పోటీ చేయొద్దని చెప్పలేం
సుప్రీంకోర్టు స్పషీ్టకరణ
ఈవీఎంపై ఇద్దరు రాహుల్ గాంధీలు కనిపిస్తే? ఎవరికి ఓటేయాలి? ఇది ఎంతో కొంతమంది ఓటర్లను అయోమయానికి గురి చేసే అంశమే. కీలక అభ్యర్థుల పేర్లను పోలిన వారిని ప్రత్యర్థి పారీ్టలు బరిలో దించి ఓట్లను చీల్చడం పరిపాటే. కొన్నిసార్లు అభ్యర్థుల గెలుపోటములనే ప్రభావితం చేసే ఈ పోకడకు చెక్ పెట్టాలంటూ ‘సాబు స్టీఫెన్’ అనే వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోనే పిల్ వేశారు!
అదే పేరుతో మరొకరు పోటీలో ఉండడం వల్ల వెంట్రుకవాసి తేడాతో ఓటమి పాలైన ఉదంతాలను ఉదహరించారు. ‘‘2004 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో అలప్పుజ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వీఎం సుదీరన్ కేవలం 1,009 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడ వీఎస్ సు«దీరన్ అనే ఇండిపెండెంట్‌కు ఏకంగా 8,282 ఓట్లు పోలయ్యాయి.
ప్రత్యర్థి పారీ్టలు డబ్బు, తదితరాలు ఎరగా చూపి ఇలాంటి నకిలీలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ చర్యలు ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలకు వ్యతిరేకం’’ అని వాదించారు. ‘‘ప్రముఖ అభ్యర్థుల పేరును పోలిన వారు బరిలో ఉంటే వారి నేపథ్యాన్ని కూలంకషంగా విచారించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. నకిలీలని తేలితే పోటీ నుంచి నిషేధించేలా చూడండి’’ అని కోరారు. కానీ, ఈ పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచి్చంది.
ఒకే తరహా పేర్లున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘రాహుల్ గాం«దీ, లాలు ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖుల పేర్లున్న వారిని పోటీ చేయొద్దందామా? తల్లిదండ్రులు
ఆ పేర్లు పెట్టిన కారణంగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచగలమా? పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలనేది తల్లిదండ్రుల హక్కు’’ అని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది!
– న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment