అమెరికాతో తెగిన గతం బంధనాలు | shekar gupta opinion on indian Foreign policy | Sakshi
Sakshi News home page

అమెరికాతో తెగిన గతం బంధనాలు

Published Sat, Sep 3 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

అమెరికాతో తెగిన గతం బంధనాలు

అమెరికాతో తెగిన గతం బంధనాలు

జాతిహితం

ప్రచ్ఛన్న యుద్ధం అంతరించి, ఏక ధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది.ఆ ధ్రువం ఆకర్షణ శక్తి క్షీణిస్తుండగా మరో ధ్రువం వృద్ధి చెందుతోంది. ఏదో ఒక మేరకు బలాబలాల సమతూకం   నెలకొంటోంది. క్యూబా, ఇరాన్, అమెరికా తమ పాత శత్రుత్వాలను పాతిపెట్టేశాయి. భారత్ తటపటాయిస్తూనే ఉంది. మోదీ ఆ గతాన్ని చెత్తబుట్టలోకి విసిరేశారు. ప్రజా స్వామ్యంలో అధికారం చేతులు మారుతుందే గానీ విదేశాంగ, వ్యూహాత్మక విధానాలు స్థూల జాతీయ ఏకాభిప్రాయం పునాదిగానే కొనసాగుతాయనే అపోహను తొలగించారు.
 
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కిక్కిరిసిన ఢిల్లీ ఐఐటీ ఆడి టోరియంలో జరిపిన ఇష్టాగోష్టికి నేను ప్రయోక్తగా వ్యవహరించాను. ఆ సందర్భంగా కెర్రీ భారత్, అమెరికాలు ‘చారిత్రక తటపటాయింపులను వదు ల్చుకున్నాయి’ అని అన్నారు. ఈ పదబంధాన్ని కెర్రీ ఈ ఏడాది మొదట్లో మన ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్‌లో చేసిన ప్రసంగం నుంచి స్వీకరించారు.

చారిత్రకమైన తటపటాయింపులే కాదు, కాపట్యాలు కూడా ఉన్నాయన డానికి అద్భుతమైన ఆధారాలున్నా వాటిని గమనించేటంత దాకా కెర్రీ పోలేదు. ఐఐటీ క్యాంపస్ నుంచి అలా నడిచివెళ్లేంత సమీపంలోనే  గమాల్ అబ్దుల్ నాసర్ పేరిట ఉన్న ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులోని ఒక భాగాన్ని చూసే వారు. ప్రచ్ఛన్న యుద్ధం/అలీన విధానం కాలం నాటి ఆ ఈజిప్ట్ నియంత వారసత్వాన్ని ఆ దేశస్తులే తిరస్కరించారు. ఆయన పేరిట ఉన్న మార్గం బహుశా ప్రపంచంలో అదొక్కటే. అదే రింగ్ రోడ్డు తూర్పున ఓ మైలు దూరంలో హోచిమిన్ మార్గం అయిపోతుంది. ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా భారత రాజధాని వీధుల్లో, ముఖ్య స్థలాల్లో సజీవంగానే ఉందనడానికిఇది నిదర్శనం. అయితే ఇది సగం కథ మాత్రమే అవుతుంది. అదే రోజు సాయంత్రం కెర్రీ అంతుబట్టని రీతిలో ఢి ల్లీలో మరో రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణాలేమిటా అని ఊహాగా నాలు సాగాయి.

కాలం చెల్లిన విధానాలకు చెల్లు చీటి
వానాకాలపు వరదలు ఢిల్లీ నగరాన్ని ఎంతగా ముంచెత్తినా విమానాశ్రయం మాత్రం నిక్షేపంగా ఉంది! మరుసటి రోజుకుగానీ ఆ కీలక కారణమేమిటో బయటపడలేదు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ అల్ సిసీ లాంఛనంగా ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. కెర్రీ ఆయన్ను ఇక్కడ కలుసుకోవాలనుకున్నారు. చరిత్రకు సంబంధించి భారత్‌కు ఉన్న తటపటాయింపులు, కపటత్వాలను ఇది నొక్కి చెబుతుంది. 25 ఏళ్ల క్రితమే ప్రచ్ఛన్న యుద్ధం అంతరించి, ఏక ధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది. ఆ ధ్రువం ఆకర్షణ శక్తి సైతం క్షీణించి, మరో ధ్రువం వృద్ధి చెందుతోంది. అది దాన్ని సవాలు చేయకపోయినా సతాయిస్తోంది. అది తక్కువగా వ్యవస్థీకృతమైనదే అయినా ప్రపంచస్థాయి బలాబలాల సమతూకం నెలకొనడానికి దారి తీస్తోంది.

క్యూబా, ఇరాన్, అమెరికా తమ పాత శత్రుత్వాలను పాతిపెట్టేశాయి. భారత్ మాత్రం తటపటాయిస్తూనే ఉంది లేదా కొంత భాగం ఈ మార్పును హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటే మరో భాగం గతంలో గడ్డకట్టుకు పోయి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యంలో అల్ సిసీని ఢిల్లీలో కలుసుకోవడానికి కెర్రీ ఇలా ఆగిపోవడం ఈ తటపటాయింపులు, కపట త్వాలను... ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే మేధోపరమైన సోమరితనాన్ని దిగ్భ్రాంతికరంగా వెల్లడి చేస్తుంది. నాసర్ మార్గ్ గుర్తు వద్ద ఆ ముగ్గురు నేతలూ కలసి ఫొటో దిగేలా చేయలేక పోవడం ఎంతటి విచారకరం? అయితేనేం నేడు వచ్చిన మార్పు ప్రాధాన్యాన్ని మీరు గుర్తించగలరు, అర్థం చేసుకోగలరు.

బెర్లిన్ గోడ కూలిన తదుపరి వచ్చిన ప్రధానులలో ప్రాముఖ్యతగలిగిన వారు ముగ్గురు... పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మో హన్‌సింగ్. వారు ఈ పాత విముఖతను వదల్చడానికి ప్రయత్నించారు. ఒక్కొక్కరు తమవైన భిన్న పద్ధతుల్లో, తామున్న పరిస్థితుల్లో ఆ పని చేయడానికి యత్నించారు. అయితే ఎక్కడో ఒక చోట కాపట్యాలకంటే తటపటాయింపులే ఎక్కువగా వారి ప్రయత్నాలను నీరుగార్చాయి. పీవీ అమెరికాతో మైత్రిని కోరితే, వాజ్‌పేయి భారత్ అమెరికాలు వ్యూహాత్మక భాగస్వాములంటూ ఎన్‌ఎస్‌ఎస్‌పీపై (వ్యూహాత్మక భాగస్వామ్యంలోని తదు పరి చర్యలు) సంతకం చేశారు.

కానీ తీవ్ర జాతీయవాద ఆర్‌ఎస్‌ఎస్ దీన్ని అనుమానంతో చూసి, వ్యూహాత్మక నిపుణుడు బ్రజేష్ మిశ్రా అమెరికాకు అతిగా అనుకూలుడని భావించింది. ఇక మన్మోహన్‌సింగైతే మన రెండు దేశాలు సహజ మిత్రులు అనే భావనను వాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌పీని ముందుకు తీసుకుపోయి అణు ఒప్పందంపై సంతకాలు చేసి తన ప్రభు త్వానికి ముప్పును సైతం ఆహ్వానించారు. ఆ తదుపరి సమాచారం, ఎత్తుగడలు, సరఫరాల సహకారం, ఉమ్మడి శిక్షణలపై మరిన్ని సైనిక- వ్యూహాత్మక ఒప్పం దాల కోసం చర్చలు జరిపారు. అయితే  ఆయన పార్టీకే చెందిన చేతులు ముడుచుకు కూచున్న ప్రచ్ఛన్న యుద్ధ యోధులు నాటి రక్షణ మంత్రి ఏకే ఆంథోనీ నేతృత్వంలో ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. మోదీ ఆ గతాన్ని నిస్సం కోచంగా చెత్తబుట్టలోకి విసిరేశారు.

నిస్సంకోచంగా తొక్కిన కొత్త బాట
కొనసాగింపు, నిలకడా, వాటికి విరుద్ధంగా స్థాన చలనం, మార్పు అనేవి భారత విదేశాంగ విధాన రూపకల్పనలో ఎడతెగని చర్చగా ఉంటూ వచ్చాయి. వాటిలో మొదటిదే సునాయాసంగా విజయం సాధిస్తుండే ది. ప్రజా స్వామ్యంలో అధికారం చేతులు మారుతుంది. అలా అని విదేశాంగ, వ్యూహాత్మక విధానంలో స్థాన చలనం సైతం జరుగుతుందని అర్థం కాదు. అవి విశాల జాతీయ ఏకాభిప్రాయం ప్రతిపదికపై అవి తప్పక కొనసాగు తాయి. ఇదే ఇంతవరకు దాదాపుగా ఎదురేలేని విజ్ఞతగా చలామణి అయింది. మోదీ అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరంలోకి ప్రవేశి స్తుండగా ఆయన ఈ అపోహను తొలగించారు.

ఇది కేవలం అమెరికాను నిస్సంకోచంగా వాటేసుకోవడం మాత్రమే కాదని మీకేఅనిపిస్తుంది. త్వరలో అమెరికాకు కొత్త అధ్యక్షులు రానున్నారు. ఈ ఏడాది చివరికి అధ్యక్షునిగా ఉండేది ఎవరో ఆ దేవుడికే ఎరుక. అయినా ఫర్వాలేదనే వైఖరికిగానీ లేదా అలీన దేశాల (నామ్)  శిఖరాగ్ర సమావేశానికి గైర్హాజరు కావడమనే సంకేతాత్మక చర్యగానీ చెప్పేది అదే. చైనా పట్ల, ఇస్లా మిక్ ప్రపంచం పట్ల వైఖరిలో కూడా ఇది కనిపిస్తుంది. చైనాతో సంబం ధాలలో దాదాపు అసాధ్యమైన వ్యూహాత్మక కదలికను తేవడాన్ని ఆయన తన వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. పూర్తి లావాదేవీల రూపంలోని సంబంధా లను తిరిగి మలచుకోవాలన్న ఆయన ప్రయత్నం ఇంకా సఫలం కాలేదు.

మన మార్కెట్లు మనకు కావాలి, కనీసం ఆ విషయంలోనైనా సంబంధాలు ఒడిదుడుకులకు గురికాకుండా చూసుకోవాలి. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ), మసూద్ అజర్ తదితర వ్యవహారాల్లో చైనా ప్రతి కూల వైఖరి చేపట్టినప్పుడు మోదీ వీధి పోరాట యోధునిలాగా స్పందిం చారు.  చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. చైనా నుంచి తక్కువ సాంకేతికత, నైపుణ్యాలతో తయారయ్యే చౌక దిగుమతులపైకి  చాక చక్యంగా స్వదేశీ దాడిని సాగిస్తున్నారు. గత వారంలో ఆయన సంప్రదాయక మైన మట్టి విగ్రహాల పట్ల ప్రేమ, విశ్వాసాల ప్రాధాన్యాన్ని గురించి మాట్లాడటాన్ని గమనించండి. చైనా నుంచి ఆకర్ష ణీయమైన ప్లాస్టిక్ బొమ్మలను దిగుమతి చేసుకోవడం చౌక అని చెప్ప నవసరం లేదు.

తెగిపడ్డ గతం బంధాలు
అలాగే ఇస్లామిక్ ప్రపంచంతో.. సున్నీలు షియాలు ఇద్దరితో ద్వైపాక్షిక, లావాదేవీలపరమైన సంబంధాలను పెంపొందింపజేసుకోవడం కోసం ఆయన వ్యక్తిగత, దేశ ప్రతిష్టలు రెండిటినీ ఉపయోగిస్తున్నారు. అమెరికా నుంచి యూరప్‌కు, చైనాకు చివరకు సౌదీ అరేబియా, యూఏఈల వరకు అన్ని దేశాలకు ఇస్లాం తీవ్రవాదం విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఐఎస్‌ఐఎస్ విస్తరణను వెనక్కు మరల్చడానికి ఇరాన్ కీలకమైనదిగా కనిపిస్తోంది. అందుకు దాన్ని ఉపయోగించుకునే అవకాశం మోదీకి ఉంది. ఆ పని చేస్తున్న క్రమంలోనే ఆయన ఇస్లామిక్ ప్రపంచంతో సంబంధాలను పాలస్తీనా ఇజ్రా యెల్ సమస్యతో ముడిపెట్టి నిర్వచించుకోవడమనే పాత బంధనాలను ఆయన పూర్తిగా తెంచుకున్నారు. కశ్మీర్ సమస్య ఒకప్పటిలాగా భారత్‌ను భయపెట్టే సమస్యగా లేకపోవడం గురించి ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఈసీ) దేశాల నుంచి గుసగుసలు వినవస్తున్నాయి.

పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్-బలిస్తాన్, బలూచిస్తాన్ సమస్యలను లేవనెత్తడాలతో కూడిన నూతన పాకిస్తాన్ విధానానికి దోహదం చేసినది ఈ వైఖరే. క శ్మీర్‌పై ఆచితూచి ప్రవర్తించడమనే 25 ఏళ్ల పాత వైఖరిని పూర్తిగా విడనాడారు. అయితే ఈ కొత్త వైఖరి ఫలితాలనిస్తోందనడం చర్చనీయాంశం కావచ్చు. ఆ పాత వైఖరి వల్ల ఇక ఎలాంటి ప్రయోజనమూ లేదని మోదీ భావించారు. ప్రత్యేకించి పాకిస్తాన్ నానాటికి మరింత ఏకాకి అవుతున్న పరిస్థితుల్లో, దానికి ఉన్న తలనొప్పి సృష్టించే (తద్వారా బ్లాక్‌మెయిల్ చేయడం) విలువ క్షీణించిపోతుండగా... పాత వైఖరిని విడచి ముందుకు సాగడం అవసరమని మోదీ భావన.

ఈ విషయాన్ని ఇలా చూడండి: పాకిస్తాన్ 22 మందిని కాదు వంద మంది రాయబారులను ప్రపంచమంతటికీ పంపి భారత్‌తో తమకు కశ్మీర్ సమస్య ఉన్నదని చెప్పగలదు. అయితే, భారత్... పాకిస్తాన్‌తో, అది ఎగు మతి చేసే ఇస్లామిక్ ఉగ్రవాదంతో అందరికీ సమస్య ఉందని తిప్పి కొట్టగలదు. తిరుగే లేని వాదనఇది. కశ్మీర్/పాకిస్తాన్ సమస్యలపై మన పాత విధానాన్ని కొనసాగించడానికి బదులుగా మోదీ దానితో తెగతెంపులు చేసు కోవడాన్ని వివరించేది కూడా అదే. అయితే దీనికి మరో విషయంలో కలిగిన విధానపరమైన చలనాన్ని కూడా నొక్కి చెప్పడం అవసరం. మోదీ ప్రభుత్వం అణు తటపటాయింపులను కూడా వదుల్చుకుంది. అణు ప్రతినిరోధ శక్తిని ఇక నెంత మాత్రమూ పాకిస్తాన్ చేతుల్లోనే ఉంచడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి మోదీ చేతులకు ఆ బంధనాలు ఇప్పుడు లేవు.

రచయిత:శేఖర్ గుప్త
twitter@ shekar gupta


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement