభావం అక్కడి విధాన నిర్ణేతలపై ఎంత బలంగా ఉందో చూసి నివ్వెరపోయాను. ప్రభావశీలురైన అక్కడి వ్యక్తులు నన్ను పంపమని కోరిన వాటిలో నాటికి పాక్ పంజాబ్ ఆర్థిక మంత్రి, తర్వాత విదేశాంగ మంత్రియైన షా మెహమూద్ ఖురేషీ కోరిన కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిటీ నివేదిక ఉంది. అలాగే నవాజ్ (మొదటి పదవీ కాలంలో) కరాచీలో స్వతంత్రంగా పనిచేయడానికి అధికారాలను కోరు తున్న సెన్యానికి నియమ నిబంధనలను రూపొందించడానికి మన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కోరారు. నేడు మనకు పదవీ విరమణ వరకు కొనసాగిన 29 మంది ఆర్మీ చీఫ్‌లు ఉండగా, పాక్‌కు 15 మంది మాత్రమే ఉన్నారు. ఇది కూడా సానుకూల ప్రభావమే అవుతుంది. దాన్ని మెత్తని బలం అంటారా లేదా గట్టి బలం అంటారా మీ ఇష్టం. సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, క్రీడలు తదితరాలన్నీ జాతీయ ప్రయోజనాల రీత్యా బలాన్ని హెచ్చించే గుణకాలు కాగలుగుతాయి. నాలుగు దశాబ్దాల పాటూ రాజ్ కపూర్ మొత్తం కమ్యూనిస్టు దేశాలన్నిటిపైనా సానుకూల ప్రభావం నెరపలేదా? అది కేవలం సోవియట్ యూనియన్‌కే పరిమితం కాలేదు. తియనాన్మెన్ స్క్వేర్ నరమేధం జరిగిన 1989 వేసవిలో చైనా రాజధాని బీజింగ్‌లో సైతం ప్రభావాన్ని చూపింది. ఆ ఘటనపై మా కథనాన్ని మొత్తాన్ని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక హోటల్ ఉద్యోగులు (అధి కారిక అనుమతి లేకుండా) ఫ్యాక్స్ చేసి పంపారు. ప్రతిగా ఫ్యాక్స్ పంపు తున్నంత సేపూ మేం ఆపకుండా ‘ఆవారా హూ’ పాటను పాడుతుండాలని మాత్రమే కోరారు. అమెరికన్లు హాలీవుడ్‌నే కాదు, డిస్నీ ల్యాండ్ సందర్శనను కూడా అంతర్జాతీయ సందర్శకుల కార్యక్రమంలో భాగంగా చేర్చారు. మరింత పెద్ద సంప్రదాయక, అణు ఆయుధాగారాన్ని పెంపొందింపజేసు కుంటున్నా వారు... సోవియట్ల పట్ల మరింతగా తెరలు దించుకుని, మొండి తనంతో ఉండలేదు. పారదర్శకంగా ఉండటం అనేది దాపరికం లేని సమా జాల ఆయుధాగారాల్లో గొప్ప శక్తివంతమైన అస్త్రం అవుతుంది. శేఖర్ గుప్తా twitter@shekargupta -
అసంబద్ధత మన జన్యుగతం
జాతిహితం మనం పండిస్తున్న, తీసుకుంటున్న ఆహారంలో జన్యుమార్పిడి పంటలకి ఇప్పటికే చాలా చోటు ఇచ్చాం. కానీ దీని గురించి ఎవరూ ఫిర్యాదు చేయడంలేదు. దేశీయంగా జన్యు మార్పిడి విధానంతో తయారుచేసిన ఆవాల వినియోగాన్ని అనుమతించడం వెనుక అలుముకున్న అర్థంలేని భయాలు ఇకనైనా సమసిపోవాలి. వాటిలోని విషపు లక్షణాలు, ఎలర్జీ లక్షణాల గురించి జరిగిన అధ్యాయాలన్నీ కూడా ఆ ఆవాలు నిరపాయకరమనే చెప్పాయి. ఇప్పుడు మన పత్తి విత్తనం కూడా జన్యుమార్పిడి పంట నుంచి వచ్చినదే. మనకీ, భవిష్యత్ తరాలకీ కూడా ఎంతో కీలకమని చెప్పదగిన అంశాలు వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నాయో గమనించాలంటే ఢిల్లీ విశ్వవిద్యా లయం దక్షిణ క్యాంపస్‌కి ఒక్కసారి నాతో కలసిరండి. ఢిల్లీలోని రావు తులా రామ్ మార్గ్‌కు ఒక కొసన వాయువ్యంగా ఉన్న ఈ విద్యా ప్రాంగణం ఉనికి గురించి బహుశా ఢిల్లీలో కూడా చాలామందికి తెలియదు. నిజానికి ఇప్పుడు అక్కడికి చేరుకోవడం కూడా పెద్ద సవాలే. ఎందుకంటే నత్తనడకన సాగు తున్న మా మెట్రో నిర్మాణం మూడో దశ కోసం ఆ ప్రదేశమంతా గోతులు తవ్వారు. ఆ ప్రాంగణమంతా ఈ వారంతంలో జరిగే విద్యార్థి ఎన్నికలకి సంబంధించిన వాల్‌పోస్టర్లతో నిండిపోయి ఉంది. ఆ ప్రాంగణం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ చాలా ముఖ్యమైన కార్యాలయాలతో పాటు, బహుశా దేశంలోనే చెప్పుకోదగిన బయోటెక్నాలజీ ప్రయోగశాల కూడా ఉంది. మూడు దశాబ్దాల శ్రమ అదొక చిన్న ప్రయోగశాల. ఒక అంతస్తులో ఒక భాగంలో ఏర్పాటు చేశారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండవచ్చు. అందులో 22 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న దాదాపు రెండు డజన్ల మంది పరిశోధకులు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాల వారి పాలిట భూతంలా తయారైన వివిధ రకాల జన్యు మార్పిడి పంటల సాంకేతిక పరిజ్ఞానం మీదే పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే ఈ పరిశోధనా కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ఆచార్య దీపక్ పెంతాల్ మాత్రం జన్యు మార్పిడి పంట అన్న పదమే తప్పుదోవ పట్టించే విధంగా ఉందని మరీ మరీ చెప్పారు. జన్యమార్పిడి పంటలు (జెనెటికల్లీ మోడీఫైడ్) అనడానికి బదులు జెనెటికల్లీ ఇంజనీయర్డ్ (జీయీ) అని చెప్పడం సముచితంగా ఉంటుందని ఆయన అంటున్నారు. కానీ ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూశాక, వికృతమైపోయిన ఈ పారిభాషిక పదాల ఇబ్బంది పెద్ద విషయమే కాదని అనిపిస్తుంది. ప్రొఫెసర్ పెంతాల్, జన్యు, వంగడాల సృష్టి పరిశోధనలో ఆయనతో పని చేస్తున్న ఐదుగురు ముఖ్య పరిశోధకులు 32 ఏళ్ల పాటు శ్రమించి తయారుచేసిన దేశవాళీ జన్యు మార్పిడి ఆవాలు అన్ని కోణాల నుంచి నిరపాయకరమైనవని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జీఈఏసీ) ఆమోద ముద్ర వేయ డంతో ఊపిరి పీల్చుకున్నారు. జన్యు మార్పిడి ద్వారా సృష్టించిన ఈ విత్తనం 2002 నుంచి అందు బాటులోనే ఉందని ప్రొఫెసర్ పెంతాల్ చెప్పారు. అప్పటి నుంచే విజ్ఞానశాస్త్ర శంకితులు, నిరాశావాదులతో ఎడతెగని యుద్ధం ఆరంభమైంది. ఇలాంటి శంకలకు తెరపడాలని ప్రొఫెసర్ పెంతాల్ అన్నారు. ఈ ఆవాలు ఎంత సురక్షితమైనవో వివరిస్తూ జీఈఏసీకి తమ శాస్త్రవేత్తల బృందం సమర్పించిన నాలుగు వేల పేజీల నివేదికలోని అంశాలను కూడా చూపించారు. ఈ పరిశోధన మీద లేవనెత్తిన సందేహాలు, శంకల గురించి ఆయన కొంత తాత్విక ధోరణిని ప్రదర్శిస్తున్నప్పటికీ, కొన్ని అపనిందలు, దూషణలు కూడా ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రొఫెసర్ పెంతాల్ నాకు గుర్తు చేసినంత వరకు ఆఖరికి గ్రంథచౌర్యం వంటి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇలాంటి విమర్శలు ఆయనను పరిశోధన తృష్ణ నుంచి పక్కకి తప్పించినా ఆశ్యర్యం లేదు. జన్యు మార్పిడి పంటలు మనకు తెలిసినంత వరకు రాజకీయ రంగును అద్దుకున్న, ఉద్విగ్నపూరిత అంశం. అలాగే ఈ పంటల గురించి వాస్తవాలను ఇతర పరిశోధనలతో బేరీజు వేసినప్పటికీ అవి ఊహాజనిత వాస్తవాలూ, భయాల ముందు వీగిపోతూ, మితవాద, అతివాద సిద్ధాంతాల వారిని కూడా ఏకం చేస్తున్నాయి. పవిత్ర గ్రీన్‌పీస్, పరమ పవిత్ర స్వదేశీ ఉద్య మకారులనీ లేదా ఆరెస్సెస్ వారినీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యమకారుల భయాలు వీరి భయాలలో చాలా ముఖ్యమైనది విదేశీ భయం. జన్యుమార్పిడి పంటకు ఉపయోగించే విత్తనాలను దుష్టశక్తులు తయారు చేశాయనీ, పీక్కు తినే బహుళజాతి సంస్థలు పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయనీ, అవి జన్యు పంటల నిల్వల ధరలనూ, సరఫరానూ శాసిస్తాయనీ, పేద దేశాల రైతులను బానిసలుగా మార్చుకుంటాయనీ ఉద్యమకారులకు భయాలు ఉన్నాయి. కానీ ఈ ఆవాలు మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిర్వహణలోని ఒక ప్రయోగశాలలో తయారై, దాని అధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రయోగశాలకు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా నిధులు అందిస్తున్నాయి. రాజీవ్‌గాంధీ జాతీయ విత్తన సంస్థకు నిధులు అందిస్తున్న డాక్టర్ వర్ఘీస్ కురియన్ జాతీయ పాడి పరిశ్ర మాభివృద్ధి బోర్డు కూడా అలా నిధులు అందిస్తున్న సంస్థలలో ఒకటి. భారతదేశంలో వంటనూనెల కొరత ఉంది. ఏటా పెద్ద ఎత్తును దిగుమతులు కూడా జరుగుతాయి. దేశంలో చమురు గింజల పంటలలో ఆవ పంటది మూడో స్థానం. దీని ఉత్పత్తి ఇప్పుడు 25 నుంచి 30 శాతం పెరగబోతోంది. 1987లో దీపక్ పెంతాల్ అనే ఆ యువ శాస్త్రవేత్త ఈ ప్రయోగశాలను ప్రారం భించినప్పుడు కురియన్ కన్న కల కూడా అదే (ప్రొఫెసర్ పెంతాల్ నేను చండీగడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థులం. ఆయన నాకంటే కొన్నేళ్లు ముందు చేరినా ఒకే విద్యార్థి వసతిగృహంలో ఉండేవాళ్లం). పరిశోధన క్రమం ప్రొఫెసర్ పెంతాల్ వృక్షశాస్త్రజ్ఞుడు. రట్జర్స్ నుంచి పీహెచ్. డీ. పట్టా తీసుకున్నారు. ఈ పరిశోధన చేస్తున్నప్పుడు, తరువాత పోలండ్‌లో కొద్ది కాలం బోధనావృత్తిలో ఉన్నప్పుడు ఆయన ఆవాల పరిశోధన మీద మమ కారం పెంచుకున్నారు. ఒక పోలండ్ రకంతో, భారతీయ రకం విత్తనంతో సాధారణ సంకరీకరణ తీరులో పరపరాగ సంపర్కం గావించడానికి (క్రాస్ పోలినేషన్) జరిగిన పరిశోధనలో ఆయన పనిచేశారు. నిజానికి అది సాధ్యం కాని సంగతి. ఆవపువ్వు లక్షణమే అందుకు కారణం. దీనిని వృక్షశాస్త్రజ్ఞులు హెర్మాఫ్రోడైట్ అని పిలుస్తారు. స్త్రీపురుషాంగాలు రెండూ ఈ పువ్వులోనే ఉంటాయి. అంటే వేరే జాతి వీర్యాన్ని ప్రవేశపెట్టడానికే ముందే తానే స్వయంగా ఫలదీకరణం చెందుతుంది. అయితే ఏమైంది? అని ఆలోచించారా యన. అందులోని పురుష లక్షణాన్ని పరిపూర్ణంగా నిర్మూలిస్తే సరిపోతుందని అందుకు మార్గం కనిపెట్టారు (ఇక్కడ నేను కావాలనే పారిభాషిక పదాలను వదిలి, సాధారణ భాషను ప్రయోగిస్తున్నాను). అలా ఆయన ఒక స్త్రీరకంతో వేరేదానితో పరపరాగ సంపర్కం చేయించారు. నిజానికి అప్పటికి జెనెటికల్ ఇంజనీరింగ్ అనేది చాలా కొత్త అంశం. ప్రొఫెసర్ పెంతాల్, ఆయన కీలక అనుయాయులు దీనిని ఒక సవాలుగా తీసుకున్నారు. బర్నేస్, బారస్టర్, బార్ అనే మూడు కొత్త జన్యువులను దేశీయమైన మన ఆవ రకంలో ప్రవేశ పెట్టారు. మొదటి రెండు రకాలు సాధారణ నేల బాక్టెరియం నుంచి వచ్చాయి. మూడో జన్యువు స్ట్రెప్టోమైస్ అనే జాతికి చెందినది. ఇవన్నీ కూడా నిరపాయకరమైనవే (లేదా నాన్ పేథోజనిక్). నిజానికి ఆవలో 85,000 జన్యువులు ఉంటాయి. పెంతాల్ బృందం కృషి ప్రొఫెసర్ పెంతాల్ బృందంలోని శాస్త్రవేత్తలంతా వారి యవ్వన ప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు కలసికట్టుగానే పనిచేశారు. అనేక పత్రిక లలో నలభైకి పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. అనేక మంది యువతీ యువకుల చేత పరిశోధనలు చేయించారు. అందరికీ చాలామంది అవకాశాలు వచ్చాయి. ప్రొఫెసర్ పెంతాల్ ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవికి ఎంపికయ్యారు. అయినప్పటికీ ఆయన ఎన్నడూ తన ప్రయోగశాలను విడిచిపెట్టలేదు. పైగా వీసీ పదవీకాలం ముగియగానే మళ్లీ పూర్తి సమయం ఆ ప్రయోగశాలకే కేటాయించారు. అయితే గడచిన దశా బ్దాలుగా దేశీయమైన మన విజ్ఞానశాస్త్రంలో సంభవించిన పతనానికీ, ప్రతిభకు పట్టిన దుస్థితికీ, మన పరతంత్రతకీ మనమంతా సామూహికంగా సంతాపం ప్రకటించాలి. అతి పెద్ద సమస్య ఏమిటంటే, మన శాస్త్రవేత్తలు ఏదైనా ఉన్నతోద్యోగంలోకి ప్రవేశిస్తే వెంటనే పరిశోధనకు మంగళం పాడడమేనని అంటారు ప్రొఫెసర్ పెంతాల్. ఇలాంటి వాళ్లనే ఆయన సైన్స్ బ్యూరోక్రాట్స్ అని పిలుస్తారు. ఆయనకి యూపీఎస్సీ సభ్యత్వం కూడా వచ్చింది. ఐదేళ్లపాటు నరకప్రాయంగా ఉండే ఆ పదవిలో చేరకుండా తన ఆవాల పరిశోధనకే పునరంకితమయ్యారు. భారతీయులంతా రుచిచూసినవారే! మీరు పండించిన జన్యు మార్పిడి పంటల ద్వారా వచ్చిన ఆవాలను మీరు వినియోగించి, మీ సంతానం కూడా ఉపయోగించేటట్టు చేయగలరా అని మీరు వారిని అడగవచ్చు. తప్పకుండా అని వారు చెబుతారు. వాటికి అనుమతి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాలు వినియోగిస్తున్నాయనీ చెబుతారు. వాటిలోని విషపు లక్షణాలు, ఎలర్జీ లక్షణాల గురించి జరిగిన అధ్యాయాలన్నీ కూడా ఆ ఆవాలు నిరపాయకరమనే చెప్పాయి. ప్రపంచ వ్యాప్తంగా జన్యుమార్పిడి పంటల ఉత్పత్తులతో చేసిన కోట్లాది వంటకాలను ప్రజలు ఆరగిస్తున్నారు. నిజానికి వీటిని తీసుకోవడం వల్ల హాని జరగదని హామీ ఇచ్చే ఎలాంటి పత్రాలు లేకుండానే వారంతా ఆ ఆహారాన్ని విని యోగిస్తున్నారు. అలా ఆమోదం పొందిన మొదటి జన్యుమార్పిడి ఆవ పంట పేరు కానోలా. కెనడాలో 1996లో రూపొందించిన జన్యుమార్పిడి ఆవ గింజలవి. వాటినే ఏటా భారతదేశం దాదాపు నాలుగు లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది. వీటి గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. సోయాబీన్ ఉన్న వంటనూనెలు, వనస్పతి కూడా అంతకంటే ఎక్కువ దిగుమతి అవుతున్నాయి. వీటికి మూలం జన్యుమార్పిడి పంటలే. ఇప్పుడు మన పత్తి విత్తనం కూడా జన్యుమార్పిడి పంట నుంచి వచ్చినదే, లేదా బీటీ కాటన్. ప్రతి భారతీయుడు ఇప్పుడు జన్యుమార్పిడి వంటనూనెలు తీసుకుంటున్నా డని కచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఎవరూ ప్రతిఘటించడం లేదు. అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో చాలా భాగం, నిజానికి చైనా కూడా జెనెటిక్ ఇంజనీరింగ్‌ను ఆశ్రయించినవే. రచయిత:శేఖర్ గుప్తా twitter@shekargupta -
అమెరికాతో తెగిన గతం బంధనాలు
జాతిహితం ప్రచ్ఛన్న యుద్ధం అంతరించి, ఏక ధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది.ఆ ధ్రువం ఆకర్షణ శక్తి క్షీణిస్తుండగా మరో ధ్రువం వృద్ధి చెందుతోంది. ఏదో ఒక మేరకు బలాబలాల సమతూకం నెలకొంటోంది. క్యూబా, ఇరాన్, అమెరికా తమ పాత శత్రుత్వాలను పాతిపెట్టేశాయి. భారత్ తటపటాయిస్తూనే ఉంది. మోదీ ఆ గతాన్ని చెత్తబుట్టలోకి విసిరేశారు. ప్రజా స్వామ్యంలో అధికారం చేతులు మారుతుందే గానీ విదేశాంగ, వ్యూహాత్మక విధానాలు స్థూల జాతీయ ఏకాభిప్రాయం పునాదిగానే కొనసాగుతాయనే అపోహను తొలగించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కిక్కిరిసిన ఢిల్లీ ఐఐటీ ఆడి టోరియంలో జరిపిన ఇష్టాగోష్టికి నేను ప్రయోక్తగా వ్యవహరించాను. ఆ సందర్భంగా కెర్రీ భారత్, అమెరికాలు ‘చారిత్రక తటపటాయింపులను వదు ల్చుకున్నాయి’ అని అన్నారు. ఈ పదబంధాన్ని కెర్రీ ఈ ఏడాది మొదట్లో మన ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్లో చేసిన ప్రసంగం నుంచి స్వీకరించారు. చారిత్రకమైన తటపటాయింపులే కాదు, కాపట్యాలు కూడా ఉన్నాయన డానికి అద్భుతమైన ఆధారాలున్నా వాటిని గమనించేటంత దాకా కెర్రీ పోలేదు. ఐఐటీ క్యాంపస్ నుంచి అలా నడిచివెళ్లేంత సమీపంలోనే గమాల్ అబ్దుల్ నాసర్ పేరిట ఉన్న ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులోని ఒక భాగాన్ని చూసే వారు. ప్రచ్ఛన్న యుద్ధం/అలీన విధానం కాలం నాటి ఆ ఈజిప్ట్ నియంత వారసత్వాన్ని ఆ దేశస్తులే తిరస్కరించారు. ఆయన పేరిట ఉన్న మార్గం బహుశా ప్రపంచంలో అదొక్కటే. అదే రింగ్ రోడ్డు తూర్పున ఓ మైలు దూరంలో హోచిమిన్ మార్గం అయిపోతుంది. ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా భారత రాజధాని వీధుల్లో, ముఖ్య స్థలాల్లో సజీవంగానే ఉందనడానికిఇది నిదర్శనం. అయితే ఇది సగం కథ మాత్రమే అవుతుంది. అదే రోజు సాయంత్రం కెర్రీ అంతుబట్టని రీతిలో ఢి ల్లీలో మరో రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణాలేమిటా అని ఊహాగా నాలు సాగాయి. కాలం చెల్లిన విధానాలకు చెల్లు చీటి వానాకాలపు వరదలు ఢిల్లీ నగరాన్ని ఎంతగా ముంచెత్తినా విమానాశ్రయం మాత్రం నిక్షేపంగా ఉంది! మరుసటి రోజుకుగానీ ఆ కీలక కారణమేమిటో బయటపడలేదు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ అల్ సిసీ లాంఛనంగా ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. కెర్రీ ఆయన్ను ఇక్కడ కలుసుకోవాలనుకున్నారు. చరిత్రకు సంబంధించి భారత్‌కు ఉన్న తటపటాయింపులు, కపటత్వాలను ఇది నొక్కి చెబుతుంది. 25 ఏళ్ల క్రితమే ప్రచ్ఛన్న యుద్ధం అంతరించి, ఏక ధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది. ఆ ధ్రువం ఆకర్షణ శక్తి సైతం క్షీణించి, మరో ధ్రువం వృద్ధి చెందుతోంది. అది దాన్ని సవాలు చేయకపోయినా సతాయిస్తోంది. అది తక్కువగా వ్యవస్థీకృతమైనదే అయినా ప్రపంచస్థాయి బలాబలాల సమతూకం నెలకొనడానికి దారి తీస్తోంది. క్యూబా, ఇరాన్, అమెరికా తమ పాత శత్రుత్వాలను పాతిపెట్టేశాయి. భారత్ మాత్రం తటపటాయిస్తూనే ఉంది లేదా కొంత భాగం ఈ మార్పును హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటే మరో భాగం గతంలో గడ్డకట్టుకు పోయి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యంలో అల్ సిసీని ఢిల్లీలో కలుసుకోవడానికి కెర్రీ ఇలా ఆగిపోవడం ఈ తటపటాయింపులు, కపట త్వాలను... ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే మేధోపరమైన సోమరితనాన్ని దిగ్భ్రాంతికరంగా వెల్లడి చేస్తుంది. నాసర్ మార్గ్ గుర్తు వద్ద ఆ ముగ్గురు నేతలూ కలసి ఫొటో దిగేలా చేయలేక పోవడం ఎంతటి విచారకరం? అయితేనేం నేడు వచ్చిన మార్పు ప్రాధాన్యాన్ని మీరు గుర్తించగలరు, అర్థం చేసుకోగలరు. బెర్లిన్ గోడ కూలిన తదుపరి వచ్చిన ప్రధానులలో ప్రాముఖ్యతగలిగిన వారు ముగ్గురు... పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మో హన్‌సింగ్. వారు ఈ పాత విముఖతను వదల్చడానికి ప్రయత్నించారు. ఒక్కొక్కరు తమవైన భిన్న పద్ధతుల్లో, తామున్న పరిస్థితుల్లో ఆ పని చేయడానికి యత్నించారు. అయితే ఎక్కడో ఒక చోట కాపట్యాలకంటే తటపటాయింపులే ఎక్కువగా వారి ప్రయత్నాలను నీరుగార్చాయి. పీవీ అమెరికాతో మైత్రిని కోరితే, వాజ్‌పేయి భారత్ అమెరికాలు వ్యూహాత్మక భాగస్వాములంటూ ఎన్ఎస్ఎస్పీపై (వ్యూహాత్మక భాగస్వామ్యంలోని తదు పరి చర్యలు) సంతకం చేశారు. కానీ తీవ్ర జాతీయవాద ఆర్ఎస్ఎస్ దీన్ని అనుమానంతో చూసి, వ్యూహాత్మక నిపుణుడు బ్రజేష్ మిశ్రా అమెరికాకు అతిగా అనుకూలుడని భావించింది. ఇక మన్మోహన్సింగైతే మన రెండు దేశాలు సహజ మిత్రులు అనే భావనను వాడారు. ఎన్ఎస్ఎస్పీని ముందుకు తీసుకుపోయి అణు ఒప్పందంపై సంతకాలు చేసి తన ప్రభు త్వానికి ముప్పును సైతం ఆహ్వానించారు. ఆ తదుపరి సమాచారం, ఎత్తుగడలు, సరఫరాల సహకారం, ఉమ్మడి శిక్షణలపై మరిన్ని సైనిక- వ్యూహాత్మక ఒప్పం దాల కోసం చర్చలు జరిపారు. అయితే ఆయన పార్టీకే చెందిన చేతులు ముడుచుకు కూచున్న ప్రచ్ఛన్న యుద్ధ యోధులు నాటి రక్షణ మంత్రి ఏకే ఆంథోనీ నేతృత్వంలో ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. మోదీ ఆ గతాన్ని నిస్సం కోచంగా చెత్తబుట్టలోకి విసిరేశారు. నిస్సంకోచంగా తొక్కిన కొత్త బాట కొనసాగింపు, నిలకడా, వాటికి విరుద్ధంగా స్థాన చలనం, మార్పు అనేవి భారత విదేశాంగ విధాన రూపకల్పనలో ఎడతెగని చర్చగా ఉంటూ వచ్చాయి. వాటిలో మొదటిదే సునాయాసంగా విజయం సాధిస్తుండే ది. ప్రజా స్వామ్యంలో అధికారం చేతులు మారుతుంది. అలా అని విదేశాంగ, వ్యూహాత్మక విధానంలో స్థాన చలనం సైతం జరుగుతుందని అర్థం కాదు. అవి విశాల జాతీయ ఏకాభిప్రాయం ప్రతిపదికపై అవి తప్పక కొనసాగు తాయి. ఇదే ఇంతవరకు దాదాపుగా ఎదురేలేని విజ్ఞతగా చలామణి అయింది. మోదీ అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరంలోకి ప్రవేశి స్తుండగా ఆయన ఈ అపోహను తొలగించారు. ఇది కేవలం అమెరికాను నిస్సంకోచంగా వాటేసుకోవడం మాత్రమే కాదని మీకేఅనిపిస్తుంది. త్వరలో అమెరికాకు కొత్త అధ్యక్షులు రానున్నారు. ఈ ఏడాది చివరికి అధ్యక్షునిగా ఉండేది ఎవరో ఆ దేవుడికే ఎరుక. అయినా ఫర్వాలేదనే వైఖరికిగానీ లేదా అలీన దేశాల (నామ్) శిఖరాగ్ర సమావేశానికి గైర్హాజరు కావడమనే సంకేతాత్మక చర్యగానీ చెప్పేది అదే. చైనా పట్ల, ఇస్లా మిక్ ప్రపంచం పట్ల వైఖరిలో కూడా ఇది కనిపిస్తుంది. చైనాతో సంబం ధాలలో దాదాపు అసాధ్యమైన వ్యూహాత్మక కదలికను తేవడాన్ని ఆయన తన వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. పూర్తి లావాదేవీల రూపంలోని సంబంధా లను తిరిగి మలచుకోవాలన్న ఆయన ప్రయత్నం ఇంకా సఫలం కాలేదు. మన మార్కెట్లు మనకు కావాలి, కనీసం ఆ విషయంలోనైనా సంబంధాలు ఒడిదుడుకులకు గురికాకుండా చూసుకోవాలి. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ), మసూద్ అజర్ తదితర వ్యవహారాల్లో చైనా ప్రతి కూల వైఖరి చేపట్టినప్పుడు మోదీ వీధి పోరాట యోధునిలాగా స్పందిం చారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. చైనా నుంచి తక్కువ సాంకేతికత, నైపుణ్యాలతో తయారయ్యే చౌక దిగుమతులపైకి చాక చక్యంగా స్వదేశీ దాడిని సాగిస్తున్నారు. గత వారంలో ఆయన సంప్రదాయక మైన మట్టి విగ్రహాల పట్ల ప్రేమ, విశ్వాసాల ప్రాధాన్యాన్ని గురించి మాట్లాడటాన్ని గమనించండి. చైనా నుంచి ఆకర్ష ణీయమైన ప్లాస్టిక్ బొమ్మలను దిగుమతి చేసుకోవడం చౌక అని చెప్ప నవసరం లేదు. తెగిపడ్డ గతం బంధాలు అలాగే ఇస్లామిక్ ప్రపంచంతో.. సున్నీలు షియాలు ఇద్దరితో ద్వైపాక్షిక, లావాదేవీలపరమైన సంబంధాలను పెంపొందింపజేసుకోవడం కోసం ఆయన వ్యక్తిగత, దేశ ప్రతిష్టలు రెండిటినీ ఉపయోగిస్తున్నారు. అమెరికా నుంచి యూరప్‌కు, చైనాకు చివరకు సౌదీ అరేబియా, యూఏఈల వరకు అన్ని దేశాలకు ఇస్లాం తీవ్రవాదం విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఐఎస్ఐఎస్ విస్తరణను వెనక్కు మరల్చడానికి ఇరాన్ కీలకమైనదిగా కనిపిస్తోంది. అందుకు దాన్ని ఉపయోగించుకునే అవకాశం మోదీకి ఉంది. ఆ పని చేస్తున్న క్రమంలోనే ఆయన ఇస్లామిక్ ప్రపంచంతో సంబంధాలను పాలస్తీనా ఇజ్రా యెల్ సమస్యతో ముడిపెట్టి నిర్వచించుకోవడమనే పాత బంధనాలను ఆయన పూర్తిగా తెంచుకున్నారు. కశ్మీర్ సమస్య ఒకప్పటిలాగా భారత్‌ను భయపెట్టే సమస్యగా లేకపోవడం గురించి ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఈసీ) దేశాల నుంచి గుసగుసలు వినవస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్-బలిస్తాన్, బలూచిస్తాన్ సమస్యలను లేవనెత్తడాలతో కూడిన నూతన పాకిస్తాన్ విధానానికి దోహదం చేసినది ఈ వైఖరే. క శ్మీర్పై ఆచితూచి ప్రవర్తించడమనే 25 ఏళ్ల పాత వైఖరిని పూర్తిగా విడనాడారు. అయితే ఈ కొత్త వైఖరి ఫలితాలనిస్తోందనడం చర్చనీయాంశం కావచ్చు. ఆ పాత వైఖరి వల్ల ఇక ఎలాంటి ప్రయోజనమూ లేదని మోదీ భావించారు. ప్రత్యేకించి పాకిస్తాన్ నానాటికి మరింత ఏకాకి అవుతున్న పరిస్థితుల్లో, దానికి ఉన్న తలనొప్పి సృష్టించే (తద్వారా బ్లాక్మెయిల్ చేయడం) విలువ క్షీణించిపోతుండగా... పాత వైఖరిని విడచి ముందుకు సాగడం అవసరమని మోదీ భావన. ఈ విషయాన్ని ఇలా చూడండి: పాకిస్తాన్ 22 మందిని కాదు వంద మంది రాయబారులను ప్రపంచమంతటికీ పంపి భారత్‌తో తమకు కశ్మీర్ సమస్య ఉన్నదని చెప్పగలదు. అయితే, భారత్... పాకిస్తాన్‌తో, అది ఎగు మతి చేసే ఇస్లామిక్ ఉగ్రవాదంతో అందరికీ సమస్య ఉందని తిప్పి కొట్టగలదు. తిరుగే లేని వాదనఇది. కశ్మీర్/పాకిస్తాన్ సమస్యలపై మన పాత విధానాన్ని కొనసాగించడానికి బదులుగా మోదీ దానితో తెగతెంపులు చేసు కోవడాన్ని వివరించేది కూడా అదే. అయితే దీనికి మరో విషయంలో కలిగిన విధానపరమైన చలనాన్ని కూడా నొక్కి చెప్పడం అవసరం. మోదీ ప్రభుత్వం అణు తటపటాయింపులను కూడా వదుల్చుకుంది. అణు ప్రతినిరోధ శక్తిని ఇక నెంత మాత్రమూ పాకిస్తాన్ చేతుల్లోనే ఉంచడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి మోదీ చేతులకు ఆ బంధనాలు ఇప్పుడు లేవు. రచయిత:శేఖర్ గుప్త twitter@ shekar gupta -
పుకార్లతో ‘వాస్తవాల’ తయారీ
జాతిహితం రంగీలా నుంచి రాజీవ్ వరకూ, మన్మోహన్ నుంచి నేటి మోదీ వరకు ఢిల్లీ దర్బారు సంస్కృతి భారత అధికారిక నిర్మాణాలలో వ్యవస్థాపరమైన కొనసాగింపును కాపాడింది. నన్నడిగితే ఏ ప్రభుత్వమైనా ఆరు నెలలు అధికారంలో ఉండేసరికి ‘‘ఒక’’ ప్రభుత్వంగా మారిపోతుంది. గుసగుసలపై ఆధారపడి నడిచే రాజధాని నగరాల శక్తి అలాంటిది. కాకపోతే ఆ గుసగుసలాడేవారు మారుతుంటారంతే. పుకార్లే సమాచారమైన చోట, కథలను మోసుకొచ్చే వారే చివరికి నిజమైన అధికారాన్ని నెరపుతారు, చరిత్రను సృష్టిస్తారు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా కాలంలో ఢిల్లీ దర్బారులోని అత్యంత విలువైన నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు చెందిన దండయాత్రికుడు నాదిర్ షా కొల్లగొట్టుకుపోయాడు. మహమ్మద్ షా (1710-48) గురించి ఆలోచనాపరులైన చరిత్రకారులెవరైనాగానీ ఆయన కళలను, సంగీతాన్ని, పండితులను పోషించేవాడని చెబుతారు. నిత్యోల్లాస పురుషుడినంటూ తనకు తానే ‘సదా రంగీలా’ (ఎప్పటికీ ఉల్లాసంగా/సకల వర్ణశోభితంగా) అనే బిరుదును ధరించాడు. కానీ ఆయన ప్రతిష్ట మాత్రం సుఖలోలుడైన భ్రష్ట సోమరి చక్రవర్తిగానే పాత ఢిల్లీ గోడలపై చెక్కి కని పిస్తుంది. నాదిర్ షా ఢిల్లీ దిశగా దండెత్తి వస్తుండగా... ఆయన రాజధాని లోని హిజ్రాలనందరినీ పోగుచేసి నాదిర్‌తో పోరాటానికి పంపాడని మౌఖిక గాథలు చెబుతాయి. అది నిజమేనా? అని ఆ కాలానికి చెందిన చరిత్రకారుడు విలియం డార్లింపుల్ను సంప్రదించాను. ఈ కథనానికి ఎలాంటి చారిత్రక ఆధారమూ లేదని ఆయన తెలిపారు. పైగా ‘‘రంగీలా గురించి చెప్పేదాని కంటే కూడా అతడు రాజకీయంగా చాలా ఎక్కువగా విజయవంతమ య్యాడు’’ అని ఆయన అన్నారు. మహమ్మద్ షా వాస్తవానికి శక్తివంతులైన కమాండర్ల నేతృత్వంలో బలమైన సైన్యాన్ని నిర్మించాడు. నాదిర్ షాకు వ్యతిరేకంగా కర్నాల్ వద్ద ఆ సైన్యం యుద్ధం సాగించాయి. అయితే, చిత్తుగా ఓడిపోయాయి (దగ్గర్లోనే పానిపట్ పట్టణంలో ఉంది). కాకపోతే, తన తలతోపాటూ, తన ముఖ్య సేనా నాయకులందరి తలలను నరికి నాదిర్ షా పుర్రెల పర్వతాన్ని తయారు చేయనివ్వకుండా అతనికి లొంగిపోయాడు. చివరికి తన అమూల్య సంపదలన్నిటినీ కోల్పోయాడు. అలాంటి చెప్పు కోదగిన పాలకుడు ఆయన ఎన్నడూ యుద్ధానికి పంపని హిజ్రాల కారణం గానే గుర్తుండిపోయాడు. ఆ కథను పదేపదే చెప్పగా చెప్పగా చివరికి వాస్త వంగా మారిపోయింది. అస్తమించిన సామ్రాజ్యాల రాజధానులు పనిచేసే తీరు ఇదే. ఢిల్లీ అలాంటి వాటిలో అత్యంత పురాతనమైనది. ‘సంబంధాల’ కోసం వేట వాషింగ్టన్ ఎలా పని చేస్తుందో చెబుతూ ‘న్యూయార్క్ టైమ్స్’ సీనియర్ పాత్రికేయుడు మార్క్ లీబోవిచ్ 2013లో ‘‘దిస్ టౌన్’’ను వెలువరించాడు. అధికార కేంద్రమైన ఆ నగరమూ, అందులోని అనుసంధానాల వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనేదాన్ని ఆయన మొరటుగానూ సరదాగానూ, వాస్తవిక దృష్టితోనూ వర్ణించాడు. అమెరికన్లు ‘‘ఇన్సైడ్ ద బెల్ట్‌వే’’ అన్నా, మనం ‘‘ల్యూటియన్లు’’ అన్నా, మొఘలాయిలు ఢిల్లీ అన్నా ఒకటే... తెరవెనుక అధికార కేంద్రాల వ్యవహారాలే. కెన్నడీ సెంటర్లో అత్యంత శక్తివంతుడైన ఒక వ్యక్తి అంత్యక్రియల గురించి చెప్పిన లీబోవిచ్ పుస్తకంలోని ఈ భాగం గుర్తుండిపోతుంది. ‘‘వాషింగ్టన్లో జరుగుతున్న అతి ముఖ్యమైన ఈ సాగ నంపే తంతు సంబంధాలను నెలకొల్పుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలుగ జేస్తుంది’’ అంటూ ఆ చనిపోయిన ప్రత్యర్థులు, మిత్రులూ అంతా అలాంటి సమయంలో సంబంధాలను విస్తరింపజేసుకోవడం కోసం విపరీతంగా ప్రయాసపడతారు, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యాపారం జోరుగా సాగు తుంది. అధికారం, లాభాల బేరసారాలకు పనికొచ్చే కరెన్సీగా సమాచారాన్ని వాడతారు. ఆ తర్వాత ఆయన మీడియా-పరిశ్రమల సమ్మేళనం గురించి చెప్పుకొస్తాడు. వాషింగ్టన్ లేదా మరే ఇతర గొప్ప పురాతన నగరంలాగే ల్యూటియన్ ఢిల్లీలోనూ పుకార్లు, వదంతుల మీద ఆధారపడే దర్బారు సాగుతుంటుంది. కాకపోతే ఇక్కడ మీడియా-పరిశ్రమల సమ్మేళం మరింత ఆసక్తికరంగా ఉంటుందంటాను. నేను నీ వీపు గోకుతాను, నువ్వు నా వీపు గోకు... ఈలోగా ఇద్దరం ఒకరి గ్లాసు వైన్‌లో మరొకరం విషం కలుపుకుందాం అనే నీతిపై ఆధారపడే సాగుతుంది. కథలను మోసేవారే చక్రం తిప్పేది నా స్నేహితురాలు తవ్లీన్‌సింగ్ తన ‘‘దర్బార్’’ పుస్తకంలో సరిగ్గా ఇదే విష యాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఆ పుస్తకానికి ఆమె ఆ పేరు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇక తవ్లీన్ తాజా పుస్తకం ‘‘ద బ్రోకెన్ ట్రిస్ట్’’లో ఆమె తన వాదనను మరిన్ని వర్తమాన ‘‘కథనాల’’తో కొనసాగించారు. అవన్నీ మళ్లీమళ్లీ చెప్పగా చెప్పగా, కొంత కాలానికి వాస్తవంగా మారిపోతాయి. రంగీలా నుంచి రాజీవ్ వరకూ, మన్మోహన్ నుంచి నేటి మోదీ వరకు ఢిల్లీ దర్బారు సంస్కృతి భారత అధికారిక నిర్మాణాలలో వ్యవస్థాపరమైన కొన సాగింపును కాపాడింది. నా దృష్టిలోనైతే ఏ ప్రభుత్వమైనాగానీ ఆరు నెలలు అధికారంలో ఉండేసరికి ‘‘ఒక’’ ప్రభుత్వంగా, ఏ పాలకుడైనా ‘‘ఒక’’ పాలకునిగా మారిపోతారు. గుసగుసలపై ఆధారపడి నడిచే రాజధాని నగరాల శక్తి అలాంటిది. కాకపోతే ఆ గుసగుసలాడేవారు మారుతుంటారంతే. అయితే, గుసగుసలు, వదంతులు, పుకార్లు బాగా అమ్ముడుకాగల సరుకు. పాశ్చాత్య తరహా రోజువారీ దుస్తుల్లో వచ్చిన ప్రకాశ్ జవ్దేకర్ను మరింత సాధారణమైన దుస్తులు ధరించి రమ్మని ఎయిర్‌పోర్టుకు తిప్పి పంపేశారన్న గుసగుస గుర్తుకొచ్చిందా? లేదా, అయితే రాజ్‌నాథ్‌సింగ్ తన ‘‘కుమారునికి అవినీతి కార్యకలాపాలు కట్టిపెట్టేయమని చెప్పిన’’ విషయమైనా గుర్తుకొ చ్చిందా? మళ్లీమళ్లీ తిరిగి చెప్పగా అవి ‘‘వాస్తవాలు’’గా మారిపోలేదా? గుసగుసలకున్న మహత్తరమైన శక్తిని తెలుసుకోవాలంటే.. ఔరంగజేబు తర్వాతి కాలపు విజయవంతమైన మొఘల్ చక్రవర్తులంతా తాగుబోతులు, అవినీతిపరులైన మూర్ఖులుగా మారిపోయిన వైనాన్ని చూడండి. పుకార్లే సమాచారమైన చోట, కథలను మోసుకొచ్చే వారే చివరికి నిజమైన అధికా రాన్ని నెరపుతారు, చరిత్రను సృష్టిస్తారు. ‘‘అందుబాటు’’ అనే తన మౌలిక సాధనాన్నే అనుమానాస్పదంగా చూసే ఈ వాతావరణంలో ఒక రాజకీయ పాత్రికేయురాలు ఎలా పని చేయాలి? ఒక పద్ధతి మీరు మీ కలుగులోకి తిరోగమించి, అక్కడ జమకూడి ఉండే మీకు ఆమోదయోగ్యులు, మీ మిత్రులు, కుటుంబ సభ్యులు, మీ కుక్కలు, పిల్లులతో కలసి ఈ ప్రపంచం తీరును తిట్టిపోయడం. లేదా బయటకు వెళ్లి ఎదుర్కోవడం. మీరు పరిహసించే ఈ ప్రపంచంలో మీరు కూడా భాగం కాదా? అని తనను పదే పదే అడుగుతుంటారని లీబోవిచ్ అన్నారు. ఈ విషయంలో ఆయన తన తప్పును అంగీకరించారు. అయితే ఆయన దాన్ని ‘‘ఈ నీటిని ఎవరు కనిపెట్టారు? నాకు తెలియదు, అయినా అప్పుడు నేను చేపను కాను’’ అని, అటు పిమ్మట ‘‘నేనూ’’ ఒక చేపనే అని అంగీకరిస్తాడు. నేను దీన్ని కబడ్డీగా పోలుస్తాను. ఢిల్లీ లేదా వాషింగ్టన్ డీసీ దర్బారు లోపలా, దాని చుట్టూ సాగే రాజకీయ జర్నలిజంలో మీరు కబడ్డీ ఆటలో లాగా అవతలి పక్షం కోర్టులోకి వెళ్లి, వారిని వేధించి, ఎవరో ఒకర్ని అంటుకుని, పాయింట్లు సంపాదించి పట్టుబడకుండా తిరిగిరావాలి. ఇదంతా మీరు ఊపిరి బిగబట్టే చేయాల్సి ఉంటుంది. అది తేలికేమీ కాదు, అలా అని అసాధ్యమూ కాదు, సరదా అయినది కూడా. ఇప్పటి కొత్త పరిస్థితిలో లీబోవిచ్ చేప కావడం అనైతికం అవుతుంది. మీరు అత్యంత వివేకవంతమైన మీ ఎలుక కలుగులోకి దూరి దాక్కోవడమే చేస్తారు. విభజన రేఖను దాటి, చెడ్డ వ్యక్తిని తాకి, చెక్కుచెదరకుండా తిరిగి రావాలని విశ్వసించడం ఇప్పుడు ఫ్యాషనేమీ కాదు. రెండేళ్ల క్రితం, యువ పాత్రికేయుడు... మీరు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు కదా, మీకు సహాయం చేస్తున్నవారు ఎవరు? అని అడిగాడు. చురుగ్గా, విజయవంతంగా పనిచేస్తున్న ఒక పాత్రికేయుడు రాజ్యసభకు ఎందుకు వెళ్లాలి? అందుకేమీ ఇంతకంటే ఎక్కువ వేతనమూ రాదు, అతని అభిప్రాయాలను వెలిబుచ్చ డానికి ఇంతకంటే విశాలమైన వేదికనూ అది కల్పించదనేది నా వాదన. ఒక ప్రపంచ సుప్రసిద్ధ కళాశాల డిగ్రీని అందుకున్న రిపోర్టర్ సైతం ఒక పాత్రికే యుని జీవితంలోకెల్లా మకుటాయమానమైనది. రాజ్యసభకు నామినేషన్ పొందడమేనని భావించడం నాకు చికాకు కలిగించింది. చేయని యుద్ధానికి శౌర్య పతకం ఈ వారం మొద ట్లో తవ్లీన్ ‘‘ట్రిస్ట్’’ ఆవిష్కరణకు వెళ్లినప్పుడు.. ఒకరు నన్ను పట్టుకుని ‘‘అంటే మీరు తవ్లీన్ కాలమ్‌ను ఆపాలని సోనియా మీ మీద ఒత్తిడి తెచ్చారన్న మాట (అప్పట్లో నేను ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు సంపాద కుణ్ణి).. సుబన్ దుబే కూడా మిమ్మల్ని బెదిరించాడే... అయితే మీరేమీ లొంగలేదు, చివరకు రాజీనామా చేసేశారనుకోండి... వగైరా, వగైరా.’’ ఇదంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నేను ఇంటికి వెళ్లి తవ్లీన్ పుస్తకంలోని ఇండెక్స్‌ను చూస్తే తొమ్మిది పేజీలలో నా పేరు ఉంది. అయితే ఆ సందర్భాలన్నీ, చాలా వరకు మన్ననా పూర్వకమైనవే. వాటిలో సోనియా, మా మాజీ సంపాదకుడు సుమన్ దుబేలు నాపై ఆమె కాలమ్‌ను ఆపేయాలని ఒత్తిడి తేవడం, నేను వాటిని తిప్పికొట్టడం కూడా ఉంది. కాకపోతే లేనిది ఒక్కటే... అసలు అలాంటిది ఏమీ జరగలేదనేదే. అయితే నేను తవ్లీన్తోనూ, ఇతరులతోనూ కూడా ఒక విషయం చెప్పాను. సోనియా నివాసానికి క్రమం తప్పకుండా వెళ్లి వచ్చేవారంతా ఆమె కాలమ్ కాల్పినికమైనదిగా, పునరావృతంగా, ఉంటుం దని వ్యాఖ్యానించేవారు. ఆమె రెచ్చగొట్టే విధంగా రాస్తారు, ప్రభుత్వ వ్యతి రేక(గాంధీ కుటుంబానికి)మైన, విశ్వసనీయమైన పాఠకులు ఆమెకు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నా పట్ల సానుభూతిని చూపిన దుబాసీకి వీటిలో ఏదీ లేదు. అతను ‘‘మీది నిజమైన సాహసోపేత జర్నలిజం సార్’’ అన్నాడు. అసలెన్నడూ యుద్ధం చేయకుండానే మీకు శౌర్య పతకాన్ని ప్రదానం చేస్తుంటే ఎలా ఉంటుందో నాకూ అలాగే అనిపించింది. ఇంతకూ నేను తవ్లీన్కు థాంక్స్ చెప్పాలో, నో థాంక్స్ చెప్పాలో తేల్చుకోవాల్సి ఉంది. లేదా నేనెన్నడూ చేయని ఆ యుద్ధ చరిత్రను మొత్తంగా కనిపెట్టి తీరాలి. అది మహ్మద్ షా రంగీలా కాలంలో అయితే సులువుగా అయ్యేది. వ్యాసకర్త: శేఖర్ గుప్తా twitter@shekargupta -
'ఉచితం తాయిలం'తో దేశంపై దాడి!
దేశం సమస్యల రాజకీయాల నుంచి ఆకాంక్షల రాజకీయాల దిశగా పయనిస్తోంది. వాతావరణ మార్పులు, పర్యావరణం వంటివి కీలక ఎజెండాలో చేరుతున్నాయి. డేటా చార్జీలతో పాటు కాల్-డ్రాప్స్ పెరిగిపోవడమనే సమస్య కూడా ద్రవ్యోల్బణం లాగే జీవన నాణ్యతకు సంబంధించిన సమస్యగా మారింది. కాబట్టే జుకెర్‌బర్గ్ ‘‘ఉచితం తాయిలం’’తో మన దేశంపై దాడికి దిగాడు. ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం గురించి ఆందోళనచెందే దేశం, ప్రభుత్వ ప్రైవేటు రంగాల వైద్య సేవల నాణ్యతను ప్రశ్నించే రోజు ఎంతో దూరంలో లేదు. డిసెంబర్ 31కి జనవరి 1కి మధ్య రాజకీయ చర్చ దిశను మార్చేటంతటి గొప్ప మార్పేమీ జరిగిపోదు. కాకపోతే కొత్త సంవత్సరం ప్రారంభం కావడం కాస్త విశ్రాంతిగా భవిత వేపు దృష్టిని సారించడానికి తగ్గ సాకును అంది స్తుంది. 2016లోకి అడుగు పెడుతుండగా వార్తా పత్రికల పేజీల్లో, వార్తా చానళ్ల ప్రైమ్‌టైమ్ చర్చల్లో ప్రముఖంగా కనిపించిన అంశాలతో ప్రారంభిద్దాం. ఢిల్లీ కార్లకు సరి-బేసి సంఖ్యల పరిమితి విధింపు పథకం వాటన్నిటిలోకీ అతి పెద్ద కథనం. కార్లకు, జనాభాకు మధ్య నిష్పత్తి అధ్వానంగా ఉన్న మన దేశ సామాజిక-వ్యవసాయక పద్ధతులకూ, మన నగరాల కాలుష్య మేఘాల సంక్షోభానికి మూల కారణమైన ఇంధన విధానాల వక్రీకరణలకూ ఈ బ్యాండ్ ఎయిడ్ శాశ్వత పరిష్కారం ఎలా అవుతుందని శంకించేవారిలో నేనూ ఒకడిని. అయితే ఈ పథకానికి విస్తృతమైన ప్రజా మద్దతు లభించింది. మనం పీల్చే గాలి నాణ్యత ఇప్పుడు మనల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో మొదటిగా మారింది. ఇక ఆ తదుపరిది, ‘నెట్-న్యూట్రాలిటీ’ (అందరికీ సమాన అవకాశాలు లభించేలా ఇంటర్నెట్ను తటస్థంగా ఉంచడం). ఆకాశం గురించిన ఒకప్పటి మన అవగాహనను బట్టి మనం ఈ చర్చను ఏదో కొందరు మేధావులకు సంబంధించినదిగా భావించేవాళ్లం. వారం రోజుల పాటూ ఫేస్బుక్ ‘ఫ్రీ బేసిక్స్ ఆఫర్’ పత్రికల మొదటి పేజీల్లో కనబడ్డాక అదీ చర్చనీయాంశమైంది. పార్టీ రాజకీయాలను, అస్తిత్వ సమస్యలను, మౌలిక అవసరాలనే అతిగా పట్టుకువేలాడే సమాజంలో... విచ్ఛిన్నకరమైన కొత్త ఉచిత ఇంటర్నెట్ సేవ ‘‘అమ్మకం’’ కోసం వంద కోట్లు ఖర్చు పెడతారని ఎన్నడైనా ఊహించారా? కొత్త ఏడాదైతే మాత్రం ఇదేం పిచ్చి? భారతదేశానికేమైనా వెర్రి పట్టిందా? మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నంత మాత్రాన గాలి నాణ్యత, ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం మన అతి ప్రధాన సమస్యలలో చేరిపోతాయా? తిండి, బట్ట, గూడూ, కులం, మతం, భాషా, విద్యుత్తు, రోడ్లు, విద్యా, అవినీతి, చెడ్డ పరిపాలనా ఇక వెనక్కు పోయినట్టేనా, ఏమిటీ? అవేమీ వెనక్కుపోలేదు. కాకపోతే గతంలో మనం, అవకాశాలతో కూడిన భవిత కోసం మనుగడకు సంబంధించిన సమస్యల బరువు కింద నలిగిపోతూ ఉండేవాళ్లం. ఆ బరువును తప్పించుకుని బయట పడేసరికి మన రాజకీయ సమస్యలు కూడా విలువ నిచ్చెనపైకి ఎగబాకాయి. ఇలాంటి విషయాలను గట్టిగా ప్రస్తావించనప్పుడల్లా, క్షామం తాండ వమాడుతున్న బుందేల్‌ఖండ్‌లో రైతులు గడ్డి తిని బతకాల్సివస్తోందనే నివేది కలతో లేదా రైతు ఆత్మహత్యలతో ప్రతిఘటించేవారు. మన దేశం సమస్యల రాజకీయాల నుంచి ఆకాంక్షల రాజకీయాల దిశగా పయనిస్తోందనే నా విశ్వా సాన్ని 2009లో వెలిబుచ్చినప్పుడు కూడా నేను అలాంటి వాదనలనే ఎదుర్కో వాల్సి వచ్చింది. మంచి నాణ్యతగల గాలి, ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం ఆ కొత్త కోరిక దిశగా వేసిన తార్కికమైన ముందడుగు మాత్రమే. బహుశా ఆ తర్వాత ఆహార నాణ్యతే కావచ్చు. వాతావరణ మార్పుల సమస్య కూడా రెండేళ్ల క్రితం వరకు కొందరు మేధావుల చర్చే. కానీ, ఆ సమస్య గురించిన అవగాహన పెరగడంతో, మీడియా, ఇంటర్నెట్ కనెక్షన్ల విస్తరణతో నేడా పరిస్థితి మారింది. మన నగర వాసులకు లాగే రైతులకు, జాలర్లకు కూడా వాతావరణ మార్పుల దుష్ర్ప భావం అనుభవంలోకి వస్తోంది. చె న్నై మన తాజా అనుభవం. పంజాబ్‌లో పత్తి పంట ఈ ఏడాది తెల్ల దోమ కాటుకు గురైంది. వానలు ఆలస్యం కావ డం, అరకొరగా మాత్రమే కురవడం వల్ల పంటకు పంటకు మధ్య వారాల తరబడి నిలిచిన నీటిలో తెల్లదోమ లార్వాలు నానిపోయి చనిపోయే అవ కాశం రైతులకు లేకుండా పోయింది. గత 110 ఏళ్లలో మొదటిసారిగా మనం వరుసగా రెండేళ్లు రుతుపవనాల వైఫల్యాన్ని ఎదుర్కొన్నామని మన వ్యవసాయ శాస్త్రవేత్తలందరిలోకీ అగ్రగణ్యుడైన అశోక్ గులాతి తెలిపారు. మూడో ఏడాది అలా జరగకపోవచ్చని అంటూనే ఆయన సందిగ్ధంతో ‘‘చెన్నై లో ఏం జరిగిందో చూశాక, ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు?’’ అన్నారు. చేపలు దొరికే ప్రాంతాలు కదలిపోవడాన్ని జాలర్లు గమనించారు. గుజరాత్ తీరంలోని మన జాలర్లు తరచూ పాకిస్తాన్ జలాల్లో పట్టుబడుతుం డటానికి ఇది కూడా ఒక కారణం. కొరమీను చేపలు పెద్ద తుట్టెల్లా గుంపుగా ఈదులాడే ప్రాంతాలు మారిపోవడంతో మన జాలర్లు మరింత సుదూరాలకు పోక తప్పడం లేదు. గాలి నాణ్యత గురించి నగరవాసులం ఇప్పుడిప్పుడే జాగృతమవుతున్నట్టే జాలర్లు కూడా ఈ ప్రకృతి శాపానికి కొంతవరకు మనిషే కారణమని అర్థం చేసుకుంటున్నారు. నేటి రాజకీయాలకు కొత్త చేర్పులు మనది విశిష్టమైన పెద్ద ప్రజాస్వామ్య దేశం. అతి తీవ్రవాద, లుడ్డైట్ (యంత్ర విధ్వంసక) వామపక్షవాదుల నుంచి కాషాయ మితవాదుల వరకు అంతా ఇక్కడ ఉన్నారు. కానీ వాతావరణ మార్పుల ఉపద్రవాన్ని కాదనేవారు మాత్రం వారిలో ఎవరూ లే రు. అందువలన వాతావరణ మార్పులు, పర్యావ రణం, గాలి నాణ్యత మన రాజకీయాల కీలక ఎజెండాలోకి వచ్చి చేరుతు న్నాయి. మన ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకునే స్థితికి అవి నెడ తాయి. ఉదాహరణకు, కేంద్రం మన వాయు, జల వనరుల పరిరక్షణకు పూనుకోవడం అనివార్యం. కాబట్టి విద్యుత్తు, ఇంధన ధరలకు సంబంధిం చిన సంస్కరణలను అది ఇకనెంత మాత్రమూ వాయిదా వేయలేదు. రైతు లకు ఉచిత విద్యుత్తు లభించినట్టయితే, కరెంటు రోజుకు ఆరు గంటలే, అదీ ఎవరికీ తెలీని ఏ అర్ధరాత్రో లభిస్తుంది. దీంతో పలువురు రైతులు తమ బోరు బావుల మోటర్ల స్విచ్‌లను ఆన్ చేసి ఉంచేస్తున్నారు. నరేంద్ర మోదీ తన ప్రభుత్వంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఆర్ఎస్ఎస్ చెప్పినవారికే ఇవ్వక తప్పలేదు. ఆవు పేడ, మూత్రాలతో చేసే ‘‘జీవక్ ఖేతీ’’(సేంద్రియ వ్యవసాయం) అంటే ఆయనకు పిచ్చి వ్యామోహం. అయితే ఆయన సైతం ఆధునీకరణ చెందక తప్పదు. లేకపోతే రైతులు శిక్షిస్తారు. అందువలన, నేల లోని పోషక పదార్థాల అసంతులనాన్ని తిరిగి వెనక్కు మరల్చడం కోసం ఎరు వుల ధరల సంస్కరణలను చేపట్టాల్సిన, విత్తన పరిశోధన శృంఖలాలను తెంచాల్సిన తక్షణ అగత్యం వచ్చిపడింది. ఆ దిశగా చర్యలు చేపట్టే ప్రయ త్నాలను యూపీఏ హయాంలో వామపక్షాలు ఎంతగా అడ్డగించాయో అంత గానూ నేడు నాగపూర్ మితవాద పక్షం అడ్డగిస్తోంది. మరింత సమర్థవంతం గా, వివేచనాయుతంగా భూమి, నీరు, గాలిని ఉపయోగించుకోవడం ఎలాగ నేది కూడా నేడు రాజకీయాలను ప్రభావితం చేసే ముఖ్యఅంశంగా మారింది. డిజిటల్ భారతాన్ని వాగ్దానం చేసేవారిలో నరేంద్ర మోదీ ఒకరు. కానీ సాగుకు నీటి సదుపాయం ఎలాగో, డిజిటలైజేషన్‌కు కనెక్టివిటీ (ఇంటర్నెట్ లేదా సెల్‌ఫోన్ సిగ్నల్ అందడం లేదా అనుసంధానం కావడం) కూడా అలాం టిదే. బిహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రయోగించిన అతి శక్తివంతమైన అస్త్రం ‘కాల్-డ్రాప్స్’ (ఫోన్లో మాట్లాడుతుండగా సాంకేతిక కారణాలతో కనెక్షన్ తెగిపోవడం). దేశంలోనే అతి పేద రాష్ట్రంలో ఆ సమస్య గురించి మాట్లాడటం అంటే కేక్ గురించి మాట్లాడటమేనని పలువురు బీజేపీ నేతలు నవ్వేశారు. కానీ బిహార్‌లో కూడా చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్లు, వాటితో పాటూ కనెక్టివిటీ తక్కువగా ఉండటమనే సమస్యా విస్తృతంగా వ్యాపించాయి. డేటా చార్జీలు పైపైకి ఎగబాకుతుండగా కాల్- డ్రాప్స్ పెరిగిపోతుండటం అనే సమస్య కూడా ద్రవ్యోల్బణంతోపాటూ నేడు జీవన నాణ్యతకు సంబంధించిన సమస్యగా మారింది. కాబట్టే జుకెర్‌బర్గ్ ‘‘ఉచితం తాయిలం’’తో మన దేశంపై దాడికి దిగాడు. మునుముందుకు సాగుతున్న ప్రజా చర్చ గాలి, నీటి నాణ్యత గురించి ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం గురించి ఆందోళన చెందే దేశం, ప్రభుత్వ ప్రైవేటు రంగాలు తమ నుంచి ధర వసూలుచేసి మరీ అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను గురించి అడగడానికి ఎంతో కాలం పట్టదు. అలాగే క్షీణదశలో ఉన్న మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రమా ణాలు తక్కువగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు మొత్తంగా ఒక తరం భారతీయులకు అందిస్తూ వస్తున్న విద్య నాణ్యతపై అసంతృప్తి కూడా త్వరలోనే పేరుకుపోతుంది. ఇంకా ముందుకు పోతే, మీ తల్లిదండ్రుల కష్టార్జితంతో మీరు సంపాదించుకున్న డిగ్రీ మిమ్మల్ని ఉద్యోగార్హత గల వారిగా చేయగలుగుతుందా, లేదా? అనేదే ఇకపై రాజకీయాలను, ఓటరు ఎంపిక అవకాశాలను శాసిస్తుంది. అంతేగానీ మెకాలే విద్యావిధానానికి అనుకూలమా? లేక వ్యతిరేకమా? లేదా ఔరంగజేబు క్రూరనియంతా లేక బాగా అపార్థానికి గురైన మొఘల్ చక్రవర్తా? అనేవి కావు. ఆహారానికి సంబంధించి కూడా గుణాత్మకమైన పెను మార్పులు హఠాత్తుగా చోటుచేసు కుంటున్నాయి. తిండిగింజల వినియోగం నిలకడగా ఉండగా, పప్పులు, మాంసం, పాలు, గుడ్లు, కూరగాయలు, పళ్లు వ గైరాల వినియోగం పెరుగు తోంది. ఎక్కువ మంది ప్రజలు మాంస కృత్తులూ, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సూక్ష్మ పోషకపదార్థాలూ ఉన్న ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. సురక్షితమైన, నాణ్యమైన ఆహారం ప్రజల ముఖ్య సమస్యగా మారుతోంది. ఒక ఏడాది అంతా మన పార్లమెంటు స్తంభించిపోవడం విచారకరం. ఫలితంగా ప్రభుత్వం పనీ కొంత వరకు అలాగే అయింది. కానీ ప్రజా చర్చ మాత్రం ముందుకు సాగుతోంది, మార్పు చెందుతోంది. అవును, నేను మరోసారి చెబుతున్నాను ప్రజా చర్చ విలువ నిచ్చెనపైపైకి ఎగ బాకుతోంది. అందుకే బీజేపీ ఆవుపై శ్రద్ధ చూపిస్తుండటం ఓటర్లను మెప్పించలేక పోయింది. ఇది కొంత వరకు, మీరు ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆగి ఉన్నప్పుడు రేర్ వ్యూ మిర్రర్లో నుంచి వాహనాలు మీ మీదకు దూసు కొచ్చేస్తున్నట్టు కనిపించటం లాంటిదే. అందువలన ఇది మనం కదిలి ముందుకు సాగాల్సిన సమయం. సమంజసమైన ఈ కోరికే నా నూతన వర్ష కామన. (వ్యాసకర్త: శేఖర్ గుప్తా) -
‘అధికారుల’ నోళ్లకు తాళాలేవి?
జాతిహితం ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా ఉండిపోకుండా చూడటం ముఖ్యం. రహస్యాలను వెల్లడించడాలు, పునర్విమర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలు సైతం వీటికి సంబంధించి నిబంధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతావ్యవస్థలోని ఉన్నతాధికారుల విషయంలో మరీ అవసరం. లేకపోతే భద్రతా అధికారులు వివేచనారాహిత్యంతో అన్నీ బయట పెట్టేయడమనే వైరస్ ప్రబలి అదుపు చేయలేనిదిగా మారే ప్రమాదం ఉంది. యాకూబ్ ప్రాణాలు కాపాడాలని రామన్ అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది. ఆయుర్వేదం, యోగ, నయం చేయలేని జీవనశైలి సంబంధమైన వ్యాధు లేవీ లేవని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ఆయుష్ (ఆయుర్వేదం, యోగ, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ, హోమియోపతి) శాఖ సహాయ మం త్రియైన ఆయన ఢిల్లీలో ఈ నెల 14న జరిగిన భారత మహిళా పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. వేదకాలం నుంచి మనకు వార సత్వంగా సంక్రమించిన ఈ అద్భుత చికిత్సలను, స్వస్థతను చేకూర్చగల శక్తు లను ధిక్కరించగల వ్యాధి ఒకటి ఉన్నదని ఆయనకు సూచించాలని ఉబలా టంగా ఉంది. అది మాటల అతి విరేచన వ్యాధి. నేను మాట్లాడేది నానా విధాలైన కాషాయ యోధుల గురించిగానీ, ఎవరో ఓ సాధు లేదా సాధ్వి గురించిగానీ కాదు. కనీసం విచక్షణా రహితంగా నోరు పారేసుకుని మనకు కావాల్సినంత వినోదాన్ని, ప్రధానికి కొంత చికా కును కలిగించే ఓ మంత్రివర్యుల గురించైనా కాదు. తోటి భారతీయుల కంటే మరింత గురుతరమైన, సున్నితమైన పనులను నిర్వహించే బాధ్యతలను నిర్వహించిన వారి గురించి. కీలక రంగాలలో వ్యక్తిగత బాధ్యతతో నిర్వహిం చాల్సిన విధులకు జీవితకాలపు వివేచనాపరత్వం ఆవశ్యకం. అలాంటి విధు లను నిర్వర్తించిన వారే ఈ మాటల అతి విరేచన వ్యాధిగ్రస్తులైతే... అది రేకె త్తించే మహా దుర్భరమైన కంపు మీ నాసికలను, మనస్థితినే కాదు, స్థూలంగా అందరి ప్రయోజనాలను సైత ం పాడుచే సేస్తుందని తెలిసీ అనాగరి కమైన ఇలాంటి భాష వాడుతున్నందుకు మన్నించాలి. పైగా ఈ వ్యాధి, ఆ ముగ్గురూ తమ వృత్తి జీవితాన్ని ఏ ఆశయాలకు అంకితం చేశారో వాటికి సైతం చెరుపు చేసేది. ‘పెద్ద మనుషులు’ కాని ఆ ముగ్గురు ఇక మనం స్వీయాభిప్రాయ సహిత పాత్రికేయ వృత్తిలో రాణించడానికి సంబంధించిన మూడు ప్రాథమిక సూత్రాలకు తిరిగి వచ్చి ఈ తాజా ఉదం తాలను చూద్దాం. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ సభ్యుడు ఆర్కే సింగ్ వ్యవహారాన్ని, ఆ తదుపరి భారత గూఢచార సంస్థ ‘రా’ మాజీ అధిపతి, కశ్మీర్ సమస్యపై మధ్యవర్తులలో ఒకరైన ఏఎస్ దౌలత్, ‘రా’ లోనే కీలక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ అధికారి దివంగత బీ రామ న్ల ఉదంతాలను పరిశీలిద్దాం. భద్రతా సంస్థలలో పనిచేసిన ఉన్నతాధికారి పదవీ విరమణానంతరం, ప్రత్యేకించి పదవీ విరమణ చేసిన వెంటనే ఎలా ప్రవర్తించాలనే విషయానికి సంబంధించి ఈ ముగ్గురూ అతి చెడ్డ ఉదాహర ణలుగా నిలిచారని చెప్పడానికి విచారంగా ఉంది. ‘‘అధికారియైనా పెద్ద మనిషే’’ అనే నానుడి మరీ పాతది. ఆ ముగ్గురు అధికారుల గురించి చర్చిం చేటప్పుడు దాన్ని ప్రయోగించకుండా ఉండటం కోసమే నేను ‘‘అధికారి- పెద్దమనిషి’’ అంటూ ఉద్దేశపూర్వకంగానే రెండు పదాల మధ్య హైఫన్ను ఉంచుతూ కొత్త నానుడిని తయారు చేశాను. ఇది భద్రతా వ్యవస్థలో కీలక బాధ్యతను నిర్వహించిన పోలీసు, సైనిక అధికారులు సహా సీనియర్ ప్రభు త్వాధికారులను కూడా అభివర్ణించేది. ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ, నైతిక బాధ్యతతో తమ జీవితాన్ని అంకితం చేసిన వృత్తికే హాని కలగజేసేలా వంతుల వారీగా బహిరంగంగా మాట్లాడారు. వారలా మాట్లాడటంలో స్థాయి, పద్ధతులకు సంబంధించి తేడాలున్నా అదో ఉన్మాదం కాదనగలిగింది ఏదీ లేదు. అది... గప్పాలు కొడుతూ, వివేకరహితంగా పతాక శీర్షికల కోసం పాకులాడటమే కావచ్చు (సింగ్), మరి కొన్ని కాపీలు అమ్ముకోవడం కోసం కొంత వివాదాన్ని కూడా జోడించమని ప్రచురణకర్తలు తెచ్చిన ఒత్తిడే కావచ్చు (దౌలత్) లేదా పెడదోవబట్టిన అపరాధ భావనతో మానసికంగా ముడుచుకుపోయే వారిలో కనిపించే ‘లీమా సిండ్రోమ్’గా పిలిచే బందీల పట్ల సానుభూతే (రామన్) కావచ్చు. బందీ తనను బంధించిన వ్యక్తితో ప్రేమలో పడటమనే పరిస్థితిని సూచించే ‘స్టాక్‌హోమ్ సిండ్రోమ్’కు సరిగ్గా విరుద్ధమైన పరిస్థితికి ఇటీవలే ఈ ‘లీమా సిండ్రోమ్’ భావనను ప్రవేశపెట్టారు. దీనికి గురైతే మీరు మీ ఖైదీపట్ల సానుభూతిని ప్రదర్శించడం మొదలవుతుంది. వివేక రాహిత్యంతోనే అతి వాగుడు వివేకరాహిత్యపు కొలబద్ధతో ఈ మూడింటినీ కొలవాల్సిన అవసర మేమీలేదు. అలాగే, మాజీ భద్రతా అధికారులు ఇలా బహిరంగంగా రహస్యా లను రచ్చకెక్కించడం ఇదే మొదలనీ కాదు. కాకపోతే ఈ ముగ్గురూ అతి తక్కువ కాలంలోనే, అదీ కూడా ఒకరి కంటే మరొకరు మరింత ఎక్కువగా భారత ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వరుసగా మాట్లాడటంలోని నిజా న్ని రాబట్టడంకోసం అధికారిక రహస్యాలను బట్టబయలు చేసే కృషి కొంత అవసరం. ప్రత్యేకించి నేను ఏమంత జాగ్రత్తగా వ్యవహరించని వ్యాఖ్యాతను. అయినా ఈ విషయంలో ఇతరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రశ్నిస్తున్నట్టుగా కనిపించినా లెక్కచేయను. ఇక కాలక్రమానుసారంగా వెనక్కు తిరిగి చూద్దాం. పాకిస్తాన్‌కు వ్యతి రేకంగా ఇటీవల సింగ్ చేస్తున్న రభస ఎంత యుద్ధోన్మాదభరితంగా ఉందం టే... బహుశా అది శాశ్వత ఆగ్రహోదగ్రులైన వార్తా చానళ్ల తెల్ల మీసాల ఆసా ములలో అభద్రతాభావాన్ని కలిగించి ఉంటుంది. సింగ్ తాజాగా గత వారం ‘‘ఇండియా టుడే టీవీ’’కి చెందిన రాహుల్క న్వల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ... ఆయన ప్రలాపాలన్నిటిలోకీ విభిన్నమైనది. టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా ఆయన 2005లో దావూద్ ఇబ్రహీంను దుబాయ్‌లో హత్య చేయడానికి వేసిన పథకాన్ని ‘‘వెల్లడి చేశారు.’’ దుబాయ్‌లో జరిగే దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రుఖ్, పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాం దాద్ కుమారుడు జానాయిద్ల వివాహానికి వచ్చినప్పుడు చేయాలని తల పెట్టిన ఈ పథకం అమలుకు పదవీ విరమణ చేసిన అజిత్ దోవల్‌ను రప్పించారని ఆయన తెలిపారు. దోవల్ యూపీఏ హయాంలో 2004-05 మధ్య మన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా పనిచేశారు. ముంబై చీకటి ప్రపంచంలో ‘‘ముస్లిం’’ దావూద్ ఇబ్రహీంకు బద్ధ శత్రువైన ‘‘హిం దూ’’ ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్ షూటర్లు (గురి తప్ప కుండా కాల్చగల నిపుణులు) దుబాయ్‌లో పొంచి ఉండేలా చేయాలని పథకం. బహుశా ఆ పెళ్లి వద్దే దావూద్‌ను అతన్ని పుట్టించిన ఆ పైవాడి దగ్గరకు పంపేయాలనుకున్నారు. సింగ్ కథనం ప్రకారం, ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఆ ఇద్దరు షార్ప్ షూటర్లు ఢిల్లీలో ఉన్న విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి వచ్చి వారిని అరెస్టు చేయడంతో ఆ పథకం విఫలమైంది. షకీల్ మనుషుల గురించి ముంబై పోలీసులకు ఎవరో ‘‘ఉప్పందించి’’, వారిని అరెస్టు చేయిం చారని ఆయన వాదన. మన గూఢచారి సంస్థ రచించిన పథకానికి ముంబై పోలీసులు వెన్నుపోటు పొడిచారా, లేదా? దావూద్ ఇబ్రహీం తన శత్రువుకు చెందిన షార్ప్ షూటర్ల జాడను కనిపెట్టి, ముంబై పోలీసులలోని తన మిత్రు లను హెచ్చరించాడా, లేదా? లేకపోతే జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ట్టుగా... కుడి చెయ్యి ఏం చేయనున్నదో ఎడమ చేతికి తెలియకపోవడమే దీనికి కారణమా? ఇక మీరే చర్చించుకోవచ్చు. ఏదేమైనా సింగ్ ప్రలాపనల వల్ల భిన్న స్థాయిల్లో జరగాల్సిన నష్టం జరగనే జరిగిపోయింది. వివేచనే గూఢచార సంస్థలకు ప్రాణం భారత్ తన సొంత పౌరులను విదేశాల్లో హత్యలు చేయించడానికి సైతం వెనుకాడదని ఆయన ప్రపంచానికి చాటారు. దావూద్ కోసం హృదయం ద్రవీ భవించిపోతుండగా భుజానికి సంచీ వేలాడేసుకుతిరిగే విప్లవకారుడివంటూ నన్ను దుమ్మెత్తిపోయడానికి ముందు మీరు ‘‘ద వే ఆఫ్ లైప్’’ పుస్తకాన్ని తిర గేయండి. అది ‘‘న్యూయార్క్ టైమ్స్’’ గూఢచార వ్యవహారాల విలేకరి మార్క్ మాజెట్టీ రచించిన అద్భుతమైన పుస్తకం. అందులో ఆయన అమెరికాకు చెందిన సీఐఏ ఒక గూఢచార సంస్థ నుంచి హత్యా యంత్రంగా పరివర్తన చెందిన వైనాన్ని చిత్రించారు. అయినా ఆ సంస్థ యెమెన్‌లోని అల్ కాయిదా కీలక నేత అన్వర్ అల్ వకీల్‌పై ద్రోన్ దాడికి వచ్చేసరికి... అతగాడు ఆమెరికన్ పౌరుడైనందున అత్యున్నత స్థాయిలో (అధ్యక్షస్థాయి) లోతుగా ఆలోచించి తీసుకునే నిర్ణయం కావాలనుకోవడం విశేష ప్రాముఖ్యం గల విషయం. భారత గూఢచార వ్యవస్థ ఒక మాఫియా ముఠాకు వ్యతిరేకంగా మరో దాన్ని చేరదీస్తుందనే వాస్తవం తెలిసిందే. అయినా ఆ విషయాన్ని ఇంతవరకు ఎన్నడూ లాంఛనంగా అంగీకరించింది లేదు. సింగ్ ఆ పని కూడా చేసేశారు. మంచి లేదా చెడ్డ ఉగ్రవాదులు అంటూ ఉండరని మనం ఎప్పుడూ అంటూ ఉంటాం. అయినా చీకటి ప్రపంచంలో మాత్రం మంచి, చెడ్డా ఉంటాయని ఎలా అనగలం? మూడోది, మీ భూభాగంలో మేం చట్టవిరుద్ధమైన హత్యలకు పథకం పన్నామని చెప్పడం... అప్పుడు యునెటైడ్ ఎమిరేట్స్‌లోనే ఉన్న ప్రధానిని, ఆయన మిత్రులను పూర్తి సంకటస్థితికి నెట్టేసింది. అందుకోసం మనం చీకటి ప్రపంచానికి చెందిన హంతకులను వాడుకోవాలనుకోవడం అతి సులువుగా విదేశీ ఉగ్రవాద చర్య అనిపించుకుంటుంది. సింగ్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశారా లేదా అనేది నేను ఇదమిత్థంగా చెప్పలేను. నాలుగు, ఆయన ముంబై పోలీసులకు దావూద్ డబ్బు సంచులు అందు తున్నాయని ఆరోపించారు. ఐదు, దోవల్ భారతదేశం తరఫున అత్యంత నమ్మకంగా ఆపరేషన్స్‌ను చేపట్టే వ్యక్తి అని బయటపెట్టారు. తద్వారా సింగ్ నేరుగా ‘‘దోవల్ భారత హమీద్ గుల్’’ (పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధిపతి) అని పనిగట్టుకు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ప్రచార యంత్రాం గానికి తోడ్పడ్డారు. ఆయన తప్పులకు లెక్కలేదు ఆయన వివేకరహితంగా చేసిన పనులను ఎన్నైనా ఇలా లెక్కిస్తూ పోగలం. దీనికి సంబంధంలేనిదే అయినా ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. నిర్భయ ఘటనపై నిరసన ప్రదర్శల మధ్య ఆయన ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పోలీసులు ఆందో ళనకారులతో వ్యవహరిస్తున్న తీరును గట్టిగా సమర్థించారు. నిజానికి ఆనాటి ఢిల్లీ పోలీసుల తీరు నేడు వారు మాజీ సైనికాధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ముందస్తు కసరత్తు మాత్రమే. సింగ్ యూపీఏలో ఉన్నారా లేదా ఎన్డీఏలో ఉన్నారా అనేదానితో నిమిత్తం లేదు. పంజాబీలో అనేట్టుగా లాహోర్‌లో వినాశకారకుడైన వాడు పెషావర్లోనైనా వినాశకారకుడే అవుతాడు. మిగతా ఇద్దరి వ్యవహారానికి వచ్చేసరికి వారికి అనుకూలంగానైనా, ప్రతికూలంగానైనా కూడా వాదించవచ్చు. దౌలత్ కశ్మీర్ చేదు వాస్తవాన్ని బయటపెట్టడం మాత్రమే చేస్తున్నారు, హురియత్ నేతలు దాదాపు అంతా కిరాయికి పనిచేస్తున్నవారే అనే ముఖ్య విషయం కశ్మీర్ ప్రజలకు, మిగతా దేశానికి కూడా రూఢి కావడం ముఖ్యమని వాదించొచ్చు. చిన్నా చితకా ఎత్తుగడలతోనూ, కూటనీతితోనూ, లంచాలు తినిపించడంతోనూ కొంత సమయాన్ని సంపాదించడమనే దాన్ని కొనసాగించడం కశ్మీర్ సమస్యతో వ్యవహరించే వ్యూహంగా ఉంటోంది. దౌలత్ కథనం... ఇది మనగలిగేదేమీ కాదని, నూతన వైఖరికి రూప కల్పన చేయడం అవసరమని ఢిల్లీలోని కొత్త ప్రభుత్వానికి గుర్తు చేసే పద్ధతి కూడా అవుతుంది. ఇక రామన్ విషయానికి వస్తే, ఆయన ఘటికుడైన గూఢచారి అధికారి మాత్రమే కాదు, అంతరాత్మ ఉన్న మనిషి కూడానని మీరనవచ్చు. కస్టడీలో ఉండి సహకరించిన ఉగ్రవాది ప్రాణాలను కాపాడా లని ప్రయత్నం చేయాల్సిన నైతిక బాధ్యత ఆయనకు ఉన్నదనీ వాదిం చవచ్చు. అరెస్టు అయ్యేలా భారత ప్రభుత్వం అతడితో ముందుగా ‘‘మాట్లాడింది’’ కాబట్టి అతని పట్ల దయ చూపాల్సి ఉన్నదనీ అనొచ్చు. కానీ ఆ ఇద్దరు చేసినదీ సమస్యాత్మకమైనదే. ఇద్దరూ ఇప్పుడు నడు స్తున్న పరిణామాలపై ఉన్న ముసుగును తొలగించేశారు. ఒక రహస్య ప్రేమ కార్య కలాపం కథనాన్ని, అది ముగిసిపోయాక తగినంత సమయం గడిచాక, దానివల్ల ఆ వ్యక్తులకు, వారి మిత్రులకు బాధ కలగకుండా వారు గతించాక రాయడం వేరు. రాజకీయవేత్తలు, గూఢచారి అధికారులు, చివరికి పాత్రి కేయులు సైతం మరింత పెద్ద ప్రయోజనం కోసం తమకు సమాచారం అందిం చిన వ్యక్తులు (సోర్స్) ఎవరో ఎప్పటికీ బయటపెట్టరు. ‘వాషింగ్టన్ పోస్ట్’కు చెందిన బాబ్ వుడ్వార్డ్, కార్ల్ బెర్నిస్టీన్లు వాటర్‌గేట్ కుంభకోణాన్ని బయట పెట్టినా, ఆ సమాచారాన్ని అందించిన ‘‘డీప్ థ్రోట్ ’’ ఎవరో ఆయన మరణా నంతరం వరకు వెల్లడించలేదు. నైతిక ధైర్యం లోపించింది రామన్ సైతం తనకు సహకరించిన వ్యక్తుల పేర్లను బయటపెట్టలేదు. కానీ, తాను సైతం నిస్సందేహంగా నేరస్తుడని భావించిన యాకూబ్ మెమెన్ పట్ల ఉదారవాద సానుభూతి పెంపొంద డానికి దోహదపడ్డారు. యాకూబ్ ‘‘భారత వ్యవస్థ’’ చేతుల్లో వంచనకు గురైన బాధితుడనే అభిప్రాయం ముస్లింలలో, ప్రత్యేకించి ముస్లిం యువతలో ఉంది. దానికి రామన్ సామం జస్యాన్ని కల్పించారు కూడా. రామన్ బతికే ఉంటే యాకూబ్‌ను ఒక హీరోగా సమాధి చేయడానికి పోగైన జనాలు ఎలాంటివారో చూసి విచారించి ఉండేవారు. నేడు లేని ఒక వ్యక్తిని గురించి ఇలా అనడం ఇబ్బందికరంగానే ఉన్నా చెప్పక తప్పడం లేదు... రామన్ తానొక నైతికపరమైన పిరికివాడినని రుజువు చేసుకున్నారు. యాకూబ్ ప్రాణాలు కాపాడాలని ఆయన అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది. రా వ్యవస్థాప కుడు ఆర్ఎన్ కావో శిష్యుడినంటూ ఆయన తనను తాను ‘‘కావోబాయ్’’గా పిలుచుకున్నారేగానీ అందుకు భిన్నంగా ప్రవర్తించారు. చివరికి ఆయన తన ఆశయానికే తీవ్ర న ష్టం కలగజేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా అలాగే ఉండిపోకుండా చూడటం ముఖ్యమైనది. రహస్యాలను వెల్లడించడాలు, వాటిపై పునర్విమ ర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. అయితే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు సైతం వీటికి సంబంధించి నిబం ధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధి కారుల విషయంలో మరీ అవసరం. అమెరికాలో ఇలాంటి అనుమతులకు, పరిశీలనకు విస్తృత యంత్రాంగం ఉంది. సీనియర్ ఎమ్15 అధికారి పీటర్ రైట్ సంచలనాత్మక స్మృతుల ‘‘స్పైకేచర్’’ ప్రచురణ తదుపరి బ్రిటన్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. వివేచనారాహిత్యమనే ఈ వైరస్, అంటువ్యాధిగా ప్రబలి అదుపు చేయలేనిదిగా విజృంభించకముందే దాన్ని నియంత్రించడం అవసరం. శేఖర్ గుప్తా Twitter@Shekargupta. -
ఓడిన యోధుని తెంపరి పోరు
బీసీసీఐ భారత క్రికెట్‌కి, ప్రపంచ క్రికెట్‌కి ఎంతో మేలు చేసిన మాట నిజమే. కానీ అది అంతర్జాతీయంగా తమ కంటే బాగా అప్రతిష్టపాలైన ‘ఫీఫా’లాగా పలు మాఫియా నిబంధనలను పాటిస్తోంది. బీసీసీఐ దానికదే ఒక కలియుగ చక్రవ్యూహం. అందులోకి చొచ్చుకుపోవడం చాలా కష్టం. ఇక సురక్షితంగా బయటపడటం అంటారా? అసాధ్యం. బీసీసీఐలో రాజకీయవేత్తలెప్పుడూ కలసికట్టుగానే ఉంటారు, వారే గెలుస్తారు. లలిత్ ఈ వాస్తవాన్ని అంగీకరించక తిరస్కరిస్తున్నారు. లలిత్ మోదీ చేసింది తప్పా లేక ఒప్పా, అతడు పారిపోయిన వంచకుడా లేక దేన్నీ లెక్కచేయని తెంపరితనంగల ప్రజాప్రయోజనాల పరిరక్షకుడా, మానవ బాంబా లేక కమికాజే (ఆత్మాహుతి వైమానిక దళం) యుద్ధ వీరుడా? ఇప్పటికే రెండు వారాలుగా చర్చించినా సమాధానాలు దొరకని ఈ ప్రశ్నలను మళ్లీ చర్చించడం అర్థ రహితం. కానీ పైన పేర్కొన్నవన్నీ ఆయనలో అంతో ఇంతో ఉన్నాయి. కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న దాడులు, వాదనలు, ఆరోపణలు, వెల్లడిచేస్తున్న విషయాలు, ‘ఇండియా టుడే’ గ్రూపునకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతకంటే ఆసక్తికరమైన ప్రశ్న మరొకటుంది. లలిత్ ఇతరులను శత్రువు లుగా చూస్తే మంచిదా? మిత్రులుగా చూస్తే మంచిదా? లేదా ఇంకా మరీ కచ్చితంగా చెప్పాలంటే ఏది అధ్వానం? మోదీ అంటే ప్రధాని మోదీ అను కుంటారేమోనని లలిత్ అంటూ నేనాయన మొదటి పేరునే వాడుతున్నా. అంతేగానీ ఆయనా, నేనూ సన్నిహిత మిత్రులమేం కాదు, కావాలంటే బీజేపీలోని ఆయన మిత్రులైన సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలను అడగండి. వారిద్దరూ ఆ పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్న నేతలని, భవిష్యత్తులో అత్యున్నత పదవికి పోటీదారులు కాగలవారని చాలా మందే భావిస్తున్నారు. ఇప్పుడు వారు రాజకీయంగా మనగలుగుతారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండానే లలిత్‌తో ఉన్న సంబంధాలు వారికి శాశ్వ తమైన చెరుపును చేశాయి. ఒకసారి ఆయన శత్రువులను చూడండి. క్రికెట్ రంగంలో అరుణ్ జైట్లీ, రాజీవ్ శుక్లా, ఎన్. శ్రీనివాసన్. రాజకీయ రంగంలో నైతే ప్రణబ్ ముఖర్జీ, ఆయనకు అత్యంత విశ్వసనీయ సహాయకురాలైన అమితా పాల్ (ఇటీవలి కాలంలో సోనియా గాంధీ కుటుంబం కూడా). ఇక మీడియాలో చాలా మందే ఉన్నా చెప్పుకోదగినవారు ‘టైమ్స్’ గ్రూపునకు చెందిన వినీత్ జైన్, టీవీ ప్రైమ్ టైమ్ తీర్పరి, శిక్ష అమలు చేసేవాడూ కూడా అయిన ఆర్ణబ్ గోస్వామి. వీరిలో ప్రతి ఒక్కరూ లలిత్ భూదగ్ధ యుద్ధ తంత్రంలోంచి (ఇప్పటికింకా అది ఎలక్ట్రానిక్ మీడియా రూపంలోనే సాగు తోంది) కాలిన గాయాలతో బయటపడ్డవారే. రాజే, స్వరాజ్ సహా ప్రతి ఒక్కరూ ఆయనను ఇప్పుడు శాపనార్థాలు పెడుతుంటారని మీరు నిశ్చ యంగా చెప్పొచ్చు. అతనితో స్నేహం వల్ల కలిగిన పాపానికి, అతని శత్రు త్వం విధించిన శాపానికి ఫలితమది. ఐపీఎల్ అనే అద్భుతంతో క్రికెటర్లను అంతటి పెద్ద ధనవంతులను చేసిన లలిత్‌లో... తాను వారికంటే ఎక్కువ ప్రముఖ వ్యక్తి కావాలనే కాంక్ష రహస్యంగా దాగి ఉన్నదని నా అనుమానం. ఈ 15 రోజుల ఖ్యాతితో ఆయన ఆ ఆశను తీర్చుకున్నారు. చివరకాయన ఇప్పుడు మిత్రులకు, శత్రువులకు కూడా హాని కలుగజే స్తుండటం ఆత్మావినాశకరం కావచ్చేమోగానీ, అందుకు కారణం ఆయన మూర్ఖుడు కావడం మాత్రం కాదు. దానికి మూడు ఇతర కారణాలున్నాయి. ఒకటి, ఆయనకు భారత రాజకీయాలు అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఆయన లెక్క చేయడమూ లేదు. రెండు, ఆయన అహం తరచుగా ఆయన వివేచన లోని ఉత్తమమైనదాన్ని హరించేస్తుంటుంది. ఇక మూడోది, అత్యంత ముఖ్యమైనది, ఆ విషయంలో ఆయన చేయగలిగినదేమీ లేనిది. అది, భారత క్రికెట్ హోల్డింగ్ కంపెనీ(ఇతర కంపెనీలలో వాటాలను కలిగివుండే సంస్థ) లాంటి బీసీసీఐ అనే అతి సన్నిహితుల క్లబ్బు స్వభావానికి సంబంధించినది. నేను పాత కాలం వాడినిగాక, ఆధునిక వ్యాఖ్యాతనై ఉంటే ఆ హోల్డింగ్ కంపెనీ కంటే మాఫియానే మెరుగని భావించే వాడిని. ఈ విషయాన్ని కాస్త వివరించనివ్వండి. నేనలా అనడానికి కారణం, బీసీసీఐ దారి దోపిడీదారుల, బలవంతపు వసూళ్ల రాయుళ్ల క్లబ్బు కావడం కాదు. భారత క్రికెట్టుకి, ప్రపంచ క్రికెట్టుకి అది ఎంతో మేలు చేసిన మాట నిజం. కానీ అది కూడా చాలావరకు అంతర్జాతీయంగా తమ సంస్థ కంటే బాగా అప్రతిష్టపాలైన ఫీఫా (అంతర్జా తీయ పుట్‌బాల్ అసోసియేషన్)లాగే మాఫియా నిబంధనలలో చాలా వాటిని పాటిస్తోందనేదే అందుకు కారణం. బీసీసీఐ కూడా పాటించే ఆ మాఫియా నిబంధనల్లో చెప్పుకోదగినవి ఓమైర్టా (తమ నేరపూరిత చర్యల రహస్యాలపై ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు విప్పరాదనే నిశ్శబ్ద నిబంధనావళి), ద్రోహి గా భావించేవారినెవరినైనా అత్యంత సుస్పష్టంగా అందరికీ కనిపించేలా క్రూరంగా నాశనం చే సేయడం. బీసీసీఐ దానికదే ఒక కలియుగ చక్రవ్యూహం. అందులోకి చొచ్చుకుపోవడం చాలా కష్టం. ఇక అందులోంచి సురక్షితంగా బయటపడటం అంటారా? అసాధ్యం...లలిత్ తానందుకు మినహాయిం పునని రుజువు చేసుకుంటే తప్ప. బీసీసీఐ రాజకీయాలు కూడా... బహుముఖ పక్షపాత రాజకీయాలు మాత్రమే చెల్లుబాటయ్యే అసలు సిసలు భారత రాజకీయాలే. ఆ వాస్తవం వల్లనే మీరు వాటిని ఎలా చూస్తారనే దాన్ని బట్టి, అవి మరింత ఎక్కువ సంక్లిష్టమైనవిగానో లేదా సరళమైనవిగానో తయారయ్యాయి. శరద్ పవార్, నరేంద్ర మోదీ, జ్యోతిరాదిత్య సింథియా, అనురాగ్ ఠాకూర్ (ధూమల్), సీపీ జోషీ, అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఫారుఖ్ అబ్దుల్లా, లాలూ యాదవ్, రాజీవ్ శుక్లా, ప్రాంతీయ స్థాయిలో ప్రస్తుత బోర్డు ఉపాధ్యక్షుడు అనిరుధ్ చౌధరీ (దివంగత బన్సీలాల్ మనుమడు) మొదలుకొని రాజకీయ రాజవంశాల మూడో తరం వారసులు సహా అంతా స్థూలంగా రాజకీయ రంగంలో బద్ధ శత్రువులే. అయితే బీసీసీఐ గుడారంలో ఒక్కసారి వారంతా కలిశారంటే చాలు.. అంతా అత్యంత నమ్మకస్తులైన మిత్రులై పోతారు. ‘ఎకనమిస్ట్’ పత్రిక ఒకప్పటి భారత బ్యూరో అధిపతి జేమ్స్ ఆస్టిల్ ‘ది గ్రేట్ తమాషా: క్రికెట్, కరప్షన్ అండ్ ది టర్బులెంట్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్లో ఆ పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా ఆమె నన్ను అరుణ్ జైట్లీ, రాజీవ్ శుక్లాల మధ్య సంభాషణ సాగేలా చూడమని కోరారు. నా శ్రోతలకు కొంత ఆసక్తి కలిగించే ఆంశం ఏమిటా అని తెగ ఆలోచించి, చివరికి నేను రాజకీయాలను ఆశ్రయిం చాను. అప్పటికింకా కొద్ది నెలల్లోనే 2014 ఎన్నికలు జరగనున్నాయి. నేనా ఎన్నికల ఫలితాన్ని అంచనా వేసి చెప్పగలిగేటంతటి అవివేకిని కానన్నాను. అయితే, ఎన్డీఏ గె లిస్తే రాజీవ్ శుక్లా, యూపీఏ గెలిస్తే అరుణ్ జైట్లీ ఐపీఎల్‌కు అధిపతి అవుతారని మాత్రం కచ్చితంగా చెప్పగలనన్నాను. శుక్లా, జైట్లీ సహా అంతా నవ్వారే తప్ప ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రాజకీయవేత్తలతోపాటే కలసివచ్చే రాజకీయాధికారం క్రికెట్‌కు చాలా ఉపయోగకరం. ఐపీఎల్‌కు ముందే వారు పోగు చేయడం ప్రారంభించిన డబ్బు బోర్డువద్ద సరిపడేంత ఉంది. మిగతా క్రీడల్లాగా వీసాలు, అనుమ తులు, స్టేడియంల కేటాయింపు, పోలీసు బందోబస్తు ఏర్పాట్ల విషయంలో సర్కారీ సవాళ్లను ఎప్పుడోగానీ ఎదుర్కోవాల్సిన అవసరం రాని అరుదైన క్రీడ ఇది. 2009లో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ చాంపియన్‌షిప్ ఒకేసారి రావడంతో ఆనాటి హోంమంత్రిగా చిదంబరం దాన్ని దక్షిణాఫ్రికాకు ప్రవా సం పంపేయడమే ఇందుకు మినహాయింపు. అంతేకాదు, క్రికెట్ ప్రసారకర్తల సాధన సంపత్తిని చేరవేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి చార్టర్డ్ విమానాలను లేదా దేశీయ విమానాలను అదనంగా వారు ఏర్పాటు చేసే వారు లేదా విమాన సర్వీసుల షెడ్యూలునే మార్చేవారు. క్రికెట్ సామ్రాట్టులు తమ పేర్లతోనే, అదీ తమ జీవిత కాలంలోనే కొత్త స్టేడియంలను నిర్మింప జేసుకోగలిగిన క్రీడగా కూడా భారత క్రికెట్ మారింది సాధారణంగా ఉపయో గించే నెహ్రూ- గాంధీల పేర్లుగాక వాంఖేడే, డీవై పాటిల్, ఎమ్ఏ చిదంబరం, సహారా, శరద్ పవార్ పేర్లను పెట్టారు. క్రికెట్ తమకు సైతం ఆసక్తికరమైనదేనని రాజకీయ వర్గం గుర్తించడానికి ముందు, క్రీడాభిమానులైన సంపన్న రాజవంశీకులే ఆ క్రీడకు నిర్వాహకు లుగా ఉండేవారు. సింథియాలు రాజకీయవేత్తలు గానే తప్ప రాజవంశీకు లుగా లెక్కలోకి రారు. కాబట్టి రాజ్‌సింగ్ దుంగార్పూర్ వారిలో ఆఖరి వాడు. ఆ తర్వాత వచ్చినది చార్టర్డ్ అకౌంటెంట్ల శకం. బీసీసీఐని ఏలిన అలాంటి వారిలో చివరివారు జగ్మోహన్ దాల్మియా, మనోహర్ శశాంక్. ఇద్దరూ ఇంకా బరిలో నిలవగలిగారు. దాల్మియా అయితే ఒకప్పుడు తనను నాశనం చేయడమే కాదు, అక్రమంగా డబ్బు పోగేసుకున్నట్టు క్రిమినల్ కేసులను సైతం పెట్టిన అదే అధికార కూటమితోనే శాంతిని నెలకొల్పుకుని, పునరుత్థా నం చెందారు కూడా. కొందరు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు గానీ, వారిని వెళ్లగొట్టేశారు. పంజాబ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్రపతి జైల్‌సింగ్‌కు ఒకప్పటి సహాయకుడు అయిన ఐఎస్ బింద్రా వారిలో ఒకడు. అయితే ఈ మారుతున్న సమ్మేళనంలోకి మరో ఆసక్తికరమైన గ్రూపు ప్రవేశించింది. వారు క్రీడపై ప్రేమతోనూ, అందులోని గ్లామర్ కోసమూ రం గంలోకి దిగిన మధ్యస్థాయివారే అయినా చెప్పుకోదగినంత ధనవంతులైన కార్పొరేటు కుబేరులు. వీరిలో అత్యంత ప్రముఖులు ఎన్. శ్రీనివాసన్, లలిత్ మోదీలే. ఇద్దరూ వంశపారంపర్యంగానే సుసంపన్నులు, చాలా నియమ నిబంధనలతో కూడిన, పాత నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు చెందిన సిమెంటు, సిగరెట్ల వ్యాపారంలో ఉన్నవారు. మహా గమ్మత్తయిన విషయమేమంటే తొలుత చార్టర్డ్ అకౌంటెంట్లు (మనోహర్, దాల్మియా) ఘర్షణపడితే, ఆ తర్వా త మహాసంపన్న వ్యాపారవేత్తలు (లలిత్, శ్రీనివాసన్) ఘర్షణకు దిగారు. అయితే బీసీసీఐ రాజకీయ సారం మాత్రం టైటానియంలా చెక్కుచెదర కుండా దృఢంగా మిగిలింది. అది ఏ పక్షానికి మద్దతు పలికితే అదే ప్రతిసారీ నెగ్గింది. బీసీసీఐలో రాజకీయవేత్తలెప్పుడూ కలసికట్టుగానే ఉంటారు, వారే గెలుస్తారు. లలిత్ ఈ వాస్తవాన్ని అంగీకరించక తిరస్కరిస్తున్నారు. లలిత్ నాకు ఎంత బాగా తెలుసు? ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేనొక సారి ఆయన్ను ఇంటర్వ్యూ చేశాను. అంతకు మించి పెద్దగా తెలియదు. ఆ సమయంలో ఆయన ఐపీఎల్ మొదటి ఏడాది విజయంతో ఉబ్బితబ్బిబ్బవు తున్నారు. నేనాయనను భారతదేశపు జెర్రీ మెగోయర్గా పరిచయం చేశాను. జెర్రీ మెగోయర్, ఆ పేరుతోనే తీసిన సినిమాలోని, ఏదీ అసాధ్యం కాదనిపిం చేలా చేసే అమెరికన్ స్పోర్ట్స్ ఏజెంట్ పాత్ర. టామ్ క్రూయిజ్ ఆ క థానాయక పాత్రను పోషించారు. ఆయనను నేనలా పరిచయం చేసినందుకు లలిత్ ఉప్పొంగిపోయారు. ల్యాప్‌ట్యాప్ ముందు తాను ఎలా గంటల తరబడి అంతులేకుండా కృషి చేసి ఐపీఎల్‌ను రూపొందించారో, క్రీడాపరమైన తన ఈ అద్భుతాన్ని వేలెత్తి చూపలేనంత లోపరహితంగా ఆయన ఎలా ఆవిష్కరించారో చెప్పుకొచ్చారు. అది బాగానే ఉందిగానీ, లండన్‌లో నేనాయనను కలుసుకున్నానా? లండన్‌లో భారతీయులు యథాలాపంగా తోటి భారతీయులకు తటస్థపడుతుండే తాజ్ గ్రూపునకు చెందిన సెయింట్ జేమ్స్ కోర్టులో నాకాయన తటస్థపడ్డారు. అప్పుడాయన ఓ మూల టేబుల్ వద్ద బింద్రాతో కలసి భోజనం చేస్తున్నారు. నేనలా అంతరాయం కలిగించినందుకు ఇద్దరిలో ఎవరికీ సంతోషం అనిపించలేదని నాకు అనిపించింది. ఐపీఎల్ విజయవంతం కావడం, బీసీసీఐ అధికారం పెరుగుతుండటం అనే రెండూ ఎప్పుడోగానీ ఆయనకు బాగా తలకెక్కాయి. తన పరిధిని దాటి మరీ ఆయన ముందుకు పోయారు. ఆయన మొట్టమొదట్లోనే అంతర్జాతీయ క్రికెట్ అధికారాన్ని రుచి చూశారు. మొదటి ఐపీఎల్లో ఆస్ట్రేలియన్ క్రీడాకా రులు పాల్గొనడానికి షరతులను చర్చించడం కోసం బీసీసీఐ ఆయనను ఆ దేశానికి పంపింది. అప్పుడాయన తన పలుకుబడిని ప్రయోగించి, డబ్బును వాగ్దా నం చేసి అసీస్ క్రీడాకారులను, బోర్డును (క్రీడాకారుల ఫీజులో వాటా) ఊరిం పజేసి ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో హర్భజన్-సైమండ్స్ మధ్య రేగిన ‘‘మంకీగేట్’’ వివాదం సందర్భంగా అది బాగా తోడ్పడింది. లలిత్ తలబిరు సుతనాన్ని, బీసీసీఐకి ఉన్న అధికారాన్ని మొరటుగా ప్రయోగించి ఆ వివా దాన్ని భారత్ వైపు మొగ్గేట్టు చేశారు. భజ్జీని చాలా తేలిగ్గా వదిలేసి, అంపైర్ స్టీవ్ బక్నర్‌పై వేటు వేశారు. అయితే ఇది భారత క్రికెట్‌ను ప్రపంచ మీడి యాలో అప్రతిష్టపాలు చేసింది. ఆయనకు దురుసు మనిషిగా పేరు తెచ్చింది. దాన్ని ఆయన ఇష్టపడటమూ ప్రారంభించారు. 2009 నాటికి, ఐపీఎల్‌ను ఆయన దక్షిణాఫ్రికాకు తీసుకుపోయేటప్పటికి ఇది ఉన్మాదం స్థాయికి చేరింది. యూపీఏ ప్రభుత్వ వ్యవహారాల్లోకి తలదూర్చి దాన్ని తూల నాడారు. అప్పటికే దానితో ఘర్షిస్తున్న శరద్‌పవార్, రాజీవ్ శుక్లాలతో కుమ్మ క్కయ్యారు. మీకు గుర్తుండే ఉండాలి, లేకపోతే యూట్యూబ్‌లో ఇప్పుడు చూడండి - లలితే అప్పుడు ఐపీఎల్ స్టార్. దక్షిణాఫ్రికా స్టేడియంలలో ఆయన ఆటో గ్రాఫుల కోసం గుంపులుగా ఎగబడ్డారు, కెమెరాలు ఆయన్ను అనుస రించాయి. అప్పటికల్లా ఐపీఎల్ మీడియా కవరేజీపై ఆయన పూర్తి నియంత్రణను సాధించారు. అది ఎంత వరకు సాగిందంటే మొహాలీలో భజ్జీ, శ్రీశాంత్‌ను చెంపపెట్టు పెట్టిన వీడియో ఫుటేజీ ఎవరికంటా పడకుండా శాశ్వతంగా సమాధై పోయింది. లలిత్‌కు వచ్చిపడ్డ ఈ కొత్త కీర్తిని నేను క్రికెట్‌కు అత్యంత సుదూరమైనదైన దావోస్‌లో సైతం చూడగలిగాను. 2009లో ఆయన దక్షిణాఫ్రికాను జయించిన తర్వాత ఎంతో కాలం కాకముం దే జరిగిన దావోస్ సమావేశాల ముగింపు వేడుకల్లో అది జరిగింది. దక్షిణా ఫ్రికా విషయంగా (థీమ్‌తో) సాగుతున్న ఆ సాయంత్రం నాకంటే కొన్ని అం గుళాలు ఎత్తున్న మిస్ దక్షిణాఫ్రికా ఒంగి నా బ్యాడ్జీపై పేరును చూసి... ‘ఓ, మీరు భారత్ నుంచి వచ్చినవారా, లలిత్ మీకు తెలుసా?’ అని అడిగింది. ఆ తదుపరి కొంత కాలానికే ఆయన పతనమూ మొదలైంది. అది మరో సంపన్న వ్యాపారి శ్రీనివాసన్ ఎదుగుదలతో పాటూ సాగింది. ప్రదర్శనాస క్తుడైన లలిత్ శైలితో పోల్చి శ్రీనివాసన్‌ను త క్కువగా అంచనా వేసినా, రాజకీ యవేత్తలతో వ్యవహరించడంలో ఆయనకంటే చతురతను ప్రదర్శించగల వారు మరెవరూ లేరు. ఆయన రాష్ట్రానికే చెందిన జే జయలలిత మాత్రమే అందుకు మినహాయింపు. దేన్నీ లెక్కచేయని లలిత్ సముద్రపు దొంగల శైలి శ్రీనివాసన్‌కు తోడ్పడింది. కానీ అది మితవాదులకు ఆమోదయోగ్యం కాలేదు, తోటివారిలో అసూయను రేకెత్తించింది. శరద్ పవార్ సైతం అత నితో స్నేహంగా ఉండలేకపోయారు, సహాయం చేయలేకపోయారు. లలిత్ మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఈడీ కేసుల్లో ఏమున్నాగానీ, ఆయన ఎదుర్కొంటున్నది మాత్రం ఒక్కటిగా ఏకమైన అధికారాన్ని. ఆయన ఇప్పుడు ప్రధాని మోదీని పొగిడినా, రాజే, సుష్మాలకు ధన్యవాదాలు తెలిపినా వారు మాత్రం ఆయనకు దూరంగానే నిలుస్తారు. పదేపదే ఆయన్ను పారిపోయిన వాడనీ (ఆయన పారిపోకున్నా), ఆయన ‘‘తప్పించుకు పోవడానికి’’ కారణం యూపీఏనని నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పుపడుతోంది. కాబట్టి అది ఆయన వెంట పడుతోంది, బహుశా నేరపూరితమైన అక్రమ ఆర్జనకు సంబం ధించిన చట్టాలను ప్రయోగించి... ఆయన్ను అప్పగించాలని అది బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. లలిత్ దురదృష్టం కొద్దీ, రాజకీయ వర్గమంతా ఆయనకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచింది. పాతకాలపు విజ్ఞత చెప్పేట్టు భార తీయులను ఐక్యం చేసేవి క్రికెట్టు, యుద్ధమూ మాత్రమే. అలాగే క్రికెట్ క్రీడను శాసించే అధికారానికి వ్యతిరేకమైన యుద్ధం మాత్రమే భారత రాజకీయ వేత్తలను ఐక్యం చేస్తుంది. టజ్ఛిజుజ్చిటజఠఞ్ట్చ653ఃజఝ్చజీ.ఛిౌఝ (వ్యాసకర్త శేఖర్ గుప్తా) -
వాస్తవాలతో భ్రమలకు చెల్లుచీటీ
జాతిహితం మీరు అర్థరహితంగా మాట్లాడుతున్నారూ అంటే, మీ బుర్రను పరీక్ష చేయిం చుకోవాల్సిందేనని ఎవరైనా చెబుతారు. అయితే అసలా అవసరమే రాని సమయాలూ ఉంటాయి. సబ్సిడీలు లేకుండా కూడా వ్యవసాయరంగం మన గలుగుతుందని మీరు విశ్వసించేట్టయితే పిచ్చివాడని ముందుగానే మీకు ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ వారం జాతిహితంలో గణాంకాల ఆధారంగా కొన్ని భ్రమలను బద్ద లుకొడతామని వాగ్దానం చేశాం. వ్యవసాయానికి చాలా అధికంగా సబ్సిడీ ఇస్తున్నారనే విస్తృతాభిప్రాయాన్ని సవాలు చేయడానికి బదులుగా మనం దాన్ని ఎందుకు సమర్థిస్తున్నాం? బహుశా మన బుర్రలను పరీక్ష చేయించుకోవాల్సి ఉండి ఉంటుంది. అయితే వాస్తవాలను ముందు చూద్దాం. జపాన్‌లో మొత్తం వ్యవసాయ ఆదా యంలో వ్యవసాయ సబ్సిడీల వాటా 56 శాతంగా, యూరోపియన్ యూని యన్‌లో 19 శాతంగా, అమెరికాలో కేవలం 7.1 శాతంగా ఉంది. ఇవి ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) గణాం కాలు. జపాన్ విషయం నిజానికి ప్రత్యేకమైనదే అయినా, అదే ఎక్కువ చర్చ నీయాంశంగా ఉంది. బియ్యం దిగుమతులపై 778 శాతం, గోధుమ దిగుమ తులపై 252 శాతం సుంకాలను విధించి జపాన్ కూడా తన రైతాంగాన్ని కాపాడుతోంది. కాబట్టి మీరు మీ రైతుల పరిరక్షణకు కూడా అడ్డు చెప్పొద్దు. ప్రతి దేశమూ ఆ పని చేయాల్సిందే. అయితే మన దేశంలోలాగా ఇతర మరే పెద్ద ఆర్థిక వ్యవస్థలోనైనా రైతు ఇలా ఆకలిగా అర్థనగ్నంగా ఉంటాడా? మన ఎరువుల సబ్సిడీలు రూ.70,000 కోట్లకు మించి పోయాయి. మన రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి చెల్లించే మొత్తం విద్యుత్ సబ్సిడీ కూడా ఇంచు మంచు రూ.70,000 కోట్లుంటుంది. వీటికి విత్తనాలు, వ్యవసాయ సాధ నాలు, డీజిల్ (ఇటీవలి వరకు), ఉచిత నీరు, బోసస్ వగైరా ఉత్పత్తి కార కాలపై ప్రత్యక్ష సబ్సిడీలను కూడా కలుపుకుంటే.. మొత్తం వ్యవసాయ సబ్సిడీలు ఎంత తక్కువగా చూసినా రూ. 2,00,000 కోట్లకు దాటి పోతాయి. అయినా రైతు దయనీయ స్థితిలోనే ఉన్నాడు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవ సాయం నిరాదరణకు గురైనది, కాబట్టి దానికి మరిన్ని సబ్సిడీలను ఇవ్వాలనే గగ్గోలు ఎప్పుడూ ఉంటుంది. మేం సవాలు చేస్తున్నది ప్రధానంగా వ్యవసాయం దరిద్రపుగొట్టుదనే భ్రమను. మన దేశానికి కావాల్సింది ఇంకా ఎక్కువ వ్యవసాయ సబ్సిడీలు కావు, వివేచనాయుతమైన సబ్సిడీలు. సబ్సిడీలలో అత్యధిక భాగం బడా రైతులకే దక్కుతున్నాయనేది ప్రపంచవ్యాప్త వాస్తవం. మన దే శంలో అందుకు విరుద్ధంగా అవి బడా వ్యాపార రంగానికి చేరుతున్నాయి. మొత్తంగా ఎరు వుల పరిశ్రమే ఆ సబ్సిడీల చుట్టూ విస్తరించి ఉన్న సిగ్గు చేటైన వ్యవహారం. ఎరువుల శాఖ నేరుగా ఉత్పత్తిదారులకు రూ.70,000 కోట్ల సబ్సిడీని పంచి పెడుతోంది. అది వారికి ఒక పెద్ద ఏటీఎమ్‌గా మారింది. ఇదిలా ఉంటే, రైతు ఎరువుల కోసం బిచ్చగాడిలా దేబిరించాల్సి ఉంటుంది. సబ్సిడీల వల్ల ధరలు తగ్గి యూరియా అనే ఎరువు కోసం శాశ్వతంగా కొరత ఎలా ఏర్పడిందో, దాని కోసం ఎలా అల్లర్లు సైతం జరుగుతున్నాయో మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సబ్సిడీ వల్ల భారత్‌లో యూరియా ధర దాని అసలు ధరలో మూడో వంతుకంటే కూడా చౌకగా మారింది. దీంతో దాన్ని పొరుగు దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. సబ్బులు, పేలుడు పదార్ధాలు మొదలు పాల కల్తీ వరకు ఇతర పరిశ్రమలకు యూరియాను మరలించేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ చైనా నుండో యూరియాను ‘‘దిగుమతి’’ చేసుకొని మన ప్రాదేశిక జలాలకు ఆవలి అంతర్జాతీయ సముద్రం ద్వారా తిరిగి ఆ దేశానికే ‘‘ఎగుమతి చేయడం’’ సైతం జరుగుతోంది. సబ్సిడీని ఇరు పక్షాలూ పంచుకుంటాయి. ఈ చెడంతా చాలదన్నట్టు ఈ అధిక సబ్సిడీ ఆవశ్యకమైన ఎన్పీకే (నైట్రోజన్, ఫాస్పేట్, పొటాషియం) మిశ్రమంలో ఇతర రెండింటినీ వదిలి యూరియా లేదా నైట్రోజన్‌ను మన రైతులు ఎక్కువగా వాడే స్థితికి నెడుతోంది. ఫలితంగా కోట్ల హెక్టార్ల అత్యంత సారవంతమైన భూములు నాశనమైపోతున్నా యి. రైతులకు భూసార పరీక్ష కార్డులు ఇవ్వడం మంచి ఆలోచన. కానీ కుళ్లి కంపుకొడుతున్న ఎరువుల సబ్సిడీ ఆర్థికశాస్త్రం దాన్ని ఓడించేస్తుంది. బ్రహ్మాం డమైన స్వార్థ ప్రయోజనాలు, లాభాలు చేసుకునే మాఫియా ఈ ఎరువుల సబ్సిడీల చుట్టూ నిర్మితమై ఉంది. అనాలోచితమైన వ్యవసాయ సబ్సిడీలు, వివేకరహితమైన ఆహార ఆర్థిక వ్యవస్థతో కలసి భారత వ్యవసాయ రంగాన్ని గందరగోళంగా మార్చింది. కాబట్టి మేం కూల్చివేయనున్న రెండవ అతి పెద్ద భ్రమ నయా-ఉదారవాద సంబంధమైనది. అది, పన్ను మినహాయింపులున్న రైతుకు అధిక సేకరణ ధరలను చెల్లిస్తూ ప్రభుత్వం అతిగా గారం చేస్తోంది; తద్వారా అది పన్ను చెల్లింపుదారులకు నష్టం కలిగించడమే గాక, ఆహార ద్రవ్యోల్బణానికి కూడా దారితీస్తోందనే భ్రమ. వ్యవసాయరంగంపై శాంతా కుమార్ కమిటీ ఇటీవలే వీటిలో కొన్ని అంశాలను వివరంగా పరిశీలించింది. చాలా గణాంకాలకు గానూ నేను నా రచయితలకు కృతజ్ఞుడిని. మన దేశంలో గోధుమ సేకరణ, లేదా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) టన్నుకు 226 డాలర్లు. అదే పాకి స్తాన్‌లో 320 డాలర్లు, చైనాలో 385 డాలర్లు. వ్యవసాయం బాగా తెలిసిన ఏ రైతూ, ప్రపంచంలో ఎక్కడా తన సాగు ఏమీ బాగా లేదని అనడు. కానీ మనతో పోల్చి చూసుకునే దేశాలలో అత్యధికం మనకు భిన్నంగా తమ వ్యవసాయాన్ని సంస్కరించుకున్నాయనేది వాస్తవం. పాకిస్తాన్, చైనాలు రెండూ ఆదాయ మద్దతు రూపంలో ప్రత్యక్ష వ్యవసాయ సబ్సిడీలను అమలుచేస్తున్నాయి. రెండూ ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) రద్దు చేశాయి. మనం మాత్రం మితవాద ధోరణితో రైతులకు ‘‘మద్దతు’’ను ఇస్తున్నాం. ఆ తక్కువ ధరకు సైతం ప్రభుత్వ సంస్థలకు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగేది. కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే. కన్నాల్లోంచి ఎక్కడికక్కడ కారిపోయే, తేలిగ్గా వచ్చి పడే డబ్బు రూపేణా వ్యవసాయ సబ్సి డీలను చెల్లాచెదురు చేసేస్తాం. ఆ మీదట ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విని యోగదారులకు సబ్సిడీ ధరలకు అమ్మడం కోసం భారీగా ఆహార ధాన్యాల నిల్వలను పోగుచేస్తాం. ఈ పీడీఎస్‌ను నేను ప్రజా దౌర్భాగ్య వ్యవస్థ అని అం టాను. అందువలన మనం మన ఆహార/వ్యవసాయ ఆర్థికశాస్త్రాన్ని మొత్తం మూడు అంశాల్లోనూ వక్రీకరించాం. వికృతపరచాం: ఉత్పత్తికారకాలు (ఇన్ పుట్స్), ఉత్పత్తులను రైతే నేరుగా అమ్ముకోవడం, వినియోగం. విపరీతంగా విస్తరించిన ధరల హెచ్చు తగ్గులన్నింటి ప్రయోజనాలు చివరికి అవాంఛనీ యమైన జేబుల్లోకి, మధ్యవర్తులు, ఇన్స్పెక్టర్లు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) అనే బ్రహ్మాండమైన వ్యవస్థకు చేరుతాయి. అందువలన, మన దేశ ఆహార భద్రతకు మరీ మరీ ఎక్కువగా ఆహార ధాన్యాలు అవసరమేనేది తదుపరి మా హిట్‌లిస్ట్‌లో ఉన్న భ్రమ. క్షామ పరిస్థితులను స్థిరీకరించడం కోసం దేశానికి అవసరమయ్యే బఫర్ స్టాక్ కేవలం కోటి టన్నులు మాత్రమేనని, అందులో భౌతికంగానూ, మిగతా సగం అంతర్జాతీయ ఆహార ధాన్యాల ఫ్యూచర్స్, ఆప్షన్ల రూపంలోనూ ఉంటే సరిపో తుందని శాంతా కుమార్ కమిటీ తెలిపింది. కానీ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 15-20 శాతం (3.2 కోట్ల టన్నులు) అనే కాలం చెల్లిన ప్రమాణం అమల్లో ఉన్న దేశంలో అలాంటి ఆలోచన మరీ విప్లవాత్మకమైనది. మన ఆహారధాన్యాల ఉత్పత్తి 2014-15లో 25.1, 2013-14లో రికార్డు స్థాయిలో 26.5 కోట్ల టన్నులు. ఆహార భద్రతా చట్టం వల్ల పీడీఎస్ అదనపు అవసరాలను కూడా చేర్చితే మన బఫర్ స్టాక్ 4.2 కోట్ల టన్నులకు చేరుతుంది. కానీ నేడు మనం 6 కోట్ల టన్నులకు పైగా నిల్వలను పెట్టుకున్నాం. వాస్తవానికి మనం అతి సులువుగా కోటి టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసుకోవచ్చు. అలా అని రెండేళ్ల క్రితం నిర్ణయించినా, నాటి కాగ్, సీవీసీ, సీబీఐల కాలంలో ఆహా రశాఖ అందుకు జంకింది. ఈ అదనపు నిల్వల వ్యయం రూ. 45,000 కోట్లకు పైగానే, ఫలితాలు మాత్రం శూన్యం. ఎఫ్‌సీఐ రైతులకు చెల్లింపులు చేసిన తర్వాత ధాన్యాన్ని తరలించడానికి టన్నుకు రూ. 4.75 ఖర్చవుతుంది. ఈ అదనపు ధాన్య నిల్వల రవాణాకే రూ.7,500 కోట్లు అదనపు ఖర్చు. ఈ అంకెలను దయచేసి గుర్తుంచుకోండి, మరో నిమిషంలో మనం వాటి వద్దకే మళ్లీ రానున్నాం. ఇది, విస్తృతంగా ప్రచారంలో ఉన్న మన ఆహారభద్రత ప్రమాదకర స్థితిలో ఉన్నదనే భ్రమను తుత్తునియలు చేస్తుంది. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే క్రిస్టోఫ్ జఫర్లోట్ వంటి అత్యంత జాగరూకత గల అద్భుత విద్యావేత్త సైతం ఆ మాయలో పడిపోయారు. ఇటీవల ఓ పత్రిక కాలమ్‌లో ఆయన, గత ఏడాది మనం ‘‘80,000 టన్నుల’’ గోధుమలను దిగుమతి చేసుకోవడాన్ని ఆహార భద్రతకు తలెత్తనున్న ముప్పుగా అభివర్ణించారు. గంగా-జమునీ అలంకారిక భాషలో చెప్పాలంటే, 6 కోట్ల టన్నుల గోధుమ, బియ్యం నిల్వలు ఉండగా 80 వేల టన్నుల దిగుమతి ఒంటె నోట్లోని జీలకర్ర గింజంత. ఈ గోధుమ దిగుమతులపై పరిశోధనాత్మక దర్యాప్తు జరిపిన దరిమిలా అవి మాగీలాంటి కొన్ని బ్రాండెడ్ వస్తువుల తయారుదారులు విభిన్నమైన జిగురు, పీచు అవసరాల కోసం దిగుమతి చేసుకున్న కొద్ది మొత్తాలనీ, లేక పోతే ఉత్తర భారతంలోని ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి తెచ్చుకునే కంటే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవడమే చౌకనుకున్న కొన్ని పిండి మిల్లుల దిగుమతులనీ తేలింది. ఇలాంటి ముక్కలు చెక్కల అర్థశాస్త్రం మీకు పిచ్చి అనిపిస్తోందా? మీకు మరిన్ని విషయాలు చెబుతాను. ఎఫ్‌సీఐ కోసం ఆహార ధాన్యాల సేకరణను ఎక్కువగా చేసేవి పంజాబ్, హర్యానా రాష్ట్రాలే. అవి కనీస సేకరణ ధరపై 15 శాతం సెస్‌ను కేంద్రంపై విధిస్తాయి. ఆహారధాన్యాలను ఎక్కువగా పండిస్తున్నందుకు కేంద్రం వాటికి నేరుగా చెల్లిస్తున్న బహుమతే ఇది. ఇక మీరు హరిత విప్లవం సాధించిన రైతు విపత్కరమైన గోధుమ/వరి విషవలయంలో చిక్కుకుపోయాడని ఫిర్యాదు చేస్తారు. గోధుమ/వరి వల యం ఆ రాష్ట్రాల బడ్జెట్లకు డబ్బులు రాల్చేది అయినప్పుడు అవి రైతును క్యాబేజీ, బెండ, గోబి, క్యాలిఫ్లవర్ లేదా దోస వేయమని ఎందుకు ప్రోత్స హిస్తాయి? భారత వ్యవసాయాన్ని చక్కదిద్దాలంటే పంజాబ్, హర్యానాలు వ్యాపార పంటలకు, మద్దతు ధరతో మొక్కజొన్నకు మారమని చెప్పాలి. బాస్మతి వరి వేస్తే మామూలు వరితో పోలిస్తే టన్నుకు మూడు రెట్లు ఆదాయా న్నిస్తాయి, మూడో వంతు తక్కువ నీటిని వినియోగిస్తాయి. మామూలు వరిని ఈశాన్య రాష్ట్రాలకు, నర్మదా నదీ జలాలతో శక్తివంతమైన మధ్య ప్రదేశ్‌కు బదలాయించవచ్చు. ఎంపీ రైతులు దాదాపు 20 శాతం వృద్ధిని నమోదుచేస్తున్నారు. పరిశ్రమలు, పట్టణీకరణల కోసం భూమిని సేకరిస్తే దే శంలో సాగు భూమికి కొరత ఏర్పడి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోందనేది తదుపరి కూల్చి పారేయాల్సిన భ్రమ. మరో మారు వాస్తవాలనే చూద్దాం. మన దేశం దాదాపు 20 కోట్ల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమిలో వ్యవ సాయం చేస్తోంది. ఇంచుమించు సాలీన 26 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది. చైనా సాగుచేస్తున్నది 15.6 కోట్ల హెక్టార్లు. కాగా, ఉత్పత్తి చేస్తున్నది (ఊపిరి బిగబట్టి వినండి!) 60 కోట్ల టన్నులు. ఎందువల్ల? దానికి సాగునీరుంది. అక్కడి వరిలో 63 శాతం సంకర వంగడాలు. కాగా, మన దేశంలో అది కేవలం 3 శాతమే. ఎందుకు? ఆ విషయాన్ని మీరు వామపక్ష, మితవాద ‘‘సేంద్రియ వ్యవసాయ’’ లుడ్డైట్లను (19వ శతాబ్దపు యంత్ర విధ్వంసకులు-అను.) అడగండి. స్థూలంగా పైన ఇచ్చిన గణాంకాలన్నీ వ్యవ సాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాతీ నుంచి సేకరించినవే. మీరు వ్యవసాయరంగాన్ని చక్కదిద్దగలగాలంటే ఏమేం చేయాలో స్వల్ప జాబితా ఇది. ఒకటి, సబ్సిడీల మొత్తానికంతటికీ సువ్యవస్థితం చేసి, వాటిని నేరుగా రైతుకే భూకమతం ఆధారంగా చెల్లించండి. రెండు, వ్యవ సాయ ఉత్పత్తుల ధరలను స్వేచ్ఛగా మార్కెట్లో నిర్ణయం కానివ్వండి. మూడు, మద్దతు ధరను నగదు రూపంలో చెల్లించి, విద్యుత్తు సహా అన్ని ఉత్పాదితాలకు మార్కెట్టు ధరలను వసూలు చేయాలి. నాలుగు, పొదుపులు, అదనపు మదుపులన్నీ నీటి పారుదల, సాంకేతికత ఉన్నతీకరణ, నూతన విత్తనాలు, జీఎమ్ సహా పరిశోధనపై పెట్టాలి. నీటిపారుదల మధ్యప్రదేశ్‌లో ఎలాంటి అద్భుతాన్ని చేసిందో చూడండి. అయితే, మహారాష్ట్రలో నీటిపారుదలపై 2000-01 నుంచి 2010-11 మధ్య రూ.81,206 కోట్లు ఖర్చు చేసినా నీటి వసతి ఉన్న పత్తి సాగు 5.1 శాతానికి మించలేదని కూడా విస్మరించరాదు. అందులో సగం ఖర్చుతో గుజ రాత్లో 67 శాతం సాగు అదనంగా పెరిగింది. దీన్ని మీరు విదర్భ, గుజరాత్ పత్తి రైతుల పరిస్థితులను పోల్చి చూడటం ద్వారా చూడవచ్చు. ఐదు, దుర్భిక్షం అనివార్యం అని, అలాగే వాతావరణ మార్పుల వల్ల విపరీత వాతావరణ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంగీకరించాలి. భారత్‌లో ప్రతి నాలుగైదు ఏళ్లకు ఒకసారి దుర్భిక్షం ఏర్పడుతుందని గత వందేళ్ల గణాంక సమాచారం చెబుతోంది. కాబట్టి మనకు నిజమైన వ్యవ సాయ బీమా వ్యవస్థ, దేశంలోని 70 శాతం సాగుకంతటికీ పూర్తి బీమాను కల్పించే వ్యవస్థ. కానీ దానికి ఏటా రూ.15,000 కోట్లు అవసరం. ఎఫ్‌సీఐ ఆ మిగులు ఆహారధాన్యాల బరువు మోయకుండా ఉంటే చాలు అందులో సగం మొత్తం లభిస్తుంది. ఇంతకు ముందు చెప్పిన ఆ రూ.7,500 కోట్ల అంకెను గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి బీమా? అందుకు అమలులో ఉన్న చాలా నమూనాలే ఉన్నాయి. నిజంగానే అద్భుతమైన నమూనా పీకే మిశ్రా (ప్రధాని కార్యాలయం ప్రస్తుత అదనపు ప్రధాన కార్యదర్శి) నేతృత్వంలోని పంటల బీమా పథకాల సమీక్ష, అమలు కమిటీ వద్ద సిద్ధంగా ఉంది. స్మార్ట్ ఫోన్లు, జీపీఎస్, ద్రోన్ల సమ్మేళనంతో సత్వర చెల్లింపులు చేయడంపై ఇతర నిపుణులు కూడా ఆ విష యంలో చాలా కృషే చేశారు. గులాతీ అన్నట్టు, కెన్యా చేయగా, మనం చేయ లేమా? అంతకంటే ముందుగా రైతును బిచ్చగాడిగా దిగజార్చి, అతనికి బిచ్చం వేస్తూ, దాన్ని కూడా ఆకలితో కాక దురాశతో నకనకలాడుతున్న వంచ కులు కాజేస్తున్నా బూటకపు సంతృప్తిని కలిగిస్తున్న ఈ భ్రమలను చెత్త బుట్టలో వేయాలి. - శేఖర్ గుప్తా shekhargupta653@gmail.com