Election Commission Postpones Punjab Assembly Election 2022 - Sakshi
Sakshi News home page

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా

Published Mon, Jan 17 2022 2:39 PM | Last Updated on Mon, Jan 17 2022 4:28 PM

Punjab Assembly Elections: EC Rescheduled To Held On February 20 - Sakshi

ఛండిఘర్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా  అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20 వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. 

కొత్త షెడ్యూల్‌  ప్రకారం.. జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్లకు ఫిబ్రవరి 1 తుది గడువు, నామినేషన్ల పరిశీలనకు తుది గడువు ఫిబ్రవరి 2, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ఫిబ్రవరి 4, ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 20న, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. 

చదవండి:  సీఎం చన్నీ సోదరుడికి కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement