సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు.
This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb
— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024
Comments
Please login to add a commentAdd a comment