సుశాంత్‌ బయోపిక్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల | Sushant Singh Rajput Biopic First Look Released | Sakshi
Sakshi News home page

సూసైడ్ ఆర్ మ‌ర్డ‌ర్: చిన్న పట్టణం నుంచి షైన్‌స్టార్‌గా!

Published Tue, Jul 21 2020 4:31 PM | Last Updated on Tue, Jul 21 2020 5:11 PM

Sushant Singh Rajput Biopic First Look Released - Sakshi

ముంబై: బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌‌ బయోపిక్‌లో వస్తున్న ‘సూసైడ్ ఆర్ మ‌ర్డ‌ర్’ చిత్రం ఫస్ట్‌ం లుక్‌ను దర్శకుడు శేఖర్‌ గుప్తా మంగళవారం సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. టిక్‌టాక్‌ స్టార్‌  సచిన్‌ తివారీ లీడ్‌రోల్‌లో పోషిస్తున్నాడు. టిక్‌టాక్‌లో సచిన్‌ తివారి వీడియోస్ చూసిన సుశాంత్ అభిమానులు అచ్చం సుశాంత్‌లా ఉన్నాడంటూ అతడిని ఫాలో అవ‌డంతో స‌చిన్‌కు కూడా విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. దర్శకుడు శేఖర్‌ గుప్తా సచిన్‌ తివారితో సుశాంత్‌ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సూసైడ్ ఆర్ మ‌ర్డ‌ర్: ఏ స్టార్‌ వాజ్‌ లాస్ట్’‌ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇక  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ షేర్‌ చేస్తూ ఓ ప్రకటన చేశారు. ‘ఒక చిన్న పట్టణానికి చెందిన వ్య‌క్తి చిత్ర పరిశ్రమలో షైనింగ్ స్టార్ అయ్యాడు. ఇది అతని ప్రయాణం. ఈ సినిమాతో స‌చిన్ తివారిని సినిమాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. (చదవండి: సుశాంత్​ కేసు: స్టేట్​మెంట్​ ఇచ్చిన చోప్రా)

ఈ చిత్రం గురించి ఇంతకుముందే ఓ ఇంట‌ర్వ్యూలో గుప్తా మాట్లాడుతూ.. ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మనందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఇది కొత్త విష‌యమేమీ కాదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎద‌గాలని వచ్చిన చాలా మంది నటులకు అవ‌కాశాలు దొర‌క‌డం లేదు. చాలామంది ఈ మార్గంలో వెళతారు. మరికొందరు తమ జీవితమంతా కష్టపడుతూనే ఉంటారు. అందుకే బాలీవుడ్‌లో గాడ్ ఫాద‌ర్స్ లేకుండా వ‌చ్చే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చెప్పాల‌నుకుంటున్నా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. గత నెల జూన్ 14న సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌ చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘రాబ్తా’, ‘కేదార్‌నాథ్’ వంటి చిత్రాల్లో సుశాంత్ నటించాడు. ఆ తర్వాత నటించిన ‘ఎమ్మెస్ ధోనీ’ బ‌యోపిక్ మాత్రం సుశాంత్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ త‌ర్వాత చిచోరే కూడా సుశాంత్ కెరీర్‌ను మ‌రో మ‌లుపు తిప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement