evm mition
-
కొన్ని ఈవీఎంల్లో ‘ఫుల్ చార్జింగ్’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. అణుశక్తినగర్ అసెంబ్లీ స్థానం ఫలితంపై తీవ్ర అనుమానాలున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఫహాద్ అహ్మద్ పేర్కొన్నారు. ఎన్సీపీ (అజిత్) అభ్యర్థి సనా మాలిక్ చేతిలో కేవలం 3,378 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలన్నింట్లోనూ సనా మాలిక్ ఆధిక్యం కనబరిచారు. తక్కువ చార్జింగ్ ఉన్న ఈవీఎంల్లోనేమో సనా వెనకబడ్డారు. ఇదెలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. అహ్మద్ అనుమానాలను ఆయన భార్య, సినీ నటి స్వరాభాస్కర్ కూడా బలపరిచారు. ‘‘17 రౌండ్ల దాకా నా భర్తే ఆధిక్యంలో ఉన్నారు. కానీ చివరి మూడు రౌండ్లలో లెక్కించిన ఈవీఎంలన్నీ 99 శాతం బ్యాటరీ చార్జింగ్ ఉన్నవే! వాటన్నింట్లోనూ సనా మాలికే ఆధిపత్యం సాధించడంతో ఫలితమే తారుమారైంది’’అని చెప్పుకొచ్చారు. ‘‘రోజంతా ఓటింగ్ ప్రక్రియ కొనసాగాక ఈవీఎం యంత్రాల్లో చార్జింగ్ తగ్గాలి. చాలా ఈవీఎంల్లో అలాగే తగ్గింది కూడా. కానీ కొన్ని ఈవీఎంల్లోనే, ప్రత్యేకించి చివరి మూడు రౌండ్లలో లెక్కించిన వాటిలోనే ఫుల్ చార్జింగ్ ఉంది. ఇదెలా సాధ్యం?’’అని ఆమె ప్రశ్నించారు. -
రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అయితేనే తమకు కూడా ప్రయోజనం ఉంటుందనే ఆలోచన ఉందన్నారు. మూసీ పరీవాహాక ప్రాంతాన్ని 55 కి.మీ. మేర అభివృద్ధి చేస్తున్నామని, కింద రోడ్డు మార్గం, సైక్లింగ్, పైన మెట్రో వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్‌కు ఎంతమాత్రం పోటీ కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.అమరావతిలో రాజధాని నిర్మాణం, భవనాల నిర్మాణం తర్వాత 10 వేల ఎకరాలే రియల్ ఎస్టేట్‌కు ఉంటుందని, అందులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కష్టమనేది తన ఆలోచన అని అన్నారు. అక్కడ పెట్టుబడి పెట్టేకన్నా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నట్లు చెప్పారు. లేదా పక్క రాష్ట్రాలైన బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్.. మీడియా సమావేశంలో వివరాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మూసీ అభివృద్ధి.. నా మార్క్ ‘మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధికి ఓ మార్క్ ఉంది. ఇలా నా మార్క్ ఏంటనేది చెప్పాల్సి వస్తే మూసీ నది అభివృద్ధేనని చెప్తా. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో 10 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు లేదా లేదా నష్టపరిహారం చెల్లిస్తాం.మధ్యమధ్యలో ఎస్టీపీలు కట్టి నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా చేస్తున్నాం. 36 నెలల్లో పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. 12–15 కీ.మీ.లకు ఒక క్లస్టర్ లెక్కన 4 కస్టర్లుగా విభజించి 4 కంపెనీలకు ఇద్దామనే ఆలోచన చేస్తున్నాం. మూసీ ప్రాజెక్టును మరింత హుందాగా డిజైన్ చేసేందుకు ఆగస్టులో దక్షిణ కొరియా, జపాన్ వెళ్లి అక్కడి రివర్ డెవలప్మెంట్ మోడల్‌ను చూసి మరిన్ని ఆలోచనలు చేస్తాం. మొత్తం మూసీ నది అభివృద్ధే రేవంత్ మార్క్ అనేలా అభివృద్ధి చేసి చూపిస్తా’అని రేవంత్ వివరించారు. గండిపేటకు ట్రంక్ లైన్.. ‘మంచినీటి నిల్వ కోసం గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు ట్రంక్ లైన్ వేస్తున్నాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుపై కూడా కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాల గురించి ప్రధాని మొదలు కేంద్ర మంత్రులందరినీ నేను, నాతో పాటు మంత్రులు కలుస్తున్నాం. కేంద్రం తెలంగాణకు సాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఎన్నికలు అయిపోయినందున ఇప్పుడు రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. అందుకే అందరినీ కలుస్తున్నాం..’అని సీఎం చెప్పారు. మరికొన్ని అంశాలపై ⇒ వివాదం లేకుండా పోటీ పరీక్షలన్నీ నిర్వహించామని సీఎం అన్నారు. తమకు మంచి పేరు వస్తుందనే గ్రూప్–1 విషయంలో బీఆర్ఎస్ అనవసర రచ్చకు తెరలేపి నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతోందని రేవంత్ ఆరోపించారు. అయితే గ్రూప్–1 గురించి ఎవరో ఏదో చెప్పారని చేసుకుంటూ వెళ్లలేమని.. అలా వెళ్తే కోర్టులు ఆక్షేపిస్తాయని చెప్పారు. ⇒ లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని ప్రధానిని కోరానని.. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో త్వరలో కొత్త బ్యాచ్‌కు చెందిన వారిని కేంద్రం తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందన్నారు. ⇒ కత్తి పట్టుకున్న వాడు కత్తికే బలైనట్లు కేసీఆర్ పరిస్థితి ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ వ్యక్తి ఆ కేసుకే పట్టుబడేలా ఉన్నారని పేర్కొన్నారు. తనకు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని.. తన ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు.పదేళ్లు నేనే సీఎం..ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతోందని, ఈ లెక్కన పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌కు వచ్చే ఢోకా ఏమీ లేదని చెప్పారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు విషయంలో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణలో పదేళ్లకు ఒకమారు ప్రభుత్వాలు మారి తే, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకమారు ప్రభు త్వం మారుతోంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు కచ్చి తంగా కొనసాగుతుంది. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా’అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఈవీఎంలపై అప్పుడు టీడీపీయే ప్రశ్నించిందిసార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) ట్యాంపరింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈవీఎం ట్యాపరింగ్లు జరిగినట్లు వస్తున్న వార్తలపై అభిప్రాయం ఏమిటని మీడియా అడగ్గా సీఎం రేవంత్ వివరంగా బదులిచ్చారు. ‘2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పారీ్టలోనే ఉన్నా). ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కలి్పంచాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి..’అని అన్నారు. ఎలా జరగొచ్చంటే.. ‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపినీ కేంద్రంలో ఉంచుతారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగానే కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఆ ఈవీఎంల స్థానంలో వాటిని ఉపయోగించుకోవడానికి ఆ 15 శాతం ఈవీఎంలను అదనంగా ఇస్తారు. ఈవీఎంల పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ రోజు ఈవీఎంలను పోలింగ్ బూత్‌లకు తరలిస్తారు.అదనంగా తెచి్చన 15 శాతం ఈవీఎంలను మాత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఉంచుతారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్‌కు కాకుండా తొలుత డి్రస్టిబ్యూషన్ సెంటర్‌కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటుఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు కదా? పంపిణీ కేంద్రం బయట పోలీసులు కాపలాగా ఉంటే లోపల ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లు వాటిని తనిఖీ చేయడానికి ఉంటారు. మన చేతిలో అధికారం, బలం ఉంటే మనకు ఇష్టమైన వ్యక్తుల్ని అక్కడ డ్యూటీకి వేసుకొనే అవకాశం కూడా ఉంది. పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్తున్నాయి..’అని రేవంత్ తెలిపారు. ట్యాంపరింగ్ ఏ రకంగా చేస్తారో చెప్పలేం‘ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ఎక్కడో కూర్చుని చేశారా లేక చిప్‌లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్‌లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్నిబట్టే ఈవీఎం పనిచేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు.ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్‌గా 10 శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు కదా’అని రేవంత్ చెప్పారు. -
ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి: ఉషశ్రీ చరణ్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: దేశ వ్యాప్తంగా ఈవీఎం పై చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం ఆమె పెనుకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈవీఎంల పనితీరుపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. పచ్చబిళ్ళ వేసుకుని ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళండి, పని చేయని అధికారుల భరతం పడతామంటూ అచ్చెన్నాయుడు వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీల వారికి సమానంగా సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్ అని ఉషశ్రీ చరణ్ అన్నారు.వైఎస్ జగన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి: రవిచంద్రారెడ్డివిజయవాడ: ఎన్డీఏ ప్రభుత్వంలో అధికార వివక్ష స్టార్ట్ అయ్యిందని వైఎస్సార్సీపీ నేత రవిచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అధికారులను టార్గెట్ చేసి వేధిస్తున్నారన్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులను కక్ష కట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికారం మారగానే అధికారులను వేధించడం సరికాదు. వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ తగ్గించడమేంటి?. వీఐపీలు ఉన్న మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టడం సహజమే. జగన్‌కు చెడు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోంది. వైఎస్ జగన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి’’ అని రవిచంద్రారెడ్డి అన్నారు. -
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్‌లు... అయితే ఏంటి?
ఈవీఎంపై ఇద్దరు రాహుల్ గాంధీలు కనిపిస్తే? ఎవరికి ఓటేయాలి? ఇది ఎంతో కొంతమంది ఓటర్లను అయోమయానికి గురి చేసే అంశమే. కీలక అభ్యర్థుల పేర్లను పోలిన వారిని ప్రత్యర్థి పారీ్టలు బరిలో దించి ఓట్లను చీల్చడం పరిపాటే. కొన్నిసార్లు అభ్యర్థుల గెలుపోటములనే ప్రభావితం చేసే ఈ పోకడకు చెక్ పెట్టాలంటూ ‘సాబు స్టీఫెన్’ అనే వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోనే పిల్ వేశారు! అదే పేరుతో మరొకరు పోటీలో ఉండడం వల్ల వెంట్రుకవాసి తేడాతో ఓటమి పాలైన ఉదంతాలను ఉదహరించారు. ‘‘2004 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో అలప్పుజ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వీఎం సుదీరన్ కేవలం 1,009 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడ వీఎస్ సు«దీరన్ అనే ఇండిపెండెంట్‌కు ఏకంగా 8,282 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి పారీ్టలు డబ్బు, తదితరాలు ఎరగా చూపి ఇలాంటి నకిలీలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ చర్యలు ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలకు వ్యతిరేకం’’ అని వాదించారు. ‘‘ప్రముఖ అభ్యర్థుల పేరును పోలిన వారు బరిలో ఉంటే వారి నేపథ్యాన్ని కూలంకషంగా విచారించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. నకిలీలని తేలితే పోటీ నుంచి నిషేధించేలా చూడండి’’ అని కోరారు. కానీ, ఈ పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచి్చంది. ఒకే తరహా పేర్లున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘రాహుల్ గాం«దీ, లాలు ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖుల పేర్లున్న వారిని పోటీ చేయొద్దందామా? తల్లిదండ్రులు ఆ పేర్లు పెట్టిన కారణంగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచగలమా? పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలనేది తల్లిదండ్రుల హక్కు’’ అని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది! – న్యూఢిల్లీ -
పోలింగ్‌కు వలస దెబ్బ!
♦ 51 వేల మంది ఓటుకు దూరం ♦ కొందరిది భుక్తి బాట ♦ మరికొందరిది భక్తి యాత్ర ♦ అయోమయంలో అభ్యర్థులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలింగ్ కేంద్రాలు..ఈవీఎంలు.. ఇంక్ ప్యాడ్లు.. గులాబీ పూలు.. మజ్జిగ ప్యాకెట్ల.. పోలీ సు పహారా.. వెరసి ఉప ఎన్నికకు సర్వం సిద్ధమయ్యాయి. ఎన్నికల సిబ్బంది, సామగ్రితో శుక్రవారం సాయంత్రానికే గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఇక ఓట్ల పండుగే..! తెర వెనుక: పొట్ట చేత పట్టుకొని వలస పోయిన కూలీలు ఇంకా గూటికి చేరలేదు.. మరో వైపు పక్కరాష్ట్రంలో పండరీ దేవుని జాతరంటూ భక్త జనం వరుస కట్టారు... ఇంకోవైపు ‘క్షుద్ర శక్తుల’భయం చూపి నిరక్షరాస్య ఓటరును ఇంట్లోనే బంధించే ప్రయత్నమేదో జరుగుతోంది. ఓట్ల పండగ రానే వచ్చింది, కానీ ఎన్నో అడ్డంకులు. ప్రతిదీ సగటు ఓటరును ఓటుకు దూరం చేసేదే. ఇన్ని ఒడిదుడుకుల నడుమ నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ శాతం భారీగా తగ్గే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆధార్‌కార్డు అనుసంధానం లేకపోవడంతో ఈ ఏడాది ఎన్నికల కమిషన్ సుమారు 17.5 వేల ఓట్లను తొలగించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 95,772 మంది పురుషులు, 93,040 మంది స్త్రీ కలిపి మొత్తం 1,88,839 ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎన్నికల అధికారులు 1.37 లక్షల మంది ఓటర్లను మాత్రమే గుర్తించి వారికి ఓటరు స్లిప్పులు అందించారు. మిగిలిన 51 వేల మంది ఓటర్ల ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో ఓటరు స్లిప్పులను అందించలేకపోయారు. వీరంతా వలస కూలీలని, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబాలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజు వరకు వీరిలో కనీసం కొందరైనా తిరిగి వస్తారనే ఆశతో ఎన్నికల అధికారులు ఓటరు స్లిప్పులను ఆయా గ్రామాల వీఆర్వోల దగ్గర అందుబాటులో ఉంచారు. వలస కూలీలను ఓటింగ్ రోజున సొంత ఊర్లకు తీసుకుని రావడానికి ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్క గ్రామం నుంచి ఎంత మంది వలస వెళ్లారో గుర్తించి వారిని పోలింగ్ కేంద్రం పద్దకు పట్టుకొచ్చి, ఓటు వేయించి తిరిగి మళ్లీ వాళ్లను పంపించే బాధ్యతను ఆయా గ్రామాల్లోని పెద్ద మనుషులకు, కుల పెద్దలకు అప్పగిస్తున్నారు. ఇదే బాధ్యతను కాంగ్రెస్‌పార్టీ నేతలు గుంపు మేస్త్రీలకు అప్పగించారు. కూలీలను తీసుకువెళ్లేది గుంపు మేస్త్రీలు కనుక, వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో సులువుగా గుర్తిస్తారని కాంగ్రెస్ పార్టీ ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయే వేచి చూడాలి. దేవుని భక్తి..‘క్షుద్ర శక్తుల’ శాసనం.. పోలింగ్ స్లిప్పులు తీసుకున్న వారిలో కూడా దాదాపు 20 నుంచి 25 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. నియోజకవర్గం నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు పండరీపురం విఠలేశ్వర స్వామి జాతరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ మాసం ఏకాదశి (ఈనెల 3న) రోజున మొదలైన పండరీ భక్తుల ప్రయాణం, త్రయోదశి (ఈ నెల 6న) వరకు కొనసాగింది. ప్రతి పల్లెనుంచి పదుల సంఖ్యలో భక్తులు పండరి వెళ్లారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పండరీ దేవుని ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్లంతా పోలింగ్‌కు దూరం అయినట్టే. ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నిరక్షరాస్యత ఓటర్లు క్షుద్ర శక్తుల భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా కల్హేర్, కంగ్టి, మనూరు ప్రాంతంలో ఈ ‘శక్తుల’ప్రభావం తీవ్రంగా ఉంది. సగటు ఓటరును ఇంట్లోనే బంధీగా చేయడానికి ఓ వర్గం పని గట్టుకొని క్షుద్ర విద్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు జనం హడలిపోతున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రించిన ఆవాలు చల్లితే మరికొన్ని గ్రామాల్లో ఎన్నికల కేంద్రం తలుపుల వద్ద పసుపు కుంకుమ పెట్టి వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భయం.. భయం.. మంత్రగాళ్లు మనుసులో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలని శాసిస్తాడో... అదే పార్టీకి గుర్తుకు ఓటు వేయాలని, లేదంటే క్షుద్ర శక్తులు బలి తీసుకుంటాయని ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. కల్హెర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో ని ప్రజలను ‘సాక్షి’ ప్రతినిధి పలకరించినప్పుడు జనం క్షుద్ర శక్తుల పట్ల తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేశారు. ఓ పేరు మోసిన మంత్రగానితో ఆవాలు మంత్రించి, క్షుద్ర శక్తులను పోలింగ్ తలుపుల వద్ద కాపలా పెట్టారని జనం చెప్తున్నారు. ఓ పార్టీకి ఓటు వేయాలని మంత్రగాడు శాసించాడో జనం చెప్తున్నారు కానీ.. మీకు ఏ వ్యక్తి చెప్పాడని అడిగితే మాత్రం బదులు రావడం లేదు. ఎవరో చెప్పుకొంటుంటే విన్నామని మాత్రమే అంటున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇలా వ్యాపిస్తోంది. ఈ భయంతో ఓటర్లు ఓటు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే ఉండిపోవాలనే యోచనలో చాలామంది ఉన్నారు.