న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో తాము ఇచి్చన చరిత్రాత్మక తీర్పులను గుదిగుచ్చి ఒక వెబ్‌పేజీ ద్వారా అందరికీ అందుబాటులోకి తెచి్చంది. న్యాయవితరణలో భాగంగా సుప్రీంకోర్టు వెలువర్చిన కీలక తీర్పుల వివరాలు పౌరులకు తెలియజెప్పడంతోపాటు, న్యాయవ్యవస్థ పట్ల వారిలో మరింత అవగాహన పెంచేందుకు ఈ చొరవ తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
www.sci.gov.in వెబ్‌సైట్‌లో ‘ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్ సమరీస్’పేరిట విడిగా ఒక వెబ్‌పేజీని అందుబాటులోకి తెచి్చంది. ప్రస్తుతానికి 2017 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఇచి్చన కీలక తీర్పుల సమగ్ర వివరాలు అందులో అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందునాటి చరిత్రాత్మక తీర్పులను త్వరలో అప్‌లోడ్ చేయనున్నారు. ‘‘తీర్పు సంక్లిష్టమైన పదజాలంతో ఇంగ్లిష్ భాష ఉంటుంది. వందల పేజీలున్న కోర్టు తీర్పును చదివి అర్థంచేసుకోవడమూ సాధారణ ప్రజలకు కష్టమే. అందుకే సులభ భాషలో, తక్కువ పదాల్లో తీర్పు సారాంశాన్ని పౌరులకు అందుబాటులోకి తెచ్చాం’’ అని సుప్రీం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment