
కొత్త గాలికి సంకేతం పంజాబ్
జరగనున్న పరిణామాలకు ముందస్తుగానే స్పష్టమైన సూచనలు కనిపించ డాన్ని ఇంగ్లిష్‌లో ‘రైటింగ్ ఆన్ ది వాల్’ (గోడమీది రాతలు) అనడం రివాజు.
జాతిహితం
అకాలీలను దించి కాంగ్రెస్‌ను ఎక్కించే క్రీడ ఇంకా ఎందుకు? మాతో యువత ఉంది, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడంyì అనేదే ఆప్ ప్రచార వ్యూహం. ఎన్నికల పండితులు ఆ పార్టీ ప్రభావం మాల్వాకే పరిమతమని అంటున్నారు. ఒక ప్రాంతంలోని ఇంత బలీయ మైన ధోర ణిని భౌగోళికతో లేదా నదో అడ్డగిస్తుందని నమ్మడం కష్టమే. ఎన్నికల పండి తులు చెప్పేదే నిజమైనా ఆప్ ఒక పెద్ద జాతీయ శక్తిగా ఆవిర్భవిస్తుందనడం నిస్సందేహం. దాని ప్రభావం దేశంపైనా, వచ్చే ఏడాది జరిగే గుజరాత్ ఎన్నికలపైనా ఉంటుంది.
జరగనున్న పరిణామాలకు ముందస్తుగానే స్పష్టమైన సూచనలు కనిపించ డాన్ని ఇంగ్లిష్‌లో ‘రైటింగ్ ఆన్ ది వాల్’ (గోడమీది రాతలు) అనడం రివాజు. ఆ నానుడి భారత్, దాని ఇరుగుపొరుగు దేశాలలో ప్రయాణాలు చేసే క్రమంలో, ప్రత్యేకించి ఎన్నికల ప్రచార క్రమంలో పుట్టుకొచ్చింది. భారత్‌లోని నగరాలు, వేగంగా పట్టణీకరణం చెందుతున్న గ్రామీణ ప్రాంతాల గుండా పోయేటప్పుడు కళ్లూ, చెవులు బార్లా తెరచి ఉంచి గోడల మీది రాతలను చూస్తే లేదా వాటి ప్రతిధ్వనులను వింటే... ఏ మార్పు జరగనున్నదో, ఏ మార్పు జరగడం లేదో అవే చెబుతాయి. భారత్‌లో మార్పు ఎన్నటికీ పదును కోల్పోదని అవి మీకు తెలియజేస్తాయి. భారత ఉపఖండం హృదయం గోడల మీద పరుచుకుని ఉంటుంది.
ఇక్కడ ‘గోడలు’ అంటే పరిమితమైన, భౌతికమైన, భాషాపరమైన అని అర్థం కాదు. అది గుజరాత్ ప్రధాన రహదారుల వెంబడే ఉండే ఫ్యాక్టరీల గగనపు శిగపై ఎగిరే పతాకమూ కావచ్చు, కాంచీపురంలోని పెరియార్ బస్ట్ సైజు పాత విగ్రహం కింద చెక్కిన అక్షరాలూ కావచ్చు. లేదంటే ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ ప్రజల మొహాల్లో కనిపించే నవ్వులే కావచ్చు.
ప్రజాభీష్టానికి నవ్వుల కొలబద్ద
అవి సాధారణమైన ఉల్లాసం వల్ల కలిగే నవ్వులు కావు. అంతకంటే విశి ష్టమైన, అనిర్వచనీయమైన తబ్బిబ్బు, మెచ్చుకోలు, ఆశావాదం కలగలిసి విరిసే దరహాసాలు. ఎన్నికల ప్రచార సమయంలో అలాంటి నవ్వు మీకు కని పించిందీ అంటే నిశ్చయాత్మకమైన మార్పును చూస్తున్నామని మీకే అర్థమౌ తుంది.1990 ఎన్నికల్లో వీపీ సింగ్ సవాలు విసిరినప్పుడు, నరేంద్ర మోదీ 2014 ప్రచారంలో, నితీశ్‌కుమార్ బిహార్‌లోనూ, మమతా బెనర్జీ బెంగాల్లోని గత రెండు ఎన్నికల్లోనూ సాగించిన ప్రచారంలో ఆ నవ్వు మనకు కనిపిం చింది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సాగించిన ప్రచారంలో తిరిగి మళ్లీ అదే నవ్వును చూశాం. వీటిలో ప్రతి ఒక్కటీ నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చింది. ‘నవ్వు’ పరీక్ష ద్వారా ఓటరు ఆలోచనా సరళిని కొలిచే సమయం మరోసారి ఆసన్నమైంది. అయితే అది ఈసారి పంజాబ్‌లో జరగనున్నది.
లూథియానా, పంజాబ్‌లోని అత్యంత సుసంపన్నవంతమైన, అతి పెద్ద నగరం, వ్యాపార కేంద్రం. అక్కడి వీధుల్లోని హిందూ, సిక్కు ప్రజల మొహా లకు, గోడలు, పిట్ట గోడల మీదుగా, బాల్కనీలు, కిటికీల్లోంచి తొంగి చూసే మహిళలు, పిల్లల ముఖాలకు, సెల్ ఫోన్ కెమెరాలకు ఈ పరీక్షను అన్వ యించి చూడండి. ఎన్నికల ప్రచార క్యాంపెయిన్లకు సంబంధించి అత్యంత జనాదరణ పొందిన తాజా విలక్షణ.. రోడ్ షోలు. అరవింద్ కేజ్రీవాల్ ఆ రోడ్ షోలనే సాగిస్తున్నారు. ఈ తరహా ప్రచారంలో నాయకుడు సాధారణంగా ఒక్క మాటైనా మాట్లాడడు. కానీ ఓ వాహనంపైకెక్కి చేతులు ఊపుతుంటాడు లేదా ఫలానా వారిని అని ఉద్దేశించకుండా కుడి ఎడమల ఉన్నవారందరికీ చేతులు జోడిస్తుంటాడు. ‘‘మీ ఓటును నాకు ఇవ్వండి’’ అని స్ఫురించే నవ్వును చిందిస్తుంటాడు. ఈ మాదిరి ప్రచారంలో మీరు ఎంతో కొంతమంది గుంపును ఆకర్షించగలుగుతారు. మన దేశంలో ఏ తమాషా అయినా జరుగు తుంది, అంతే. కాకపోతే వీధులకు ఇరుపక్కలా ఉన్న గోడలు నవ్వుల వెలు గులను చిందిస్తున్నాయంటే మీరు మార్పును చూస్తున్నారన్నమాటే.
స్థానికత సమస్యేకాని విలక్షణమైన పార్టీ
నడచి పోతుండగా లేదా వాహనంలో పోతుండగా వేలాది మంది మొహాలను ^è దివేయడానికి మీకు సహాయపడే అనుభవాధార ఫార్ములాగానీ, లేబొరేటరీ పరీక్ష గానీ లేదు. కాబట్టి ఆ నవ్వులను మీరు ఎలా వ్యాఖ్యానిస్తారనేది పూర్తిగా మీ స్వీయగతమైనదే. కానీ నేనీ మొహాలను ఇంతకు ముందే చూశాను. ఎప్పుడూ వాటి అర్థం మార్పే. లేదా కనీసం ఒక కొత్త రాజకీయ పరిణామం ఆవిర్భవించడం. ప్రజాభిప్రాయ సేకరణవేత్తలు ఈ అభిప్రాయాన్ని హేళన చేస్తారు. నేనేమీ వారి విజ్ఞానశాస్త్రాన్ని, వృత్తి నైపుణ్యాన్ని కేవలం గోడ మీది రాతల నానుడితో తీసి పారేయడం లేదు. కాబట్టి మార్చి 11న ఎవరు గెలుస్తారని చెప్పి మీకేమీ పట్టుబడిపోను. కానీ, మన రాజకీయాల్లో దేశ వ్యాప్తమైనది కాకున్నా, పలు రాష్ట్రాలకు విస్తరించిన ఒక కొత్త పార్టీ ఆవిర్భ వించనున్నదనడం నిస్సందేహం. 1989లో జనతాదళ్ తర్వాత ఇలాంటి శక్తి ఆవిర్భవించడం ఇదే మొదటిసారి. అయితే, జనతాదళ్‌కు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ అప్పటికే ఏర్పడి ఉన్న సోషలిస్టు–కుల రాజకీయ శక్తుల నుంచి ఆవిర్భవించినది కాదు. అది అణువణువునా పూర్తిగా కొత్తగా నిర్మితమైన అసలైన పార్టీ. లేదంటే మరే పార్టీతోనూ పోల్చడానికి వీల్లేని విలక్షణమైన పార్టీ.
పంజాబ్‌లో సువ్యవస్థితమైన రాజకీయ వ్యవస్థ యథాతథంగా 70 ఏళ్లపాటూ మనగలిగింది. 1966లో రాష్ట్రం భాషా ప్రతిపదికపై (మతపరమైన హిందూ, సిక్కు ప్రాతిపదికపైన కూడా) విడిపోయినప్పుడూ, 1883–93 ఉగ్రవాద దశాబ్దంలోనూ కూడా అది అలాగే నిలవగలిగింది. అకాలీలు, కాంగ్రెస్‌వారు వంతులవారీగా అధికారాన్ని నెరపారు. మధ్యలో కొన్నిసార్లు రాష్ట్రపతి పాలనకు మాత్రమే అవకాశమిచ్చారు. ఇతర జాతీయ పార్టీలు, అకాలీల నుంచి చీలిపోయిన వర్గాలు ఎన్నడూ నిజమైన ప్రభావాన్ని చూప లేకపోయాయి. వామపక్షాలు కొన్ని ప్రాంతాలలో చాలా కాలంపాటే తమ బలాన్ని కాపాడుకోగలిగాయి. చివరకు అవి కూడా కనుమరుగైపోగా రెండు పార్టీల వ్యవస్థ మరింతగా సువ్యవస్థితమైంది. కాన్షీరాం కూడా పంజాబీనే, అక్కడే పుట్టారు. పైగా దేశంలో అత్యధికంగా, 32.4 శాతం దళిత ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అయినా ఆయన ఇక్కడ ఒక రాజకీయశక్తిని నిర్మిం చడంలో ఎన్నడూ సఫలీకృతులు కాలేకపోయారు. ఉగ్రవాద దశాబ్దంలో భింద్రన్‌వాలే బృందాలు, వారి వారసులు ఆవిర్భవించారు. కానీ వారు ఎన్నడూ విస్తృత జనాకర్షణను, ప్రజాబాహుళ్యపు ఆదరణను చూరగొన లేకపోయారు.
వీటన్నిటిని బట్టి చూస్తే, బయటివారితో కూడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఒక శక్తిగా ఆవిర్భవించడం విశేషమే. పైగా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పంజాబీ మాట్లాడని హిందువు. అంతేకాదు ఇక్కడ లెక్కలోకి రాని కులానికి చెందినవాడు. హరియాణతో పంజాబ్‌కు నదీజలాలు సహా ఎన్నో వివాదా లున్నాయి. కేజ్రీవాల్ ఆ రాష్ట్రానికి చెందినవాడే. కాబట్టి ఆ పార్టీ అస్తిత్వ పరీక్షలో పూర్తిగా విఫలమైంది. ఇక దాని భావజాలం అంతుబట్టేది కాదు. అయినా ప్రజలకు పట్టింపే ఉన్నట్టు అనిపించడం లేదు. ‘‘అతను పంజాబీ కాకపోతే ఏమిటి, కెనడా నుంచో లండన్ నుంచో వచ్చిన వాడేం కాదే. ఆయనా భారతీయుడే, మేమూ భారతీయులమే’’ అన్నాడు సెహ్వత్ సింగ్.
ఆప్ గాలి రాష్ట్రవ్యాప్తం కాదా?
భటిండాకు ఎంతో దూరంలేని జాత్రు గ్రామానికి బయట మూడు రోడ్ల కూడలిలో ఆయన, డజను మంది ఆప్ మద్దతుదార్లతో కలసి ప్లకార్డులు పట్టుకు నిలబడ్డారు. కొద్దిమంది కాంగ్రెస్ మద్దతుదార్లు, ఓ ఇద్దరు అకాలీ విధేయులు అక్కడున్నారు. అక్కడ చర్చలు ఆవేశపూరితంగానూ, వర్గాలుగా చీలిపోయి, పోటీపడుతూ సాగుతున్నాయి. అయినా మంచి హాస్యం చిందిస్తు న్నాయి. పెద్ద నోట్ల రద్దు అందరినీ చాలా దెబ్బ తీసిందనే ఒక్క విషయంలో మాత్రం వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. మీరు గనుక సుసంపన్న మైన పత్తి/గోధుమ ధాన్యాగారంలోకి లోతట్టుకు చొచ్చుకుపోతే ఈ అసం తృప్తి గగ్గోలుగా మారుతుంది. మౌర్ మండి వద్ద మితూసింగ్ అనే రెండున్నర హెక్టార్ల భూమున్న రైతు కలిశాడు. ఆయన తన పంటను రూ. 1.10 లక్షలకు అమ్ముకున్నా, కొద్ది కొద్దిగా రూ. 10,000 చొప్పున దఫదఫాలుగా చేతికి రావ డంతో డబ్బంతా ఖర్చయిపోయిందని ఆగ్రహంతో చెప్పాడు.
పంజాబ్ చిన్నదే అయినా అద్భుత రవాణా సదుపాయాల వ్యవస్థ ఉన్న రాష్ట్రం. అమృత్‌సర్ నుంచి లూథియానాకు, అటునుంచి దక్షిణాదిన భటిండా, పాటియాలాల దిశగా, రాష్ట్రానికి గుండెకాయలాంటి ప్రాంతం గుండా ప్రయాణిస్తూ, ఆగి మాట్లాడుతూ పోతుంటే... మీకు కాంగ్రెస్, అకా లీల కంటే ఆప్, చీపురుల మాటే ఎక్కువగా వినబడుతుంది. కెప్టెన్ అమ రీందర్‌సింగ్, బాదల్‌లు ఇద్దరూ కలిసే ఉన్నారు. అయినా అకాలీల గురించి ఒక్క మంచి మాట వినిపించడం అరుదే. అయితే అతి పాత పార్టీ కావడం వల్ల కాంగ్రెస్‌కు మౌన మద్దతుదార్ల రిజర్వాయరు ఇంకా ఉండి ఉండొచ్చు. అది పోలింగ్ పండితులకే తప్ప రిపోర్టర్లకు కనిపించేది కాదు. అయినా నేను ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆమ్ ఆద్మీ ప్రభావం పంజాబ్‌లోని ఒక పెద్ద ప్రాంతానికి మాత్రమే పరిమితమైందనే వాదనను కూడా నేను సవాలు చేస్తున్నాను.
చిన్న రాష్ట్రమైన పంజాబ్‌ను జాతీయ మీడియా మూడు ప్రాంతాలుగా విడగొట్టేసింది. ఆ రాష్ట్రంలో మూడు భిన్న ప్రాంతాలున్న మాట నిజమే. అమృత్‌సర్ సహా బియాస్ నదికి పశ్చిమాన ఉన్న జిల్లాలు వీటిలో కెల్లా చిన్న ప్రాంతం. దాన్ని మాఝా అని పిలుస్తారు. లూథియానా, జలంధర్‌లున్న బియాస్, సట్లేజ్ నదుల మధ్య ఉన్న సుసంపన్న ప్రాంతం దొవాబ్. సట్లెజ్‌కు తూర్పున, ఇంకా లోతట్టున రాజస్థాన్, హరియాణల సరిహద్దుల్లోని దక్షిణాది మెట్ట ప్రాంతాన్ని మాల్వా అంటారు. అక్కడ 69 శాసనసభా స్థానాలు న్నాయి, మిగతా రెండు ప్రాంతాల్లో కలిపి ఉన్నవి 48. ఆప్ పోటీదారులు, ఎన్నికల పండితులు ఆ పార్టీ ప్రభావం మాల్వాకే పరిమతమని అంటున్నారు. ఒక ప్రాంతంలోని ఇంత బలీయమైన ధోరణిని భౌగోళికతో లేదా నదో అడ్డగి స్తుందని నమ్మడం కష్టమే.
మెట్టప్రాంతంగా చెప్పే మాల్వా ప్రాంతాన్నే చూడండి. పచ్చటి పంటలు, కాలువలు, ఇళ్లు చూస్తే దేశంలోని ఏ గ్రామీణ ప్రాంతానికైనా అసూయ కలుగుతుంది. నిజానికి ఇవేవీ 2017 నాటి పంజాబ్‌లో లెక్కకు వచ్చేవి కావు. ఆప్ ఓటర్లకు ఇస్తున్నది ఒకే ఒక్క సందేశం, అదే దాని వ్యూహం: ‘క్రై’ (సీఆర్‌వై) అంటే మార్పు, ప్రతీకారం, యువత. మీకు మార్పు కావాలి. అకాలీలను దించి కాంగ్రెస్‌ను ఎక్కించే క్రీడ ఇంకా ఎందుకు? మీరు అందరిపట్లా ఆగ్రహంతో ఉన్నారు. మాకైతే గతæ అనుభవం ఏమీలేదు నిజమే. కానీ మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఎన్నికల పండితులు చెప్పేదే నిజమైనా ఆప్ ఒక పెద్ద జాతీయ శక్తిగా ఆవిర్భవిస్తుందనడం నిస్సం దేహం. దాని ప్రభావం దేశంపైనా, వచ్చే ఏడాది జరిగే గుజరాత్ ఎన్నికల పైనా ఉంటుంది.
శేఖర్ గుప్తా
twitter@shekargupta