మెత్తని ‘కత్తి’.. గెలిపించే శక్తి | Liberal, democratic systems powerful weapon in Bilateral relations | Sakshi
Sakshi News home page

మెత్తని ‘కత్తి’.. గెలిపించే శక్తి

Published Sat, Oct 22 2016 3:44 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

చరిత్రాత్మక బస్సు యాత్రలో (1999) లాహోర్ చేరిన నాటి మన ప్రధాని వాజ్‌పేయి, దేవానంద్‌లతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్

చరిత్రాత్మక బస్సు యాత్రలో (1999) లాహోర్ చేరిన నాటి మన ప్రధాని వాజ్‌పేయి, దేవానంద్‌లతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్

జాతిహితం
మన మెత్తని బలం, పాకిస్తానీలు మన సినిమాలను మన క్రీడాకారులను అభిమానించ డానికే పరిమితమైనది కాదు. మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు నెలకొనడంలో సొంత ప్రయోజనాలు ఇమిడి ఉన్న పాక్ నటీనటులు అంతకంటే కాదు. వాటికంటే పెద్దది భారత ఉదారవాద, ప్రజాస్వామ్య వ్యవస్థలది, సంస్థలది. ఒక దేశం మరో దేశంలోకి చొరబాటు దార్లను, ఉగ్రవాదులను పంపి హింసాకాండను సృష్టించడం ద్వారానే ప్రభావితం చేయలేదు. ఉత్తమ ఉదాహరణగా నిలవడం ద్వారా కూడా ఆ పని చేయగలుగుతుంది.

అటల్ బిహారీ వాజ్‌పేయి చరిత్రాత్మకమైన లాహోర్ బస్సు యాత్రకు బయ లుదేరిన 1999 ఫిబ్రవరి 22న ప్రధాని కార్యాలయం జుట్టుపీక్కోవాల్సి వచ్చింది. ఆ అర్ధరాత్రి వేళ దేవానంద్‌ను తీసుకు రావడం ఎలా? దేవానంద్ అంటే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పిచ్చి అభిమానం. ఆ విషయం నాటి మన ప్రధాని అటల్‌జీకి అప్పుడే గుర్తుకొచ్చింది. మరో దేవానంద్ అభిమాన్ని ఎలాగోలా ఆయన వద్దకు వెళ్లి వాజ్‌పేయితో బస్సు యాత్రకు అందుకోగలుగుతారా? అని అడిగారు. ఆయన ఆనందంగా వచ్చేశారు. ఆ పర్యటనలో దేవానంద్ రాక ప్రధాన ఆకర్షణ అయింది. ఆ సినీ మాంత్రికుడు అక్కడ బాల్ డాన్స్ చేశారు, రాజకీయవేత్తలను, ప్రముఖులను, మొత్తంగా పాకిస్తాన్ మీడియాను ఉల్లాసపరుస్తూ గడిపారు. వ్యూహాత్మకంగా అంత ముఖ్యమైన పర్యటనను ఆయనేమీ ఆషామాషీగా చూడలేదు. దేవానంద్‌ను తీసుకెళ్లడం ద్వారా ఆయన అప్పుడు భారత్‌కు ఉన్న మెత్తని బలాన్ని (సాఫ్ట్ పవర్) ఉపయోగించారంతే.
 
పాక్‌పై సాంస్కృతిక, క్రీడాపరమైన, విద్యాపరమైన  మొత్తం బహిష్కర ణను విధించాలంటూ సాగుతున్న నేటి ప్రచారాన్ని చూస్తుంటే నాకు... మెత్తని బలం అంటే ఏమిటో ఇంకా అర్థంకాని లేదా గుర్తించని రోజులనాటి ఆ విషయం గుర్తుకొస్తోంది. గౌతం గంభీర్, సౌరవ్ గంగూలీ వంటి గొప్ప క్రికెట్ క్రీడాకారులు సైతం కార్యక్రమంలో చేరారు. మెత్తని బలాన్ని ప్రయోగించా ల్సినది మెత్తని వారి మీదనే అంటున్నారు. పాక్ సమస్య పరిష్కారానికి కుసుమ కోమలమైన సుతి మెత్తని వైఖరి పనికిరాదంటున్నారు.

కాబట్టి పాక్‌తో అన్ని సంబంధాలూ తెంచేసుకుని, దాన్ని ప్రపంచంలో అంటరాని రాజ్యంగా నిలపాలి. భారత్ సాగిస్తున్న ఉగ్రవాద (పాకిస్తానీ) వ్యతిరేక పోరా టంలో మిగతా ప్రపంచమంతా చేరేలా ఒప్పించి అప్పుడు చూడమంటు న్నారు. గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ముందు తరువాత సంభవిం చిన కొన్ని తాజా పరిణామాలు ఈ వైఖరికున్న పరిమితులను నొక్కి చెబుతు న్నాయి.  2014 మేలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశం ప్రపంచ శక్తిగా అవిర్భవించిందని మన టీవీ స్టూడియో యుద్ధ యోధులు, ‘‘యుద్ధ వాద’’ విశ్రాంత సైనిక, గూఢచార అధికారులు, దౌత్యవేత్తలు విశ్వసిస్తు న్నారు. వాస్తవంలో మనం అందుకు బహు దూరంలో ఉన్నాం.
 
మెత్తని బలం అంటే ఏమిటి?
మెత్తని బలం అనే సిద్ధాంతానికి మద్దతుదార్లు, వ్యతిరేకులు కూడా ఉన్నారు. జూనియర్ బుష్ మొదటి దఫా అమెరికా అధ్యక్షునిగా ఉండగా రక్షణ మంత్రిగా ఉన్న డొనాల్డ్ రమ్స్‌ఫీల్డ్‌ను, మొత్తని బలాన్నిమీరు విశ్వసిస్తారా? అని అడిగితే ‘‘అదేమిటి?’’ అని అమాయకంగా అతి సుప్రసిద్ధ  సమాధా నాన్ని చెప్పారు. గట్టి, సైనిక బలం, బల ప్రయోగాలను కోరే వారిలో ఆయన అగ్రగణ్యులు. ప్రపంచాన్ని, అమెరికా ప్రయోజనాలను, భావి తరాల ప్రయో జనాలను ఆయన ఎలా చింద ర వందర చేసి వెళ్లారో కూడా మనకు తెలుసు.

రోగిని నిలువుగా కోసేసి వ్రణాన్ని తొలగించకుండానే లేదా తిరిగి కుట్లయినా వేయకుండానే అపరేషన్ బల్లపై (ఇరాక్, అఫ్గానిస్తాన్) అలాగే వదిలేసి పోయారు. 1990లలో, ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో ‘మెత్త్తని బలం’ అనే భావనను హార్వర్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ న్యే జూనియర్ మొదట  నిర్వ చించారు.  2006లో రాసిన ఓ వ్యాసంలో ఆయన... బుష్ రెండవ దఫా అధ్యక్షునిగా ఉండగా కండోలిజా రైస్ వద్ద మెత్తని బలం గురించి పాఠాలు నేర్చుకున్నారని, మెత్తని బలాన్ని, బహిరంగ దౌత్యాన్ని మరింత ఎక్కువగా ప్రయోగించారని రాశారు.
 
ఇప్పుడు  స్టూడి యోలో, పార్టీలు చేసుకునే బృందాల్లో, ఎయిర్ పోర్ట్‌లో, పార్లమెంటులో, ఎక్కడైనాగానీ మెత్తని బలం అనే మాట వింటేనే విరగబడి నవ్వుతారు. ప్రత్యే కించి న్యే అన్నట్టు మెత్తని బలం అనే ఆయన సిద్ధాంతాన్ని ‘‘అతిగా సాగదీశారు, మెలికలు తిప్పారు, కొన్ని సందర్భాల్లో గుర్తుపట్ట   లేనంతగా చేసేశారు.’’
 
మెదళ్లను మెలి తిప్పడం మెరుగు
న్యే ఇలా వివరించారు... మెత్తని బలం అని పిలుస్తున్న కారణంగానే అది మెత్తనిది అయిపోదు. అలాగే అది తప్పనిసరిగా మరింత మాన వత్వంతో కూడినది అని కూడా కాదు, అది కేవలం ‘‘విలువలను ప్రబోధించేది కాదు.’’ మీ గట్టి బలాన్ని ప్రయోగిస్తారా? లేక మెత్తని బలాన్ని ప్రయోగిస్తారా? అనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఒక జనరల్ ఎడారి యుద్ధంలో గెలవడానికైతే పెద్ద ట్యాంకుల బలగాన్ని ప్రయోగిస్తాడు. వియత్నాం అడవుల్లో అయితే అందుకు ఇతర పద్ధతులు అవసరం అవుతాయి. దీన్ని మరింతగా వివరిస్తూ అయన.. మీరు తుపాకీ చూపి అవతలి వాడి డబ్బును దోచుకోవచ్చు లేదా త్వరగా ధన వంతులు కావచ్చని మోసగించి కాజేయొచ్చు లేదా ఆధ్యాత్మిక యాత్రలో తనతో చేరమంటూ అతన్ని ఒప్పించి ఆస్తినంతా మీ పేరిట రాయించేసు కోవచ్చు. మొదటివి రెండూ గట్టి బలానికి ఉదాహరణలు కాగా, మూడోది మెత్తని బలానికి ఉదాహరణ. ‘‘కానీ ఫలితం మాత్రం దొంగతనమే.. చేతులు మెలి తిప్పడం కంటే మెదళ్లను మెలి తిప్పడం మెరుగు.’’
 
ప్రపంచ శక్తిగా భారత ప్రయోజనాలకు లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే, భారత్-పాక్ సంబంధాలకు  ఈ తర్కాన్ని  విస్తరింపజేయడం ఎలా? మెత్తని బలం అంటే ఆహారం, సంస్కృతి, సాహిత్యం, క్రీడలేనా? అలా అయితే కోకా కోలా, మెక్ డొనాల్డ్స్, మైఖేల్ జాక్సన్, మడోనాలు సోవియట్ కూటమిని ఇంకా చాలా ముందుగానే జయించేసి ఉండేవారు. లేకపోతే చైనావారు వారి ఆహారం ద్వారా మన మెదళ్లను, హృదయాలను కూడా శాసించేవారు. లేదా దేశీ వెజిటబుల్ ప్రైడ్ రైస్‌ను నాశనం చేసేలా, అది మాదంటే మాదని మనతో యుద్ధానికి దిగేవారు. మెత్తని బలం అంటే జాతీయ విలువలు, విధానాలు ప్రజాస్వామ్యం, రాజకీయాల నాణ్యత, సంస్థల దృఢత్వాలకు సంబంధించినది కూడా.
 
మెత్తని బలం, కేవలం పాకిస్తానీలు టీవీ చానళ్లలో మన సినిమాలను చూడటానికి, మన క్రీడా హీరోలను ఆరాధించడానికి లేదా మన జనరంజక గేయాలను ఆలపించడానికి మాత్రమే పరిమితం కాదు. అది మరింత ఎక్కువ సుప్రసిద్ధ్దులైన పాకిస్తానీలు, క్రీడాకారులు మాత్రమే కారు. ప్రత్యేకించి మన దేశంలో జీవనాధారాన్ని సంపాదించుకుంటూ,  మెరుగైన ద్వైపాక్షిక సంబం ధాలు నెలకొనడంలో సొంత ప్రయోజనాలు ఇమిడి ఉన్న నటీనటులు  అంత కంటే కాదు. ఇవన్నీ లెక్కలోకి వచ్చేవే, కానీ వాటికంటే మరింత పెద్దదైన భారత ప్రభావం నైతికంగా మరింత ఆకర్షణీయమైనది. మెరుగైన ప్రజా స్వామ్యం, మరింత ఉదారవాద సమాజం, మైనారిటీలతో వ్యవహరించే తీరు, ఎక్కువ వాక్ స్వాతంత్య్రం, సున్నితమైన, ప్రశ్నించే మీడియా, కోర్టులు, పర్యావరణ చట్టాలువంటివన్నీ కలిసి ఆకర్షణీయమైన ఆ బ్రాండ్ ప్రభావా నికి మూల సారంగా ఉంటాయి. దాన్ని మీరు మెత్తని బలం అనొచ్చు లేదా గట్టి బలం అనొచ్చు లేదా నిర్వచించలేనిది అనొచ్చు.
 
గట్టిగా పనిచేసే మెత్తని బలం
ఒక దేశం మరో దేశంలోకి చొరబాటుదార్లను, విద్రోహులను, ఉగ్రవాదు లను పంపి హింసాకాండను సృష్టించడం ద్వారానే దాన్ని ప్రభావితం చేయ లేదు. తానే ఉత్తమ ఉదాహరణగా నిలవడం ద్వారా కూడా ఆ పని చేయ గలుగు తుంది. మరింత ఉదారవాద, ప్రజాస్వామిక శక్తులు నియంతృత్వంతో పోటీ పడేటప్పుడు అది ఎప్పుడూ అద్భుతంగా పనిచేసింది. 25 ఏళ్ల క్రితం ‘సెమి నార్’ పత్రికలో నేను  ‘‘పాకిస్తాన్: ఎ హ్యాక్స్ ఎజెండా’’ అనే వ్యాసం రాశాను. పాశ్చాత్య కూటమి, ప్రత్యేకించి అమెరికా తన ప్రజాస్వామిక, ఉదారవాద, సాంస్కృతిక ప్రభావాలతో (మెత్తని బలం అనే పద ప్రయోగం అప్పటికి వాడుకలో లేదు) ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్ కూటమిని ఓడించ గలిగిందో అందులో వివరించాను. భారత్ దాన్ని క్షుణ్ణంగా అధ్య యనం చేసి, దాన్ని తన పాక్ విధానంలో అల్లాలి.

రిపోర్టర్‌గా నేను పాక్‌లో చాలా సార్లు పర్యటించా. భారత సంస్థల ప్రభావం అక్కడి విధాన నిర్ణేతలపై ఎంత బలంగా ఉందో చూసి నివ్వెరపోయాను. ప్రభావశీలురైన అక్కడి వ్యక్తులు నన్ను పంపమని కోరిన వాటిలో నాటికి పాక్ పంజాబ్ ఆర్థిక మంత్రి, తర్వాత విదేశాంగ మంత్రియైన షా మెహమూద్ ఖురేషీ కోరిన కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిటీ నివేదిక ఉంది. అలాగే నవాజ్ (మొదటి పదవీ కాలంలో) కరాచీలో స్వతంత్రంగా పనిచేయడానికి అధికారాలను కోరు తున్న సెన్యానికి నియమ నిబంధనలను రూపొందించడానికి మన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కోరారు. నేడు మనకు పదవీ విరమణ వరకు కొనసాగిన 29 మంది ఆర్మీ చీఫ్‌లు ఉండగా, పాక్‌కు 15 మంది మాత్రమే ఉన్నారు. ఇది కూడా సానుకూల ప్రభావమే అవుతుంది. దాన్ని మెత్తని బలం అంటారా లేదా గట్టి బలం అంటారా మీ ఇష్టం.    
 
సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, క్రీడలు తదితరాలన్నీ జాతీయ ప్రయోజనాల రీత్యా బలాన్ని హెచ్చించే గుణకాలు కాగలుగుతాయి. నాలుగు దశాబ్దాల పాటూ రాజ్ కపూర్ మొత్తం కమ్యూనిస్టు దేశాలన్నిటిపైనా సానుకూల ప్రభావం నెరపలేదా? అది కేవలం సోవియట్ యూనియన్‌కే పరిమితం కాలేదు. తియనాన్మెన్ స్క్వేర్ నరమేధం జరిగిన 1989 వేసవిలో చైనా రాజధాని బీజింగ్‌లో సైతం ప్రభావాన్ని చూపింది. ఆ ఘటనపై మా కథనాన్ని మొత్తాన్ని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక హోటల్ ఉద్యోగులు (అధి కారిక అనుమతి లేకుండా) ఫ్యాక్స్ చేసి పంపారు.

ప్రతిగా ఫ్యాక్స్ పంపు తున్నంత సేపూ మేం ఆపకుండా ‘ఆవారా హూ’ పాటను పాడుతుండాలని మాత్రమే కోరారు. అమెరికన్లు హాలీవుడ్‌నే కాదు, డిస్నీ ల్యాండ్ సందర్శనను కూడా అంతర్జాతీయ సందర్శకుల కార్యక్రమంలో భాగంగా చేర్చారు. మరింత పెద్ద సంప్రదాయక, అణు ఆయుధాగారాన్ని పెంపొందింపజేసు కుంటున్నా వారు... సోవియట్ల పట్ల మరింతగా తెరలు దించుకుని, మొండి తనంతో ఉండలేదు. పారదర్శకంగా ఉండటం అనేది దాపరికం లేని సమా జాల ఆయుధాగారాల్లో గొప్ప శక్తివంతమైన అస్త్రం అవుతుంది.

శేఖర్ గుప్తా
twitter@shekargupta

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement